Superintendent of Police
-
సాఫ్ట్వేర్ టు ఐపీఎస్.. సేవలోనే సంతృప్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా నాన్న బాలాజీ పవార్. ఆయన డాక్టర్. ఎప్పుడూ ప్రజలతో మేమేకం అయ్యేవారు. ఆయనను చూశాక నాకూ అలాగే ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనిపించేది. అంతేకాదు.. కలెక్టర్లు, ఎస్పీల గురించి నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నాన్న స్ఫూర్తితోనే సివిల్స్ వైపు వచ్చాను’ అని చెప్పారు యువ ఐపీఎస్ అధికారి శరత్చంద్ర పవార్. నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన.. ఐపీఎస్ సాధించడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలను, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉద్యోగ జీవితంలో అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నా బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. పదో తరగతి వరకు మహీంద్రాహిల్స్‌లోని ఆక్జిలియం హైసూ్కల్లో చదువుకున్నాను. నారాయణగూడలోని రత్న జూనియర్ కాలేజీలో ఇంటరీ్మడియట్ పూర్తిచేశా. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేలో సీటు సాధించా. అక్కడ బీటెక్ పూర్తి చేశాక ఏడాది పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేసి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్‌ను అభివృద్ధి చేసి, రెండేళ్లపాటు నిర్వహించా. అయినా, చిన్నతనంలోనే నా మనస్సులో నాటుకున్న సేవ అనే బీజం అక్కడ ఉండనీయలేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. నా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేకూరిస్తే ఎంతో సంతృప్తి ఇస్తుంది.సాఫ్ట్‌వేర్‌లో ఉంటూనే సివిల్స్‌పై దృష్టిస్టార్టప్లో ఉండగా సివిల్స్‌పై దృష్టిపెట్టాను. సాఫ్ట్‌వేర్‌తో వచ్చే డబ్బులతోనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేవాడిని. రెండుసార్లు అటెంప్ట్ చేశా. ఇక మూడోసారి మరింత సీరియస్‌గా తీసుకొని పూర్తిగా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాను. 2015లో సివిల్స్ మూడోసారి రాశాను. 2016లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణ పూర్తయ్యాక 2018 డిసెంబర్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వచ్చిది. ఆ తరువాత రామగుండం ఓఎస్డీ, మహబూబాబాద్ ఎస్పీగా పనిచేశా. ఆ తరువాత పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా, సెంట్రల్ జోన్ డీసీసీగా, నార్కొటిక్స్ ఎస్పీగా చేశా. అక్కడి నుంచి నల్లగొండ ఎస్పీగా వచ్చా.బాధితులకు న్యాయం చేస్తే ఎంతో తృప్తిఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే నేరుగా ప్రజలకు సేవ చేయొచ్చు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. మా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం ఎంతో సంతృప్తి ఇస్తోంది. ఇప్పుడు వచ్చే జీతం.. అప్పుడు సాఫ్ట్‌వేర్‌లో వచ్చే జీతం కంటే తక్కువే అయినా.. ప్రజలకు సేవలందించడం ద్వారా ఇప్పుడు కలిగే తృప్తి ముందు అది తక్కువే అనిపిస్తుంది. మహబూబాబాద్‌లో ఎస్పీగా ఉన్నప్పుడు రెండు జాబ్ మేళాలు నిర్వహించాను. దాదాపు 1200 మంది గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగా. అది ఎంతో సంతృప్తి ఇచ్చింది. నల్లగొండలో కూడా త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం యువత గ్రూప్స్‌కు ప్రిపరేషన్లో ఉంది. అవి పూర్తయ్యాక జాబ్‌మేళా నిర్వహిస్తాం.కుటుంబ నేపథ్యం ఇదీ..ఎస్పీ శరత్చంద్ర పవార్ తండ్రి బాలాజీ పవార్ ప్రభుత్వ వైద్యుడు. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కువ కాలం నిజమాబాద్‌లో పనిచేశారు. ఆ తరువాత సంగా రెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారిగా పనిచేశారు. తల్లి గృహిణి. శరత్చంద్ర భార్య పూజ ఇంటీరియర్ డిజైనర్. వారికి ఇద్దరు పిల్లలు. సంవ్రీత్, ఐరా. ‘పోలీసు వృత్తిలో రోజూ ఏదోరకమైన ఒత్తిడికి లోనవుతుంటామని, ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలతో కాసేపు గడిపితే అన్నీ మర్చిపోతా..’ అంటున్నారు ఎస్పీ శరత్చంద్ర పవార్.అధిక వేతనం.. అయినా లోటుఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్లో సన్‌టెక్ బిజినెస్ సొల్యూషన్స్‌లో జాబ్ వచ్చింది. త్రివేండ్రం వెళ్లి అక్కడ ఏడాదిపాటు ఆ సంస్థలో ఇన్నోవేషన్ అనలిస్ట్‌గా పనిచేశా. ఆ తరువాత స్టార్టప్ ప్రారంభించాం. ఫుడ్ ఎన్ బ్రేవరేజెస్ ఇండస్ట్రీలో (ఎఫ్ఎన్బీ) రిసోర్స్ ఆప్టిమైజేషన్ చేశాను. రెండేళ్ల పాటు కొనసాగింది. మొదట ఏడాది జాబ్ చేసినప్పుడు వేతనం బాగానే వచ్చేది. స్టార్టప్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంది. అయినా ఏదో వెలితిగా ఉండేది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. నాన్న చూపిన బాటలో నడిచేందుకు సివిల్స్ వైపు మళ్లాను. -
నెల్లూరు జిల్లా: టీడీపీ అరాచకాలు.. ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా ఎస్పీని వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలు, దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశామని కాకాణి తెలిపారు.మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని ఆదాల తెలిపారు. -
స్రవంతికి అండగా నిలిచిన ఎస్పీ మాధవరెడ్డి..
పుట్టపర్తి టౌన్: నల్లమాడకు చెందిన చిన్నారి స్రవంతికి ఎస్పీ మాధవరెడ్డి ఆర్థికంగా అండగా నిలిచారు. తల్లి మృత్యువాత పడటం, అనారోగ్యంతో తండ్రి మంచం పట్టడంతో కుటుంబ భారం మోస్తున్న స్రవంతి గురించి తెలుసుకున్న ఎస్పీ సోమవారం చిన్నారిని తన కార్యాలయానికి పిలిపించారు. ఈ సందర్భంగా దుస్తులు, నిత్యావసరాలతో పాటు రూ.30 వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే చిన్నారి చదువుకు ఇబ్బంది లేకుండా గురుకుల పాఠశాలలో చేర్పిస్తామన్నారు. భవిష్యత్‌లోనూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ.. నల్లమాడకు చెందిన లక్ష్మీదేవి, సూర్యనారాయణ దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు స్రవంతిని అల్లారుముద్దుగా పెంచుకున్నారన్నారు. అయితే మూడేళ్ల క్రితం సూర్యనారాయణ చెట్టుమీద నుంచి పడి వెన్నుముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కాగా, భార్య లక్ష్మీదేవి కూలీ పనులు చేస్తూ భర్తను, కుమార్తెను పోషించేదన్నారు. అయితే ఆరు నెలల క్రితం లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందగా, కుటుంబ భారం చిన్నారి స్రవంతిపై పడిందన్నారు. తండ్రిని చూసుకుంటూ ఇరుగుపొరుగు వారు ఇచ్చే సహాయంతో జీవనం కొనసాగిస్తోందన్నారు. చిన్నారి స్రవంతికి తమవంతు సాయం అందిస్తామన్నారు. మానవతావాదులూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాతలు ఎవరైనా సాయం చేయాలనుకుంటే పుట్టగొలుసుల స్రవంతి, అకౌంట్ నంబర్ 91155144392, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నల్లమాడ (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఏపీజీబీ 0001014)కు విరాళాలు పంపాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వాసుదేవన్, సీఐలు రాజేంద్రనాథ్ యాదవ్, రాగిరి రామయ్య, బాలసుబ్రమణ్యం రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు
చండీగఢ్: హర్యానాలో నెలకొన్న హింస ఎఫెక్ట్‌తో నూహ్ జిల్లా ఎస్పీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూహ్ కేంద్రంగా మత ఘర్షణలు చెలరేగిన సోమవారం రోజు సెలవులో ఉన్న ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు వేసింది. జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ నరేంద్ర బిజర్నియా నియమిస్తూ హర్యానా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా అల్లర్లు చెలరేగే ముందు రోజే సెలవులపై వెళ్లారు. దీంతొ ఘర్షణలు మొదలైన సోమవారం నుంచి నూహ్ తాత్కాలిక ఎస్పీగా ఐపీఎస్ అధికారి నరేంద్ర బిజర్నియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 అక్టోబర్ వరకు నూహ్ జిల్లాలో పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్నారు. తాజాగా వరుణ్ సింగ్లా 160 కిలోమీటర్ల దూరంలోని బివానీ జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సింగ్లా స్థానంలో నూహ్ శాశ్వత ఎస్పీగా శుక్రవారం నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మత ఘర్షణలకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోందని పేర్కొన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాన్ని త్వరలో నుహ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: 8 ఫోర్లు జారిపడ్డ లిఫ్ట్.. గుండెపోటుతో మహిళ మృతి #WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma — ANI (@ANI) August 4, 2023 కాగా సోమవారం వీహెచ్‌పీ, బజరంగ్దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు రాజుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు మత్యువాత పడ్డారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు, మత ప్రార్థన స్థలాలు, రెస్టారెంట్లు, దుకాణలను అల్లరిమూకలు తగలబెట్టాయి. నూహ్‌లోని రెండు మసీదులకు గురువారం దుండగులు నిప్పటించారు. దీంతో నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. హింస కారణంగా 176 మందిని అరెస్ట్ చేశారు90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. VIDEO | Police personnel continue to remain deployed in parts of Gurugram in the aftermath of violence that broke out earlier this week. pic.twitter.com/1H6fHEmWlP — Press Trust of India (@PTI_News) August 4, 2023 నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలో అలాగే గురుగ్రామ్‌లోని మూడు సబ్ డివిజన్లు( సోహ్నా, పటౌడీ ,మనేసర్) ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయతితే నేడు నూహ్‌లో నేడు(శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలకు వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్‌లో కేబినెట్ బేటీ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు -
నడి రోడ్డుపై అడ్డగించి మరీ..మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..
ఓ వ్యాపారి మహిళపై యాసిడ్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ రాకను గమనించి రోడ్డుపై కాపుకాసి మరీ దాడి చేశాడు నిందితుడు. ఈ ఘటన అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...నిందుతుడికి సదరు మహిళకి ఒకరికొకరు సుపరిచితులే. నిందితుడు వివాహితుడు కాగా ఆమె అవివాహితురాలు. ఇరువురు కొద్దిరోజులు సహజీవనం చేశారు. ఐతే గత కొద్దిరోజులుగా ఇరువురి మధ్య డబ్బుల విషయమై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే నిందితుడు ఆ 30 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుడు వ్యాపారి వాస్తుకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ బిశ్వ శర్మ తెలిపారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?) -
Sirimanostavam 2022: సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు
విజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను విజయగవంతంగా నిర్వహించేందుకు మూడువేల మంది పోలీస్ బలగాలతో పటిష్టబందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ నెల 10న జరిగే తొలేళ్ల ఉత్సవం, 11న జరిగే సిరిమానోత్సవానికి గట్టి బందోబస్తు ఏర్పాటుచేస్తామని చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయనగరం ఇన్చార్జి డీఎస్పీ టి.త్రినాథ్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావుతో కలిసి గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సిరిమానోత్సవం రోజున బందోబస్తును 22 సెక్టార్లుగా విభజించి, సుమారు మూడువేల మంది పోలీసులు రెండు షిఫ్ట్‌లుగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ, అదనపు ఎస్పీ, 12 మంది డీఎస్పీలు, 63 మంది సీఐ/ఆర్ఐలు, 166 మంది ఎస్ఐ/ఆర్ఎస్ఐలు, 11 మంది మహిళా ఎస్ఐలు, స్పెషల్ పార్టీ సిబ్బందితో సహా సుమారు మూడువేలమంది పోలీస్ అధికారులను, సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తారన్నారు. మహిళా పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల సేవలను వినియోగిస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్బీ సీఐ జి.రాంబాబు, వన్‌టౌన్ సీఐ బి.వెంకటరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ అమ్మవారి చదురుగుడి ఎదురుగా తాత్కాలిక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తామని ఎస్పీ దీపిక తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకుని వచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు. బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలను ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలను ఏర్పాటుచేశామన్నారు. వాటన్నంటినీ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నట్టు తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ముందుగా గుర్తించిన 30 ప్రాంతాల్లో రూఫ్ టాప్లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రూఫ్ టాప్లలో విధులు నిర్వహించే సిబ్బంది బైనాక్యూలర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. 200 మందితో ప్రత్యేక నిఘా నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఈ బృందాలు ఆలయం రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు. రంగంలోకి బాంబ్ స్క్వాడ్ అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నట్టు ఎస్పీ స్పష్టం చేశారు. ఈ బృందాలు ఆలయాలు, బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలు కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంటాయన్నారు. పార్కింగ్ ఇలా.. ట్రాఫిక్ నియంత్రణకు వాహనాల పార్కింగ్‌కి సంబంధించి అయోధ్యా మైదానం, రాజీవ్‌స్టేడియం, రామానాయుడు రోడ్డు, పెద్దచెరువు గట్టు, అయ్యకోనేరు గట్టు, పోర్ట్ సిటీ స్కూల్ రోడ్డు, ఎస్వీఎన్ నగర్ రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ కూడలి నుంచి బాలాజీ కూడలి వరకూ గల రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు స్థలాలు ఏర్పాటుచేశామన్నారు. వీఐపీల వాహనాల పార్కింగ్‌కు బొంకులదిబ్బ, టీటీడీ కల్యాణమండపం, గురజాడ కళాక్షేత్రం, కోట ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటుచేసినట్టు వివరించారు. ప్రజలకు సూచనలు చేసేందుకు, సమాచారాన్నిచ్చేందుకు వాహనాలకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశామన్నారు. సిరిమానోత్సవం రోజున ఫోర్ వీలర్స్ వాహనాలు ఎంఆర్ కళాశాల, కేపీ టెంపుల్, గంటస్తంభం, ట్యాక్సీ స్టాండ్, శివాలయం వీధి, ఘోష ఆస్పత్రి, గుమ్చీ రోడ్డు, సింహాచలం మేడ, సత్యా లాడ్జి ప్రాంతాల్లో ప్రవేసించేందుకు అనుమతి ఉండదన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో ఎటువంటి తోపులాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలందరూ సిరిమాను తిలకించేలా అనుసంధాన రోడ్లలో బాక్స్ సిస్టమ్స్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. అధికారులు 200 వైర్లెస్ సెట్స్‌ను పోలీసుల వద్ద ఉంచి, ప్రజలకు సూచనలు చేస్తారు. పోలీసు సేవాదళ్ భక్తులకు సేవలందిస్తారు. బందోబస్తుకు వచ్చే మహిళా సిబ్బందికి దిశ మహిళా టాయిలెట్స్ ఏర్పాటుచేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పైడితల్లి అమ్మవారి పండగ శాంతియుతంగా భక్తి వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించాలని, పోలీసుల సహాయాన్ని పొందాల్సిన వారు దేవాలయం ఎదురుగా ఏర్పాటుచేసిన తాత్కాలిక కంట్రోల్‌రూమ్‌ను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. పోలీసులందరూ భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలందించాని ఆదేశించారు. సిరిమానోత్సవం రోజున డైవర్షన్స్ ఇలా.. పట్టణంలోని వాహనాలు సీఎంఆర్ జంక్షన్, గూడ్స్షెడ్ల మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్ జంక్షన్, గూడ్స్‌షెడ్ మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా పట్టణం బయటకు వెళ్లవచ్చు. కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా పట్టణం నుంచి వెళ్లేందుకు వాహనాలకు అనుమతిస్తారు. జేఎన్టీయూ, కలెక్టేరేట్, ఆర్అండ్బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్ మీదుగా పట్టణ బయటకు వాహనాలకు అనుమతిస్తారు. ప్రదీప్‌నగర్ కూడలి, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా బయటకు అనుమతిస్తారు. -
ఎస్ఐ, ఏఎస్ఐలను లాకప్‌లో బంధించిన ఎస్పీ.. వీడియో వైరల్
పాట్నా: సబ్ ఆర్డినేట్ల పనితీరుతో బిహార్ నవాడా జిల్లా ఎస్పీ గౌరవ్ మంగళకు చిర్రెత్తిపోయింది. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన ముగ్గురు ఏఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలను లాకప్‌లో వేశారు. రెండు గంటలపాటు వారిని లోపలే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. बिहार पुलिस का हाल नवादा में SP ने लापरवाही बरतने के कारण 2 दारोगा और 3 ASI को 2 घंटे तक थाने के लॉकअप में बंद कर दिया. पुलिस एसोसिएशन ने SP पर कार्रवाई की माँग की. pic.twitter.com/FpF4ye9KOb — UnSeen India (@USIndia_) September 10, 2022 అయితే ఈ విషయంపై ఎస్పీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఫేక్ న్యూస్ అని బదులిచ్చారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎన్నిసార్లు అడిగినా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు బిహార్ పోలీసు సమాఖ్య ఈ ఘటనపై శనివారం న్యాయ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై ఎస్పీని అడిగేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించట్లేదని పోలీసు సమాఖ్య అధ్యక్షుడు మృత్యుంజయ్ కుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలు బిహార్ పోలీసులను అప్రతిష్టపాలు చేస్తాయని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ తన అధికారంతో కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చదవండి: భారత్ జోడో యాత్ర: రాహుల్ ఓకే అంటే పెళ్లికి రెడీ! -
గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం
పనాజీ: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్కి గోవాలోని అస్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సిట్) అధికారి నిధి వాసన్ తెలిపారు. ఫెర్నాండజ్ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్‌కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ గోవా ఎన్నారై కమిషనరేట్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్ నరేంద్ర సవైకర్ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్, రెవెన్యూ, ఆర్కెవ్స్, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం) -
ఫిర్యాదు చేస్తే అవిటితనాన్ని వెక్కిరించి కొట్టి...
అనంతపురం క్రైం: ‘న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళితే.. కుంటి నాయాలా.. వడ్డీ వ్యాపారం చేస్తావా? అంటూ పామిడి సీఐ ఈరన్న కొట్టాడు’ అని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఎదుట ఓ దివ్యాంగుడు కన్నీటి పర్యంతమయ్యాడు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్ప చేపట్టిన స్పందన కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పామిడి మండలం కట్టకిందపల్లికి చెందిన దివ్యాంగుడు సుంకిరెడ్డి తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆపద సమయంలో కొందరికి రూ.లక్షల్లో డబ్బు ఇచ్చానని, ప్రస్తుతం వారు ఆ డబ్బు వెనక్కు ఇవ్వకుండా తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాపోయాడు. దీనిపై పామిడి సీఐ ఈరన్నకు ఫిర్యాదు చేస్తే తన అవిటితనాన్ని వెక్కిరించి కొట్టాడని ఫిర్యాదు చేశాడు. కాగా, స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై మొత్తం 94 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ సీఐ చక్రవర్తితో కలిసి వినతులను ఎస్పీ స్వీకరించి, పరిశీలించారు. తక్షణ పరిష్కారం నిమిత్తం ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. 79 సెల్ఫోన్ల అందజేత పోగొట్టుకున్న సెల్ఫోన్లను సంబంధీకులకు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అందజేశారు. సోమవారం డీపీఓలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 79 మందికి ఆయన సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు 94407 96812 వాట్సాఫ్ నంబర్‌కు సమాచారం అందించడంతో వాటిని రికవరీ చేసి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 541 సెల్ఫోన్లను రికవరీ చేసి, 450 మంది సంబంధీకులకు అందజేసినట్లు పేర్కొన్నారు. మిస్సింగ్ కేసులను నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్పీ మిస్సింగ్ కేసుల ఛేదింపులో నిర్లక్ష్యం తగదని పోలీసు అధికారులను ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సూచించారు. పిల్లలు, మహిళలు, యువతులు... ఇలా కనిపించకుండా పోయిన వారిపై సంబంధీకులు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలన్నారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి సోమవారం డీపీఓలో సీఐలతో ఆయన సమీక్షించారు. వివిధ పీఎస్‌ల్లో పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్ కేసులపై ఆరా తీశారు. ఛేదింపులో విఫలమైన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మిస్సింగ్ అయిన వ్యక్తుల ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాట్లాడి దర్యాప్తునకు ఉపయోగపడే వివరాలు సేకరించాలన్నారు. ఈ విషయంగా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. (చదవండి: రెండు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య) -
టీచర్ నుంచి పోలీస్.. ఆమె ప్రయాణం వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
ఖండఖండాంతరాల్లో పర్వతాలు అధిరోహించేలా శిఖరాగ్రానికి ఆహ్వానం పలికాయి. పోలీస్ విధుల్లోనూ ప్రశంసలు నక్షత్రాలుగా భుజాలపై మెరిశాయి. కృషి, పట్టుదలే ఆలంబనగా పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సిక్కోలు కొత్త ఎస్పీ జీఆర్ రాధిక. అటు పర్వతారోహణలో మేటిగా నిలిచిన ఆమె ఇటు పోలీస్ డ్యూటీలో కూడా ఘనాపాటిగా నిరూపించుకున్నారు. లెక్చరర్‌గా పనిచేస్తూ గ్రూప్ 1 ద్వారా పోలీస్ బాసయ్యారు. ఎస్పీ అయ్యేనాటికే ఆరు ఖండాల్లోని పర్వతాలు ఆమె పాదాక్రాంతం అయ్యాయి. తాజాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆమె సిక్కోలు శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం అంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సవాళ్లను స్వీకరించడం కొందరికి సరదా. అలాంటి కోవకే వస్తారు జిల్లా కొత్త ఎస్పీ జిఆర్ రాధిక. ఓవైపు వృత్తి.. మరోవైపు కుటుంబం.. అయినా తాను అనుకున్నది సాధించే వరకు వదల్లేదు. కొన్ని పనులను కేవలం మగవారే చేయగలరన్న నానుడికి స్వస్తి పలికి తాము కూడా చేయగలమని నిరూపించిన వారిలో రాధిక ఒకరు. ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆమె ‘సాక్షి’ ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాల్యం, విద్యాభ్యాసం.. పుట్టింది అనంతపురంలో. బాల్యం, విద్యాభ్యాసం అంతా కడపలోనే. ఇంటర్మీడియెట్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తిచేశా. పోస్ట్‌గ్రాడ్యుయేషన్(ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్) ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో చేశాను. తొలి ఉద్యోగం ఇంగ్లిష్ లెక్చరర్.. ఏపీపీఎస్సీలో జూనియర్ లెక్చరర్ (ఇంగ్లీష్)గా 2002లో ఎంపికై మెదక్‌లో మూడేళ్లు పనిచేశాను. తర్వాత కర్నూలులో ఉద్యోగం చేస్తుండగానే 2007లో గ్రూప్–1కు ఎంపికయ్యాను. మెదక్‌లో లెక్చరర్‌గా ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్‌గా చేశా. నాన్న టీచర్, అమ్మ రిటైర్డ్ ప్రిన్సిపాల్. మాది కులాంతర ప్రేమ వివాహం. భర్త బిజినెస్ చేస్తున్నారు. ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి ఎంఎస్ ఫైనలియర్, చిన్నబ్బాయి బీటెక్ ఫస్టియర్. ఇద్దరూ యూఎస్‌లో చదువుతున్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు అంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడినవారే. చాలెంజింగ్ జాబ్స్ ఇష్టం.. ప్రతి రోజూ జిమ్, సైక్లింగ్, వాకింగ్ చేస్తూ ఫిట్నెస్కి ప్రాధాన్యమిస్తాను. ఆరోగ్యంగా ఉండాలి.. ఇతరులకు సాయపడాలి. ఇలాంటి ఆలోచనలు ఉంటేనే మానవ జీవితానికి సార్థకత ఉంటుంది. చాలెంజింగ్ జాబ్స్ అంటే ఇష్టం. అవార్డులు చాలా వచ్చాయి. రోల్ మోడల్: రాజీవ్ త్రివేది సీఐడీ డీజీ సునీల్‌కుమార్ టెక్నాలజీని ఉపయోగించే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. వినూత్నమైన ఆలోచనలతో కొత్త యాప్‌ల ద్వారా డిపార్ట్మెంట్ని తీర్చిదిద్దుతున్నారు. బెస్ట్ ఫ్రెండ్: ఇండియా హాకీ టీమ్ గోల్‌కీపర్ రజిని(చిత్తూరు) అభిరుచులు: బుక్‌రీడింగ్, రైటింగ్ చాలా ఇష్టం: యాక్షన్, హర్రర్, థ్రిల్లర్ పోలీసింగ్ వంటి సినిమాలు అన్ని జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది. దీన్ని ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలి. దేవుడిపై నమ్మకంతో మనుగడ సాగిస్తే సంతోషంగా ఉండవచ్చు. ప్రతి సమస్య నుంచి ఒక పాఠం నేర్చుకుంటా. ప్రతి దాన్ని సవాలుగా స్వీకరిస్తా. పర్వతారోహణ మొదలైందిలా.. 2012లో మానస సరోవర్ యాత్రకు వెళ్లాను. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే ముందుగా 45 రోజుల మౌంటెనింగ్ కోర్సు పూర్తి చేయాలి. దీనికోసం నాతో పాటు మరో ఇద్దరు మేల్ కానిస్టేబుళ్లు దరఖాస్తు చేశారు. డిపార్ట్మెంట్ పర్మిషన్ కోసం పెట్టాను. మౌంటెనింగ్ కోర్సు కాశ్మీర్లో చేయాల్సి ఉంది. లేడీ ఆఫీసర్ని అంతదూరం పంపించడం సేఫ్ కాదని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది వద్దన్నారు. ఎలాగైనా అనుమతి ఇవ్వాలని, ప్రైవేటుగా డబ్బులు పెట్టుకుని వెళ్లడానికి సిద్ధపడి ప్లాన్ బీ పెట్టుకున్నాను. ఈలోపు ఇద్దరు కానిస్టేబుళ్లకు రిజర్వేషన్ దొరక్కపోవడంతో నాకు అవకాశం వచ్చింది. ఆరు ఖండాల్లో శిఖరాలు అధిరోహించా.. సెవెన్ సమ్మిట్ చాలెంజ్ విన్నాను. ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ దిశగానే ప్రయత్నం చేసి ముందుగా లడఖ్‌లోని జాస్కర్ రేంజ్ పరిధిలో మౌంట్ గోలిప్ కాంగ్రీ(5995మీటర్లు)ని 2013 సెప్టెంబర్ 7న ఎక్కాను. తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ మెంతోసా(6443మీటర్లు), కార్గిల్‌లోని మౌంట్ కున్(7007 మీటర్లు) అధిరోహించాను. –సివెన్ సమ్మిట్ చాలెంజ్‌లో భాగంగా 2016 మే 20న ఎవరెస్ట్(8848మీటర్లు)తో ప్రారంభించాను. తర్వాత కిలిమంజారో(ఆఫ్రికా), ఆస్ట్రేలియా ఖండంలోని కొస్కియస్‌జ్కో, ఐరోపా ఖండంలోని ఎల్బ్రస్, దక్షిణా ఆమెరికా ఖండంలోని అకోన్కాగ్వా, అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మౌంట్ , డెనాలీమౌంటెన్ ఎక్కాను. నార్త్ అమెరికాలోని అలెస్కాలో మాత్రం 300 మీటర్ల దూరానికి సమీపంలో వెనుదిరిగాను. 2021లో నేపాల్‌లోని ఇస్లాండ్ పర్వతాన్ని అధిరోహించాను. ఏపీ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో పోలీస్ ఉద్యోగంలో చేరాక ఫిజికల్ యాక్టివిటీవ్స్‌లో భాగంగానే శిఖరాలన్నీ ఎక్కే ప్రయత్నం చేశాను. డీఎస్పీగా విధుల్లో చేరాక ఈ అచీవ్మెంట్స్ అన్నీ సాధించగలిగాను. అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాను. మౌంట్ కున్ని అధిరోహించిన మొదటి ఇండియన్ మహిళగా, ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి మహిళా పోలీస్ ఆఫీసర్‌గా రికార్డులు దక్కాయి. -
‘నేర చరిత్ర ఉన్న వ్యక్తిని అత్త పెళ్లి చేసుకోమంటుంది’
భువనేశ్వర్: ‘సార్.. మా ప్రాణాలు కాపాడండి’ అంటూ వివాహిత సునీతా ప్రధాన్ గురువారం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలైన ఈమె భర్తతో కలిసి గంజాం జిల్లాలోని చికిటి సమితి, కె.నువాగాం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుమ్మరాడ గ్రామంలో కొన్నాళ్ల నుంచి నివాసముంటోంది. అయితే కొన్నిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈమె భర్త చనిపోగా అప్పటి నుంచి తన ఐదేళ్ల కూతురితో కలిసి అత్త వారి ఇంట్లో ఉంటోంది. అప్పటి నుంచి ఆమెని తన అత్త, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఎస్పీకి తెలిపింది. దీంతో పాటు తన అత్త నేర చరిత్ర కలిగిన మహేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని బలవంతం పెడుతున్నారని బాధితురాలు వాపోయింది. ఇదే విషయంపై తన తండ్రి వారిని ప్రశ్నించగా, అతనిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని ఆమె ఎస్పీ ఎదుట వాపోయింది. ఈ ఘటన పట్ల కె.నువాగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఎప్పటికైనా తమ అత్తవారింటి నుంచి ముప్పు ఉందని, నిందితులపై చర్యలు చేపట్టాల్సిందిగా ఎస్పీని ఆమె కోరారు. అనంతరం ఎస్పీ పినాకి మిశ్రాకి ఫిర్యాదు పత్రం అందజేశారు. -
హాట్సాఫ్ ఎస్పీ శ్వేత: రక్తదానంలో మగువలూ ముందడుగు
ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. చాలా మందికి రక్తం, ప్లాస్మా అవసరం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం అవసరం గుర్తించిన మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. రక్తదానం అంటే ఇప్పటికీ ఎన్నో అపోహలు సమాజంలో ఉన్నాయి. రక్తం ఇస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా చాలామందిని వీడడం లేదు. మహిళల్లో రక్తదాన విషయంలో ఇంకా ఎన్నో అనుమానాలుంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నెలసరి ఒత్తిళ్లు, ప్రసవానంతర సమస్యలు, రక్తహీనత... వంటివి వారిని ఈ విషయం లో వెనకడుగు వేయిస్తున్నాయి. వాటినన్నింటినీ దాటుకుంటూ నేటితరం యువతులు ‘మేము సైతం’ అంటూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి... సాధారణంగా చాలామంది మహిళల్లో రక్తహీనత అనేది ఒక సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం అంటే గొప్ప విషయంగానే భావించాలి. కామారెడ్డి జిల్లాలో రక్తదానం ఒక ఉద్యమంగా సాగుతున్న సందర్భంలో రక్తదానం చేస్తూ పలువురు మహిళలు కూడా రక్తదాతలుగా వెలుగొందుతున్నారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భవించి నాలుగేళ్లు గడచింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్ ఆఫీసర్ ఎన్.శ్వేత ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె తొమ్మిదిసార్లు రక్తదానం చేశారు. ఏటా రెండుసార్లు రక్తం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నానని, ఇది నిరాటంకం గా కొనసాగిస్తానంటున్నారు. ఎస్పీ స్ఫూర్తితో పలువురు యువతులు మేము కూడా... అంటూ ముందుకు వస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు రక్తదానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ఒకరి రక్తదానంతో మరొకరి ప్రాణం కాపాడొచ్చని చెబుతున్నారు. అపోహలు వీడాలి మహిళలు రక్తదానం విషయంలో ఉన్న అపోహలు వీడాల్సిన అవసరం ఉంది. మగవారే కాదు మగువలూ రక్తం ఇవ్వొచ్చు. రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేనైతే ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నాను. ఇప్పటికీ తొమ్మిది సార్లు ఇచ్చాను. రాబోయే రోజుల్లోనూ ఇస్తూనే ఉంటా. మహిళలకు రక్తదాన విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. రక్తదానంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి. –ఎన్.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి రక్తదానం చేస్తున్న జిల్లా ఎస్పీ శ్వేతను అభినందిస్తున్న ఐఏఎస్ అధికారి సత్యనారాయణ (ఫైల్) ఇబ్బందులేవీ రావు రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడామన్న సంతోషం కలుగుతోంది. – శోభ, కామారెడ్డి గొప్ప అనుభూతి మొదటిసారి రక్తదానం చేశాను. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. ఒకరికైనా సాయపడుతున్నాను అనే ఆలోచనతో గొప్ప అనుభూతిని పొందాను. రక్తదాతల సమూహం ద్వారా అవసరం ఉన్న వారికి రక్తదానం చేయడానికి ఎప్పుడైనా నేను సిద్ధం. – నవ్య, మద్దికుంట, రామారెడ్డి మండలం ఎనిమిది సార్లు రక్తదానం చేశాను రక్తదానం విషయంలో ఎలాంటి అపోహలకూ లోను కావొద్దు. నేను ఇప్పటికీ ఎనిమిది సార్లు రక్తదానం చేశాను. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్క ఆడపిల్ల రక్తదానానికి ముందుకు రావాలి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు దూసుకుపోతున్నారు. రక్తదానంలోనూ బాధ్యతను నెరవేర్చాలి. –వెన్నెల, కామారెడ్డి పట్టణం ప్రాణదాతలు కావాలి నా బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం ఉందని తెలిస్తే వెళ్లి ఇస్తున్నాను. ఇప్పటికి ఐదు సార్లు రక్తదానం చేశాను. అపోహలు వీడితే రక్తదానం చేయడానికి ఎవరికి వారే ముందుకు వస్తారు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని. –లావణ్య, రాంరెడ్డిపల్లి, బీబీపేట మండలం యువతులు ముందడుగు రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని తెలుసుకుని రక్తం చేయడానికి ముందుకు వచ్చాను. ముఖ్యంగా యువత రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలి. రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. – హర్ష, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
ఎస్పీ ఫేస్బుక్ హ్యాక్
సాక్షి, నల్లగొండ: నల్లగొండ ఎస్పీ రంగనాథ్ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయింది. ఫేస్బుక్లో సైబర్ నేరగాళ్లు ఎస్పీ రంగనాథ్ ఫొటో డీపీ(డిస్ప్లే పిక్చర్)గా పెట్టి డబ్బులు కావాలంటూ కొందరికి మెసేజ్‌లు పెట్టినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. నలుగురు వ్యక్తులకు మెసేజ్‌లు పెట్టినప్పటికీ అనుమానం వచ్చి వారు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. రెండేళ్లుగా ఎస్పీ తన వ్యక్తిగత ఫేస్బుక్ ఖాతాను ఉపయోగించడంలేదు. తన ఫేస్బుక్ హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న విషయం తెలియడంతో శుక్రవారం తన ఖాతాను ఎస్పీ డీయాక్టివేట్ చేశారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో సీఐగా పనిచేసిన బాల గంగిరెడ్డి ఫేస్బుక్ కూడా హ్యాక్ అయింది. డీపీలో బాల గంగిరెడ్డి ఫొటో పెట్టి డబ్బులు కావాలని సైబర్ నేరగాళ్లు మెసేజ్ పెట్టడంతో ఇద్దరు వ్యక్తులు రూ.20వేల చొప్పున రూ.40,000 ఖాతాలో వేసినట్లు సమాచారం. ప్రస్తుతం బాల గంగిరెడ్డి హైదరాబాద్ చిలకలగూడలో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘దిశ’ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ విషయంలో విచారణ చేపట్టాలని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఎన్కౌంటర్ ఆందోళన కలిగించే అంశమని, దీనిపై చాలా జాగ్రత్తగా విచారణ జరగాలని పేర్కొంది. నిజనిర్ధారణ చేసేందుకు సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఎన్హెచ్ఆర్సీ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్)ను ఆదేశించినట్లు తెలిపింది. సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం త్వరలోనే హైదరాబాద్ వెళ్లి నిజనిర్ధారణ చేసి నివేదిక అందజేస్తుందని వివరించింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు అప్రమత్తంగా లేరని కమిషన్ భావించింది. నిందితుల నుంచి అవాంఛనీయ ఘటన జరుగుతుందని అప్రమత్తంగా ఉండాల్సినా అలా లేకపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారని భావించింది. ‘పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ఈ ఘటన జరగడం.. సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది’అని ఎన్హెచ్ఆర్సీ వ్యాఖ్యానించింది. -
‘ఆదిత్యను దారుణంగా హత్య చేశారు’
సాక్షి, కృష్ణా : చల్లపల్లి బీసీ హాస్టల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన దాసరి ఆదిత్యది(8) హత్యేనని అడిషినల్ ఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. రాత్రి రెండు గంటల తర్వాత ఈ హత్య జరిగిందని వెల్లడించారు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆయుధాలు లభించలేదన్నారు. హత్య జరిగిన రోజు రాత్రి హాస్టల్ వాచ్మెన్ డ్యూటీలో లేడని, సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని అడిషినల్ ఎస్పీ వెల్లడించారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఈ కేసు విచారణ కోసం 4 బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని అడిషినల్ ఎస్పీ సత్తిబాబు పేర్కొన్నారు. (చదవండి : హాస్టల్లో అమానుషం ; బాత్రూంలో మృతదేహం) హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం మూడోతరగతి విద్యార్థి ఆదిత్య మృతిపై బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ డిప్యూటీ డైరెక్టర్ రమాభార్గవి స్పందించారు. హాస్టల్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వ్యాఖ్యానించారు. హత్య జరిగిన రాత్రి హాస్టల్లో వాచ్మెన్, వార్డెన్ లేరన్నారు. బయట వ్యక్తులు లోపలికి రావడం వల్లే ఈ హత్య జరుగొచ్చనే అనుమానం తనకు ఉందన్నారు. హాస్టల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలీసులు విచారణలో నిందితులెవరో తెలుస్తుందని రమా భార్గవి అన్నారు. మరిది, వాచ్మెన్పై అనుమానం వాచ్‌మెన్‌తో కలిసి తన మరిదే తన కొడుకును హత్య చేశారని ఆదిత్య తల్లి ఆదిలక్ష్మీ ఆరోపించారు. వారిద్దరిపైనే తమకు అనుమానం ఉందన్నారు. తన బిడ్డకు జరినట్లు ఏ బిడ్డకు జరుగొదంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. -
మా ఆవిడ చేసే సాంబార్ ఇడ్లీకి ఫిదా
మా ఆవిడ ప్రతిభ మనస్సు పెట్టి చేసే స్మాల్ ఇడ్లీ.. సాంబార్ అంటే నాకు భలే ఇష్టం.. ఆ రోజు నిజంగా పండుగే.. మాకు పెళ్లి అయ్యేటప్పటికి ఆమెకు వంట రాదు. తర్వాత డ్యూటీలో భాగంగా నాతో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా వంట నేర్చుకుంది. సీ ఫుడ్ బాగా వండుతుంది.. కానీ ఇక్కడ అవి దొరకవు కదా.. అందుకే తీరిక దొరికినప్పుడు స్మాల్ ఇడ్లీ, సాంబారు చేస్తుందంటున్నారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్. ‘ఆయనకు ఇష్టమైన ఇడ్లీ చేయడం అంటే నాకు కూడా ఇష్టం.. ఆయన తిని ఆనందించడం కన్నా నాకేం కావాలి’ అంటున్నారు ఆయన సతీమణి ప్రతిభ. శనివారం ‘సాక్షి పర్సనల్ టైం’తో సీపీ దంపతుల ముచ్చట్లు.. సాక్షి, సిద్దిపేట: మాది పెద్దలు కుదిర్చిన వివాహం.. మా ఇద్దరిది సాంప్రదాయక కుటుంబాలు. డాక్టర్‌గా ప్రతిభ పేదలకు, వృద్ధులకు సేవచేయడం చూసిన మా బంధువులు ఈ మ్యాచ్ గురించి చెప్పారు. అమ్మా నాన్నలకు కూడా అటువంటి వారే కావాలని కోరుకునేవారు.. ఇంకేముంది ఒప్పేసుకున్నా.. అన్నారు డేవీస్. అయితే పోలీస్ ఆఫీసర్ అంటే మా కుటుంబానికి ఇష్టం ఉండకపోయేది. కానీ మంచి దైవచింతన, పెద్దలపై గౌరవం, కింది స్థాయి నుంచి కష్టాలు, కన్నీళ్లు చవిచూసిన వ్యక్తిగా మా బంధువులు చెప్పారు. అంతకంటే ఏం కోరుకుంటామని ఆయన సతీమణి ప్రతిభ బదులు చెప్పారు. మాది తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా.. వృత్తి రీత్యా ఇక్కడికి వచ్చాం.. మాకు ఈ ప్రాంతంలో బంధువులు ఎవరూ లేరు.. నాకు మా ప్రతిభ.. ప్రతిభకు నేను.. మాకు ఇద్దరు కుమారులు ఎఫ్రేమ్ పీ జోయల్, ఇవాన్ పీ జోయల్, ఇది మా కుటుంబం.. అంతా సరదగా ఉంటాం.. అవకాశం దొరికితే ఇంటి వద్దనే ఎక్కువ గడిపేందుకు ఇష్టపడుతాం. నా పెళ్లి సమయం నాటికి ఆమెది ఎంబీబీఎస్ పూర్తి అయింది. సామాజిక సేవ చేయడం ఇష్టం. ఉట్నూరు ఆస్పత్రిలో పనిచేసినప్పుడు అందరు అంటూ ఉండేవారు.. అందుకోసమే ఆమె ఇష్ట్రపకారం ఎండీ కూడా చదివించాను. చదువును అశ్రద్ధ చేయలేదు.. చిన్నతనంలో ఎవ్వరైనా సెలవులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటారు.. నేను కూడా అంతే.. వేసవి సెలవుల్లో మా నాన్న గారు ముందుగా పదిరోజులు బైబిల్ స్కూల్‌కు పంపించేవారు.. ఆ తర్వాత.. ఆటలే ఆటలు పొద్దన లేవగానే మిత్రులతో కలిసి గ్రౌండ్‌కు వెళ్లడం.. వాలీబాల్ ఇతర ఆటలు ఆడటం.. కన్యాకుమారి చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతా లకు వెళ్లడం భలే సరదాగా ఉండేది. అయితే ఎంత ఆటలు ఆడినా.. ఎటు వెళ్లినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. సెలవులు ముగియగానే తిరిగి చదువు యుద్దం ప్రారంభించేవాళ్లం.. పోటీ పడి చదివే వాళ్లం.. కామిడీ సినిమా వస్తే చూడాల్సిందే.. కామిడీ సినిమాలు ఇంటే మా ఇద్దరికి ఇష్టం. అందుకోసమే కామిడీ సినిమా వచ్చిందంటే చూసి తీరాల్సిందే.. మనం సరదాగా సినిమాకు వెళ్తాం. అక్కడ కూడా అంతా టెన్షన్, ఉత్కంఠంగా ఉంటే నచ్చదు. సినిమా చూసిన మూడు గంటలు సరదాగా ఉండాలి. నవ్వుకునేలా ఉండాలి.. ఇటీవల చూసిన ఎఫ్–2 సినిమా మొదటి ఆఫ్ నాకు నచ్చింది. అనగానే రెండో ఆఫ్ నాకు నచ్చిందని డాక్టర్ ప్రతిభ బదులు చెప్పారు. అదేవిధంగా విక్రమార్క సినిమా కూడా బాగా నచ్చిందని చెప్పారు. తీరికి దొరికితే సిద్దిపేట కోమటిచెరువు.. ఎక్కువ సమయం దొరికితే హైదరాబాద్ వెళ్లి వస్తాం.. అక్కడ షాపింగ్, ఫుడ్ కోర్టులోకి వెళ్లడం అంటే కూడా ఇష్టమే. నైనిటల్ అంటే బాగా ఇష్టం.. ఇద్దరం బీజీగా ఉంటాం.. కానీ అప్పుడప్పుడు టూర్స్ వేస్తాం.. మా రాష్ట్రంలోని ఊటీ, కొడైకెనాల్ ఎప్పుడూ వెళ్తుంటా.. అయితే నైనిటాల్ అంటే బాగా ఇష్టం. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడికి ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపిస్తుంది. మా పెళ్లి అయిన తర్వాత ఆరు సంవత్సరాలకు ఇద్దరు కవలలు పుట్టారు. వారి పుట్టిన రోజు మాకు బాగా ఆనందకరం కల్గించిన రోజు.. అదేవిధంగా చిన్నబాబు ఇవాన్ పీ జోయల్ గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నప్పుడు... ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఆరోజు ఇద్దరు కంటికి రెప్పకూడా వేయకుండా బాబును చూసుకుంటూ ఏడ్చాం. అంతటి బాధెప్పుడూ రాలేదు. దేవుడి దయవల్ల ఇప్పుడు అంతా హ్యాపీ. -
ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎస్సైకి గుండెపోటు
-
అసెంబ్లీ వద్ద ఎస్సైకి గుండెపోటు
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఆవరణలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై గుండె పోటుకు గురయ్యారు. డ్యూటీలో ఉన్న ఎస్సై కోలా మోహన్‌కు గుండెనొప్పితో ఒక్కసారిగా కుప్పకూలారు. అప్రమత్తమైన మిగతా సిబ్బంది ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హరికృష్ణ మృతికి కారణాలివే..!
సాక్షి, నల్లగొండ : సీటు బెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా వాహనాన్ని నడుపడం.. వాహనం నడుపుతున్న సమయం తెల్లవారుజాము కావడం ఇవే.. రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ (61) మృతికి కారణాలని పోలీసులు చెప్తున్నారు. ఆయన స్వయంగా నడుపుతున్న కారు నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలను నల్లగొండ ఎస్పీ రంగనాథ్ ‘సాక్షి’ టీవీకి వివరించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. సీటు బెల్లు ధరించి ఉంటే ప్రమాద స్థాయి తగ్గేదన్నారు. ప్రమాదం జరిగే సమయంలో ఫార్చునల్ కారు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోందని, ఈ సమయంలో వాటర్ బాటిల్ కోసం కారును నడుపుతున్న హరికృష్ణ వెనక్కి తిరగడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పిందని ఆయన తెలిపారు. దీంతో డివైడర్‌ను ఢీకొట్టి 15 మీటర్ల దూరంలోకి కారు ఎగిరిపడిందని, డ్రైవింగ్ సీట్లో ఉన్న హరికృష్ణ 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారని ఎస్పీ వివరించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘నెల్లూరు జరిగే ఓ వివాహానికి AP28 BW 2323 నంబర్ కారులో ఈ రోజు (బుధవారం) తెల్లవారు జామున 4.30 ప్రాంతంలో హైదరాబాద్ నుంచి హరికృష్ణ బయల్దేరారు. కారును హరికృష్ణ డ్రైవ్ చేస్తున్నారు. 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి అన్నెపర్తి వద్ద డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టింది. దీంతో కారు గాల్లో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన 15మీటర్ల దూరంలో పడిపోయింది. హరికృష్ణ దాదాపు 20మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలైన హరికృష్ణను 5నిమిషాల్లో నార్కెట్‌పల్లి కామినేని ఆస్పత్రి తరలించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించడంతో హరికృష్ణ మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. సీటు బెల్టు ధరించకపోవడం, అతివేగమే ప్రమాదానికి కారణం. ఘటనపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’ అని ఎస్పీ పేర్కొన్నారు. -
వివాహితపై నలుగురు అత్యాచారం..
-
దారుణం.. వివాహితపై నలుగురు అత్యాచారం..
సాక్షి, నాగర్‌కర్నూల్ : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు చేసింది. అయిన దేశంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతునే ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో గత రాత్రి దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గత రాత్రి నలుగురు యువకులు వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విధమైన ఘటనలు చోటు చేసుకోవడం భాధాకరమని అన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
న్యాయం చేయండి: ఎస్పీని ఆశ్రయించిన ప్రేమికుడు
సాక్షి, నందిగామ: తనకు న్యాయం చేయాలంటూ కృష్ణాజిల్లా ఎస్పీ త్రిపాఠిని ఆశ్రయించాడో ప్రేమికుడు. వివరాలు ఇలా ఉన్నాయి. సురేష్ అనే యువకుడు శ్రీజ అనే యువతిని ప్రేమించి గత నెల 21న వివాహం చేసుకున్నాడు. ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు ఒప్పుకోకపోగా సురేష్‌ను బెదిరించారు. దీంతో ఇద్దరూ ఈ నెల 4న చెన్నై పారిపోయారు. చెన్నైలో ఉన్న శ్రీజను ఆమె కుటుంబీకులు బలవంతంగా తీసుకొచ్చి సురేష్‌పై నందిగామ పోలీసు స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. నందిగామ డీఎస్పీ రాధేష్ మురళి కూడా అమ్మాయి కులానికే చెందినవాడు కావడంతో తనను బెదిరిస్తున్నాడని బాధితుడు సురేష్ త్రిపాఠికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వారం రోజులైనా నందిగామ ఎస్సై సురేష్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదని తెలిపాడు. సురేష్ ఫిర్యాదుతో సీఐ వెంకటరమణ, ఎస్సై సురేష్‌లపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. అమ్మాయిని మర్చిపోవాలంటూ డీఎస్పీ, సీఐ, ఎస్సైలు బెదిరించారని బాధితుడు ఆరోపించాడు. -
పోలీస్ బాస్ సీరియస్?
నారాయణపేట: గత నెల 30న మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌కు ఎదురుతిరగడం.. గన్మెన్లు దాడికి దిగడంతో రైతుల ధర్నా.. తాజాగా వారిపై కేసుల నమోదే కాకుండా చితకబాదిన ఘటన పోలీసుల మెడకు చుట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు శనివారం వత్తు గుండ్లకు చెందిన రైతులు రఘువీరారెడ్డి, శివవీరారెడ్డి, ధర్మవీరారెడ్డి, మాల హన్మంతును అరెస్టు చేసి కోస్గి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారని చెబుతున్నారు. తమ ను పోలీసులు కోట్టారని శివవీరారెడ్డి జడ్జి ముందు వాపోవడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జడ్జి ఆదేశించినట్లు శివవీరారెడ్డి వెల్లడించారు. ఇక ఆదివారం రాత్రి నా రాయణపేటకు వచ్చిన మాజీ మంత్రి డీకే.అరుణకు విషయం తెలియడంతో సీఐ రామకృష్ణ, దామరగిద్ద ఎస్ ఐ నరేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వత్తుగుండ్ల రైతుల విషయంలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. కేసులు చేస్తే అరెస్టు చేసి రిమాండ్ చేయాలే తప్ప చితకబాదడం సరికాదని వత్తుగుండ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు స రైన న్యాయం జరగపోతే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తా మని బాధిత రైతు శివవీరారెడ్డి తెలిపారు. ఎవరినీ కొట్టలేదు.. వత్తుగుండ్లలో జరిగిన సంఘటన కేసులో రైతులు శివవీరారెడ్డి, ధర్మావీరారెడ్డి, హన్మంతు, రఘువీరారెడ్డిని అరెస్ట్ చేసిన విషయం వాస్తవమేనని నారాయణపేట సీఐ రామకృష్ణ వెల్లడించారు. అయితే, శివవీరారెడ్డి పోలీ సు వాహనంలో ఎక్కే సమయంలో దురుసుగా వ్యవహరించాడన్నారు. ఆయన వాహనంలో ఎక్కించే సమయంలో డోర్లు వేయకుండా అడ్డుకోగా చేతులు, కాళ్లకు తగిలాయే తప్ప తాము ఎవరికీ కొట్టలేదని తెలిపారు. -
ప్రజా సేవ.. పోలీసు సంక్షేమం
సాక్షి, కడప : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ.. ప్రజా సేవ.. పోలీసు సంక్షేమం.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.. ఇలా వివిధ అంశాల్లో పోలీసు యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తోందని జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ పేర్కొన్నారు. కడప పోలీసు పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఈ ఏడాది సాధించిన పలు విజయాలను ఆయన వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట.. జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే 1510 మందిని అరెస్టు చేసి 23 టన్నుల దుంగలు, 74 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. 116 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు, 22 మంది అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించాం. ఫ్యాక్షన్ కనుమరుగు జిల్లాలో 71 ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. నిత్యం గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇవ్వడం..పల్లెనిద్ర చేపట్టడం...ఫ్యాక్షన్ గ్రామాల్లో గట్టి నిఘా, బైండోవర్ కేసులు, గ్రామ సభలు, వాహనాల తనిఖీ, కార్బన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.. పోలీసుల ద్వారా 90 కళాజాతా కార్యక్రమాలు నిర్వహించడం.. 13 చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గిపోయాయి. రోడ్డు ప్రమాదాలను తగ్గించాం జిల్లా రవాణాశాఖతో కలిపి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగాం. 2016లో 2030 మంది క్షతగాత్రులుంటే 2017లో 1666 మంది ఉన్నారు. వాహనాల తనిఖీలో రికార్డు స్థాయిలో 2,49,791 మందికి జరిమానాలు విధించాం. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కేసుల నమోదు. శిక్షలు ఖరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాం. 2016లో 1701 కేసులు నమోదు కాగా, 2017లో 5512 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిలో గత ఏడాది 182 మందికి శిక్ష పడితే 2017లో 362 మందికి శిక్ష పడింది. పరివర్తనతో మట్కా నిర్మూలన మట్కా మహమ్మారి వలలో చిక్కి విలవిల్లాడుతున్న వారిని రక్షించేందుకే ప్రత్యేకంగా పరివర్తన లాంటి కార్యక్రమం చేపట్టాం. గత ఏడాది 239 కేసులు నమోదైతే ఈసారి 106కు తగ్గాయి. పరివర్తన పేరుతో 744 కార్యక్రమాలు నిర్వహించి 25 వేల మందిని కలిసి మార్పు తీసుకు వచ్చేందుకు కృషి చేశాం. లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా ఫస్ట్ లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో జిల్లా పోలీసుశాఖ కృషి ఫలితంగా రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 2016లో కేవలం 715 కేసులు మాత్రమే పరిష్కారం కాగా, 2017లో 4042 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించాం. అసాంఘిక కార్యకలాపాలపై దాడులు జిల్లాలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కోడిపందేలపై విస్తృతంగా దాడులు నిర్వహించాం. 2016లో రూ.1.72 కోట్లు స్వాధీనం చేసుకోగా, 2017లో రూ. 3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నాం. గల్ఫ్ బాధితులకు అండగా బంధం ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లి అక్కడి యజమానులు, ఏజెంట్ల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేకంగా బంధం యాప్‌ను రూపొందించాం. జిల్లాలోని 10078 కుటుంబాలు బంధంలో నమోదయ్యాయి. 33 మంది మహిళలను గల్ఫ్ నుంచి విముక్తి కల్పించాం. ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు, ఉపాధి రాష్ట్రంలోనే జిల్లాలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ల సమస్యలను మానవీయ కోణంలో చూశాం. అందుకు తగ్గట్టుగా వారికి ఆధార్, రేషన్‌కార్డులు, బ్యాంకు అకౌంట్లు, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఎస్పీ పేర్కొన్నారు. -
ఎస్పీపై ఎస్సై ఫిర్యాదు
చింతలపూడి: అనారోగ్యంతో మెడికల్ లీవ్‌లో ఉన్న తనను కులం పేరుతో దూషించడమే కాక , నిత్యం మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని సాక్షాత్తు జిల్లా సూపరింటెండెంట్ పై ఓ ఎస్సై ఫిర్యాదు చేశాడు. ఎస్పీతోపాటు డీఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ హెచ్‌సిలు కూడా క్షోభకు గురిచేశారని వాపోతున్నాడా ఎస్సై. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎస్సైగా పనిచేస్తున్న డి. రాంబాబు నాయక్.. జ్వరంతో బాధపడుతుండటంతో నవంబర్ 5 నుంచి 7 వరకు మెడికల్ లీవ్ కావాలని ఉన్నతాధికారులను కోరాడు. అందుకు నిరాకరించిన అధికారులు అతడికి సెలవు మంజూరుచేయకపోగా గ్రౌహౌండ్స్ ట్రైనింగ్ డ్యూటీ వేశారు. డ్యూటీకి వెళ్లలేనని తేల్చిచెప్పడంతో తనను కులంపేరుతో దూషించారని ఎస్సై రాంబాబు ఉన్నతాధికారులపై ఫిర్యాదుచేశారు. ఈమేరకు తన భార్యతో కలిసి ఎస్సై రాంబాబు శనివారం రాత్రి చింతలపూడి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదుచేశారు. ఎస్సీ భాస్కర్ భూషణ్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె వెంకట్రావు, స్పెషల్ బ్రాంచ్ హెచ్ సిలు ప్రభాకర్‌రావు, పిసి సత్యన్నారాయణలపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. అనంతరం ఎస్ఐ రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ.. గత నెల 28 న ఓ కేసు విషయమై ఎస్సీ తనకు ఫోన్ చేశారని, అకారణంగా కులంపేరుతో దూషించారని చెప్పాడు. ఎస్పిపై అట్రాసిటి సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు.