WFI
-
‘టైమ్’ టాప్–100 జాబితాలో రెజ్లర్ సాక్షి
న్యూఢిల్లీ: ప్రఖ్యాత ‘టైమ్’ మేగజీన్ ప్రకటించిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత మహిళా రెజ్లర్ సాక్షి మలిక్‌కు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ‘టైమ్’ ఈ జాబితాను ప్రకటించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన వివాదంలో మహిళా రెజ్లర్ల పక్షాన బలంగా నిలబడి ఆమె చేసిన పోరాటానికి ఈ గుర్తింపు లభించింది. ఈ అంశంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు ఎదురొడ్డి సాక్షి మలిక్ గట్టిగా తన వాణిని వినిపిస్తూ నిరసనల్లో పాల్గొంది. వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలతో కలిసి ఆమె చేసిన ఈ పోరాటం దేశవిదేశాల్లో వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో బ్రిజ్‌భూషణ్ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. -
యువ రెజ్లర్ల నిరసన
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ), సీనియర్ రెజ్లర్ల మధ్య గొడవలతో తమ భవిష్యత్తు నాశనం అవుతోందని యువ రెజ్లర్లు నిరసనకు దిగారు. ఏడాది కాలంగా డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో కూరుకుపోవడంతో శిబిరాలు, జాతీయ జూనియర్, సబ్–జూనియర్ టోర్నీలు లేక యువ రెజ్లర్ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దీనిపై ఉత్తరప్రదేశ్, హరియాణా, ఢిల్లీలకు చెందిన సుమారు 300 మంది వర్ధమాన రెజ్లర్లు బస్సుల్లో వచ్చి జంతర్‌మంతర్ వద్ద మూడు గంటల పాటు నిరసన చేపట్టారు. ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్ పూనియా, సాక్షి మలిక్, కామన్వెల్త్ చాంపియన్ వినేశ్ ఫొగాట్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఈ ముగ్గురి బారి నుంచి మమ్మల్ని కాపాడండి’ అనే బ్యానర్లతో పెద్దఎత్తున నినాదాలతో హోరెత్తించారు. 10 రోజుల్లోగా సమాఖ్యపై నిషేధాన్ని ఎత్తేయాలని, వెంటనే టోర్నీల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము కూడా అవార్డుల్ని వెనక్కిస్తామని ప్రకటించారు. మరో వైపు దీనిపై అడ్‌హక్ కమిటీ అవసరమైన చర్యలు చేపట్టింది. ఆరు వారాల్లోనే అండర్–15, అండర్–20 కేటగిరీలో జాతీయ చాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తామని కమిటీ చైర్మన్ భూపేందర్ సింగ్ బజ్వా తెలిపారు. రెజ్లర్ల కెరీర్‌కు సంబంధించిన వ్యవహారాలను తీవ్రంగా పరిశిలిస్తామని, ఇకపై సమాఖ్య బాధ్యతల్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై రియో ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి స్పందించారు. వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ విధేయుడు సంజయ్ సింగ్‌ను అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తే కొత్త కార్యవర్గంతో తమకు ఏ ఇబ్బందీ లేదని ఆమె ప్రకటించింది. -
వినేశ్ కూడా వెనక్కిచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కూడా కేంద్ర క్రీడా అవార్డులను వెనక్కి ఇచ్చేసింది. శనివారం కర్తవ్యపథ్ వద్ద ఆమె ‘ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను వదిలేసి వెళ్లింది. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పతకాలతో ఆమె దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఫొగాట్ ఘనతలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’, అర్జున అవార్డులను ఇచ్చింది. అయితే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్ వర్గమే కొత్తగా ఎన్నికైంది. ఆయన విధేయుడైన సంజయ్ సింగ్ అధ్యక్షుడు అయ్యారు. దీన్ని ఏమాత్రం జీర్ణించుకోలేని స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్ నిమిషాల వ్యవధిలోనే రిటైర్మెంట్ ప్రకటించింది. బజరంగ్ ‘పద్మశ్రీ’ని వెనక్కిచ్చాడు. బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా తన పురస్కారాన్ని వెనక్కిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఫొగాట్ కూడా ముందు ప్రకటించినట్లే ఖేల్‌రత్న, అర్జున అవార్డుల్ని వెనక్కి ఇచ్చేందుకు ప్రధానమంత్రి నివాసానికి బయల్దేరింది. కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో అవార్డుల్ని రోడ్డుపైనే వదిలేసింది. ఆ పురస్కారాలు ఇప్పుడు పోలీసుల ఆ«దీనంలో ఉన్నాయి. -
పరువు కోసం కుస్తీ!
ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు... తక్షణమే సరిదిద్దకపోతే, ఆపైన అన్నీ తప్పులే జరుగుతాయట. ప్రాచుర్యంలో ఉన్న లోకోక్తి అది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కథ సరిగ్గా అలానే ఉంది. సమాఖ్యలోని అవకతవకలు, మహిళా మల్లయోధులపై సమాఖ్య అధ్యక్షుడు, కోచ్‌ల లైంగిక వేధింపుల గురించి ఏడాది పైగా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అయినా, కంటితుడుపులకే తప్ప, కఠిన చర్యలకు దిగని కేంద్ర పాలకులు తాజాగా సమాఖ్యపై సస్పెన్షన్ వేటువేయక తప్పలేదు. వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సారథ్యంలో సమాఖ్య గబ్బుపడితే, తాజాగా ఆయన సహచరుడు సంజయ్ సింగ్ సారథ్యంలో ఏర్పడ్డ కొత్త కార్యవర్గం సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఎన్నికైన మూణ్ణాళ్ళకే సస్పెన్షన్ వేటుకు గురైన దుఃస్థితి. ఆదివారం నాటి ఈ సస్పె న్షన్తో మన రెజ్లింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దేశానికి పేరు తెచ్చిపెట్టిన క్రీడాకారులెందరో ఉన్నప్పటికీ, మన కుస్తీ గోదా కథ ఆశించినంత గొప్పగా లేదని మరోమారు తేలిపోయింది. ఒలింపిక్ పతకాలు సాధించిన మన మల్లయోధులు సాక్షీ మాలిక్, బజరంగ్ పూనియా,ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతక విజేత వినేశ్ ఫోగట్‌లు సమాఖ్యలో అవతవకలపై గళం విప్పి మరి కొద్ది రోజుల్లో ఏడాది కావస్తోంది. ఈ పన్నెండు నెలల కాలంలో ర్యాలీలు, దేశ రాజధాని నడిబొడ్డున ఆటగాళ్ళ ధర్నాలు, వేధింపుల ఆరోపణలతో బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల కేసులు, దర్యాప్తులు... ఇలా అనేక నాటకీయ ఘటనలు చూశాం. బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ తప్పనిసరై తన పదవికి దూరం జరిగాడు. అయితే, పేరుకు పదవిలో లేకపోయినా, వెనుక నుంచి చక్రం తిప్పుతున్నది అతగాడేనని సమాఖ్య కొత్త కార్యవర్గం తాజా ఎన్నికల్లోనూ తేలిపోయింది. బ్రిజ్‌భూషణ్‌కు దీర్ఘకాలంగా నమ్మిన బంటైన సంజయ్‌సింగ్ గత గురువారం డిసెంబర్ 21న జరిగిన ఎన్నికల్లో సమాఖ్య కొత్త అధ్యక్షుడ య్యారు. ఎన్నికలు జరిగిన 15 పదవుల్లో 13ను ఆ జట్టే గెలిచింది. పైగా, లైంగిక వేధింపులపై ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్నికైనవారిలో కనీసం ఒక్క మహిళైనా లేకపోవడం మరీ విడ్డూరం. అయినా వ్యవస్థ మారకుండా పేరుకు వ్యక్తులు మారితే ప్రయోజనం ఏముంటుంది! పాత తానులోని ముక్కే అయిన కొత్త అధ్యక్షుడు వస్తూనే సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా ఈ నెల 28 నుంచి యూపీలో అండర్–15, అండర్–20 వారికి జాతీయ ఛాంపియన్షిప్స్ జరుగుతాయని ప్రకటించారు. సమాఖ్య సెక్రటరీ జనరల్‌ను సంప్రతించడం లాంటి నియమాలేవీ పాటించనేలేదు. పైగా, లైంగిక వేధింపులు జరిగినట్టు ఆరోపణలున్న ప్రాంగణంలోనే, అదే పాత కాపుల కను సన్నల్లోనే కొత్త కమిటీ సాగుతుండడం దిగ్భ్రాంతికరం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్య వివాదానికీ, ఫిర్యాదులకూ దారి తీసింది. మరోపక్క ఎన్ని పోరాటాలు చేసినా, ప్రభుత్వానికి మరెన్ని వినతులు ఇచ్చినా పాత కథే పునరావృతం కావడం ఆటగాళ్ళే కాదు, ఎవరూ జీర్ణించుకోలేని విషయం. రెజ్లర్ సాక్షీ మాలిక్ కుస్తీకి పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు కన్నీటి పర్యంతమవుతూ ప్రకటించారు. మరో రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ పతకాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేస్తున్నట్టు శుక్రవారం స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో సర్కార్ ఒత్తిడిలో పడింది. హడావిడిగా కొత్త కమిటీపై సస్పెన్షన్ వేటు వేసింది. సమాఖ్య నిర్వహణకు తాత్కాలిక ప్యానెల్‌ను నియమించాల్సిందిగా భారత ఒలింపిక్ సంఘాన్ని (ఐఓఏ) కోరింది. రెజ్లింగ్ సమాఖ్యను సరిదిద్దేందుకు ఎప్పుడో చర్యలు చేపట్టాల్సిన సర్కార్ ఇప్పటికి గాఢనిద్ర నుంచి మేలుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఈ మాత్రమైనా కదలిక రావడం మంచిదే. కానీ, ఇది సరిపోతుందా అన్నది ప్రశ్న. దేశానికి పతకాలు పండిస్తున్న క్రీడాంశంలో, అందులోనూ అంతర్జా తీయంగా మన ప్రతిష్ఠను పెంచిన ఆటగాళ్ళ నిఖార్సయిన ఆందోళనలపై మన పాలకులు ఇన్నాళ్ళు కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వపక్ష పార్లమెంట్ సభ్యుడే సమాఖ్య అధ్యక్షుడు కావడం, సార్వత్రిక ఎన్నికల బరిలో ఓట్లు – సీట్ల సంఖ్యను ప్రభావితం చేసే శక్తిమంతుడు కావడంతో బీజేపీ పెద్దలు ఇంతకాలం విషయం సాగదీశారనేది సుస్పష్టం. వినేశ్ ఫోగట్ అన్నట్టు... రెజ్లింగ్ సమాఖ్యలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక దేశంలో కుస్తీ క్రీడ ఆడపిల్లకు భద్రత లేని అంశంగా మిగిలిపోతుంది. కానీ, ‘బేటీ బచావో... బేటీ పఢావో’ అంటూ బీరాలు పలికే పాలకులకు ఇది పెద్దగా పట్టినట్టు లేదు. మన సొంతింటి రెజ్లింగ్ వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అప్రతిష్ఠగా పరిణమించింది. నిజానికి, క్రీడా సంస్థలపై వివాదాలు కొత్త కావు. క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు, ఆటగాళ్ళ ఎంపికలో అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు తరచూ వినబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలతోనే సరిపుచ్చుతున్నాయి తప్ప, సమూల ప్రక్షాళనకు సమకట్టడం లేదు. రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన క్రీడాసంస్థల్ని అధికార పార్టీల జేబు సంస్థలుగా, వారసత్వపు గడీలుగా నడుపుతున్నారు. పెద్ద స్థానాల్లో ఉన్న ఒకప్పటి స్టార్ ఆట గాళ్ళు సైతం తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సింది పోయి, తమకా పదవులిచ్చిన పార్టీల ప్రయోజనాలకు డూడూ బసవన్నలవుతున్నారు. ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్న, లోపభూయిష్ఠ మైన మన క్రీడా నిర్వహణలో తక్షణ సంస్కరణలు అవసరం. లేదంటే, తీరని నష్టం. పాలకులు స్వపక్షాభిమానం వదిలి, కఠిన కార్యాచరణకు పూనుకోనట్లయితే... మన క్రీడావీరుల కష్టానికీ, కన్నీళ్ళకూ విలువేముంది! రాజకీయం ఆట కావచ్చేమో కానీ, ఆటలు రాజకీయం కాకూడదు!! -
'ప్రతి అవకాశంలో మహిళా రెజ్లర్లను వేధించాడు'
ఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అవకాశం దొరికినప్పుడల్లా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఆయనపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తజకిస్థాన్‌లో ఈవెంట్ సందర్భంగా ఓ రెజ్లర్‌ను గదిలోకి పిలిచి హగ్ చేసుకునేందుకు ప్రయత్నించారని కోర్టుకు పోలీసులు తెలిపారు. బాధితురాలు నిరసన తెలిపితే.. తాను తండ్రిలాగే దగ్గరికి తీసుకున్నట్లు బ్రిజ్ భూషణ్ చెప్పారని న్యాయమూర్తికి పోలీసులు చెప్పారు. అనుమతి లేకుండా తన శరీర భాగాలను దురుద్దేశంతో తాకాడని మరో మహిళా రెజ్లర్ పేర్కొన్న విషయాన్ని కూడా ధర్మాసనానికి వెల్లడించారు. ఇవన్నీ బ్రిజ్ భూషణ్ దురుద్దేశంతోనే చేశాడని పోలీసులు తెలిపారు. మహిళా రెజ్లర్ల ఆరోపణలను పరిశీలించడానికి బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ నేతృత్వంలో కమిటీ కూడా బ్రిజ్ భూషణ్‌ను నిర్దేషిగా పేర్కొనలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల దర్యాప్తుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది. అందుకు సంబంధించిన రిపోర్టును బయటకు వెల్లడించలేదు. కానీ ఓ కాపీని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులకు అందించారు. మహిళ రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో గరిష్ఠంగా మూడేళ్లు ఉంటుంది. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరుగురు మహిళా రెజ్లర్లు జూన్ 15న కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ కోర్టు విచారణ చేపడుతోంది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: రమేశ్ బిధూరీపై సస్పెన్షన్ వేటు వేయాలి -
భారత రెజ్లింగ్ సమాఖ్యకు (WFI) షాక్.. సభ్యత్వం రద్దు
విశ్వవేదికపై భారత్‌కు అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య(UWW).. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) సభ్యత్వాన్ని రద్దు చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు చర్యలు తీసుకున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. యూడబ్ల్యూడబ్ల్యూ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో (సెప్టెంబర్ 16 నుంచి) ప్రారంభంకానున్న ఒలింపిక్ క్వాలిఫైయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత అథ్లెట్లుగా తటస్థ అథ్లెట్లుగా (భారత్ ట్యాగ్‌లైన్ లేకుండా) బరిలోకి దిగాల్సి ఉంటుంది. కాగా, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై స్టార్ మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు తారాస్థాయిలో ఆందోళనలకు దిగడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు వరుసగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న ఎలక్షన్స్ జరగాల్సి ఉండింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిలిపి వేసింది. ఆతర్వాత చాలా తేదీలు మారుతూ వచ్చాయి. ఈ మధ్యలో ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కాయి. చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్ కమిటీ ప్రకటించగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. -
మళ్లీ మొదటికి.. నేడు జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై స్టే
చండీగఢ్: అడ్డంకులు తొలగి ఎన్నికలకు సిద్ధమైన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు పంజాబ్ –హరియాణా హైకోర్టు షాక్ ఇచ్చింది. తద్వారా వివాదాస్పద సమాఖ్య మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. నేడు ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నిక కావాల్సి ఉండగా... హైకోర్టు ఓ రోజు ముందే నామినేషన్లు వేసిన అభ్యర్థులకు మింగుడు పడని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో హరియాణా అమెచ్యూర్ రెజ్లింగ్ సంఘానికి ఓటేసే హక్కు ఇవ్వడం పట్ల హరియాణా రెజ్లింగ్ సంఘం హైకోర్టులో పిటిషన్ వేయడంతో... శుక్రవారం విచారించిన కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఎన్నికలు నిర్వహించరాదని స్టే విధించింది. బ్రిజ్‌భూషణ్‌కు ఎదురుదెబ్బ! భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌ను విచారించేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధమయ్యారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్‌భూషణ్‌పై కోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా కీలక సాక్ష్యాధారాలను ఢిల్లీ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్‌కు తెలపడంతో ఆయన విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు. -
రెజ్లర్ల పోరాటానికి ఊహించని షాక్.. అసలు నిజం ఇదేనా?
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు,బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకరంగా లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోరాటానికి మైనర్ రెజ్లర్ తండ్రి రూపంలో ఊహించని షాక్ తగిలింది. ఆయన వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు, అది తప్పుడు ఫిర్యాదని ఆ మైనర్ రెజ్లర్ తండ్రి మీడియాకు తెలపడంతో ఒక్కాసారిగా అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం మీరు ఇలా ఎందుకు మాట మారుస్తున్నారని విలేకరులు ఆయనను అడగగా.. ‘ఈ నిజం న్యాయస్థానం ద్వారా బయటకు రావడం కంటే ఇప్పుడు ఈ రకంగా బయటకు రావడమే మేలు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై వివరణగా.. 2022లో అండర్-17 చాంపియన్‌షిప్ ట్రయల్స్ ఫైనల్స్‌లో తన కూతురు ఓడిపోయిందని తెలిపారు. ఆ పోటీలో తన కూతురు ఓటమికి కారణమైన రెఫరీని డబ్ల్యూఎఫ్ డిప్యూటేషన్ మీద పంపించిందని, దాని అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కాబట్టే ఆయనపై కోపంతో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే కేవలం ఒక మ్యాచ్‌లో ఓటమికి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. మీకు అది ఒక్క పోటీనే కావచ్చని, కానీ అది తన కూతురుకు ఏడాది శ్రమకు ఫలితమని చెప్పారు. అంతేకాకుండా తన కూతురు ఓడిపోయిన అండర్-17 చాంపియన్‌షిప్ ట్రయల్స్‌పై నిష్పక్షపాతంగా విచారణ చేయిస్తామని అధికారులు నాకు హమీ ఇచ్చారని, అందుకు ఆరోపణలను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. చదవండి: ‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. దేశానికి మరో ముప్పు ఉంది’ -
రెజ్లర్ల ఆందోళన: ఐకానిక్ క్రికెటర్స్ స్పందించకపోతే ఎలా? పారిశ్రామికవేత్త ట్వీట్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న భారతీయ మహిళా రెజ్లర్ల ఆందోళనపై ప్రముఖ పారిశశ్రామికవేత్త హర్షగోయెంకా స్పందించారు. మహిళలకు తోటి మహిళలే అండగా లేకపోతే ఎలా? ఇంకెవరుంటారు అంటూ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. అంతేకాదు ప్రస్తుత దిగ్గజ క్రికెటర్లు తోటి క్రీడాకారులకు మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదీ చదవండి: ఐసీఐసీఐ,పీఎన్బీ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్! ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్ల ఫిర్యాదుల మేరకు ఢిల్లీలో రెండు ఎఫ్ఐఆర్లు నమదు కావడం సంచలనం రేపింది. ఏళ్లుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు స్పందించిన ఢిల్లీ పోలీసులు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ 10 ఫిర్యాదులను నమోదు చేశారు. తమను అనుచితంగా తాకి, లైంగిక వేధింపులతో మనోవేదనకు గురిచేశారని మహిళా రెజర్లు ఆరోపించారు. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ సింగ్ మహిళా రెజ్లర్లను వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలో నమోదు చేశారు. 2017, సెప్టెంబర్ లో ఆసియా ఇండోర్ గేమ్స్ కోసం కర్ణాటకలోని బళ్లారిలో శిక్షణ పొందుతున్నప్పుడు, శిక్షణ సమయంలో, గాయపడి దాదాపు మరణశయ్యపై ఉంటే, ఈమెయిల్ ద్వారా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు సమాచారం అందించినప్పటికీ నోటీసులు ఇచ్చారని, విచారణ కమిషన్ వేస్తామంటూ బెదిరించారని ఒక రెజ్లర్ వాపోయారు. సింగ్‌తోపాటు వినోద్ తోమర్‌పై ఆరోపణలు గుప్పించారు. (సూపర్ ఆఫర్: ఐపోన్13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్) If women will not support other women, who will? If the current iconic cricketers not support their brethren, who will? — Harsh Goenka (@hvgoenka) June 2, 2023 -
1,000 మందిని లైంగికంగా వేధించానా? నేనేమైనా 'శిలాజిత్' రోటీలు తింటున్నానా?
న్యూఢిల్లీ: రెజ్లర్ల నుంచి లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మొదట 100 మందిని లైంగికంగా వేధించినట్లు ప్రచారం చేశారని, ఇప్పుడేమో ఎకంగా 1,000 మందిని వేధించానని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇంత మందిని అలా చేయడానికి తానేమైనా శిలాజిత్‌తో తయారు చేసిన రోటీలు తింటున్నానా? అని నోరుజారారు. దీంతో బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడవచ్చా? అని అతనిపై ఆరోపణలు చేస్తున్న మహిళా రెజ్లర్ సత్యవార్ట్ కదియాన్ మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఏడగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నిరసనకు దిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అతనిపై కేసు నమోదు చేసి, పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు మొదట బ్రిజ్‌పై కేసు నమోదు చేయేలదు. కానీ చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ పోలీసులు అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే రాజకీయ దురుద్దేశంతోనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లు నిరసన చేస్తే తాను రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. కాగా.. మహిళ రెజ్లర్లకు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారు. వారి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. నలుపు రంగులో ఉండే శిలాజిత్ పౌడర్‌ను ఉపయోగిస్తే సామర్థ్యం పెరుగుతుందని అంటారు. ఇవీ క్యాప్సుల్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఇది తింటే పురుషుల శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయంటారు. చదవండి: రాజద్రోహం చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటులో బిల్లు..! -
న్యాయం కావాలి!
చట్టం ముందు అందరూ సమానులే అంటాం. కానీ, డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కొంచెం ఎక్కువ సమానమని పదేపదే రుజువవుతుంటే ఏమనాలి? వ్యవస్థపై ఇక నమ్మకమేం మిగుల్తుంది? లైంగిక వేధింపులకూ, బెదిరింపులకూ పాల్పడ్డాడంటూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడూ, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై మహిళా రెజ్లర్లు నెలలుగా మొత్తుకుంటున్నా క్రీడాశాఖకూ, పాలకులకూ పట్టనితనం చూస్తే ఇలాంటి ప్రశ్నలెన్నో వస్తాయి. అంతర్జాతీయ పత కాలు తెచ్చిన ఆడపిల్లలు తమ గోడు వెళ్ళబోసుకుంటూ, బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలంటూ జనవరిలో వీధికెక్కిన దృశ్యాలు దేశమంతా చూసినవే. మూడు నెలలు గడిచినా అతీగతీ లేక చివరకు మళ్ళీ ఆ అగ్రశ్రేణి మహిళా మల్లయోధులు మరోసారి నిరసనకు దిగాల్సి రావడం శోచనీయం. తాజాగా ఏప్రిల్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసినా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాని పరిస్థితుల్లో అసహాయులైన అమ్మాయిలు ఆఖరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టాల్సి రావడం మనం ఏ కాలంలో, ఎలాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నామో నగ్నంగా నిరూపిస్తున్నాయి. అన్నిటికీ అత్యుత్సాహంతో కేసులు కట్టే పోలీసులు తాజా ఫిర్యాదు తర్వాత 5 రోజులైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఆదివారం నుంచి 4 రోజులుగా జంతర్ మంతర్ వద్ద రెండోసారి నిరసన దీక్ష కొనసాగిస్తున్నా బాధిత మహిళా రెజ్లర్లను సంబంధిత అధికారులెవరూ పలకరించనైనా లేదు. మహిళా సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పుకొనే జాతీయ మహిళా కమిషన్ సైతం అయిపూ అజా లేదు. ఇక దేశంలో సగటు స్త్రీకి మనం ఏం భరోసా కల్పిస్తున్నట్టు? అసలైతే మహిళలెవరైనా లైంగిక వేధింపుల ఫిర్యాదు చేస్తే – తక్షణమే కేసు పెట్టి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చట్టం. ఢిల్లీ పోలీసులు మాత్రం ఏడుగురు మహిళలు లిఖిత పూర్వక ఫిర్యాదులిచ్చినా ప్రాథమిక విచారణ చేశాక ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని మీనమేషాలు లెక్కిస్తుండడం దారుణం. ‘పోక్సో’ చట్టం సైతం వర్తించే మైనర్ బాలికపై వేధింపుల తీవ్రాతితీవ్ర అంశమున్నా, సోకాల్డ్ విచారణేదో ఇన్నిరోజులుగా పూర్తి కాకపోవడం మరీ విడ్డూరం. పైపెచ్చు, లైంగిక బాధితులమంటూ ఫిర్యాదు చేసిన స్త్రీల పేర్లను పోలీసులే లీకు చేయడం ఘోరం, నేరం. నిందితుడు అధికార పార్టీకీ, అందునా సీట్లు, ఓట్లలో కీలక యూపీకీ చెందిన వ్యక్తి గనక చట్టాలన్నీ చుట్టాలయ్యాయంటే తప్పు పట్టగలమా? జనవరిలో బాధితులు నిరసన దీక్షకు దిగినప్పుడే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు జరిగాయి. వినేశ్ ఫోగట్, సాక్షీ మలిక్ లాంటి తోటి క్రీడాకారిణులకు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భజరంగ్ పునియా లాంటి పురుషులూ తోడుగా నిలిచి, విషయం మీడియాలో పెద్దదయ్యే సరికి తప్పక క్రీడాశాఖ రంగంలోకి దిగింది. నిందితుడైన బీజేపీ ఎంపీని తాత్కాలికంగా సమాఖ్యకు దూరం జరిపింది. విచారణకు కంటితుడుపు కమిటీ వేసింది. బాక్సర్ మేరీ కోమ్ సారథ్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ 4 వారాల్లో నివేదిక ఇవ్వాలి. ఇప్పటికి 3 నెలలైనా ఆ కమిటీ, దాని నివేదిక అతీగతీ దేవరహస్యమే. నివేదికను బయటపెట్టాలనీ, నిందితుణ్ణి అరెస్ట్ చేయాలనీ కోరుతూ రెజ్లర్లు ఇప్పుడు ఢిల్లీ నడిబొడ్డున, నేపథ్యంలో హనుమాన్ చాలీసా వినిపిస్తూ, దీక్షకు కూర్చున్నారు. రోడ్ల మీదే రెజ్లింగ్ సాధన చేస్తున్నారు. పతకాలు తెచ్చినప్పుడల్లా వారితో ఫోటోలకు పోజులిచ్చి, న్యాయం కోసం రోడ్డెక్కినప్పుడు మౌనం పాటిస్తున్న కమలనాథులకు మాత్రం కనికరం కలగట్లేదు. భారత ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన మరో కమిటీ వేస్తున్నట్టు క్రీడా శాఖ ప్రకటించింది కానీ, మరోసారి కమిటీల పేర మోసపోవడానికి రెజ్లర్లు సిద్ధంగా లేరు. బాధిత మహిళలతో పాటు పౌర సమాజం డిమాండ్ చేస్తున్నట్టు... ఆరుసార్లు ఎంపీ, ఒకప్పుడు తీవ్రవాద కేసులో నిందితుడూ, స్థానిక డాన్‌గా అపరిమిత పలుకుబడి గల వ్యక్తి అయిన బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ దాఖలుకు నిరాకరించిన పోలీసులపై కేసు నమోదు చేయాలి. పతకాలు పండిస్తున్న భారత రెజ్లింగ్ ఇప్పటికే ఈ వివాదాలతో కుదేలైంది. నిరసనగా గత నెల అంతర్జాతీయ శిక్షణ శిబి రాల నుంచి పునియా, ఫోగట్ పక్కకు తప్పుకున్నారు. వచ్చే ఎటి ప్యారిస్ ఒలింపిక్స్‌లో విజయా లకూ ఇది గండి కొట్టే ప్రమాదం ఉంది. సుప్రీంలో కేసు ఈ 28న తదుపరి విచారణకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే పరువు పోయిన క్రీడాశాఖ కళ్ళకూ, చెవులకూ గంతలు తొలగించుకోవాలి. నిజానికి, మన క్రీడా వ్యవస్థ అనేక లోపాల పుట్ట. క్రీడాసంస్థలు కొందరి జేబుసంస్థలుగా కొనసాగడం, రాజకీయ ప్రాబల్యానికి అడ్డా కావడం దశాబ్దాలుగా ఉన్నదే. కోరింది ఇస్తేనే ఆటలో అవకాశాలొస్తాయనే వాతావరణం కల్పించడం, అర్హుల కన్నా అయినవాళ్ళను అందలం ఎక్కించడం పదే పదే చూస్తున్నదే. అందుకే, అప్రతిష్ఠ మూటగట్టుకున్న రెజ్లింగ్ సమాఖ్య, దాన్ని సొంత జాగీరులా నడుపుతున్న బ్రిజ్భూషణ్ల వ్యవహారం ఆశ్చర్యం కాకపోవచ్చు కానీ, ఇన్ని ఆరోపణల తర్వాతైనా కళ్ళు తెరిచి, చర్యలు తీసుకోవాల్సిన అంశం. కేసు ఇప్పుడు సుప్రీం దాకా వచ్చింది గనక బాధితులకు న్యాయం జరగవచ్చు. కానీ దేశప్రతిష్ఠను పెంచిన క్రీడాకారులు, అందులోనూ ఆడ పిల్లలు ఆరోపణలు చేస్తుంటే అధికార, పాలనా వ్యవస్థలు సరిగ్గా స్పందించకపోవడమే దుర్మార్గం. ఇకనైనా స్వపర భేదాలు వదిలి, క్రీడా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళించాలి. బ్రిజ్ భూషణ్ కథ అందుకు నాంది కావాలి. సాధారణ న్యాయం సైతం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తేనే సాధ్యమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళితే, అది పాలకులకు కాదు... మొత్తం వ్యవస్థకే తలవంపులు. -
మే 7న జరగాల్సిన WFI ఎన్నికలు వాయిదా
-
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిపై లైంగిక ఆరోపణలు
-
భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ
సాక్షి, న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్యకు వినేశ్ ఫొగాట్ క్షమాపణ చెప్పారు. టోక్యో ఒలింపిక్స్‌లో తన ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ పంపిన నోటీసుపై ఆమె స్పందిస్తూ ఆదివారం క్షమాపణ కోరారు. కాగా, టోక్యోలో ఫొగాట్ ప్రవర్తనపై డబ్ల్యూఎఫ్ఐ తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆమెపై నిషేధంపై త్వరలో భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నిర్ణయం తీసుకోనుంది. నిన్న(శనివారం) ఆమె స్పందిస్తూ.. ‘మన దేశంలో ఎంత వేగంగా పైకి ఎదుగుతామో అంతే వేగంగా కింద పడిపోతాం. ఒక్క పతకం రాలేదంటే ఇక అంతా అయిపోయినట్లే. ఇప్పుడూ అదే జరుగుతోంది. అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓటమికి కారణాలేమిటో నాకు బాగా తెలుసు. ఒలింపిక్స్ కోసం అన్ని రకాలుగా సిద్ధమై వచ్చాను. కానీ నన్ను దురదృష్టం వెంటాడింది’ అని వినేశ్ పేర్కొంది. రెజ్లింగ్‌పై అవగాహనలేని, షూటింగ్‌తో సంబంధం ఉన్న ఫిజియోను తనకు కేటాయించారని, బౌట్‌కు ముందు తన బరువు తగ్గించుకునే విషయంలో తానే ఆమెకు వివరించాల్సి వచ్చిందని వినేశ్ ఆరోపించింది. రెండుసార్లు కరోనా సోకడంతో తన శరీరంలో అసలు ప్రొటీన్ లేకుండా పోయిందని ఆమె చెప్పింది. తన వల్ల భారత రెజ్లర్లు కోవిడ్ బారిన పడకూడదనే విడిగా ఉన్నానని, ఇందులో తప్పేముందని ప్రశ్నించిన వినేశ్... గత రెండేళ్లుగా చాలాసార్లు డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. -
‘మీ పతకాలు వెనక్కి ఇచ్చేయండి’
న్యూఢిల్లీ: డోపింగ్‌లో విఫలమైన రెజ్లర్లు ‘ఖేలో ఇండియా’ క్రీడల్లో సాధించిన పతకాలతో పాటు ధ్రువపత్రాలను వెనక్కి ఇచ్చేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఈ విధంగా చేస్తున్నట్లు డబ్ల్యూఎఫ్ఐ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. గత నాలుగు సీజన్ల ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌తో పాటు స్కూల్ యూత్, యూనివర్సిటీ క్రీడల్లో పతకాలు సాధించిన 12 మంది రెజ్లర్లు డోపింగ్‌లో విఫలమయ్యారు. ఇందులో ఆరుగురు ఫ్రీస్టయిల్ రెజ్లర్లు కాగా, మరో ఆరుగురు గ్రోకో రోమన్ విభాగానికి చెందినవారు. వీరి నుంచి పతకాలను వెనక్కి తీసుకోవడంలో అనుబంధ రాష్ట్ర సంఘాలు సహాయం చేయాలని డబ్ల్యూఎఫ్ఐ కోరింది. డోపింగ్ పరీక్షలో విఫలమైన రెజ్లర్లలో రోహిత్ దహియా (54 కేజీలు), అభిమన్యు (58 కేజీలు), వికాస్ కుమార్ (65 కేజీలు), విశాల్ (97 కేజీలు), వివేక్ భరత్ (86 కేజీలు), జస్దీప్ సింగ్ (25 కేజీలు), మనోజ్ (55 కేజీలు), కపిల్ పల్‌స్వల్ (92 కేజీలు), జగదీశ్ రోకడే (42 కేజీలు), రోహిత్ అహిరే (72 కేజీలు), విరాజ్ రన్వాడే (77 కేజీలు), రాహుల్ కుమార్ (63 కేజీలు) ఉన్నారు. -
రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఝలక్
న్యూఢిల్లీ: రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత, భారత రెజ్లర్ సుశీల్ కుమార్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఝలక్ ఇచ్చింది. తాను గాయంతో బాధపడుతున్న కారణంగా తన 74 కేజీల విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ను వాయిదా వేయాలంటూ కోరిన విన్నపాన్ని తోసిపుచ్చింది. ఈ ట్రయల్స్‌లో విజేతలుగా నిలిచిన వారు ఈ నెలలో రోమ్ వేదికగా జరిగే ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి, న్యూఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తారు. అయితే ఈ టోర్నీకి రోజుల వ్యవధిలో సుశీల్ గాయపడటంతో... తన విభాగంలో జరిగే ట్రయల్స్‌ను వాయిదా వేయాలని కోరాడు. దీనిపై స్పందించిన డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ‘ట్రయల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు. 74 కేజీల విభాగంలో పోటీ పడటానికి చాలా మంది రెజ్లర్లు ఉన్నారు. సుశీల్ గాయపడితే మేమేం చేయగలం. 74 కేజీల విభాగంలో అర్హత సాధించిన రెజ్లర్ల ప్రదర్శనను ర్యాంకింగ్ సిరీస్ ఈవెంట్స్‌లో పరిశీలిస్తాం. ఈ విభాగంలో సుశీల్ కంటే మెరుగైన రెజ్లర్ లేరనిపిస్తే... మార్చిలో జరిగే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో అతనికి తప్పక అవకాశం ఇస్తాం’ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సుశీల్ ‘నేను రెండు వారాల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తాను. నేను గాయంతో బాధపడుతున్న సంగతి వారికి (డబ్ల్యూఎఫ్ఐ) తెలుసు. ఒక వేళ వారు ట్రయల్స్‌ను కొనసాగించాలనుకుంటే కొనసాగించుకోవచ్చు.’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. -
సాక్షి మళ్లీ శిబిరానికి....
న్యూఢిల్లీ: జాతీయ శిక్షణ శిబిరంలో తిరిగి చేరేందుకు భారత మహిళా స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అనుమతించింది. సమాచారం ఇవ్వ కుండా శిబిరం నుంచి నిష్క్రమించడంతో మొదట ఆగ్రహించిన సమాఖ్య వివరణ ఇవ్వాలని ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మొత్తం 25 మంది మాట మాత్రమైనా చెప్పకుండా, సంబంధిత వర్గాల అనుమతి లేకుండానే శిబిరం నుంచి జారుకున్నారు. ఇందులో 2016 రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి (62 కేజీలు)తో పాటు సీమా (50 కేజీలు), కిరణ్ (76 కేజీలు) ఉన్నారు. ఈ ముగ్గురు ఇటీవలే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సంపాదించారు. బుధవారం లోగా వివరణ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐ ఆదేశించగా సాక్షి... రక్షాబంధన్ వేడుకలో పాల్గొనేందుకే శిబిరం నుంచి పయనమైనట్లు వివరించింది. దీనిపై డబ్ల్యూఎఫ్ఐ ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆమె తిరిగి శిబిరంలో కొనసాగేందుకు అనుమతిచ్చారు. -
సుశీల్, సాక్షిలకు మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రయల్స్ నుంచి స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, సాక్షి మాలిక్‌లు తప్పుకున్నారు. వీరిద్దరితో పాటు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలు కూడా ట్రయల్స్‌లో పాల్గొనలేమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు నివేదించారు. దీనిపై స్పందించిన డబ్ల్యూఎఫ్ఐ వారికి మినహాయింపు ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కీలకమైన పోటీలకు ముందు ఎలాంటి ఉదాసీనతలకు తావివ్వకుండా ఉండేందుకు డబ్ల్యూఎఫ్ఐ ఆధ్వర్యంలో సోనెపట్‌లోని భారత స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో వచ్చే నెల 10 నుంచి పురుషుల కోసం ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌లో ఫ్రీస్టయిల్, గ్రీకోరోమన్ విభాగాల్లో రెజ్లర్లకు తర్ఫీదు ఇవ్వనున్నారు. మహిళల కోసం లక్నోలో జూన్ 17 నుంచి ఈ ట్రయల్స్ జరుగుతాయి. ఈ నేపథ్యంలో నలుగురు రెజ్లర్లు తమను ట్రయల్స్ నుంచి మినహాయించాలని కోరడంతో డబ్ల్యూఎఫ్ఐ అధికారులు దీనికి సమ్మతించారు. -
‘దంగల్’ సిస్టర్స్‌పై వేటు
న్యూఢిల్లీ : నేషనల్ క్యాంప్‌కు హజరుకానందుకుగాను జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఫోగట్ సిస్టర్స్‌పై వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే డబ్ల్యూఎఫ్ఐ ఫోగట్ సిస్టర్స్‌కు మరో అవకాశం ఇచ్చింది. నేషనల్ కాంప్‌కు హాజరుకానందుకు కల కారణాన్ని వివరిస్తే వారిని తిరిగి చేర్చుకునే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించడమే కాక వారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘దంగల్’ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఫోగట్ సిస్టర్స్ గీత, బబితలతో పాటు వీరి చెల్లెళ్లు రీతు, సంగీత కూడా ప్రస్తుతం లక్నోలో నిర్వహిస్తున్న నేషనల్ క్యాంప్‌కు హాజరుకాలేదు. ఈ కారణం వల్ల డబ్ల్యూఎఫ్ఐ వీరి మీద వేటు వేసింది. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. ‘నేషనల్ క్యాంప్‌కు ఎంపికైన ఏ రెజ్లర్ అయిన మూడురోజుల్లోగా తన శారీరక దృఢత్వం గురించి క్యాంప్‌లో తెలియచేయాలి. ఒకవేళ వారికి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటి గురించి కోచ్‌తో చెప్పి పరిష్కరించుకోవాలి. అయితే గీతా, బబిత వారి ఇద్దరు సోదరీమణులు రీతూ, సంగీత కూడా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కనీసం వారితో మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. డబ్ల్యూఎఫ్ఐ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణించి, వారిపై క్రమశిక్షణా రహిత్యం కింద చర్యలు తీసుకుంది. ఇక వారు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోవచ్చ’ని అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ చర్యల వల్ల ఫోగట్ సిస్టర్స్ ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరగబోయే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోనున్నట్లు సమాచారం. అయితే డబ్ల్యూఎఫ్ఐ వీరికి ఒక ఊరట కల్పించింది. ఒకవేళ ఫోగట్ సిస్టర్స్ కనుక వారి గైర్హాజరుకు సరైన కారణాన్ని చెప్తే వారికి మరో అవకాశం ఇస్తామని శరణ్ సింగ్ తెలిపారు. ఫోగట్ సిస్టర్స్‌తో పాటు రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భర్త సత్యవర్త్ కడియాన్పైనా కూడా డబ్ల్యూఎఫ్ఐ నిషేధం విధించింది. నిషేధం గురించి నాకేం తెలియదు : బబిత అయితే ఈ విషయం గురించి బబిత స్పందిస్తూ.. ‘డబ్ల్యూఎఫ్ఐ నాపై వేటు వేసిన సంగతి నాకు తెలియదు. దీనికి సంబంధించి ఎటువంటి నోటీసు నాకు రాలేదు. నేను నేషనల్ కాంప్‌కు హాజరుకాని మాట వాస్తవం. ఎందుకంటే నేను మోకాలి గాయాలతో బాధపడుతున్నాను. అయితే ఈ విషయం గురించి నేను డబ్ల్యూఎఫ్ఐకి సమాచారం ఇవ్వలేదు. ఈరోజే దీని గురించి వారికి తెలియజేస్తాను. అలానే రీతూ, సంగీత రష్యాలో నిర్వహిస్తున్న ట్రైనింగ్ క్యాంప్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ వారికి ఇంకా వీసాలు రాలేదు. ఈ విషయం గురించి డబ్ల్యూఎఫ్ఐను సంప్రదించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం గీత బెంగుళూరులో శిక్షణ తీసుకుంటోంది. ఆమె నేషనల్ క్యంప్కు ఎందుకు గైర్హాజరయ్యిందో నాకు తెలియద’ని చెప్పారు. గీతా ఫోగట్ 2010 కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే కాక 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి మల్లయుద్ధంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. అలానే ఆమె సోదరి బబిత 2014 గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించింది. -
ఢిల్లీకి చేరిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమయ్యే వరల్డ్ ఫుడ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు. షెడ్యూలు ప్రకారం ఆయన శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన హైదరాబాద్ నుంచి గురువారం రాత్రికే ఢిల్లీకి చేరుకోవడం గమనార్హం. ఎవరిని కలవడానికి హడావుడిగా గురువారం రాత్రికే ఆయన ఢిల్లీకి చేరుకున్నారన్నది అంతుచిక్కట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీతోపాటు పలువురు కేంద్రమంత్రుల్ని సీఎం కలవడానికి వీలుగా అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అపాయింట్మెంట్ను బట్టి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను చంద్రబాబు శుక్రవారం కలవనున్నారు. బాబు కేంద్రమంత్రి జైట్లీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జైట్లీ అపాయింట్మెంట్ ఇస్తే పెంచిన అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులివ్వాలని కోరాలని సీఎం నిర్ణయించారు. ఇదిలా ఉంటే.. కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీ అపాయింట్మెంట్ను సైతం కోరడం గమనార్హం. -
అన్యాయంగా ఆపేశారు
♦ న్యాయంగా రూ.25 లక్షలు చెల్లించండి ♦ 15 ఏళ్ల తర్వాత రెజ్లర్ సతీశ్‌కు అనుకూలంగా ఢిల్లీ కోర్టు తీర్పు న్యూఢిల్లీ: ప్రతిభావంతుడైన రెజ్లర్ జీవితంతో ఆడుకున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై ఢిల్లీ కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. రెజ్లర్ సతీశ్ కుమార్‌కు పరిహారంగా రూ. 25 లక్షలు చెల్లించాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. తీర్పు ఆలస్యమైనా... న్యాయం మాత్రం లభించింది. 2002లో జరిగిన ఉదంతంపై 15 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. 2002లో బుసాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన ఆసియా క్రీడలకు సతీశ్ (పంజాబ్) పయనమయ్యాడు. అయితే అదే పేరుతో ఉన్న పశ్చిమ బెంగాల్ రెజ్లర్ డోపీగా తేలడంతో పంజాబ్ రెజ్లర్ సతీశ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో నిలిపేశారు. ఎన్నో కలలతో బరిలోకి దిగాలనుకున్న సతీశ్ తను డోపీ కాదని నెత్తి, నోరు మొత్తుకున్న డబ్ల్యూఎఫ్ఐ అధికారులు పెడచెవిన పెట్టారు. దీంతో బుసాన్‌కు అతను వెళ్లలేకపోయాడు. తను పడిన మానసిక వేదనపై సతీష్ న్యాయపోరాటం చేశాడు. మరోవైపు అతను కామన్వెల్త్ చాంపియన్‌షిప్, ప్రపంచ పోలీస్ గేమ్స్‌లో పతకాలు గెలుపొందాడు. సుదీర్ఘ విచారణ అనంతరం ఢిల్లీ కోర్టు రెజ్లింగ్ సమాఖ్య అధికారులు ‘కళ్లు తెరిచి పడుకున్నారు’ అని తీవ్రస్థాయిలో మండిపడింది. దీనికి కారణమైన ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టొద్దని, అందరిపై .కేసు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో మరే క్రీడాకారుడు ఇలా అన్యాయానికి గురికాకుండా చూడాలని కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది. -
యోగేశ్వర్ కు కాంస్యమా.. రజతమా?
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ పతకంపై స్పష్టత కరువైంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ కాంస్య పతకం నెగ్గగా.. తాజాగా ఆ పతకంపై కొన్ని పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ శాంపిల్స్ పాజిటీవ్ గా తేలడంతో యోగేశ్వర్ పతకం కాంస్యం నుంచి రజతానికి అప్ గ్రేడ్ అవుతుందని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మంగళవారం నాడు బాంబు పేల్చింది. ఓ వైపు దేశమంతా యోగేశ్వర్ కు రజత పతకం వస్తుందని ఆనందంలో మునిగి తేలుతుండగా, సంబంధిత క్రీడా సమాఖ్య మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. అసలు తమకు లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ పతకానికి సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలపై తమ వద్ద ఎలాంటి సమాచార లేదని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. లండన్ ఒలింపిక్స్ లో కుదుకోవ్ చేతిలోనే యోగేశ్వర్ ఓటమిపాలు కాగా, ఆ తర్వాత అతడు ఫైనల్ కు వెళ్లడంతో యోగేశ్వర్ దశ తిరిగి కాంస్యం సాధించాడు. ఒలింపిక్స్ పతకాలపై దర్యాప్తు చేయడం, విచారణ చేసి ఆటగాళ్ల పతకాలపై నిర్ణయం తీసుకునే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)కి ఉంది. అయితే ఐఓసీ మాత్రం కుదుకోవ్ విషయాన్ని తేలికగా తీసుకుని దర్యాప్తును ఆపివేయాలని యోచిస్తుండటం గమనార్హం. డోపీగా తేలిన రష్యా రెజ్లర్ కుదుకోవ్ 2013లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. -
నా కెరీర్ ఏమవుతుందో : సుశీల్
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ లో తనకు అవకాశం కల్పించక పోవడంపై భారత రెజ్లర్ సుశీల్ కుమార్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్ లో భారత్‌కు పతకాలు అందించిన ఏకైక ప్లేయర్ సుశీల్. రియో వివాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడాడు. రియోలో పాల్గొనక పోవడం తన కెరీర్ పై ఎంతో ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. రియో ఒలింపిక్స్ కోసం ఎంతగానో శ్రమించానని చెప్పాడు. వరుసగా మూడో ఒలింపిక్స్ లో పాల్గొని దేశానికి తన వంతుగా మూడో పతకం సాధించాలన్న తన ఆకాంక్షను నెరవేరలేదని వాపోయాడు. దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారానికి భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తన పేరును ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశాడు. డబ్ల్యూఎఫ్ఐ ఇప్పటికైనా తన విజయాలను గుర్తించిందన్నాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ డోపీగా తేలడంతో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ దత్ రజతానికి అప్ డేట్ అవడంపై సుశీల్ స్పందించాడు. యోగేశ్వర్ కు అభినందనలు తెలిపాడు. ఆ పతకం కుదుకోవ్ కుటుంబం వద్ద ఉంటడమే కరెక్ట్ అని చెప్పి యోగేశ్వర్ మానవత్వాన్ని చాటుకున్నాడని ప్రశంసించాడు. 74 కేజీల విభాగంలో భారత్ నుంచి నర్సింగ్ యాదవ్ ను రియోకు పంపించగా నాటకీయ రీతిలో డోపింగ్ కారణాలతో అవకాశం ఇవ్వకపోగా, నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
ప్రమోషన్‌కు సైతం నర్సింగ్ దూరం
న్యూఢిల్లీ: ఇటీవల కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో రియో ఒలింపిక్స్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఇప్పుడు ఆ గేమ్స్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనే అంశంపై కూడా సందిగ్ధత నెలకొంది. మరో నాలుగు నెలల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ) ఆధ్వర్యంలో విశ్వవిజేత గామా రెజ్లింగ్ పేరుతో కొత్తగా నిర్వహించదలచిన వరల్డ్ కప్ పోటీల ప్రమోషన్ కార్యక్రమాలకు నర్సింగ్ దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని తాజాగా బ్యూఎఫ్ఐ సెక్రటరీ టీఎన్ ప్రసూద్ ధృవీకరించారు. కోర్టు తీర్పుతో నర్సింగ్ యాదవ్ భవిష్యత్ అంధకారంలో పడిందన్న ప్రసూద్.. ఇక నుంచి గేమ్స్ ప్రమోషన్ కార్యక్రమాలకు సైతం ఆ రెజ్లర్ దూరం అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే నర్సింగ్ యాదవ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా? లేదా అనేది దానిపై వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ' ఈ పోటీల్లో నర్సింగ్ యాదవ్ పాల్గొనడం లేదనేది కోర్టు తీర్పును బట్టి మనకు తెలుసు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గేమ్స్ ప్రమోషన్లో కూడా నర్సింగ్ పాల్గొనకపోతే ఆ స్టేజ్‌కు అందం ఉండదు. ఈ ఈవెంట్ కు సంబంధించి అత్యధిక శాతం క్వాలిఫికేషన్ పోటీలు మహారాష్ట్రలో జరుగనున్నాయి. మహారాష్ట్ర రెజ్లర్ అయిన నర్సింగ్ యాదవ్ కనీసం ప్రమోషన్ లోనైనా ఉంటే ఈ పోటీలకు కొంత ఊపు వస్తుంది. దీనిపై వాడాను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది' టీఎన్ ప్రసూద్ తెలిపారు. -
'సీబీఐ విచారణ జరగాల్సిందే'
రియో డీ జనీరో: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై డోపింగ్ కుట్ర జరిగిందని బలంగా వాదిస్తున్న డబ్యూఎఫ్ఐ(రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా).. ఈ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ జరగాల్సేందనని డిమాండ్ చేస్తోంది. ఇందులో నిజానిజాలు వెలికి రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని డబ్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి వెళ్లిన నర్సింగ్ యాదవ్ ఆశలకు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో బ్రేక్ పడింది. దాంతో పాటు అతనిపై నాలుగేళ్ల నిషేధం కూడా విధించింది. నర్సింగ్ పై డోపింగ్ కుట్ర జరిగిందనడానికి బలమైన ఆధారాలు లేనందును అతనిపై సస్పెన్షన్ వేటూ వేస్తూ తీర్పు వెలువరించింది. జూన్ 25వ తేదీన నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో నర్సింగ్ యాదవ్ విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత నర్సింగ్ కు రెండోసారి పరీక్షలు నిర్వహించిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా).. రెండు సార్లు తీర్పును వాయిదా వేసిన అనంతరం ఆగస్టు 1వ తేదీన అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో నర్సింగ్ యాదవ్ ఎన్నో ఆశలతో రియోలో అడుగుపెట్టాడు. కాగా, నాడా' ఇచ్చిన క్లీన్ చీట్ ను సీఏఎస్ లో వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) తన అధికారం మేరకు సీఏఎస్ లో సవాల్ చేసింది. దీనిపై విచారణకు స్వీకరించిన సీఏఎస్.. నర్సింగ్ కుట్ర కారణంగానే డోపింగ్ లో ఇరుక్కున్నాడన్న వాదనను అంగీకరించలేదు. అతడి ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని, నర్సింగ్ పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ఉదంతం డోపింగ్ కుట్రలో భాగమేనని డబ్యూఎఫ్ఐ భావిస్తోంది.