ప్రముఖ దర్శకుడు చనిపోయాడు. సీరియల్, సినిమాకు దర్శకత్వం వహిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇతడు.. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో విషాదం నింపింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఇలా ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)
గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వినోద్ దొండాలే.. నన్నరాసి రాధే, గంగే గౌరి, కరిమణి తదితర సీరియల్స్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. కొన్నాళ్ల క్రితం 'అశోక్ బ్లేడ్' అనే సినిమా కూడా మొదలుపెట్టాడు. దీని షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. శుక్రవారం కూడా షూటింగ్ విషయమై హీరో సతీష్, నిర్మాతలతో కలిసి మాట్లాడాడు. శనివారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
సినిమా, సీరియల్ నిర్మాణంలోనూ వినోద్ ఎంటరయ్యాడని, దీని తర్వాత నష్టాలు ఎక్కువయ్యావని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పుల బాధ తట్టుకోలేక ఇలా ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సీనియర్ దర్శకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది.
(ఇదీ చదవండి: OTT: ‘ఫ్రీలాన్స్’ హాలీవుడ్ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment