independance day
-
కాకి దేశభక్తి.. అసలు సంగతి ఇది!
తిరువనంతపురం: కేరళలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు అద్భుతం జరిగిందట. ఓ స్కూల్లో పిల్లలు, టీచర్లు కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అయితే జెండా పైకి వెళ్లిన తర్వాత కూడా తెరచుకోకుండా ముడుచుకునే ఉంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందోగాని ఓ కాకి సూపర్ హీరోలా వచ్చి ముడుచుకున్న జెండాను ముక్కుతో పూర్తిగా విప్పి తుర్రుమని ఎగిరిపోయింది. Kerala - National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK— Shilpa (@shilpa_cn) August 16, 2024దీంతో జెండా రెపరెపలాడి అక్కడున్నవారిపై పూల వర్షం కురిసింది. అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్ సీన్‌ను తలపించిన ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ పోస్టు చేయగా వైరల్‌గా మారింది అంటూ ఓ వీడియో చక్కర్లు కొట్టింది. పక్షి జెండాను రెపరెపలాడించిన ఈ వీడియో చూసిన వారు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. గాడ్స్‌ఓన్ కంట్రీ కదా అలాగే జరుగుతుందని ఒకరు, గత జన్మలో ఆ పక్షి దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుడేమో అని మరొకరు ఇది నిజంగా అద్భుతమని ఇంకొకరు కామెంట్ చేశారు. Fact Check: అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ కాకి వెనకాల ఉన్న చెట్టు మీద వాలింది. జాతీయ జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరో.. దాన్ని బలంగా లాగడం వల్లే తెరుచుకుంది. ఈలోపు ఆ అలికిడికి చెట్టు మీద కాకి జడుసుకుని ఎగిరిపోయింది. జెండా కర్రను డిఫరెంట్యాంగిల్లో చూపించడంతోనే అలా పక్షి ఎగరేసిన జెండా కథనం వైరల్ అయ్యింది.Is that the bird unfurling the flag? No.It's the camera angle. pic.twitter.com/on3BlxJs6U— Mohammed Zubair (@zoo_bear) August 17, 2024 -
ఇది.. సైనికుల సంగ్రామం!
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ‘దేశభక్తి’. దేశాన్ని కాపాడాలనే ధ్యేయంతో ఊరి యువకులు సైన్యం బాట పట్టారు. ఒకే ఊరి నుంచి ఇంటికి ఒక్కరు చొప్పున సుమారుగా 92 మందికిపైగా యువకులు సైన్యంలో తమ సేవలను అందిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు పీపుల్స్‌వార్ ఖిల్లాగా ఉన్న ఆ ఊరిని ఇప్పుడు ఆర్మీ జవాన్ల పుట్టినిల్లుగా పిల్చుకుంటున్నారు. ఆ ఊరు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామం. ఆ ఊరి ముచ్చట్లలోకి వెళదామా?సుమారు 40 ఏళ్ల క్రితం కట్కూర్ గ్రామానికి చెందిన జేరిపోతుల డేనియల్ మిలిటరీలో జవాన్ గా చేరాడు. ఆయన స్ఫూర్తితో గ్రామంలోని యువకులు సైన్యం బాటపట్టారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఆర్మీలో చేరారు. జవాన్ స్థాయి నుంచి లాన్స్‌నాయక్, నాయక్, హవల్దార్, నాయక్ సుబేదార్ స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇలా గ్రామానికి చెందిన వారు ప్రస్తుతం 92 మంది ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో జిల్లాలో కట్కూరు గ్రామం అంటే ఆర్మీజవాన్ ల గ్రామంగా గుర్తింపు ΄÷ందింది. ఈ గ్రామంలో 1,014 కుటుంబాలుండగా జనాభా సుమారుగా 3,045 ఉన్నారు. అందులో మొత్తం గ్రామంలో 175 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీరిలో కొందరు ఇతర ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. – మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేటదేశసేవ ఇష్టం...దేశసేవ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 1998లో భారతసైన్యంలో చేరాను. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ బెంగళూర్‌లో ట్రైనింగ్ చేశాను. కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నాను. కాశ్మీర్లో రాష్ట్రీయ విభాగంలో సేవలు అందించి అనేక టెర్రరిస్ట్ ఆపరేషన్ లలో పాల్గొన్నాను. కాశ్మీర్ సేవలను గుర్తించి నాకు సుబేదార్ మేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. – పంజా సదయ్య, సుబేదార్గర్వపడుతున్నా...దేశరక్షణ కోసం సైన్యంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేశం కోసం పని చేయడం ఆనందంగా ఉంది. – కొయ్యడ శ్రీనివాస్, ఆర్మీ జవాన్ -
కాలం చెక్కిలిపై.. చెరగని కన్నీటి చారిక!
శతాబ్దాల బానిస గతానికి స్వతంత్రం అంతం పలికింది. భారత భవితవ్యానికి మాత్రం దేశ విభజన సవాళ్లు విసిరింది. స్వాతంత్య్రం కొరకు పోరాడిన వారు అంటూ చిరకాలంగా కొన్ని కుటుంబాలనే భారతీ యులు ఆరాధించారు. విభజన విషాదంలో అకారణంగా కన్ను మూసి, అందరినీ పోగోట్టుకుని, స్వాతంత్య్రోద్యమ సంబరాలు ఎరుగని వారినీ ఇప్పుడు తలుచుకోవాలని అనుకుంటున్నాం. దేశ విభజన విషాదాల సంస్మరణ దినం (ఆగస్ట్ 14) అందుకు అవకాశం ఇస్తున్నది.స్వాతంత్య్ర సమరంలోని చాలా ఘట్టాలు చరిత్ర పుటలకు చేరనట్టే, విభజన విషాదమూ మరుగున ఉండిపోయింది. కేవలం తేదీలు, కారణాలు, ఫలితాల దృష్టి నుంచి సాగే చరిత్ర రచన కంటే, చరిత్రకు ఛాయ వంటి సృజనాత్మక సాహిత్యమే విభజన విషాదాన్ని గుర్తు చేసే బాధ్యతను ఎక్కువగా స్వీకరించింది. ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదలు నిన్న మొన్నటి జస్వంత్ సింగ్ వరకూ తమ పుస్తకాలలో చరిత్రగా విభజన గాథను విశ్లేషించారు. నవల, కవిత, కథ, నాటక ప్రక్రియలు విభజన విషాదాన్ని ఆవిష్కరించిన తీరూ స్మరణీయమే.భీష్మ సహానీ ‘తమస్’ (అంధ కారం) విభజన కాలాన్ని చర్చించిన నవలా సాహిత్యంలో మకుటాయమానమైనదనిపిస్తుంది. విభజనకు కారణం మతమా? మత రాజకీయమా అన్నది చర్చించారాయన. చల్లారుతున్న మతోద్రిక్తతలు పంది కళే బరం మసీదు మెట్ల మీద కనిపించడం వల్ల తిరిగి భగ్గు మనడం ఇందులో ఇతివృత్తం. ఇంతకీ నాథూ అనే తోళ్ల కార్మికుడికి, పారిశుద్ధ్య కార్మికుడికి మాయమాటలు చెప్పి మురాద్ అలీ అనే వ్యాపారి చేయించిన పని ఇది. భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల గిల్లికజ్జాలు, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న ఆంగ్లేయుడు దేశం వీడు తున్న క్షణంలోనూ ప్రదర్శించిన ‘విభజించి పాలించు’ బుద్ధినీ కూడా ఇందులో పరిచయం చేశారాయన.చివరికి శాంతియాత్రకు మురాద్ అలీ ముందు ఉండడం పెద్ద మలుపు. ఈ నవలను డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెనిగించారు. మహిళల మీద విభజన చేసిన దాడిని చాలామంది వర్ణించారు. అమృతాప్రీతమ్ నవల ‘పింజర్’ (అస్తిపంజరం) వాటిలో ప్రత్యేకమైనది. పెళ్లి నిశ్చయమైన పూరో అనే హిందూ యువతిని రషీద్ అనే ముస్లిం యువకుడు అపహరించడం ఇందులో కీలకం. ఆమె తప్పించుకు వచ్చినా తల్లిదండ్రులు స్వీకరించ డానికి నిరాకరి స్తారు. మతం మారి రషీద్‌నే ఆమె పెళ్లి చేసుకుంటుంది. చివరికి ఆమె అవసరమే పుట్టింటివారికి వస్తుంది.స్వాతంత్య్రోద్యమం, దాని ఫల శ్రుతి వేర్వేరేనని గుర్తించాలన్నట్టు విభజన గాథలను వివరించేందుకు రైలు ప్రయాణాలను పలు వురు తమ ఇతివృత్తాలకు నేప థ్యంగా స్వీకరించారనిపిస్తుంది. వాటిలో ప్రముఖమై నది ‘ట్రెయిన్ టు పాకిస్తాన్’. కుష్వంత్ సింగ్ ఈ నవలను జుగ్గు (సిక్కు), నురాన్ (ముస్లిం)ల ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి అల్లారు. ముస్లిం శరణార్థులతో పాకిస్తాన్ వెళుతున్న రైలును కొందరు హిందువులు, సిక్కులు తగలబెడితే అందులో నుంచి నురాన్ను జుగ్గు రక్షిస్తాడు. భారత్ నుంచి ముస్లింల శవాలతో, వక్షోజాలు నరికిన మహిళల శరీరాలతో పాకిస్తాన్‌కు రైలు రావడం బప్సి సిధ్వా నవల ‘ఐస్‌క్యాండీ మ్యాన్’లో మలుపు.గుల్జార్ రాసిన ‘రావి నదికి ఆవల’ కథ విభజనతో భారత ఉపఖండం ఆత్మను కోల్పోయిన వైనం ఉంది. ఇది కూడా రైలు ప్రయాణం నేపథ్యంగానే సాగుతుంది. ఆయనదే ‘భయం’ (కావూఫ్) కథలో యాసిన్ అనే ముస్లిం యువకుడు లోకల్ ట్రైన్లో పొందిన వింత అనుభవం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఒక స్టేషన్లో మరో యువకుడు ఎక్కాడు. అతడు హిందువులా కనిపించాడు. అతడితో తనకు ప్రాణహాని తప్పదని రైలు భయాందర్ వంతెన మీదకు వచ్చాక గుమ్మం దగ్గర ఆదమరచి ఉన్న ఆగంతకుడిని యాసిన్ బయ టకు నెట్టేశాడు.మరుక్షణం ఒక ఆక్రందన ‘అల్లా’ అంటూ! భీష్మ సహానీ రాసిన ‘రైలు అమృత్సర్ చేరింది’ కథ కూడా పట్టాల మీద నడిచిన అనుభవమే. పాకిస్తాన్ నుంచి భారత్ వస్తున్న ఒక హిందూ శరణార్థిని (బాబు) ముస్లింలు ఏడిపిస్తారు. వాళ్లు మధ్యలో దిగిపోతారు. ఇతడు మాత్రం రైలు భారత్‌లో ప్రవేశించాక అంతదాకా అణచి ఉంచుకున్న కోపాన్ని ఇక్కడ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న ముస్లిం మీద చూపిస్తాడు. అంతకు ముందే దాచి పెట్టిన ఇనప రాడ్‌తో తల బద్దలు కొడతాడు. పెషావర్–బొంబాయి మధ్యలో జరి గిన హిందూ ముస్లిం హింసాకాండ దృశ్యాలను కిషన్ చందర్ తన కథ ‘పెషావర్ ఎక్స్‌ప్రెస్’ కథలో అక్షర బద్ధం చేశారు. ఆ దారిలో రైలు ఆగిన ప్రతి స్టేషన్ రక్త పాతంతోనే కనిపిస్తుంది. ఒక చోట స్త్రీలను నగ్నంగా ఊరేగించడం కూడా కనిపిస్తుంది. గతంలోని కక్షలను వెలికి తీసి మరీ పరస్పరం దాడులకు దిగారు. పింజ ర్లో పూరోను రషీద్ ఎత్తుకుపోవడానికి కారణం, రెండు మూడు తరాల క్రితం ఆ ముస్లిం కటుంబం నుంచి ఒక మహిళను రుణం గొడవలో పూరో తాతలు ఎవరో అపహరించారు.ముస్లిం లీగ్ వైఖరి కారణంగానే విభజన జరిగిందన్నది నిజం. కానీ ఆ పరిణామాన్ని జీర్ణించుకోలేక పోయినవారు అన్ని వర్గాలలోను ఉన్నారు. సాదత్ హసన్ మంటో రాసిన ‘టోబా టేక్సింగ్’ కథకు ఇతివృత్తం ఇదే. రెండు మతాల వారిని రెండు దేశాలు పంచుకున్నట్టే మతిస్థిమితం లేనివారిని కూడా పంచు కుంటారు. కానీ లాహోర్ పిచ్చాసుపత్రిలో ఉన్న టోబా టేక్సింగ్ను భారత్‌కు అప్పగిస్తున్నప్పుడు అతడు వాఘా సరిహద్దులో సగం పాక్ వైపు, సగం భారత్ వైపు తన దేహం ఉండేలా పడి మరణిస్తాడు.విభజన నిర్ణయం తరువాత సరిహద్దు రేఖ గీయ డానికి వచ్చినవాడు సెరిల్ రాడ్‌క్లిఫ్. కేవలం ఐదువారా లలో అతడు ఆ పని ముగించాడు. కానీ రేఖ మీద నెత్తుటి తడి ఏడు దశాబ్దాలైనా ఆరలేదు. ఆ పరిణామం ఎంతటి పాశవికతకు దారి ఇచ్చిందో అమెరికా కవి డబ్ల్యూ హెచ్ ఎడెన్ ‘పార్టిషన్’ పేరుతో రాసిన తన కవితలో నిక్షిప్తం చేశాడు. ‘డ్రాయింగ్ ది లైన్’ పేరుతో రాడ్‌క్లిఫ్ చర్యనే నాటకంగా మలిచాడు బ్రిటిష్ రచయిత హోవార్డ్ బెంటన్. దీనిని 2013లోనే ప్రదర్శించారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే విషాద కరమైనదిగా చెప్పడం సత్యదూరం కాదు. విభజన మూల్యం 20 లక్షల ప్రాణాలు. కోటీ నలభై ల„ý లు లేదా కోటీ ఎనభై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇది ఇప్పటికి దొరికిన లెక్క. ఇందులో స్త్రీల దుఃఖం మరీ ఘోరమైనది. ఊర్వశీ బుటాలియా విభజన వేళ స్త్రీ పడిన వేదనను, క్షోభను, గుండె కోతను అన్వేషించారు. చాలాకాలం వరకు 75 వేల మంది మహిళలు విభజనకు బాధితులని అనుకున్నారు. కానీ లక్షమంది స్త్రీలను బలి చేశారని, ‘ది అదర్ సైడ్ ఆఫ్ సైలెన్స్’ పుస్తకంలో రాశారు.ఇన్ని కోట్ల మంది బాధితులలో ప్రతి ఒక్కరికీ ఒక విషాద గాథ ఉంది. ప్రతి కన్నీటి బొట్టుకు ఒక కథ ఉంది. నెలల తరబడి సాగిన ఈ హత్యాకాండలో చలికీ, వానకీ, ఎండకీ, మతోన్మాదానికీ, ఆకలికీ సరిహద్దుల వెంట రాలిపోయిన ప్రతి ప్రాణం ఒక నవలకు ఇతివృత్తం కాగలినదే. ఉన్మాదుల నుంచి రక్షణ కోసం గురుద్వారా వెనుక బావులలో పిల్లలతో సహా దూకేసిన వందలాది మంది మహిళల గుండె ఆక్రోశాన్ని, చావును సమీపంగా చూసిన పసి ఆక్రందనలను ఇప్పుడైనా గమ నించాలి. అందుకే ఆ గ్రంథాల వెల్లువ. మానవతను అతి హీనంగా ఛిద్రం చేస్తూ కాలం కల్పించే దుస్సంఘ టనల్లో దేశ విభజన కూడా ఒకటి!– డా. గోపరాజు నారాయణరావు, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఇళ్లపై జాతీయజెండా ఎగురవేయాలి: కిషన్‌రెడ్డి పిలుపు
సాక్షి,హైదరాబాద్: ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఆదివారం(ఆగస్టు11) హైదరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో తిరంగా ర్యాలీని కిషన్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.‘జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ జనతా యువమోర్చ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీని తిరంగా యాత్రను నిర్వహిస్తాం. గత ఆగస్టు 15న సుమారు 23 కోట్ల మంది ప్రజలు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. మళ్లీ ఈసారి అదే స్ఫూర్తిని కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు’అని కిషన్‌రెడ్డి తెలిపారు. -
సూపర్ పవర్
-
సెక్రటేరియట్లో మెగా డ్రోన్ షో.. చూశారా?
-
మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని నరేంద్ర మోదీ ధీమా.. ఎర్రకోటపై స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ..ఇంకా ఇతర అప్డేట్స్
-
రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్‌గా ఉందో!
ఈ ఏడాది మెగా ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే దాదాపు రామ్ చరణ్, ఉపాసనకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వారసురాలు జన్మించింది. జూన్ 20న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఉపాసన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెలలోనే నామకరణం ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. తన మనవరాలి పేరును మెగాస్టార్ సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. క్లీంకారగా రామ్,ఉప్సీల బిడ్డకు పేరు పెట్టారు. అయితే క్లీంకార పుట్టాక మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన తల్లిదండ్రులు సైతం మనవరాలితో టైం స్పెండ్ చేస్తున్నారు. క్లీంకార పుట్టాక తొలిసారిగా ఇండిపెండెన్స్ డే వేడుకలను తాత, అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫోటోల్లో మెగా వారసురాలు ఫోటో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజే తమ బిడ్డ రూపాన్ని మెగా అభిమానులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. అంతేకాకుండా క్లీంకార భారత జెండాను ఆవిష్కరిస్తూ తొలి ఇండిపెండెన్స్ డే రోజే అమ్మమ్మతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఇది అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మెగా ప్రిన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో ఏకంగా అన్నయ్య రామ్ చరణ్ ఫేస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఆశీర్వదించండి!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ నేడు నిరంతర విద్యుత్తు వెలుగులు, పంట కాల్వలు, పచ్చని చేలతో కళకళలాడుతోంది. మండే ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతోంది. ఇరవైకి పైగా రిజర్వాయర్లతో తెలంగాణ పూర్ణకలశం వలె తొణికిసలాడుతోంది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోంది. తెలంగాణ అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఈ పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని అందించాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. నాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు! పదేళ్ల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ దుఖం తన్నుకొస్తుంది. ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరెంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నలు. అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు. ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు. యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు. ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు. ఇలాంటి అగమ్యగోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఒక దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని సూచికలుగా పరిగణిస్తారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1గా నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో తొలి స్థానంలో ఉంది. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. తొమ్మిదిన్నరేళ్లలో రూ.37 వేల కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా స్థిరీకరించింది. కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ వక్ర భాష్యాలు చెబుతున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలని వ్యాఖ్యానిస్తున్నారు. వీరికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నా. సాగునీరు, వైద్యారోగ్య రంగంలో ప్రగతి మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించినా కేసులు వీగిపోయాయి. పర్యావరణ అనుమతులు లభించాయి. స్వల్ప కాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి రాష్ట్రం చరిత్ర సృష్టించింది. మరో 8 మెడికల్ కాలేజీలను త్వరలోనే ప్రారంభించి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నిమ్స్ విస్తరణ శరవేగంగా జరుగుతున్నాయి. అనాథ పిల్లలను ‘స్టేట్ చి్రల్డన్’గా గుర్తిస్తూ వారికోసం ప్రత్యేక పాలసీని ప్రభుత్వం రూపొందించింది. విద్యారంగ వికాసం..ఐటీలో మేటి వెయ్యికి పైగా గురుకుల జూనియర్ కళాశాలలు ప్రారంభించాం. మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి పేరుతో రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నాం. రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందిస్తున్నాం. టీఎస్ ఐపాస్ చట్టం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజం వచ్చింది. రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రా్రష్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. 17.21 లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు పెరిగాయి. త్వరలో ‘తెలంగాణ చేనేత మగ్గం’ దళితబంధు కింద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం. ప్రభుత్వ లైసెన్సు వ్యాపారాల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు, బీసీల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీలకు రూ.లక్ష సాయం, ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంపు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు, మద్యం దుకాణాల్లో గౌడలకు 15శాతం రిజర్వేషన్లు, గీతన్న, నేతన్నలకు రూ.5 లక్షల బీమా, నేత కార్మికులకు నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఫ్రేమ్ మగ్గాల పంపిణీకి ‘తెలంగాణ చేనేత మగ్గం’అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నాం. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు, లబ్దిదారుల సంఖ్యను 29 లక్షల నుంచి 44 లక్షలకు పెంచాం. లబ్దిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించాం. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచాం. 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోగా, ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందిన సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయి. వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలను పొందుతున్నారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతాం. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తాం. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి పండుగల బోనస్‌గా రూ.1,000 కోట్లు పంపిణీ చేయబోతున్నాం. వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులనూ క్రమబద్దీకరించాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. వారికి రైతుబంధు సాయం సైతం అందించింది. పోడు కేసుల నుంచి విముక్తులను చేసింది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాం. గత నెలలో భారీ వర్షాలు కురవడంతో తక్షణ సహాయంగా రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు మంగళవారం నుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నాం. నగరం నలువైపులకూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదరికం తగ్గుముఖం సంపద పెంచు – ప్రజలకు పంచు అనే సదాశయంతో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందని, తలసరి ఆదాయం పెరుగుతోందని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచి స్పష్టం చేసింది. జాతీయ స్థాయి సగటుతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైంది. 2015–16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019–21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైంది. లక్ష్యం చేరని స్వతంత్ర భారతం 75 ఏళ్ల స్వతంత్ర భారతం గణనీయ ప్రగతి సాధించినా, ఆశించిన లక్ష్యాలు, చేరవల్సిన గమ్యాలను ఇంకా చేరలేదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల్లో పేదరికం తొలగిపోలేదు. వనరుల సంపూర్ణ వినియోగంతో ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే స్వాతంత్య్రానికి సార్థకత. అమర వీరులకు నివాళి గోల్కొండ కోటలో జెండావిష్కరణకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మృతి చిహ్నాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఎయిర్ వైస్ మార్షల్ చంద్రశేఖర్, ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జీవోసీ మేజర్ జనరల్ రాకేష్ మనోచా ఇతర ఆర్మీ అధికారులు అమర సైనికులకు నివాళులర్పించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎంఓ కార్యాలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దేశభక్తి మోడ్ ఆన్.. జెండాలతో స్టార్ హీరోయిన్స్
జెండా పట్టుకుని స్మైల్ ఇస్తున్న శ్రీలీల దేశభక్తి మోడ్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ పూజాహెగ్డే స్పెషల్ విషెస్.. జెండా పట్టుకుని జెండా పండగరోజు హ్యాపీగా రాశీఖన్నా ప్రగ్యా జైస్వాల్.. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకున్న బన్నీ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) Happy Independence Day pic.twitter.com/hgOk4SOTgf — Allu Arjun (@alluarjun) August 15, 2023 View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఏపీ ప్రభుత్వ ఆద్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
-
స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా సీఎం వైస్ జగన్ పోలీస్ అధికారులకు పతకాలు అందజేశారు
-
అన్నిరంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది
-
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం కెసిఆర్
-
Independence Day Song : తరం, తరం, నిరంతరం
దేశ స్వాతంత్య్రంలో సాహిత్యం పాత్ర మరువలేనిది. నిజానికి ఏ ఉద్యమం అయినా.. సాహిత్యంతో ప్రజలను జాగృతం చేస్తుంది. ఒక్కతాటిపైకి తెస్తుంది. అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాటలు, నినాదాలు, కవిత్వాలు, ప్రసంగాలు.. ఒకటేమిటి.. ఉద్యమ స్పూర్తిని పెల్లుబికెలా చేశారు మహానుభావులు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా యువతను మరింత బలోపేతం చేస్తూ, జాతి నిర్మాణ బాధ్యతను చక్కగా గుర్తు చేసే ప్రేరణ గీతాన్ని ప్రజల ముందుకు తెచ్చారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. పాటకు సంగీతం, కూర్పు, గానం అందించారు సినీ గాయకులు రవివర్మ పోతేదార్. (సినీ గాయకులు రవివర్మ పోతేదార్) || పల్లవి || తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు తరం, తరం, నిరంతరం, నిర్భయ నవతరం మీరు అనంతరం, అనవరతం, అపూర్వ యువతరం మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జాగరూకత జారిపోతే తరిగిపోయే తురగ మీరు జగతి కొరకు..., జాతి కొరకు..., జాగృతమవ్వాలి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 1 || ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు ఎగిసి పడే రక్తం మీరు ఎవరెస్టునైనా ఓడించే అగ్ని శిఖలు మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు సునామీ కెరటం మీరు అరుణ సింధూర విజయ సౌరభం మీరు పాల సంద్రాన ఆదిశేషుని వేయిపడగల హోరు మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! || చరణం 2 || భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు భయం తెలియని ధైర్యం మీరు భరత భూమిని బాగుచేసే బాధ్యతే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శంఖనాదం మీరు చిత్త శుద్ధికి, లక్ష్యసిద్ధికి అర్థమే మీరు శిలయు మీరు, శిల్పి మీరు, చరితకెక్కే స్థపతి మీరు వందేమాతరం...భారతీవందనం! వందేమాతరం...భారతీవందనం!! ||తరం, తరం, నిరంతరం… || (రచన:డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి; 9848023090) -
పంద్రాగస్టు వేడుకకి వెళ్లమంటే.. ప్రాణం తీసుకున్నాడు
ఆదిలాబాద్: పాఠశాలకు వెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చావని తండ్రి మందలించడంతో కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీంపూర్ మండలంలోని రాజుల్కోరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిడాం అనురాగ్(13) అందర్‌బంద్ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 4న ఉపాధ్యాయులకు తెలియకుండా ఇంటికి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వెళ్లాలని తండ్రి సీతారాం చెప్పినా వెళ్లలేదు. పంద్రాగస్టు వేడుకలు ఉన్నందున వెళ్లాలని శనివారం మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అనురాగ్ ఇంటి వద్ద పురుగుల మందు తాగి కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై లాల్‌సింగ్‌నాయక్ మృతదేహన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఐటీడీఏ ఏపీవో భాస్కర్, ఏటీడీవో నిహారిక రాజుల్కోరిలో కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హెచ్ఎం రాజశేఖర్‌ను ఆదేశించారు. -
రూపాయికే బస్సు ప్రయాణం.. దేశమంతా తిరగొచ్చు..
సాక్షి, సిటీబ్యూరో: బస్సు ప్రయాణీకులకు బంపరాఫర్. ఇంటర్–సిటీ ఎలక్ట్రిక్ ఏసీ కోచ్ సేవలందించే న్యూగో సంస్థ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా గ్రీన్‌సెల్ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా మాట్లాడుతూ.. పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. పంద్రాగస్టు రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్ మొదలయ్యాయని, రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తమ రవాణా సేవలు కొనసాగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఇండోర్– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్ వర్తిస్తుందని వివరించారు. బుకింగ్స్ కోసం న్యూగో వెబ్సైట్ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్ అప్లికేషన్లలోనూ బుకింగ్ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు. ఇది కూడా చదవండి: ఒకే నెలలో ఇన్ని పరీక్షలా? -
స్వాతంత్ర దినోత్సవం రోజు వైఎస్సార్ అదిరిపోయే ప్రసంగం
-
ఆజాద్ హింద్ ఫౌజ్.. ఖుషీ కే గీత్ గాయే జా..!
ఆ ప్రశ్న ఎందుకు వేశానా అనిపించింది. అలా అడిగాక మొదట అతడు చేసిన పని, తటాల్న నాకేసి చూడడం. నన్ను చూస్తూనే బుగ్గల మీద ఎడం చేత్తో రాసుకున్నాడు, కొన్ని సెకన్లు. దంతాలు ఊడి లోతుకుపోయిన బుగ్గలు. ఓ నిమిషం తరువాత అతడి ముఖంలో చిన్న నవ్వు. అప్పుడే కళ్లూ మెరిశాయి, ఒక్కసారిగా. ‘చూశాను బాబూ!’ స్థిరంగా అన్నాడతడు. అతని గొంతుపెగిలాక నా మనసు శాంతించింది. పాట అందుకుంటే రెండు వీధుల అవతల ఉన్నా ఖంగుమంటూ వినిపించే ఆ గొంతు అంత మార్దవంగా, అంత మంద్రంగా స్పందించడం కొంచెం వింతే. ఎంత గొప్పగా పాడతాడో ఆ పాటలన్నీ ‘కదం కదం బఢాయే జా, ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందగీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ ఒళ్లు గగుర్పొడుస్తుంది. సాగిపో సాగిపో మున్ముందుకు, ఆనందగీతికలను ఆలపిస్తూ సాగిపో, నీ జీవితాన్ని మాతృభూమి కోసం అర్పించుకో ఎంత బలమైన భావన. ఇదే కాదు శుభ్ సుఖ్ చైన్ కీ బర్ఖా బర్సే, ఎక్ల చొలో, హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ వంటి పాటలూ పాడతాడు. శ్రీరాములు, కొల్లి శ్రీరాములు.. ఒంటి మీద ఖాకీ మిలటరీ యూనిఫారవ్ు. టక్ చేసుకున్నాడు. అప్పటిదే కాబోలు ఆ యూనిఫారవ్ు. శిథిలమైపోయినట్టున్నా, రంగు మాత్రం వెలిసిపోలేదు. అతడు ఒక వయసులో ఎలా ఉన్నాడో చెబుతూ, ఆ శరీరం మీద ఇప్పుడు వేలాడిపోతోంది. దాని వయసు కనీసం యాభయ్ ఏళ్లు. కాళ్లకి బూట్లతోనే బాసిం పట్టు వేసుకుని నేల మీద కూర్చున్నాడు. బూట్లు కూడా అప్పటివేనేమో! స్లాబ్ పనివాళ్ల బూట్లలా ఉన్నాయి. ఆ రూపం చిన్నతనం నుంచి మేం చూస్తున్నదే. మామూలు బట్టల్లో ఏనాడూ చూసిందిలేదు. జుట్టు మరీ ముగ్గుబుట్ట కాలేదు. కొద్దిగా నల్ల వెంట్రుకలూ ఉన్నాయి. నడినెత్తి మీద నుంచి వెనక్కే. ముందంతా బట్టతల, వెనక జులపాలు. నల్లటి శరీరం. నుదురు కింద లోతుకు పోయిన కళ్లు. ఆ మహావ్యక్తిని చూసిన కళ్లు ఇవే! అదృష్టం చేసుకున్నాయి! ‘ఎక్కడ చూశావు శ్రీరాములు?’ ‘బర్మాలో బాబూ!’ ఏదో లోకంలో ఉన్నట్టే ఆ మాటలన్నాడు. నేను ఐదో తరగతిలో ఉండగా, ఓ ఆగస్ట్ 15 పండుగకి ఒక సన్నివేశంలో అతడిని చూసినప్పటి నుంచి నాకు ఓ రకమైన సానుభూతి.. శ్రీరాములంటే. నాన్నగారు చెప్పినదానిని బట్టి గౌరవం కూడా. మా ఇంటి బయటకొచ్చి నిలబడినా మేం చదువుకున్న ఆ స్కూలు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం ఇవతలే అమ్మవారి గుడి. దానికి దగ్గరగా గ్రామ పంచాయతీ కార్యాలయం. ఆ ఘటన జరిగింది ఆ కార్యాలయం ముందే. శ్రీరాములుకి గుర్తుందో లేదో! దారే కాబట్టి ఆ కార్యాలయం ముందు నుంచి పాడుకుంటూ అతడు ఎప్పుడు నడిచి వస్తున్నా, వెళుతున్నా నాకు మాత్రం ఆ సన్నివేశమే గుర్తుకొస్తుంది. తరువాత అతడిని చూస్తున్న కొద్దీ నాకూ అనిపించేది, ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం రాలేదు. ఎందరికో ఉన్న అభిప్రాయమే. అలా చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడచిపోయాయి. పదిరోజులకీ, పదిహేను రోజులకీ ఒకసారి ఇంటిముందుకొచ్చి అరుస్తాడు, అటెన్షన్లో నిలబడే, ‘బోసుబాబు అనుచరుడినొచ్చానయ్యా! ధర్మం చెయ్యండి!’ బిచ్చగాళ్లు వచ్చినప్పుడు వేయడానికి సావిట్లో నల్లటి రేకు డబ్బా ఉంటుంది, బియ్యంతో. రెండు కేజీల వరకు పడుతుంది. అంతకంటే పెద్ద డబ్బాలో వడ్లు ఉంటాయి. కొందరికి బియ్యం, కొందరికి ధాన్యం. ఎవరికైనా దోసెడు. నాన్నగారు ఎప్పుడో చెప్పేశారు, శ్రీరాములిని అలా చూడకండని. అందుకే ఎప్పుడొచ్చి నిలబడినా డబ్బా నిండుగా బియ్యం పట్టుకొచ్చి అతడి పాత్రలో పోస్తాం. శ్రీరాములుని చూడగానే ‘జైహింద్’ అనేవారు పిల్లలు. అతడు ఉరిమినట్టు ఇంకా గట్టిగా అనేవాడు, కాలుని నేలకి బలంగా తాటించి, సెల్యూట్ చేస్తూ. ఆ నినాదం ఇచ్చినందుకు పిల్లలని సంతోషపెట్టడం తన కర్తవ్యం అనుకునేవాడు కాబోలు. ఒక్కొక్క వస్తువుని లేదా జంతువుని కొన్ని భాషలలో ఏమంటారో చెప్పేవాడు. ‘కుక్క.. తెలుగులో కుక్క, హిందీలో కుత్తా, ఇంగిలీసులో డాగ్, బర్మాలో హావె, తమిళంలో నాయీ, బెంగాలీలో కుకురో..’ అంటూ చెప్పేవాడు. కానీ ఈ ప్రవర్తనే అతడి మీద మతి స్థిమితం లేనివాడి ముద్ర వేసింది. అది నిజమే, శ్రీరాములుకి మతి చలించిందని నాన్నే చెప్పారు. అలా జరిగిందీ ఒక సందర్భంలోనే. ఇలా కథలు కథలుగా చెప్పుకునేవారు. ఎప్పటి నుంచో శ్రీరాములుతో మాట్లాడాలని చూస్తుంటే, అనుకోకుండా ఈ రోజు సాధ్యపడింది, నేను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు. అతడి మీద ఇంకాస్త వృద్ధాప్యం పడింది. అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినట్టు, పై జేబులోంచి బంతిలా చుట్టిన ఒక గుడ్డ తీశాడు, ఖాకీదే. మడత విప్పాక తెలిసింది, అది ఖాకీ టోపీ. ఎంతో భక్తిగా, పద్ధతిగా శిరస్సున అలంకరించుకున్నాడు. ఆ టోపీతో ముఖం ఏదో ప్రత్యేకతని సంతరించుకుంది. సుభాష్‌చంద్ర బోస్ రూపం నా దృష్టిపథంలోకి వచ్చి నిలిచింది వెంటనే. అలాంటిదే టోపీ. ఔను, శ్రీరాములు ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేసి వచ్చాడు. లోపలికి రమ్మని పదిసార్లు పిలిస్తే మొత్తానికి వచ్చాడు. దూరంతో కూడిన చనువు, మా ఇంట్లో. నేరుగా పెరట్లోకి వెళ్లాం. బావి చూడగానే నీళ్లు తోడుకుని తాగాడు. తడి ముఖంతో, చేతులతో అక్కడే మొక్కల మధ్య ఖాళీ స్థలంలో నేల మీద చతికిలపడ్డాడు. కాస్త ఎత్తుగా ఉండే నూతిపళ్లెం అంచున నేను కూర్చున్నాను. ‘విలేకరుగారు, అమ్మగారు..?’ ఉన్నారా అన్నట్టు అడిగాడు. ‘లేరు, పెళ్లికెళ్లారు. ఏమైనా చెప్పాలా?’ అన్నాను. విలేకరుగారంటే మా నాన్నగారే. ఆ చుట్టుపక్కల ఆయనకు అదే పేరు. ఆంధ్రప్రభకి గ్రామీణ విలేకరి. ఏమీ లేదన్నట్టు తలాడించి, మళ్లీ మౌనం దాల్చాడు శ్రీరాములు. వాస్తవానికి అతడు ఏదో జ్ఞాపకపు గాలానికి చిక్కుకున్నాడనాలి. రెండు నిమిషాల తరువాత మళ్లీ అడిగాను. ‘సుభాష్ బోస్ ఎలా ఉండేవారు?’ ‘శివాలయంలో నందంత అందంగా, కొట్టొచ్చినట్టు ఉండేవారు బాబూ!’ ఒక ఉద్యమ నేత మీద ఎంత గౌరవం ఉంటుందో బాగా అర్థమయింది. ఆ మాట అంటున్నప్పుడు అతడి రెండు చేతులూ నమస్కరిస్తున్నట్టు కలసి గాల్లోకి లేచాయి. నేత్రాలు అర్ధనిమీలితాలయ్యాయి. మద్దూరి అన్నపూర్ణయ్య గారని, ఆయన సుభాష్‌చంద్ర బోస్‌ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు శ్రీరాములు మొదటిసారి విన్నాడట ఆ పేరు. ఈ బోస్గారే సింగపూర్‌లో ఐఎన్ఏతో ఉద్యమం మొదలుపెట్టాడని తెలిసిందట. ఒక వేకువన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడట. ఇంకొకరు ఎవరో చెబితే కలకత్తా వెళ్లి, అక్కడి నుంచి బర్మా చేరుకుని మొత్తానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడట. ఎవరో ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుడు రాసిన స్వీయానుభవమే ఎక్కడో చదివాను. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఓటమితో ఫౌజ్ సైనికులను బ్రిటిష్ ప్రభుత్వం ఢిల్లీ తీసుకువచ్చి ఎర్రకోటలో సైనిక విచారణ పేరుతో హింసించారు. యుద్ధఖైదీల్లా కాదు, నేరగాళ్లని చూసినట్టు చూశారు. రెండురోజులకీ మూడురోజులకీ ఒకసారి తిండి పెట్టేవారు. అలాంటి పరిస్థితిలో కొందరిని పరుగెట్టమని, వెనక నుంచి కాల్చి చంపారు కూడా. బతికి బయటపడి ఢిల్లీ నుంచి శ్రీరాములు కోనసీమలో తన స్వగ్రామానికి వచ్చాడని నాన్నగారు చెప్పేవారు. ఆ ఒక్కరోజే అతడు హీరో. ఎలా వెళ్లాడో, ఎలా వచ్చాడో! స్వాతంత్య్రం వచ్చింది. ఊరూవాడా ఉత్సవాలు జరిగాయి. స్వాతంత్య్ర పోరాటం తరువాత చాలామంది స్వాతంత్య్ర సమరయోధులకి జీవనపోరాటం ఎదురైంది. అలాంటి వాళ్లలో శ్రీరాములూ ఉన్నాడు. అసలు ప్రశ్న. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన విషయం శ్రీరాములుకి స్పృహలో ఉందో లేదో! నాకు ఎప్పటికీ గుర్తుంటుందన్న ఆ సందర్భం ఆగస్ట్ 15నే జరిగింది. అంటే శ్రీరాములు అనే ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవితంలో ఆ రోజు కూడా భిక్షాటనతోనే గడిచింది. శ్రీరాములు గాథంతా నాన్నగారు వార్తాకథనంగా రాశారు. చాలామంది సమరయోధులకి పింఛను వచ్చింది. భూములు దక్కాయి. ఉచిత ప్రయాణాలు అమరాయి. తామ్రపత్రాలూ వచ్చాయి. దేశం కోసం జవానుగా మారి చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన శ్రీరాములుకి ఏమీ రాలేదు. కారణం, అతడు దేశం కోసం దేశం బయట నుంచి పోరాడాడట. అది నిజమేనని చెప్పే రికార్డేదీ లేదట. ప్రస్తుతం అతడికి భుక్తి గడవడం కష్టంగా ఉందనీ, ఇస్తే ఏ ఉద్యోగమైనా చేస్తాడంటూ కథనం ముగించారట నాన్న. ఎవరో సహృదయుడు స్పందించాడట. మద్రాస్‌లో ఉంటాడట. పెద్ద ఆఫీసరట. నూట యాభయ్ రూపాయల జీతంతో, ఉండడానికి క్వార్టర్స్ సహా అన్నీ ఇస్తానని పత్రికా కార్యాలయానికి ఉత్తరం రాస్తే, అది నాన్నగారికి చేర్చారు వాళ్లు. ఎందుకో ఏమో, అప్పుడే మూడువారాలైనా మా ఊరివైపు రాలేదట శ్రీరాములు. విషయం చెప్పి, ఇంటికే కబురు చేశారు నాన్న. శ్రీరాములు భార్యే కాబోలు ఎవరితోనో కబురు పెట్టింది, ఇప్పుడు అతడిని అంత దూరం పంపలేమన్నదే దాని సారాంశం. నాన్న వాకబు చేశారు. శ్రీరాములుకు మతి చలించిందని తెలిసింది. బోస్ బతికే ఉన్నాడా? విమాన ప్రమాదంలో మరణించాడా? ఇదే ధ్యాసట కొంతకాలం. కారణం దేశమంతా ఇదే చర్చట. ఎలా తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడో, అంతిమంగా బోస్ మరణించడమే నిజమన్న నిర్ణయానికి వచ్చాడట శ్రీరాములు. అప్పటి నుంచి మనిషి మారిపోయాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే చేతికి భిక్షాపాత్ర వచ్చింది. బ్రిటన్ మీద యుద్ధం ప్రకటించిన సైన్యం తన కవాతులో పాడుకున్న దేశభక్తి గీతాలు భిక్షాపాత్రా, కడుపూ నింపుకోవడానికి అభ్యర్థనలుగా ఉపయోగపడుతున్నాయి. ‘మా పొలాలు చూడు అని నీకు చెప్పడానికి మనసొప్పక చెప్పలేదయ్యా శ్రీరాములు. నీకేమిటీ ఖర్మ? వచ్చి మా పొలం పనుల్లో సాయపడు. ఎంతో కొంత ఇస్తాను.’ నాన్నది చిన్నపాటి సేద్యమే అయినా, సాటి స్వాతంత్య్ర సమరయోధుడికి సాయం చేయాలనుకుని, ఈ మాట అన్నారట. ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయాడట. భిక్షాటనలోనే ఉండిపోయాడు. ‘ఇదిగో! ఇది ఉంచు!’ అని పది రూపాయలు, నా పాకెట్ మనీ, అతడి చేతిలో పెట్టాను. మళ్లీ మొహమాటం. ‘తీసుకో ఫరవాలేదు’ అంటే, జేబులో పెట్టుకుని లేచాడు. ‘సెలవిప్పించండి!’ అన్నాడు, సెల్యూట్ భంగిమలో. నేను కూడా లేచాను. సింహద్వారం దాకా వెళ్లాను. నెమ్మదిగా మెట్లు దిగి వీథిలోకి వెళ్లిపోయాడు శ్రీరాములు. ఎదురుగా కనిపిస్తోంది పంచాయతీ కార్యాలయం. ముందు నుంచే నడిచి వెళుతున్నాడతడు. ఆ రోజూ, అతడు పాడిన సందర్భం ఎలాంటి ప్రయత్నమూ లేకుండానే గుర్తుకు వచ్చాయి. ఆ ఆగస్ట్ 15కి కూడా బడి దగ్గర నుంచి మమ్మల్నందరినీ ఉరేగింపుగా తీసుకొచ్చి పంచాయతీ కార్యాలయం ముందు బారులు తీర్చారు. తరగతుల వారీగా నిలబెడుతున్నారు. ఆ పనంతా వీరస్వామి మాస్టారిదే. పిల్లలంతా సిరా నీలం రంగు నిక్కరు, తెల్లచొక్కాలతో, ఆడపిల్లలు కూడా అలాంటి కూడికతోనే గౌన్లు, స్కర్టులతో ముచ్చటగా ఉన్నారు. మా పైనంతా రంగురంగుల కాగితపు జెండాల తోరణాలు. నిటారుగా ఉన్న ఒక సరుగుడు కర్రని కార్యాలయం ముందు పాతిపెట్టారు. దానికే వేలాడుతోంది మువ్వన్నెల జెండా. జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. గోలగోలగా ఉందంతా. కార్యాలయం లోపల ఊరి పెద్దలు పది పన్నెండు మంది ఖద్దరు దుస్తుల్లో తిరుగుతున్నారు, హడావిడి చేస్తూ. బడిపిల్లల గోల కంటే ఎక్కువే ఉంది. ఉదయం తొమ్మిది గంటల వేళకి సర్పంచ్‌గారు కష్టపడి జెండా ఎగరేశారు. వెంటనే వీరాస్వామి మేస్టారు ‘జెండా ఊంఛా రహే హమారా.. విజయీ విశ్వతిరంగా ప్యారా’ అంటూ పిడికిలెత్తి ఉద్విగ్నంగా పాడితే మేమంతా ఉత్సాహంగా అనుసరించాం. ఇంకొద్ది సేపటికి మేం ఎదురుచూస్తున్న చాక్లెట్ల పంపకం మొదలయింది. అప్పుడే లోపల పెద్దల చేతికి తలొక ప్యాకెట్ వచ్చింది. ఇడ్లీ కాబోలు. చాక్లెట్లు చేతుల్లో పడినవాళ్లు పరుగెత్తుతున్నారు. ఐదో తరగతి వాళ్లందరం చివర్న ఉన్నాం. లోపల పెద్దలు తినడం పూర్తి చేసి బయటకొచ్చి చేతులు కడుగుతున్నారు. ఒకళ్ల తరువాత ఒకళ్లు.. ఆ నీళ్లు నెమ్మదిగా ముందుకొస్తున్నాయి, సరిగ్గా జెండా కర్ర దిశగా, ఆ మహానుభావుల ఫొటోలు ఉన్న కుర్చీల కిందకే. వీరాస్వామి మాస్టారు, సరోజినీ టీచరమ్మ, మార్తమ్మ టీచరు, హెడ్మాస్టరు శివలపంతులు గారు, ఆయా వెంకమ్మ అట్టపెట్టెలలో తెచ్చిన చాక్లెట్లు పంచుకుంటూ వస్తున్నారు. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీరాములు. నేరుగా పంచాయతీ కార్యాలయం ముందుకెళ్లి గట్టిగా అరిచాడు, ‘బాబూ! బోసుబాబు అనుచరుణ్ణొచ్చాను. నాక్కూడా ఓ పొట్లం ఇప్పించండి బాబూ!’ ఒక్క నిమిషం ఆగి మళ్లీ అరిచాడు శ్రీరాములు. చేయి కడుక్కోవడానికి బయటకు వచ్చిన ఓ ఖద్దరుధారికి ఆ అరుపు చిర్రెత్తించింది. ఏదో అనబోయాడు గాని, గొంతులో నీళ్లు దిగేదాకా ఆగాడు. ఈసారి పాట అందుకున్నాడు శ్రీరాములు. ‘హవ్‌ు దిల్లీ దిల్లీ జాయేంగే, చలో దిల్లీ..’ ‘ఛ, అవతలకి పో!’ భరించలేనట్టే అసహనంతో అరిచాడు పెద్దమనిషి. పెద్దలకి కలిగిన అసౌకర్యానికి భయపడిన ప్యూను వెంటనే ప్రత్యక్షమై, ‘పైకెళ్లు.. పో, పైకెళ్లు..’ మీదకెళుతూ అన్నాడు, పొమ్మని బిచ్చగాళ్లకి చెప్పేమాట. అలాంటి చీదరింపులకి అలవాటు పడిపోయినట్టు నిర్లిప్తంగా ఉండిపోయాడు శ్రీరాములు. అంతా అటే చూశారు. నిమిషం తరువాత భారంగా కదిలాడు శ్రీరాములు. పంచాయతీ కార్యాలయం దాటి, ముందుకు వెళ్లిపోయాడు. చెట్లపల్లి వారి ఇంటి పక్క నుంచి వెళ్లే కాలిబాటని అనుసరించాడు. రెండు మూడు నిమిషాల తరువాత గాలి మోసుకొచ్చింది పాట. ‘కదం కదం బఢాయే జా.. ఖుషీ కే గీత్ గాయే జా.. ఏ జిందతీ హై కౌవ్ుకీ, తో కౌవ్ు పే లుటాయే జా..’ సావిట్లోకి అడుగుపెట్టిన తరువాత దూరం నుంచి శ్రీరాములు కంఠం లీలగా. గెలవాలన్న నిశ్చయం, ఓడిపోతున్నానన్న దిగులుతో కలసి జుగల్బందీ చేస్తున్నట్టుంది. ‘.. ఖుషీ కే గీత్ గాయే జా.. కదం కదం బఢాయే జా..’ జెండా కొయ్య మొదట్లో వరసగా మూడు కుర్చీలు. మధ్య కుర్చీలో బోసినవ్వుల గాంధీ ఫొటో. ఒక పక్క నెహ్రూ బొమ్మ, రెండో పక్క బాబూ రాజేంద్రప్రసాద్ బొమ్మ. మూడు ఫొటోలకి మువ్వన్నెల ఖాదీ దండలు. ∙డా. గోపరాజు నారాయణరావు -
‘ఫోన్ లిఫ్ట్ చేసి హలో కాదు.. వందేమాతరం అనండి’
Vande Mataram While Answering Calls.. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి సుధీర్ ముంగంటివార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి మహారాష్ట్రలో ప్రభుత్వ అధికారులు, కార్మికులకు కీలక సూచన చేశారు.. వీరంతా తమ ఫోన్లు లిఫ్ట్ చేసిన వెంటనే హలో అని కాకుండా వందేమాతరం సమాధానం ఇవ్వాలని ఆర్డర్ వేశారు. కాగా, హలో అనే ఇంగ్లీష్ పదం.. అందుకే దాన్ని వదులుకోవడం మంచిది. వందేమాతరం అనేది కేవలం పదం కాదు, ప్రతీ భారతీయుడు అనుభవించే అనుభూతి అని ఆయన స్పష్టం చేశారు. భారతీయులు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నారు. అందుకే, అధికారులు హలో బదులుగా ఫోన్లో 'వందేమాతరం' అని చెప్పాలని తాను కోరుకుంటున్నాను అని తెలిపారు అయితే, దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పోర్ట్‌ఫోలియోలను అప్పగించిన కొద్దిసేపటికే మంత్రి సుధీర్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. మరోవైపు.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆదివారం మంత్రులకు శాఖలను అప్పగించారు. ఇందులో డిప్యూటీ సీఎం, హోం శాఖ, ఆర్థిక శాఖలను దేవేంద్ర ఫడ్నవీస్‌కు అప్పగించి.. పట్టణ అభివృద్ధి శాఖ, పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ప్రాజెక్ట్స్) పోర్ట్‌ఫోలియోలను సీఎం షిండే తీసుకున్నారు. బీజేపీ మంత్రి రాధాక్రిష్ణ విఖే పాటిల్ కొత్త రెవెన్యూ శాఖ బాధ్యతలు, బీజేపీ మంత్రి సుధీర్ ముంగంటివార్ అటవీ శాఖను అప్పగించారు. #Maharashtra minister Sudhir Mungantiwar directed his officials in the department to start telephonic conversations with 'Vande Mataram' instead of greeting a phone call with a 'hello' (@sahiljoshii) https://t.co/yUaWLV17oE — IndiaToday (@IndiaToday) August 15, 2022 ఇది కూడా చదవండి: 75 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు.. పేదలకు సాయం నా లక్ష్యం: ప్రధాని మోదీ -
అమృతోత్సవ భారతం
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి నిండా డెబ్బయి ఐదేళ్లు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రజల్లో దేశభక్తి ప్రజ్వరిల్ల చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవానికి కొద్ది నెలల ముందుగానే ‘హర్ ఘర్ తిరంగా’– అంటే, ‘ఇంటింటా మువ్వన్నెలు’ నినాదాన్ని హోరెత్తించడం ప్రారంభించింది. ఎలాగైతేనేం, దేశమంతటా ఊరూవాడా మువ్వన్నెల రెపరెపలతో మెరిసిపోతున్నాయి. డెబ్బయి ఐదేళ్ల కిందట సాధించుకున్న స్వాతంత్య్రం మనకు తేలికగా దక్కలేదు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మనకు దక్కిన ఈ స్వాతంత్య్రం. ప్రజాపక్షపాతుల బలిదానాల ఫలితంగా దక్కిన స్వాతంత్య్రాన్ని మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలి? కష్టనష్టాలకు ఎదురీది, నెత్తురు చిందించి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు ప్రజానీకానికి అందేలా చేయడానికి ఎంతటి దీక్షాదక్షతలను చాటుకోవాలి? గడచిన డెబ్బయి ఐదేళ్లలో దేశంలోని సామాన్యుల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పగల పరిస్థితులు లేవు. అలాగని ఇన్నేళ్లలో సాధించినది శూన్యం అని చెప్పడానికీ లేదు. అయితే, మనం సాధించిన పురోగతి కొంతేనని, సాధించాల్సినది ఎంతోనని నిస్సందేహంగా చెప్పవచ్చు. దేశాన్ని అట్టుడికించిన స్వాతంత్య్ర సమరంలో ఎందరెందరో కవులు, రచయితలు ప్రజల పక్షాన నిలిచారు. బ్రిటిష్ దుష్పరిపాలనను ఎదిరించారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. శిక్షలు అనుభవించారు. దుర్భర దారిద్య్ర బాధలను అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చాక స్వాతంత్య్రోద్యమంలో త్యాగాలు చేసిన రచయితలు, కవుల్లో చాలామందికి దక్కాల్సినంత గౌరవం దక్కకపోవడమే చారిత్రక విషాదం. ఇందుకు కొందరు తెలుగు ప్రముఖుల ఉదాహరణలనే చెప్పుకుందాం. స్వాతంత్య్ర సమరం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము– దేవ– మాకొద్దీ తెల్లదొరతనము’ అంటూ గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ధిక్కారగీతం తెలుగునాట నలుచెరగులా ఊరూవాడా మార్మోగింది. జనంలోకి చొచ్చుకుపోయిన ఆ పాట తెల్లదొరలకు వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటి బ్రిటిష్ కలెక్టర్ బ్రేకన్, గరిమెళ్లను పిలిపించుకుని, ఆ పాటను ఆయన నోటనే విన్నాడు. భాష అర్థం కాకపోయినా, పాటలోని తీవ్రతను గ్రహించి, ఆయనకు ఏడాది జైలుశిక్ష విధించాడు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు ఆయనను తగినరీతిలో గౌరవించిన పాపాన పోలేదు. దుర్భర దారిద్య్రంతోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణానంతరం మన పాలకులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన పట్ల భక్తిప్రపత్తులను చాటుకున్నారు అంతే! గరిమెళ్లకు సమకాలికుడైన తొలితరం దళితకవి కుసుమ ధర్మన్న అదేకాలంలో ‘మాకొద్దీ నల్లదొరతనము’ పాట రాశారు. అప్పట్లో కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ఆయన ఈ పాట రాశారంటే, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కొందరు ఉద్యమనేతల అవినీతి, ద్వంద్వప్రవృత్తి ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కుసుమ ధర్మన్న స్వాతంత్య్రానికి వ్యతిరేకి కాదు గాని, అణగారిన దళిత వర్గాల అభ్యున్నతిపై నిబద్ధత, చిత్తశుద్ధి లేని నాయకుల చేతికి అధికారం దక్కితే జరగబోయే అనర్థాలను ముందుగానే గుర్తించిన దార్శనికుడు ఆయన. స్వాతంత్య్రం వచ్చాక కుసుమ ధర్మన్నకు కూడా ఎలాంటి గౌరవమూ దక్కలేదు. పరాయి పాలనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన తెలుగు కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం అగ్రగణ్యుడు. ఆయన ‘భరతఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగదూడలై యేడ్చుచుండ/ తెల్లవారను గడుసరి గొల్లవారు/ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’ పద్యాన్ని రాశారు. ఇక్కడి సంపదను బ్రిటిష్‌వారు దౌర్జన్యంగా కొల్లగొట్టుకుపోతుండటంపై ఆయన సంధించిన పద్యాస్త్రం అప్పట్లో విపరీతంగా ప్రభావం చూపింది. ఇక సహాయ నిరాకరణోద్యమ సమయంలో చీరాల–పేరాల ఉద్యమానికి నేతృత్వం వహించిన ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆనాడు రగిలించిన స్ఫూర్తి తక్కువేమీ కాదు. సహజ చమత్కారి అయిన దుగ్గిరాల బ్రిటిష్ పాలనను మాత్రమే కాదు, నాటి కాంగ్రెస్ నేతల సంకుచిత స్వభావాలను ఎండగడుతూ చాటువులు రాయగలిగిన సాహసి. సహాయ నిరాకరణోద్యమంలో జైలుపాలై, విడుదలయ్యాక మద్రాసు చేరుకుని అక్కడ ఇచ్చిన ఉపన్యాసంలో ‘న యాచే రిఫారం– నవా స్టీలు ఫ్రేముం/ న కౌన్సిల్ న తు ప్రీవి కౌన్సిల్ పదం వా/ స్వరాజ్యార్తి హన్తాంగ్లరాజ్యే నియన్తా/ ఫరంగీ ఫిరంగీ దృగంగీ కరోతు’ అంటూ నాటి పరిస్థితులపై చమత్కారాస్త్రాన్ని సంధించగల చతురత దుగ్గిరాలకే చెల్లింది. చిలకమర్తి, దుగ్గిరాల– ఇద్దరూ స్వాతంత్య్రానికి ముందే కన్నుమూశారు. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు వారికి సముచిత గౌరవం కల్పించే చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ సందర్భంగా గరిమెళ్ల మాటలను గుర్తు చేసుకోవాలి. ‘కొందరు త్యాగము చేయవలె, కొందరు దారిద్య్రముతో నశించవలె, పూర్తిగా నాశనమైనగాని దేశమునకు స్వరాజ్యము రాదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేసిన ఇలాంటి కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో స్ఫూర్తి రగిలించిన కవులు, రచయితల సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు ఇప్పటికైనా నడుం బిగిస్తే బాగుంటుంది. స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషించినా, గుర్తింపు దక్కించుకోలేకపోయిన కవులు, రచయితల కృషిని వెలుగులోకి తెచ్చేందుకు విశ్వవిద్యాలయాలు, అకాడమీలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి ప్రారంభించినట్లయితే, స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సార్థకత దక్కినట్లవుతుంది. -
ఆగస్టు 15న ఓలా మరో సంచలనం: బీ రెడీ అంటున్న సీఈవో
సాక్షి, ముంబై: క్యాబ్ సేవలు, ఎలక్ట్రిక్ బైక్స్‌తో హవాను చాటుకుంటున్న ఓలా త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న ఒక స్పోర్టీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించ నుందని తెలుస్తోంది. ఈ మేరకు ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వెల్లడించారు. భవిష్ అగర్వాల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, కార్ లాంచింగ్‌ను ధ్రువీకరించారు. 75వ స్వాతంతత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ప్రొడక్ట్‌ను ఇండియాలో లాంచ్ చేయ నున్నట్లు ట్వీట్ చేశారు. దీంతో పాటు అతి చౌక ధరలో కొత్త ఎస్1 స్కూటర్‌ను తీసుకురానుందని సమాచారం. ఆగస్టు 15న మేము ఏమి ప్రారంభించ బోతున్నామో ఊహించగలరా? అంటూ ట్వీట్ చేసిన భవీష్ అగర్వాల్ నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. అలాగే లాంచ్ ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లోస్ట్రీమ్ చేయనున్నామని, సంబంధిత వివరాలను త్వరలోనే వెల్లడి స్తామన్నారు. Any guesses what we’re launching on 15th August??!! — Bhavish Aggarwal (@bhash) August 5, 2022 ఓలా ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కాన్సెప్ట్ తక్కువ ధరలో కొత్త S1, భారతదేశపు అత్యంత స్పోర్టియస్ట్ కారు, సెల్ ఫ్యాక్టరీ , S1లో కొత్త ఉత్తేజకరమైన రంగుఅంటూ నాలుగు హింట్స్ ఇచ్చారు. దీంతో ఈ నాలింటిని పరిచేయనుందనే అంచనాలు మార్కెట్ వర్గాలు నెలకొన్నాయి. స్పోర్టీ ఎలక్ట్రిక్ కారు 10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుందట. అలాగే ఈ ఆగస్ట్ 15న ఫ్యూచర్ ఫ్యాక్టరీలో సెల్ తయారీ ప్లాంట్, కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికలతో సహా అనేక కార్యకలాపాలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కాగా ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త ఫోర్-వీలర్ లాంచింగ్‌పై గత కొద్ది కాలంగా అప్డేట్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓలా ఇండియాలో ఎస్1, ఎస్1 ప్రో, అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. -
కొనుగోలు దారులకు బంపరాఫర్, 75శాతం డిస్కౌంట్‌తో మరో సేల్!
కొనుగోలు దారులకు బంపరాఫర్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈకామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పోటీ పడి వినియోగదారులకు డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో పాటు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తున్నాయి. అమెజాన్ ఆగస్ట్ 6న నుంచి గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తుండగా.. ఫ్లిప్‌కార్ట్ ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈసేల్‌లో శాంసంగ్, రియల్మీ, షావోమీతో పాటు ఇతర సంస్థలకు చెందిన టీవీలపై టెలివిజన్, హోం అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు చెప్పింది. కండీషనర్ల(షాంపూలు)పై 55శాతం వరకు డిస్కౌంట్, మైక్రోవేవ్లపై 55శాతం, ఎయిర్ కండీషనర్లపై 55శాతం, వేరబుల్స్ అంటే స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాస్లపై 10శాతం నుంచి 70శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అదే సమయంలో యాపిల్, వివో,ఒప్పో, మోటరోలాతో పాటు ఇతర బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని అన్నారు. క్రేజీ డీల్స్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో 'క్రేజీ డీల్స్' పేరుతో 12ఏఎం, 8ఏఎం, 4పీఎంలలో ప్రత్యేకంగా అమ్మకాలు నిర్వహించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 'రష్ అవర్స్' 2ఏఎంలో కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. -
మహోజ్వల భారతి.. విభజన సమయంలో గాంధీజీ లేరు!
‘ఆజాదీ కా అమృత్ మహాత్సవ్’ సమయంలో స్మరించుకోవలసిన మరొక తేదీ జూన్ 3, 1947. భారతదేశానికి ‘అధికార బదలీ’ చేస్తున్నట్టు ఇంగ్లండ్ ప్రకటించిన రోజు. దాదాపు తొమ్మిది దశాబ్దాల స్వరాజ్య సమరం ఆ రోజుతో ముగిసింది. అధికార బదిలీ, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాన్ని భారత్ అని, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అని ఇంగ్లిష్ ప్రభుత్వమే నామకరణం చేసింది. ఆ ముందు ఏడాది 1946 సెప్టెంబరు 2న ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్‌పటేల్, కాంగ్రెస్ అధ్యక్షుడు జేబీ కృపలానీ, ముస్లింలీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (నెహ్రూ మంత్రిమండలిలో ఆర్థికమంత్రి), అబ్దుల్ రబ్ నిష్తార్ (మరొక మంత్రి), సిక్కుల తరఫున బలదేవ్ సింగ్ (రక్షణ మంత్రి) జూన్ 3న సమావేశం అయ్యారు. లార్డ్ మౌంట్‌బాటన్, ఆయన సలహాదారు ఎరిక్ మీవిల్లె ఆ సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం తొమ్మిది మంది. విభజన ప్రణాళిక లేదా మౌంట్‌బాటన్ పథకం లేదా జూన్ 3 పథకానికి వీరే ఆమోదముద్ర వేశారు. విభజనతో కూడిన అధికార బదలీ గురించి జూన్ 3న రేడియోలో మౌంట్‌బాటన్, నెహ్రూ, జిన్నా, బల్దేవ్ సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆ సాయంత్రమే బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ఆమోదించింది. ఒక్కడొక సందేహం రావచ్చు. భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ఈ సమావేశంలో స్వతంత్ర సమర సారథి గాంధీజీ ఎక్కడ? గాంధీ ఆ సమావేశంలో ఉండడం మౌంట్ బాటన్ కు ఇష్టంలేదు. ఆయన అంతరంగాన్ని బట్టే కాంగ్రెస్ నేతలు వ్యవహరించి గాంధీజీని దూరంగా ఉంచారని అంటారు. -
సరిహద్దుల్లో బీటింగ్ రిట్రీట్
-
హక్కులు అందరికి సమానంగా అందాలి : సీఎం జగన్
-
మనం అమరవీరుల ఆశయాలను సాధించామా?
-
జెండా పాట
-
పోలీసుల తీరుపై రాజాసింగ్ ఫైర్
-
ఇండిపెండెన్స్‌డే ఆఫర్లు... తగ్గిన రెడ్మీ ఫోన్ల ధరలు
స్వాతంత్ర దినోత్సవ కానుకగా షావోమీ తన మొబైల్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. రీసెంట్గా మార్కెట్లో రిలీజైన మోడల్స్‌తో పాటు రన్నింగ్‌లో ఉన్న మొబైల్స్‌పై ఈ తగ్గింపును వర్తింప చేస్తోంది. ఈ మేరకు షావోమి తన ట్విట్టర్ పేజీ ద్వారా అధికారిక ప్రకటన జారీ చేసింది. ఎంఐ ఎక్స్ 11 5 జీ Xiaomi's Mi 11X 5G మొబైల్ ప్రస్తుతం మార్కెట్ ధర రూ.27,999లు ఉండగా ప్రత్యేక ఆఫర్ కింద రెండు వేలు తగ్గించారు. ఎంఐ 10టీ ప్రో 5జీ Xiaomi Mi 10T Pro ధర రూ. 39,999 ఉండగా ఇండిపెండెన్స్ డే ఆఫర్ కింద రూ. 36,999కి లభిస్తోంది. ఎంఐ 10ఐ Mi 10i మిడ్‌రేంజ్ సెగ్మెంట్లో ఎంఐ 10ఐ మొబైల్‌ని లాంచ్ చేసినప్పుడు ధర రూ.21,999 ఉండగా ఇప్పుడు రూ. 20,999కి తగ్గించింది. రెడ్మీ 9 Redmi 9 మొబైల్ ఫోన్ ధర రూ. 8,999 ఉండగా రూ. 1500 తగ్గింపు ప్రకటించింది. స్టార్ట్ టీవీపై కూడా స్వాతంత్ర దినోత్సవ తగ్గింపు ఆఫర్లను ఆగస్టు 5 నుంచి 9 వరకు షావోమీ అమలు చేస్తోంది. మొబైల్ ఫోన్లతో పాటు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ఉపయోగించి షావోమీ స్మార్ట్‌టీవీ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ. 7,500ల వరకు క్యాష్‌బ్యాక్ అమలు చేస్తోంది. దీంతో పాటు 20,000 ఎంఏహెచ్ పవర్బ్యాంక్పై రూ.500 తగ్గింపు అందిస్తోంది. Avail exciting offers on #MiSmartphones during the #BigSavingDays 📲 Up to ₹6,000 off on Exchange🤑 📲 Up to ₹2,500 Instant Discount and more Last day today! Shop now on @flipkart and save BIG! 😇 pic.twitter.com/ppREeLdcAD — Mi India (@XiaomiIndia) August 9, 2021 -
ఓలా, ఏథర్ స్కూటర్లకి పోటీగా మరో ఎలక్ట్రిక్ స్కూటర్!
దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రజల ఆసక్తికి అనుగుణంగా చాలా కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొనిరావడానికి పోటీపడుతున్నాయి. తాజాగా ఓలా, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా మరో కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొనిరావడానికి సిద్దం అవుతుంది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ ఆగస్టు 15న తన మొదటి ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సింపుల్ ఎనర్జీ ఈ నెల ప్రారంభంలో 'సింపుల్ వన్' పేరుతో ఒక స్కూటర్ ను ట్రేడ్ మార్క్ చేసింది. ఇంతకు ముందు దీనికి మార్క్2 అని పేరు పెట్టారు. "సింపుల్ ఎనర్జీ ద్వారా మొదటి ఎలక్ట్రిక్ వాహనం పేరును ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. సింపుల్ వన్ అనే పేరు బ్రాండ్, ప్రొడక్ట్ కు సంభందించి సరైన అర్ధాన్ని ఇస్తుంది" అని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. దీనిని ఒకసారి సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్ లో 240 కిలోమీటర్ల వెళ్లవచ్చు అని సంస్థ క్లెయిమ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా, ఏథర్ స్కూటర్లకి పోటీగా నిలవనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని తొలగించడానికి అవకాశం ఉంది. ఈ స్కూటర్ 3.6 సెకన్లలో గంటకు 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. దీని గంటకు 100 కిలోమీటర్లు అత్యదిక వేగంతో వెళ్లనున్నట్లు సంస్థ పేర్కొంది. దీని ధర కూడా రూ.1.10 లక్షల నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండవచ్చని కంపెనీ సూచించింది. అలాగే, కేంద్ర, రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీతో ఇది మరింత చౌకగా లభించనుంది. -
ఇండిపెండెన్స్ డే: ఆ సినిమాను గుర్తు చేసిన కాజోల్
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్ట్స్ ఎప్పడు ఆసక్తిగా ఉంటాయి. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2001లో వచ్చిన కాజోల్ ‘కబీ ఖుసీ కబీ గమ్’ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఆమె తన ట్విటర్లో శనివారం షేర్ చేశారు. ఇందులో కాజోల్ తన కుమారుడుని ‘సారే జహా సే అచ్చా హిందుస్తాన్ హమారా’ ఎప్పటికి మర్చిపోవద్దు అంటూ వారించిన సన్నివేశాన్ని పంచుకున్నారు. అలాగే వీడియో చివరిలో కాజోల్ జాతీయ జెండా త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దీనిని ‘రిపీట్ ఆఫ్టర్ మీ’ అనే క్యాప్సన్‌తో షేర్ చేశారు. (చదవండి: సల్మాన్ ‘సారే జహాసే అచ్చా’ వీడియో వైరల్) అయితే ఈ సినిమాల్లో షారుక్ ఖాన్, కాజోల్ వివాహం అనంతరం విదేశాల్లో స్థిరపడిన విషయం తెలిసిందే. అక్కడ తన కొడుకుకు భారతదేశం గొప్పతనం గురించి తరచూ వివరిస్తూ ఉంటుంది. చివరిగా కాజోల్ దేవి అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. ఇందులోని తన నటనకతో కాజోల్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లక్స్‌లో రాబోయే చిత్రం త్రిభంగలో నటిస్తున్నారు. రేణుకా సహనే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కాజోల్ భర్త, హరో అజయ్ దేవగన్ నిర్మిస్తున్నారు. Repeat after me!#IndependenceDay pic.twitter.com/kV21ie2wOR — Kajol (@itsKajolD) August 15, 2020 -
దాడిచేస్తే ఉపేక్షించం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మనదేశంపై శత్రుదేశాలు దాడి చేస్తే, వారికి తగిన రీతిలో బుద్ధి చెపుతామని, తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో తలెత్తిన ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనాను ఉద్దేశించి రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. భారత దేశం ప్రజల హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటుందే తప్ప, భూభాగాల ఆక్రమణను కాదని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భద్రతా దళాలకిచ్చిన సందేశంలో రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. (101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం) దాని అర్థం తమ స్వీయ గౌరవానికి భంగం కలిగితే భరిస్తామని కాదని రక్షణ మంత్రి ఆ సందేశంలో స్పష్టం చేశారు. ‘‘దేశ రక్షణకు మాత్రమే మేం ఏదైనా చేస్తాం, ఇతర దేశాలపై దాడులు మా లక్ష్యం కాదు’’అని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఏ దేశ భూభాగంపై భారత్ దురాక్రమణకు పాల్పడలేదని, దానికి చరిత్రే సాక్ష్యమని మంత్రి చెప్పారు. సైనిక సిబ్బంది అవసరాలు తీర్చడానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన అన్నారు. -
పంద్రాగస్టు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సాక్షి, హైదరాబాద్ : నేడు భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పంద్రాగస్టు అనగానే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పండగే.. ఎక్కడ చూసిన మువ్వనెల జెండా రెపరెపలాడుతూ కనిపిస్తోంది. భారతీయుల గుండెల్లో దేశభక్తి పరవళ్లు తొక్కుతోంది. నా దేశానికి ఏ హాని జరగకుండా కాపాడుకుంటామని.. మాతృభూమికి ఆపద వస్తే రక్షించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతామనే ధృడ సంకల్పం ప్రతి భారతీయునిలో కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరగుతాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ఎస్జీ స్నైపర్లు, స్వాట్ కమాండోలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. (స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధం) ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ రోజుఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 350 మంది పోలీసులు మాత్రమే పాల్గొనున్నారు. ఎర్రకోట వద్ద పంద్రాగస్టు వేడుకలకు 4 వేల మందితో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి ఇద్దరి మధ్య రెండు యార్డుల దూరం ఉండేలా కుర్చీల ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో ఇక్కడ జరిగే స్వాతంత్ర దినోత్స వేడుకలకు దాదాపు 30 వేల మంది పాల్గొనేవారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వీవీఐపీలు కేవలం 20 శాతం మంది మాత్రమే హాజరు కానున్నారు. ఎర్రకోట సమీపంలో నాలుగు కోవిడ్-4 టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే వారిలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఈ కేంద్రాల్లో వారికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. అలాగే దేశంలోని అన్ని చోట్లా నేడు పంద్రాగస్టు వేడుకలు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదగా నిర్వహిస్తున్నారు. జెండా ఆవిష్కరణ వేడుకలకు కొద్ది మంది మాత్రమే పాల్గొననున్నారు. నేడు పంద్రాగస్టు వేడుకలు ప్రగతి భవన్‌లోనే జరగనున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఉదయం 10.15 గంటలకు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరిస్తారు. కొవిడ్-19 నిబంధనలకు లోబడి ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్వాతంత్య్ర వేడుకల్లో 20 మంది అతిథులు మాత్రమే పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ప్రతి చోట స్వాతంత్ర్య సంబురాలు జరుపుకోవాల్సిన నిబంధనలను తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ► ప్రతి చోట భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు ► ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్కు ధరించాల్సిందే.. ► ప్రతి చోట శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచారు. ► వేడుకల్లో పాల్గొనే వారికి 50 మందికి మించరాదు. ► 20 నిమిషాల్లో వేడుకను పూర్తి చేయాలి. ► సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించరాదు. -
399 మంది ఖైదీలకు సీఎం కేసీఆర్ క్షమాభిక్ష!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 399 మంది ఖైదీలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. ఖైదీల క్షమాభిక్ష పైలుపై ఈరోజు సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఆగస్టు 15న వారిని విడుదల చేస్తారు. ఈక్రమంలో ఖైదీల విడుదలకు అవసరమైన విధివిధానాలను పది రోజుల్లో పూర్తి చేయాలని హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్విని ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016 లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవిత, జీవితేతర, తక్కువ శిక్షాకాలం ఖైదీలను విడుదల చేసింది. అదే తరాహాలో 2020 ఆగస్టు 15 న ప్రసాదించే ఖైదీల క్షమాభిక్ష జీవో ఉంటుందని తెలిసింది. ఖైదీలు, వారి కుటుంబాలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల పోరాటాల ఫలితం మూలంగానే తెలంగాణ ప్రభుత్వం స్పందించినట్టు సమాచారం. (జ్వరం వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు : ఈటల) -
లవ్ ఇండియా: ట్రంప్ ట్వీట్ వైరల్
వాషింగ్టన్ : భారత్‌పై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. ‘అమెరికా లవ్స్ ఇండియా’ అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. అగ్రరాజ్యం 244వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి, ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్ర ఓ సందేశాన్ని పంపారు. దీనికి బదులుగా స్పందించిన అధ్యక్షుడు ట్రంప్.. థ్యాంక్యూ మై డియర్ ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు. అమెరికా లవ్స్ భారత్ అంటూ మరోసారి తన అభిమానాన్ని ట్విటర్ ద్వారా చాటుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల అధినేతలు సైతం ప్రపంచ వేదికలపై పలుమార్లు ప్రశంసలు కురిపించుకున్నారు. మరోవైపు భారత్-చైనా మధ్య సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో సైనికపరంగా భారత్‌కు అండగా ఉంటామంటూ అమెరికా ప్రకటించింది. (అగ్రరాజ్యం ఒకప్పుడు బానిసగానే..) -
అగ్రరాజ్యం ఒకప్పుడు బానిసగానే..
జార్జ్ వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్, జేమ్స్ మన్నో, జాన్ క్విన్సీ ఆడమ్స్, ఆండ్రూ జాక్సన్, మార్టిన్ వాన్ బ్యూరెన్, విలియం హెన్రీ హారిసన్, జాన్ టైలర్ తదితరులు అమెరికా స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ముఖ్యులుగా చరిత్రకెక్కారు. జార్జ్ వాషింగ్టన్ 1789-97 వరకు అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు. ప్రపంచ దేశాలకు పెద్దన్న.. అంతర్జాతీయ సంస్థలన్నింటినీ శాసించగల ఆర్థిక శక్తి... ఏ దేశాన్నైనా తన గుప్పిట్లోకి తెచ్చుకోగల సైనిక బలగం కలిగిన శక్తిమంతమైన దేశం.. ఇలా దశాబ్దాల తరబడి అన్నింటా అగ్రరాజ్యంగా వెలుగొందుతోంది అమెరికా. అయితే ఇప్పుడంటే ఈ దేశానికి ఇన్ని హోదాలు ఉన్నాయి గానీ.. ఒకప్పుడు అమెరికా కూడా బానిసగానే బతికింది. ప్రపంచాన్ని శాసించాలన్న బ్రిటన్ సామ్రాజ్యవాద కాంక్షకు బలైపోయింది. పరాయి పాలన నుంచి విముక్తి కోసం పోరాడి 1776, జూలై 4న స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. ఆనాటి నుంచి జూలై 4ను ‘బర్త్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్’ డే గా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలు.. 244 ఏళ్ల క్రితం.. దాదాపు 244 క్రితం.. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్య పోకడలను వ్యతిరేకిస్తూ 13 కాలనీల్లోని అమెరికన్లంతా ఒక్కటయ్యారు. శిస్తులు విపరీతంగా పెంచడం, కాలనిస్టుల అభిప్రాయం కోరకుండానే కాలనీల్లో సైన్యాన్ని మోహరించడం, ప్రజలపై కాల్పులకు తెగబడటం సహా కాలనిస్టులకు పార్లమెంటులో సముచిత స్థానం కల్పించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో 1760-1770 మధ్య అమెరికన్ కాలనీలు, బ్రిటిష్ పాలకుల మధ్య తలెత్తిన సంఘర్షణ చివరకు అమెరికన్ విప్లవానికి తెరతీసింది. ఈ క్రమంలో 1775 ఏప్రిల్‌లో గ్రేట్ బ్రిటన్ నుంచి పూర్తిగా విముక్తి పొందితేనే బానిసత్వం తొలగిపోతుందటూ కాలనిస్టులు ప్రజల్లో స్వతంత్ర కాంక్ష రగిల్చారు. ఇందులో భాగంగా 1776లో రాజకీయవేత్త థామస్ పేన్ ‘కామన్ సెన్స్’ పేరిట ప్రచురించిన కరపత్రాలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ నేపథ్యంలో కాంటినెంటల్ కాంగ్రెస్ (బ్రిటిష్ అమెరికన్ కాలనీల ప్రతినిధులు) అదే ఏడాది జూన్ 7న ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌజ్(ఈ తర్వాత ఇండిపెండెన్స్ హాల్‌గా గుర్తింపు పొందింది)లో నిర్వహించిన సమావేశంలో.. వర్జీనియా ప్రతినిధి రిచర్డ్ హెన్రీ లీ కాలనీల స్వాతంత్ర్యం కోసం తీర్మానం ప్రవేశపెట్టారు. వాడి వేడి చర్చల అనంతరం లీ తీర్మానంపై ఓటింగ్ వాయిదా వేసిన కాంటినెంటల్ కాంగ్రెస్.. థామస్ జెఫర్సన్(వర్జీనియా), జాన్ ఆడమ్స్(మసాచుసెట్స్), రోజర్ షెర్మన్(కనెక్టికట్), బెంజమిన్ ఫ్రాంక్లిన్(పెన్సిల్వేనియా), రాబర్ట్ ఆర్ లివింగ్స్టన్(న్యూయార్క్) తదితర ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. గ్రేట్ బ్రిటన్ పెత్తనాన్ని కాలనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుపుతూ, స్వరాజ్య కాంక్షను సమర్థిస్తూ అధికారిక ప్రకటన చేసేందుకు వీలుగా ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్.. అనేక పరిణామాల అనంతరం జూలై 2న లీ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన కాంటినెంటల్ కాంగ్రెస్.. బ్రిటీష్ సింహాసనాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్ల స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం అంటే జూలై 4న డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పేరిట స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ‘ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ క్రియేటెడ్(మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు- అందరికీ సమాన హక్కులు అనే ఉద్దేశంతో)’ అంటూ థామస్ జెఫర్సన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా.. ‘‘ఇప్పటి నుంచి మన ముందు తరాలు ఓ గొప్ప పండుగను ప్రతి ఏటా జరుపుకొంటాయి. సంబరాలు చేసుకుంటాయి. పరేడ్లు, ఆటలు, గంటల మోత, టపాసుల కాంతులు ఖండమంతటా విస్తరిస్తాయి’’అంటూ మసాచుసెట్స్ ప్రతినిధి జాన్ ఆడమ్స్ తన భార్యకు రాసిన లేఖలో స్వాతంత్ర్యం ఖరారైందనే శుభవార్త పంచుకున్నారు. ఇలా ఓ వైపు బ్రిటీష్ బలగాలతో కాంటినెంటల్ ఆర్మీ యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు స్వాతంత్ర్య ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో 1778లో ఫ్రాన్స్ అమెరికా కాలనీల తరఫున రంగంలోకి దిగడంతో.. ఎట్టకేలకు 1781లో వర్జీనియాలోని యార్క్‌టౌన్‌లో కొన్ని బ్రిటీష్ సేనలు లొంగిపోయాయి. అయితే 1783 ముగిసేనాటికి కూడా ఈ యుద్ధం ముగిసిపోలేదు. మరలా అనేక యుద్ధాలు, పరిణామాల అనంతరం 1941లో జూలై 4ను అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ హాలిడేగా ప్రకటించింది. 13 కాలనీలు 1. ప్రావిన్స్ ఆఫ్ మసాచుసెట్స్ బే 2. ప్రావిన్స్ ఆఫ్ హాంప్‌షైర్ 3. కనెక్టికట్ కాలనీ 4.కాలనీ ఆఫ్ రోడే ఐలాండ్ 5.డెలావేర్ కాలనీ 6.ప్రావిన్స్ ఆఫ్ న్యూయార్క్ 7.ప్రావిన్స్ ఆఫ్ న్యూజెర్సీ 8. ప్రావిన్స్ ఆఫ్ పెన్సిల్వేనియా 9. కాలనీ అండ్ డొమీనియన్ ఆఫ్ వర్జీనియా 10. ప్రావిన్స్ ఆఫ్ మేరీలాండ్ 11. ప్రావిన్స్ ఆఫ్ నార్త్ కరోలినా 12. ప్రావిన్స్ ఆఫ్ సౌత్ కరోలినా 13. ప్రావిన్స్ ఆఫ్ జార్జియా జార్జ్ వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామప్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్, జేమ్స్ మన్నో, జాన్ క్విన్సీ ఆడమ్స్, ఆండ్రూ జాక్సన్, మార్టిన్ వాన్ బ్యూరెన్, విలియం హెన్రీ హారిసన్, జాన్ టైలర్ తదితరులు అమెరికా స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ముఖ్యులుగా చరిత్రకెక్కారు. జార్జ్ వాషింగ్టన్ 1789-97 వరకు అమెరికా ప్రథమ అధ్యక్షుడిగా సేవలు అందించారు. -
అయ్యో! ఇషా గుప్తా
న్యూఢిల్లీ: ఆగస్టు 15వ తేదీన గణతంత్ర దినోత్సవ శుభాకాం క్షలు తెలిపిన బాలీవుడ్ నటి ఇషా గుప్తాపై సామాజిక మాధ్యమం ట్విట్టర్లో కామెంట్లు వెల్లువెత్తాయి. గురువారం మాజీ మిస్ ఇండియా ఇషా మాత్రం ‘గణతంత్ర దిన శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతే.. నెటిజన్లు వెంటనే తమదైన శైలిలో స్పందించారు. ఇషా గుప్తా బాధ్యత లేకుండా వ్యవహరించారని కొందరు విమర్శించారు. తన అకౌంట్ హ్యాక్ అయిందని ఇషా తెలపడంతో కథ ముగిసింది. -
కశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలు
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు కారణంగా రాష్ట్ర ప్రజల ప్రత్యేక గుర్తింపుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. గురువారం షేర్–ఇ–కశ్మీర్ స్టేడియంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపబోవని హామీ ఇస్తున్నాను. పైపెచ్చు, రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల ప్రజల భాషా సాంస్కృతిక వికాసానికి అవి సాయపడతాయి. నవ కశ్మీర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను కోరుతున్నాను’అని పేర్కొన్నారు. కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్తగా ముఖ్య నేతలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నందున వారెవరూ రాలేకపోయారు. నగరంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడనున్న లదాఖ్‌లో ప్రజలు మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లదాఖ్‌లో జరిగిన వేడుకల్లో ప్రజలు తమ ఏకైక ఎంపీ జమ్యంగ్ త్సెరింగ్ నంగ్యా(24)తో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. -
దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి
స్వాతంత్య్రం అంటే తెలుసుకున్నా... కొన్నేళ్ల క్రితం వరకు స్వాతంత్య్ర దినోత్సవం అంటే సెలవు రోజు.. కుటుంబసభ్యులతో ఇంట్లో గడపవచ్చని భావించేదానిని. అది తెలియనితనం. కానీ బాధ్యతాయుత పౌరురాలిగా మారాక నా ఆలోచనలో మార్పు వచ్చింది. నిజమైన స్వాతంత్య్రం అంటే ఏంటో తెలుసుకున్నా. సైద్ధాంతిక భావజాలం, అంధ విశ్వాసాల చట్రంలో ఇరుక్కుపోకుండా వాటి నుంచి బయటకు రావాలి. దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. – ‘రోజా’ ఫేమ్ మధుబాల దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతగా ఉండాల్సిన రోజు. మనకు లభించిన స్వాతంత్య్రం విలువను చూపించాల్సిన రోజు. అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు వేడుకల్లో పాల్గొనాలి. మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేయడం మన బాధ్యత. ఆ రోజు ఎవరికి తోచిన విధంగా వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మన వంతుగా మనం దేశానికి ఏం ఇస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన రోజు. – సినీ నటి పూజా హెగ్డే -
బ్యాంకులకు వరుస సెలవులు
సాక్షి, అమరావతి: ఆగస్టు నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో బ్యాంకులకు ఆ రోజున కూడా సెలవు. ఈ సెలవు దినాల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ చెల్లింపులు కూడా పనిచేయవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా బ్యాంకర్లు సూచిస్తున్నారు. -
జాతీయ గీతాన్ని అవమానించిన ప్రిన్సిపాల్
లక్నో : విద్యార్ధులకు జాతీయ గీతంపై గౌరవాన్ని పెంపొందించాల్సిన ఉపాధ్యాయుడే దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ గీతంపై అవమానకరంగా ప్రవర్తించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాలేజీలో జెండా ఆవిష్కరించిన అనంతరం విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా కళాశాల ప్రిన్సిపాల్ దానికి నిరాకరించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌ఘనీలో మదర్సా బాలికల కళాశాలలో బుధవారం చోటుచేసుకుంది. సహా ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు మదర్సా ప్రిన్సిపాల్ ఫజ్ల్‌ర్ రెహ్మాన్‌తో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు జూనైద్ అన్సారీ, నిజాంలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అరేబియా అలే సునాత్ బాలికల కళాశాల యూపీ మదర్సా బోర్డుపై 2007లో నమోదు చేయబడి ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న కాలేజేలో ప్రిన్సిపాల్ జెండా ఆవిష్కరించగానే విద్యార్థినిలు జాతీయ గీతం పాడుతుండగా వారికి ప్రిన్సిపాల్ వారించినట్లు త్రిపాఠి అనే ఉపాధ్యాయుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. త్రిపాఠి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కాగా జాతీయ గీతాన్ని అవమానించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుని, కళాశాల గుర్తింపుని రద్దు చేయవల్సిందిగా జిల్లా మెజిస్టేట్ అమర్నాథ్ ఉపాధ్యాయ అధికారులను ఆదేశించారు. కాగా దేశంలోని అన్ని మదర్సాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తప్పనిసరిగా నిర్వహించాలని కే్ంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాల జారీ చేసిన విషయం తెలిసిందే. -
కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం..
-
పంద్రాగస్టు లేదా గాంధీ జయంతి!
న్యూఢిల్లీ: దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల కవరేజ్ అందించేందుకు ప్రభుత్వం ఉద్దేశించిన ‘మోదీ కేర్’ పథకాన్ని ఆగస్టు 15 లేదా, గాంధీ జయంతి (అక్టోబర్ 2) ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. వచ్చే (2018–19) ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించినప్పటికీ పథకం ప్రాముఖ్యత దృష్ట్యా స్వాతంత్య్ర దినోత్సవం లేదా గాంధీ జయంతిల్లో ఒకరోజు అట్టహాసంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం’ (దీన్నే మోదీ కేర్ అంటున్నారు)లో 60 శాతం కేంద్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుందని జైట్లీ అన్నారు. బడ్జెట్లో ఈ ఏడాది ‘మోదీ కేర్’ కోసం రూ.2వేల కోట్లతో ప్రాథమిక మూలనిధిని ఏర్పాటుచేశామన్నారు. పథకం అమలు ఆధారంగా వచ్చే ఏడాది తర్వాత మరిన్ని నిధులు సమకూరుస్తామన్నారు. దీని ద్వారా 10 కోట్ల కుటుంబాలకు (దాదాపు భారత జనాభాలో 40 శాతం మందికి) లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ వైద్య పథకం క్యాష్లెస్గానే ఉంటుందని రీయింబర్స్మెంట్ పథకం కాదని చెప్పారు. ‘ఈ పథకం ఆసుపత్రిలో చికిత్సను, అనంతర సంరక్షణను అందిస్తుంది. ఇందులో పలు ప్రభుత్వాసుపత్రులు, ఎంపికచేసిన ప్రైవేటు ఆసుపత్రులు ఉంటాయి. ఇదో ట్రస్టు లాగా లేదా ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది. రీయింబర్స్మెంట్ సాధ్యం కాదు’ అని అన్నారు. పాలసీదారులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీమియం తగ్గటం సహజమేనన్నారు. ఈ విధానాన్ని నీతి ఆయోగ్, వైద్య శాఖ సంయుక్తంగా రూపొందించాయని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 తర్వాత)లో ఏదో ఒకరోజు దీన్ని ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ‘ఆరోగ్యశ్రీ’ ట్రస్టులాగే మోదీకేర్ను ట్రస్టులా నిర్వహించొచ్చనే భావనా వ్యక్తమవుతోంది. ఈ పథకం ద్వారా రూ.11వేల కోట్ల భారం పడుతుందని అంచనా. నిధులు కాదు.. అమలే సవాల్ ఈ పథకానికి నిధుల సమస్యలేదని వైద్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. అమల్లో ఉండే అవరోధాలనూ కేంద్రం పరిశీలిస్తోందన్నారు. త్వరలోనే పథకానికి సంబంధించిన అన్ని వివరాలనూ వెల్లడిస్తామన్నారు. పథకాన్ని అమలు చేయాలా? వద్దా? లేక సొంత నిధులతో నడుపుకోవాలా? అనేది రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చన్నారు. అన్ని అనారోగ్య సమస్యలకూ ఈ పథకంలో చికిత్స అందుతుందన్నారు. నిధుల సమీకరణ ఇబ్బందేం కాదని.. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయటమే అసలు సవాల్ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. ‘ఏడాదికి రూ.5 లక్షల రూపాయల కవరేజీ ఇచ్చేందుకు ఒక్కో కుటుంబానికి రూ.1,000 నుంచి 1,200 వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి’ అని నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఒక్క శాతం సెస్ పెంచితే చాలు ఈ పథక రూపశిల్పి, నీతి ఆయోగ్ సభ్యుడు వినోద్ కుమార్ పాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్కశాతం అదనపు విద్య, వైద్య సెస్ ద్వారా ఈ పథకానికి అవసరమైన నిధిని సమకూర్చవచ్చన్నారు. 2011 సామాజిక, ఆర్థిక, కుల జనగణన ఆధారంగానే పేదల గుర్తింపు ఉంటుందన్నారు. పథకాన్ని వాడుకునేందుకు ఆధార్ తప్పనిసరి కాదన్నారు. కాగా, బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకుండా పథకాన్ని ప్రకటించడం అంటే.. దారం లేకుండా గాలిపటాన్ని ఎగరేయటమేనని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు. ‘వాస్తవానికి అక్కడ గాలిపటమూ ఉండదు, ఎగరటమూ ఉండదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమలు ఎలా..? కేంద్ర బడ్జెట్లో అందరినీ ఆకర్షించిన ప్రధానాంశం జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం (ఎన్‌హెచ్‌పీఎస్). దేశ జనాభాలో మూడోవంతుకు దీర్ఘకాలంలో ఆరోగ్యబీమా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ఒబామాకేర్ తరహాలో ప్రభుత్వం మోదీ కేర్ అని పిలుస్తోంది. మరి ఈ మోదీ కేర్ పథకం ఎలా ఉంటుంది? దీన్ని ఏయే సంస్థలు అమలు చేస్తాయన్న వివరాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007 ఏప్రిల్ ఒకటిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన∙రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి అధ్యక్షతన నడిచే ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా విజయవంతంగా అమలు చేశారు. ఐఏఎస్ అధికారి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) గా ఉన్న ట్రస్ట్ ఆరోగ్యపరిరక్షణరంగ నిపుణులతో సంప్రదించి ఆరోగ్యశ్రీని సాధ్యమైనంత పకడ్బందీగా అమలు చేసింది. ఎన్‌హెచ్‌పీఎస్ అమలుకు చేతులు కలపాలని తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా ప్రైవేటు కంపెనీలను కూడా కేంద్ర సర్కారు కోరవచ్చు. కాని, ప్రతి ఏటా అదనంగా అవసరమైన సొమ్మును ప్రైవేటు పారిశ్రామికవేత్తలు సకాలంలో ఎలా అందజేస్తారన్న విషయం కూడా ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. అయితే.. ఈ పథకాన్ని హడావుడిగా అమలు చేస్తే లాభపడేది ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రైవేటు ఆస్పత్రులేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కందికుంట జెండా ఎగురవేయడంపై వివాదం
కదిరి: మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ జాతీయ జెండా ఎగురవేయడం వివాదాస్పదమైంది. ‘అధికారిక కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సురయాభానుతో కలిసి ఆయన ఎగురవేయడమేమిటని సొంతపార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా నకిలీ డీడీల కుంభకోణం కేసులో ఆయన శిక్షపడిన ఖైదీ అనీ, అలాంటి వ్యక్తి చేత జాతీయ జెండాను ఎలా ఎగురవేసేందుకు అధికారులు అనుమతించారని సొంతపార్టీ నాయకులే విమర్శిస్తున్నారు. దీనిపై తాము జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వారంటున్నారు. మరోవైపు కందికుంట ఎగురవేసిన జాతీయ జెండా తిరగబడిందనేది మరో వివాదం. -
కోర్టులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
అనంతపురం లీగల్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అంతేకాకుండా కార్మిక న్యాయస్థానం న్యాయమూర్తి జి. స్వర్ణలత, వినియోగదారుల న్యాయస్థానం ఎదుట ఫోరం అధ్యక్షురాలు వై.ప్రమీలారెడ్డి, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అశోకస్థూపం వద్ద న్యాయవాదసంఘం అధ్యక్షుడు టి.భరత్‌భూషన్‌రెడ్డి తదితరులు త్రివర్ణపతాకాలు ఎగుర వేశారు. -
దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలి
జేఎన్టీయూ: దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా పనిచేయాలని జేఎన్టీయూ అనంతపురం ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ అన్నారు. జేఎన్టీయూ అనంతపురంలో 71వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేసిన అనంతరం ఇన్ఛార్జ్ వీసీ ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల ఆదర్శాలను తీసుకొని దేశం, సమాజం అభ్యున్నతికి పాటుపడాలన్నారు. వర్సిటీ పరిధిలోని బోధన పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, డైరెక్టర్లు ప్రొఫెసర్ విజయ్‌కుమార్, ప్రొఫెసర్ ఆనందరావు, ప్రొఫెసర్ కే.రామానాయుడు, ప్రొఫెసర్ ప్రశాంతి, ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్యాగధనుల బాటలో నడవాలి
అనంతపురం అర్బన్: దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు పాటుపడిన త్యాగధనుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి అన్నారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో జాతీయపతాకాన్ని ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, జిల్లా ఖజానా డీడీ శర్మ, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలాజయరామప్ప, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఏడీ జయమ్మ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజనల్ పీఆర్ఓలు వేణుగోపాల్‌రెడ్డి, రమేశ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా అభివృద్ధికి కృషి
వృద్ధి రేటులో జిల్లాకు 4వ స్థానం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు(పొగతోట): జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అందుకు ప్రతి ఒక్కరి సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ పేర్కొన్నారు. సోమవారం 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వసతులు ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపన విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లాలో 19 మెగా ప్రాజెక్టులు, 42 భారీ పరిశ్రమలు రూ.30,772 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 48 వేల మందికి ప్రత్యక్షంగా, 32 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లాలో రూ.11,354 కోట్ల పెట్టుబడుతలతో 13 పరిశ్రమలు స్థాపనకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో రూ.50 వేల పెట్టుబడులతో చెన్నై–బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకానుందన్నారు. 2.30 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటు 10.99 శాతం ఉందన్నారు. జిల్లా వృద్ధి రేటు 12.20 శాతంతో నాల్గవ స్థానంలో ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో గత ఏడాది 19.35 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు. వర్షపాతం 43 శాతం తక్కువగా ఉందన్నారు. జిల్లాలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికి కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తగినంత వర్షపాతం ఉన్నందున శ్రీశైలం జలాశయం నుంచి సోమశిల, కండలేరు జలాశయాలకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. హర్టికల్చర్ పంటల సాగు అధికం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇ–మార్కెటింగ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. నిరుపేద మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా బ్యాంకుల ద్వారా రూ.751 కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. రైతుల పొలాల్లో పంట సంజీవిని ద్వారా రూ.99 కోట్లతో 30 వేల నీటి కుంటలు నిర్మిస్తున్నామని తెలిపారు. రహదారుల అభివృద్ధి కోసం రూ 263 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తున్నామన్నారు. వచ్చే మార్చికి నెల్లూరు బ్యారేజి పనులు పూర్తి నెల్లూరు బ్యారేజి, బ్రిడ్జి, సంగం బ్యారేజ్ పనులు వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 20,700 ఎకరాలకు సాగునీరు అందించేలా రూ.53 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. నగరంలోని ప్రజలకు మంచినీటిని అందించడానికి రూ 556 కోట్లు ఖర్చుతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. రూ.580 కోట్లతో భూగర్భడ్రైనేజీ పనులు త్వరలో ప్రారంభంకానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ విశాల్‌గున్నీ, జాయింట్ కలెక్టర్ ఎ.మహమ్మద్‌ఇంతియాజ్, ఇన్చార్జి డీఆర్ఓ మార్కండేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జేసీ–2 రాజ్‌కుమార్, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రూ.22 కోట్ల ఆస్తులు పంపిణీ
నెల్లూరు (వేదాయపాళెం) :స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ శాఖల ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల లబ్ధిదారులకు రూ.22,60,47,000లు విలువైన ఆస్తులను సోమవారం మంత్రి నారాయణ, కలెక్టర్ ముత్యాలరాజు పంపిణీ చేశారు. 738 డ్వాక్రా సంఘాలకు రూ.20కోట్ల 35లక్షల బ్యాంక్ రుణాల చెక్కులు, గిరిజన సంక్షేమశాఖలో 18 మందికి సైకిళ్లు, 191 మందికి 243 ఎకరాల్లో అటవీభూముల హక్కు పత్రాలు, గిరిపుత్రిక కల్యాణం పథకం ద్వారా 30 మంది మహిళలకు రూ.15లక్షలు పంపిణీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకంలోని 48 మందికి కుట్టు మిషన్లు, ఉద్యానవనశాఖలో 23 మందికి రోటవేటర్లు, ఏడుగురికి తైవాన్ స్ప్రేయర్స్, మైక్రో ఇరిగేషన్లో 23 మందికి డ్రిప్, స్పింకర్ యూనిట్లు, ఎస్ఈ కార్పొరేషన్లో ఐదుగురికి ఆటోలు, ముగ్గురికి జెరాక్స్ మిషన్లు, 12 మందికి సబ్మెర్సిబుల్ మోటార్లు, 15 మందికి ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకం కింద చెక్కులు, 50 మందికి బ్యాంక్ లింకేజ్ రుణాల చెక్కులు, బీసీ కార్పొరేషన్లో 30 మందికి రూ.50వేలు చొప్పున (బుట్టల అల్లకం, కర్టన్స్ తయారీ), 15 మందికి ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున, మత్స్యశాఖలో డాట్లో 110 యూనిట్లకు రూ.11.75లక్షలు, జీపీఎస్ 9 యూనిట్లకు రూ.85వేలు, ఎక్స్‌గ్రేషియా కింద ముగ్గురికి రూ.5లక్షలు, ఐస్ బాక్సులకు రూ.23వేలు, మత్స్యకారులకు 10 మందికి సైకిళ్లు, వలలు, వికలాంగులశాఖలో ఐదుగురికి ట్రై సైకిళ్లు, 10 మందికి వీల్‌చైర్స్, 10 మందికి టచ్ఫోన్లు పంపిణీ చేశారు. -
రెండంకెల వృద్ధి రేటు లక్ష్యం
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో రెండు అంకెల వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా సోమవారం పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. తొలుత జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పెరేడ్ తిలకించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జిల్లా ప్రజలకు ఆయన సందేశం ఇచ్చారు. ఈ ఏడాది 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకు అనుగుణంగా జిల్లాలో తలసరి ఆదాయాన్ని 94 వేల నుంచి లక్షా 10 వేల రూపాయలు సాధించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోందని చెప్పారు. ప్రాథమిక రంగంలో 5 శాతం, ద్వితీయ రంగంలో 17 శాతం, సేవా రంగంలో 14 శాతం, వృద్ధి రేటు సాధన దిశగా జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. ఈ ఏడాది 4126 కోట్ల రూపాయల లక్ష్యానికిగాను ఇప్పటికే 1325 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు పంపిణీ చేశామన్నారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, సూక్ష్మ పోషకాలు పంపిణీ చేశామన్నారు. రాయితీపై వ్యవసాయ పనిముట్లు ఇస్తున్నామని చెప్పారు. 50 వేల రూపాయలలోపు రుణాలు తీసుకున్న రైతులు ఒకే దఫాలో రుణ విముక్తులయ్యారని చెప్పారు. 50 నుంచి లక్షా 50 వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో దశల వారీగా రుణమాఫీ మొత్తాన్ని జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో 3,52,000 మంది రైతులకు సుమారు రూ. 1286 కోట్లు రుణమాఫీ వర్తించిందన్నారు. ఇప్పటిదాకా రెండు విడతల్లో 668 కోట్ల 56 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు 1.1 శాతం ఉందని, దీన్ని 40 శాతానికి పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థూల ఉత్పత్తిలో గత సంవత్సరం ఉన్న 23 శాతం వాటాను ఈ ఏడాది నాలుగు శాతం వృద్ధి రేటుతో 27 శాతం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా స్థూల ఉత్పత్తిలో గత ఏడాది 12 శాతం వృద్ధి సా«ధించగా, ఈ యేడు 20 శాతం సాధించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ యేడు పండ్ల తోటల విస్తరణ, రక్షిత వ్యవసాయం, ఉద్యాన యాంత్రీకరణ పథకాలను రూ. 26 కోట్లతో అమలు చేస్తున్నామని చెప్పారు. ఉద్యాన రైతులకు కూడా రుణమాఫీ చేశామన్నారు. జిల్లాలో 32 వేల మందికి 67 కోట్ల 35 లక్షల రూపాయలు మాఫీ చేశామని పేర్కొన్నారు. ఈ యేడు 40,400 హెక్టార్లలో బిందు, తుంపర సేద్య పరికరాల ఏర్పాటుకు రైతులకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 124 రెయిన్ గన్స్, 124 స్ప్రింకర్లు, 3100 అదనపు పైపులు సమకూర్చామన్నారు. ఈ యేడు 400 ఎకరాల్లో మల్బరీ సాగు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. అలాగే 4 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ యేడు కోటి మేలు జాతి చేప పిల్లల పెంపకం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 59 లక్షల చేప పిల్లలను చుతున్నామన్నారు. చేనేత కార్మికులు 986 మందికి రూ. 5 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. మైలవరం టెక్స్టైల్ పార్కుకు రూ. 4 కోట్లు విడుదల కాగా, రూ. 3 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రొద్దుటూరులో అపెరల్ పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. శ్రీశైలం జలాశయం ద్వారా గండికోట రిజర్వాయర్‌కు 12 టీఎంసీల నీటిని ఈ యేడు తీసుకొస్తామని చెప్పారు. గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ తెలుగుగంగ పథకం కింద గత ఏడాది 20 వేల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. ఈ యేడు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 12 టీఎంసీల నీటిని బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌కు మళ్లిస్తామన్నారు. బ్రహ్మంసాగర్ కింద లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేసీ కెనాల్ కింద 90 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, సగిలేరు ప్రాజెక్టుల ద్వారా సుమారు 56 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. భూగర్భ జలాలను పెంపొందించే పనులకు అ«ధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 40 వేల ఫారంపాండ్లు తవ్వించడం లక్ష్యం కాగా, 35 వేల పనులు ప్రగతిలో ఉన్నాయని చెప్పారు. లక్ష ఇంకుడు గుంతలకుగాను 33 వేల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.స్వచ్ఛాంధ్ర సాధనలో భాగంగా 45 వేల మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. వనం–మనం కింద 3,65,000 మొక్కలు నాటామన్నారు. జిల్లాలో 285 వ్యవసాయ బోరు బావులకు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నామన్నారు. ఈ యేడు 21,510 కొత్త సర్వీసులకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా సంఘాలకు రూ. 630 కోట్లు పంపిణీ లక్ష్యం కాగా, ఇప్పటికి రూ. 69 కోట్లు ఇచ్చామన్నారు. స్త్రీ నిధి రుణాల కింద ఈ యేడు రూ. 80 కోట్లకుగాను ఇప్పటికి రూ. 28 కోట్లు ఇచ్చామని వివరించారు. వంద శాతం గర్భవతుల నమోదు, ఈ–ఔషధి కార్యక్రమంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ యేడు 3373 గృహాలను మంజూరు చేశామన్నారు. ఒంటిమిట్ట, గండికోట, కడప దర్గాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కడప సమీపంలో 12.56 ఎకరాల్లో హజ్‌హౌస్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి ఘనంగా సత్కరించారు. పోలీసు, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, డీఆర్డీఏ, ఆర్‌డబ్లు్యఎస్, అగ్నిమాపక,108, డ్వామా శాఖలు అభివృద్ధి శకటాలను ప్రదర్శించాయి. డీఆర్డీఏ, ఏపీ వికలాంగుల సహకార కార్పొరేషన్, మెప్మా, ఏపీఎంఐపీలు 9163 మంది లబ్ధిదారులకు రూ. 29,95,00,000 విలువజేసే 1432 యూనిట్లను మంజూరు చేశారు. వీటిని మంత్రి గంటా శ్రీనివాసరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకుగాను మొత్తం 265 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మంత్రి గంటా శ్రీనివాసరావు మెరిట్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీ సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ విజయ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ, వివిధ శాఖల ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, అనధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతి పండుగ.. సమైక్యత నిండుగ
► ‘అనంత’లో ఘనంగా 70వ స్వాతంత్య్ర వేడుకలు ► జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించిన సీఎం చంద్రబాబు ► జిల్లా అభివృద్ధికి రూ.6,554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ► టవర్‌క్లాక్ సమీపంలోని గాంధీజీ విగ్రహానికి నివాళి ► ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన శకటాలు..సాంస్కృతిక ప్రదర్శనలు ► స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం సాక్షిప్రతినిధి, అనంతపురం : భరత జాతి పండుగ సమైక్యతా స్ఫూర్తిని ఘనంగా చాటింది. కుల,మత,వర్గ, లింగ బేధాలకు అతీతంగా ప్రజలందరూ భరతమాతకు జేజేలు అర్పించారు. మువ్వన్నెల జెండాకు వందనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో 70వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించారు. తర్వాత డీజీపీ సాంబశివరావు ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రికి స్టేడియంలోని ఆర్మ్డ్, నాన్ ఆర్మ్డ్ కవాతు బృందాలను చూపించారు. తర్వాత కవాతు ప్రదర్శనను సీఎం తిలకించారు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు మెడల్స్‌ను అందజేశారు. ప్రభుత్వ పథకాలపై రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. పౌరసరఫరాల శాఖ శకటానికి Sమొదటి, ఉద్యాన శాఖ శకటానికి ద్వితీయ, విద్యుత్, పరిశ్రమలశాఖ శకటాలకు తృతీయ బహుమతులను అందజేశారు. ఆపై రాష్ట్రప్రజలనుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రసంగం తర్వాత అవార్డులు పొందిన వారితో గ్రూపు ఫొటో దిగారు. స్వాతంత్య్ర సమరయోధులను ప్రత్యేకంగా సత్కరించారు. తర్వాత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. పీటీసీలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి∙తిరుగు పయనమయ్యారు. అంతకుముందు నగరంలోని టవర్‌క్లాక్ సమీపంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులర్పించారు. జిల్లా అభివృద్ధికి రూ.6,554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ముఖ్యమంత్రి ప్రసంగం సమయంలో జిల్లా అభివృద్ధి కోసం ‘ఎన్టీఆర్ ఆశయం’ పేరుతో రూ.6,554 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో కరువు నివారణకు రూ. 1,767కోట్లు, వ్యవసాయాభివృద్ధికి రూ.2,654 కోట్లు, తాగునీటికి రూ.500 కోట్లు, పరిశ్రమల అభివృద్ధికి రూ.100 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ.139 కోట్లు, స్వచ్చ అనంతపురానికి రూ.94 కోట్లు,పేరూరు ప్రాజెక్టు ఫేజ్–1కు రూ.850 కోట్లు, భైరవానితిప్ప ప్రాజెక్టు ఫేజ్–1కు రూ.450 కోట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లాను కరువు రహిత ప్రాంతంగా మారుస్తానని సీఎం పునరుద్ఘాటించారు. ‘అనంత’కు సెంట్రల్, ఎనర్జీ యూనివర్సిటీలు అనంతపురంలో సెంట్రల్æ, ఎనర్జీ యూనివర్సిటీలు స్థాపిస్తామన్నారు. పారిశ్రామికSకారిడార్‌గా జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో పండ్లతోటల పెంపకంపై ప్రత్యేకSదృష్టి సారించి హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని చెప్పారు. వేరుశనగ పరిశోధన కోసం ప్రత్యేకంగా ఇక్కడ∙డైరెక్టరేట్ స్థాపించి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయస్థాయిలో మార్కెటింగ్ చేస్తామన్నారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాలో సాగునీటి కష్టాలు తీర్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాళ్లసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి రాక మునుపు డీజీపీ సాంబశివరావుకు పోలీసులు గౌరవవందనం చేశారు. శకటాల ప్రదర్శన అనంతరం వాటిని నగరంలో ప్రజలు తిలకించేలా ప్రధాన రోడ్లపై తిప్పారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, పీతలసుజాత, పరిటాల సునీత, పల్లెరఘునాథరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ చమన్, మేయర్ స్వరూప, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, ఈరన్న, హనుమంతరాయ చౌదరి, చాంద్‌బాషా, ఎమ్మెల్సీలు మెట్టుగోవిందరెడ్డి, పయ్యావుల కేశవ్, గేయానంద్, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్డీవో మలోల తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్టులో భారీ జాతీయ పతాకం ఆవిష్కరణ
విమానాశ్రయం(గన్నవరం) : విమానాశ్రయంలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ భవన ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకాన్ని సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం ఆవిష్కరించారు. వంద అడుగుల ఎత్తు కలిగిన స్తంభంపై 30 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు కలిగిన డే అండ్ నైట్ పతాకాన్ని ఆయన రిమోట్ బటన్ ద్వారా ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. పతాకం ప్రజల్లో జాతీయభావం, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉందన్నారు. ముఖ్యంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం అందరికి గర్హకారణమన్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర డీజీపీ నండూరి సాంబశివరావు, విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, కలెక్టర్ బాబు.ఎ, విజయవాడ సీపీ గౌతమ్‌సవాంగ్, ఏఏఐ జీఎం ప్రభహరణ్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు పాల్గొన్నారు. -
బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారన్నారు. బీసీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ జాతీయ పతాకావిష్కరణ
-
జెండా వందనం ఫొటోలు పంపండి
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి భారతీయుడు ఎక్కడున్నా ఆనందంగా, గర్వంగా జరుపుకొంటారు. మువ్వన్నెల జెండా ఎగరేసి వందనం చేస్తారు. అలా మీరు కూడా జెండావందనం చేశారా? మీ స్కూలు, కాలేజి, ఆఫీసు, కాలనీ.. ఇలా ఎక్కడైనా సరే జెండా ఎగరేసినట్లయితే.. ఆ ఫొటోలను వివరాలతో పాటు మాకు పంపండి. ఎన్నారైలు కూడా తాముంటున్న దేశాలు, ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా ఎగరేస్తే.. ఆ ఫొటోలు, ప్రాంతం పేరు, మీ పేరుతో sakshinetduty@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి పంపండి. వాటిని మీ వివరాలతో గ్యాలరీ రూపంలో అందిస్తాం. -
దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటలో.. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా తెలంగాణలో గోల్కొండ కోట మరోసారి పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ తీరంలో పంద్రాగస్టు వేడుకలను జరపడానికి సిద్ధమైంది. ఖాకీ నీడలో హస్తిన నగరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. ఐబీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని మోదీకి ఏడంచెల భద్రత కల్పించారు. ఢిల్లీలో 40వేల మంది పోలీసులు పహారా వేశారు. దాంతో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. -
'15 ను బ్లాక్‌డే గా జరుపుకోవాలి'
విశాఖ: స్వాతంత్ర్య దినోత్సవం ను బ్లాక్ డేగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం తీములబంద గ్రామంలో నల్లజెండాలను ఎగురవేశారు. శుక్రవారం గాలెకొండ ఏరియా కమిటీ పేరుతో గ్రామంలో నల్లజెండాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
'15న ఉగ్ర దాడులు జరిగే అవకాశం'