
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముమ్మాటికీ అబద్ధాల సర్దార్ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మన దేశ భూభాగంలోకి చైనా ప్రవేశిస్తుంటే మోదీ నిద్రపోతున్నారని ధ్వజమెత్తారు. గురువారం రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడారు.
దేశ క్షేమం గురించి ఏమాత్రం పట్టించుకోని ప్రధానమంత్రి.. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని దూషించడంలో తీరిక లేకుండా ఉంటున్నారని ధ్వజమెత్తారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకుంటున్న మోదీ మన దేశ భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఖర్గే ఆరోపించారు. మోదీ గ్యారంటీల డ్రామా సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఏమీ ఉండదన్నారు. ఓటమి భయంతోనే విపక్షాలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment