పాట్నా: సబ్ ఆర్డినేట్ల పనితీరుతో బిహార్ నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళకు చిర్రెత్తిపోయింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ముగ్గురు ఏఎస్‌ఐ, ఇద్దరు ఎస్‌ఐలను లాకప్‌లో వేశారు. రెండు గంటలపాటు వారిని లోపలే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
बिहार पुलिस का हाल
— UnSeen India (@USIndia_) September 10, 2022
नवादा में SP ने लापरवाही बरतने के कारण 2 दारोगा और 3 ASI को 2 घंटे तक थाने के लॉकअप में बंद कर दिया. पुलिस एसोसिएशन ने SP पर कार्रवाई की माँग की. pic.twitter.com/FpF4ye9KOb
అయితే ఈ విషయంపై ఎస్పీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఫేక్ న్యూస్ అని బదులిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు బిహార్ పోలీసు సమాఖ్య ఈ ఘటనపై శనివారం న్యాయ విచారణకు ఆదేశించింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎస్పీని అడిగేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించట్లేదని పోలీసు సమాఖ్య అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలు బిహార్ పోలీసులను అప్రతిష్టపాలు చేస్తాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ తన అధికారంతో కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చదవండి: భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ!
Comments
Please login to add a commentAdd a comment