విశాఖ: స్వాతంత్ర్య దినోత్సవం ను బ్లాక్ డేగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం తీములబంద గ్రామంలో నల్లజెండాలను ఎగురవేశారు. శుక్రవారం గాలెకొండ ఏరియా కమిటీ పేరుతో గ్రామంలో నల్లజెండాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.