బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్ | Actress Harshika Poonacha Wedding With Actor Bhuvan Ponnanna - Sakshi
Sakshi News home page

Harshika Poonacha: ఆ నటుడితో హీరోయిన్ పెళ్లి.. ఫొటోలు వైరల్

Aug 29 2023 10:32 AM | Updated on Aug 29 2023 11:36 AM

Actress Harshika Poonacha Wedding With Actor Bhuvan Ponnanna - Sakshi

ఈ మధ్య పెళ్లిళ్లు బాగానే జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ కూడా కొత్త జీవితం ప్రారంభించింది. తన బెస్ట్ ఫ్రెండ్, బిజినెస్ పార్ట్‌నర్‌ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.

నటి హర్షిక పునాచ స్వతహాగా కన్నడ అమ్మాయి. 15 ఏళ్ల వయసులోనే 'PUC' అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పటికీ అంటే దాదాపు 15 ఏళ్లుగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, భోజ్‌పురి సినిమాల్లో హీరోయిన్‪‌గా చేసింది. 'ఏడు కొండలవాడ వేంకటరమణ అందరూ బాగుండాలి', 'అప్పుడు అలా ఇప్పుడు ఇలా' అనే తెలుగు మూవీస్ చేసింది.

(ఇదీ చదవండి: పబ్లిక్‌లో హీరోయిన్‌కి ముద్దుపెట్టిన తెలుగు డైరెక్టర్)

హీరోయిన్‌గా కాస్త బిజీగా ఉన్న హర్షికకు 'గ్లామ్‌గాడ్ ఫ్యాషన్' అనే కంపెనీ కూడా ఉంది. ఫ్యాషన్ షోలు లాంటివి ఇది నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో హర్షికకు పార్ట్‌నర్‌గా నటుడు భువన్ ఉన్నాడు. గత కొన్నాళ్లుగా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్లిద్దరూ.. ఇప్పుడు ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఆగస్టు 26న కొడగు సంప్రదాయ విధానంలో వీళ్ల పెళ్లి జరిగింది.

ఇకపోతే హీరోయిన్ హర్షిక పెళ్లికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు యడుయూరప్ప, బసవరాజు బొమ్మైతో పాటు పలువురు మంత్రులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. నూతన వధూవరులని ఆశీర్వదించారు. మరి హర్షిక పెళ్లి ఫొటోలపై మీరు ఓ లుక్ వేసేయండి.

(ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement