బాంబు స్క్వాడ్ తనిఖీలు | Bomb squad checks | Sakshi
Sakshi News home page

బాంబు స్క్వాడ్ తనిఖీలు

Published Sat, Dec 6 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

బాంబు స్క్వాడ్ తనిఖీలు

బాంబు స్క్వాడ్ తనిఖీలు

కైకలూరు : బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు డిసెంబర్ ఆరో తేదీ (బ్లాక్ డే)ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా కైకలూరులో శుక్రవారం రాత్రి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఎస్పీ విజయ్‌కుమార్ ఆదేశాలతో గుడివాడ డీఎస్పీ అంకినీడు ప్రసాద్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో నాలుగు బృందాలుగా ఈ తనిఖీలు చేశారు. కైకలూరు ైరె ల్వే స్టేషన్‌లో జిల్లాకు చెందిన ‘మిక్కి’ డాగ్‌తో అణువణువు పరిశీలించారు.

బాంబు స్క్వాడ్ టీం మోతి, నాగభూషణం, నాగరాజు, డాగ్ స్క్వాడ్ సీహెచ్‌వీవీ సూర్యనారాయణ తనిఖీల్లో పాల్గొన్నారు. బాంబు డిస్పోజబుల్ పరికరాలు, డాగ్ అన్వేషణను చూసిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement