
నిర్దోషిగా తేలిన బాబా రాంపాల్
న్యూఢిల్లీ : వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు బాబా రాంపాల్‌ను హర్యానాలోని హిస్సార్ కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. రాంపాల్‌పై అల్లర్లు, హత్యానేరాలపై రెండు కేసులు నమోదయ్యాయి. 2014 నుంచి రాంపాల్ హిస్సార్‌లో జైలు జీవితం గడుపుతున్నారు. మూడేళ్ల కిందట బల్వారాలో జరిగిన అల్లర్ల కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగేలా ప్రేరేపించారనే అభియోగాలు రామ్‌పాల్‌పై నమోదయ్యాయి. ఈ ఘర్షణల్లో ఆరుగురు మరణించారు.
బాబాపై ఆరోపణలను రుజువు చేయడంలో పోలీసులు విఫలమవడంతో రాంపాల్‌ను నిర్ధోషిగా కోర్టు నిర్ధారించింది. మరోవైపు గుర్మీత్ సింగ్‌కు శిక్ష ఖరారు సందర్భంగా అల్లర్లు చెలరేగిన క్రమంలో బాబా రాంపాల్‌పై తీర్పు నేపథ్యంలో హర్యానా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.