Haryana Violence
-
Nuh Violence: హర్యానా అల్లర్లలో మరో నిందితుడి అరెస్టు..
చండీగఢ్: హర్యానా అల్లర్లలో నిందితుడు అమిర్‌ను అదుపులోకి తీసుకున్నారు హర్యానా పోలీసులు. ఆరావళి పర్వతాల్లో దాగిన అమిర్ పోలీసులను చూడగానే కాల్పులు జరపగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడి పోలీసులకు చిక్కాడు. గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. నిందితుడి నుండి ఒక దేశవాళీ తుపాకీ తోపాటు ఐదు కేట్రిడ్జ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. హర్యానా అల్లర్లలో ప్రధాన సూత్రధారుల కోసం హర్యానా పోలీసులు ఆరావళి పర్వతశ్రేణుల్లో వేట మొదలుపెట్టారు. ఆరావళి పర్వతాల్లో నక్కిన దుండగులను పట్టుకునే క్రమంలో విస్తృతంగా గాలిస్తుండగా తౌరు ప్రాంతంలో అమిర్ హర్యానా పోలీసులు వస్తుండటాన్ని గమనించి అనుచరులతో కలిసి వారిపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో అమిర్ కాలిలోకి బులెట్ దూసుకుపోయింది. దిధారా గ్రామానికి చెందిన అమిర్‌పై ఢిల్లీ పరిధిలో సుమారు 100 కేసులున్నాయని అతడిపై రూ.25,000 నగదు బహుమతిని కూడా ప్రకటించినట్లు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఇతర నిందితులను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎన్కౌంటర్ జరిగిందని తెలిపారు పోలీసులు. ఇక ఈ అల్లర్లలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు బజరంగ్, మోను మానేసర్లు రెచ్చగొట్టడం వల్లనే ఈ హింస చెలరేగిందన్న ఆరోపణలు రావడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిట్టు బజరంగ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మోను మానేసర్ పాత్రపై విచారణ జరుగుతోందన్నారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 64 ఎఫ్ఐఆర్లు నమోదుకాగా మొత్తం 280 మందిని అరెస్టు చేశారు. వీరితోపాటు సోషల్ మీడియాలో వదంతులను ప్రచారం చేస్తున్నందుకు మరో 12 మందిపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు హర్యానా పోలీసులు. ఈ సందర్బంగా నూహ్ పోలీసులు వదంతులు పుకార్లను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇది కూడా చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.21 లక్షల బంగారం పట్టివేత -
ముగ్గురి ప్రాణాలు కాపాడాడు.. ప్రభుత్వం అతని ఇంటిని బుల్డోజర్తో..
చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లు జరిగిన రోజున హిసార్ కు చెందిన రవీందర్ ఫోగట్ తోపాటు అతని స్నేహితులకు ఆశ్రయమిచ్చినందుకు అనీష్ అనే వ్యక్తి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది హర్యానా ప్రభుత్వం. అల్లర్లతో అనీష్ కు సంబంధం లేకపోయినా అల్లరిమూకకు ఆశ్రయమిచ్చాడన్న కారణంతో అతని ఇంటిని కూలదోసింది ప్రభుత్వం. నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ బ్రీజ్ మండల్ జలాభిషేక యాటర్ పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక అల్లరి మూక వారిపై రాళ్ల దాడి చేయడంతో భారీ విధ్వాంసానికి తెరలేచింది. ఈ అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయాల పాలయ్యారు. దాడులు ప్రతిదాడులతో మూడు రోజుల పాటు ఆ ప్రాంతం అట్టుడికింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే నెపంతో అక్కడి ప్రభుత్వం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే రవీంద్ర ఫోగట్, అతడి స్నేహితులు అల్లర్ల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అనీష్ ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఆశ్రయమిచ్చాడన్న నెపంతో ప్రభుత్వం అనీష్ ఇంటిని బుల్డోజర్తో కూల్చేసింది. ఏ నేపథ్యంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ ట్రీట్మెంట్లో బుల్డోజర్లు ఒక భాగమంతే అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. రవీంద్ర ఫోగట్ తాను ఒక కాంట్రాక్టరునని అల్లరి మూకల దాడి నేపథ్యంలో ఆ రోజున ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వారు అనీష్ ఇంటిలో ఆశ్రమ పొందినట్లు చెప్పారు. తన కారు పూర్తిగా ధ్వంసమైందని.. కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణిగాక అనీష్ తన కారులో PWD గెస్ట్ హౌస్ వద్ద తనను డ్రాప్ చేసినట్లు తెలిపారు. తాను చెయ్యని తప్పుకు అనీష్ తన ఇంటిని కోల్పోయాడని వ్యాఖ్యానించారు. ఈ విధంగా అకారణంగా బుల్డోజర్ విధ్వాంసాలకు గురైన వారి సంఖ్య నూహ్ జిల్లాలో అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ కూల్చివేతలపై సీరియస్ అయ్యింది. ఈ సందర్బంగా హైకోర్టు "అధికారం అవినీతికి కారణమైతే సంపూర్ణ అధికారం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందంటూ" లార్డ్ ఆక్టన్ మాటలను కూడా గుర్తు చేసింది. ఇది కూడా చదవండి: నల్లగా ఉంటే భర్త కాకుండా పోతాడా? ఉన్నా భర్తే కదా.. -
హర్యానా అల్లర్లు: నాలుగోరోజుకు చేరిన బుల్డోజర్ విధ్వంస ప్రక్రియ
చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. హర్యానాలో మతపరమైన అల్లర్లకు కారణమైన వారికి సంబంధించిన ఇళ్లను బుల్డోజర్తో కూలదోసేందుకు ఉపక్రమించింది హర్యానా పోలీసు శాఖ. ఇప్పటికే మూడు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆదివారం ఈ కార్యక్రమం నాలుగోరోజుకి చేరుకుంది. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. ఇందులో భాగంగా అల్లర్లకు ప్రధాన కారణమైన సహారా హోటల్‌ను కూడా కూల్చివేశారు అధికారులు. జులై 31న విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపుపై కొంతమంది సహారా హోటల్ పైభాగం నుండి రాళ్లు రువ్వడంతో ఈ వివాదం పురుడు పోసుకుంది. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో దగ్గర్లోని దేవాలయంలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. అదేరోజు రాత్రి ఆ ప్రాంతంలోని మసీదు దగ్ధం కాగా అక్కడి నుండి గురుగ్రామ్ వరకు వందల కొద్దీ వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అల్లర్లలో ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారితో సహా ఆరుగురు మరణించగా వందల సంఖ్యలో సామన్యులు గాయపడ్డారు. అల్లర్లకు పాల్పడిన వారిలో చాలామంది అరెస్టులకు భయపడి వేరే ప్రాంతాలకు పారిపోయారు. దీంతో పోలీసులు నిందితులకు సంబంధించిన ఆస్తులను లక్ష్యం చేసుకుని అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. #WATCH | Haryana | A hotel-cum-restaurant being demolished in Nuh. District administration says that it was built illegally and hooligans had pelted stones from here during the recent violence. pic.twitter.com/rVhJG4ruTm — ANI (@ANI) August 6, 2023 ఇది కూడా చదవండి: అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్ -
హర్యానా ఘర్షణలు.. నుహ్ జిల్లాలో బుల్డోజర్ చర్యకు దిగిన ప్రభుత్వం
చండీగఢ్: మత ఘర్షణలతో హర్యానా రాష్ట్రం అట్టుడుకుతోంది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన అల్లర్లతో నూహ్, గురుగ్రామ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నూహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ చర్చ చేపట్టింది. హింసాకాండకు గురైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరు ఏరియాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివసిస్తున్న వసలదారుల గుడిసెలను అధికారులు కూల్చివేశారు. కాగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా చెలరేగిన హింసలో బయటి వ్యక్తులు(చొరబాటుదారులు) పాల్గొన్నారని పోలీసులతోపాటు సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ సైతం ఆరోపించారు. ఈ క్రమంలో అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలుగా భావించి బుల్డోజర్ యాక్షన్‌కు దిగినట్లు తెలుస్తోంది. స్వయంగా సీఎం ఖట్టరే ఈ కూల్చివేతలకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో అస్సాంలో ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ శరణార్థులు.. ఇటీవల హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో నివసిస్తున్నారు. నూహ్ జిల్లాలోని తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి మార్గంలో వార్డు నంబర్ వన్‌లోని హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు ఎకరం స్థలంలో 250కి పైగా గుడిసెలు నిర్మించి, వారు గత నాలుగేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు సమాచారం. చదవండి: హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు -
హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు
చండీగఢ్: హర్యానాలో నెలకొన్న హింస ఎఫెక్ట్‌తో నూహ్ జిల్లా ఎస్పీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూహ్ కేంద్రంగా మత ఘర్షణలు చెలరేగిన సోమవారం రోజు సెలవులో ఉన్న ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు వేసింది. జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ నరేంద్ర బిజర్నియా నియమిస్తూ హర్యానా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా అల్లర్లు చెలరేగే ముందు రోజే సెలవులపై వెళ్లారు. దీంతొ ఘర్షణలు మొదలైన సోమవారం నుంచి నూహ్ తాత్కాలిక ఎస్పీగా ఐపీఎస్ అధికారి నరేంద్ర బిజర్నియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 అక్టోబర్ వరకు నూహ్ జిల్లాలో పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్నారు. తాజాగా వరుణ్ సింగ్లా 160 కిలోమీటర్ల దూరంలోని బివానీ జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సింగ్లా స్థానంలో నూహ్ శాశ్వత ఎస్పీగా శుక్రవారం నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మత ఘర్షణలకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోందని పేర్కొన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాన్ని త్వరలో నుహ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: 8 ఫోర్లు జారిపడ్డ లిఫ్ట్.. గుండెపోటుతో మహిళ మృతి #WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma — ANI (@ANI) August 4, 2023 కాగా సోమవారం వీహెచ్‌పీ, బజరంగ్దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు రాజుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు మత్యువాత పడ్డారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు, మత ప్రార్థన స్థలాలు, రెస్టారెంట్లు, దుకాణలను అల్లరిమూకలు తగలబెట్టాయి. నూహ్‌లోని రెండు మసీదులకు గురువారం దుండగులు నిప్పటించారు. దీంతో నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. హింస కారణంగా 176 మందిని అరెస్ట్ చేశారు90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. VIDEO | Police personnel continue to remain deployed in parts of Gurugram in the aftermath of violence that broke out earlier this week. pic.twitter.com/1H6fHEmWlP — Press Trust of India (@PTI_News) August 4, 2023 నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలో అలాగే గురుగ్రామ్‌లోని మూడు సబ్ డివిజన్లు( సోహ్నా, పటౌడీ ,మనేసర్) ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయతితే నేడు నూహ్‌లో నేడు(శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలకు వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్‌లో కేబినెట్ బేటీ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు -
హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి
హర్యానాలోని నూహ్ జిల్లాల్లో రెండు వర్గాల మధ్య రాజుకున్న మత ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. నాలుగు రోజులుగా హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ననూహ్ జిల్లాలో ప్రారంభమైన అల్లర్లు గురుగ్రామ్, దాని చుట్టు పక్కలా ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. సోమవారం నిర్వహించిన మతపరమైన ఊరిగేంపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఓ మహిళా జడ్జీ ఆమె కూతురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నూజ్ జిల్లా అడిషనల్ చీఫ్ జస్టిస్ అంజలి జైన్.. తన మూడేళ్ల కూమార్తె, గన్‌మెన్ సియారమ్తో కలిసి కారులో మధ్యాహ్నం 1 గంటలకు మందుల కోసం మెడికల్ కాలేజీకి వెళ్లారు. 2 గంటలకు వైద్య కళాశాల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో సుమారు 100-150 మంది అల్లరిమూకలు ఆమె కారును అడ్డుకున్నారు. చదవండి: 100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు వెనక అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఆ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ కారుకు నిప్పంటించారు. కారులో జడ్జితో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. వీరంతా రోడ్డుపైనే కారు వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. నూహ్‌లోని పాత బస్టాండ్‌లోని వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. తరువాత కొందరు న్యాయవాదులు వచ్చి వీరిని రక్షించారు. మరుసటి రోజు కారును చూసేందుకు వెళ్లగా దుండగులు దానిని తగలబెట్టారు. దీనిపై కోర్టు సిబ్బంది అయిన టెక్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై మంగళవారం సిటీ నూహ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణలు గత రెండు రోజులుగా గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్పై ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. చదవండి: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
గుర్మీత్ తీర్పు.. అల్లర్లు... అంతా దైవలీల!
ముంబై: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎపిసోడ్‌పై మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు రాధేమా స్పందించారు. గుర్మీత్ దోషిగా తేలటం, హరియాణాలో హింస చెలరేగటం అంతా దైవ నిర్ణయమే అని ఆమె పేర్కొన్నారు. వరుసగా బాబాలు, స్వామీజీలు జైలుకు వెళ్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆయన(గుర్మీత్) వ్యవహారం గురించి నాకేం తెలీదు. నేనే ఈశ్వర్య ధ్యానంలో మునిగిపోయి ఉన్నా. జరిగే పరిణామాలన్నీ ఆ భగవంతుడి లీలలే. అమాయకులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం. అది వారి కర్మ’ అంటూ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న విమర్శల గురించి రాధే మా స్పందిస్తూ గాజుతో ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఎదుటి వాళ్ల మీద రాళ్లు వేయాలని ప్రయత్నించకూడదని వ్యాఖ్యానించారు. ‘నేనొక రొమాంటిక్ దేవిని. నా ఇంటిని.. నా బిడ్డలను(భక్తులను) కాపాడుకోవటమే నా ముందున్న విధి.. విమర్శలను పట్టించుకోనూ’ అంటూ మరో వ్యాఖ్య కూడా రాధే మా చేశారు. ఇక దేశ ప్రధాని మోదీ ఓ సాధువని, ఆయన నిర్ణయాలన్నీ దేశానికి మేలునే చేస్తాయని ఆమె చెప్పారు. మరోవైపు తనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు రిషికపూర్ గురించి మాట్లాడుతూ.. ఆయన చాలా మంచి వారని, ఎలాంటి పాపం చేయలేదని, భగవంతుడే ఆయనకు సమాధానం చెప్తాడని రాధే మా అన్నారు. తనకు తాను దైవంగా చెప్పుకునే రాధే మా 2015 లో ఓ మహిళను కట్నం కోసం వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. నటి డాలీ బింద్రా కూడా ఈ మాతాజీ పై బెదిరింపులు, లైంగిక వేధింపుల కేసు పెట్టారు. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని భక్తి ముసుగులో అశ్లీలతను ప్రదర్శిస్తోందంటూ ఫాల్గుని బ్రహ్మభట్ట్ అనే న్యాయవాది ఆమెపై ఫిర్యాదు కూడా చేశారు.