మెగా హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టాడు. అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఈమె పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా చాలామంది ఉపాసనకు విషెస్ చెప్పాడు. ఇకపోతే బర్త్ డే వేడుకల్ని చరణ్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన చెర్రీ.. కొత్త పేరు ఏంటనేది రివీల్ చేశాడు.
(ఇదీ చదవండి: సితార పాప బర్త్ డే.. మహేశ్, నమ్రత స్పెషల్ విషెస్)
రామ్ చరణ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ సంగతేమో గానీ గత కొన్నాళ్లలో మెగా కోడలు ఉపాసన కూడా అంతకు మించిన క్రేజ్ సంపాదించారు. గతేడాది కూతురికి జన్మనిచ్చిన ఉపాసన.. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూ మరోవైపు బిజినెస్ వ్యవహారాలు కూడా నిర్వర్తిస్తున్నారు. తాజాగా బర్త్ డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక పుట్టినరోజు ఫొటోని పోస్ట్ చేసిన చరణ్.. ఉపాసనని 'కారా మమ్మీ' అని రాసుకొచ్చాడు. నేరుగా ఉపాసన అని పిలవకుండా క్లీంకార తల్లి అని ఫన్నీగా సంభోదించాడు. దీనికి రిప్లై ఇచ్చిన ఉపాసన.. 'థ్యాంక్యూ మిస్టర్ సీ. నీ సెల్ఫీ స్కిల్స్ మాత్రం సూపర్' అని రాసుకొచ్చింది. ఇదిప్పుడు మెగాఫ్యాన్స్‌ని తెగ నచ్చేస్తోంది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్' చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ కావొచ్చు.
(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)
Comments
Please login to add a commentAdd a comment