Rashmi Prabhakar Wedding: Kannada Actress Rashmi Prabhakar Nikhil Bhargav Marriage Pics - Sakshi
Sakshi News home page

Rashmi Prabhakar: పెళ్లి చేసుకున్న టీవీ నటి రష్మీ, ఫొటోలు వైరల్‌

Published Tue, Apr 26 2022 11:45 AM | Last Updated on Tue, Apr 26 2022 11:55 AM

Kannada Actress Rashmi Prabhakar Ties Knot With Nikhil Bhargav, Pics Inside - Sakshi

కన్నడ బుల్లితెర నటి రష్మీ ప్రభాకర్‌ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ప్రియుడు నిఖిల్‌ భార్గవ్‌ను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. బెంగళూరులో ఏప్రిల్‌ 25న వీరి వివాహం జరిగింది. పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా ఇటీవల రష్మి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ముందుగానే వివరించింది. 'నిఖిల్‌ అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీలో పని చేస్తాడు. కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఓ ఈవెంట్‌లో మేమిద్దరం కలిశాం. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్‌గా మారాము. అలా ఒకరినొకరం ఇష్టపడ్డాం. ముందు నిఖిల్‌ ప్రపోజ్‌ చేశాడు, నేనూ ఓకే చెప్పాను. ఒక నెల క్రితమే ఇంట్లో మా ప్రేమ విషయాన్ని చెప్పగా వాళ్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు, పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. లాక్‌డౌన్‌లో మేమిద్దం కలిసి ఆహారపొట్లాలు కూడా పంచాము. ఒక నటిగా పెళ్లయ్యాక నా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కూడా నిఖిల్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు' అని చెప్పుకొచ్చింది. కాగా రష్మి కన్నడ బుల్లితెరపై మనసెల్ల నేనే అనే సీరియల్‌లో కథానాయికగా నటించింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆ ధారావాహిక నుంచి తప్పుకుంది.

చదవండి: KGF Director: ప్రశాంత్‌ నీల్‌.. మన బంగారమే

ఏంటి, ఓవరాక్షనా? దీపికానే కాపీ కొడుతున్నావా? ఆలియాపై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement