sandlewood
-
వివాదంలో 'కేజీఎఫ్' యష్.. ఏకంగా అటవీ భూమిలోనే
'కేజీఎఫ్' సినిమాతో తెలుగులో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న యష్.. ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నాడు. ఇతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలవగా.. రీసెంట్గా బెంగళూరు సమీపంలోని పీణ్య-జలహళ్లి దగ్గరలో కొత్త షెడ్యూల్ మొదలైంది. రెండు రోజులు షూటింగ్ చేశారు. అయితే సెట్ నిర్మాణ కోసం అక్రమంగా వేలాది చెట్లు నరికేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. 'టాక్సిక్' మూవీ టీమ్ చెట్లు నరికేశారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేయడంతో పాటు స్యయంగా ఆ ప్రదేశానికి వెళ్లి సందర్శించారు. చెట్ల నరికివేతకు అనుమతించిన వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో షూటింగ్ అర్థంతరాంగా నిలిచిపోయింది.(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌కి మధ్యంతర బెయిల్)అటవీ, జీవావరణ, పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శికి రాసిన నోట్లో బెంగళూరులోని పీణ్య ప్లాంటేషన్ 1, ప్లాంటేషన్ 2లోని 599 ఎకరాల గెజిటెడ్ రిజర్వ్ ఫారెస్ట్ భూమిని హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT)కి చట్టవిరుద్ధంగా బదలాయించిన విషయాన్ని ఎత్తి చూపారు. హెచ్ఎంటీ ఆధీనంలో అటవీ భూమిని సినిమా షూటింగ్‌ల కోసం లీజుకు ఇస్తోందని, అటవీ భూమిలో అనధికారికంగా చెట్ల నరికివేత నేరమని మంత్రి ఈశ్వర్ చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.హెచ్ఎమ్టీకి ఈ భూమిని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అక్రమంగా విక్రయించింది. దీంతో అక్కడ చెట్ల నరికివేత జరిగింది. తాజాగా టాక్సిక్ షూటింగ్ కోసం చాలా చెట్లని కొట్టేసి మరీ సెట్ వేశారనే తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ఫొటోలని మంత్రి ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: నటితో ప్రేమ.. పెళ్లికి సిద్ధమైన 'కలర్ ఫోటో' దర్శకుడు!)ಎಚ್.ಎಂ.ಟಿ. ವಶದಲ್ಲಿರುವ ಅರಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ‘ಟಾಕ್ಸಿಕ್’ ಎಂಬ ಚಲನಚಿತ್ರದ ಚಿತ್ರೀಕರಣಕ್ಕಾಗಿ ನೂರಾರು ಮರಗಳನ್ನು ಅಕ್ರಮವಾಗಿ ಕಡಿದು ಹಾನಿಗೊಳಿಸಿರುವ ವಿಚಾರ ಗಂಭೀರ ಚಿಂತೆ ಮೂಡಿಸಿದೆ. ಸ್ಯಾಟೆಲೈಟ್ ಚಿತ್ರಗಳಿಂದ ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಕಾಣುತ್ತಿದ್ದು, ಇಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ನಡೆಸಿದ್ದೇನೆ. ಈ ಅಕ್ರಮ ಕೃತ್ಯಕ್ಕೆ… pic.twitter.com/yrjHhG9kLA— Eshwar Khandre (@eshwar_khandre) October 29, 2024 -
కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్
కన్నడ హీరోయిన్ మిలానా నాగరాజ్.. రీసెంట్గా పుట్టిన కుమార్తె ఫేస్ రివీల్ చేసింది. పరి అనే పేరు పెట్టిన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఈమె భర్త డార్లింగ్ కృష్ణ కన్నడలో ఓ హీరో. నటుడు, దర్శకుడు, నిర్మాతగా పలు సినిమాలు చేశాడు.(ఇదీ చదవండి: OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ)పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. 2013 నుంచి సినిమాలు చేస్తోంది. అప్పట్లో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు మాత్రం ఓ వైపు నటిస్తూనే మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. 2021లో కృష్ణ-మిలానా పెళ్లి జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్గా ఈమెకు పాప పుట్టింది.ఈ క్రమంలోనే పాపని ఇంటికి తీసుకొచ్చిన వీడియోని తొలుత పోస్ట్ చేసింది. తాజాగా పాప-భర్తతో కలిసి తీసుకున్న క్యూట్ అంట్ స్వీట్ ఫొటోల్ని మిలానా షేర్ చేసింది. వీటిని చూసి తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరు కూడా వీడియో, ఫొటోలపై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్) View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) -
రెండు సంప్రదాయాల్లో డైరెక్టర్,హీరోయిన్ల పెళ్లి
కన్నడ ప్రముఖ దర్శకుడు తరుణ్ సుధీర్, నటి సోనల్ రెండు సంప్రదాయాల్లో వివాహం చేసుకున్నారు. ఆగష్టు 11న బెంగళూరు పూర్ణిమ ప్యాలెస్‌లో హిందూ సంప్రదాయంలో వారు పెళ్లి చేసుకున్నారు. సిని ప్రముఖలతో పాటు ఇరువైపుల కుటుంబసభ్యుల సమీక్షంలో జంట ఒక్కటయ్యారు. మంత్ర ఘోషణల మధ్య తరుణ్ సోనల్‌కు తాళి కట్టాడు. హీరో దర్శన్‌తో కాటేరా సినిమాను తెరకెక్కించి తెలుగు వారికి కూడా ఆయన పరిచయం అయ్యారు.తరుణ్ సుధీర్ సతీమణి నటి సోనల్ సూచన మేరకు మంగళూరులో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 2న మరోసారి వివాహం చేసుకున్నారు. మంగళూరు చర్చిలో ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో వారి వివాహాన్ని సంబరంగా చేసుకున్నారు. నూతన జంటకు సినీ, టీవీ రంగాల నటీనటులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. -
ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!
సినిమా కోసం నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడూ ఉండేదే. కానీ తొలిసారి ఓ కుక్కతో డబ్బింగ్ చెప్పించారు! నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. 'నను మత్తు గుండా 2' అనే కన్నడ మూవీ కోసం ఇదంతా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడే బయటపెట్టాడు. కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంతకీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!)రీసెంట్ టైంలో కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చకుంటోంది. కేజీఎఫ్, చార్లీ తదితర చిత్రాలు నేషనల్ వైడ్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఓ సినిమా కోసం కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పించడం. 2020లో థియేటర్లలో రిలీజైన 'నాను మత్తు గుండా' మూవీ హిట్‌గా నిలిచింది. ఆటో డ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారి కుక్క పాత్ర దానితోనే డబ్బింగ్ చెప్పించారట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకం కీలక పాత్ర పోషించిందని, నేచురాలిటీ కోసం సదరు కుక్కతోనే డబ్బింగ్ చెప్పించామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఈ సీక్వెల్ మూవీకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతమందించడం విశేషం.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ) -
యంగ్ హీరోయిన్ పెళ్లి వేడుక.. హాజరైన ఉప ముఖ్యమంత్రి
కన్నడ నటి సోనాలి, ప్రముఖ దర్శకుడు తరుణ్ సుధీర్‌ని పెళ్లి చేసుకోనుంది. ఆదివారం ఈ వేడుక జరగనుంది. దీనికంటే ముందు వెడ్డింగ్ రిసెప్షన్ జరగ్గా.. ఈ కార్యక్రమానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అలానే కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆశీర్వదించారు.(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)బాల నటుడిగా కన్నడ సినీ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన తరుణ్ సుధీర్.. ఆ తర్వాత రైటర్, డైరెక్టర్‌గా పలు సినిమాలు తీశాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న స్టార్ హీరో దర్శన్‌తో 'రాబర్ట్', 'కాటేరా' చిత్రాలు తెరకెక్కించారు. ఇక 'రాబర్ట్' చేస్తున్న టైంలో ఇందులో ఓ హీరోయిన్గా నటించిన సోనాలితో ప్రేమలో పడ్డాడు.అప్పటినుంచి తమ ప్రేమని రహస్యంగా ఉంచిన తరుణ్-సోనాలి.. కొన్నిరోజుల క్రితం నిశ్చితార్థం చేసుకుని తమ రిలేషన్‌ని అధికారికం చేశారు. ప్రస్తుతం బెంగళూరులో వీళ్ల పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే శనివారం జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కావడం విశేషం.(ఇదీ చదవండి: స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం) View this post on Instagram A post shared by DK Shivakumar (@dkshivakumar_official) -
దేవాలయాల సందర్శనలో 'కేజీఎఫ్' హీరో.. అన్నదానంలోనూ
'కేజీఎఫ్ 2' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ హీరో యష్ ఎక్కడా కనబడట్లేదు. 'టాక్సిక్' అనే మూవీ చేస్తున్నాడని అన్నారు గానీ లుక్ లాంటిదేం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు కర్ణాటకలోని ప్రముఖ దేవాలయాల్ని కుటుంబంతో సందర్శిస్తూ కనిపించాడు. సామాన్యుడిలా దర్శనం చేసుకోవడమే కాదు అన్నదానంలోనూ సింపుల్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్ చేయలేనిది.. 'దేవర' చేసి చూపించాడు!)'కేజీఎఫ్' తర్వాత యష్ ఎలాంటి సినిమా చేస్తాడా? ఎప్పుడు రిలీజ్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే 'టాక్సిక్' అనే మూవీని యష్ ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు అసలు షూటింగ్‌లోనే పాల్గొనలేదు. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆగస్టు 8 నుంచి యష్‌కి సంబంధించిన షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు.యష్‌కి బాగా కలిసొచ్చిన సంఖ్య 8. జనవరి 8వ తేదీన పుట్టాడు. బహుశా అందుకేనేమో ఈ నంబర్ కలిసొచ్చేలా ఎనిమిదో నెల ఎనిమిదో తారీఖున షూటింగ్‌కి వెళ్లాలని ఇన్నాళ్లు ఆగినట్లున్నాడు. మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తీస్తున్న 'టాక్సిక్'.. గ్యాంగస్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రావొచ్చు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోతో పాటు అతడి తండ్రిని!) -
ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ
థ్రిల్లర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. థియేటర్లలో వీటిని పెద్దగా పట్టించుకోపోవచ్చు గానీ ఓటీటీలో మాత్రం విశేషాదరణ దక్కుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పలు భాషల్లో హిట్ అయిన థ్రిల్లర్ మూవీస్‌ని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తుంటారు. అలా రెండు నెలల క్రితం అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసిన కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నడలో రిలీజైన 'శాఖాహారి'.. అద్బుతమైన సక్సెస్ అందుకుంది. కోటి రూపాయలు పెడితే ఐదు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మర్డరీ మిస్టరీ థ్రిల్లర్ స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇందులో ట్విస్టులు చూస్తే మీ బుర్ర తిరిగిపోవడం గ్యారంటీ. అంతలా ఆకట్టుకుంది. హింసాత్మక సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్త.'శాఖాహారి' కథ విషయానికొస్తే.. సుబ్బన్న (రంగాయన రఘు).. చిన్న ఊరిలో శాఖాహార హోటల్ నడుపుతుంటాడు. పెళ్లి చేసుకోకపోవడంతో సోలోగానే బతికేస్తుంటాడు. భార్యని హత్య చేసిన వినయ్ అనే కుర్రాడు.. సుబ్బన్న హోటల్లో తలదాచుకుంటాడు. వినయ్ కోసం వచ్చిన లోకల్ పోలీస్ (గోపాల్ కృష్ణ దేశ్ పాండే)కు సుబ్బన్న గురించి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఇంతకీ అవేంటి? తన హోటల్‌కి వచ్చిన వాళ్లని సుబ్బన్న ఎందుకు చంపేస్తున్నాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: భోజనం చేస్తూ అస్సలు ఈ సినిమా చూడొద్దు.. డేర్ చేసి చూస్తే మాత్రం?) -
41 ఏళ్ల డైరెక్టర్‌తో 28 ఏళ్ల హీరోయిన్ పెళ్లి.. వీళ్లు ఎవరంటే?
ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఇది చాలాసార్లు ప్రూవ్ అయిన విషయమే. కలిసి పెరిగిన వాళ్లు కావొచ్చు, కలిసి ఒకేచోట పనిచేస్తున్న వాళ్లు కావొచ్చు ప్రేమలో పడుతుంటారు. అలా ఇప్పుడు ఓ కన్నడ డైరెక్టర్.. తన సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి వరకు వచ్చేశాడు. తాజాగా తన బంధాన్ని అఫీషియల్ చేస్తూ వివాహ తేదీని ప్రకటించాడు.(ఇదీ చదవండి: విడాకులు తీసుకున్నా.. కానీ హ్యాపీగానే ఉన్నా: స్టార్ హీరో భార్య)తరుణ్ సుధీర్.. చైల్డ్ ఆర్టిస్టుగా 1990లోనే కన్నడ ఇండస్ట్రీకి వచ్చేశాడు. 2019 వరకు అప్పుడప్పుడు నటిస్తూ వచ్చాడు. మరోవైపు రైటర్‌గానూ స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు. 2017లో 'చౌక' అనే మూవీ తీశాడు. దీని తర్వాత 'రాబర్ట్', 'కాటేరా' చిత్రాలు చేశాడు. ఇక 'రాబర్ట్' చేస్తున్న టైంలో అందులో నటించిన సోనాలి మొంటిరోతో ప్రేమలో పడ్డాడు. కాకపోతే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాడు.తాజాగా తామిద్దరం ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టిన తరుణ్, సోనాలి.. ఆగస్టు 11న బెంగళూరులో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అయితే డైరెక్టర్, హీరోయిన్గా తాము ఎలా ప్రేమలో పడ్డాం అనేది సింబాలిక్‌గా చూపిస్తూ వెడ్డింగ్ వీడియో రూపొందించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా) View this post on Instagram A post shared by Sonal Monteiro Official (@sonal_monteiro_official) -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య
ప్రముఖ దర్శకుడు చనిపోయాడు. సీరియల్, సినిమాకు దర్శకత్వం వహిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇతడు.. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో విషాదం నింపింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఇలా ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వినోద్ దొండాలే.. నన్నరాసి రాధే, గంగే గౌరి, కరిమణి తదితర సీరియల్స్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. కొన్నాళ్ల క్రితం 'అశోక్ బ్లేడ్' అనే సినిమా కూడా మొదలుపెట్టాడు. దీని షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. శుక్రవారం కూడా షూటింగ్ విషయమై హీరో సతీష్, నిర్మాతలతో కలిసి మాట్లాడాడు. శనివారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.సినిమా, సీరియల్ నిర్మాణంలోనూ వినోద్ ఎంటరయ్యాడని, దీని తర్వాత నష్టాలు ఎక్కువయ్యావని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పుల బాధ తట్టుకోలేక ఇలా ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సీనియర్ దర్శకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. (ఇదీ చదవండి: OTT: ‘ఫ్రీలాన్స్’ హాలీవుడ్ మూవీ రివ్యూ) -
ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం
ప్రముఖ లేడీ యాంకర్ అపర్ణ వస్తారే కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడిన ఈమె.. గురువారం రాత్రి మరణించారు. ఈ విషయాన్ని అపర్ణ భర్త చెప్పుకొచ్చారు. కన్నడలో గత 40 ఏళ్లుగా నటిగా, యాంకర్, న్యూస్ యాంకర్‌గా చేసిన ఈమె ఇప్పుడు ఇలా మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తన సంతాపాన్ని తెలియజేశారు.(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు)1984లోనే నటిగా కెరీర్ ప్రారంభించిన ఈమె.. డీడీ చందన ఛానెల్లో న్యూస్ రీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితో పాటే ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. 1998లో దీపావళి ప్రోగ్రాంకి దాదాపు ఎనిమిది గంటల పాటు యాంకరింగ్ చేసి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో వినిపించే అనౌన్స్మెంట్కి వాయిస్ ఇచ్చింది ఈమెనే కావడం విశేషం.ఇక బిగ్ బాస్ కన్నడ షోలోనూ పాల్గొన్న ఈమెకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే కన్నడలో అద్భుతమైన డిక్షన్‌తో యాంకర్‌గా ఈమెని కొట్టేవాళ్లు లేరని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఈమె మృతి పట్ట సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ సాయం.. ట్రాన్స్ జెండర్ కంటతడి)ನಟಿ, ಖ್ಯಾತ ನಿರೂಪಕಿ ಅಪರ್ಣಾ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ತಿಳಿದು ನೋವಾಯಿತು. ಸರ್ಕಾರಿ ಸಮಾರಂಭಗಳು ಸೇರಿದಂತೆ ಕನ್ನಡದ ಪ್ರಮುಖ ವಾಹಿನಿಗಳ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಕನ್ನಡ ಭಾಷೆಯಲ್ಲಿ ಅತ್ಯಂತ ಸೊಗಸಾಗಿ ನಿರೂಪಣೆ ಮಾಡುತ್ತಾ ನಾಡಿನ ಮನೆಮಾತಾಗಿದ್ದ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆಯೊಂದು ಬಹುಬೇಗ ನಮ್ಮನ್ನು ಅಗಲಿರುವುದು ದುಃಖದ ಸಂಗತಿ.ಮೃತ ಅಪರ್ಣಾಳ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ… pic.twitter.com/fZs9L6m42Q— Siddaramaiah (@siddaramaiah) July 11, 2024 -
జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్
కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉండలేకపోతున్నాడు. ఇన్నాళ్లు లగ్జరీ లైఫ్ బతుకుతూ వచ్చిన ఇతడు.. సాధారణ ఖైదీలా ఉండలనేసరికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇంటి ఫుడ్‌తో పాటు పలు సదుపాయాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇంతకీ దర్శన్ కేసులో అప్డేట్ ఏంటి?(ఇదీ చదవండి: ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్)కన్న హీరో దర్శన్‌ని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడ సహా మొత్తంగా 17 మందిని అరెస్ట్ చేశారు. రేణుకస్వామి అనే వ్యక్తి దర్శన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో భార్యతో కాకుండా ప్రియురాలు పవిత్రతో ఎక్కువగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన రేణుకాస్వామి.. ఈమెకు అసభ్య సందేశాలు పంపించాడు. ఇది ఈమె దర్శన్‌కి చెప్పడంతో తన మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.ప్రస్తుతం జైల్లో ఉన్న దర్శన్.. మిగతా ఖైదీల్లానే ఉన్నాడు. కాకపోతే ఇతడికి అజీర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. తనకు ఇంట్లో చేసిన ఆహారంతో పాటు పడుకోవడానికి పరువు, బట్టలు, పుస్తకాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. బుధవారం దీనిపై విచారణ జరగనుంది. మరి న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!) -
గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ పిక్ వైరల్
మరో యంగ్ హీరోయిన్ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటోతో సహా రివీల్ చేసింది. అయితే ఈ ఫొటోలో భర్తతో కలిసి డిఫరెంట్ ఔట్ఫిట్లో కనిపించి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)కర్ణాటకకు చెందిన హర్షిక.. 15 ఏళ్ల నటిగా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, భోజ్‌పురి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. 'ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడు అలా ఇప్పుడు ఇలా' అనే తెలుగు మూవీస్ చేసింది. హీరోయిన్గా చేస్తూనే గ్లామ్ గాడ్ ఫ్యాషన్ అనే కంపెనీ కూడా ఈమెకు ఉంది. ఇందులో హర్షిక పార్ట్నర్ నటుడు భువన్ పొన్నాన.ఇలా బిజినెస్ పార్ట్నర్స్ కాస్త గతేడాది ఆగస్టులో జీవిత భాగస్వామ్యలు అయ్యారు. కర్ణాటకలోని కొడగు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. తాజాగా తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు హర్షిక-భువన్ ప్రకటించారు. అక్టోబరులో డెలివరీ ఉంటుందని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే పలువురు వీళ్లకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) -
దర్శన్‌కి ఆ సమస్య.. అందుకే అతడితో జాగ్రత్తగా మాట్లాడతారు!
కొన్నిరోజుల క్రితం కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనని అభిమానించే ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు దర్శన్‌తో కలిసి పనిచేసిన కొందరు లేడీ యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నీ మధ్యే హీరోయిన్ సంజనా గల్రానీ దర్శన్ ప్రవర్తన గురించి చెప్పగా, తాజాగా నటి అనూష రాయ్.. దర్శన్ ఇతరులతో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన(దర్శన్) అందరినీ కేరింగ్‌గా చూసుకుంటాడు. కాకపోతే ఆయనకు అప్పుడప్పుడు కోప్పడటం లాంటి సమస్య ఉంది. దీంతో అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కూడా నా ఫరిది దాటకుండా మాట్లాడాను. తనకు ఈ సమస్య ఉందని దర్శన్ గతంలో ఓ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అయితే దర్శన్‌కి సంబంధం ఉందనే విషయం మాత్రం నాకు తెలియదు. దర్శన్‌పై కోపం ఉంటే ఏమైనా అనుకోండి గానీ ఆయన భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదు.' అని అనుష రాయ్ చెప్పుకొచ్చింది.కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుకాస్వామి.. దర్శన్‌కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలహాలకు కారణం పవిత్ర గౌడనే అని భావించిన రేణుకాస్వామి.. ఆమెకు అసభ్య వీడియోలు పంపించాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్‌కి చెప్పగా.. ఇతడు దారుణంగా టార్చర్ పెట్టి మరీ చంపేశాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం రేణుకాస్వామి శరీరంపై 15కి గాయాలు, కరెంట్ షాక్ ఇచ్చినట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు దాదాపు 11 మందికి పైగా జైల్లో ఉన్నారు.(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ శోభాశెట్టి.. రేటు ఎంతో తెలుసా?) -
హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు
వ్యక్తిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. రోజురోజుకి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్. కన్నడ హాస్య నటుడు కమ్ హీరో చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలానే పోలీస్ స్టేషన్‌కి కూడా తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)కన్నడ హీరో దర్శన్.. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజులు, వీడియోలని మొబైల్లో పంపడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఓవైపు విచారణ, మరోవైపు దర్యాప్తు సాగుతోంది.అయితే హత్య జరగడానికి ముందు దర్శన్‌తో పాటు అతడి మనుషులు.. బెంగళూరు రాజేశ్వరి నగర్‌లోని స్టోనీ బ్రూక్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. దీనికి దర్శన్ ఫ్రెండ్, నటుడు చిక్కన్న కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ చేసుకునే టైంలో హత్య గురించి దర్శన్ ఏమైనా చర్చించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిక్కన్నకు నోటీసులు ఇచ్చారు. ఇతడికి హత్యతో సంబంధం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. కేవలం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుని వదిలేశారు.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలా పాల్.. వీడియో వైరల్!) -
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. స్వయంగా అభిమానిని చంపాడనే ఆరోపణలతో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అలానే బయటకొస్తున్న ఒక్కో విషయం అందరికీ వరస షాకులు ఇస్తోంది. అయితే దర్శన్ అరెస్ట్ వల్ల కన్నడ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రముఖ కన్నడ హీరో సుదీప్.. దీంతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి'(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'అయితే దర్శన్ అరెస్ట్ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీపై వేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది' అని సుదీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ నెల 8న రేణుకా స్వామి అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఇతడిని ఎవరు చంపారనే కోణంలో ఆరా తీయగా.. హీరో దర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తనతో రిలేషన్లో ఉన్న పవిత్ర గౌడని రేణుకాస్వామి ఇబ్బంది పెట్టడంతోనే దర్శన్ కోపం పెంచుకుని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్శన్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!
సినిమాలో హీరోహీరోయిన్‌కి కష్టాలు ఉండటం కామన్. కానీ ఇప్పుడు వాళ్లకు రియల్ లైఫ్‌లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు వీటిని కోరి తెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఊహించని విధంగా ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనిది ఒక్కసారిగా ఇండస్ట్రీలో మూడ్ మారిపోయింది. ఎంతలా అంటే సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్లు కాస్త సెలబ్రిటీలని ఊహించని చోట చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?దర్శన్ కేసుకన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ఈ మధ్య కాలంలో దీనంత షాకింగ్ సంఘటన మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు గురించి సింపుల్‌గా చెప్పుకొంటే.. దర్శన్‌కి ఇదివరకే విజయ్ లక్ష్మితో పెళ్లయింది. కానీ పవిత్ర గౌడ అనే నటితో గత కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలతలకు ఈమెనే కారణమని భావించిన ఓ అభిమాని.. పవిత్రకు అసభ్యకర ఫొటోలు, వీడియోలని పంపించాడు. దీంతో పవిత్ర, ఈ విషయాన్ని దర్శన్‌కి చెప్పగా ఇతడు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)పవిత్ర-చందు మరణాలుతెలుగు సీరియల్ 'త్రినయని'లో కీలక పాత్ర పోషిస్తున్న నటి పవిత్ర జయరాం.. కొన్నిరోజుల క్రితం సొంతూరి నుంచి హైదరాబాద్‌కి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈమెని ప్రేమిస్తున్న సహ నటుడు చందు.. ఈమె మరణాన్ని తట్టుకోలేక పవిత్ర చనిపోయిన రెండు మూడు రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణాలు అందరికీ షాకయ్యేలా చేశాయి.డ్రగ్స్ కేసులో హేమ టాలీవుడ్లో డ్రగ్స్, రేవ్ పార్టీ లాంటివి అప్పుడప్పుడు వినిపించే మాటలు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉండటం, ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెకు బెయిల్ కూడా వచ్చింది. అయితే ఎన్నడూ లేనిది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు దక్షిణాదిలో పలు షాకింగ్ సంఘటనలు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కొన్ని స్వీయ తప్పిదాలు ఉండగా, మరికొన్ని అనుకోకుండా జరిగినవి. మరి వీటికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడేళ్లుగా కనిపించని దర్శన్ మేనేజర్.. కారణం ఏంటి..?) -
రేణుకా స్వామి హత్యకేసు.. లొంగిపోయిన హీరో దర్శన్ డ్రైవర్
అభిమానిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఇతడి ప్రేయసి, హీరోయిన్ పవిత్ర గౌడని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇక రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో భాగంగా తాజాగా దర్శన్ కారు డ్రైవర్ రవి.. చిత్రదుర్గ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరోవైపు రేణుకా స్వామి పోస్ట్ మార్టం జరగ్గా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' సినిమా తీయమని శివుడు చెప్పాడు: మంచు విష్ణు)ఈ కేసు పూర్వపరాలు పరీశిలిస్తే.. దర్శన్‌కి వీరాభిమాని రేణుకా స్వామి. కానీ తన అభిమాన హీరో భార్య దగ్గర కంటే ప్రేయసి పవిత్ర గౌడతో ఎక్కువగా ఉంటున్నాడని ఆమెకు, రేణుకా స్వామి అసభ్యకర మెసేజులు పంపించేవాడు. దీంతో సీరియస్ అయిన దర్శన్, తన స్నేహితులతో కలిసి ఈ నెల 8న రేణుకా స్వామిని హత్య చేశాడు. మృత దేహాన్ని బెంగళూరు కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీలో పడేశారు. అయితే రేణుకా స్వామి భార్య.. తన భర్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది.పోలీసులు దర్యాప్తు చేసి ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. కన్నడ హీరో దర్శన్ ఏ-1, పవిత్ర గౌడ ఏ-2గా గుర్తించారు. రీసెంట్గా రేణుకా స్వామి పోస్ట్ మార్టం చేశారు. ఇతడి మర్మాంగాలపై గట్టిగా కొట్టడంతో చనిపోయినట్లు తేలింది. ఇది ఇప్పుడు అందరినీ షాక్‌కి గురి చేస్తోంది. ఇకపోతే దర్శన్, పవిత్ర గౌడకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ) -
శ్రీగంధం, టేకు చెట్ల కొమ్మలు కత్తిరిస్తున్నారా? అంతే సంగతులు.. నష్టాలు తప్పవు!
Sri Gandham Cultivation- Disadvantages Of Pruning: శ్రీగంధం (చందనం), టేకు వంటి అధిక విలువైన కలప తోటల సాగుకు దక్షిణాది రాష్ట్రాలు పెట్టింది పేరు. ప్రైవేటు భూముల్లో సాగుకు ప్రభుత్వం అనుమతించడంతో ముఖ్యంగా శ్రీగంధం తోటల సాగు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో గత 20 ఏళ్లలో బాగా పెరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ మధ్యనే సాగు విస్తరిస్తోంది. శ్రీగంధం,టేకు సాగు రైతులకు అధికాదాయాన్నిచ్చే కలప తోటలు. శ్రీగంధం చెట్లను 15 ఏళ్లు శ్రద్ధగా పెంచితే ఒక్కో చెట్టుపై రూ. లక్ష వరకూ కూడా ఆదాయం రావటానికి అవకాశం ఉందని బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐ.డబ్లు్య.ఎస్.టి.) శాస్త్రవేత్త చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ సహా 5 దక్షిణాది రాష్ట్రాల్లో శ్రీగంధం, టేకు తోటల సాగుపై ఈ సంస్థ పరిశోధనలు చేస్తోంది. ఐ.డబ్లు్య.ఎస్.టి. శాస్త్రవేత్త డా. ఆర్.సుందరరాజ్ శ్రీగంధం, టేకు తోటల సాగులో సాధారణంగా రైతులు చేసే తప్పుల గురించి ‘సాక్షి సాగుబడి’ తో పంచుకున్నారు. ప్రూనింగ్‌తో నష్టాలు మామిడి, దానిమ్మ, మునగ, మల్బరీ వంటి తోటల్లో పంటకోతలు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపులు చేస్తుంటారు. ఈ తోటల్లో ప్రూనింగ్ వల్ల అనేక రకాలుగా వెసులుబాటు కలుగుతుంది. దిగుబడి పెరగడంతో΄ాటు చెట్ల కొమ్మలు మరీ ఎత్తుగా పెరగనీయకుండా ఉండటం వల్ల పంటకోత సులువు అవుతుంది. ఈ అలవాటుకొద్దీ శ్రీగంధం, టేకు చెట్లకు కూడా ప్రూనింగ్ చేస్తున్నారు. ఇది పెద్ద తప్పు. మేలు కన్నా కీడు ఎక్కువగా జరుగుతోందని డా. సుందర్రాజ్ అంటున్నారు. శ్రీగంధం, టేకు చెట్ల కాండం లోపలి కలపను, మధ్యలోని చేవను చీడపీడల నుంచి రక్షించేంది కాండం పైన ఉండే బెరడే. కొమ్మలు కత్తిరించినప్పుడు బెరడు దెబ్బతిని, ఎండిపోతుంది. కొమ్మను నరికిన చోట కాండం లోపలి పొరలు బయటపడతాయి. ఆ విధంగా కలపను కుళ్లింపజేసే శిలీంధ్రాలు, నష్టం చేసే కాండం తొలిచే పురుగులు ప్రూనింగ్ జరిగిన చోటు నుంచి చెట్టు లోపలికి ప్రవేశిస్తాయి. తద్వారా చెట్టు బలహీనపడుతుంది. ఆకుల పెరుగుదల మందగిస్తుంది. కాయలు రాలిపోతాయి. ప్రూనింగ్ గాయాలు కొమ్మల సహజ పెరుగుదలను దెబ్బతీస్తాయి. చెట్టు సమతుల్యత దెబ్బతిని గాలుల వల్ల నష్టం కలుగుతుంది. చాలా సందర్భాల్లో చెట్లు ప్రూనింగ్ జరిగిన కొద్దికాలంలోనే చని΄ోతాయి కూడా అంటున్నారు డా. సుందర్రాజ్. కలప మన్నికకు గొడ్డలిపెట్టు టేకు కలప పదికాలాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. టేకు కలప జీవక్షీణతకు గురిచేసే సూక్ష్మజీవరాశిని అరికట్టే రక్షక పదార్థాలు (మెటబాలిటీస్ లేదా ఎక్స్ట్రాక్టివ్స్) చెట్టు కాండం లోపలి పొరల్లో ఉండబట్టే టేకు కలపకు ఈ గట్టితనం వచ్చింది. ప్రూనింగ్ చేసిన టేకు చెట్లలో ఈ పదార్థాలు లోపించటం వల్ల ఆ కలప మన్నిక కాలం తగ్గిపోతుంది. ఐ.డబ్ల్యూ.ఎస్.టి. నిపుణుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ బయోడిటీరియోరేషన్ అండ్ బయోడిగ్రేడేషన్ జర్నల్‌లో ప్రచురితమైన వ్యాసంలో ఈ విషయాలు పొందుపరిచారు. శ్రీగంధం చెట్లకు ప్రూనింగ్ చేస్తే ఎత్తు పెరగొచ్చు గానీ కాండం చుట్టుకొలత పెరగదు. ప్రూనింగ్ గాయాల దగ్గర సుడులు ఏర్పడటం వల్ల చెక్క అందం పాడవుతుంది. ప్రూనింగ్ చేయటం వల్ల శ్రీగంధం, టేకు చెట్లకు నష్టం జరగటమే కాదు దాని చుట్టూ ఉండే పర్యావరణ వ్యవస్థకు తెలియకుండానే పెద్ద నష్టం జరుగుతుందట. ప్రూనింగ్ చేసిన చెట్లకు గాయాలపై బోర్డాక్స్ పేస్ట్ వంటి శిలీంధ్రనాశనులను పూస్తుంటారు. అయితే, ఇది పూర్తి రక్షణ ఇస్తుందని చెప్పలేమని డా. సుందరరాజ్ తెలిపారు. రసాయనాల ప్రతికూల ప్రభావాలు శ్రీగంధం చెట్లపై చాలా ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలు విని శ్రీగంధం, టేకు చెట్లకు ప్రూనింగ్ చేయొద్దని, చెట్లను సహజంగా పెరగనిస్తూ ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించాలని డా. సుందరరాజ్ సూచిస్తున్నారు. 15 ఏళ్ల చెట్టుకు 10 కిలోల చేవ ఒక రైతు ఇంటి దగ్గర పెరుగుతున్న ఈ మూడు శ్రీగంధం చెట్ల వయస్సు 15 సంవత్సరాలు. ఈ మూడిటికీ కొమ్మలు కత్తిరించారు. తక్కువ ప్రూనింగ్ వల్ల రెండు చెట్లు కోలుకున్నాయి. కానీ మూడో చెట్టుకు అతిగా ప్రూనింగ్ చేయటం వల్ల కోలుకోలేకపోయింది. మేం ఈ చెట్లకు చేవ (హార్ట్‌వుడ్) ఎంత ఉందో పరీక్షించాం. మొదటి రెండు చెట్ల కాండంలో మాత్రమే హార్ట్‌వుడ్ కనిపించింది. బలహీనంగా ఉన్న మూడో చెట్టులో అసల్లేదు. చెట్టు మీ కోసమో, నా కోసమో చేవదేలదు. తన బలం కొద్దీ చేవదేలుతుంది. కాబట్టి ఏ చెట్టు నాణ్యతైనా, చేవ పరిమాణమైనా అది ఎంత ఆరోగ్యకరంగా పెరుగుతున్నదన్నదానిపై ఆధారపడి ఉంటుంది. నా అనుభవం ప్రకారం, 15 సంవత్సరాలు ఆరోగ్యంగా పెరిగిన చందనపు చెట్టుకు కనీసం 10 కిలోల చేవ ఉంటుంది. దాన్ని బట్టి రైతుకు ఆదాయం వస్తుంది. – డా. ఆర్.సుందరరాజ్ (97404 33959), శాస్త్రవేత్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బెంగళూరు – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ చదవండి: ఎటాక్.. స్ట్రోక్ వేర్వేరు... -
డ్రగ్స్ కేసు: నటి సంజన అరెస్టు!
సాక్షి, బెంగళూరు: డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా నటి సంజన సన్నిహితుడు, రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే.(చదవండి: రంగుల తెరపై డ్రగ్స్ మరక!) అతడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు పొందారు.( చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) టాలీవుడ్ డ్రగ్స్ కేసును తలపిస్తున్న కన్నడ చిత్ర సీమ వ్యవహారం రెండేళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలోనూ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అకున్ సబార్వాల్ నేతృత్వంలోని సిట్ అనేక మంది టాలీవుడ్ ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, దర్శకులను విచారించారు. పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్‌ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరైన తారల లిస్టులో ఉన్నారు. ఇక ఇటీవల శాండల్‌వుడ్‌లోనూ ఇదే తరహా డ్రగ్స్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ క్రమంలో ఆగష్టులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్స్‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అనిఖా అనే యువతి కూడా ఉంది. సోదాల్లో భాగంగా ఆమె.. డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు పేర్లను గుర్తించారు. విచారణలో భాగంగాపలువురు హీరోలు, హీరోయిన్లు, సింగర్లకు అనిఖా డ్రగ్స్ సరఫరా చేసినట్లు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని.. పలువురు సెలబ్రిటీలు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగుని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు బీ-టౌన్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారిస్తోంది. -
సిటీలో ఎర్రచందనం డంపులు?
సాక్షి, సిటీబ్యూరో: శేషాచలం అడవుల్లో మాత్రమేలభించే ఎర్రచందనం డంపులు హైదరాబాద్‌లోనూ ఉన్నాయా..? వ్యవస్థీకృత ముఠాలు ఈ సరుకును సిటీ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నాయా..? అక్కడ నుంచి భారీగా విదేశాలకు తరలి వెళ్లిపోతోందా..? అంటే..ఔననే అంటున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. గత నెల ఆఖరి వారంలో వారు అరెస్టు చేసిన భోలే రామ్ కాశ్యప్ విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంలో ఢిల్లీకి చెందిన ఓ ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి వచ్చింది. ఈ దందాలో నగరానికి చెందిన మరికొందరికీసంబంధం ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు అప్రమత్తం కాకుండా ఉండేందుకు తమ విచారణ వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఢిల్లీ శివార్లలోని మెండు గర్హి ప్రాంతంలో భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు అక్రమంగా దాచి ఉంచినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు గత నెల 30న సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ ప్రాంతంపై దాడి చేశారు. ఫలితంగా 1797.05 కేజీల బరువుతో ఉన్న రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, భోలే రామ్ కాశ్యప్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని సుభాష్ పార్క్ ప్రాంతానికి చెందిన మెండు గర్హి ప్రాంతంలో ఓ గోదాము అద్దెకు తీసుకున్నాడు. అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లింగ్ గ్యాంగ్‌లో ఇతడు కీలక పాత్ర పోషిస్తున్నాడు. బీహార్‌లోని పట్నా ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఇతడికి సహకరిస్తున్నాడు. అంతర్జాతీయ లావాదేవీలన్నీ అతడి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు ఎర్రచందనం దుంగల్ని హైదరాబాద్‌తో పాటు ఉత్తరాదికి తరలిస్తున్నారు. ప్రధానంగా రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘడ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు ఈ దుంగలు చేరుతున్నాయి. ఇక్కడ నుంచి అంతర్జాతీయ మాఫియా రంగంలోకి దిగుతోంది. ఈ దుంగల్ని రకరకాలుగా మారుస్తున్న స్మగ్లర్లు విమానాల ద్వారా తక్కువ మోతాదులో, ఓడల్లో భారీ స్థాయిలో విదేశాలకు తరలించేస్తున్నారు. ప్రధానంగా చైనా, జపాన్‌లతో పాటు కొన్ని ఆసియా దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ధర భారీగా ఉంటోంది. భోలేరామ్ కాశ్యప్ కేసును సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. పరారీలో ఉన్న పట్నా వాసి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇతడు చిక్కితేనే అంతర్జాతీయ మాఫియా లింకులు వెలుగులోకి వస్తాయని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. భోలే రామ్‌కు ఎర్రచందనం చిత్తోర్‌ఘడ్‌తో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినట్లు తేలడంతో ఈ రెండు ప్రాంతాల్లో దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ టీమ్ ఆదివారం హైదరాబాద్ చేరుకుని రహస్యంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసుకు సంబ«ంధించి త్వరలోనే మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉంది. చందనం సైతం అక్రమ రవాణా... హైదరాబాద్ కేంద్రంగా ఎర్రచందనమే కాదు... చందనం కూడా భారీ స్థాయిలో అక్రమ రవాణా అవుతోంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు పార్శిల్ చేసిన గంధం చెక్కలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులు పట్టుకున్నారు. ఈ ఉదంతం గత నెల 30న చోటు చేసుకుంది. 78.5 కేజీల బరువు ఉన్న గంధపు చెక్కల్ని చిప్స్‌తో పాటు స్టిక్స్ రూపంలోకి మార్చిన స్మగ్లర్లు అక్రమ రవాణాకు ప్రయత్నించారు. ఈ కేసును శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..!
బెంగళూరు: సాధారణంగా సినిమాల్లో మన హీరోలు దొంగలను, హంతకులను అవినీతిపరులను వెంటాడడం చూస్తుంటాం. కానీ నిజజీవితంలో అదే హీరోలు ఏమైనా జరిగితే మాత్రం పెద్దగా స్పందించరు. కానీ కన్నడ హీరో రఘుబట్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనే అంటూ నిరూపించుకున్నాడు. బెంగళూరులో శుక్రవారం తెల్లవారుజామున క్యాబ్ డ్రైవర్ని వద్ద చోరీ చేసి పరారవుతున్న ఇద్దరు దొంగలను.. అటుగా ఫార్చ్యూనర్ కారులో వెళుతున్న హీరో రఘుభట్ గమనించారు. వెంటనే దొంగల బైక్‌ను సుమారు రెండు కిలోమీటర్ల వరకు వెంబడించిగా.. సెయింట్ జాన్సన్ స్కూల్ సర్కిల్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వెంటనే రఘుభట్ వారిరువురిని పట్టుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మొహిన్ తలకు, అబ్దుల్లా చేయికి గాయాలు కావడంతో, ఇరువురిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆ బాలుడి సంకల్పానికి ఫిదా అవ్వాల్సిందే! -
విక్రమ్ సినిమాతో తెరంగేట్రం చేయనున్న బౌలర్
రాంచి : టీమిండియా పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నాడు. తమిళ సూపర్‌స్టార్ విక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్లో పేర్కొన్నాడు. అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్ తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలిసింది. ఙ్ఞానముత్తు ఇదివరకు డిమొంటే కాలనీ, ఇమైక్క నొడిగల్ సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే, ఈ సినిమాలో ఏ రకమైన పాత్ర పోషించబోతున్నదీ ఇర్ఫాన్ వెల్లడించలేదు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై సినిమా నిర్మాణం జరుగునున్నట్టు సమాచారం. కాగా, 2012లో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ ఇర్ఫాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఇక దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇర్ఫాన్ ఎక్స్పర్ట్ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్నాడు. New venture,new challenge looking forward to it @AjayGnanamuthu @iamarunviswa @7screenstudio @arrahman @Lalit_SevenScr #ChiyaanVikram58 @sooriaruna @proyuvraaj @LokeshJey@VishalSaroee pic.twitter.com/yZ99OZyJrl — Irfan Pathan (@IrfanPathan) October 14, 2019 -
హీరో సుదీప్‌కు అరెస్ట్ వారెంట్
బెంగళూరు : కన్నడ హీరో, ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాఫీ ఎస్టేట్ వివాదంలో కోర్టుకు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చిక్మంగళూరు కోర్టులో వరుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు చిక్మంగళూరు జెఎంఎఫ్‌సీ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. మే 22వ తేదీ లోగా సుదీప్ ఆచూకి తెలుసుకొని కోర్టు ముందు హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసులను ఆదేశించిందిజ ప్రస్తుతం ఆ వార్త శాండల్‌వుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా నిలిచింది. కర్ణాటక చిక్‌మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ యజమాని దీపక్ పటేల్ ఫిర్యాదు మేరకు నటుడు సుదీప్, కన్నడ టీవీ రియాలిటీ షో సుదీప్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్ కిచ్చా క్రియేషన్స్‌పైనా, డైరెక్టర్ మహేష్‌లపై కేసు నమోదైంది. 2016లో కన్నడ టీవీ షో వారసదార షూటింగ్ కోసం తన ఎస్టేట్‌ను అద్దెకు తీసుకొన్నారు. ఇందుకు కోటి 80 లక్షల రూపాయలను చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ రూ. 50 వేలు మాత్రమే ఇచ్చి మిగతా సొమ్మును ఎగ్గొట్టారని, అలాగే తన కాఫీ తోటల్ని, మరికొంత వారసత్వ ఆస్తిని ధ్వంసం చేశారని దీపక్ ఆరోపించారు. ఒప్పందానికి భిన్నంగా లోపల ఒక సెట్‌ను కూడా నిర్మించారనీ, తనకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించకుండా మోసం చేశారంటూ మొదట జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అయితే ఇది సివిల్ వివాదం కావడంతో ఎస్పీ సలహా మేరకు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు కాఫీ ఎస్టేట్ ఓనర్ దీపక్. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడనేది ప్రధాన ఆరోపణ. -
నా బలమేంటో నాకు తెలుసు
‘కేజియఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు కన్నడహీరో యశ్. పాపులారిటీతో పాటు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా తెచ్చిపెట్టుకున్నారని శాండిల్‌వుడ్ మీడియా టాక్. యశ్‌కు ప్రాణ హాని తలపెట్టడానికి ఓ గ్యాంగ్ సుపారీ పుచ్చుకుంది అని వార్తలు రావడంతో యశ్ అభిమానులు కంగారు పడ్డారు. దీంతో యశ్ బయటకు వచ్చి సమాధానం ఇచ్చారు. ‘‘నేను పోలీస్ అధికారులతో మాట్లాడాను. ప్రాణహాని లాంటిది ఏం లేదని చెప్పారు. ఏ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ అయినా నాకు ప్రాణహాని ఉందంటారు. నేనేమీ గొర్రెను కాదు కదా? నా బలమేంటో నాకు తెలుసు’’ అన్నారు. -
ఐశ్వర్యతో పెళ్లి కాలేదు: వెంకట్
యశవంతపుర : నటి ఐశ్వర్యను తాను వివాహం చేసుకున్నట్లు ఫేస్బుక్ లైవ్‌లో చేప్పిన శాండల్‌వుడ్ నటుడు హుచ్చ వెంకట్ మూడు రోజుల తరువాత మాట మార్చాడు. తాను ఐశ్వర్యను వివాహం చేసుకోలేదంటూ బుధవారం మరో వీడియోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ‘డిక్టేటర్ హుచ్చ వెంకట్’ అనే సినిమాలో హిరోయిన్‌గా ఐశ్వర్య నటిస్తోందని, సినిమా చిత్రీకరణలో భాగంగా జరిగిన వివాహ దృశ్యాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసినట్లు తెలిపారు.