Nawada
-
బిహార్‌లో దారుణం.. 25 ఇళ్లకు పైగా నిప్పపెట్టిన దుండగులు
పట్నా: బిహార్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవాడా పట్టణం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో దాదాపు 20-25 ఇళ్లకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. దుండగులు ముందు కాల్పులు జరిపి తర్వాత ఇళ్లను తగులబెట్టారు. అయితే.. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఇళ్లలోని వస్తువులు పూర్తిగా కాలిబుడిదయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రాథమికంగా భూమి సమస్యగా కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కనిపిస్తోందని పోలీసు ఉన్నతాధికారి సునీల్‌కుమార్ వెల్లడించారు.#WATCH | Nawada, Bihar | Around 20-25 houses were set on fire by some miscreants in Krishnanagar under the Mufassil Police Station area. No casualties reported. Prima facie it seems to be a land issue: SDPO, Sadar Nawada, Sunil Kumar pic.twitter.com/aXET2wdH7m— ANI (@ANI) September 19, 2024 ఈ ఘటనపై బీఎస్పీ చీఫ్ మాయావతి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘బీహార్‌లోని నవాడాలో అనేక మంది పేద దళితుల ఇళ్లను గూండాలు తగలబెట్టి, వారి జీవితాలను నాశనం చేశారు. ఈ సంఘటన చాలా బాధాకరం. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితుల పునరావాసానికి ఆర్థిక సహాయం అందించాలి’ అని పేర్కొన్నారు.BSP chief Mayawati tweets "The incident of burning down many houses of poor Dalits in Bihar's Nawada by the goons and ruining their lives is extremely sad and serious. The government should take strict legal action against the culprits and also provide financial help for the… https://t.co/YvTo1IP4ko pic.twitter.com/UvEfPqH7jd— ANI (@ANI) September 19, 2024 చదవండి: One Nation One Election: ఆచరణ సాధ్యమేనా? -
PM Narendra Modi: కశ్మీర్ భారత్‌లో లేదా?
నవడా/జల్పాయ్గురి/జబల్పూర్: కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అచ్చంగా ముస్లిం లీగ్ విధానాలను పోలి ఉందని విమర్శించారు. అది మేనిఫెస్టో కాదు, బుజ్జగింపు పత్రం అని ధ్వజమెత్తారు. ఆదివారం బిహార్‌లోని నవడా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ప్రస్తావిస్తున్నారన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన భద్రతా సిబ్బంది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వారి పారి్థవ దేహాలు త్రివర్ణ పతాకాలతో స్వస్థలాలకు చేరుకున్నాయి. రాజ్యాంగాన్ని జమ్మూకశ్మీర్‌లో గతంలో ఎందుకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలి. అది దేశంలో అంతర్భాగం కాదా?’’ అని ప్రశ్నించారు. రన్‌వేపై మా గ్రోత్ ఇంజన్ సిద్ధం దేశాన్ని రెండు విభజించాలన్నదే కాంగ్రెస్ ఆలోచనా విధానమని మోదీ ఆక్షేపించారు. ‘‘ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ పెద్దలు బహిష్కరించారు. హాజరైన పార్టీ నేతలను బహిష్కరించారు. శ్రీరామనవమి రాబోతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన పాపాలను మర్చిపోవద్దు’’ అని ప్రజలకు సూచించారు. తమ పదేళ్ల పాలన ట్రైలర్ మాత్రమేనని, తమ గ్రోత్ ఇంజన్ రన్‌వేపై సిద్ధంగా ఉందని, ఇక టేకాఫ్ తీసుకుంటుందని అన్నారు. బెంగాల్‌లోని జల్పాయ్గురిలో ఎన్నికల మెగా ర్యాలీలో, మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. పశి్చమ బెంగాల్లో అవినీతికి, హింసాకాండకు ఉచిత లైసెన్స్ ఇవ్వాలని అధికార టీఎంసీ కోరుకుంటోందని మండిపడ్డారు. -
ఎస్ఐ, ఏఎస్ఐలను లాకప్‌లో బంధించిన ఎస్పీ.. వీడియో వైరల్
పాట్నా: సబ్ ఆర్డినేట్ల పనితీరుతో బిహార్ నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళకు చిర్రెత్తిపోయింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ముగ్గురు ఏఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలను లాకప్‌లో వేశారు. రెండు గంటలపాటు వారిని లోపలే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. बिहार पुलिस का हाल नवादा में SP ने लापरवाही बरतने के कारण 2 दारोगा और 3 ASI को 2 घंटे तक थाने के लॉकअप में बंद कर दिया. पुलिस एसोसिएशन ने SP पर कार्रवाई की माँग की. pic.twitter.com/FpF4ye9KOb — UnSeen India (@USIndia_) September 10, 2022 అయితే ఈ విషయంపై ఎస్పీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఫేక్ న్యూస్ అని బదులిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు బిహార్ పోలీసు సమాఖ్య ఈ ఘటనపై శనివారం న్యాయ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎస్పీని అడిగేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించట్లేదని పోలీసు సమాఖ్య అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలు బిహార్ పోలీసులను అప్రతిష్టపాలు చేస్తాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ తన అధికారంతో కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ! -
అల్లర్ల కేసు నిందితులను జైల్లో కలిసిన కేంద్ర మంత్రి
పట్నా : వ ముస్లిం వ్యక్తిని చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులకు ఘనస్వాగతం పలికి కేంద్రమంత్రి జయంత్ సిన్హా విమర్శలు ఎదుర్కొంటున్న వివాదం మరవకముందే మరో కేంద్ర మంత్రి వివాదంలో చిక్కుకున్నారు. అల్లర్ల కేసులో జైల్లో ఉన్న విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం కలిశారు. బిహార్‌లోని నవడా జైలులో ఉన్న బజరంగ్ దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలను కలిసిన ఆయన.. సుమారు 30 నిమిషాల పాటు వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. 'జీతూ జీ, కైలాష్ జీని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. 2017లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రక్తతలు తలెత్తినప్పుడు వారు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అక్బర్పూర్లో దుర్గామాత విగ్రహాన్ని విధ్వసం చేసినప్పుడు కూడా ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నమే చేశారు. అలాంటి వారిని అల్లరి మూకలు అని ఎలా నిందిస్తారు ’ అని నిందితులను సమర్థించారు. హిందువులను అణిచివేయడం ద్వారా మత సామరస్యాన్ని కాపాడగలమని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్‌లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా ధోరణిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని గిరిరాజ్ అన్నారు. 2017 అల్లర్ల కేసులో బజరంగ్ దళ్ కన్వీనర్ జితేంద్ర ప్రతాప్‌ను ఈ నెల 3న అరెస్టు చేశారు. దీనిపై ఆ మరుసటి రోజే జితేంద్ర ప్రతాప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గిరిరాజ్ ఆరోపణలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిప్పికొట్టారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం విషయాల్లో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క నేరస్థునికి రక్షణ కల్పించదని పేర్కొన్నారు. -
మోదీ విధేయుడికి మంత్రి పదవి
బీహార్ కు చెందిన వివాదస్పద నాయకుడు గిరిరాజ్ సింగ్- నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేబినెట్ పదవి పొందారు. బీహార్ నుంచి కేంద్ర కేబినెట్ ప్రాతినిథ్యం లేకపోవడంతో తొలిసారి ఎంపీ అయినప్పటికీ ఆయనకు స్థానం కల్పించారు. నవాడా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిన దాఖలాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైయ్యాయి. నరేంద్ర మోదీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని అభ్యర్థిగా మోదీని ముందుగా సమర్థించిన వారిలో గిరిరాజ్ ఒకరు. మోదీ పట్ల చూపిన విధేయతకు ఆయనకు ఫలితం దక్కింది. నవాడా నుంచి పోటీ చేసేందుకు గిరిరాజ్ విముఖత వ్యక్తం చేసినట్టు ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. తాను సురక్షితంగా భావించే బెగుసరాయ్ స్థానం కాదని నవాడా సీటు కేటాయిండంతో అయిష్టత ప్రదర్శించారు. దీంతో మోదీ స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా గిరిరాజ్ ను నవాడా సేవకుడుగా పేర్కొన్నారు. వ్యవసాయం, పశుసంవర్థకం గిరిరాజ్ కు ఇష్టమైన అంశాలు. బీహార్ శాసనమండలిలో సభ్యుడిగా, నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భూమిహార్ ప్రాంతంలో గిరిరాజ్ ప్రభావం చూపుతారని బీజేపీ అంచనా వేస్తోంది. -
మోడీ వర్సెస్ నితీష్.. రేపు బీహార్ లో సవాల్
నవాడ: ఇన్నాళ్లూ ఘాటు విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కించిన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లు ఇప్పుడు ఒకే రోజు, ఒకే జిల్లాలో తమ సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. బీహార్‌లోని నవాడ జిల్లా ఇందుకు వేదిక కాబోతోంది. బుధవారం మోడీ, నితీష్ తమ పార్టీల అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన బోతున్నారు. నవాడకు 25 కిలో మీటర్ల దూరంలో గల నడ్రీగంజ్లో జరిగే ర్యాలీలో నితీష్ పాల్గొంటుండగా, నవాడలో జరిగే బహిరంగ సభకు మోడీ హాజరవుతారు. కాగా వీరిద్దరి సభలు ఒకే సమయంలో గాక మూడు గంటల తేడాతో జరుగుతాయి. ఇరు పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలను విజయవంతం చేసుందుకు కృషిచేస్తున్నారు. మోడీని వ్యతిరేకించి జేడీయూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మోడీ, నితీష్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బుధవారం నవాడ జిల్లాలో జరిగే సభలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. వీరిద్దరూ మరోసారి మాటలకు పదును పెట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.