Haryana Violence: Nuh Police Chief Varun Singla On Leave During Violence Is Transferred - Sakshi
Sakshi News home page

హర్యానా ఘర్షణల్లో ఆరుగురు మృతి.. సెలవులపై వెళ్లిన నూహ్‌ ఎస్పీపై వేటు

Published Fri, Aug 4 2023 12:19 PM | Last Updated on Fri, Aug 4 2023 3:07 PM

Nuh Police Chief varun Singla On Leave During Violence Is Transferred - Sakshi

చండీగఢ్‌: హర్యానాలో నెల​కొన్న హింస ఎఫెక్ట్‌తో నూహ్‌ జిల్లా ఎస్పీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూహ్‌ కేంద్రంగా మత ఘర్షణలు చెలరేగిన సోమవారం రోజు సెలవులో ఉన్న ఎస్పీ వరుణ్‌ సింగ్లాపై  బదిలీ వేటు వేసింది.  జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ నరేంద్ర బిజర్నియా నియమిస్తూ హర్యానా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా నూహ్‌ జిల్లా ఎస్పీ వరుణ్‌ సింగ్లా అల్లర్లు చెలరేగే ముందు రోజే సెలవులపై వెళ్లారు.  దీంతొ ఘర్షణలు మొదలైన సోమవారం నుంచి నూహ్‌ తాత్కాలిక ఎస్పీగా ఐపీఎస్‌ అధికారి నరేంద్ర బిజర్నియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 అక్టోబర్‌ వరకు నూహ్‌ జిల్లాలో పోలీస్‌ బలగాలకు అధిపతిగా ఉన్నారు. 

తాజాగా వరుణ్‌ సింగ్లా 160 కిలోమీటర్ల దూరంలోని బివానీ జిల్లాకు ఎస్పీగా  ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. సింగ్లా స్థానంలో నూహ్‌ శాశ్వత ఎస్పీగా శుక్రవారం నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మత ఘర్షణలకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోందని పేర్కొన్నారు.  ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాన్ని త్వరలో నుహ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: 8 ఫోర్లు జారిపడ్డ లిఫ్ట్‌.. గుండెపోటుతో మహిళ మృతి

కాగా సోమవారం వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు రాజుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు మత్యువాత పడ్డారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు, మత ప్రార్థన స్థలాలు, రెస్టారెంట్లు, దుకాణలను అల్లరిమూకలు తగలబెట్టాయి. నూహ్‌లోని రెండు మసీదులకు గురువారం  దుండగులు నిప్పటించారు. దీంతో నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. హింస కారణంగా 176 మందిని అరెస్ట్ చేశారు90 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలో అలాగే గురుగ్రామ్‌లోని  మూడు సబ్ డివిజన్‌లు( సోహ్నా, పటౌడీ ,మనేసర్‌) ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయతితే నేడు నూహ్‌లో నేడు(శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలకు వరకు కర్ఫ్యూ సడలించనున్నారు.  సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ చండీగఢ్‌లో కేబినెట్‌ బేటీ ఏర్పాటు చేయనున్నారు. 

అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
చదవండి: రాహుల్‌ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement