ఏలూరు: కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి మద్యం పాలసీని తయారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, అతను తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం వలన పేదల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.