టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్‌ | Ram Charan Daughter Klin Kaara Adorable Reaction After Seeing Her Father On TV, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

టీవీలో రామ్‌ చరణ్‌ను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్‌

Published Sat, Jan 4 2025 2:04 PM | Last Updated on Sat, Jan 4 2025 3:18 PM

Ram Charan Daughter Klin Kaara  Has  An Adorable Reaction After Seeing Her Father On The Small Screen

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌-ఉపాసన గారాలపట్టి క్లీంకార(Klin Kaara ) తొలిసారి టీవీలో నాన్నను చూసి మురిసిపోయింది. బుల్లితెరపై నాన్న కనిపించగానే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ చరణ్‌ అలా చూస్తూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోని రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా..అది కాస్త వైరల్‌గా మారింది.

వీడియోలో ఏముందంటే..?
మెగా మనవరాలు క్లీంకార, ఉపాసన కలిసి ఇంట్లో టీవీలో రామ్‌చరణ్‌(Ram Charan) నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’డాక్యుమెంటరీ వీక్షిస్తున్నారు. ఈ సమయంలో తెరపై చరణ్‌ కనిపించగానే..క్లీంకార మురిసిపోయింది. నాన్నను చూపిస్తూ.. అలా ఉండిపోయింది. అంతేకాదు మా నాన్న అన్నట్లుగా సైగలు చేస్తూ.. హాయ్‌ చెప్పింది. 

తన తండ్రిని తొలిసారి బుల్లితెరపై చూసి క్లీంకార ఆనందం వ్యక్తం చేసిందంటూ ఉపాసన ట్వీట్‌ చేసింది.‘రామ్‌ చరణ్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. గేమ్‌ ఛేంజర్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయింది. 

కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌ చరణ్‌ నటించిన చిత్రం గేమ్‌ ఛేంజర్‌. శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. దిల్‌ రాజు నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

ఓటీటీలో ఆర్‌ఆర్‌ఆర్‌ డ్యాక్యుమెంటరీ
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటుతూ..ఆస్కార్‌ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టాన్ని తెలియజేస్తూ ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌-బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’(RRR Behind and Beyond)పేరుతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు టెక్నీషియన్స్‌ కామెంట్స్‌ కూడా ఈ డాక్యూమెంటరీలో ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement