Upasana Reveals Her Daughter KlinKaara's Face On Independence Day - Sakshi
Sakshi News home page

Klinkara: మెగా వారసురాలిని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!

Published Wed, Aug 16 2023 7:06 AM | Last Updated on Wed, Aug 16 2023 8:30 AM

Upasana Reveals Her Daughter Klinkara Face On Independence Day - Sakshi

ఈ ఏడాది మెగా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే దాదాపు రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వారసురాలు జన్మించింది. జూన్ 20న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెలలోనే నామకరణం ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. తన మనవరాలి పేరును మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. క్లీంకారగా రామ్,ఉప్సీల బిడ్డకు పేరు పెట్టారు. 

అయితే క్లీంకార పుట్టాక మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన తల్లిదండ్రులు సైతం మనవరాలితో టైం స్పెండ్ చేస్తున్నారు. క్లీంకార పుట్టాక తొలిసారిగా ఇండిపెండెన్స్‌ డే వేడుకలను తాత, అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోల్లో మెగా వారసురాలు ఫోటో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజే తమ బిడ్డ రూపాన్ని మెగా అభిమానులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. 

అంతేకాకుండా క్లీంకార భారత జెండాను ఆవిష్కరిస్తూ తొలి ఇండిపెండెన్స్ డే రోజే అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇది అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ప్రిన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా అన్నయ్య రామ్ చరణ్ ఫేస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement