haryana high court
-
మళ్లీ మొదటికి.. నేడు జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే
చండీగఢ్: అడ్డంకులు తొలగి ఎన్నికలకు సిద్ధమైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు పంజాబ్ –హరియాణా హైకోర్టు షాక్ ఇచ్చింది. తద్వారా వివాదాస్పద సమాఖ్య మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. నేడు ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నిక కావాల్సి ఉండగా... హైకోర్టు ఓ రోజు ముందే నామినేషన్లు వేసిన అభ్యర్థులకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో హరియాణా అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘానికి ఓటేసే హక్కు ఇవ్వడం పట్ల హరియాణా రెజ్లింగ్ సంఘం హైకోర్టులో పిటిషన్ వేయడంతో... శుక్రవారం విచారించిన కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఎన్నికలు నిర్వహించరాదని స్టే విధించింది. బ్రిజ్‌భూషణ్‌కు ఎదురుదెబ్బ! భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్‌భూషణ్‌పై కోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కీలక సాక్ష్యాధారాలను ఢిల్లీ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్‌కు తెలపడంతో ఆయన విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. -
ముగ్గురి ప్రాణాలు కాపాడాడు.. ప్రభుత్వం అతని ఇంటిని బుల్డోజర్తో..
చండీగఢ్: నూహ్ జిల్లాలో అల్లర్లు జరిగిన రోజున హిసార్ కు చెందిన రవీందర్ ఫోగట్ తోపాటు అతని స్నేహితులకు ఆశ్రయమిచ్చినందుకు అనీష్ అనే వ్యక్తి ఇంటిని బుల్డోజర్లతో కూల్చేసింది హర్యానా ప్రభుత్వం. అల్లర్లతో అనీష్ కు సంబంధం లేకపోయినా అల్లరిమూకకు ఆశ్రయమిచ్చాడన్న కారణంతో అతని ఇంటిని కూలదోసింది ప్రభుత్వం. నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ బ్రీజ్ మండల్ జలాభిషేక యాటర్ పేరిట భారీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక అల్లరి మూక వారిపై రాళ్ల దాడి చేయడంతో భారీ విధ్వాంసానికి తెరలేచింది. ఈ అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయాల పాలయ్యారు. దాడులు ప్రతిదాడులతో మూడు రోజుల పాటు ఆ ప్రాంతం అట్టుడికింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే నెపంతో అక్కడి ప్రభుత్వం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే రవీంద్ర ఫోగట్, అతడి స్నేహితులు అల్లర్ల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అనీష్ ఇంటిలోకి చొరబడ్డారు. వారికి ఆశ్రయమిచ్చాడన్న నెపంతో ప్రభుత్వం అనీష్ ఇంటిని బుల్డోజర్తో కూల్చేసింది. ఏ నేపథ్యంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ ట్రీట్మెంట్లో బుల్డోజర్లు ఒక భాగమంతే అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. రవీంద్ర ఫోగట్ తాను ఒక కాంట్రాక్టరునని అల్లరి మూకల దాడి నేపథ్యంలో ఆ రోజున ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వారు అనీష్ ఇంటిలో ఆశ్రమ పొందినట్లు చెప్పారు. తన కారు పూర్తిగా ధ్వంసమైందని.. కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణిగాక అనీష్ తన కారులో PWD గెస్ట్ హౌస్ వద్ద తనను డ్రాప్ చేసినట్లు తెలిపారు. తాను చెయ్యని తప్పుకు అనీష్ తన ఇంటిని కోల్పోయాడని వ్యాఖ్యానించారు. ఈ విధంగా అకారణంగా బుల్డోజర్ విధ్వాంసాలకు గురైన వారి సంఖ్య నూహ్ జిల్లాలో అధికంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఈ కూల్చివేతలపై సీరియస్ అయ్యింది. ఈ సందర్బంగా హైకోర్టు "అధికారం అవినీతికి కారణమైతే సంపూర్ణ అధికారం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందంటూ" లార్డ్ ఆక్టన్ మాటలను కూడా గుర్తు చేసింది. ఇది కూడా చదవండి: నల్లగా ఉంటే భర్త కాకుండా పోతాడా? ఉన్నా భర్తే కదా.. -
డేరా బాబా.. హార్డ్‌కోర్ క్రిమినల్ కాదంట!
డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జడ్ ఫ్లస్ లెవల్ సెక్యూరిటీ అందించడం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఖలిస్థాన్ ప్రేరేపిత సంస్థల నుంచి డేరా బాబాకు ప్రాణహాని ఉందన్న కారణం చెబుతూ.. జెడ్‌ఫ్లస్ లెవల్ ప్రొటెక్షన్ కల్పించింది హర్యానా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. అభ్యంతరాలపై హర్యానా సర్కార్ వివరణ ఇచ్చుకుంది. ఫర్లాగ్(తాత్కాలిక సెలవు) మీద ప్రస్తుతం బయట ఉన్న డేరాబాబాకు జెడ్‌ఫ్లస్ సెక్యూరిటీ అందించడం తప్పేం కాదని సమర్థించుకుంది. ఈ మేరకు హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ‘డేరా సచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ హార్డ్ కోర్ క్రిమినల్ ఏంకాదు. శిక్షలు అనుభవిస్తున్న కేసుల్లోనూ స్వయంగా ఆయనే హత్యలు చేయలేదు. నేరపూరిత కుట్ర, సహ నిందితుడిగా మాత్రమే ఉన్నారు. హర్యానా ప్రిజనర్స్ యాక్ట్ కూడా ఆయన్ని హార్డ్ కోర్ క్రిమినల్‌గా పరిగణించకూడదని చెబుతోంది’ అని జైళ్ల శాఖ రూపొందించిన ఆ నివేదికను హైకోర్టుకు సమర్పించింది ప్రభుత్వం. 2017లో పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. అత్యాచార కేసులో ఇరవై ఏళ్ల శిక్ష, మేనేజర్‌తో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసులో డేరా సచ్ఛ సౌధా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో ప్రస్తుతం డేరా బాబా శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో హర్యానా జైళ్ల శాఖ 21 రోజుల ఫర్లాగ్ జారీచేయగా.. ఫిబ్రవరి 7వ తేదీన బయటకు వచ్చిన గుర్మీత్ తన గురుగ్రామ్ ఆశ్రమంలో ఉంటున్నాడు. అయితే పంజాబ్ ఎన్నికలను ప్రభావం చేసేందుకే డేరా బాబా బయటకు వచ్చాడని, పైగా ఒక క్రిమినల్‌కు జెడ్ ఫ్లస్ సెక్యూరిటీ అందించడం ఏంటని? అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వాన్ని వివరణ కోరింది హైకోర్టు. వివరణ.. సునారియా జైళ్ల సూపరిడెంట్ సునీల్ సంగ్వాన్ ఈ మేరకు హర్యానా ప్రభుత్వం తరపున హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. హర్యానా అడ్వొకేట్ జనరల్ నుంచి న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నాకే గుర్మీత్‌కు ఫర్లాంగ్ జారీ చేసినట్లు వెల్లడించారు. డేరా చీఫ్‌ను హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్(టెంపరరీ రిలీజ్)యాక్ట్ కింద హార్డ్‌కోర్ క్రిమినల్‌గా పరిగణించరాదని ఏజీ జనవరి 25నే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశంలో భద్రతా కేటగిరీ X, Y, Y-Plus, Z మరియు Z-Plus. చివరిది జెడ్ ఫ్లస్ వర్గం ప్రముఖులకు మాత్రమే కేటాయించబడుతుంది. ఈ కేటగిరీలు కాకుండా.. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కవర్ కేవలం ప్రధాని, వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కల్పిస్తారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు కూడా ఎస్పిజి భద్రత కల్పించారు. కానీ ఇది తరువాత Z-ప్లస్ కేటగిరీకి మార్చేశారు. Z-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులు మొబైల్ సెక్యూరిటీకిగానూ 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం ఇద్దరిని (ప్లస్ ఎనిమిది మంది) అందిస్తారు. Z-Plus స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందిస్తారు. -
‘20వేల కోట్ల ఆస్తి.. ముగ్గురికి హక్కు ఉంది’
చండీగఢ్: దివంగత ఫరీద్కోట్ మహారాజాకు చెందిన దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ఆస్తిని.. ఆయన కుమార్తెలకు వారసత్వంగా మంజూరు చేస్తు హర్యానా హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిలో మణిమజ్రా కోట, సిమ్లా మషోబ్రాలోని ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, ఆభరణాలు, పాతకాలపు కార్లు, ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని కోపర్నికస్ మార్గ్ వద్ద ఉన్న ఫరీద్కోట్ హౌస్ ఉన్నాయి. కుమార్తెలు రాజ్‌కుమారి అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ ఇద్దరికీ ఈ ఆస్తిలో 75 శాతం వాటా లభిస్తుందని కోర్టు తెలిపింది. మిగిలిన 25 శాతం వాటా వారి తల్లి మహారాణి మహీందర్ కౌర్‌కు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తన 547 పేజీల తీర్పులో ఇద్దరు కుమార్తెల హక్కులను సమర్థించారు. మహారావల్ కేవాజీ ట్రస్ట్, దీపిందర్ కౌర్ చేసిన విజ్ఞప్తులను తోసిపుచ్చారు.అంతేకాక ఫరీద్కోట్ పాలకుడు రాజా హరీందర్ సింగ్ బ్రార్ మరణించినప్పుడు మహారాణి మహేంద్ర కౌర్ సజీవంగా ఉన్నారని.. ఆమెకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. అయితే ప్రస్తుతం మహారాణి మహీందర్ కౌర్, ఆమె కుమార్తె దీపిందర్ కౌర్ ఇద్దరూ మరణించారు. దాంతో ఈ ఇద్దరి వాటాలు వారి చట్టపరమైన వారసులకు వెళ్తాయని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఆస్తులను నిర్వహిస్తున్న మహారావల్ ఖేవాజీ ట్రస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించిన దిగువ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దిగువ కోర్టు 2013 జూలై 25న తన తీర్పులో.. దివంగత తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న అమృత్ కౌర్‌కు వారసత్వాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని దీపిందర్ కౌర్ పై కోర్టులో సవాలు చేశారు. దీన్ని కోర్టు 2018లోనే కొట్టివేసింది. ఫరీద్కోట్ వివాదం... 1918 లో మూడేళ్ళ వయసులో పాలకుడిగా పట్టాభిషేకం పొందిన హరీందర్ ఫరీద్కోట్ ఎస్టేట్ చివరి పాలకుడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు... అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ , మహిపీందర్ కౌర్ కాగా ఒక కుమారుడు హర్మహిందర్ సింగ్ ఉన్నారు. కొడుకు 1981 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఏడుగురు సిక్కు రాచరికపు మహారాజులలో ఒకరైన హరీందర్ 1989లో మరణించాడు. చనిపోయేనాటికి ఆయనకు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్,ఢిల్లీ, హర్యానా మరియు చంఢీగడ్‌లో ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి. అక్టోబర్ 1989 లో మహారాజా మరణించిన తర్వాత ఈ ఆస్తి వివాదం ప్రారంభమైంది. హరీందర్ కౌర్ మరణించిన తర్వాత ఓ విల్లు వెలుగులోకి వచ్చింది. ఈ విల్లును 1982లో రాసినట్లు దానిలో ఉంది. మహారాజా తన ఆస్తులను మహర్వాల్ ఖేవాజీ ట్రస్ట్‌కు ఇచ్చినట్లు విల్లు పేర్కొంది. అంతేకాక కుమార్తె దీపిందర్ కౌర్ అధ్వర్యంలో ఈ ట్రస్ట్ నడుస్తుంది. మూడవ కుమార్తె ఈ ట్రస్టుకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. రెండవ కుమార్తె అయిన అమృత్ కౌర్ 1952లో తండ్రికి ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమెకు ఈ ఆస్తిలో వాటాలేదని మహారాజా ప్రకటించారు. అయితే మహారాజు చనిపోయిన తర్వాత అమృత్ కౌర్ ఎస్టేట్ యాక్ట్, 1948 ఆధారంగా మొత్తం ఎస్టేట్ మీద దావా వేశారు. విల్లు నకిలీదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగానే మహారాజా మూడవ కుమార్తె మహిపీందర్ కౌర్ 2001లో కన్యగానే మరణించారు. మరో రెండు పిటిషన్లు.. అమృత్ కౌర్ మాదిరిగానే మహారాజా హరీందర్ సింగ్ సోదరుడు మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరతీందర్ సింగ్ జేష్ఠత్వ నియమాన్ని పేర్కొంటూ ఆస్తిపై తనకు హక్కు కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. తండ్రి రాసిన విల్లు ఆధారంగా తనకు ఆస్తిలో వాటా దక్కాలని దీపిందర్ కౌర్ దావా వేశారు. అయితే ఈ వివాదం నడుస్తుండగానే దీపిందర్ కౌర్ మరణించారు. ఈ వివాదానికికి సంబంధించి 2018లోనే హర్యానా హై కోర్టు ట్రస్టు పాత్ర శూన్యమని ప్రకటించి కుమార్తెలకు ఆస్తిని ఇవ్వమని పేర్కొంది. నేడు జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ 30ఏళ్ల ఈ వివాదానికి తుది తీర్పు ఇచ్చారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం రాజా హరీందర్ సింగ్ ఆస్తిలో ఆయన ఇద్దరు కుమార్తెలు అమృత్ కౌర్, దీపిందర్ కౌర్‌లతో పాటు మహారాణికి వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. ఆస్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ట్రస్ట్ ధర్మకర్తలు కుట్ర పన్నారని.. నకిలీ విల్లును సృష్టించారని కోర్టు వెల్లడించింది. -
ఇక నుంచి లౌడ్స్పీకర్లు బంద్..!
చంఢీగర్ : అవసరం ఉన్నా.. లేకపోయినా.. అంతెత్తు లౌడ్‌స్పీకర్ల హోరుతో ప్రజల అనారోగ్యానికి కారణమయ్యేవారికి ఇక మూడినట్లే..! బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్ల వాడకాన్ని నిషేదిస్తూ పంజాబ్-హరియాణ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు కూడా లౌడ్స్పీకర్లను వాడాలంటే రాతపూర్వక అనుమతి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆద్యాత్మిక కేంద్రాల్లో కూడా రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి స్పీకర్లు పెట్టరాదని వెల్లడించింది. ఏడాది మొత్తంలో పండుగల సమయంలో 15 రోజులు లౌడ్‌స్పీకర్ల వాడకానికి వెసులుబాటు కల్పించింది. పండుగల సమయంలో రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు లౌడ్స్పీకర్లు వాడుకోవచ్చని తెలిపింది. జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ హరీందర్ సింగ్ సిద్ధూ ఈ మేరకు రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించకుండా... శబ్ద కాలుష్య నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
'ఆ వీడియో నేను అప్లోడ్ చేయలేదు'
సాక్షి, చండీగఢ్ : సరిహద్దులో గస్తీ కాస్తున్న సైనికులకు పౌష్టికాహారం పెట్టడం లేదంటూ సంచలన వీడియో పోస్ట్ చేసి అనంతరం ఉద్యోగాన్నికోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ కోర్టు మెట్లెక్కారు. తన ఉద్యోగాన్ని తనకు తిరిగి ఇప్పించాలంటూ హర్యానా కోర్టును ఆశ్రయించారు. ఆ వీడియోను తాను అప్లోడ్ చేయలేదని, తన సహచరులే ఆ పనిచేశారని కోర్టుకు వెళ్లడించారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం దీనిపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర హోంశాఖకు, బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మకు, బీఎస్ఎఫ్ 29 బెటాలియన్ కమాండెంట్‌కు నోటీసులు పంపించింది. తదుపరి విచారణను వచ్చే మే (2018) 28కి వాయిదా వేసింది. తమకు సరైన ఆహారం పెట్టడం లేదంటూ ఓ సెల్ఫీ వీడియోను తేజ్ బహదూర్ గత ఏడాది (2017) జనవరి 8న ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో దేశ వ్యాప్తంగా పెను సంచలనం అయింది. ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతడిని ఎవరికీ తెలియని చోట పోస్టింగ్ ఇచ్చారని కక్ష పూరితంగా వ్యవహరించారిన తేజ్ భార్య కూడా ఆరోపించింది. అయితే, తేజ్ ఉద్దేశ పూర్వకంగా ఈ పనిచేశాడని పేర్కొంటూ ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ బీఎస్ఎఫ్ నిర్ణం తీసుకుంది. అయితే, ఆ వీడియోను తాను పోస్ట్ చేయలేదని, తన సహచర ఉద్యోగుల్లో ఎవరో ఒకరు అది చేసి ఉంటారని, అతడి ఉద్యోగంపై వేసిన వేటును బీఎస్ఎఫ్ వెనక్కు తీసుకొని తిరిగి ఉద్యోగం ఇవ్వాలంటూ తేజ్ తరుపు న్యాయవాది తాజాగా కోర్టును అభ్యర్థించారు. -
నిర్దోషిగా తేలిన బాబా రాంపాల్
న్యూఢిల్లీ : వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు బాబా రాంపాల్‌ను హర్యానాలోని హిస్సార్ కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. రాంపాల్‌పై అల్లర్లు, హత్యానేరాలపై రెండు కేసులు నమోదయ్యాయి. 2014 నుంచి రాంపాల్ హిస్సార్‌లో జైలు జీవితం గడుపుతున్నారు. మూడేళ్ల కిందట బల్వారాలో జరిగిన అల్లర్ల కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా ప్రేరేపించారనే అభియోగాలు రామ్పాల్పై నమోదయ్యాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు. బాబాపై ఆరోపణలను రుజువు చేయడంలో పోలీసులు విఫలమవడంతో రాంపాల్‌ను నిర్ధోషిగా కోర్టు నిర్ధారించింది. మరోవైపు గుర్మీత్ సింగ్‌కు శిక్ష ఖరారు సందర్భంగా అల్లర్లు చెలరేగిన క్రమంలో బాబా రాంపాల్‌పై తీర్పు నేపథ్యంలో హర్యానా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
బాబా రాంపాల్‌ను నిర్దోషిగా నిర్ధారించిన హర్యానా కోర్టు
-
‘డేరా’ హింసాకాండ..
-
‘డేరా’ హింసాకాండ.. అనూహ్య మలుపు
ఛండీగఢ్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్‌కు అన్యాయం జరిగిందంటూ ఆయన భక్తులు, డేరా స్వచ్ఛ సౌదా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉత్తరభారతంలోని హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ సృష్టించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, ఈ ఘటనల్లో ధ్వంసమైన ఆస్తుల విలువను డేరా సంస్థ నుంచే ముక్కుపిండి వసూలు చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. పంజాబ్, హరియాణా హైకోర్టు శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా వెలువరించిన ఆదేశాల్లో.. డేరా సంస్థకు చెందిన అన్ని ఆస్తులను తక్షణమే జప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం డేరాలు విధ్వంసం చేసిన ఆస్తుల విలువను.. వారి సంస్థ నిధుల నుంచే వసూలు చేయాలని సూచించింది. పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసమేకాక హింసాకండలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను దోషిగా తేలారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. 'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల ‘డేరా’ విధ్వంసం.. రాష్ట్రపతి ఖండన రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్ -
రెచ్చిపోతే కఠినంగా వ్యవహరించండి: హైకోర్టు
సాక్షి, చంఢీఘర్ : డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మిత్ సింగ్ మద్దతు దారులపై హరియాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరూ చేసినా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయంతో రెండు రాష్ట్రాలు గడగడలాడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుండడమే ఇందుకు కారణం. పంచకులలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మధ్యాహ్నం రెండున్నరకు తుది తీర్పు వెల్లడించినుంది. దీంతో హర్యాణా, పంజాబ్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. సాధారణంగా ప్రశాంతంగా ఉండే పంచ కులలో ఈ తీర్పు నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది ఇక పంచకులకు గుర్మీత్ అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. రహదారులపై ఎటువైపు చూసినా ఆయన మద్దతుదారులే కనిపిస్తున్నారు. వేలాదిగా వచ్చిన గుర్మీత్ అనుచరులు ఎక్కడికక్కడ తిష్ట వేసుకుని ఉన్నారు. ఇప్పటికే సుమారు రెండులక్షల మందికి పైగా నామ్ చర్చా ఘర్కు చేరుకోగా సమయం గడిచే కొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశముంది. అలాగే గుర్మీత్ మద్ధతు దారులు నిరసనలకు దిగారు. రోడ్లపై బైఠాయించి గుర్మీత్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు తీర్పు గుర్మీత్‌కు వ్యతిరేంగా వస్తే అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. డేరా సచ్ఛా సౌధాలో భారీగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేశారని, పదునైన ఆయుధాలు దాచి పెట్టారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పంచకులతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. పంచకుల, చండీఘర్ సహా ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని స్టేడియంలోకి తరలించారు. అలాగే పోలీసులకు అదనంగా ఇప్పటికే 15వేల పారా మిలిటరీ దళాలను మోహరించారు. ఒక్క పంచకులకే 177 కంపెనీల పారా మిలిటరీ దళాలను కేటాయించారు. సైన్యం కూడా పంచకులకు చేరుకుంది. రెండు రాష్ర్టాల్లోను 72 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సిర్సా పట్టణం తోపాటు మరో మూడు గ్రామాల్లో నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. పంజాబ్, హర్యానాల్లో కార్యాలయాలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు, ప్రభుత్వరంగ సంస్థలు మూతపడ్డాయి. పంజాబ్, హర్యానాలకు వచ్చే 29 రైళ్లను రద్దు చేశారు. బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. మరోవైపు కోర్టుకు హాజరయ్యేందుకు గుర్మిత్ సిర్సా నుంచి భారీ కాన్వాయ్‌తో పంచకుల బయల్దేరారు. ఈ కాన్వాయ్‌లో సుమారు రెండువందల వాహనాలు ఉన్నట్లు సమాచారం. అయితే తాము కేవలం రెండు వాహనాలను మాత్రమే పంచకులలోకి అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. -
‘ఉడ్తా పంజాబ్’కు ఓకే
‘స్టే’కు సుప్రీంకోర్టు, పంజాబ్ - హరియాణా హైకోర్టు తిరస్కృతి చండీగఢ్: సెన్సార్షిప్ వివాదంలో చిక్కుకున్న ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు అన్ని అడ్డంకులూ తొలిగాయి. ఈ సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు, పంజాబ్-హరియాణా హైకోర్టులు నిరాకరించాయి. దీంతో డ్రగ్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా.. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. దీని విడుదలపై స్టే విధించాలని హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమనిస్పష్టం చేసింది.దీనిపై పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఉందని పేర్కొంది. హైకోర్టును పిటిషనర్ ఆశ్రయించారు. అలాగే ఈ చిత్రం విడుదలకు వ్యతిరేకంగా మరో పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలైంది. ఈ రెండు పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు ఈ సినిమా ఆన్లైన్లో లీక్ కావడంపై సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ మండిపడ్డారు. పైరసీ కాపీ వివిధ టోరెంట్ వెబ్సైట్లలో దర్శనమిచ్చింది. ఇందులో ‘ఫర్ సెన్సార్’ అని ఉండటంతో లీక్‌లో సెన్సార్ బోర్డుకు ఏమైనా పాత్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ఆన్లైన్ లీక్‌కు సంబంధించి వచ్చిన వార్తలను సీబీఎఫ్సీ చీఫ్ పహ్లాజ్ నిహ్లానీ తోసిపుచ్చారు. -
జాట్ల రిజర్వేషన్‌పై స్టే
పంజాబ్, హర్యానా హైకోర్టు ఉత్తర్వులు చండీగఢ్: జాట్లతోపాటు మరో ఐదు వర్గాలకు బీసీ (సీ) కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తెచ్చిన చట్టంపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించింది. హర్యానా వెనుకబడిన తరగతుల (విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్) చట్టం-2016ను హర్యానా అసెంబ్లీ గత మార్చి 29న ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.. దీని చట్టబద్దతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎస్ఎస్ సరోన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం దీనిపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మురారిలాల్ గుప్తా అనే వ్యక్తి కొత్తగా తెచ్చిన బీసీ (సీ) కేటగిరీని సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ కేసీ గుప్తా కమిషన్ నివేదిక మేరకు ప్రభుత్వం జాట్ వర్గానికి రిజర్వేషన్లు కల్పించిందని, అయితే ఈ కమిషన్ నివేదికను అప్పటికే సుప్రీంకోర్టు తిరస్కరించిందని పిటిషనర్ చెప్పారు. న్యాయ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ రిజర్వేషన్ చెల్లుబాటుకాదన్నారు. ఈ కమిషన్ నివేదికలోని అంశాలపై సవరణలు చేసే అధికారం కేవలం న్యాయవ్యవస్థకే ఉందని, దీనిపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని చెప్పారు. -
మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: మ్యాక్స్ ఇండియా కంపెనీ పునర్వ్యవస్థీకరణకు పంజాబ్, హర్యానా హైకోర్ట్ ఆమోదం లభించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మ్యాక్స్ ఇండియా మూడు కంపెనీలుగా విడిపోతోంది. మ్యాక్స్ ఇండియా కంపెనీ మ్యాక్స్ పైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతుందని కంపెనీ తెలిపింది. మిగిలిన రెండు కంపెనీలు (మ్యాక్స్ ఇండియా, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్) వచ్చే ఫిబ్రవరి నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతాయని తెలియజేసింది. మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జీవిత బీమా వ్యాపారాన్ని, మ్యాక్స్ ఇండియా ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా, ఇతర వ్యాపారాలను, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ తయారీ రంగ కార్యకలాపాలను చూస్తాయని తెలిపింది. కాగా మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు ఇప్పటికే సెబీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, కాంపిటీ షన్ కమీషన్ ఆఫ్ ఇండియాలు(సీసీఐ) ఆమోదం తెలిపాయి. -
రామ్‌పాల్ అరెస్ట్‌కు రూ. 26 కోట్లు!
పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పణ రామ్‌పాల్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు చండీగఢ్: వివాదాస్పద స్వామీజీ బాబా రామ్‌పాల్ ఆచూకీ కనుగొనడం, అరెస్ట్ చేయడం కోసం చేపట్టిన భారీ ఆపరేషన్‌కు రూ. 26.61 కోట్లు ఖర్చయిందట. ఈ మేరకు శుక్రవారం పంజాబ్-హర్యానా హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య రామ్‌పాల్‌ను జస్టిస్ ఎం జయపాల్, జస్టిస్ దర్శన్‌సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఎదుట హర్యానా పోలీసులు హాజరుపరిచారు. రామ్‌పాల్‌తో పాటు సహ నిందితులైన రామ్కన్వర్ ధాకా, ఓపీ హుడాలను కూడా కోర్టులో హాజరుపరిచారు. హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ఠ్ హిస్సార్ జిల్లా బర్వాలాలోని సత్లోక్ ఆశ్రమంలో చేపట్టిన ఆపరేషన్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు రామ్‌పాల్ అరెస్ట్‌కు అయిన ఖర్చు వివరాలను పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించాయి. హర్యానా డీజీపీ కోర్టు సమర్పించిన అఫిడవిట్లో రామ్‌పాల్ ఆపరేషన్ కోసం హర్యానా ప్రభుత్వం రూ.15.43 కోట్లు చేసినట్టు వెల్లడించారు. ఇందులో రూ. 2.19 కోట్ల మేర ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లిందని, పోలీసు యంత్రాంగాన్ని తరలించేందుకు రూ. 7 కోట్లు, రైల్వే పోలీసుల కోసం రూ. 1.69 కోట్లు, రవాణా వ్యయం కింద రూ. 2.36 కోట్లు, సిబ్బంది ఆహారానికి రూ. 4.5 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. మరోవైపు రామ్‌పాల్ అరెస్ట్‌కు, కోర్టులో హాజరుపరచడం కోసం ఏర్పాట్లు చేయడానికి పంజాబ్ రూ.4.34 కోట్లు, చండీగఢ్ రూ.3.29 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 3.55 కోట్లు వెచ్చించినట్టు కోర్టుకు తెలిపాయి. నవంబర్ 19న రామ్‌పాల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సత్లోక్ ఆశ్రమం వద్దకు రావడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి మృతి చెందారు. -
అసభ్య సందేశాలను పంపడం స్త్రీల గౌరవాన్ని హరించడమే
ఛండీఘర్: అసభ్య సందేశాలు, యువతుల అశ్లీల చిత్రాలను పంపడం.. ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం మహిళల గౌరవానికి భంగం కగిలించడంతో సమానమని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ తరహా ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. సమాజానికి వినాశ హేతువులుగా మారుతున్న ఈ తరహా ఘటనలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పింది. అమత్సర్కు చెందిన ఆదర్శ సింగ్ అనే వ్యక్తి ఓ యువతికి అసభ్యకరమైన సందేశాలు, చిత్రాలు పంపడమేకాక, ఆమె అభ్యంతరకర చిత్రాలను ఇంటర్నెట్లో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆదర్శ్సింగ్తో పాటు మరో వ్యక్తిపై అమత్సర్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్ 24న కేసు నమోదు చేశారు. వీరిపై మహిళల గౌరవాన్ని భంగం కలిగించడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆదర్శ్ సింగ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ మహీంధర్సింగ్సుల్లార్ పై విధంగా వ్యాఖ్యానిస్తూ.. ఆదర్శ్‌సింగ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు ఆదర్శ్‌సింగ్ పంపిన అసభ్య సందేశాలు, అశ్లీల చిత్రాల తాలుకూ ప్రతులను కోర్టుకు సమర్పించారు. బాధితురాలి వివాహాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో.. ఆ యువతికి, ఆమె బంధువులకూ ఆదర్శ్ సింగ్ అసభ్యకరమైన సందేశాలు, అశ్లీల చిత్రాలను పంపినట్టు ప్రాసిక్యూషన్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి ఆదర్శ్‌సింగ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.