Governament
-
కూటమి నేతల అండదండలతో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
-
ఢిల్లీలో హైబ్రీడ్ మోడ్‌లో పాఠశాల తరగతులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ మునిసిపల్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ‘హైబ్రిడ్ మోడ్’లో అంటే ఆన్లైన్, ఆఫ్లైన్లలో నడపాలని ఆదేశించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి నాణ్యతలో కాస్త మెరుగుదల ఏర్పడిన దరిమిలా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సడలింపులను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పాఠశాలల నిర్వహణలో ఈ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలను అక్టోబర్ 18 నుండి ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా గాలి నాణ్యత చాలా తక్కువ వర్గానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులను పునఃప్రారంభించాలని సీఏక్యూఎం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హైబ్రిడ్ మోడ్‌లో విద్యాబోధన కొసాగనుంది. దీని ప్రకారం పాఠశాల తరగతులను అటు ఆన్లైన్లో, ఇటు అఫ్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
Delhi Pollution: డ్రోన్ల సాయంతో కాలుష్యకారక పరిశ్రమల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం హద్దులు దాటి ప్రజలకు ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యం నియంత్రణ దిశగా నడుంబిగించింది. రాజధానిలోని నివాస ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తూ, కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న జీన్స్ డైయింగ్ ఫ్యాక్టరీలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లు, ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లపై దృష్టి సారించింది.అక్రమ ఫ్యాక్టరీలు, యూనిట్లపై డ్రోన్‌తో నిఘా చేపట్టేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) సిద్ధమైంది. పారిశ్రామిక కాలుష్యానికి కారణమయ్యే యూనిట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టి, వాటిని మూసివేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తుఖ్మీర్‌పూర్, కరవాల్ నగర్, గోకుల్‌పురి, ఘాజీపూర్, అలీ విహార్, మిథాపూర్ పరిసర ప్రాంతాలతో సహా 17 ప్రధాన కాలుష్య హాట్స్పాట్లలో డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. ఇక్కడ అక్రమంగా రంగులు వేసే యూనిట్లు, జీన్స్ వాషింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 15 రోజుల పాటు ఈ డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. డ్రోన్ ఆధారిత ఆర్థో-రెక్టిఫైడ్ ఇమేజరీ (ఓఆర్ఐ)ని ఇందుకోసం వినియోగించనున్నారు. ఇది కాలుష్య యూనిట్లకు ఫోటోలు తీస్తుంది. ఈ సర్వేలో ఉపయోగించే డ్రోన్ దాదాపు 45-60 నిమిషాల పాటు గాలిలో ఎగురుతుంది. దీని విజిబిలిటీ పరిధి 3-5 కి.మీ ఉంటుంది. ఇది 750 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ సర్వే కోసం 17 డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇందుకోసం డీపీసీసీ టెండర్లు జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా తమ ప్రతిపాదనలో డ్రోన్ ప్లాన్, డ్రాఫ్ట్ స్క్రిప్ట్, యాక్షన్ ప్లాన్, డ్రాఫ్ట్ డిజైన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ! -
ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!
ఇంతకుముందు "జనాభా నియంత్రణ" అంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ కథే అడ్డం తిరిగింది. బాబు.. "పిల్లల్ని కనండి ప్లీజ్" అంటూ వెంటపడుతున్నాయి దేశాలు. ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. అందుకోసం ఆయా దేశాల అధికారులు జననాల రేటు పెంచేందుకు తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాలు చూస్తే.. మరీ ఇంతలా దిగజారిపోవాలా..! అనుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు పిల్లలు వద్దు అని ప్రజల మనసుల్లో పాతకునేలా చేశాం. ఇప్పుడు కావాలంటే..ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు కూడా. జనాభాని పెంచేందుకు ఆయా దేశాలు అమలు చేస్తున్న స్కీమ్‌లు, విధానాలు వింటే గోప్యతకు భంగం వాటిల్లేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతలా ఆయా దేశాలు జనాభాను పెంచేందుకు ఏం చేస్తున్నాయనే కదా..!రష్యాలో జనాభా దారుణంగా తగ్గిపోతుంది. ఏం చేయాలో తెలియక అక్కడి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి జననాల రేటుని పెంచాలనే నిర్ణయానికి వచ్చేసింది రష్యా. అందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను(సెక్స్ మంత్రిత్వ శాఖ) ఏర్పాటు చేసి జననాల రేటుని పెంచే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించింది. ఆ విషయమై పిటిషన్‌ని కూడా దాఖలు చేశారు అధికారులు. ఇది జనాభాను పెంచే రష్యా పార్లమెంట్ కమిటీ అధిపతి నినా ఒస్తానియా సమీక్షలో ఉంది. పని ప్రదేశాల్లో కూడా జంటలను ఎక్కువ విరామం తీసుకుని పిల్లలనే కనేలా ప్లాన్ చేసుకోండని ప్రోత్సహిస్తున్నారు అక్కడి అధికారులు. అక్కడితో ఆగలేదు ఆఖరికి బెడ్రూంలోకి కూడా ఎంటర్ అయ్యిపోయే స్థాయికి దిగజారిపోయింది రష్యా ప్రభుత్వం. దయచేసి బెడ్రూంలోకి రాగానే పౌరులంతా మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయాలనే నిబంధనలు తీసుకొచ్చింది. అంతేగాదు పిల్లలను కనేలా ప్రోత్సహిస్తూ..జంటలకు రూ. 4 వేల రూపాయలు అందిస్తోంది. అదే కొత్తగా పెళ్లైన జంటలకు హోటల్లో గడిపేందుకు ఖర్చులు కింద ఏకంగా రూ. 22 వేల రూపాయల వరకు అందిస్తోంది. అలానే 18 నుంచి 23 మధ్య వయస్సు గల మహిళలకు బిడ్డను కనేలా రూ. 98,029 ఇస్తున్నారు. మొదటి బిడ్డకు ఏకంగా రూ.9.26 లక్షల వరకు పారితోషకం ఇవ్వడం విశేషం. అంతేగాదు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఫ్యామిలీ ప్లాన్ గురించి, వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి సంబంధించిన డేటాను సేకరిస్తారు. దీంతోపాటు గతంలో పిల్లలను కలిగి ఉన్నారా..ఎంతమంది కావాలనుకుంటున్నారు వంటి పూర్తి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. ఇతర దేశాల్లో..దక్షిణ కొరియాఈ దేశంలో జననాల రేటు ఘోరంగా తగ్గిపోతోంది. అక్కడి ప్రభుత్వాలు ఈ విషయమై రకరకాలుగా సన్నాహాలు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే పార్క్‌లు, పబ్లిక్ మ్యూజియంలలో ప్రజలు వివాహాలు చేసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. జస్ట్ జంటలుగా మారితేనే రూ.30,270 చెల్లిస్తోంది. అంతేగాదు వివాహం గురించి మాటలు జరిగితేనే ఏకంగా రూ. 60540 పారితోషకం అందిస్తోందట. ఇక పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ. 1210810ల పారితోషకాన్ని గిఫ్ట్‌గా పొందొచ్చు. జపాన్జపాన్ ప్రభుత్వం వివాహం చేసుకునే మహిళలకు ఏకంగా రూ. 3 లక్షలు పైనే చెల్లించేలా ఓ ప్రత్యేక స్కీమ్‌ని ప్రవేశపెట్టింది. అయితే ఇది అంతగా వర్కౌట్ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆకర్షించేలా.. వివాహానికి సంబంధించిన పథకాలను ప్రవేశ పెట్టే యోచనలో పడింది.చైనాచైనా ఒకప్పుడు ఒకే బిడ్డ అనే పాలసీతో ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర జనాభా కొరతతో పోరాడుతోంది. చైనా అంతట జననాల రేటు దారుణంగా పడిపోయింది. దీంతో పిల్లలను కనండి అంటూ ఉద్యోగులకు ఎన్నో వెసులుబాటులు, సౌకర్యాలు కల్పిస్తోంది. మూడో బిడ్డను కనేవారికి ఏకంగా రూ. 3లక్షలుగా పైగా విలువైన సబ్సిడీలను కూడా అందిస్తోంది.(చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?) -
ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు
చండీగఢ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకున్న దరిమిలా ఆ ప్రభావం పంజాబ్‌పై పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయడం, అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది. పంజాబ్ నీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా, సమాచార, పౌరసంబంధాలు, మైనింగ్, భూమి ప్రకటనల శాఖ మంత్రి చేతన్ సింగ్ జోరామజ్రా, పర్యాటక మంత్రి అన్మోల్ గగన్ మాన్‌తో పాటు మరో మంత్రి బాల్కర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించి, వెంటనే గవర్నర్‌కు పంపింది. అనంతరం పంజాబ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ప్రకటించింది. కొత్తగా బరీందర్ కుమార్ గోయల్, తరణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, మహీందర్ భగత్, హర్దీప్ సింగ్ ముండియాలను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు ప్రకటించింది.ఈ నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే తొలిసారి. 30 నెలల భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఇది నాల్గవసారి మంత్రివర్గ విస్తరణ. 117 మంది ఎమ్మెల్యేలున్న పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ సహా 15 మంది మంత్రులు కేబినెట్లో ఉన్నారు. మంత్రి మండలిలో మొత్తం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశముంది. ఇది కూడా చదవండి: Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు.. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
స్లీపర్ వందేభారత్ ప్రత్యేకతలివే..
త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ రైలు గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్ రైలు పూర్తిగా భారత్‌లోనే తయారు కావడం విశేషం. ఇప్పటి వరకు వందేభారత్ రైలులో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు స్లీపర్ వందే భారత్ మరిన్ని సౌకర్యాలతో మనముందుకు రానుంది. ఈ రైలుకు సంబంధించిన కార్యకలాపాలను ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024, ఆగస్టు 15న ఈ రైలు ట్రయల్ రన్ జరగనుంది.తాజాగా స్లీపర్ వందే భారత్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్‌చేస్తున్నాయి. భారీ గాజు అద్దాల కిటికీలు రైలుకు ప్రీమియమ్ లుక్‌ని ఇస్తున్నాయి. బోగీలోని పైసీటు కాస్త కిందకే ఉంది. దాన్ని ఎక్కడానికి అమర్చిన మెట్లలో గ్యాప్ తక్కువగా ఉంది. అంతేకాకుండా మెట్లపై కుషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోగీలో ఒకవైపు మూడు సీట్లు ఉన్నాయి.సీటు రంగు లేత గోధుమ రంగులో ఉంది. ఫ్యాన్సీగా కనిపించే లైట్లను అమర్చారు. ఇది కోచ్‌కు మరింత అందాన్నిచ్చింది. రాబోయే ఐదేళ్లలో 500 వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను పట్టాలపై పరుగులు తీయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
సిక్కింలో వర్ష బీభత్సం.. చిక్కుకుపోయిన పర్యాటకులు
సిక్కింలో వర్ష బీభత్సం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు మించిన వర్షం కురిసింది. దీంతో తీస్తాలో వరదలు సంభవించాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో ఒడ్డున ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు చేరింది.వాతావరణం అనుకూలించిన అనంతరం పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మరమ్మతులకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టవచ్చని సమాచారం. ఉత్తర సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం నమోదయ్యింది. ఈ విపత్తు బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. గురువారం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు.సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై సమాచారం సేకరించి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. #WATCH | One person dead, five missing and houses damaged due to heavy rain in Mangan, Sikkim (Video source: SSP Mangan) pic.twitter.com/lo7iD8tAFH— ANI (@ANI) June 13, 2024 -
'స్లీపింగ్ పార్టనర్' సమాధానం చెప్పదు.. నిర్మలా సీతారామన్
దేశంలో ఇప్పటి వరకు నాలుగు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇంకా మూడు దశల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలతో పాటు స్టాక్ మార్కెట్ బ్రోకర్లపై విధించే పన్నులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇటీవల జరిగిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్‌ను స్టాక్ మార్కెట్ లావాదేవీలతో పాటు ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే పన్నుల గురించి స్టాక్ బ్రోకర్ అడిగారు. తాను డబ్బును పెట్టుబడి పెట్టడంతోపాటు నష్టాలను కూడా భరిస్తున్నానని, అయితే ప్రభుత్వం దాదాపుగా తన “స్లీపింగ్ పార్టనర్” లాగా ఉందని అన్నారు.ప్రభుత్వం మాత్రమే జీఎస్టీ, ఐజీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ నుంచి ప్రభుత్వం బాగానే ఆదాయాన్ని గడిస్తోందని అన్నారు. దీనికి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. స్లీపింగ్ పార్టనర్ ఇక్కడ కూర్చుని సమాధానం చెప్పలేదని చమత్కరించారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)తో కలిసి పనిచేయాలని బిఎస్ఇకి మంత్రి విజ్ఞప్తి చేశారు.The Government of India is my sleeping partner. 😩FM Nirmala Sitharaman Stumped By This Question At BSE by stock market investor. pic.twitter.com/tr7yD9yQdg— Pankaj Parekh (@DhanValue) May 16, 2024 -
ఓట్ల లెక్కింపు ఎప్పుడు? ఫలితాలు ఎన్నడు?
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులతో సతమతమవుతున్న పాకిస్తాన్లో గురువారం సాధారణ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 336 సభ్యుల జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 169 సీట్లు అవసరం. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఓటింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 150 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. అవి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్. పాకిస్తాన్లో ఎన్నికల జరిగిన రోజు అర్థరాత్రికల్లా ఫలితాలు వెలువడతాయి. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పాక్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. వాటి మొత్తం బరువు 2100 టన్నులు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పోలింగ్ అధికారి రిటర్నింగ్ అధికారికి ఆ సమాచారం అందిస్తారు. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. -
‘బిల్కిస్’ దోషులకు... శిక్ష తగ్గింపు చెల్లదు
న్యూఢిల్లీ/దాహోద్: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆమెపై అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో 11 మంది దోషులకు శిక్షా కాలం తగ్గిస్తూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. వారు రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ మేరకు 251 పేజీల తీర్పు వెలువరించింది. ఓ మహిళపై ఇంతటి క్రూర నేరాలకు పాల్పడ్డ కేసుల్లో శిక్ష తగ్గింపునకు అసలు ఆస్కారమెలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి, మత విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని స్పష్టం చేసింది. ‘‘శిక్ష తగ్గింపు (రెమిషన్) గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయం. ఈ విషయంలో దోషులతో ప్రభుత్వం పూర్తిగా కుమ్మక్కైంది. వారి విడుదల కోసం అన్నివిధాలా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది’’ అంటూ కడిగి పారేసింది. ‘‘సుప్రీంకోర్టులో రెమిషన్ పిటిషన్ సందర్భంగా దోషులు ఈ కేసులో వాస్తవాలను దాచారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానాన్నే ఏమార్చారు. తద్వారా రెమిషన్‌పై పరిశీలనకు ఆదేశాలు పొందారు’’ అంటూ ఆక్షేపించింది. ఆ తీర్పు కూడా చెల్లుబాటు కాబోదని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును బాధితురాలితో పాటు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. బానో స్వస్థలంలో ఆమె బంధుమిత్రులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జైలుకు వెళ్లిన అనంతరం రెమిషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం దోషులకు ఉంది. గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు గుజరాత్లో 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం మత ఘర్షణలు చెలరేగడం తెలిసిందే. ఆ సందర్భంగా మిగతా బిల్కిన్ బానో ఉదంతం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి అయిన 21 ఏళ్ల బిల్కిస్‌పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేసింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ 2008లో తీర్పు వెలువరించింది. దీన్ని బాంబే హైకోర్టు కూడా సమరి్థంచింది. 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాక తమను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు 2022 మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించాలన్న కోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని సిఫార్సు ఆధారంగా మొత్తం 11 మందికీ రెమిషన్ మంజూరు చేయడంతో 2022 ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ తీవ్ర ఆవేదన వెలిబుచి్చంది. రాజకీయ పారీ్టలతో పాటు అన్న విర్గాలూ వారి విడుదలను తీవ్రంగా తప్పుబట్టాయి. గుజరాత్ ప్రభుత్వ చర్యపై దేశమంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి విడుదలను సుప్రీంకోర్టులో బిల్కిస్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 11 రోజుల వాదనల అనంతరం 2023 అక్టోబర్ 12న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రెమిషన్‌ను కొట్టేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ జరిగి దోషులకు శిక్ష పడింది మహారాష్ట్రలో గనుక వారికి రెమిషన్ ప్రసాదించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్ష తగ్గించిందంటూ తప్పుబట్టింది. రెమిషన్ నిర్ణయాన్ని కొట్టేసేందుకు ఈ ఒక్క ప్రాతిపదికే చాలని పేర్కొంది. ‘‘2022లో సుప్రీంకోర్టుకు వెళ్లిన నిందితులు కేసులో వాస్తవాలను దాచి ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించి పునఃసమీక్షకు తీర్పును పొందారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా వారితో కుమ్మకైంది’’ అంటూ ఆక్షేపించింది. ‘‘రెమిషన్ కోసం దోషుల్లో ఒకరు 2019లోనే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా మహారాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందిగా సూచించింది. 2020లోనూ మరో పిటిషన్ పెట్టుకున్నా కొట్టేసింది. దాంతో దోషి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. రెమిషన్ ఇవ్వొద్దంటూ సీబీఐతో పాటు సీబీఐ ప్రత్యేక జడ్జి కూడా సిఫార్సు చేశారు. ఈ వాస్తవాన్ని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టారు’’ అంటూ మండిపడింది. రెమిషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ బానో నేరుగా సుప్రీంకోర్టులో పిల్ వేయడం ఆరి్టకల్ 32 ప్రకారం సబబేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘శిక్ష విధించాల్సింది ప్రతీకార దృష్టితో కాదు. నేరం పునరావృతం కాకుండా చూసేందుకు. దాంతోపాటు దోషుల్లో మార్పు తెచ్చేందుకు’’ అన్న గ్రీకు తత్వవేత్త ప్లేటో సూక్తిని జస్టిస్ నాగరత్న ప్రస్తావించారు. శిక్ష తగ్గింపు నిర్ణయానికి కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. దోషుల హక్కులతో పాటు బాధితుల హక్కులనూ పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. బాక్సు తీర్పుపై స్పందనలు... ‘‘బానో అవిశ్రాంత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్యాయంపై, బీజేపీ సర్కారు అహంకారంపై ఆమె సాధించిన విజయమిది. ఎన్నికల లబ్ధి కోసం నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్నదెవరో, న్యాయానికి పాతరేస్తున్నదెవరో సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి తేటతెల్లమైంది’’ – కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ‘‘ఇది సాహసోపేతమైన తీర్పు. ఇందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు’’ – తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘బానోకు కేంద్రం తక్షణం క్షమాపణలు చెప్పాలి’’ – మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘‘మహిళలపై జరిగే అన్యాయాలను జాతి సహించబోదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది’’ – బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత -
గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే..
ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులో మంటలు చెలరేగి, మూడు బోగీలు దగ్ధమయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలియజేశారు. కాగా గడచిన పదేళ్లలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం! 2012: మే 22న ఆంధ్రప్రదేశ్‌లో హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నాయి. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతోపాటు, ఒక బోగీలో మంటలు చెలరేగడంతో దాదాపు 25 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2014: మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లోని ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2016: నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో, 150 మంది ప్రయాణికులు మృతి చెందారు. 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2017: ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. 2017: ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2022: జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ ప్రాంతంలో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. 2023: జూన్ 2న ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 291 మంది మృతి చెందారు. 1,1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. -
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్: రెండో పెళ్లి కుదరదంతే! షరతులు వర్తిస్తాయి
Assam అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక ఆదేశాలు చేసింది. వారి వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింల ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత చట్టం ద్వారా పలు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉన్న పురుషులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సర్క్యులర్‌లో పేర్కొంది, ఈ మేరకు అసోం సర్కార్ అక్టోబర్ 20న ఆఫీసు మెమోలో ఈ సూచనలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడం విశేషం. (19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి) ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భర్త పెన్షన్ కోసం ఇద్దరు భార్యలు గొడవపడే సందర్భాలని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. (2014లోనే కాలం చెల్లిన ఫోన్లను వదిలేశారు: ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు) కాగా ఈ ఏడాది ప్రారంభంలో, అసోం బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలనుకుంటున్నామనే అభిప్రాయాన్ని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్‌లో జరిగే తదుపరి అసెంబ్లీ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నామని, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే జనవరి సెషన్లో ప్రవేశపెడతామని శర్మ హింటిచ్చారు. అలాగే ప్రతిపాదిత చట్టంపై ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని కోరారు. దీంతోపాటు బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకున్న అర్హత విషయంలో అసోం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా, దీనికి కమిటీ నివేదిక ఆమోదం లభించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముస్లిం మంత్రికి వ్యతిరేకంగా హిమాంత శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. -
ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? అమలవుతున్న 7 పథకాలు ఏవి?
మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ తనను తాను మధ్యప్రదేశ్ మహిళల సోదరునిగా అభివర్ణించుకుంటారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారధ్యంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వడం, వితంతువులకు పింఛన్ ఇవ్వడం వంటి అనేక పథకాలను శివరాజ్ ప్రభుత్వం అమలు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళల కోసం ఏఏ పథకాలు అమలు చేస్తున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లాడ్లీ బెహన్ యోజన శివరాజ్ ప్రభుత్వం ‘లాడ్లీ బెహన్’ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ఈ పథకం కింద అక్కాచెల్లెళ్లకు రూ.1,000 ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నెలకు రూ. 1,250కి పెంచారు. 2. నారీ సమ్మాన్ కోష్ శివరాజ్ ప్రభుత్వం రూ. 100 కోట్లతో నారీ సమ్మాన్ కోష్‌ను ఏర్పాటు చేసింది. ఈ పథకంలో చిన్న వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని పీఎం స్వనిధి యోజన, ముఖ్యమంత్రి వీధి వ్యాపారుల పథకాల కింద అందజేస్తారు. 3. లాడ్లీ లక్ష్మీ యోజన ఈ పథకాన్ని మధ్యప్రదేశ్‌లో ఆడపిల్లలు పుడితే ప్రోత్సాహం, లింగ నిష్పత్తిలో మెరుగుదల, విద్యా స్థాయి, బాలికల ఆరోగ్య స్థితిపై ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందేందుకు ప్రారంభించారు. ఈ పథకం 2007 నుండి అమలులో ఉంది. లాడ్లీ ఇ-సంవాద్ యాప్ ద్వారా, ప్రజలు నేరుగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలుసుకోవచ్చు. 4. ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి కన్యా వివాహ-నిఖా పథకం అమలవుతోంది. దీని కింద పేదలకు రూ.51వేలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు. 5. ఉజ్వల పథకం మధ్యప్రదేశ్‌లో శివరాజ్ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్‌ను రూ. 450కి అందిస్తోంది. లాడ్లీ బెహనా లబ్ధిదారులతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు, ప్రత్యేక వెనుకబడిన తెగల (బైగా, భరియా, సహరియా) మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. 6. స్కూటీ పథకం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల కోసం స్కూటీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 12వ తరగతి టాపర్లు స్కూటీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేస్తుంది. 7. మహిళా జర్నలిస్టులకు.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్తో పాటు చిన్న వార్తాపత్రికలకు ప్రకటనల హామీని కూడా ప్రకటించారు. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి పనులపై అధ్యయనం చేయడానికి ప్రతి సంవత్సరం ఐదుగురు మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్ అందజేస్తారు. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్!
త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఇండియా పేరును పూర్తిగా తొలగిస్తూ, దేశానికి ‘భారత్’ పేరు స్ధిరపరిచే ప్రస్తావన రానున్నదని అంటున్నారు. opposition named their alliance I.N.D.I.A government changes India's name to Bharat Opposition : pic.twitter.com/cTaigawSaF — coincasm | Meme Creator (@coincasmin) September 5, 2023 ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున రాష్ట్రపతి భవనం అధికారులు జీ-20 సమావేశాలకు దేశంలోని నేతలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉండే చోటున ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. #Bharat The names are like BIM, ABIMS,BIT,NBT pic.twitter.com/C4ioOR0sTk — Ashish (2nd edition) (@brb_memes17) September 5, 2023 దీనిని చూస్తుంటే దేశానికి ‘భారత్’ పేరును ఖాయం చేయనున్నారని వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో #Bharat ట్రెండ్ నడుస్తోంది. దీనిలో నెటిజన్లు వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. Opposition names their alliance I.N.D.I.A Government proposes to change India's name to Bharat Opposition : pic.twitter.com/YsT9OCUrLo — SwatKat💃 (@swatic12) September 5, 2023 -
చైనాను వీడని ప్రకృతి ప్రకోపం.. వరద బీభత్సం నుంచి బయటపడగానే..
ఇటీవలి కాలంలో చైనాను తరచూ ప్రకృతి విపత్తులు చుట్టుముడుతున్నాయి. ఈమధ్యనే వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దేశంలోని పలు నగరాలు నీట మునిగాయి. ఇప్పుడు వరదల కారణంగా ఆహార సంక్షోభం కూడా అంతకంతకూ పెరుగుతోంది. పొలాల్లోకి వరద నీరు చేరింది. పంటలన్నీ నాశనమయ్యాయి. కొత్త పంటలు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. గత కొన్ని నెలలుగా చైనా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యింది. తుఫాను కారణంగా సంభవించిన వరదలకు లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. 30 మంది మరణించారు. ఈ మరణాలు బీజింగ్, దాని పక్కనే ఉన్న హెబీ ప్రావిన్స్‌లో సంభవించాయి. ఆహార సంక్షోభం దిశగా.. హీలాంగ్జియాంగ్, జిలిన్, లియోనింగ్.. ఇవి చైనాకు ఈశాన్య ప్రాంతంలోని మూడు ప్రావిన్సులు. వీటిని చైనా ధాన్యాగారం అని పిలుస్తారు. ఈ మూడు ప్రావిన్సుల్లోనూ సాగు భూమి చాలా సారవంతమైనది. దేశంలోని ఆహార ధాన్యాలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. సోయాబీన్స్, మొక్కజొన్న, వరి మొదలైనవి ఈ మూడు ప్రాంతాలలో ఎక్కువగా సాగవుతాయి. అయితే వర్షాల కారణంగా ఈ మూడు ప్రావిన్స్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశంలో ఆహార సంక్షోభం సంభవించవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. ధ్వంసమైన పంటపొలాలు హీలాంగ్జియాంగ్లో వరదల కారణంగా వరి పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. కూరగాయల ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. హీలాంగ్జియాంగ్ రాజధాని హర్బిన్లో భారీ వర్షాలకు 90 వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. హర్బిన్‌కు ఆనుకుని ఉన్న షాంగ్జీ నగరంలో 42,575 హెక్టార్లలో పంటలు పూర్తిగా నీట మునిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వర్షాలు, వరదల కారణంగా దేశంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గోధుమల దిగుబడి కూడా తగ్గింది. వరి పొలాలు నాశనమయ్యాయి. గత ఏడాది తీవ్రమైన ఎండలకు పంటలు నాశనం కాగా ఈ ఏడాది వరదలు విధ్వంసం సృష్టించాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’ -
సీడీపీ నిధులొచ్చాయ్..! ఒక్కో ఎమ్మెల్యేకు రూ.??
ఆదిలాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) మంజూరయ్యాయి. జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల చొప్పున రూ.5కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి అందించే రూ.3కోట్లలో ప్రతీ మూడు నెలలకోసారి రూ.75లక్షల చొప్పున విడుదల చేస్తోంది. ఆ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాక మరోమూడు నెలలకు నిధులు విడుదల చేసేది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రూ.75లక్షలు ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేసింది. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగతా మూడు విడతల నిధులు రూ.2.5కోట్లను ముందస్తుగానే విడుదల చేసింది. దీంతో అత్యవసర పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. కాగా, ఈ నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంఽధించిన ప్రతిపాదనల తయారీలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. జిల్లాకు రూ.5 కోట్లు.. ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాలు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాగా, శాసనమండలి సభ్యులు టీ జీవన్‌రెడ్డి, దండె విఠల్ ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఏ జిల్లానైనా వారు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో జీవన్‌రెడ్డి నిజా మాబాద్ను ఎంపిక చేసుకోగా, దండె విఠల్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంపిక చేసుకున్నారు. వారి కోటా నిధులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు కేటాయిస్తోంది. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి నిధులు ఒకేసారి రావడంతో అత్యవసరమైన, పెండింగ్ పనులు పూర్తిచేసే వెసులుబాటు ఎమ్మెల్యేలకు కలగనుంది. ప్రతిపాదనలకే పరిమితమైన గ్రీన్‌ఫండ్ 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో రూ.2కోట్లను ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఖర్చు చేయాలని సూచించింది. మిగతా రూ.3కోట్లలో 10 శాతం అంటే రూ.30లక్షలను గ్రీన్‌ఫండ్‌కు వినియోగించాలని సూచించింది. దీంతో ఆ నిధులు నియోజకవర్గ పరిధిలో పచ్చదనం పెంపునకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులు జిల్లాలో ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గతేడాదికి సంబంధించి ప్రతిపాదనలు అందాయే గానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రూ.30లక్షలకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అందించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రూ.17లక్షలతో ప్రతిపాదనలు అందించగా పనులు కొనసాగుతున్నట్లుగా ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రూ.11లక్షలతో కూడిన ప్రతిపాదనలు అందించారు. తాజాగా విడుదలైన నిధుల్లోనూ 10 శాతం నిధులు గ్రీన్‌ఫండ్ కింద ఖర్చు చేయాల్సి ఉండడంతో వాటిని ఏ మేరకు ఖర్చుచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
దివ్యాంగులకు దిగులులేని మరింత దివ్యమైన ‘ఆసరా’
నెక్కొండ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్‌ను అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.3,016 ఇస్తుండగా రూ. వెయ్యి పెంపుతో రూ.4,016 అందుకోనున్నారు. తాజా నిర్ణయంతో జిల్లాలోని 15,585 మందికి లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్లతోపాటు ఉపకరణాలు, వాహనాలు, ఇతర పథకాలను అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ రోగులు మొత్తం 1,27,089 మంది ప్రతి నెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారు. 13 మండలాలు.. 15,585 మంది లబ్ధిదారులు సీఎం ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా 13 మండలాల పరిధిలోని మొత్తం 15,585 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రతి నెలా రూ.47 కోట్లను ఆసరా పింఛన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజా పెంపుతో అదనంగా రూ.1.55 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. మరీ ముఖ్యంగా దివ్యాంగులు ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో పింఛన్ పెంపుతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు రాగానే పంపిణీ.. జిల్లాలోని 13 మండలాల పరిధిలో మొత్తం 15,585 మంది దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 3,016 చొప్పున పింఛన్ అందిస్తోంది. సీఎం ప్రకటనతో వీరికి అదనంగా రూ.1000 కలిపి రూ.4,016 పింఛన్ అందనుంది. ఉత్తర్వులు రాగానే పంపిణీ చేస్తాం. పోరాడి సాధించుకున్నాం.. సంఘటితంగా దివ్యాంగులు చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం పింఛన్‌ను పెంచింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని సంఘం తరఫున ఉద్యమించాం. దాని ఫలితంగా రాష్ట్రంలో రూ.4,016 అందుకోనుండడం సంతోషంగా ఉంది. జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ధ్రువపత్రాలు జారీ చేసి పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వచ్చే నెలలో అమలు చేస్తామని చెప్పడం హర్షణీయం. –కృష్ణమూర్తి, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, నెక్కొండ -
గుట్టలు గుట్టలుగా శవాలు.. ఎక్కడా ఖాళీ లేదు
ఒడిశా: గోరుచుట్టు మీద రోకలిపోటులా రైలు ప్రమాదం నుంచి తేరుకునేలోపే ఒడిశా ప్రభుత్వానికి మరో సమస్య వచ్చి పడింది. ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను సంరక్షించడంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటోంది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. మృతదేహాలను సంరక్షించడానికి తగిన సదుపాయాలు లేక ఇప్పటికే 187 మృతదేహాలను జిల్లా కేంద్రమైన బాలాసోర్ నుండి భువనేశ్వర్ కు తరలించారు. అక్కడ కూడా అదే సమస్య తలెత్తడంతో ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించింది. శవాల నుండి దుర్వాసన... ఒడిశా రైలు ప్రమాదం మొత్తం దేశాన్నే కుదిపేసింది. చాలా తక్కువ వ్యవధిలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురికావడంతో మృతుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో చనిపోయినవారిని వారి బంధువులు గుర్తించే వరకు మృతదేహాలను సంరక్షించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే సంఘటన జరిగి రెండు రోజులు కావడంతోపాటు విపరీతంగా ఉన్న ఎండలకు శవాలు పాడైపోకుండా చూడటం శవాగార నిర్వాహకులకు కష్టసాధ్యంగా మారింది. భువనేశ్వర్ కు మృతదేహాలు తరలింపు... బాలాసోర్ శవాగారంలో తగినంత చోటు లేకపోవడంతో 187 మృతదేహాలను బాలాసోర్ నుండి భువనేశ్వర్ తరలించారు. భువనేశ్వర్‌లో కూడా శవాలను ఉంచడానికి తగినంత చోటు లేకపోవడంతో 110 మృతదేహాలను మాత్రమే అక్కడి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంచి మిగిలిన వాటిని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రి హాస్పిటల్, సమ్ హాస్పిటల్, మరికొన్ని ప్రయివేటు హాస్పిటల్స్ కు తరలించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో కూడా అక్కడ 40 మృతదేహాలు ఉంచే సౌకర్యం మాత్రమే ఉంది. మిగతావాటి నిర్వహణ వారికి కష్టంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ -
సూక్ష్మ రుణ సంస్థలకు ప్రభుత్వ మద్దతు కావాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడుగు వర్గాల రుణ అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మైక్రోఫైనాన్స్ రంగానికి ప్రభుత్వం తగు తోడ్పాటు అందించాలని సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) సమాఖ్య ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. ఎంఎఫ్ఐలకు రుణ హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్‌ఐల కోసం ప్రత్యేకంగా రీఫైనాన్స్ సదుపాయం కల్పించడం, ఇండియా మైక్రోఫైనాన్స్ ఈక్విటీ ఫండ్ (ఐఎంఈఎఫ్) ద్వారా ఈక్విటీపరమైన సహాయం పెంచడం తదితర రూపాల్లో మద్దతు కల్పించాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు. (ఇదీ చదవండి: అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు) తద్వారా సమ్మిళిత వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో మైక్రోఫైనాన్స్ రంగం కూడా తన వంతు పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 2021-22 ఇండియా మైక్రోఫైనాన్స్ రివ్యూ ప్రకారం 2025-26 నాటికి సూక్ష్మ రుణాల మార్కెట్ రూ. 25 లక్షల కోట్లకు చేరవచ్చనే అంచనాలు నెలకొన్నట్లు మిశ్రా చెప్పారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 633 జిల్లాల్లో ఎంఎఫ్ఐలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన వివరించారు. -
దేశీయ దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం, త్వరలోనే అమల్లోకి
న్యూఢిల్లీ: దేశీయ కాఫ్ సిరప్‌లపై ఇటీవలి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు ఎగుమతులపై కీలక నిబంధనలు జారీ చేసింది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు మందుల (సిరప్)లపై అనుమతిని తప్పనిసరి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆందోళనలు తలెత్తిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్‌పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..! ప్రభుత్వ ల్యాబ్‌ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్షల అనంతరం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ యా ల్యాబ్స్ టెస్టింగ్ సంబంధించి దగ్గు సిరప్‌లపై తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఎగుమతుల సమయంలో ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. దేశం నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో తమ నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఆర్డీటీఎల్-చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్-కోల్‌కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్-చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్డీటీఎల్- గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ల్యాబ్‌ల్లో పరిక్షలకు అనుమతి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్‌కేర్ ఐ డ్రాప్స్‌ను రీకాల్ చేసింది. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో వరుసగా 66, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్లు కారణమని ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
నాలుగేళ్లలో ఏపీ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు
-
ఎన్టీఆర్ జిల్లాలో అదనంగా 168 ఎకరాలు కేటాయింపు
-
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం
-
వనస్థలిపురంలో రేడియో స్టేషన్ టవర్ ఎక్కి వక్తి హల్ చల్..