అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.
మీకేం తెలుసు?
అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్‌స్పిరేషన్. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.
(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)
అదే నన్నింకా బాధిస్తోంది!
మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్‌ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.
మా అమ్మ హీరో
మా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.
అభిమాని హత్య
కాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు.
చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment