అందుకే ఇన్నేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చాం: ఉపాసన | Upasana Konidela Interesting Comments On Klin Kaara And Ram Charan, Deets Inside - Sakshi
Sakshi News home page

Upasana Konidela: చరణ్‌కి నాకు ఆ విషయంలో బౌండ్రీస్ ఉన్నాయి

Published Tue, Feb 6 2024 1:30 PM | Last Updated on Tue, Feb 6 2024 1:52 PM

 Upasana Comments On Klin Kaara And Ram Charan - Sakshi

మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చిరంజీవి కొడుకు రామ్‪‌చరణ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలు అయిపోయింది. ఈమెకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుంటాయి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువని చెప్పొచ్చు. అలాంటిది తాజాగా ఓ బుక్ లాంచ్ సందర్భంగా ఉపాసన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులోనే చరణ్‌తో బాండింగ్, కూతురు క్లీంకార గురించి పలు సంగతుల్ని చెప్పుకొచ్చింది. 

అందుకే ఇన్నాళ్లకు..
పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా, ఎలా ఫీలవుతున్నారు? అని అడగ్గా.. 'అందరూ తల్లి కావడం గ్రేట్ అనుకుంటారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి మాటలు నా వరకు వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేం అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలని అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది' అని ఉపాసన చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?)

చరణ్‌కి నాకు బౌండ్రీస్
ఇక భర్త చరణ్‌తో బాండింగ్ గురించి అడగ్గా.. 'రామ్ ఎప్పుడూ కూడా 'ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం' అని అంటుంటాడు. అలానే మేం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటాం, గౌరవించుకుంటాం, మా ఇద్దరి మధ్య హద్దులు(బౌండరీస్) కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోం. కానీ వ్యక్తిగత జీవితం విషయానికొచ్చేసరికి మాత్రం ఒక్కటిగా ఉంటాం' అని ఉపాసన చెప్పుకొచ్చింది.

2012లో రామ్ చరణ్-ఉపాసన పెళ్లి జరిగింది. అప్పట్లో వీళ్ల జంటపై ట్రోల్స్ వచ్చాయి. కానీ రానురాను ఉపాసన.. మెగా ఫ్యాన్స్‌కి బాగా సుపరిచితురాలైపోయింది. ఇప్పడు చరణ్ ని ఎంత అభిమానిస్తారో.. ఉపాసనని కూడా మెగా అభిమానులు అంతే అభిమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె చెప్పిన మాటలు ఫ్యాన్స్ మధ్య డిస్కషన్‌కి కారణమయ్యాయి.

(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement