ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్షాలను ఎన్నికల అధికారులు టార్గట్ చేసి మరీ తనిఖీలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హెలికాప్టర్‌ను బిహార్‌లోని సమస్తిపూర్‌లో పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. అయితే ఎన్డీయే కూటమి నేతలను మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకుండా విదిలేస్తున్నారని కాంగ్రెస్ ఎన్నికల అధికారులపై విమర్శలు చేసింది. శనివారం మల్లికార్జున ఖర్గే.. సమస్తీపూర్, ముజఫర్‌పర్‌లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.
‘‘ఇప్పటికే కేరళలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారలు తనిఖీ చేశారు. శనివారం మల్లికార్జన ఖర్గేను బిహార్‌లోని సమస్తీపూర్‌లో అధికారుల చేత తనిఖీ చేయబడ్డారు’’ అని ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ రాథోడ్ అన్నారు. బిహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఖర్గే హెలికాప్టర్ చెక్ చేశారని రాజేష్ రాథోడ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో.. హెలికాప్టర్ చుట్టూ అధికారులు, పోలిసులు ఉండటం గమనించవచ్చు.
श्री @RahulGandhi जी के बाद अब @INCIndia अध्यक्ष श्री @kharge जी का हेलीकॉप्टर की तलाशी बिहार के समस्तीपुर में सभा के दौरान चुनाव आयोग और पुलिसकर्मियों द्वारा करना चुनाव आयोग का दुर्भावना पूर्ण व्यवहार प्रतिपक्षों के लिए दर्शाता है यह लोकतंत्र की हत्या है l pic.twitter.com/tk1SUqcj5P
— Rajesh Rathorre (@RajeshRathorre1) May 11, 2024
‘‘కేవలం కాంగ్రెస్ నేతల హెలికాప్టర్లకు మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? లేదా బీజేపీకి చెందిన అగ్రనాయకుల హెలికాప్టర్లును కూడా చెక్ చేస్తున్నారా? అనే విషయంపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలి. ఈ తనిఖీలు సమాచారాన్ని ఈసీ బహిరంగంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే ప్రతిపక్షాలను అడ్డుకొని, ఎన్డీయే నేతలను ఫ్రీగా వదిలేసినట్లు అర్థమవుతుంది’’ అని రమేష్ రాథోడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు నేతల హెలికాప్టర్లను చెక్ చేసిన అన్ని వీడియోను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment