ప్రతిపక్షాలను నిలదీసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నవడా/జల్పాయ్‌గురి/జబల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అచ్చంగా ముస్లిం లీగ్ విధానాలను పోలి ఉందని విమర్శించారు. అది మేనిఫెస్టో కాదు, బుజ్జగింపు పత్రం అని ధ్వజమెత్తారు. ఆదివారం బిహార్‌లోని నవడా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు.
ఆర్టికల్ 370 రద్దు గురించి బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు.
‘‘దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వారి పారి్థవ దేహాలు త్రివర్ణ పతాకాలతో స్వస్థలాలకు చేరుకున్నాయి. రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్‌లో గతంలో ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలి. అది దేశంలో అంతర్భాగం కాదా?’’ అని ప్రశ్నించారు.
రన్‌వేపై మా గ్రోత్ ఇంజన్ సిద్ధం
దేశాన్ని రెండు విభజించాలన్నదే కాంగ్రెస్ ఆలోచనా విధానమని మోదీ ఆక్షేపించారు. ‘‘ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పెద్దలు బహిష్కరించారు. హాజరైన పార్టీ నేతలను బహిష్కరించారు. శ్రీరామనవమి రాబోతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన పాపాలను మర్చిపోవద్దు’’ అని ప్రజలకు సూచించారు. తమ పదేళ్ల పాలన ట్రైలర్ మాత్రమేనని, తమ గ్రోత్ ఇంజన్ రన్‌వేపై సిద్ధంగా ఉందని, ఇక టేకాఫ్ తీసుకుంటుందని అన్నారు. బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలో ఎన్నికల మెగా ర్యాలీలో, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. పశి్చమ బెంగాల్‌లో అవినీతికి, హింసాకాండకు ఉచిత లైసెన్స్ ఇవ్వాలని అధికార టీఎంసీ కోరుకుంటోందని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment