మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు కోర్టు ఓకే
న్యూఢిల్లీ: మ్యాక్స్ ఇండియా కంపెనీ పునర్వ్యవస్థీకరణకు పంజాబ్, హర్యానా హైకోర్ట్ ఆమోదం లభించింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మ్యాక్స్ ఇండియా మూడు కంపెనీలుగా విడిపోతోంది. మ్యాక్స్ ఇండియా కంపెనీ మ్యాక్స్ పైనాన్షియల్ సర్వీసెస్ పేరుతో వచ్చే నెల నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతుందని కంపెనీ తెలిపింది. మిగిలిన రెండు కంపెనీలు (మ్యాక్స్ ఇండియా, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్) వచ్చే ఫిబ్రవరి నుంచి స్టాక్ మార్కెట్లో ట్రేడవుతాయని తెలియజేసింది.
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ జీవిత బీమా వ్యాపారాన్ని, మ్యాక్స్ ఇండియా ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా, ఇతర వ్యాపారాలను, మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ తయారీ రంగ కార్యకలాపాలను చూస్తాయని తెలిపింది. కాగా మ్యాక్స్ ఇండియా పునర్వ్యస్థీకరణకు ఇప్పటికే సెబీ, బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, కాంపిటీ షన్ కమీషన్ ఆఫ్ ఇండియాలు(సీసీఐ) ఆమోదం తెలిపాయి.