చండీగఢ్: అడ్డంకులు తొలగి ఎన్నికలకు సిద్ధమైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు పంజాబ్ –హరియాణా హైకోర్టు షాక్ ఇచ్చింది. తద్వారా వివాదాస్పద సమాఖ్య మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. నేడు ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నిక కావాల్సి ఉండగా... హైకోర్టు ఓ రోజు ముందే నామినేషన్లు వేసిన అభ్యర్థులకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల్లో హరియాణా అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘానికి ఓటేసే హక్కు ఇవ్వడం పట్ల హరియాణా రెజ్లింగ్ సంఘం హైకోర్టులో పిటిషన్ వేయడంతో... శుక్రవారం విచారించిన కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఎన్నికలు నిర్వహించరాదని స్టే విధించింది.
బ్రిజ్‌భూషణ్‌కు ఎదురుదెబ్బ!
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్‌భూషణ్‌పై కోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కీలక సాక్ష్యాధారాలను ఢిల్లీ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్‌కు తెలపడంతో ఆయన విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment