
చండీగఢ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకున్న దరిమిలా ఆ ప్రభావం పంజాబ్‌పై పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయడం, అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది.
పంజాబ్ నీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా, సమాచార, పౌరసంబంధాలు, మైనింగ్, భూమి ప్రకటనల శాఖ మంత్రి చేతన్ సింగ్ జోరామజ్రా, పర్యాటక మంత్రి అన్మోల్ గగన్ మాన్‌తో పాటు మరో మంత్రి బాల్కర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించి, వెంటనే గవర్నర్‌కు పంపింది. అనంతరం పంజాబ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ప్రకటించింది. కొత్తగా బరీందర్ కుమార్ గోయల్, తరణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, మహీందర్ భగత్, హర్దీప్ సింగ్ ముండియాలను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు ప్రకటించింది.
ఈ నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే తొలిసారి. 30 నెలల భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఇది నాల్గవసారి మంత్రివర్గ విస్తరణ. 117 మంది ఎమ్మెల్యేలున్న పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ సహా 15 మంది మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. మంత్రి మండలిలో మొత్తం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశముంది.
ఇది కూడా చదవండి: Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు..