Harshika Poonacha
-
ప్రెగ్నెన్సీ రోజుల్ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్ (ఫొటోలు)
-
హీరోయిన్ హర్షిక బేబీ షవర్.. హోస్ట్ చేసింది స్టార్ హీరోనే (ఫొటోలు)
-
గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీ పిక్ వైరల్
మరో యంగ్ హీరోయిన్ తల్లి కాబోతుంది. ఇందుకు సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నానని ఫొటోతో సహా రివీల్ చేసింది. అయితే ఈ ఫొటోలో భర్తతో కలిసి డిఫరెంట్ ఔట్ఫిట్లో కనిపించి ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)కర్ణాటకకు చెందిన హర్షిక.. 15 ఏళ్ల నటిగా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, భోజ్‌పురి భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. 'ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడు అలా ఇప్పుడు ఇలా' అనే తెలుగు మూవీస్ చేసింది. హీరోయిన్గా చేస్తూనే గ్లామ్ గాడ్ ఫ్యాషన్ అనే కంపెనీ కూడా ఈమెకు ఉంది. ఇందులో హర్షిక పార్ట్నర్ నటుడు భువన్ పొన్నాన.ఇలా బిజినెస్ పార్ట్నర్స్ కాస్త గతేడాది ఆగస్టులో జీవిత భాగస్వామ్యలు అయ్యారు. కర్ణాటకలోని కొడగు సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. తాజాగా తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు హర్షిక-భువన్ ప్రకటించారు. అక్టోబరులో డెలివరీ ఉంటుందని కూడా చెప్పేశారు. ఈ క్రమంలోనే పలువురు వీళ్లకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: అబ్బాయినని చెప్పిన వదల్లేదు.. బలవంతం చేశారు: యంగ్ హీరో) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) -
హీరోయిన్‌కి చేదు అనుభవం.. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా!
ప్రముఖ హీరోయిన్ చేదు అనుభవం ఎదురైంది. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా బూతులు తిట్టారు. మెడలోని బంగారు గొలుసు కూడా లాగేసే ప్రయత్నం చేశారు. కొన్ని రోజుల ముందు జరిగిన ఈ సంఘటన గురించి సదరు హీరోయిన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. అసలేం జరిగిందో అనేది విడమరిచి మరీ చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. కర్ణాటకకు చెందిన నటి హర్షిక పునాచ.. 2008 నుంచి సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ 'ఏడుకొండలవాడ వెంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడలా ఇప్పుడిలా' తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కొంకణి, భోజ్‌పురి, కొడవ భాషా చిత్రాల్లో నటించింది. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) నటుడు భువన్ పొన్నానని గతేడాది పెళ్లి చేసుకున్న హర్షిక.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని ఆస్వాదిస్తోంది. తాజాగా బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లి తిరిగొస్తుండగా ఊహించని సంఘటన ఎదురైందని, కొందరు వ్యక్తులు తమ కారుని అడ్డగించి దాడి చేశారని.. తన భర్త మెడలో బంగారు గొలుసు లాగేయబోయరని చెప్పుకొచ్చింది. 'ఇద్దరు వ్యక్తులు సడన్ గా డ్రైవర్ సీటు దగ్గరకొచ్చి కారు చాలా పెద్దగా ఉందని, స్టార్ట్ చేస్తే తమకు తగులుద్ది అని గొడవ మొదలుపెట్టారు. నా భర్త కన్నడలో సరేలే జరగమని వాళ్లతో అన్నాడు. అయితే ఈ కన్నడ వాళ్లకు బుద్ది చెప్పాలని, అవసరమైతే ముఖంపై గుద్ది చెప్పాలని వాళ్లు హిందీలో అన్నారు. పదే పది నిమిషాల్లో 20-30 మంది మా కారు చుట్టుముట్టారు. వీళ్లలో ముగ్గురు నా భర్త మెడలోని బంగారు గొలుసు లాగేయాలని ప్రయత్నించారు. ఇది గ్రహించిన నా భర్త.. గొలుసు నాకు ఇచ్చేశారు. వాళ్లతో మేం కన్నడలో మాట్లాడమే తప్పైపోయింది. దీని గురించి కంప్లైంట్ చేయాలని పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఓ ఏఎస్ఐ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు' అని హర్షిక చెప్పుకొచ్చింది. ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు) View this post on Instagram A post shared by Harshika Poonacha (@harshikapoonachaofficial) -
బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్
ఈ మధ్య పెళ్లిళ్లు బాగానే జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ కూడా కొత్త జీవితం ప్రారంభించింది. తన బెస్ట్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్నర్ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. నటి హర్షిక పునాచ స్వతహాగా కన్నడ అమ్మాయి. 15 ఏళ్ల వయసులోనే 'PUC' అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పటికీ అంటే దాదాపు 15 ఏళ్లుగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్గా చేసింది. 'ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడు అలా ఇప్పుడు ఇలా' అనే తెలుగు మూవీస్ చేసింది. (ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్) హీరోయిన్గా కాస్త బిజీగా ఉన్న హర్షికకు 'గ్లామ్గాడ్ ఫ్యాషన్' అనే కంపెనీ కూడా ఉంది. ఫ్యాషన్ షోలు లాంటివి ఇది నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో హర్షికకు పార్ట్నర్గా నటుడు భువన్ ఉన్నాడు. గత కొన్నాళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్లిద్దరూ.. ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఆగస్టు 26న కొడగు సంప్రదాయ విధానంలో వీళ్ల పెళ్లి జరిగింది. ఇకపోతే హీరోయిన్ హర్షిక పెళ్లికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు యడుయూరప్ప, బసవరాజు బొమ్మైతో పాటు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. నూతన వధూవరులని ఆశీర్వదించారు. మరి హర్షిక పెళ్లి ఫొటోలపై మీరు ఓ లుక్ వేసేయండి. (ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్) -
వైరల్: కరోనా పేషెంట్లతో సెలబ్రిటీల డ్యాన్స్
బెంగళూరు: కోవిడ్ సోకితే చాలు అయినవాళ్లనే పరాయివాళ్లుగా చూస్తున్నా రోజులివి. మానసిక స్థైర్యం కల్పించాల్సిన వాళ్లే మనకెందుకులే అని చేతులు దులుపుకుంటున్న దుర్దినాలివి. కానీ ఇలాంటి సమయంలో బాధతో కుమిలిపోతున్న కోవిడ్ పేషెంట్లను నవ్వించేందుకు, వారి ముఖాల మీద చిరునవ్వు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారిద్దరు నటీనటులు. కన్నడ స్టార్ హర్షిక పూనాచా, తన కజిన్, నటుడు భువన్ పొన్నన్నతో కలిసి కర్ణాటకలోని మడికెరి కోవిడ్ ఆస్పత్రిని సందర్శించింది. పీపీఈ కిట్లలో ఆస్పత్రిలో అడుగుపెట్టిన ఈ సెలబ్రిటీలు అక్కడి వార్డుల్లో ఉన్న ఆయా పేషెంట్లను పలకరిస్తూ డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు కరోనా పేషెంట్లు వారితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కొడగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుమతితో కోవిడ్ పేషెంట్లను కలిసిన ఈ సెలబ్రిటీలు వారిపై వివక్ష చూపకూడదని తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేశామన్నారు. అయితే అక్కడ చాలా మంది రోగులు మానసికంగా బలహీనంగా ఉన్నారని తెలిపారు. అలాంటివారికి ధైర్యాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించామన్నారు. ఈ మాయదారి రోగాన్ని సమూలంగా నాశనం చేసేవరకు మనమందరం కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా భువన్, హర్షిక.. భువనమ్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడంతోపాటు రోగులకు ఔషధాలను కూడా పంపిణీ చేస్తున్నారు. చదవండి: OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో! -
బలవంతంగా ముద్దు పెట్టబోయాడు!
‘‘నాతో అసభ్యంగా ప్రవర్తించాడు’’.. మీటూ అంటూ పలువురు సినీ తారలు తమ చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. ‘మీకు తోడుగా నేనున్నాను’ మీటూ.. అంటూ పలువురు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు పురుషుల కోసం ‘హీటూ’ రావాలంటున్నారు. కొందరు ‘వియ్ టు’ (వీటూ) అంటూ మగవాళ్లే ముందుకు రావాలని చెబుతున్నారు. ఎవరెవరు ఏమేం అన్నారు? ఎవరెవరు తాజాగా మీటూ అని ఆరోపించారు? అనేది తెలుసుకుందాం. బలవంతంగా ముద్దు పెట్టబోయాడు! వికాస్ బాల్, సాజిద్ ఖాన్, సుభాష్ కపూర్... ఇలా కొంతమంది బాలీవుడ్ డైరెక్టర్లకు ‘మీటూ’ ఉద్యమ సెగ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్‌లో కన్నడ స్క్రీన్‌ప్లే రైటర్, డైరెక్టర్ ఎరే గౌడ ఈ జాబితాలో చేరారు. ‘తిథి’ సినిమాకి స్క్రీన్‌ప్లే రైటర్‌గా పనిచేసినప్పుడు ఎరే తనను లైంగికంగా వేధించాడని ఏక్తా అనే యువతి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సారాంశం ఇలా ఉంది. ‘‘సినిమాలపై ఆసక్తితో చదువు పూర్తయ్యాక ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేద్దామని బెంగళూరు వచ్చాను. నా లక్ష్యం నెరవేర్చుకోవడానికి సహాయం చేస్తానంటూ, ఎరే నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆ తర్వాత అతనికి దూరంగా వెళ్లిపోయాను’’ అని చెప్పుకొచ్చారు. ఏక్తా చెప్పిన ఈ విషయాన్ని నటి శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎరేపై ఏక్తా చేసిన ఆరోపణ వెంటనే ప్రభావం చూపింది. ఎరే దర్శకత్వంలో వచ్చిన ‘భలేకెంపా’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సైతం నామినేట్ అయ్యింది. త్వరలోనే ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శితం కావాల్సి ఉంది. కానీ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు ‘భలేకెంపా’ సినిమాను ప్రదర్శించడం లేదని వెల్లడించారు. అలాగే ఎరే మీద వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో తెలిసే వరకు ఈ సినిమాను ఫిల్మ్ ఫెస్టివల్స్ కమిట్మెంట్స్ నుంచి విత్ డ్రా చేసుకుంటున్నాం’’ అని స్వయంగా ఈ సినిమా నిర్మాణసంస్థ జూ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు పేర్కొన్నారట. నా పోరాటం ఆగదు ‘‘అర్జున్‌పై ‘మీటూ’ ఆరోపణలు చేయడం నా పొరపాటుగా ఒప్పుకోవాలని కొందరు నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నాను. అర్జున్ పై ఆరోపణలు చేయాలని చేతన్, ప్రకాశ్ రాజ్, కవితా లంకేశ్, మరి కొందరు నన్ను ప్రోత్సహించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. చట్టపరంగా నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. అర్జున్ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాపై తమాషా వీడియోలను తయారుచేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాళ్లు ఏమి కావాలో అది చేసుకోవచ్చు, నేనేం చేయాలో అది చేస్తాను. భట్, సంజన, మరికొందరు నటీమణులు ‘మీటూ’ ఆరోపణలు చేస్తున్నారు. వారికి భవిష్యత్ లేకుండా చేయాలని కన్నడ ఫిల్మ్ చాంబర్ ప్రయత్నిస్తున్నట్లుంది. నా పోరాటం ఆగద’’ని వివరిస్తూ శ్రుతీ హరిహరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాకది పెద్ద షాక్ – అమలాపాల్ ఇటీవల ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ లీలా మనిమేకళై దర్శకుడు సుశీ గణేశన్ తనను వేధించారని ఆరోపించారు. ఇప్పుడు నటి అమలాపాల్ కూడా సుశీపై ఆరోపణలు చేశారు. ‘‘లీలాను నేను నమ్ముతున్నాను. సుశీ డైరెక్షన్లో ‘తిరుట్టుపయలే 2’ అనే సినిమా చేశాను. సెట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడేవాడు. మహిళల పట్ల అతని ప్రవర్తన సరిగ్గా ఉండేది కాదు’’ అన్నారు అమలాపాల్. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సుశీ, ఆయన భార్య మంజరి నాకు కాల్ చేశారు. ఈ ఇష్యూ గురించి మంజరికి వివరిస్తున్నప్పుడు సుశీ తిట్టడం స్టార్ట్ చేశాడు. అప్పుడు మంజరి నవ్వడం ఆశ్చర్యంగా అనిపించింది. నాపై పగ తీర్చుకోవడానికి వాళ్లు ఏకమయ్యారు. నేను భయపడతానని వాళ్లనుకుంటున్నారేమో’’ అన్నారు. పురుషులకు ‘హీటూ’ ఉండాలి ఒకవైపు ‘మీటూ’కి పలువురు మద్దతుగా నిలుస్తుంటే బాలీవుడ్ తార రాఖీ సావంత్, కన్నడ తార హర్షికా పూనాచా మాత్రం వ్యతిరేకంగా మాట్లాడారు. ‘‘తనుశ్రీ పబ్లిసిటీ కోసమే నానాపై ఆరోపించిందని, తనకు పిచ్చి అని నేను అన్నందుకు నాపై పది కోట్ల పరువు నష్టం దావా వేస్తే, నన్ను లో క్లాస్ గాళ్ అని అన్నందుకు ఆమెపై నేను 50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. ‘మీటూ’ ఉద్యమంలో మహిళలు చెబుతున్నవన్నీ వాస్తవాలని ఎందుకు నమ్ముతున్నారు? అయోధ్యన్ సుమన్, హృతిక్‌రోషన్ ఎంతో టార్చర్ అనుభవించారు. మహిళలకు ‘మీటూ’ ఉన్నట్లే.. పురుషులకు ‘హీటూ’ లేదా ‘మెన్‌టూ’ మూమెంట్స్ ఉండాలి’’ అని రాఖీ సావంత్ అన్నారు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం హర్షిక పూనాచా ‘వీటూ’ (వియ్ టూ) మూమెంట్ రావాలని అభిప్రాయపడుతూ ఓ పోస్ట్‌ను సోషల్ మీడియాలో ఉంచారు. ‘‘మీటూ’ డెవలప్‌మెంట్స్‌ను గమనిస్తున్నా. మహిళల ప్రమేయం లేకుండా ఎవ్వరూ ఏమీ చేయలేరని ఒక స్ట్రాంగ్ ఉమెన్‌గా నా అభిప్రాయం. పబ్లిసిటీ కోసమే కొందరు నటీమణులు ఫెమినిటీని ఓ టూల్‌గా వాడుకుంటున్నారు. పదేళ్లుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు ‘యాక్టివిస్ట్ యాక్ట్రసెస్’గా చెప్పుకుంటున్న కొందరు కెరీర్ స్టార్టింగ్‌లో తమ సౌకర్యాల కోసం పురుషులకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఆ తర్వాత పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తున్నారు. ‘మీటూ’కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకడం లేదు. ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘ఎ’ లిస్ట్ సూపర్ స్టార్స్ పేర్లు మీటూ ఉద్యమంలో ఎందుకు రావు? సూపర్ స్టార్ హీరోయిన్లు ఎందుకు స్పందించడం లేదు. ఇప్పుడు ‘మీటూ’ ఉద్యమంలో ఉన్న కొందరు తారలు హ్యాపీగా మత్తు పీలుస్తూ.. మీటూ ఉద్యమంలో ఫేమస్ పర్సనాలిటీస్‌ను ఎలా లాగాలి? అని చర్చించుకుంటున్న వీడియోను చూశాను. ఇంకో వీడియోలో అర్ధనగ్నంగా కారులో ఉన్న ఓ హీరోయిన్ ‘మీ తర్వాతి చిత్రంలో కూడా నేనే హీరోయిన్.. ఓకేనా’ అని ఓ ఫేమస్ హీరోని అడగడం చూశాను. ఒక నటిగా నన్ను కొందరు ‘ఆఫర్స్’ అడిగారు కానీ నేను నో చెప్పాను. దానివల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో నేను చాన్సులు మిస్ అయ్యుండవచ్చు. కానీ నేను ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఈ రోజు నేను చెప్పిన ఈ విషయాలను కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ నిజం ఎప్పటికీ మారదు. ఇండస్ట్రీలో కొందరు చెడ్డ వ్యక్తులు ఉండవచ్చు. వర్క్ ఇస్తామంటూ మహిళలను ప్రలోభ పెట్టవచ్చు కానీ మహిళల ప్రమేయం ఎంతో కొంత లేకుండా బలవంతంగా రేప్ చేయలేరు. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేం. ‘మీటూ’ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్న మహిళలను ఒక విషయం కోరుతున్నాను. దయచేసి రియల్‌గా ఉండండి. ఇప్పుడు పురుషులు ‘వీటూ’ అనే ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నా తోటి నటీమణులకు వ్యతిరేకంగా మాట్లాడాలన్నది నా ఉద్దేశం కాదు. అయితే ఇతరులు మనల్ని, మన ఇండస్ట్రీని అపహాస్యం చేస్తున్నారు. మనకు ఇండస్ట్రీ ‘బ్రెడ్ అండ్ బటర్’ ఇస్తోంది. ఆ పరిశ్రమను అపహాస్యం కానివ్వకూడదు ’’ అని చెప్పుకొచ్చారు. సుశీ గణేశన్, అమలాపాల్ -
‘కాఫీడే’... నా జీవితాన్ని మలుపు తిప్పింది!
- హర్షికా పూనచ్చా ‘‘కన్నడంలో ఇప్పటివరకూ 12 సినిమాలు చేశాను. పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ వంటి సూపర్‌స్టార్స్‌తో నటించా. తెలుగులో నాకిది తొలి సినిమా. రిలీజ్ దగ్గరవుతుంటే నెర్వస్‌గా ఉంది’’ అని నాయిక హర్షిక అన్నారు. కె.ఆర్.విష్ణు దర్శకత్వంలో సూర్య, హర్షికా పూనచ్చా జంటగా పుల్లరేవు రామచంద్రారెడ్డి, కల్యాణ్ ధూళిపాళ సమర్పణలో ప్రదీప్‌కుమార్ జంపా నిర్మించిన చిత్రం ‘అప్పుడలా...ఇప్పుడిలా’. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హర్షిక మాట్లాడుతూ- ‘‘నేను పుట్టింది, పెరిగింది బెంగళూరులోనే. నిజం చెప్పాలంటే, నేను హీరోయిన్ని అవుతానని కలలో కూడా అనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. టెన్త్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్‌తో కలిసి ‘కాఫీడే’కి వెళ్లాను. అక్కడికి ఓ సినిమా డెరైక్టర్ వచ్చి నన్ను చూసి, ‘యాక్ట్ చేస్తావా?’ అని సడన్‌గా అడిగారు. మొదట షాక్ అయ్యాను. కానీ తర్వాత కథ నచ్చి, వెంటనే ఒప్పుకున్నా. అలా ‘కాఫీడే’ నా జీవితాన్ని మలుపుతిప్పింది. 15 ఏళ్ల వయసులో సినిమాల్లోకొచ్చా. కానీ, చదువు కొనసాగిస్తూనే, సినిమాల్లో కూడా నటించాను. గత ఏడాదే నా ఇంజినీరింగ్ పూర్తయింది. ఇక నుంచి పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాలనుకుంటున్న సమయంలోనే ఈ తెలుగు ఛాన్స్ వచ్చింది. తెలుగులో అందరి సినిమాలూ చూస్తుంటా. ముఖ్యంగా పవన్‌కల్యాణ్, మహేశ్‌బాబు సినిమాలంటే చాలా ఇష్టం. ఈ చిత్ర నిర్మాత ప్రదీప్‌కుమార్ జంపా నా సినిమాలు చూసి నన్నీ చిత్రానికి రికమెండ్ చేశారు. అప్పుడే దర్శకుడు విష్ణు ఈ కథ చెప్పడం, ఆ కథ బాగా నచ్చడంతో మొదటిసారి తెలుగులో నటించ డానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నేను రిచ్గాళ్గా కనిపిస్తాను. ఇందులో సీనియర్ నరేశ్ నాకు తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో క్యారెక్టర్ నా నిజజీవిత స్వభావానికి దగ్గరగా ఉంటుంది. కానీ నా పాత్ర పేరు సస్పెన్స్. ఈ సినిమా చిత్రీకరణప్పుడే తెలుగు మాట్లాడటం నేర్చేసుకున్నా. నా నెక్స్ట్ సినిమాకు తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నా’’ అని చెప్పారు. -
ముద్దెవరూ ఇవ్వలేదు!
కన్నడ ముద్దుగుమ్మ హర్షిక పూనాచా, తమిళ హీరో శింభుల లిప్ లాక్ వీడియో ఇప్పుడు అభిమానులను ఊపేస్తోంది. దీనిపై ఇంతకాలం సెలైంట్‌గా ఉన్న ఈ అమ్మడు... ఎట్టకేలకు పెదవి విప్పింది. తనకెవరూ ముద్దు ఇవ్వలేదని ఎంత చెప్పినా వినరేంటని తెగ సీరియస్ అయిపోతోంది. ‘ఇదో పనికిమాలిన ప్రచారం. ఇటీవల మలేిసియాలో జరిగిన అవార్డుల కార్యక్రమం సందర్భంగా ఇలా లిప్ లాకైందని కామెంట్స్ చేస్తున్నారు. ఇది సరైంది కాదు’ అంటూ ట్వీట్ చేసిందీ స్వీట్ సుందరి. -
'పానీపూరి' సినిమా స్టిల్స్
-
వినోదాల ‘పానీపూరి’
‘‘కుటుంబ విలువలతో కూడిన చిత్రమిది. వినోదంతో పాటు చిన్నపాటి సందేశం కూడా ఉంది’’ అని సుమన్ చెప్పారు. సూర్యతేజ, హర్షిక పూంచా జంటగా కేఆర్ విష్ణు దర్శకత్వంలో ప్రదీప్‌కుమార్ జంపా నిర్మిస్తున్న ‘పానీపూరి’ చిత్రం టాకీపార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్ తరహాలోనే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. కథే ఈ చిత్రానికి ప్రాణమని, పాటలు మినహా చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు. సోలో హీరోగా తనకిది తొలి చిత్రమని సూర్యతేజ చెప్పారు. ఈ సినిమాలో ప్రతి పాత్ర కొత్తగా ఉంటుందని నరేష్ అన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: కె.బ్రహ్మారెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్.