negative roles
-
హీరోయిన్స్; భ‘లేడీ విలన్లు’
హీరోయిన్స్ అంటే...? ఐ క్యాండీగా స్క్రీన్‌ను కలర్ఫుల్గా మార్చేవాళ్లు. బబ్లీనెస్‌తో హీరోను బబుల్‌గమ్‌లా చుట్టుకునేవాళ్లు. పాటల వరకూ కనిపించి వెళ్లిపోయేవాళ్లు. హీరోయిన్ల పాత్రల డిజైన్‌లో మనకు తరచూ వినిపించే కామెంట్స్ ఇవి. హీరోయిన్‌కి స్ట్రాంగ్ రోల్స్‌తో వస్తున్న సినిమాలు తక్కువే. మెల్లిగా ఈ ధోరణి మారుతున్నట్టు కనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాల ఆదరణ పెరుగుతోంది. హీరోయిన్లు పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నారు. నెగటివ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్నారు. సీత మంచి అమ్మాయి అనే పాత్రలే కాకుండా నెగటివ్ సైడ్‌ని ఆవిష్కరించి భలేడీ విలన్లు అనిపించు కుంటున్నారు. విలన్ – నయన్ హిందీ చిత్రం ‘అంధాధూన్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఇందులో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రకు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ‘అంధాధూన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. టబు పోషించిన పాత్రకు నయనతారను సంప్రదించినట్టు సమాచారం. నయన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ పాత్ర విషయానికి వస్తే.. తనకు ఇబ్బందిగా అనిపిస్తే చంపేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. సినిమా కథకు కీలకమైన పాత్ర ఇది. నయనతార టెర్రరిస్ట్ స్యామ్ సమంత తన కెరీర్లో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. కమర్షియల్ సక్సెస్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’తో మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా వెబ్స్పేస్లోకి అడుగుపెడుతున్నారు స్యామ్. వెబ్ ఎంట్రీ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ రెండో పార్ట్‌లో సమంత కూడా జాయిన్ అయ్యారు. ఇందులో సమంత నెగటివ్ పాత్రలో నటించారు. టెర్రరిస్ట్‌గా కనిపిస్తారని సమాచారం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రసారం కానుంది. సమంత కనులతో దోచారు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఫిబ్రవరిలో విడుదలయిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఇందులో రీతూ అమాయకంగా కనిపించే దొంగ పాత్ర చేశారు. తెలివిగా ప్లాన్ చేసి మోసాలు చేశారు. ‘పెళ్లి చూపులు’తో ఒకలాంటి ఇమేజ్ ని సంపాదించుకొని ఇలాంటి పాత్ర చేయడంలో రీతు విభిన్నత కనిపిస్తుంది. ‘కనులు కనులను..’ చిత్రంతో తాను నెగటివ్ క్యారెక్టర్స్ చేయగలనని నిరూపించుకున్నారు రీతూ వర్మ. ‘కనులు కనులు దోచాయంటే’లో రీతూ వర్మ సీతతో వీజీ కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకుడు. ఈ సినిమాలో కాజల్ పాత్రలో కొంచెం నెగటివ్ యాంగిల్ ఉంది. తనది పక్కా ప్రాక్టికల్ బిజినెస్ ఉమెన్ పాత్ర. డబ్బు కోసం తెలివితేటలతో మోసం చేయడం తప్పు కాదని నమ్మే పాత్ర తనది. అందులో పెద్ద తప్పు కూడా లేదనుకుంటుంది ఆ పాత్ర. అప్పటివరకూ పాజిటివ్ క్యారెక్టర్స్ లో కనిపించిన కాజల్ ‘సీత’లో అందుకు భిన్నంగా కనిపించి, ప్రసంశలు దక్కించుకోగలిగారు. ‘సీత’లో కాజల్ అగర్వాల్ బోల్డ్ ఎంట్రీ తొలిసారి తెరపై కనబడినప్పుడే ప్రేక్షకుల ప్రేమను పొందాలనుకుంటారు ఎవరైనా. కానీ పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 10’లో భిన్నమైన పాత్ర ఎంచుకున్నారు. ఈ సినిమాలో కొంచెం హాట్‌గా కనిపించారు. అలాగే సినిమాలో ఆమెది విలన్ పాత్ర. స్వార్థం కోసం ప్రేమించి మోసం చేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. మామూలుగా పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం కష్టం అంటారు. ఆ విధంగా తొలి సినిమాతోనే పాయల్ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ నల్ల విలన్ తమిళ నటి వరలక్ష్మి హీరోయిన్గా, లేడీ విలన్‌గా తమిళ సినిమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ‘నల్ల’ విలన్ (మంచి విలన్) అని పేరు తెచ్చుకున్నారు కూడా.. ఆ మధ్య ‘సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకష్ణ’ చిత్రాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రల్లో కనిపించారు. ‘సర్కార్, తెనాలి రామకృష్ణ’ సినిమాల్లో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా ఆమె వేసిన ఎత్తులకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘క్రాక్’లోను పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు వరలక్ష్మి. వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ‘భలే’డీ విలన్ అనిపించుకుంటున్నారు వరలక్ష్మి. ‘పందెం కోడి 2’లో వరలక్ష్మీ మహా విలన్ అనిపించుకోవాలని... హీరోయిన్గా 49 సినిమాలు పూర్తి చేశారు హన్సిక. 50వ సినిమా మైలురాయి గుర్తుండిపోయేలా ఉండాలని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ‘మహా’ అనే చిత్రం చేస్తున్నారామె. ఇందులో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ‘హన్సిక మహా విలన్’ అని అందరితో అనిపించుకోవాలనే పట్టుదలతో నటనపరంగా చాలా కేర్ తీసుకున్నారట ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ‘మహా’లో హన్సిక ‘పాటల కోసం హీరోయిన్’ అనే గ్లామరస్ క్యారెక్టర్స్ కే పరిమితం కాకుండా వీలు కుదిరినప్పుడల్లా విలన్ పాత్రల్లో భ‘లేడీ విలన్లు’ అనిపించుకుంటున్న నాయికలను అభినందించాల్సిందే. -
ఫుల్ నెగెటివ్
బోరెత్తినట్టుంది... రాముడు మంచి బాలుడిలాగా ఉండి ఉండి విసుగొచ్చినట్టుంది.కాస్త బ్యాడ్‌గా ఉంటే కిక్ వస్తుంది అని అనిపించినట్టుంది.హీరోలు హీరోయిన్లూ క్రీనీడల్లో కనుబొమ్మలెత్తి కోరగా చూసే నెగెటివ్ కేరక్టర్లలోకి దిగిపోతున్నారు. కొత్త సీసాలో కొత్త పెర్ఫార్మెన్స్. ఘట్టం ఏదైనా, పాత్ర ఏదైనా ఎన్టీర్ రెడీ. హీరోగా ఆయన ఎప్పుడో నిరూపించుకున్నారు. విలన్ పాత్రను ఇంకెంత బాగా చేయగలరో 2017లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రంలో చూశాం. ‘అసుర.. అసుర.. రావణాసుర’ అంటూ ‘జై’ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘బాహుబలి’ సినిమాలో రానా చేసిన ప్రతి నాయకుడి పాత్రను ఆడియన్స్ తెగ మెచ్చుకున్నారు. హీరోగా చేస్తూ విలన్‌గా రాణిస్తున్నవాళ్లల్లో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘సరైనోడు’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లో విలనిజమ్ పండించారు ఆది పినిశెట్టి. అలాగే కోలీవుడ్‌లో మాధవన్ ఎంత పెద్ద హీరోనే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది నాగచైతన్య హీరోగా ‘సవ్యసాచి’ సినిమాలో విలన్ పాత్రతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు మాధవన్. సుధీర్‌బాబు బాలీవుడ్ ‘భాగీ’ చిత్రంలో విలన్‌గా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ ‘బాద్షా’ చిత్రంలో నవదీప్‌ది విలన్ వర్గమే. 2017లో వచ్చిన ‘గృహం’ సినిమాలో కూడా సిద్దార్థ్ క్యారెక్టర్లో నెగటీవ్ షేడ్స్ కనిపిస్తాయి. ఇలా మరి కొంతమంది హీరోలు కూడా వీలైనప్పుడల్లా విలన్లు అయిపోవడానికి సిద్ధం అవుతున్నారు. విలన్ అంటే.. ఇప్పుడు గుర్తొచ్చే పేరు జగపతిబాబు. ‘లెజెండ్’ నుంచి జగపతిబాబు విలన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. మరో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ‘యుద్ధం శరణం’లో విలన్‌గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో నటుడు సాయికుమార్ ‘ఎవడు’లో విలన్‌గా చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘మహర్షి’లో సాయికుమార్ విలన్‌గా చేస్తున్నారని సమాచారం. నితిన్ ‘లై’, విశాల్ ‘అభిమన్యుడు’ సినిమాల్లో విలనిజం చూపించారు అర్జున్. ఇక పక్క ఇండస్ట్రీ హీరోలు ఇక్కడ విలన్లుగా నటిస్తున్నారు. రాజమౌళి ‘ఈగ’ సినిమాలో విలన్‌గా సుదీప్ అదుర్స్. రానా ‘అరణ్య’ సినిమాలో తమిళ హీరో విష్ణువిశాల్ విలన్‌గా నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఇలా మరికొందరు హీరోలు విలన్ పాత్రల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. విలన్ పాత్ర ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. నిజానికి ప్రతినాయకుడిగా చేయడం అనేది సవాల్ లాంటిదే. అందుకే అప్పుడప్పుడూ హీరోలు హీరోయిన్లు ఆ సవాల్‌కి సై అంటారు. అప్పటివరకూ వెండితెరపై మంచివాళ్లుగా కనిపించిన తారలు ఆ మంచితనానికి మటాష్ చెప్పి, చెడ్డవారిగా కనిపించడానికి రెడీ అవుతుంటారు. ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ఈ ఏడాది కొందరు నాయకానాయికలు నెగటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. వారి గురించి తెలుసుకుందాం. హీరోనా? విలనా? హీరో ఆర్ విలన్?! నాని హీరోగా నటించిన ‘జెంటిల్మన్’ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. నానితో ‘అష్టా చమ్మా’ తీసిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో నాని డ్యూయెల్ రోల్ చేశారు. ‘జెంటిల్మన్’ సినిమాలో ప్రీ క్లైమాక్స్ వరకు నానిలో నెగటివ్ షేడ్స్ ఉన్నట్లే కనిపిస్తాయి. క్లైమాక్స్‌లో కథ టర్న్ అవుతుంది. ఇప్పుడు మళ్లీ ఈ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను టచ్ చేయాలని చూస్తున్నారట నాని. అది కూడా మళ్లీ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోనే కావడం విశేషం. నాని, సుధీర్ బాబులు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాణంలో ఓ సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. సుధీర్ బాబు పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని టాక్. మరి.. ఈ సినిమాలో నాని హీరోనా? విలనా? ఈ ప్రశ్నకు త్వరలో సమాధానం దొరుకుతుంది. అవును.. ప్రతినాయకుడే! గతేడాది ఉగాదికి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్‌చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రంలో నటిస్తున్నారు వరుణ్ తేజ్. ఇది తమిళ మూవీ ‘జిగర్తండా’కి తెలుగు రీమేక్. ఒరిజినల్ చిత్రంలో బాబీ సింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఒరిజినల్లో బాబీ సింహా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. సో.. ‘వాల్మీకి’ చిత్రంలో వరుణ్ తేజ్ పాత్రలో ప్రతినాయక ఛాయలు ఉంటాయనుకోవచ్చు. బైక్ జోరు బాగుంది టాలీవుడ్ రహదారిపై ‘ఆర్ఎక్స్ 100’ బైక్‌తో వెండితెరపైకి వచ్చిన హీరో కార్తికేయ మంచి స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. ‘ఆర్ఎక్స్ 100’ హిట్ ఇచ్చిన ఉత్సాహంతో ఆల్రెడీ తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్టైనర్లో కూడా కార్తికేయనే హీరోగా కనిపిస్తారు. ఇదిలా ఉంటే ఇటీవల ‘ఇష్క్, మనం, 24’ చిత్రాల ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర చేయనున్నట్లు కార్తికేయ తెలిపారు. ఇది కచ్చితంగా విలన్ పాత్ర అని ఫిల్మ్‌నగర్ టాక్. అదే నిజమైతే కెరీర్ పీక్స్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కార్తికేయ ఇలా ప్రయోగాలు చేయాలనుకోవడం అభినందనీయమే. గయ్యాళి అత్త పాత్రల్లో విజృంభించిన సూర్యకాంతంని మంచి ప్రతినాయకురాలితో పోల్చవచ్చు. ఇక.. కథానాయికలుగా చేస్తూ, నెగటివ్ షేడ్‌లో రెచ్చిపోయినవారిలో రమ్యకృష్ణ ముందువరుసలో ఉంటారు. ‘నరసింహా’ చిత్రంలో ఆమె చేసిన నీలాంబరి అందుకు మంచి ఉదాహరణ. ఏ కథానాయికను అడిగినా రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’లాంటి పాత్రకు అవకాశం వస్తే చేయాలనుంది అంటుంటారు. అలా కాజల్ అగర్వాల్ చాలాసార్లు చెప్పారు. ఆమె ఆశ నెరవేరే సమయం ఆసన్నమైంది. కెరీర్లో 50 చిత్రాల మైలురాయిని చేరుకున్న తర్వాత కాజల్ ప్రయోగాలపై కన్నేశారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సీత’ అనే సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరో. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు కాజల్. అలాగే తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’లో సమంత క్యారెక్టర్లో విలనిజం ఛాయలు ఉన్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటివరకు మిల్కీబ్యూటీ తమన్నాను గ్లామనస్ పాత్రల్లో చూశాం. రీసెంట్గా ఆమె కాస్త ట్రాక్ మార్చారు. ‘దేవి 2, రాజుగారిగది 3’ చిత్రాలతో పాటు ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో తమన్నా క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. మైండ్‌గేమ్ ఆడే క్యారెక్టర్లో నటిస్తున్నారు తమన్నా. ఇందులో విశాల్ హీరో. ఇక ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు తెరపై సంచలనం సృష్టించారు పాయల్ రాజ్‌పుత్. తొలి చిత్రంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఇందులో పాయల్ నటన ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే... మరో ఏడాది వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవట. అలాగే సమంత నటించిన ‘యు–టర్న్’ సినిమాలో భూమిక, శివ కార్తికేయన్ హీరోగా చేసిన ‘సీమరాజా’ చిత్రంలో సిమ్రాన్, ధనుష్ తమిళ ‘కొడి’ (తెలుగులో ధర్మయోగి) సినిమాలో త్రిష విలన్ పాత్రలు చేశారు. ఇక వరలక్ష్మీ శరత్‌కుమార్ అయితే ఇటీవల విలన్ పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ‘పందెంకోడి 2, సర్కార్’ సినిమాల్లో ఆమె పూర్తిస్థాయి విలన్ పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. హీరోలు విలన్లుగా చేయొచ్చు. ఫర్ ఎ చేంజ్ విలన్ హీరో అయితే బాగానే ఉంటుంది. ఈ తరం విలన్ అనూప్ సింగ్ ఠాకూర్ హీరో అయ్యారు. ‘సింగమ్ 3, విన్నర్, రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల్లో ఆయన విలన్‌గా నటించారు. ఇప్పుడు సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రం‘ఉద్ఘర్ష’ కోసం ఆయన లీడ్ యాక్టర్‌గా మారారు. ఇందులో సాయి ధన్సిక, శ్రద్ధాదాస్, తాన్యాహోప్ కీలక పాత్రలు చేశారు. హీరోలు విలన్లుగా చేస్తే వెరైటీగా ఉంటుంది. కమెడియన్లు చేస్తే ఇంకా వెరైటీగా ఉంటుంది. గతంలో కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి వంటి హాస్యనటులు విలన్లు విజృంభించిన విషయం తెలిసిందే. కామెడీ విలన్‌గా బ్రహ్మానందం కూడా కనిపించారు. ఇప్పుడు కమెడియన్ ‘వెన్నెల’ కిశోర్ ‘గూఢచారి’లో హీరోయిన్ని హత్య చేయడానికి ప్లాన్ గీశారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ సమీరారావు అలియాస్ సమీరా షేక్ పాత్రధారి శోభితాను శ్యామ్ పాత్ర చేసిన వెన్నెల కిశోర్‌నే చంపాడన్న విషయం తెలిసిందే. ఫప్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో శ్యామ్ పాత్ర చనిపోయింది. ‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’ను ఇటీవల షూరూ చేశారు. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ పాత్ర ఉంటుందా? వెయింట్ అండ్ సీ. – ముసిమి శివాంజనేయులు -
కన్నడకు నమస్కార
తమిళంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో రేంజ్‌కి వెళ్ళిన విజయ్ సేతుపతి ఇప్పుడు కొత్త ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. చిరంజీవి ‘సైరా’తో తెలుగు ఆడియన్స్‌కు నమస్కారం చెప్పనున్న ఈ హీరో ఇప్పుడు కన్నడ అభిమానులకు నమస్కార చెప్పబోతున్నారు. వసంత్ విష్ణు హీరోగా రూపొందనున్న ఓ సినిమాలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్‌తో కన్నడకు ఎంట్రీ ఇవ్వనున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ.. ఇలా వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ రోజు వాళ్లు నన్ను కొడతారనుకున్నా!
సంభాషణం: సినిమాల్లో నెగిటివ్రోల్స్ చేసేవాళ్లకు తక్కువేమీ లేదు. కానీ చూడగానే గుండె ఝల్లుమనిపించేలా నటించేవాళ్లు కొందరే ఉంటారు. అమిత్‌కుమార్ తివారీ ఆ కోవకు చెందిన నటుడే. సూపర్, అనుకోకుండా ఒకరోజు, యువసేన, రాఖీ, విక్రమార్కుడు తదితర చిత్రాల్లో క్రూరమైన పాత్రల్లో నటించి మెప్పించిన అమిత్ తన గురించి, తన కెరీర్ గురించి చెబుతోన్న విశేషాలు... సినిమాల్లో ఆడపిల్లలను వేధిస్తుంటాను కదా, అందుకే నా భార్య ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు చాలామంది. నేను సినిమాల్లోనే శాడిస్ట్‌ని. బయట చాలా సాఫ్ట్, కూల్. ఆ విషయం పూజకి బాగా తెలుసు. అందుకే నన్ను ప్రేమించింది. తను ముంబై అమ్మాయి. పెళ్లికి పదేళ్ల ముందు నుంచే మాకు పరిచయం ఉంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకిప్పుడో బాబు... విరాన్ష్ (2). అర్థం చేసుకునే భార్య, ముద్దొచ్చే కొడుకు... లైఫ్ హ్యాపీగా ఉంది! మీ సినీ ప్రయాణం ఎలా మొదలైంది? చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. కానీ నాన్నేమో... ముందు చదువు, తర్వాతే సినిమాలు అన్నారు. దాంతో డిగ్రీ అయ్యేవరకూ ఓపిక పట్టాను. ఆ తర్వాత ‘కల’ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఫొటోలు పంపించాను. అవి నచ్చడంతో డెరైక్టర్ నన్ను ముంబై నుంచి హైదరాబాద్ రప్పించారు. సెలెక్ట్ అవడంతో నటుడినైపోయాను. ముంబై అంటున్నారు... మీరు తెలుగువారు కాదా? అచ్చమైన తెలుగువాడినే. కాకపోతే నాన్నగారి చిన్నప్పుడే మా కుటుంబం ముంబై వెళ్లి స్థిరపడింది. దాంతో నేను అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. నెగిటివ్ రోల్స్ ఎందుకెంచుకున్నారు? నేను ఎంచుకోలేదు. ‘కల’ సెలెక్షన్స్ అప్పుడు నా పొడవాటి జుత్తు, గడ్డం చూసి నెగిటివ్ రోల్‌కి తీసుకున్నారు. ఆ తర్వాత అలాంటి పాత్రలే వచ్చాయి. బ్రేక్ ఇచ్చిన సినిమా? విక్రమార్కుడు. మొదటి సినిమా తర్వాత మూడేళ్లపాటు చాలా సినిమాలు చేశాను. గుర్తింపు వచ్చింది కానీ బ్రేక్ రాలేదు. కానీ ‘విక్రమార్కుడు’ నా కెరీర్‌నే మార్చేసింది. మిమ్మల్ని ప్రతినాయకుడిలా చూసినప్పుడు మీ ఇంట్లోవాళ్ల రియాక్షన్? మొదట షాకైపోయారు. అమ్మయితే... అదేంట్రా అలా చేశావ్ అంటూ బాధపడిపోయింది. సర్ది చెప్పడంతో ఊరుకుంది. తర్వాత అందరూ అలవాటు పడ్డారు. కానీ హీరో నన్ను అంతం చేసే సీన్ చూసినప్పుడు మాత్రం ఏడ్చేస్తుంటారు. బయటికెళ్లినప్పుడు జనాల స్పందన..? బయటికెళ్తే నన్ను చూసి అందరూ ఎలా రియాక్టవుతారో అన్న ఫీలింగ్ మొదట్లో ఉండేది. టీమ్‌తో కలిసి థియేటర్లో ‘విక్రమార్కుడు’ చూడ్డానికి వెళ్లా. సినిమాలో నేను చచ్చిపోగానే పక్కనే ఉన్న పదిమంది కుర్రాళ్లు లేచి చప్పట్లు కొడుతూ, నా పాత్రను బూతులు తిడుతూ ఉన్నారు. దాంతో భయమేసి ముఖం కప్పుకున్నాను. ఏమయ్యిందని రాజమౌళి అడిగితే, బయటికెళ్లాక వాళ్లు నన్ను కొడతారేమో సార్ అన్నాను. అప్పుడాయన... ‘వాళ్లు తిట్టేది నీ పాత్రని. అంతగా రియాక్ట్ అవుతున్నారంటే నువ్వంత బాగా నటించావని అర్థం. బయటికెళ్లాక వాళ్లే ఆ మాట చెప్తారు చూడు’ అన్నారు. నిజంగా అలానే జరిగింది. అందరూ వచ్చి చాలా బాగా చేశానని చెబుతుంటే సంతోషమేసింది. మేం చేసేది నటన అని, సినిమాకే పరి మితమనే విజ్ఞత ప్రేక్షకులకు ఉంది. కానీ సినిమాల్లో ఇంతటి క్రూరత్వాన్ని చూపించడం అవసరమా? అలాంటి పాత్రలు ప్రేక్షకుల మీద చెడు ప్రభావాన్ని చూపించవంటారా? అలా ఎందుకనుకోవాలి! ‘రాఖీ’లో నేను చేసిన పాత్రనే తీసుకోండి. అది కల్పిత పాత్ర కాదు. విజయవాడలో ఒకడు ఒకమ్మాయి పట్ల అంత దారుణానికి ఒడిగట్టాడు. దానినే సినిమాలో పెట్టారు కృష్ణవంశీ. ఎందుకని! ఇలాంటివాళ్లు సమాజంలో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి. ఇలా జరిగే ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్పడానికి మా పాత్రలు ఉపయోగపడుతున్నందుకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ అవే చేసి చేసి బోర్ కొట్టట్లేదా? ఒక్కోసారి అదే అనిపిస్తుంది. కానీ అందరూ నాకు అలాంటివే ఇస్తున్నారు. నాకేమో పాజిటివ్ రోల్స్ కూడా చేయాలని ఉంది. నేను కామెడీని కూడా పండించగలనని నా నమ్మకం. కానీ ఎవ్వరూ అలా ఆలోచించడం లేదు. త్రివిక్రమ్‌గారు మాత్రం తన ప్రతి సినిమాలోనూ నన్ను కాస్త కొత్తగా చూపించాలని ప్రయత్నిస్తుంటారు. అందుకాయనకు థ్యాంక్స్ చెప్పాలి. నెగిటివ్ రోల్స్ చేసేవాళ్లు చాలామంది ఉన్నారు. పోటీ పెరిగిపోలేదా? ఎవరి టాలెంట్‌కి తగ్గ పాత్రలు వారికి వస్తాయి. పోటీ పడాల్సిన అవసరం లేదు. అయినా నేనెవరితోనూ పోటీ పడను. నాకు నేనే పోటీ. దాదాపుగా ఒకేలాంటి పాత్రలొచ్చినా ప్రతి సినిమాలోనూ ఏదైనా కొత్తగా చేద్దామని ప్రయత్నిస్తుంటాను. నటన కాకుండా ఇంకేమైనా...? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా పాడతాను కూడా. నా ఫ్రెండ్సందరూ సినిమాల్లో పాడొచ్చు కదా అంటుంటారు. అవకాశం వస్తే తప్పక ట్రై చేస్తాను. భవిష్యత్ ప్రణాళికలు...? ప్రస్తుతానికి మనసంతా నటన మీదే. చాలెంజింగ్ రోల్స్ చేసి మెప్పించాలి. సమాజానికి కూడా ఏదైనా చేయాలని ఉంది. ముఖ్యంగా బాల కార్మికుల్ని చూస్తే బాధేస్తుంది. అలాంటి పిల్లలకు సాయపడాలి. కాకపోతే దానికి కాస్త టైమ్ పడుతుంది. కెరీర్లో అనుకున్నది సాధించాక... దానిమీద దృష్టి పెడతాను! - సమీర నేలపూడి -
విలన్ పాత్రలో తాప్సీ
నటి తాప్సీ ప్రతినాయకి పాత్రలో నటిస్తోంది. తమిళంలో ఆడుగళం చిత్రంలో తాప్సీ కథానాయకిగా నటించి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో ఆమెకు కోలీవుడ్‌లో వందాన్ వెండ్రాన్ సహా పలు చిత్రాల్లో నటించేం దుకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం ముని-3లో నటిస్తోంది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న వై రాజా వై చిత్రంలో లేడీ విలన్ పాత్రలో నటించేందుకు తాప్సీని సంప్రదించారు. ఇందులో ప్రతినాయకి పాత్ర నచ్చడంతో నటించేందుకు అం గీకారం తెలిపారు. ఆ చిత్రంలో కథానాయకుడిగా గౌతమ్ కార్తీక్, కథానాయకిగా ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. ఈ పాత్రలో తాప్సీ ఏ మేరకు రాణించనుందో వేచి చూడాల్సిందే. -
'విలన్ పాత్రలో కనిపించడానికి సై'