Black day
-
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
అమెరికా చరిత్రలో ఇది చీకటి రోజు.. డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ తీవ్ర విమర్శలు
Dagger At The Throat Of Democracy వాషింగ్టన్: యూఎస్ క్యాపిటల్‌పై ట్రంప్ మద్ధతుదారుల దాడి (2020 జనవరి 6న ) జరిగి ఏడాది గడిచిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురువారం శక్తిమంతమైన ప్రసంగం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ పరోక్షంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. 2020 నవంబర్ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అబద్ధపు ప్రచారాలను జో బైడెన్ దుయ్యబట్టారు. ఎన్నికల్లో బైడెన్‌ను విజేతగా ప్రకటించకుండా నిలిపివేసేందుకు, ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల లెక్కింపుకు అంతరాయం కలిగించడానికి, ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ మద్ధతుదారులు పన్నిన కుట్రలపై మండిపడ్డారు. క్యాపిటల్‌లోకి చొరపడ్డ ఘటనలో దాదాపు 700 మంది తిరుగుబాటుదారులు అరెస్టయ్యారన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి చెందారు. దాడి జరిగిన రోజు అక్కడున్న మరో నలుగురు అధికారులు ఆ తర్వాత నెలల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాడి జరిగిన అనంతరం దాడికి ప్రేరేపించిన ఆరోపణలతో ట్రంప్‌ను అభిశంసనకు రంగం సిద్ధం చేశారు. ఐతే సెనెట్‌లో 57 - 43 ఓట్ల తేడాతో ట్రంప్ బయటపడ్డాడు (నిర్ధారణకు 67 ఓట్లు అవసరమవుతాయి). కాగా క్యాపిటల్‌పై దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా క్యాపిటల్‌లోని స్టాచ్యురి హాల్లో నిన్న (గురువారం) బైడెన్ ఈ విధంగా ప్రసంగించారు. చరిత్రలోనే తీవ్ర అపఖ్యాతి ఇది బ్లాక్ డే (జనవరి 6). అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక అధ్యక్షుడు ఎన్నికల్లో ఓడిపోవడమేకాక, శాంతియుత అధికార మార్పిడికి తీవ్రప్రతిఘటనకు ప్రయత్నించాడు. ప్రజాస్వామ్యపు గొంతుకకు బాకును గురిపెట్టడానికి ఎవ్వరినీ అనుమతించను. ముమ్మాటికీ ఇది సాయుధ తిరుగుబాటు. మాజీ అధ్యక్షుడు 2020 ఎన్నికలు జరగకముందే రిగ్గింగ్ జరుగుతుందని ప్రచారం చేశాడు. జనవరి 6 న క్యాపిటల్ భవనంపై దాడి చేయించడం ద్వారా వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ చర్యలతో అతను అమెరికా చరిత్రలోనే అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. నువ్వు గెలిస్తే తప్ప నీ దేశాన్ని ప్రేమించలేవా?’ అని బైడెన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రోజు వైట్ హౌస్‌లో తాపీగా కూర్చుని టీవీలో అంతా చూస్తూనే ఉన్నాడు ‘అమెరికా రాజకీయ హింసను అంగీకరించే దేశంగా మారబోతోందా? ప్రజలు చట్టబద్ధంగా వ్యక్తీకరించబడిన ఇష్టాన్ని తారుమారు చేయడానికి పక్షపాత ఎన్నికల అధికారులను అనుమతించే దేశంగా మనం ఉండబోతున్నామా?’ అని బైడెన్ ప్రశ్నించారు. గత అధ్యక్షుడు అబద్ధపు చట్రాన్ని సృష్టించి జనాన్ని రెచ్చగొట్టాడని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌పై దాడి సమయంలో అతను వైట్‌హౌస్‌లో టీవీ ముందు కూర్చుని అంతా చూస్తున్నాడని చెప్పారు. ఐతే మొత్తం ప్రసంగంలో బైడెన్ ఎక్కడా ట్రంప్ పేరును ప్రస్తావించనప్పటికీ ఎన్నికల్లో గెలవడం కోసం మోసానికి పాల్పడిన వ్యక్తికి చెందిన రూపును (ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గురించి) సుస్పష్టం చేశారు. అమెరికాను విభజించడానికి బైడెన్ నాపేరు వాడుతున్నారు: ట్రంప్ బైడెన్ ప్రసంగం ముగిసిన వెంటనే ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. అమెరికాను విభజించడానికి డెమొక్రాట్ ప్రయత్నిస్తుందని, రాజకీయ రంగస్థలమని (పొలిటికల్ థియేటర్) బైడెన్ క్యాపిటల్ దాడి వార్షకోత్సవ ప్రసంగంపై ట్రంప్ ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే తన వాదనను ఈ ప్రకటనలో పునరావృతం చేశారు. చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు -
రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే
సాక్షి, ఢిల్లీ/ హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో అల్లోపతి వైద్యం పని చేయడం లేదని.. వైద్యులు విఫలమయ్యారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాఖ్యలు చేసిన రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం నల్ల దినంగా (బ్లాక్ డే) వైద్యులు రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. పీపీఈ కిట్లు ధరించి.. నల్లబ్యాడ్జీలు పెట్టుకుని విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌పై ఉత్తరాఖండ్ ఐఎంఏ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నె తదితర ప్రాంతాల్లో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోషల్ మీడియాలో కూడా రామ్‌దేవ్ బాబాకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. #ArrestRamdev అనే హ్యాష్‌ట్యాగ్ చేస్తూ ట్విటర్, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి, వైద్యారోగ్య మంత్రులను విజ్ఞప్తులు పంపుతున్నారు. చదవండి: బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు చదవండి: రామ్‌దేవ్ బాబా ఇది ‘తమాషా’ కాదు: ఆరోగ్యశాఖ మంత్రి -
Blackday: దేశ జెండా మోసి అలసిపోయాం
సాక్షి, న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి నేటితో ఆరు నెలలు పూర్తైంది. కేంద్ర ప్రభుత్వం కిందటి ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నవంబర్ 26 తేదీ నుంచి రైతు సంఘాలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ బ్లాక్ డే నిర్వహించాలని సంఘాలు నిర్ణయించుకున్నాయి కూడా. దీంతో దేశ రాజధానికి నలువైపులా భారీగా పోలీసులు మోహరించారు. మొద్దు ప్రభుత్వం బ్లాక్‌డే సందర్భంగా రైతు సంఘాల నేత రాకేశ్ టికాయత్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఉద్యమం చేయబట్టి ఆరు నెలలు అయ్యింది. ఈ ఆరు నెలలు దేశ జెండాను మోశాం. మా గళం వినిపించాం. కానీ, ఎవరూ స్పందించలేదు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వం మొద్దుగా వ్యవహరిస్తోంది’’ అని టికాయత్ మండిపడ్డాడు. నిరసనల సందర్భంగా ఎక్కడా గుంపులుగా చేరబోమని, బహిరంగ సమావేశాలు అసలే నిర్వహించమని ఆయన స్పష్టం చేశాడు. అయితే రైతులు మాత్రం ఎక్కడికక్కడే నల్ల జెండాల్ని ఎగరేసి నిరసన తెలపాలని టికాయత్ ఒక ప్రకటనలో పిలుపు ఇచ్చాడు. ఊరుకునేది లేదు రైతుల బ్లాక్ డే నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. ఢిల్లీలో కరోనా విజృంభణ, లాక్డౌన్ అమలులో ఉన్నందున ఎవరైనా గుంపులుగా మీటింగ్‌లు పెట్టినా, అక్రమంగా చెక్పాయింట్ల నుండి చొరబడేందుకు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో చిన్మయ్ బిస్వాల్ తెలిపారు. శాంతియుతంగా.. మరోవైపు నేడు బుధ పూర్ణిమ కావడంతో శాంతియుతంగా బ్లాక్‌డే నిర్వహించాలని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు ఇచ్చింది. సమాజంలో సత్యం, అహింస జాడ కరవైందని.. వాటిని పునరుద్ధరించేలా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే ఎక్కడికక్కడ శాంతియుతంగా బ్లాక్‌డే నిరసన తెలపాలని రైతులను కోరింది. ఈ నేపథ్యంలో ఇళ్లపైనే నల్లజెండాలు ఎగరేస్తూ రైతులు నిరసన తెలియజేస్తున్నారు. మద్ధతుగా ప్రతిపక్షాలు.. మే 26న బ్లాక్ డే నిర్వహించాలని వారం క్రితమే ఎస్కేఎం నిర్ణయించింది. ఈ నిరసనలకు తమ మద్ధతు ఉంటుందని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఈమేరకు 12 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఇక బ్లాక్‌డేకు మద్దతుగా కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ పటియాలాలో, ఆయన కూతురు రబియా అమృత్‌సర్‌లో ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సర్కార్లకు నోటీసులు మరోవైపు, కరోనా నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుండడంపై ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు పంపింది. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది. -
రైతుల ఉద్యమానికి నెలలు; ఈ నెల 26న ‘బ్లాక్ డే’
న్యూఢిల్లీ: కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల ఉద్యమం ప్రారంభమై ఈ నెల 26వ తేదీకి 6 నెలలు అవుతుందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజున ‘బ్లాక్ డే’గా పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా శనివారం పిలుపునిచ్చింది. 40కి పైగా రైతుల సంఘాల ఐక్యవేదికే ఈ కిసాన్ మోర్చా. ఈనెల 26న ఇళ్లు, దుకాణాలపై నల్లజెండాలను ఎగురవేయాలని, వాహనాలకు నల్లజెండాలు కట్టుకోవాలని రైతు నేత బల్బీర్‌సింగ్ రాజేవాల్ శనివారం ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా ‘చలో ఢిల్లీ’ నినాదంతో రైతులు నవంబరు 26న ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారని తెలిపారు. వణికించే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు చాలారోజుల పాటు ఢిల్లీ సరిహద్దులను దిగ్బంధించిన విషయం తెలిసిందే. కేంద్రంతో పలుమార్లు రైతు సంఘాల చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. అప్పటినుంచి దేశనలుమూలల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి, సింఘు, ఘాజీపూర్‌లలోని ధర్నా స్థలాలకు వచ్చి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మే 26తో మోదీ మొదటిసారి అధికారం చేపట్టి ఏడేళ్లు అవుతుందని రాజేవాల్ తెలిపారు. -
న్యాయ చరిత్రలో బ్లాక్ డే: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్ డే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించింది. మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది. మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా..? బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోంది.. ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’అని ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఒవైసీ ఆరోపించారు. -
వైద్యులపై దాడులకు నిరసనగా బ్లాక్ డే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అంటువ్యాధిలా అందరినీ కబలిస్తోంది. అయినా ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా రోగులకు డాక్టర్లు సేవలందిస్తున్నారు. అయినా కొందరు మాత్రం వైద్యులపై దాడులకు పాల్పడుతున్నారు. వైద్యులపై ఉమ్మివేస్తూ, దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 23న బ్లాక్‌డే పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్వీ అశోకన్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని సూచించారు. వైద్యులకు రక్షణగా ఓ చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. #IMA demands Special Central Law Against Violence on Doctor’s & Declares White Alert to the nation on 22.04.2020 & Black Day on 23.04.2020. pic.twitter.com/inFOSiJusI — Indian Medical Association (@IMAIndiaOrg) April 20, 2020 తమిళనాడులో కరోనా కారణంగా ఓ వైద్యుడు చనిపోతే అతని అంత్యక్రియలకు స్థానికులు అడ్డుతగిలారు. అంతేకాకుండా వారిపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ‘కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటం అన్నది అత్యంత హేయమైన చర్య. వారి శ్రమను గుర్తించకుండా వారిపై దాడులకు పాల్పడుతున్నారు. సరే మేం కూడా ఇంట్లో కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అపోహలు సృష్టిస్తూ దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేద’ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. -
బాబ్రీ ఎఫెక్ట్ ఫుల్ ఫోర్స్
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ పరిస్థితుల్లోనే బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజైనడిసెంబర్ 6వ తేదీ నగర పోలీసులుభారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలనేపథ్యంలో ఈసారి మరింత కట్టుద్టిమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలుచోటుచేసుకోకుండా మూడు కమిషనరేట్ల అధికారులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. డిసెంబర్ 6ను కొన్ని సంస్థలుబ్లాక్ డేగా, మరికొన్ని విజయ్ దివాస్‌గా జరుపుకోవడం ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా శుక్రవారం నగరవ్యాప్తంగా 144 సెక్షన్ విధించనున్నట్లు ప్రకటించారు. సభలు, సమావేశాలు, నిరసనలు, ధర్నాలను నిషేధించడంతో పాటు ఒకేచోట నలుగురికి మించి గుమిగూడకూడదని స్పష్టం చేశారు. బుధవారం నుంచే అదనపు బలగాలను రంగంలోకి దించి పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పాతబస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం అక్కడ మకాం వేసి పరిస్థితిని సమీక్షించనున్నారు. అన్ని విభాగాలు... సీసీఎస్, సిట్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, సిటీ ఆర్ఏఎఫ్, టీఎస్‌ఎస్‌పీలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. ఈ బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. వీరికి తోడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 300 మంది సివిల్, 70 ప్లటూన్ల సాయుధ బలగాలను రంగంలోకి దింపుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. ‘డిసెంబర్ 6’ నేపథ్యంలో నగరానికి చెందిన ఓ సంస్థ ప్రతిఏటా ర్యాలీకి ప్రయత్నిస్తుంటుంది. ఈసారి కూడా పోలీసులు దీనికి అనుమతి ఇవ్వలేదు. సున్నిత, అనుమానిత ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెట్టడానికి పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరించారు. గతంలో తీవ్ర పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడటానికి షాడో టీమ్‌లను ఏర్పాటు చేశారు. క్విక్ రియాక్షన్ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్ల ద్వారా వాహనాలను సోదా చేయనున్నారు. పాతబస్తీతో పాటు శివార్లలోని ప్రాంతాల్లో అణువణువూ నిఘాలో ఉంచారు. లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. పాతబస్తీతో పాటు పశ్చిమ మండలం, తూర్పు మండలాల్లోనూ అడుగడుగునా పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ప్రస్తు తం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా పక్కా బందోబస్తు ఏర్పా టు చేస్తున్నాం. ఉన్నతాధికారులందరూ అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా రు. పోలీసు రికార్డుల్లో ఉన్న కమ్యూనల్, కరుడుగట్టిన రౌడీ షీటర్లలో చాలామంది ఇప్పటికే జైళ్లల్లో ఉన్నారు. బయట ఉన్న వారిలో అవసరమనుకున్న వారిని బైండోవర్ చేస్తున్నాం’ అని తెలిపారు. -
హోదాపై నిరసనగా నేడు బిజిలీ బంద్
-
నేడు బిజిలీ బంద్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా మంగళవారం ‘బ్లాక్ డే (బిజిలీ బంద్)’గా పాటించాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఆరోజు రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా లైట్లు ఆర్పివేసి నిరసన తెలపాలని రాష్ట్ర ప్రజలకు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను, చేసిన చట్టాలను అమలు చేయాలని 4 ఏళ్లుగా కోరుతున్నా ఈ ప్రభుత్వాలు పట్టించుకోనందుకు నిరసనగా బ్లాక్ డేకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పక్షాలు ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్నా... మోదీకి అది చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే ఉందని పేర్కొన్నారు. నేడు బ్లాక్ డేకు సహకరించండిపార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ పిలుపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు మంగళవారం నిర్వహించనున్న బ్లాక్ డేకు సహకరించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో మంగళవారం రాత్రి 7 నుంచి 7.30 గంటల వరకు విద్యుత్ దీపాలను ఆర్పి బ్లాక్ డేగా పాటించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోదా సాధన సమితి, సీపీఎం, సీపీఐ నాయకులు పార్టీ నేతలను సంప్రదిస్తే వారికి సహకరించాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సోమవారం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించింది. స్థానిక వర్తక, వాణిజ్య సంఘాలను సంప్రదించడంతో పాటు ప్రజల్లోకి నేరుగా వెళ్లి బ్లాక్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మనవంతు పాత్ర పోషించాలని సూచించింది. -
చర్రితలో బ్లాక్ డే
సాక్షి, రాజమహేంద్రవరం: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో బ్లాక్డేలా నిలిచిపోతుందని వైఎస్సార్ సీపీ గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్ అభివర్ణించారు. పోలవరం, రాజధాని, విశాఖ రైల్వే జోన్ అంశాలకు కనీసం ప్రస్తావన కూడా లేదని మండిపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో గడిచిన నాలుగేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్న టీడీపీ సర్కారు ఏం సాధిం చిందో చెప్పాలన్నారు. శుక్రవారం ఆయన పార్టీ నేతలతో కలసి స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టం అంశాల అమలుకు ఒత్తిడి తెస్తేనే ఫలితం ఉం టుందని తమ పార్టీ చెబుతున్నా రాష్ట్ర సర్కారు పెడచెవిన పెట్టిందని దుయ్యబటారు. ప్రస్తుత బడ్జెట్ చూశాక ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే రాష్ట్రం తరఫున అడిగేందుకు ఎవరూ ఉండేవారు కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. రాష్ట్రానికి అన్యా యం చేస్తే తమ ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటామని చంద్రబాబు ఒత్తిడి తెచ్చి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదికాదన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు ఏడా ది ప్రాజెక్టుకు అవసరమైన రూ. 44 వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారని ప్రశ్నించారు. కేంద్రం నిర్మించి ఇవ్వాల్సిన జాతీయ ప్రాజెక్టును తా ము నిర్మిస్తామని ముడుపుల కోసం చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించారు. 11 విద్యాసంస్థలుకు ఎంగిలి మెతుకులు విదిల్చినట్టు నిధులు ఇ చ్చి వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం నగర కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి ఢిల్లీపై పోరాడిన ఎన్టీరామారావును కూలదోసి ఆ పార్టీని ఇప్పుడు సీఎం చంద్రబాబు తాకట్టు పెడుతున్నారన్నారు. నాలు గేళ్లు మిన్నుకుండి ఇప్పుడు తన అనుకూల పత్రికల్లో ఇదేంటని రాయించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల కోసం ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు గిరిజాల బాబు, మేడపాటి షర్మిలారెడ్డి, బొం తా శ్రీహరి, బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, మాజా రామజోగి, పెంకె సురేష్, యడ్లమహేష్, చిక్కాల బాబులు, పేట రామకృష్ణ, కాటం రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
బాబ్రీ విధ్వంసానికి పది కారణాలు
సాక్షి, న్యూఢిల్లీ : నేటికి సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం అంటే, 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన పరిస్థితులు, వైఫల్యాలు, బాధ్యులను పది అంకెల్లో పేర్కొనవచ్చు! 1. ఎల్కే అద్వానీ 1990, సెప్టెంబర్ 25 తేదీన భారతీయ జనతా పార్టీ ఎల్కే అద్వానీ చేపట్టిన రథయాత్ర బాబ్రీ మసీదు విధ్వంసానికి బీజం వేసింది. ఆయన రథ యాత్ర పలు రాష్ట్రాల్లో హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలను పెంచి అల్లర్లకు దారితీసింది. పైగా అద్వానీ బాబ్రీ మసీదు విధ్వంసం రోజున అక్కడే వేదికపై ఉన్నారు. ఆయన పక్కన పార్టీ సహచరులు మురళీ మనోహర్ జోషి, ఉమా భారతిలు ఉన్నారు. వారంతా బాబ్రీ విధ్వంసానికి కరసేవకులను ప్రోత్సహించారనే అభియోగాలు ఉన్నాయి. ఆ తర్వాత 1992, డిసెంబర్ 6వ తేదీన తన జీవితంలో అత్యంత చీకటి రోజని అద్వానీ బాధను వ్యక్తం చేశారు. ఆ బాధ నిజంగా కలిగిందా, ఆత్మవంచనా ? ఆయనకే తెలియాలి. 2. ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్, బజరంగ్ దళ్ ఈ సంఘాలు హిందూ, ముస్లింలు, క్రైస్తవుల మధ్య వైషమ్యాలనే సష్టించడమే కాకుండా బాబ్రీ మసీదు విధ్వంసానికి కార్యకర్తలను తరలించాయి. సాధ్వీ రిదంబర లాంటి వారు వారిలో మరింత ఆజ్యం పోశారు. ‘కహో గర్వ్‌సే హమ్ హిందూ హై, హిందుస్థాన్ హమారా హై, జో హమ్సే టక్రాయేగా, వో కుత్తేకి మౌత్ యహాపర్ దేకో మారా జాయేగా, జహా బనీ హై మసీద్, అప్నా మందిర్ వహీ బనాయింగే. బాబర్ కే హౌలాదోం, జావో పాకిస్థాన్, యా కబరిస్థాన్’ అంటూ ఆమె రెచ్చగొట్టారు. 3. పీవీ నర్సింహారావు అప్పుడు ప్రధాన మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు బాబ్రీ మసీదును రక్షించేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉండగా, అలా చేయలేదు. జన నష్టం ఎక్కువ జరుగుతుందంటూ సాకు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ తనకిచ్చిన మాట తప్పారంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. రామ మందిరాన్ని కోరుకుంటున్న కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు విధ్వంసం కాకుండా అడ్డుకుంటారని అనుకున్నాననడం అర్థరహితం. 1984లో ఢిల్లీలో సిక్కుల అల్లర్లు చెలరేగినప్పుడు కూడా వాటిని నిరోధించడంలో పీవీ విఫలం అయ్యారు. 4. కళ్యాణ్ సింగ్ ఆయన బాబ్రీ మసీదును విధ్వంసం నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన తన బీజేపీ పార్టీతోపాటు తాను మసీదు విధ్వంసాన్ని కోరుకున్నారు. శక్తివంచన లేకుండా మసీదును పరిరక్షించేందుకు ప్రయత్నించానని చెప్పుకున్నారు. 5. శివసేన బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ముంబైలో చెలరేగిన అల్లర్లకు శివసేనదే బాధ్యత. ఆ పార్టీ నాయకుడు తన పత్రిక ‘సామ్నా’ద్వారా అల్లర్లను ప్రేరేపించారు. నాటి అల్లర్లలో వందలాది మంది మరణించారు. శ్రీకష్ణ కమిషన్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. 6. పోలీసులు, భద్రతా దళాల వైఫల్యం అయోధ్యలో బాబ్రీ మసీదు వద్ద భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా బలగాలు కరసేవకులకు భయపడి పారిపోయారు. ముంబైలో హిందూ మూకలు అల్లర్లకు పాల్పడుతుంటే కూడా మౌన ప్రేక్షకుల్లా ఉండిపోయారు. 7. కాంగ్రెస్ పార్టీ 1992, 1993లలో ఇటు కేంద్రంలో, అటు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీదును రక్షించడంలో, ముంబై అల్లర్లను నిరోధించడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వం అల్లర్లపై శ్రీకష్ణ కమిషన్‌ను వేసింది. ఆ కమిషన్ నివేదికపై కఠన చర్యలు తీసుకుంటానని ఎన్నికల మేనిఫెస్టోలో పదేపదే హామీ ఇచ్చి కూడా ఎన్నడూ ఎలాంటి చర్య తీసుకోలేదు. 8. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త విజ్ఞానం ప్రాతిపదికన వ్యవహరించాల్సిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా హిందూత్వ ఎజెండాకే మద్దతు పలికింది. పుక్కిటి పురాణాల్లో ఉన్న సరస్వతి నదికి, సింధూ నాగరికతకు లింకు ఉందని చెప్పింది. పెద్దగా తవ్వకాలు జరపకుండానే బాబ్రీ మసీదు కింద రామాలయం ఉందని తేల్చింది. 9. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ బాబ్రీ మసీదు విధ్వంసంపై 1992లోనే దర్యాప్తునకు లిబర్హాన్ కమిషన్‌ను వేశారు. అది 17 సంవత్సరాల తర్వాత, అంటే 2009లో నివేదికను సమర్పించింది. ఇంతటి ఆలస్యానికి అర్థం ఏమైనా ఉందా? 1993, అక్టోబర్‌లో సీబీఐ అద్వానీ, మురళీ మనోహర్, ఉమా భారతి సహా 21 మంది నిందితులపై బాబ్రీ విధ్వంసం కుట్రకేసును నమోదు చేసింది. ఈ కేసును సాంకేతిక కారణాలను చూపిస్తూ 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఈ కేసును 2017లో సుప్రీం కోర్టు పునరుద్ధరించింది. 21 మంది నిందితుల్లో ఇప్పటికే 8 మంది నిందితులు మరణించారు. 10. సుప్రీం కోర్టు బాబ్రీ విధ్వంసం కేసుకన్నా బాబ్రీ మసీదు వివాదం ఎన్నో ఏళ్లుగా అంటే, దాదాపు ఏడు దశాబ్దాలుగా సుప్రీం కోర్టులో నలుగుతోంది. ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలంటూ సూచించడం తప్పా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. భూ వివాదానికి సంబంధించిన ఈ కేసు తుది విచారణను మళ్లీ ఫిబ్రవరికి వాయిదా వేసింది. -
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం
ఒంగోలు అర్బన్: విజయవాడలోని భవానీ ద్వీపం వద్ద కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్‌పై మంగళవారం కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించి మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బోటు ప్రమాదం జరిగిన నవంబర్ 12వ తేదీని ఒంగోలు చరిత్రలో బ్లాక్‌డేగా అభివర్ణించారు. బోటు ప్రమాదం విషయం తెలియగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. ఒక్కో ఇంటిలో ఇద్దరు మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. రంగారాయుడు చెరువుకట్టపై మృతుల స్మృతి స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్న వాకర్స్ క్లబ్ సభ్యుల ఆలోచనతో వాకర్స్‌లో ఎంతటి అన్యోన్యత ఉందో అర్థమవుతోందన్నారు. స్థూపానికి వాకర్స్ క్లబ్ ఎంత విరాళం సేకరిస్తుందో అంత మొత్తాన్నీ ఇస్తానన్నారు. అంతేగాకుండా అనుమతుల విషయంలో పూర్తి సహకారం అందిస్తానన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునే విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఎంపీ వైవీ వెంట మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొని మృతులకు నివాళులర్పించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజూ కలిసి అడుగులు కలిపే మిత్రులు ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అందుకే వారి జ్ఞాపకార్థం స్థూపాన్ని నిర్మించాలని తలచామన్నారు. ఈ విషయం ప్రకటించగానే వాకర్స్ నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికే 80 వేల రూపాయల విరాళాలు అందాయన్నారు. ఎంపీ వైవీ వాకర్స్ కుటుంబానికి అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు దేసు కాశి, మాంటిస్సోరీ ప్రకాష్, రాఘవ, టి.రంగారావు, కొటారి రామచంద్రరావు, వేమూరి బుజ్జి, వైఎస్సార్ సీపీ నాయకులు కేవీ రమణారెడ్డి, చుండూరి రవి, అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, వై.వెంకటేశ్వర్లు, గొర్రెపాటి శ్రీను, గంగాడ సుజాత, అరుణ, గంటా రామానాయుడు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశవ్యాప్తంగా బ్లాక్ డే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేసి.. సరికొత్త మార్పులకు నాంది పలికిన నోట్లరద్దు నిర్ణయానికి బుధవారం ఏడాది నిండిన సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ‘చీకటిదినం’ పేరుతో ఆందోళనలు నిర్వహించాయి. అధికార బీజేపీ నల్లధన వ్యతిరేక దినోత్సవం పేరుతో సంబరాలు జరిపింది. నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు డిమానిటైజేషన్‌ను చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నోట్లరద్దు నిర్ణయంతో తమ వద్ద ఉన్న పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని విపక్ష నాయకులు ఆరోపించారు. ఇప్పటికీ కష్టాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌తోపాటు లెఫ్ట్ తదితర విపక్ష పార్టీలు బ్లాక్‌డేలో పాల్గొని ఆందోళనలకు దిగాయి. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ భారీ మారథాన్ నిర్వహించింది. నల్లదుస్తులు ధరించి కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఈ రన్లో పాల్గొని.. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కశ్మీర్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు చోట్ల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. వామపక్షాలు, ఇతర సామాజిక సంఘాలూ ఆందోళనల్లో పాలుపంచుకున్నాయి. మిఠాయిలు పంచిన బీజేపీ నాయకులు విపక్షాల బ్లాక్ డేకు వ్యతిరేకంగా బీజేపీ బుధవారం అన్ని రాష్ట్రాల్లో నల్లధన వ్యతిరేక దినాన్ని జరిపింది. పలు చోట్ల జరిగిన కార్యక్రమాలు మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ రాజధానిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. నోట్లరద్దుతో ఉగ్రవాదం, అవినీతి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ శ్రేణులు ఉత్తరప్రదేశ్‌లో పెద్దనోట్ల రద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు నిర్వహించాయి. మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో మోదీ ఫొటోకు స్వీట్లు తినిపిస్తూ.. కొత్త నోట్లను ప్రదర్శిస్తూ.. బీజేపీ నేతలు ’డిమానిటైజేషన్’ సంబరాలు నిర్వహించారు. నోట్లను రద్దు చేయడం వల్ల ఉగ్రవాదం వెన్ను విరిగిందని, కశ్మీర్లో రాళ్లు విసిరే ఘటనలు తగ్గాయని బీజేపీ నాయకులు అన్నారు. నల్లధనంపై యుద్ధం.. 125 కోట్ల మంది విజయం : ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దు నల్లధనంపై చేపట్టిన యుద్ధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా 125 కోట్ల మంది భారత ప్రజలు నిర్ణయాత్మక యుద్ధం చేసి.. గెలిచారు. నల్లధనాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను సమర్థించిన ప్రతి భారతీయుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని ప్రధాని బుధవారం మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దుతో చేకూరిన ప్రయోజనాలను ఓ లఘుచిత్రం రూపంలో తీసుకొచ్చారు. ఈ వీడియోను ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. పెద్దనోట్ల రద్దుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కనిపించాయని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదొక మహావిషాదం : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ మరోసారి మండిపడ్డారు. నోట్లరద్దు పూర్తిగా అనాలోచిత నిర్ణయమని స్పష్టం చేస్తూ ‘విషాదం’ అనే మాటకు ఏమాత్రం తక్కువ కాదని వ్యాఖ్యానించారు. ట్విటర్ వేదికగా ఆయన బుధవారం స్పందిస్తూ... ‘నోట్ల రద్దు ఓ విషాదం. ప్రధాని తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా జీవితాలు, జీవనోపాధి కోల్పోయిన కోట్లాదిమంది నిజాయతీపరులైన భారతీయులకు మేము అండగా ఉంటాం’ అని సందేశం పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక హిందీ పద్యాన్ని కూడా ఉటంకించారు. ‘ఒక్క కన్నీటి బొట్టు కూడా ప్రభుత్వానికి ప్రమాదకరమే. అయితే మీరు ఇంతటి కన్నీటి సముద్రాన్ని చూసి ఉండరు...’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనికి ఆయన జతచేసిన ఓ వయోధికుడి ఫోటో కంటతడి పెట్టించేలా ఉంది. డబ్బు చేతికి అందక ఏటీఎం ముందు నిలబడి విలపిస్తున్న ఈ దృశ్యం నెటిజన్లను కదిలిస్తోంది. సంక్షిప్తంగా.. నోట్లరద్దు కారణంగా అనేక మంది తమ జీవితాలను, ఉద్యోగాలను కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. ప్రస్తుతం రూ. 15 లక్షల కోట్లు నగదు చలామణీలో ఉందని, త్వరలో అది రూ. 17 లక్షల కోట్లకు చేరుకుంటుందని అన్నారు. కృత్రిమంగా నగదు కొరత సృష్టించడం వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందన్నారు. తమిళనాడువ్యాప్తంగా విపక్ష పార్టీ డీఎంకే బ్లాక్ డే కార్యక్రమాల్లో పాల్గొంది. నోట్లరద్దు సామాన్యుడికి కష్టాలు మినహా ఏమీ మిగల్చలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. బ్యాంకు క్యూల్లో నిలబడి ఎంతో మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుత ప్రభుత్వ తప్పుడు విధానాలు ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశాయన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బీజేపీ మిత్రులే లబ్ధి పొందారన్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రజలకేమీ మేలు జరగలేదని స్టాలిన్ స్పష్టం చేశారు. పాట్నాలో జరిగిన బ్లాక్ డే ఆందోళనల్లో పాల్గొన్న ఆర్జేడీ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నోట్లరద్దు వల్ల సంపన్నులు సులువుగా తమ నల్లధనాన్ని తెలుపుగా మార్చుకున్నారని ఆరోపించారు. బిహార్ వ్యాప్తంగా ఆర్జేడీ ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించింది. నోట్లరద్దు తొందరపాటు, అపరిపక్వ నిర్ణయమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. దీనివల్ల కోట్ల మంది భారతీయులు ఇబ్బందిపడ్డారని చెప్పారు. ఇప్పటికీ ఇబ్బందులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ వద్దే నల్లదనం అధికంగా ఉందనే విషయం ప్యారడైజ్ పత్రాల ద్వారా వెల్లడయిందన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజధాని ముంబైలో జరిగిన బ్లాక్ డేలో పాల్గొన్న మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నోట్లరద్దుపై పార్లమెంటరీ సంయుక్త సంఘంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మిత్రపక్షం కూడా అయిన శివసేన అధికార పార్టీకి కర్మకాండలు నిర్వహించింది.ఎన్సీపీ నాయకులు పుణేలో బ్లాక్ డే నిర్వహించారు. పార్టీ అధిపతి శరద్ పవార్ సహా కీలక నేతలు పలువురు ఆందోళనల్లో పాల్గొన్నారు. -
అదొక మహా విషాదం
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనేది ఒక మతిలేని చర్య అని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఏడాది కిందట ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ చర్య దేశంలో మహా విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. దేశంలోని లక్షలాది నిజాయితీపరుల జీవితాలను నోట్లరద్దు విషాదంలో ముంచిందని ఆయన అన్నారు. కోట్లాది భారతీయులను డిమానిటైజేషన్ నిర్ణయం ఇబ్బందుల్లోకి, బాధల్లోకి నెట్టిందని ఆయన అన్నారు. అత్యంత వేగంగా దూసుకు పోతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఈ నిర్ణయం ఆగాథంలోకి నెట్టిందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నోట్ల మార్పిడి కోసం నిలుచున్నవారు.. క్యూ లైన్లోనే మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన గుర్తు చేశారు. డిమానిటైజేషన్ అనేది భారతీయుల నిజాయితీని పరీక్షించడమేనని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు చర్యను కాంగ్రెస్ పార్టీ బ్లాక్ డేగా పాటిస్తుందని ఆయన చెప్పారు. Demonetisation is a tragedy. We stand with millions of honest Indians, whose lives & livelihoods were destroyed by PM’s thoughtless act. — Office of RG (@OfficeOfRG) 8 November 2017 "एक आँसू भी हुकूमत के लिए ख़तरा है तुमने देखा नहीं आँखों का समुंदर होना" pic.twitter.com/r9NuCkmO6t — Office of RG (@OfficeOfRG) 8 November 2017 -
నేడు బ్లాక్ డే
కామారెడ్డి క్రైం: నోట్ల రద్దు కారణంగా యేడాదికాలం పాటు దేశ ప్రజలకు కలిగిన కష్టాలకు నిరసనగా నోట్ల రద్దు చేసిన నవంబర్ 8వ తేదీని బ్లాక్ డేగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందన్ అన్నారు. కామారెడ్డిలోని కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ బుధవారం నిజామాబాద్‌లోని కాంగ్రెస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి మహాత్మాగాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటామన్నారు. మహాత్మానికి నివేదిక సమర్పిస్తామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, నాయకులు నల్లమడుగు సురేందర్, కారంగుల అశోక్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, గోనె శ్రీనివాస్, తిర్మల్‌రెడ్డి, ఐరేని నర్సయ్య, ఇసాక్‌షేరూ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
8న బ్లాక్‌డేగా పాటించాలి
ఒంగోలు టౌన్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీని బ్లాక్‌డేగా పాటించాలని సీపీఎం, సీపీఐ ఉమ్మడి సమావేశం నిర్ణయించింది. జిల్లాలోని తాలూకా, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, సభలు జరపాలని నిర్ణయించింది. శనివారం స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ మాట్లాడారు. గతేడాది నవంబర్ 8వ తేదీ చలామణిలో ఉన్న 17 లక్షల 97 వేల కోట్ల రూపాయల 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశారన్నారు. నల్లధనాన్ని పట్టుకోవడం కోసం, అవినీతిని అంతం చేయడం కోసం, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, నకిలీ కరెన్సీని దెబ్బతీసే లక్ష్యాలతో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి సంవత్సరం గడిచిపోయినా నరేంద్రమోదీ ప్రకటించిన లక్ష్యాలు ఒక్కటీ నెరవేరకపోగా అవినీతి, ఉగ్రవాదం పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. నల్లధనం పట్టుకోలేదన్నారు. కొత్త నకిలీ కరెన్సీ చెలామణి అవుతోందని విమర్శించారు. నోట్ల రద్దు దుష్ఫలితాలను మాత్రం ప్రజలు అనుభవిన్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దెబ్బతినడంతో పాటు చిన్న పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. ఉత్పత్తి రంగం కుదేలై ఉపాధి పడిపోయిందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అత్యధిక లాభాలు వచ్చిన సంవత్సరంగా ఈ సంవత్సరం నమోదైందన్నారు. ఆన్లైన్ వ్యాపారాన్ని పెంచి రిటైల్ రంగాన్ని దెబ్బతీసి పెద్ద మాల్స్‌కు ఉపయోగపడేలా నరేంద్రమోదీ వ్యవహరించారని విమర్శించారు. నోట్ల రద్దు దుష్ఫలితాలతో దేశవ్యాప్తంగా ప్రజల్లో నిరసన పెల్లుబికిందని చెప్పారు. సుప్రీంకోర్టు సైతం నోట్ల రద్దు నల్ల కుబేరులపై సర్జికల్ దాడుల్లా ఉండాలిగానీ, ప్రజలపై కార్పెట్ బాంబులా ఉండకూడదని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. వామపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీపీఎం రాష్ట్ర నాయకుడు జాలా అంజయ్య, నగర కార్యదర్శి జీవీ కొండారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి పాల్గొన్నారు. -
‘నోట్ల రద్దు’ పై విమర్శలకు బీజేపీ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దును పలికిమాలిన చర్యగా అభివర్ణిస్తూ, నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నవంబర్ 8ని ‘బ్లాక్ డే’గా ప్రకటించిన విపక్షాలకు.. అధికార బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. నవంబర్ 8న ‘యాంటీ బ్లాక్‌మనీడే’గా జరపాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. నోట్ల రద్దుతో పేదలకు మంచి : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో నల్లధనాన్ని, అవినీతిని అంతం చేశామని, తద్వారా దేశంలోని పేదలకు మేలు చేకూరిందని మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నల్లధనాన్ని ఎందుకు వెలికితీయలేకపోయిందని ప్రశ్నించారు. తాము చేసిన మంచి పనులేవీ కాంగ్రెస్‌కు నచ్చవని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరగనున్న ‘యాంటీ బ్లాక్‌మనీ డే’ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని జైట్లీ కోరారు. అదొక చీకటి దినం : పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన చేసిన నవంబర్ 8.. దేశానికి చీకటి దినమని విపక్షాల కూటమి అభిప్రాయపడింది. ఆ రోజును చీకటి దినం(బ్లాక్ డే)గా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, ఎస్పీ సహా 18 విపక్ష పార్టీలు ఇదివరకే ప్రకటించాయి. రాజధాని ఢిల్లీతోపాటు అన్ని ప్రాంతాల్లో ఆందోళనలకు సమాయత్తం కావాలని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పోటాపోటీ : నవంబర్ 8న అధికార, విపక్షాలు పరస్పర వ్యతిరేక నినాదాలతో నిరసనలకు పిలుపునియ్యడంతో శాంతిభద్రతల అంశం చర్చనీయాంశమైంది. ఇరు పక్షాలూ ప్రజాస్వామిక స్ఫూర్తితో వ్యవహరిస్తే తప్ప, ఉద్రిక్తతలను నివారించలేని పరిస్థితి. దీనిపై ఢిల్లీ సహా ఆయా రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు స్పందించాల్సిఉంది. -
పాకిస్తాన్లో బ్లాక్ డే నిరసనలు
ముజఫరాబాద్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్) : పాకిస్తాన్లో పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బల్టిస్తాన్, ముజఫరాబాద్, రావల్కోట్, కోట్లీ తదితర ప్రాంతాల్లోని ప్రజలు ఆదివారం బ్లాక్ డే పాటించారు. పలు ప్రాంతాల్లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. తమకు స్వతంత్రం కావాలని.. స్వేచ్ఛగా బతకాలని అభిలషిస్తున్నట్లు ప్రజలు స్పష్టం చేశారు. బ్రిటీష్ ప్రభుత్వం దేశ విభజన చేసి.. స్వతంత్రం ఇచ్చాక జమ్మూ కశ్మీర్ రాజ్యం అప్పటి రాజు స్వతంత్ర ఏలుబడిలో ఉంది. ఆ సమయంలో పాకిస్తాన్ సరిగ్గా 70 ఏళ్ల కిందట ఇదే రోజు (1947 అక్టోబర్22)న పాకిస్తాన్ కశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఆ ప్రాంత ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్టోబర్ 22న బ్లాక్ డే నిర్వహిస్తున్నారు. రావల్కోట్లో పెద్ద ఎత్తున ప్రజలు బ్లాక్ డేలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం తక్షణం ఆక్రమిత కశ్మీర్ నుంచి వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇదే విధంగా కోట్లీ, హాజీరా ప్రాంతాల్లోనూ ప్రజలు నిరసనలు నిర్వహించారు. ముజుఫరాబాద్లోని నీలం బ్రిడ్జి దగ్గర నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు.. పాక్ సైన్యం తమపై చేస్తున్న అకృత్యాలను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని కోరారు. ఆ ఘటన మర్చిపోలేం ఆక్రమిత కశ్మీర్‌కు స్వతంత్రం కావాలని పోరాటం చేస్తున్న జమ్మూ కశ్మీర్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్(జేకేఎన్ఎస్ఎఫ్) నాయకుడు నాబీల్ ముఘల్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల కిందట రాత్రి నిద్రిస్తున్న గిరిజనులపై పాక్ సైన్యం చేసిన అకృత్యాలను ఎన్నటికీ మర్చిపోలేమని చెప్పారు. చైనా సహకారంతో నిర్మిస్తున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌ను తక్షణమే నిలపాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాక్ సైన్యం, ప్రభుత్వం మమ్మల్ని లూఠీ చేస్తోందని జమ్మూ కశ్మీర్ నేషనల్ ఇండిపెండెన్స్ అలయెన్స్ ఛైర్మన్ సర్దార్ మహమూద్ కశ్మీరీ స్పష్టం చేశారు. ఆజాద్ కశ్మీర్‌కు ప్రధాని, అధ్యక్షుడు ఉన్నా.. పాలన మాత్రం ఇస్లామాబాద్ నుంచే సాగుతోందని.. దీనిని వ్యతిరేకిస్తున్నట్లు నిరసనకారులు తెలిపారు. -
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
► నడివీధిలో రాజ్యాంగం ఖూనీ ► టీడీపీలో సమర్థులు లేకే ఫిరాయింపుదారులకు అందలం ► నీచ రాజకీయాల చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగలడం ఖాయం ► ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజం ► అంబేడ్కర్ విగ్రహా కళ్లకు గంతలు కట్టి నిరసన తిరుపతి రూరల్: చంద్రబాబు ప్రభుత్వం రాజ్యాంగాన్ని నడివీధిలో ఖూనీ చేసిందని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మె ల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎస్వీ యూనివర్సిటీ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. అంబేడ్కర్ కళ్లకు నల్లగుడ్డలతో గంతలు కట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. చెవిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పచ్చి అవకాశవాది అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశారని, టీడీపీలో సమర్థులు లేకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అందలం ఎక్కిం చారని మండిపడ్డారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో చీకటిరోజు అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోవటం ఖాయమని పేర్కొన్నారు. రాస్తారోకో..అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు తిరుపతి–చిత్తూరు రహదారిపై రాస్తారోకో చేపట్టాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎస్వీయూ సీఐ శ్రీని వాసులు సిబ్బందితో వచ్చి ఎమ్మెల్యే చెవిరెడ్డిని, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా పార్టీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఎస్వీయూ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అ«ధ్యక్షుడు దామినేటి కేశవులు, పార్టీ మండలాధ్యక్షుడు మూలం బాబు, మాధవరెడ్డి, మస్తాన్, మల్లారపు వెంకటరమణ, హరినా«థ్, చిన్నియాదవ్, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, జోగి మోహన్, గోపి, యుగంధర్‌రెడ్డి, అజయ్‌కుమార్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, మునస్వామియాదవ్, భాస్కర్‌రెడ్డి, ఒంటేల శివ, భానుకుమార్‌రెడ్డి, పాల్గొన్నారు. గవర్నర్ తీరు సిగ్గుచేటు స్వార్థరాజకీయాల కోసం పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణం చేయించిన గవర్నర్ నరసింహన్ తీరు దారుణమని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ తీరు సిగ్గుచేటన్నారు. గవర్నర్ పదవికే మచ్చ తెచ్చిన నరసింహన్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కుర్చీలో జీయర్ను కూర్చోబెడతారా?
ప్రగతిభవన్ ప్రారంభరోజు రాష్ట్రానికి బ్లాక్ డే: రేవంత్ కరీంనగర్: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛకు అడ్డుపడిన చిన్నజీయర్‌స్వామిని ప్రగతిభవన్ కుర్చీలో కూర్చోబెట్టి అమరవీరుల ఆత్మ ఘోషించేలా చేసిన సీఎం కేసీఆర్‌ను గన్‌ఫౌండ్రీ వద్ద ఉరితీసినా పాపం లేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధ వారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన టీడీపీ కన్వీనర్లు సీహెచ్.విజయరమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, అన్నమనేని నర్సింగరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉద్యమానికి, రాష్ట్రం సిద్ధిం చడానికి వేదికగా మారిన కరీంనగర్ నుంచే కేసీఆర్ పత నానికి శ్రీకారం చుడుతామన్నారు. ఉద్యమం జరిగి నప్పుడు చిన్నజీయర్‌స్వామి ఏనాడూ తెలంగాణ ఇవ్వా లని మాట్లాడలేదని, అలాంటి వ్యక్తిని అధికార కుర్చీలో ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. నవంబర్ 24 ముమ్మాటికీ బ్లాక్‌డే అవుతుందన్నారు. రాష్ట్రం కోసం 1,569 మంది అమరులైతే 498 కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణ ద్రోహులు తుమ్మల, తలసాని చెప్పుచేతల్లో నడుచుకుంటున్నాడని విమర్శిం చారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు 89 మంది జర్నలిస్టులు ఆరోగ్య సేవలందక అసువులు బాసారని, రుణమాఫీ అందక 2,700 మంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 9 నుంచి టీడీపీ విద్యార్థి పోరు యాత్ర టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 9 నుంచి జనవరి 26 వరకు విద్యార్థిపోరును కొనసాగిస్తామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాలను సందర్శించి, విద్యార్థులను చైతన్యవంతులను చేస్తామన్నారు. -
మాదన్నపేటలో భారీ బందోబస్తు
చంచల్‌గూడ: బాబ్రీ మసీదు కూల్చివేత దినం కావడంతో మంగళవారం మానద్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాసలు పర్యవేక్షణలో మాదన్నపేట ఇన్స్పెక్టర్ కలింగ్ పీటర్ వత్సల రాజు ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. ఈ బందోబస్తులో 2 కంపెనీ ప్లాటూన్లు, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్‌లు, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు. -
భువనగిరిలో ‘బ్లాక్‌డే’ ర్యాలీ
భువనగిరి: బ్లాక్ డే సందర్భంగా మంగళవారం భువనగిరిలో ముస్లింలు ర్యాలీ చేపట్టారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి రైతు బజార్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో ముస్లిం సంస్థలు డిసెంబర్ 6 ను బ్లాక్‌డేగా పాటిస్తున్న విషయం విదితమే. -
దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక సాయిబాబా ఆలయంలో సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సరూర్‌నగర్ పోలీసులు, బాంబుస్క్వాడ్ సిబ్బందితో పాటు ఆలయ పరిసరాల్లో సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు వాహనాలను కూడా విస్త్రతంగా తనిఖీలు చేశారు. బ్లాక్‌డే నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా సోదాలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. -
బ్లాక్ డే అలర్ట్
► నిఘా కట్టుదిట్టం ►తనిఖీలు ముమ్మరం ► ఉగ్రవాదుల ఇళ్లల్లో ►ఎన్ఐఏ తనిఖీలు సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన బ్లాక్ డేను పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారంలేని విధంగా నిఘాతో వ్యవహరించే పనిలో పడ్డారు. రైల్వేస్టేషన్లలో నిఘాను మరింతగా కట్టుదిట్టం చేశారు. ఇక, గత వారం మధురైలో పట్టుబడిన ఉగ్రవాదుల ఇళ్లల్లో ఎన్ఐఏ వర్గాలు తనిఖీల్లో పడ్డారుు. బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6ను బ్లాక్ డేగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఈ రోజు వస్తుందంటే టెన్షన్ తప్పదు. ఆ రోజు గడిస్తే చాలు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అరుుతే, ఈ ఏడాది రాష్ట్రంలో చాప కింద నీరులా సాగుతూ వస్తున్న ఉగ్రవాదుల కార్యకలాపాలు ఓ వైపు, అల్‌ఖైదా మద్దతు ది బేస్ మూమెంట్ కార్యకలాపాలు మరో వైపు వెలుగులోకి రావడంతో ఉత్కంఠ తప్పలేదు. మదురై కేంద్రంగా సాగుతున్న ఆ సంస్థకు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నారు. ఈ సంస్థ వైపుగా మరెందరో యువత ఆకర్షితులై ఉండొచ్చన్న అనుమానాలతో దర్యాప్తు వేగం పెరిగింది. శని, ఆదివారాల్లో మదురైలోని ఆయా ఉగ్రవాదుల ఇళ్లల్లో తనిఖీలు ముమ్మరంగా సాగడం ఆలోచించాల్సిందే. ఎన్ఐఏ ఎస్పీలు ప్రతిభా అంబేడ్కర్, రాహుల్ నేతృత్వంలో 20 మందితో కూడిన ఎన్ఐఏ వర్గాలు తనీఖీలు సాగించి, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అందులోని నంబర్ల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. ఈ సమయంలో బ్లాక్‌డే వస్తుండడంతో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యారుు. తనిఖీలు - భద్రత: రైల్వేస్టేషన్లు, బస్సుస్టేషన్లు, విమానాశ్రయాల్లో, ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ పోలీసు, సాయుధ రిజర్వు పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద భద్రతా విషయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. లాడ్జీలు, హోటళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ, విద్రోహక సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ భద్రతతో ముందుకు సాగుతున్నారు. చెన్నై మహానగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటుగా తనిఖీలు వేగవంతం చేశారు. శనివారం రాత్రి జరిపిన వాహనాల తనిఖీల్లో 1,967 మంది పట్టుబడ్డారు. వీరిలో కొందరిని విచారణ అనంతరం పంపింవేశారు. ఇక, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, సెంట్రల్, ఎగ్మూర్ రైల్వేస్టేషన్లలో, కోయంబేడు బస్టాండులో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నారు. అలాగే రైళ్లలో తరలిస్తున్న, ఇక్కడికి వస్తున్న పార్శిళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సముద్ర తీరాల్లోనూ గస్తీ పెంచారు. -
తిరుపతిని జల్లెడ పడుతున్న పోలీసులు
-
తిరుపతిని జల్లెడ పడుతున్న పోలీసులు
తిరుపతి నగరంలో ఆదివారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బ్లాక్‌డే(డిసెంబర్ 6), నక్సల్స్ వారోత్సవాలు, తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో రక్షణ చర్యలు పటిష్టం చేశారు. సత్యనారపురం, జీవకోన, కొర్లగుంట, నవోదయకాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. ఎలాంటి ఐడెంటిటీ కార్డులు లేని వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. ఈ తనిఖీల్లో డీఐజీ సత్యనారాయణ, జిల్లా అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి లు స్వయంగా పాల్గొన్నారు. -
'డిసెంబర్ 6'కు భారీ బందోబస్తు
హైదరాబాద్: బాబ్రీ మసీద్ కూల్చివేతకు గురైన డిసెంబర్ 6న.. వివిధ వర్గాలు ఏటా నిర్వహించే బ్లాక్ డే, విజయ్ దివస్‌ల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. ఈ మేరకు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడికూడా మొదలుకావడంతో రాజకీయ పార్టీలు డిసెంబర్ 6ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉన్నందున పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ కొందరు బ్లాక్ డేకు సిద్ధమవుతుండగా... విజయ్ దివస్ కోసం మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా దక్షిణ మండలం పోలీసులు ఎవరికీ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదు. బందోబస్తు కోసం పోలీస్ సిబ్బందితో పాటు ఆర్ముడ్ రిజర్వుడ్ ఫోర్స్, కమాండో టీమ్స్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌లను పెద్ద సంఖ్యలో వినియోగించుకోనున్నారు. చార్మినార్ సందర్శకులకూ.. బ్లాక్ డే నేపథ్యంలో పాతనగరం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. చార్మినార్ ను సందర్శించే పర్యాటకులను సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. పర్యాటకులు తమ వెంట తెచ్చుకున్న బ్యాగులు ఇతర వస్తువులను చార్మినార్ పైకి అనుమతించడం లేదు. బ్యాగులను తనిఖీ చేసి వాటన్నింటిని ప్రధాన గేటు వద్దే ఉంచుతున్నారు. 144 సెక్షన్ అమలు... ఈ నెల 6వ తేదీన పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున నలుగురి కంటే ఎక్కువగా గుమికూడ రాదని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే నిర్ధేశిత ప్రార్థనలు, పూజలు యధావిధిగా కొనసాగించుకోవచ్చు నన్నారు. అపరిచిత వ్యక్తులు తారసపడితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. రౌడీషీటర్లపై నిఘా దక్షిణ మండలంలో ఇప్పటికే నమోదైన పేరు మోసిన రౌడీషీటర్లపై నిఘా పెంచారు. ఇటీవల సత్ప్రవర్తన గల రౌడీలపై నమోదైన రౌడీషీట్లను తొలగించినప్పటికీ, వారిని కూడా ఓ కంట కనిపెడుతున్నారు పోలీసులు. అనుమానాస్పద స్థితిలో సంచరించే వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
‘డిసెంబర్ 6’కు పోలీసుల ముందస్తు తనిఖీలు
నేరేడ్మెట్: డిసెంబర్ 6 బ్లాక్ డే, విజయ్ దివస్‌ల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలు డిసెంబర్ 6ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందన్న సమాచారంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. నేరేడ్మెట్ ప్రాంతంలో శుక్రవారం పోలీసులు బస్టాప్‌లు, రైల్వే స్టేషన్, దేవాలయాలు, రద్దీగా ఉండే ప్రాంతాలలో బాంబ్ స్వ్కాడ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి ప్రశ్నిస్తున్నారు. -
'22న సీమవాసులకు చీకటి దినం'
-
'22న సీమవాసులకు చీకటి దినం'
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్ధాలుగా అన్ని అంశాల్లో రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, మరోసారి దీనిని చంద్రబాబు కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని, లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు అబ్బసొత్తైనట్టు రాజధాని నిర్మాణానికి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అమరావతికి ఖర్చు చేస్తున్న రూ. వందలకోట్ల దుర్వినియోగంపై హైకోర్టులో 'పిల్' వేస్తామని తెలిపారు. అమరావతి శంకుస్థాపనకు ముహుర్తమైన 22వ తేదీని రాయలసీమ వాసులకు చీకటిదినంగా ఆయన అభివర్ణించారు. -
సీఎం కేసీఆర్‌పై జానారెడ్డి ఫైర్
-
'15 ను బ్లాక్‌డే గా జరుపుకోవాలి'
విశాఖ: స్వాతంత్ర్య దినోత్సవం ను బ్లాక్ డేగా జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం తీములబంద గ్రామంలో నల్లజెండాలను ఎగురవేశారు. శుక్రవారం గాలెకొండ ఏరియా కమిటీ పేరుతో గ్రామంలో నల్లజెండాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. -
'ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్ డే'
న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి ఈ రోజు బ్లాక్ డే అని సోనియా వ్యాఖ్యానించారు. సోమవారం లోక్‌సభ కార్యకలాపాలకు అడ్డుతగిలిన 25 మంది కాంగ్రెస్ ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. ఈ రోజు ఉదయం సోనియా గాంధీ మాట్లాడుతూ.. 'మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేసేదాకా మా నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం. సభ కొనసాగనివ్వబోము. మమ్మల్ని విమర్శించేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి.. సభలో మెజారిటీ ఉన్నంత మాత్రాన తప్పులు ఒప్పులైపోవు' అని విమర్శించారు. -
నేడు శాసనసభకు బ్లాక్ డే: వైఎస్ఆర్ కాంగ్రెస్
-
నేడు శాసనసభకు బ్లాక్ డే: వైఎస్ఆర్ కాంగ్రెస్
హైదరాబాద్: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసన సభ చరిత్రలో బ్లాక్ డే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, చాంద్ బాషా అన్నారు. సభలో ప్రభుత్వం ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకు స్పీకర్ వంత పాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంతో పాటు, స్పీకర్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సోమవారం ట్యాంక్‌బండ్‌పైన అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన హామీలపై నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం జగన్‌కు పదే పదే అడ్డుతగులుతున్నారని చెప్పారు. ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. సభ్యుల అంతు చూస్తామని బెదిరించడం అధికార పక్ష సభ్యుల రౌడీయిజాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహించడం సిగ్గు చేటని చెప్పారు. -
నిరసన హోరు
బాబ్రీ మసీదు కూల్చివేత దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో శనివారం నిరసనలు హోరెత్తాయి. బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం కాంక్షిస్తూ మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం లక్ష్యంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పోటాపోటీ ఆందోళనలు ఎక్కడ ఉద్రిక్తతను రేపుతాయోనన్న ఉత్కంఠ నడుమ పోలీసులు విధుల్ని నిర్వర్తించి చివరకు ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు అంటే పోలీసులకు హైటెన్షన్. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలు, అన్ని మతాలకు చెందిన ఆలయాల్ని తమ ఆధీనంలోకి తీసుకుని కట్టుదిట్టమైన భద్రతతో వ్యవహరించారు. తనిఖీలు ముమ్మరం చేసి అప్రమత్తంగా వ్యవహరించడంతో బ్లాక్ డే కేవలం నిరసనలతో గడిచింది. అయితే, హిందూ సంఘాలు ఈ సారి రామాలయం నిర్మాణం నినాదంతో ఆందోళనలకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. అనుమతులు లేకుండా నిరసనలు తెలియజేసిన హిందూ సంఘాల్ని పలు చోట్ల పోలీసులు అరెస్టు చేయడంతో బ్లాక్ డే ప్రశాంతగా గడిచింది. నల్లచొక్కాలతో...: బాబ్రీ మసీదు పున ర్నిర్మాణం, జాతీయ సమైక్యతను కాంక్షిస్తూ మైనారిటీ సంఘా లు, పార్టీలు నిరసనలతో హోరెత్తించాయి. తమిళనా డు ముస్లిం మున్నేట్ర కళగం, తమిళనాడు ముస్లిం లీగ్, తమిళనాడు తౌపిక్ జమాత్, మనిదనేయ మక్కల్ కట్చి, ఎస్డీపీఐ, ఐఎన్టీజే తదితర సం ఘాలు, పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి. నల్ల చొక్కాల్ని ధరించి తమ నిరసనల్ని తెలియజేశారు. చెన్నై నగంరలో నాలుగు చోట్ల నిరసనలు సాగాయి. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగం నేత అబూబక్కర్ నేతృత్వంలో జరిగిన నిరసనలో శ్రీలంక తమిళుల పరిరక్షణ కమిటీ నేత పల నెడుమారన్, మనిమారణ్ సైతం పాల్గొని తమ సంఘీభావం తెలియజేశారు. ఇదే వేదిక మీద చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతీయ సమైక్యతను, సర్వమత సామరస్యాన్ని చాటే విధంగా వస్త్రాల్ని ధరించి తమ ఐక్యతను చాటుకోవడం విశేషం. తమను ఎవ్వరూ విడదీయలేరని, తాము భారతీయులం, జాతీయ సమైక్యతకు పాటుపడుతామని నినదించారు. చెన్నైలో జరిగిన నిరసనలకు పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు సైతం తరలి వచ్చారు.రామాలయం లక్ష్యం: అయోధ్యలో రామాలయం నిర్మాణమే లక్ష్యంగా పిలుపునిస్తూ హిందూ సంఘా లు ఆందోళనకు దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, హిందూ మున్నని, విశ్వహిందూ పరిషత్‌ల నేతృత్వంలో నిరసనలు సాగాయి. రామాలయం నిర్మా ణం నినాదంతో ఫ్లకార్డులను చేత బట్టి ఆందోళనల కు దిగారు. పలు చోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టిన హిందూ సంఘాల్ని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలో ఎగ్మూర్, తాంబ రం, మాధవరంలలో ఈ నిరసనలు సాగాయి. ముందస్తు అనుమతులు లేకుండా నిరసనలు చేపట్టినందుకు గాను 200 మంది హిందూ సంఘాల నాయకుల్ని అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. -
బ్లాక్ డేకు భారీ బందోబస్తు
*జంట కమిషనరేట్లలో 144 సెక్షన్ *పాతబస్తీలో పోలీసు బలగాల మోహరింపు హైదరాబాద్ : బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన డిసెంబర్ ఆరో తేదీని బ్లాక్‌డేగా ప్రకటిస్తున్నట్లు ఎంఐఎం, ఎంబీటీ పార్టీలు పిలుపునివ్వగా బీజేపీ, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ నేతలు విజయ్ దివస్‌గా నిర్వహించాలని పిలుపునిచ్చాయి. రెండు కార్యక్రమాలూ ఇరు వర్గాల మనోభావాలకు సంబంధించిన అంశాలతో ముడి పడి ఉండటంతో జంట కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు పాతబస్తీలో దుకాణాలు మూసివేశారు. శనివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు. వ్యక్తులు, వస్తువులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు ఎం. మహేందర్‌రెడ్డి, సీవీ. ఆనంద్‌లు ప్రజలకు ఒక ప్రకటనలో సూచించారు. పాతబస్తీతోపాటు అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలు, గతంలో ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు తెలంగాణ స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను రంగంలోకి దింపారు. పోలీస్ స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు. పాతబస్తీలో సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ కమిషనర్ మహేందర్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డిలు పర్యటించి బందోబస్తును పర్యవేక్షించారు. పుకార్లను నమ్మొద్దు ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మొద్దు. ఎస్సెమ్మెస్, వాట్సాప్ తదితర ప్రచార సాధనాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫొటోలు పంపించొద్దు. పుకార్లు పుట్టించేవారి గురించి సమాచారం ఇవ్వండి. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు. -మహేందర్‌రెడ్డి శాంతియుతంగా జరపండి బ్లాక్ డేను శాంతియుతంగా జరుపుకోవాలి. బలవంతంగా ఎవరి దుకాణాలు మూయించొద్దు. ఘర్షణలకు తావులేకుండా ప్రార్థనలు మాత్రమే చేసుకోవాలి. శాంతియుతంగా బంద్, బ్లాక్‌డేను విజయవంతం చేయాలి. -ఎంఐఎం, ఎంబీటీ -
బ్లాక్‌డే అలర్ట్
* నిఘా కట్టుదిట్టం * రైల్వే స్టేషన్లలో భద్రత పెంపు * అటు బాబ్రీ కోసం.. ఇటు రామాలయం కోసం.. * పోటాపోటీనిరసనలకు పిలుపు సాక్షి, చెన్నై: బాబ్రీ మసీదు కూల్చి వేత దినం బ్లాక్ డేని పురస్కరించుకుని రాష్ట్రంలో భద్రతను పటిష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుది ట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘాను మూడింతలు పెంచారు. కాగా బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం మైనారిటీ సంఘాలు, రామాలయం నిర్మాణం కోసం హిందూ సంఘాలు పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. బాబ్రీ మసీదు కూల్చి వేసిన రోజు డిసెంబర్ ఆరవ తేదీని బ్లాక్ డేగా అనుసరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా ఈ రోజు వస్తున్నదంటే చాలు టెన్షన్ తప్పదు. భద్రతను కట్టుదిట్టం చేస్తారు. తనిఖీలు ముమ్మరం చేస్తారు. ఆ రోజు గడిస్తే చాలు పోలీసులు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. అయితే, ఈ ఏడాది మునుపెన్నడూలేని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకు కారణంగా రాష్ట్రంలో ఇటీవల కాలంగా వెలుగు చూస్తున్న సంఘ విద్రోహ శక్తుల కదలికలే. కేంద్రం నుంచి వస్తున్న హెచ్చరికలు, తాజా పరిణామాలు వెరసి రాష్ట్రంలో ఏవైనా విధ్వంసాలకు వ్యూహ రచన జరిగిందా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. తనిఖీలు ముమ్మరం శనివారం బాబ్రీ డే కావడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు, విమానాశ్రయ పరిసరాల్లో భద్రతను పెంచారు. ప్రతి ప్రయాణికుడ్నీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు, ప్రత్యేకంగా తమిళనాడు స్పెషల్ పోలీసు, సాయుధ రిజర్వు పోలీసుల సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే, జాతీయ, రాష్ట్ర రహదారుల్లో, అన్ని నగరాల్లోని రోడ్లలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. లాడ్జీలు, హోటళ్లలో అనుమానితులెవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో, వినోద కేంద్రాల్లో, మాల్స్‌లలో, సెంట్రల్, ఎగ్మూర్ రైల్వే స్టేషన్లలో, కోయంబేడు బస్టాండులో పోలీసులు అను నిత్యం నిఘాతో వ్యవహరిస్తున్నారు. రైళ్లల్లో, బస్సులలో పార్శిళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నిరసనలు : ప్రతి ఏటా బ్లాక్ డే రోజున మైనారిటీ సంఘాలు నిరసనలు చేపట్టడం పరిపాటే. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం నినాదంతో, శాంతి స్థాపన పిలుపుతో ఆయా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాయి. అయితే, ఈ నిరసనలకు అడ్డుకట్ట వేయాలంటూ కొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. ఇందుకు కోర్టు నిరాకరించింది. దీంతో తమ దైన శైలిలో నిరసనలకు మైనారిటీ సంఘాలు సిద్ధమయ్యాయి. ఇక, తాము సైతం అంటూ రామాలయం నిర్మాణం పిలుపుతో నిరసనలకు హిందూ సంఘాలు పిలుపు నిచ్చాయి. తాంబరం, పల్లావరం తదితర ప్రాంతాల్లో పోటాపోటీగా నిరసనలకు పిలుపునిచ్చారుు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. -
బాంబు స్క్వాడ్ తనిఖీలు
కైకలూరు : బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు డిసెంబర్ ఆరో తేదీ (బ్లాక్ డే)ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కైకలూరులో శుక్రవారం రాత్రి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాలతో గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో నాలుగు బృందాలుగా ఈ తనిఖీలు చేశారు. కైకలూరు ైరె ల్వే స్టేషన్లో జిల్లాకు చెందిన ‘మిక్కి’ డాగ్‌తో అణువణువు పరిశీలించారు. బాంబు స్క్వాడ్ టీం మోతి, నాగభూషణం, నాగరాజు, డాగ్ స్క్వాడ్ సీహెచ్‌వీవీ సూర్యనారాయణ తనిఖీల్లో పాల్గొన్నారు. బాంబు డిస్పోజబుల్ పరికరాలు, డాగ్ అన్వేషణను చూసిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
అసెంబ్లీకిది బ్లాక్ డే
ఏపీ సర్కారుకు రేవంత్ సమర్థనా? కేసీఆర్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో సోమవారం వాడీవేడి చర్చ సాగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మధ్య శాసనసభలో వాగ్యుద్ధం జరిగింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమని ముఖ్యమంత్రి ఆరోపిస్తే, ప్రభుత్వం తన అసమర ్థతను పొరుగు రాష్ట్రంపై వేసి తప్పించుకోవాలని చూస్తోందని రేవంత్ ప్రతి విమర్శలకు దిగడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ గణాంకాల మేరకు వాస్తవ వాటా కన్నా ఎక్కువగానే విద్యుత్‌ను రాష్ర్టం వాడుకుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సహా అధికారపక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఓ దశలో సీఎం తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, మాతృభూమిని అవమాన పరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీకి ఇది బ్లాక్ డే అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై రేవంత్ వెనక్కి తగ్గకపోగా.. ‘నన్ను రెచ్చగొట్టినా, దూషించినా దారి తప్పనంటూ’ తన పంథాలో మరోమారు మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర వాదులాటకు దారితీసింది. చివరికి శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు తగ్గించరాదంటూ ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్రాావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గతంలో హైకోర్టులో దాఖలు చేసిన ‘పిల్’ కారణమని వ్యాఖ్యానించడంతో గొడవ మరింత ముదిరింది. సోమవారం విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో చేసిన ప్రకటనపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి సమాధానం, ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పందన అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. విద్యుత్ సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నాలుగు నెలలుగా కోరినా స్పందించని ప్రభుత్వం.. 400 మంది రైతుల ఆత్మహత్యల అనంతరమైనా స్పందించినందుకు అభినందిస్తున్నానంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 1956 నుంచి 1993 మధ్య రాష్ట్రంలో 5,634 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉండగా.. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అదనంగా 5,061 మెగావాట్ల సామర్థ్యంగల కొత్త ప్లాంట్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. దీనిపై అధికారపక్షం ఎమ్మెల్యేలు కొంత అభ్యంతరం చెప్పగా.. ‘దొరను సంతోషపెట్టడానికి నాకు అడ్డుపడొద్దు’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించడం సభలో వేడి పుట్టించింది. బాబు హయాంలో తెలంగాణలోని 20 లక్షల పంప్సెట్లకు 9 గంటల కరెంట్ ఇచ్చారని, విభజన చట్టం ప్రకారం అప్పులు, ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచినా, విద్యుత్ విషయంలో మాత్రం వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని 46:54 నిష్పత్తిలో పంచారని, కేవలం తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే అధికంగా విద్యుత్ ఇచ్చేందుకు బాబు సహకరించారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మరింత దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపైఒకరు గట్టిగా అరుచుకోవడం తో గందరగోళం నెలకొంది. రేవంత్ వ్యాఖ్యలపై సీఎం ప్రతిస్పందించడంతో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం మొదలైంది. చివరికిది సభ వాయిదాకు దారితీసింది. ఈ వాగ్వాదం ఇలా సాగింది. సీఎం: నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాత్రమే ఆరోపణలు చేశాను. మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? రేవంత్: అక్కడ ఫ్యూజులు పీకుతారు, ఇక్కడ బస్సు యాత్రలు చేస్తున్నారని అన్నారు కదా..! ఇది ఆరోపణ కాదా? కేసీఆర్: బాబు ఫ్యూజులు పీకింది వాస్తవం కాదా? మీరు బస్సు యాత్రలు చేసింది వాస్తవం కాదా? రేవంత్: విద్యుత్ సంస్థల్లో అధికారులను సరిగా నియమించుకోలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కేసీఆర్: ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలవుతోంది. నేను స్వయంగా 50 ఉత్తరాలు రాశాను. వర్క్ టూ ఆర్డర్ కింద 35 మంది ఐఏఎస్‌లతో ప్రభుత్వం నడుస్తోంది. ఒక్కో అధికారి మూడు శాఖలు చూస్తున్నారు. ఈ విషయంలో అధికారులను అభినందించాలి. రాష్ట్ర సీఎస్ 15సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చినా కేటాయింపులు జరగలేదు. అది అసమర్థత కాదు, జాప్యం మాత్రమే. అసమర్థత అనుకుంటే అది మీ అవివేకం. రేవంత్: సదరన్ డిస్పాచ్ సెంటర్ లెక్కల ప్రకారం నిర్ణీత వాటా కంటే తెలంగాణ ఎక్కువగానే వాడుకుంది. (గణాంకాలు చెబుతున్న సమయంలో టీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు) కేసీఆర్: అసెంబ్లీకి ఇదొక బ్లాక్ డే. ఈ సభ్యుడు మాతృభూమిని అవమానించే రీతిలో మాట్లాడుతున్నాడు. ఏపీ మనకు చేస్తున్న మోసాన్ని సమర్థిస్తావా?, ఇదొక వాదనా? అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. దీనికి అధికారపక్ష సభ్యులు సైతం ‘సిగ్గు..సిగ్గు’ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. (ఈ గొడవ మధ్య మంత్రి హరీశ్‌రావు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతిచ్చారు.) హరీశ్‌రావు: కార్గిల్ యుద్ధ సమయంలో పార్టీలు, మతాలకు అతీతంగా అంతా భారత ప్రభుత్వం వెనకాల నిలిచింది. కావేరీ జలాల విషయంలో తమిళనాడులో రజనీకాంత్ నుంచి రిక్షా కార్మికుడి వరకు ప్రభుత్వానికి అండగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నా టీడీపీ సభ్యులు మాత్రం పక్క రాష్ట్రం నేతకు అండగా మాట్లాడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ప్రజల పక్షాన నిలవాల్సింది పోయి పక్క రాష్ట్రానికి వంతపాడుతారా? పవర్ తీసుకెళ్లినా, గవర్నర్ పాలన పెట్టాలని కోరినా.. టీడీపీ నేతలు స్పందించారా? రేవంత్: నన్ను రెచ్చగొట్టినా, దూషించినా దారి తప్పను. రైతుల ఆత్మహత్యలకు కారణాన్ని పక్క రాష్ట్రంపై వేయాలనుకోవడం తప్పు. సెంట్రల్ పూల్ నుంచి రావాల్సిన విద్యుత్‌లోనూ తెలంగాణకే అధికంగా వచ్చింది. సీఎం: (కోపంగా) రాష్ట్ర సమస్యలు తెలిసీ పక్కరాష్ట్రాన్ని సమర్థిస్తారా? ఇది చరిత్రకు మంచిది కాదు. రేవంత్ చేస్తున్న వాదన నూరు శాతం తప్పు. ఒక్క మాట నిజం కాదు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? ఇంత దుర్మార్గమా?... ఇదే సమయంలో అధికారపక్ష ఎమ్మెల్యేలు ‘తెలంగాణ ద్రోహులారా ఖబడ్దార్’ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ స్పందిస్తూ.. తనకు ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి, మంత్రే ఎక్కువ సేపు మాట్లాడారంటూనే.. మొత్తం విద్యుత్‌లో తెలంగాణకు 271 మిలియన్ యూనిట్ల మేర ఎక్కువ విద్యుత్ వస్తుందని వివరించబోయారు. రేవంత్ మళ్లీ అదే అంశంపై మాట్లాడుతుండటంతో స్పీకర్ మైక్ కట్ చేసి బీజేపీకి అవకాశమిచ్చారు. అయితే టీడీపీ సభ్యుల ఆందోళనతో మరోమారు రేవంత్‌కు అవకాశం కల్పించారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండేలా కోర్టు నుంచి స్టే తెచ్చి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని రేవంత్ అనడంతో సభలో దుమారం రేగింది. దీంతో సభను స్పీకర్ కొద్దిసేపు వాయిదా వేశారు. -
బ్లాక్ డే
సాక్షి, చెన్నై: యుద్ధం పేరుతో శ్రీలంకలో సాగిన మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను యుద్ధ ద్రోహిగా అంతర్జాతీయ న్యాయ స్థానం బోనులో నిలబెట్టాలన్న కాంక్షతో ప్రపంచంలోని తమిళులు ఎదురు చూస్తున్నారు. ప్రపంచ దేశాల్ని అభ్యర్థిస్తున్నారు. అయితే, తమిళుల్ని మట్టుబెట్టిన రాజపక్సేకు ప్రసంగించే అవకాశం కల్పిస్తూ ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడం తమిళుల్లో ఆగ్రహాన్ని రేపింది. రాజపక్సే ప్రసంగాన్ని అడ్డుకోవాలంటూ నినదిస్తున్నారు. శుక్రవారం ఐరాసలో ప్రసంగించేందుకు రాజపక్సే ఓ వైపు సిద్ధం అవుతుంటే, మరో వైపు ప్రపంచంలోని తమిళులందరూ ఆగ్రహంతో నిరసనల బాట పట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోను నిరసన జ్వాల ఎగసింది. గురువారం బ్లాక్ డేగా పరిగణించాలని ఈలం తమిళుల మద్దతు సంఘం (టెసో) పిలుపు నిచ్చింది. దీంతో బ్లాక్ డేను ప్రశాంత పూరిత వాతావరణంలో డీఎంకే, ఆ కూటమి మిత్రులు పాటించారు. నలుపుమయం: డీఎంకే నేతృత్వంలో రాష్ట్రంలోని గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న ఆ పార్టీ కార్యాలయాల్లో ఉదయాన్నే నల్ల జెండాల్ని ఎగుర వేశారు. డీఎంకే నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లోను నల్ల జెండాలు ఎగుర వేసి నిరసన తెలియజేశారు. నాయకులు, కార్యకర్తలు నల్ల చొక్కాల్ని ధరించి ర్యాలీలు నిర్వహించారు. చెన్నైలోని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాళయం, పరిసరాల్లో నల్లజెండాల్ని ఎగుర వేశారు. అధినేత ఎం కరుణానిధి నివాసం ఉండే గోపాల పురం ఇంటి వద్ద, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్ ఇళ్లలోను నల్ల జెండాలు ఎగిరాయి. కరుణానిధి నల్ల చొక్క ధరించగా, స్టాలిన్ నల్ల ప్యాంటు, నల్ల షర్టు ధరించారు. పార్టీ నాయకులు దాదాపుగా గురువారం నల్ల చొక్కాలతోనే ప్రత్యక్షం అయ్యారు. అన్నా అరివాళయం వద్ద కాసేపు రాజపక్సేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పుదియ తమిళగం నేత కృష్ణ స్వామి, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల నేతృత్వంలోను పలు చోట్ల నిరసనలు జరిగారుు. వారి ఇళ్లలోను నల్ల జెండాలు ఎగిరాయి. నల్ల చొక్కాలతో నాయకులు నిరసనలకు తరలి వచ్చారు. నినాదాల హోరు: రాజపక్సేకు వ్యతిరేకంగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఖండిస్తూ బ్లాక్‌డేలో నినాదాలు హోరెత్తాయి. సీమాన్ నేతృత్వంలో వళ్లువర్‌కోట్టం వద్ద నిరసన జరిగింది. దిండుగల్‌లో, విల్లుపురం, పెరంబలూరు, అరియలూరు, కడలూరు, కరూర్, తిరునల్వేలి, కన్యాకుమారి, మదురై, తిరుచ్చిల్లో డీఎంకే నేతృత్వంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. తంజావూరులో మాత్రం అనుమతి లేదన్న సాకుతో డీఎంకే వర్గాల్ని పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ బ్లాక్ డే విజయవంతంతో డీఎంకే అధినేత ఎం కరుణానిధి మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను విస్మరించినా, తమిళులు మాత్రం విస్మరించ లేదన్నారు. రాజపక్సేను అడ్డుకుందామని కేంద్రానికి పిలుపునిచ్చామని, అయితే, వారి నుంచి స్పందన రానప్పటికీ, బ్లాక్ డేకు మాత్రం విశేష స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కళ్లు తెరవాలని, తమిళుల మనో భావాలకు అనుగుణంగా నడుచుకోవాలని కోరారు. రాజపక్సే ప్రసంగాన్ని అడ్డుకునే విధంగా ఐరాస సమావేశంలో భారత్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాల్ని తీసుకోవద్దని, మనో భావాలతో చెలగాటం మాత్రం ఆడొద్దని, గత ప్రభుత్వం వలే కుటిల యత్నాలు చేయొద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. -
ఇది బ్లాక్ డే: వైఎస్ జగన్
* బిల్లు ఆమోదంపై జగన్ ఆగ్రహం * నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు * సీమాంధ్ర ఎంపీల్లేకుండా ఫ్లోర్‌ను ఖాళీ చేశారు * పాకిస్థాన్‌లో కూడా ఇలా ఎవరూ చేయరేమో! * సోనియా గాంధీ నియంతలా వ్యవహరించారు * విభజనకు సోనియా, చంద్రబాబు, బీజేపీలే కారణం * టీడీపీ ఎంపీలు నామా, రాథోడ్ విభజనకు ఓటేశారు పూర్వపు రోజుల్లో నియంత అన్న పదం ఎప్పుడైనా ప్రస్తావనకొస్తే.. హిట్లర్‌తో పోల్చేవారు. కానీ ఇవాళ పార్లమెంటులో బిల్లు ఆమోదం జరిగిన తీరును చూసిన తరువాత నియంత ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు సోనియా గాంధీ. సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘బ్లాక్ డే’గా అభివర్ణించారు. నియంత పోకడలతో రాష్ట్రాన్ని విభజించినందుకు నిరసనగా బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీజేపీలే కారణమని దుయ్యబట్టారు. పార్లమెంటు టీవీ లైవ్ ప్రసారాలను నిలిపేయడం, పార్లమెంటు గేట్లు మూసివేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. పార్లమెంటు వెలుపల విజయ్‌చౌక్ వద్ద మంగళవారం సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించిన తీరు చూస్తే ప్రజాస్వామ్యంలో, దేశంలో ఉన్నామో, లేమో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. విభజన బిల్లు ఆమోదంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, బహుశా పాకిస్థాన్‌లో కూడా ఈ విధంగా ఎవరూ చేయరేమోనన్నారు. ‘‘పూర్వపు రోజుల్లో నియంత అన్న పదం ఎప్పుడైనా ప్రస్తావనకొస్తే.. హిట్లర్‌తో పోల్చేవారు. కానీ ఇవాళ పార్లమెంటులో బిల్లు ఆమోదం జరిగిన తీరును చూసిన తరువాత నియంత ఎవరంటే గుర్తుకు వచ్చే పేరు సోనియా గాంధీ’’ అని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం ఏ స్థాయికి దిగజారిపోతారో చెప్పడానికి పార్లమెంటు ఒక నిదర్శనంగా మిగిలిందన్నారు. రాష్ట్రం ఒప్పుకోకపోయినప్పటికీ, విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ పార్లమెంటుకు విభజన బిల్లు తెచ్చారని విమర్శించారు. సీమాంధ్రులు లేకుండా ఫ్లోర్‌ను ఖాళీ చేశారు ‘‘పార్లమెంటు సంప్రదాయాలను పక్కనబెట్టి నియంతలా పదే సెకన్లలో బిల్లును ప్రవేశపెట్టారు. 17 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి ఫ్లోర్‌ను ఖాళీ చేశారు. సభలో మాట్లాడే వారు ఎవరూ లేని పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంటుకు బిల్లు తెచ్చి నియంతలా బిల్లును ఆమోదించారు. మనం అసలు భారతదేశంలోనే ఉన్నామా? ఇంత నియం త పోకడతో రాష్ట్రాన్ని విడగొడుతున్నారు. నీళ్ల కోసం, పిల్లల చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కడికెళ్లాలని అడిగితే పట్టించుకునేవారు లేరు. ఆదాయం లేకుంటే ఉద్యోగులకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు.? ఈ పోకడ సరైందేనా? రాష్ట్రాన్ని చీల్చడానికి అధికార, ప్రతిపక్షం ఒక్కటైతే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందా? దీన్ని నిరసిస్తూ ఈ రోజును బ్లాక్ డేగా పాటిస్తున్నాం. అంతేకాదు నియంత పోకడకు నిరసనగా బుధవారం బంద్‌కు పిలుపునిస్తున్నాను’’ అని జగన్ ప్రకటించారు. చంద్రబాబు ఎంపీలే విభజనకు ఓటేశారు.. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం సోనియా, చంద్రబాబులే అని చెప్పారు. బాబు పార్టీకి చెందిన ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేశ్ రాథోడ్‌లు విభజనకు అనుకూలంగా ఓటేశారన్నారు. ‘ఇవాళ పార్లమెంటులోకి మమ్మల్ని పోనివ్వలేదు. కానీ కార్యదర్శి గదిలో ఆడియోలో వింటుంటే సభలో జరుగుతున్న తీరు బాధ కలిగించింది. ఇవాళ రాష్ట్రం ఈ స్థాయికి వచ్చిందంటే.. సోనియా ప్రధాన కారణమైతే, రెండవ కారణం చంద్రబాబు. ఆయన పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు నామా, రాథోడ్ పార్లమెంటుకు వెళ్లి రాష్ట్రాన్ని విభజించాలని బిల్లుకు ఓటు వేశారు. నిజంగా వీరు అసలు మనుషులేనా?’ అంటూ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయానికి సోనియా, ప్రతిపక్ష బీజేపీ, చంద్రబాబులదే బాధ్యతన్నారు. -
ఈ రోజు దేశ చరిత్రలో బ్లాక్ డే: జగన్
-
'దేశ చరిత్రకే చీకటి అధ్యాయం'
-
రాష్ట్రానికి విద్రోహ దినం
సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ, అందుకు కారణమైన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజును జిల్లా వాసులు బ్లాక్‌డేగా జరుపుకున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కడప నగరంలో ఉపాధ్యాయ జేఏసీ నేత లెక్కల జమాల్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నల్లజెండాలతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇన్సాఫ్ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు సిగ్గులేకుండా పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. వెంటనే కేంద్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోకపోతే ప్రజల్లో తిరగనీయబోమన్నారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు శ్రీరామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సోనియా గాంధీ తన బర్త్‌డే కేక్‌ను కట్ చేసినట్లు రాష్ట్రాని చీల్చాలనుకోవడం సహించరాని విషయమన్నారు. బద్వేలు ఏపీ ఎన్జీవోలు సోమవారాన్ని బ్లాక్‌డేగా పాటించారు. నల్లజెండాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. పులివెందులలో విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరలించి ర్యాలీ నిర్వహించారు. సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నందలూరులో పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, అందుకు నిరసనగా సోమవారాన్ని బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామన్నారు. ప్రొద్దుటూరులో న్యాయవాదులు బ్లాక్‌డే పాటించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. -
మిన్నంటిన నిరసన
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ ప్రజలు రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. స్వార్థ రాజకీయాలకు తెలుగు ప్రజలను విడదీయడం అన్యాయమంటూ ఆదోనిలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం నుంచి భీమాస్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. డోన్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను పట్టణ పురవీధుల్లో చీపుర్లతో కొడుతూ ఊరేగించారు. ఇదే మండలంలోని యు.కొత్తపల్లెలో జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు సోనియా జన్మ దినాన్ని బ్లాక్‌డేగా పాటించారు. ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. నందికొట్కూరులో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. పత్తికొండలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సోనియా గోబ్యాక్ అంటూ నాలుగు స్తంభాల కూడలిలో నినదించారు. కోడుమూరులోని కోట్ల సర్కిల్లో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. సోనియా జన్మదినం తెలుగు జాతి కర్మదినం పేరిట సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కర్నూలులోని రాజ్‌విహార్ సెంటర్లో నల్ల జెండాలతో రాస్తారోకో చేపట్టారు. సమితి జిల్లా చైర్మన్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ కొడిదెల శివనాగిరెడ్డి, విద్యార్థి జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు భానుచరణ్ రెడ్డి, బుద్ధి రాజు గౌడ్ల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఆటో కార్మికుల జేఏసీ పిలుపులో భాగంగా మధ్యాహ్నం వరకు ఆటోల బంద్ చేపట్టారు. -
'అనంత'లో ఆగ్రహజ్వాలలు
అనంతపురం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లాలో తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సమైక్యవాదులు ఈ రోజును బ్లాక్ డేగా పాటించారు. జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో సప్తగిరి సర్కిల్ నుంచి సోనియా గాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దగ్గం చేశారు.క్లాక్ టవర్ వద్ద టీచర్లు మానవహారం ఏర్పాటు చేశారు. పెనుకొండ ఉపాధ్యాయ జేఏసీ సోనియా జన్మదినాన్ని విద్రోహదినంగా ప్రకటించింది. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. ముస్లీం నగర సమితి ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్మించారు. తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో సోనియాకు పిండ ప్రధానం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇదిలా ఉండగా, అనంతపురంలో జరిగిన సోనియాగాంధీ జన్మదిన వేడుకలు కూడా దాడికి దారి తీశాయి. కాంగ్రెస్ నేత గోపాల్ రాష్ట్రాన్ని విభజించిన సోనియాకు సంతాపం తెలిపారు. మంత్రి శైలజానాథ్ అనుచరుడు దాదా గాంధీ గోపాల్‌పై దాడి చేశాడు. ఫొటోలు : జి.వీరేష్, అనంతపురం -
'సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్‌కు డెత్ డే'
అనంతపురం: రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సమైక్యవాదులు సోమవారం అనంతపురం జిల్లాలో బ్లాక్ డే గా పాటిస్తున్నారు. జిల్లాలో సమైక్య ఉద్యమాలు కొనసాగుతున్నాయి. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ సమైక్యవాదులు నిరసనలు తెలుపుతున్నారు. సోనియాగాంధీ బర్త్ డే ఆంధ్రప్రదేశ్‌కు డెత్ డే అంటూ ప్లకార్డులతో సమైక్యవాదులు తెనాలిలో తమ నిరసనలు తెలియచేశారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిసెంబర్ 9వ తేదీని బ్లాక్ డే గా కర్నూలు జిల్లా వాసులు పాటిస్తున్నారు. మరోవైపు సోనియా జన్మదినాన్ని తెలుగు జాతి విద్రోహదినంగా పాటిస్తూ ఆటో కార్మికుల జేఏసీ నగరంలో నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. -
సోనియా బర్త్‌డే... ‘అనంత’లో బ్లాక్‌డే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కారణమైన సోనియాగాంధీ జన్మదినం(9వ తేదీ)ను బ్లాక్‌డేగా పరిగణించి, జిల్లా బంద్ చేపట్టాలని ‘అనంత’ సంయుక్త కార్యాచరణ వేదిక (సంయుక్త జేఏసీ) నిర్ణయించింది. సోమవారం విద్రోహదినంగా పాటిస్తూ అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలతో కలిసి నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. శనివారం సాయంత్రం నగరంలోని మేడా కన్వెన్షన్ హాలులో న్యాయవాదుల జేఏసీ నేతలు కొత్త విశ్వనాథ్‌రెడ్డి, రామ్‌కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీలు, యువ, కుల సంఘాలు, పొలిటికల్, నాన్‌పొలిటికల్ జేఏసీల నేతలు హాజరయ్యారు. బంద్ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చిన నాటి నుంచి 130 రోజులుగా జిల్లాలో అన్ని వర్గాలు చేస్తున్న ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ... కీలకమైన ఈ పరిస్థితుల్లో మరింత ఉధృతం చేసి ఉద్యమ సెగను ఢిల్లీకి తాకించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని సంకల్పించారు. ఉద్యమం చివరిఘట్టంలో ఉన్నందున కలసివచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆహ్వానించాలని నిర్ణయించారు. జెండా, అజెండాలు పక్కనపెట్టి అన్ని పార్టీలు కలసిరావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉద్యమాన్ని అణచివేసే దిశగా పోలీసు యంత్రాంగం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని పలువురు నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వసతి గృహం, ఎస్కేయూ విద్యార్థులను నిర్బంధించడం తగదన్నారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన తరువాత సమైక్యవాదులందరూ ఏకతాటిపై ఉద్యమించడంతో ఆ ప్రకటన వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యమం మరోసారి అవసరమన్నారు. రాయల తెలంగాణ లేదా మరో ప్రతిపాదన లేకుండా సమైక్యాంధ్ర నినాదంతోనే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. సమావేశంలో వివిధ జేఏసీల నాయకులు బోరంపల్లి ఆంజనేయులు, మునిరత్నం శ్రీనివాసులు, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కృష్ణవేణి, యు.రాజేశ్వరి, దేవళ్ల మురళీ, సగర శ్రీకాంత్, వశికేరి శివ, బీఎస్ఎన్ఎల్ రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, జగదీష్, మేడా రమణ, హెచ్ఎన్ఎస్ఎస్ మనోహరరెడ్డి, రేణుకాదేవి, శ్రీధర్, వాసుప్రకాశ్, మహబూబ్‌బాషా, శివప్రకాశ్, ఎస్వీ సత్యనారాయణగుప్తా, ప్రతాప్, కుసుమ పుల్లారెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణ, జేబీ సురేష్, నాగరాజు, ముక్తియార్ పాల్గొన్నారు. -
జిల్లాలో బ్లాక్ డే.. నిరసన ర్యాలీలు
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : బాబ్రీమసీద్ కూల్చివేత దినం సందర్భంగా శుక్రవారం జిల్లాలో ముస్లింలు, వివిధ సంఘాల నాయకులు బ్లాక్ డేగా పాటించారు. లౌకికవాద దేశంలో ఇలాంటి సంఘటన జరగడాన్ని వ్యతిరేకిస్తూ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎంబీటీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని వీధుల గుండా మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని డీఆర్వో ఎస్ఎస్ రాజుకు వినతిపత్రం అందజేశారు. బాబ్రీ మసీద్ కూల్చివేసిన స్థలంలోనే పునర్నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. ఎంబీటీ జిల్లా అధ్యక్షుడు ఆయాజ్ అహ్మద్ షమా, జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అన్వర్, పట్టణ అధ్యక్షుడు అక్తర్‌ఖాన్ పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్‌లో మతతత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆసిఫాబాద్‌లో ముస్లింలు ధర్నా నిర్వహించి సబ్‌కలెక్టర్ ప్రశాంత్పాటిల్కు వినతిపత్రం అందజేశారు. భైంసాలో ముస్లింలు దుకాణాలు బంద్ చేసి బ్లాక్ డే పాటించారు. మంచిర్యాలలో రైల్వేస్టేసన్ నుంచి ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ఆధర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ ఎదుట మతతత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిర్మల్‌లో ఎంఐఎం నాయకులు అభిందిన్ మాఫియా, అజర్, నాయకులు, జమాతే ఉల్మ్ హింద్ సయ్యద్ అజార్, వసీం, అహ్మద్ ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్‌లో ఎన్టీర్ చౌక్ నుంచి ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తహశీల్దార్ కనకయ్యకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6ను మతతత్వ దినంగా పరిగణించాలని దిష్టిబొమ్మ దహనం చేశారు. బాబ్రీ మసీదు పునర్నిర్మించాలి ఆసిఫాబాద్ : బాబ్రీ మసీద్ పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట శెరియత్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు ఎంఏ వాహబ్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చివేతను అడ్డుకోవడంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు శేక్ ఇబ్రహీం, సయ్యద్‌జాఫర్, ఎండి.ఇస్మాయిల్, షబ్బీర్, ఎండివజీర్, ఎస్కే చాంద్, సయ్యద్ జావిద్, సయ్యద్ అన్సార్, ముస్లింలు పాల్గొన్నారు. -
రాష్ట్ర చరిత్రలో డిసెంబర్ 5 బ్లాక్ డే: విశ్వరూప్
రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ముఖ్యమంత్రి తెలివితక్కువతనంతో వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిసెంబర్ 5 బ్లాక్ డే అని విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆందోళనలో పాల్గొనడం హాస్యాస్పదమని విశ్వరూప్ అన్నారు. -
బ్లాక్ డే అలర్ట్!
సాక్షి, చెన్నై:1992 డిసెంబర్ 6 దేశ చరిత్రకు మాయని మచ్చను సృష్టించిన రోజు. బాబ్రీ మసీదును కూల్చి వేసిన ఈ రోజున బ్లాక్ డే గా పరిగణిస్తూ వస్తున్నారు. ఈ రోజున విధ్వంసాలకు తీవ్ర వాదులు తెగబడొచ్చన్న సమాచారంతో ప్రతి ఏటా భద్రతను కట్టు దిట్టం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తీవ్ర వాదుల కార్యకలాపాలు ఒక దాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తుండటంతో భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నది. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు రాష్ట్రం చుట్టూ తిరుగుతున్న సమయంలో, హిందూ నేతల్ని టార్గెట్ చేస్తున్న తీవ్ర వాదుల ముఠా కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు తీవ్రవాదులైన ఇస్మాయిల్, బిలాల్, ఫక్రీద్దీన్లను బంధించారు. అయితే, వారి అనుచరులతో పాటుగా మరో తీవ్రవాది అబూబక్కర్ జాడ కానరాలేదు. వీరి కోసం వేట తీవ్రంగానే సాగుతోంది. ఈ సమయంలో బ్లాక్ డేనుపురస్కరించుకుని రాష్ట్రంలో దాడులకు కుట్రలు జరిగిన సమాచారం పోలీసులను కలవరంలో పడేసింది. చొరబాటు: పది కిలోల అమ్మోనియంతోపాటుగా పేలుడుకు ఉపయోగించే పదార్థాలతో ముగ్గురు తీవ్ర వాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. తిరునల్వేలి, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై నగరాల్ని వీరు టార్గెట్ చేసి ఉన్నట్టుగా వచ్చిన సంకేతాలతో ఆ ప్రాంతాల్లో భద్రతను ఆరు అంచెలు పెంచారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు భద్రత కల్పించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మఫ్టీల్లో సిబ్బంది నిఘాను పర్యవేక్షిస్తున్నారు. అలర్ట్: ఆ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఎస్పీలకు డీజీపీ రామానుజం ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నైతోపాటుగా అన్ని జిల్లాల్లోనూ భద్రతను పెంచారు. రాష్ట్ర సరిహద్దుల్లో, ఆయా జిల్లా కేంద్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. బుధవారం నుంచి గురువారం రాత్రంతా వాహనాల తనిఖీలు సాగారుు. ఆలయాలకు వచ్చే భక్తులను, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతిస్తున్నారు. పార్శిల్ కేంద్రాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్ల ద్వారా తనిఖీలు చేశారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్, సెంట్రల్ రైల్వే స్టేషన్, ఎగ్మూర్రైల్వే స్టేషన్, మీనంబాక్కం విమానాశ్రయాల్లో మూడు అంచెల భద్రతను కల్పించారు. బ్లాక్ డేను పురస్కరించుకుని నిరసనలకు ముస్లిం సంఘాలు, పార్టీలు సన్నాహాలు చేస్తున్నారుు. ఈ నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. బాబ్రీ మసీదు పునరుద్ధరణ నినాదంతో ఈ నిరసనలు చేపట్టాలని ముస్లింలు ప్రయత్నం చేస్తున్నారు. తాంబరం పరిసరాల్లో అయితే, ఇవే నినాదాలతో పోస్టర్లు, చిన్న చిన్న ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిని తొలగించేందుకు పోలీసులు సాహించడం లేదు. నిరసనల్ని అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు సిద్ధంగానే ఉన్నారు. అయితే, ఈ పర్యాయం బ్లాక్ డే శుక్రవారం రావడంతో సున్నిత సమస్యను సామరస్య పూర్వకంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు అడ్డుకున్నా, తాము మాత్రం శాంతియుత మార్గంలోనే నిరసన తెలియజేసి తీరుతామని కొన్ని సంఘాలు పేర్కొంటున్నాయి. -
నవంబర్ 1 సీమకు చీకటి దినం
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీ రాయలసీమ చరిత్రలో చీకటి దినమని రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. కర్నూలులో ఉన్న రాజధానిని ఆ రోజు హైదరాబాద్‌కు తరలించడంతోనే సీమకు కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. శుక్రవారం ఆర్పీఎస్ఎస్ఎఫ్, టీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రీ ఎస్టేట్ నుంచి కలెక్టరేట్ వరకు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్పీఎస్ఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, టీఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ చంద్రప్ప ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడారు. రాయలసీమ వాసుల త్యాగంతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాజధానిని కర్నూలుకు కేటాయించాలని కోరుతూ తక్షణమే అన్ని రాజకీయ పార్టీలూ లేఖలు ఇవ్వాలని కోరారు. రాజధాని చేయలేకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో సైన్స్ సిటీ, మదనపల్లిలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీను, రాజు, రవి, జనార్ధన్, వినయ్ పాల్గొన్నారు. -
రాష్ట్రాన్ని ఆవహేళన చేయవద్దు:ఆళ్ల నాని
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని స్పష్టం చేశారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని అవహేళన చేయవద్దని ఆయన తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నాట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలో బాధితులను పరామర్శించడానికి తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్తే తెలంగాణ వాదులు, కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆళ్లనాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అయితే తెలంగాణవాదులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా వ్యవహరించడం పట్ల ఆళ్లనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్లనానిపై విధంగా స్పందించారు. -
నిరసనలే..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర అవతరణ వేడుకలకు నిరసన సెగ తగలనుంది. ఓ వైపు అవతరణ వేడుకలు బహిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ పిలుపు నిచ్చింది. మరోవైపు నవంబర్ 1న బ్లాక్ డేగా ప్రకటించిన టీఆర్ఎస్ జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని ప్రకటించింది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా రాష్ర్ట అవతరణ వేడుకల్లో పాల్గొనడం లేదని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటు న్న పార్టీలు రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు దూరంగా ఉంటున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో శుక్రవారం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినాన్ని వేడుకగా చేసుకోవడం అర్థంలేని వ్యవహారంగా భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు వేడకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో అధికారులు కూడా మొక్కుబడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే తెలంగాణవాదులు, ఉద్యమ సంస్థలు ఈ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. జిల్లా అంతటా నిరసనలు తెలపాలని టీజేఎసీ నిర్ణయించింది. నవంబర్ 1న విద్రోహ దినంగా పాటించేందుకు జిల్లాలో తెలంగాణవాదులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలతోపాటు వివిధ సంఘాలు నిరసనలు, నల్లజెండాల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. అవతరణ దినాన నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలపాలని పలు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదిలా వుండగా రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించేందుకు ఆదిలాబాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్స్ సిద్ధమైంది. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో జిల్లాకేంద్రంలో ప్రధాన వేడుక జరిగే పోలీసు గ్రౌండ్‌తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ భద్రత ఏర్పాట్ల వల్ల సామాన్య జనం హాజరయ్యే అవకాశం లేక పోవడంతో కేవలం అధికారులకే పరిమితం కానుంది.