
విలన్ పాత్రలో తాప్సీ
నటి తాప్సీ ప్రతినాయకి పాత్రలో నటిస్తోంది. తమిళంలో ఆడుగళం చిత్రంలో తాప్సీ కథానాయకిగా నటించి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో ఆమెకు కోలీవుడ్‌లో వందాన్ వెండ్రాన్ సహా పలు చిత్రాల్లో నటించేం దుకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం ముని-3లో నటిస్తోంది.
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న వై రాజా వై చిత్రంలో లేడీ విలన్ పాత్రలో నటించేందుకు తాప్సీని సంప్రదించారు. ఇందులో ప్రతినాయకి పాత్ర నచ్చడంతో నటించేందుకు అం గీకారం తెలిపారు. ఆ చిత్రంలో కథానాయకుడిగా గౌతమ్ కార్తీక్, కథానాయకిగా ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. ఈ పాత్రలో తాప్సీ ఏ మేరకు రాణించనుందో వేచి చూడాల్సిందే.