చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లు జరిగిన రోజున హిసార్ కు చెందిన రవీందర్ ఫోగట్ తోపాటు అతని స్నేహితులకు ఆశ్రయమిచ్చినందుకు అనీష్ అనే వ్యక్తి ఇంటిని బుల్డోజర్‌లతో కూల్చేసింది హర్యానా ప్రభుత్వం. అల్లర్లతో అనీష్ కు సంబంధం లేకపోయినా అల్లరిమూకకు ఆశ్రయమిచ్చాడన్న కారణంతో అతని ఇంటిని కూలదోసింది ప్రభుత్వం.
నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ బ్రీజ్ మండల్ జలాభిషేక యాటర్ పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక అల్లరి మూక వారిపై రాళ్ల దాడి చేయడంతో భారీ విధ్వాంసానికి తెరలేచింది. ఈ అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయాల పాలయ్యారు. దాడులు ప్రతిదాడులతో మూడు రోజుల పాటు ఆ ప్రాంతం అట్టుడికింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే నెపంతో అక్కడి ప్రభుత్వం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే రవీంద్ర ఫోగట్, అతడి స్నేహితులు అల్లర్ల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అనీష్ ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఆశ్రయమిచ్చాడన్న నెపంతో ప్రభుత్వం అనీష్ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేసింది. ఏ నేపథ్యంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ ట్రీట్‌మెంట్‌లో బుల్డోజర్‌లు ఒక భాగమంతే అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం.
రవీంద్ర ఫోగట్ తాను ఒక కాంట్రాక్టరునని అల్లరి మూకల దాడి నేపథ్యంలో ఆ రోజున ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వారు అనీష్ ఇంటిలో ఆశ్రమ పొందినట్లు చెప్పారు. తన కారు పూర్తిగా ధ్వంసమైందని.. కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణిగాక అనీష్ తన కారులో PWD గెస్ట్ హౌస్ వద్ద తనను డ్రాప్ చేసినట్లు తెలిపారు. తాను చెయ్యని తప్పుకు అనీష్ తన ఇంటిని కోల్పోయాడని వ్యాఖ్యానించారు.
ఈ విధంగా అకారణంగా బుల్డోజర్ విధ్వాంసాలకు గురైన వారి సంఖ్య నూహ్ జిల్లాలో అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ కూల్చివేతలపై సీరియస్ అయ్యింది. ఈ సందర్బంగా హైకోర్టు "అధికారం అవినీతికి కారణమైతే సంపూర్ణ అధికారం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందంటూ" లార్డ్ ఆక్టన్ మాటలను కూడా గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: నల్లగా ఉంటే భర్త కాకుండా పోతాడా? ఉన్నా భర్తే కదా..
Comments
Please login to add a commentAdd a comment