![Actress Harshika Poonacha Pregnancy News](/styles/webp/s3/article_images/2024/07/2/Actress-Harshika.jpg.webp?itok=ySpUg9VZ)
మరో యంగ్ హీరోయిన్ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటోతో సహా రివీల్ చేసింది. అయితే ఈ ఫొటోలో భర్తతో కలిసి డిఫరెంట్ ఔట్‌ఫిట్‌లో కనిపించి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)
కర్ణాటకకు చెందిన హర్షిక.. 15 ఏళ్ల నటిగా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, భోజ్‌పురి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. 'ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడు అలా ఇప్పుడు ఇలా' అనే తెలుగు మూవీస్ చేసింది. హీరోయిన్‌గా చేస్తూనే గ్లామ్ గాడ్ ఫ్యాషన్ అనే కంపెనీ కూడా ఈమెకు ఉంది. ఇందులో హర్షిక పార్ట్‌నర్ నటుడు భువన్ పొన్నాన.
ఇలా బిజినెస్ పార్ట్‌నర్స్ కాస్త గతేడాది ఆగస్టులో జీవిత భాగస్వామ్యలు అయ్యారు. కర్ణాటకలోని కొడగు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. తాజాగా తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు హర్షిక-భువన్ ప్రకటించారు. అక్టోబరులో డెలివరీ ఉంటుందని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే పలువురు వీళ్లకు విషెస్ చెబుతున్నారు.
(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో)
Comments
Please login to add a commentAdd a comment