Left Wing Parties
-
అమిత్ షాతో భేటీలో పాల్గొన్న సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత
సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రారంభమైన ఈ సదస్సుకు వామపక్ష తీవ్రవాద ప్రభావితం ఉన్న 10 రాష్ట్రాలు హాజరయ్యాయి. తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన వారు హాజరయ్యారు. సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. -
వీవీ ప్రాణాలు కాపాడాలి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు శుక్రవారం విజ్ఞప్తిచేశారు. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడే బెయిల్ ఇచ్చి ఉంటే ఆయనకు కోవిడ్ సోకేది కాదన్నారు. వెంటనే ఆయనను విడుదల చేసి డాక్టర్లు, కుటుంబసభ్యుల సంరక్షణలో హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యాన్ని అందించడం ద్వారా ప్రాణాలను కాపాడొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాడ వెంకటరెడ్డి, పశ్యపద్మ, ఎన్.బాలమల్లేష్ (సీపీఐ), డీజీ నర్సింహా రావు, బి.వెంకట్ (సీపీఎం), కె. గోవర్థన్. కె.రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), ఉపేందర్ రెడ్డి (ఎంసీపీఐ–యూ), సీహేచ్ మురహరి (ఎస్‌యూసీఐ–సీ),డి.రాజేశ్ (లిబరేషన్) పాల్గొన్నారు. ప్రజాసంఘాల ర్యాలీ విరసం నేత వరవరరావుతోపాటు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని పీడీఎస్‌యూ, పీవోడబ్లు్య, ఐఎఫ్టీయూ, ఏఐకేఎంఎస్, ప్రజా సంఘాలు శుక్రవారం విద్యానగర్ నుంచి హిందీ మహావిద్యాలయ వరకు ర్యాలీ నిర్వహించాయి. పీవోడబ్లు్య జాతీయ అధ్యక్షురాలు వి.సంధ్య మాట్లాడుతూ వరవరరావు, సాయిబాబాలకు కరోనా సోకడంతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి అచ్యుత రామారావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, సహాయ కార్యదర్శి జి. అనురాధ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్, నగర అధ్యక్షుడు రియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : వామ పక్షాలు
విజయనగరం పూల్‌బాగ్ : పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రజాస్వామ్య ఖూనీని నిరసిస్తూ అఖిలభారత వామపక్షాల పిలుపు మేరకు సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కోట జంక్షన్ నుంచి కన్యకాపపరమేశ్వరి కోవెల వరకు నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఐ నాయకులు బుగత సూరిబాబు మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో, బీజేపీ త్రిపురలో అధికారం చేపట్టిన నుంచి యథేచ్ఛగా మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపించారు. వామపక్ష కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వామపక్ష కార్యకర్తలపైనే కాకుండా ప్రజలపైన తృణమూల్ గూండాలు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో వామపక్ష నేతలు డి.అప్పలరాజు, గాడి అప్పారావు, సుధారాణి, అప్పారావు, రామారావు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ముందస్తుకు సంకేతమా?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టడానికి కేంద్రం అంగీకరించడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలను ముందుకు జరిపే విశేష అధికారం ప్రధానికే ఉన్నా, చివరి నిమిషం లెక్కలను బేరీజు వేసుకుని ఆ దిశగా అడుగేసే అవకాశాలున్నాయి. 2019 సాధారణ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడానికి ఇంకా 7–8 నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో మోదీ ఆలోచన ఏంటో ఊహించడం కష్టమని, ఏదైనా జరగొచ్చని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు ఒకరు వెల్లడించారు. మరోవైపు, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటే లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలను బీజేపీ వర్గాలు తోసిపుచ్చాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులపై చర్చ తప్ప, ముందస్తు ఎన్నికలపై ఆలోచించడం లేదని కేంద్ర మంత్రి ఒకరు తెలిపారు. జాగ్రత్తగా పరిశీలిస్తున్న కాంగ్రెస్, లెఫ్ట్.. ఇటీవల ప్రధాని మోదీ వరుసగా యూపీలో పర్యటించిన సంగతిని విపక్షాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు బీజేపీ అన్ని అవకాశాలను సిద్ధం చేసుకుంటోందా? అని కాంగ్రెస్, లెఫ్ట్‌లో అంతర్మథనం మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రచారం, ప్రచారకర్తకు ఎదురయ్యే సమస్యలు ముందుగానే తెలుస్తాయని లెఫ్ట్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీకి తగిన రాజకీయ అస్త్రాలు ఉన్నట్లయితే ఇతర పార్టీలు స్పందించేందుకూ అవకాశం ఇచ్చేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ‘సంపర్క్ కే సమర్థన్’ పేరిట ప్రముఖులతో సమావేశమై ఎన్డీయే ప్రభుత్వ విజయాలను వివరిస్తున్నారు. సుమారు 100 మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి అవకాశం కోల్పోవచ్చని అమిత్ షా పర్యటనల్లో తెలిసినట్లు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆరెస్సెస్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. -
మెక్సికోపై వామపక్ష కేతనం
ఎటు చూసినా నిరాశా నిస్పృహలు అలుముకున్నప్పుడు, నిజ వేతనాలు పడిపోయి పౌరులు నానా కష్టాల్లో కూరుకుపోయినప్పుడు, అవినీతి రివాజుగా మారినప్పుడు, అరాచకం తాండవించిన ప్పుడు ఎక్కడైనా ఏమవుతుందో మెక్సికోలో కూడా అదే అయింది. రెండు దశాబ్దాలుగా రెండు పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి అలవాటుపడిన మెక్సికో పౌరులు ఈసారి అధ్యక్ష ఎన్ని కల్లో కొత్తగా ఆవిర్భవించిన మూడో పార్టీకి పట్టంగట్టి యధాతథ స్థితిని బద్దలుకొట్టారు. ఆదివారం దేశాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వామపక్ష మొరెనా పార్టీ అభ్యర్థి ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్(ఆమ్లో) 53 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఆబ్రడార్ ఎన్నికయ్యారని ప్రకటించిన వెంటనే పొరుగు దేశమైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన్ను అభినందించినా వారిద్దరి మధ్య సంబంధాలు ఉప్పు–నిప్పులాగే ఉంటాయని, ఆయన్ను పదవీచ్యుతుణ్ణి చేయడానికి ట్రంప్ మార్గాలు వెదకటం ఖాయమని వారిద్దరి సంగతీ తెలిసిన రాజకీయ విశ్లేషకులు అంచనా. ఆబ్ర డార్కు ‘మెక్సికో ట్రంప్’ అన్న పేరుంది. అలాగని ఇద్దరి సిద్ధాంతాలకూ పొంతన లేదు. కానీ అమల్లో ఉన్న వ్యవస్థను తూర్పారబట్టడంలో, ప్రత్యర్థులను చీల్చిచెండాటంలో, ప్రభుత్వ విధా నాలపై ఓటర్లలో ఉన్న ఆగ్రహాన్ని పసిగట్టి దానికి తగినట్టు మాట్లాడటంలో ఇద్దరూ ఒకటే. అయితే సిద్ధాంతరీత్యా ఆబ్రడార్ వామపక్షవాది గనుక అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి త్వానికి డెమొక్రటిక్ పార్టీలో హిల్లరీతో పోటీపడిన వామపక్షవాది బెర్నీ శాండర్స్‌తో ఆయన్ను పోల్చవచ్చు. అధ్యక్ష భవనంలో ఆబ్రడార్ ప్రవేశం అమెరికాకు మింగుడుపడనిది. కానీ చిత్రంగా ట్రంప్ విధానాలే అందుకు కారణమయ్యాయి. ఒకపక్క మెక్సికో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) అమెరికా వాటాయే అత్యధికమైనా, అమెరికాకు అది మూడో పెద్ద వాణిజ్య భాగస్వామి అయినా ట్రంప్ అధికారంలోకి రావడానికి ముందు సరే... తర్వాత కూడా మెక్సికో పౌరులను తరచు కించ పరుస్తూ మాట్లాడారు. వారు అమెరికాను కొల్లగొడుతున్నట్టు ప్రచారం చేశారు. మెక్సికోతో ఉన్న సరిహద్దుల పొడవునా గోడ కడతామని, అందుకయ్యే ఖర్చంతా ఆ దేశమే భరించాలని చెప్పారు. అమెరికాకు చట్టవిరుద్ధ వలసలు మెక్సికో నుంచే అధికంగా ఉంటాయన్నది నిజమే అయినా, వారంతా పొట్టకూటి కోసమే వస్తున్నారు. చిన్నా చితకా పనులు చేసుకుని ఎదగడమే వారి ధ్యేయం. మెక్సికోలో పెట్టుబడులు పెట్టి ఏటా భారీయెత్తున లాభాలు గడిస్తున్న అమెరికా పెట్టుబడిదారుల్లా వారేమీ నిలువుదోపిడీకి దిగలేదు. మెక్సికో నుంచి మాదకద్రవ్యాలు వచ్చిపడుతుండటం అమెరి కాకు సమస్య అయితే... అమెరికా నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించే మారణాయుధాలు మెక్సికోకు ప్రాణాంతకమవుతున్నాయి. వాటి సాయంతోనే మాదకద్రవ్య ముఠాలు విచ్చలవిడిగా కిడ్నాప్‌లకూ, హత్యలకూ పాల్పడుతున్నాయి. నిరుడు ఆ దేశంలో 30,000 హత్యలు జరిగాయి. సెనేట్కూ, దిగువ సభకూ ఎన్నికలు ప్రకటించాక 50మంది అభ్యర్థులతోసహా 130మంది నేతల్ని చంపేశారు. బెదిరింపుల పర్యవసానంగా 600మంది పోటీ నుంచి తప్పుకున్నారు. ట్రంప్ అధ్య క్షుడు కాకముందు మెక్సికో పౌరుల్లో అత్యధికులకు అమెరికా అంటే వల్లమాలిన అభిమానం. కానీ ట్రంప్ నిత్య దూషణలతో అది కాస్తా ఆవిరైంది. అదే సమయంలో ట్రంప్‌కు దీటుగా, ఘాటుగా జవాబిచ్చిన ఆబ్రడార్ను మెక్సికో పౌరులు ఆదరించారు. మెక్సికో అనేక సమస్యలతో అట్టుడుకుతోంది. అక్కడ పౌరులను మాయం చేయడం నిత్య కృత్యం. ఈ ‘అదృశ్యాలకు’ అటు భద్రతా బలగాలు– ఇటు మాదకద్రవ్య ముఠాలు కారణమే. గత దశాబ్దకాలంలో 32,000మంది పౌరులు ఆచూకీ లేకుండా పోయారు. అపహరణలపై కేసులు, అరెస్టులు రివాజు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఆ కేసుల అతీగతీ ఉండదు. అప్పుడప్పుడు శవాల దిబ్బలు బయటపడుతుంటాయి. వాటిని తవ్వి డీఎన్ఏ పరీక్షలు జరిపి అదృశ్యమైన వ్యక్తులు చని పోయారని ధ్రువీకరించడం తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు. వీటికితోడు మెక్సికోతో 1994లో కుదిరిన ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(నాఫ్టా)ను తిరగదోడతానని ట్రంప్ ప్రక టించడంతో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. అనేక అమెరికా సంస్థలు ట్రంప్ విధానాల పర్యవసానంగా అయోమయంలో పడ్డాయి. చిత్రమేమంటే ఆబ్రడార్ కూడా నాఫ్టాకు తొలినుంచీ వ్యతిరేకి. అది దేశ సార్వభౌమత్వాన్ని అమెరికాకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపణ. అమల్లో ఉన్న ఒప్పందం వల్ల అమెరికాకు అన్యాయం జరిగిందని వాపోయే ట్రంప్ ఒకపక్కా... దీనివల్ల మెక్సికో ప్రజలు నష్ట పోయారని వాదించే ఆబ్రడార్ మరోపక్కా ఉంటే ఇరు దేశాల మధ్యా కొత్త వాణిజ్య ఒప్పందం సంగతలా ఉంచి, అసలు ఎలాంటి ఒప్పందమైనా సాధ్యమేనా అని చాలామంది సందేహం. ఆబ్ర డార్ విజయం ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారులను, మెక్సికో వాణిజ్యవేత్తలను కూడా భయ పెడుతోంది. అయితే పాలనకు ఆబ్రడార్ పూర్తిగా కొత్త వ్యక్తేమీ కాదు. ఆయన 1976 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మెక్సికో మేయర్‌గా పనిచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ దశలో ఉండగా, అవినీతి, నేరాలు అడ్డూ ఆపూ లేకుండా విస్తరించిన దశలో, సంక్షేమ పథకాలకు, పింఛన్లకు కోతపడిన సమయంలో ఆబ్రడార్ దేశాధ్యక్షుడు కాబోతున్నారు. 2003లో బ్రెజిల్ అధ్యక్షుడిగా వామపక్షవాది లూలా డి సెల్వా ఎన్నికైనప్పుడు, ఇంచుమించు అదే సమయంలో చిలీలో సోషలిస్టు నాయకుడు మైకేల్ బాచెలే విజయం సాధించినప్పుడు ఆ దేశాల స్థితిగతులు మెక్సికో మాదిరే ఉన్నాయి. వారిద్దరూ సమర్ధవంతంగా పాలించి ఆ దేశాలను గట్టెక్కించారు. ఆర్థిక వ్యవస్థల్ని బలో పేతం చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు. అసమానతలను ఏదో మేరకు తగ్గించగలిగారు. ఇటీవలకాలంలో వివిధ దేశాల్లో లెఫ్టిస్టులు దెబ్బతింటుండగా మెక్సికో చరిత్రలో తొలిసారి వామ పక్షం విజయం సాధించడం విశేషమనే చెప్పాలి. అయితే మెక్సికోను ఆబ్రడార్ ఎలా చక్కదిద్దగలరో వేచిచూడాలి. -
మెక్సికోకు వామపక్ష అధ్యక్షుడు
మెక్సికో సిటీ: ఆధునిక మెక్సికో చరిత్రలో తొలిసారిగా ఓ వామపక్ష నాయకుడు ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. దాదాపు గత శతాబ్ద కాలంగా మెక్సికోను పాలిస్తున్న రెండు పార్టీ లను కాదని ఆ దేశ ప్రజలు ఈసారి వామపక్ష పార్టీకి పట్టంగట్టారు. 2014లో మొరెనా పార్టీని స్థాపించిన ఆమ్లో (ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్)కు తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక కాలపు మెక్సికో ఎన్నికల్లో ఓ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇన్నేళ్లూ పాలించిన నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్), ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్ఐ)లు వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. తీవ్ర అవినీతి, మితిమీరిన హింస, మత్తుపదార్థాలు తదితర సమస్యలతో విసిగిపోయిన మెక్సికన్లు తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. విజయానంతరం ఆమ్లో ప్రసంగిస్తూ ‘ఇదో చరిత్రాత్మకమైన రోజు. ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు. వెనుజులా అనుసరిస్తున్న విధానాలనే ఆమ్లో మెక్సికోలో అమలుచేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారంటూ విమర్శకులు వ్యక్తం చేసిన భయాలను ఆయన కొట్టిపారేశారు. అవినీతిని నిర్మూలించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పగా, మత్తు పదార్థాల వ్యాపారులకు ప్రభుత్వంలోని పెద్దలు, సైన్యంతో సంబంధాలు ఉన్నందున అవినీతిని రూపుమాపడమనేది ఆమ్లో ముందున్న అతిపెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమ్లో డిసెంబరులో అధ్యక్షపదవి చేపట్టనున్నారు. పార్టీ స్థాపించాక తొలి ఎన్నికలోనే గెలుపు ఆమ్లో గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో తన సొంత పార్టీ మొరెనా (నేషనల్ రీజనరేషన్ మూవ్మెంట్)ను స్థాపించిన అనంతరం తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే గెలుపొందడం గమనార్హం. 1953లో జన్మించిన ఆమ్లోకు దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మెక్సికోలో ప్రస్తుత అధికార పార్టీ పీఆర్‌ఐలో 1976లో చేరి ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980ల చివర్లో ఆయన మరో పార్టీలో చేరి గవర్నర్ సహా పలు ఎన్నికల్లో పోటీచేశారు. 2000లో మెక్సికో సిటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, మంచి వక్తగా ఆమ్లో పేరుతెచ్చుకున్నారు. -
టీడీపీ నేతలకు ఘోర అవమానం
సాక్షి, కడప: వైఎస్సార్ కడప జిల్లా అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు ఘోర అవమానం జరిగింది. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ అమరణ దీక్షపై శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి టీడీపీ నేతలు, ఒకరిద్దరు ప్రజా సంఘాల నేతలు తప్ప మిగతా రాజకీయ, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు హాజరు కాలేదు. నాలుగేళ్లుగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని టీడీపీ ఈరోజు సమావేశం పెడితే ఎలా అంటూ వామపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి. బీజేపీతో సంసారం చేసి విడిపోయి జిల్లాకు మోసం చేసారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. -
విజయవాడలో వామపక్షాల ధర్నా
-
అమరావతి ఏపీకి కాదు.. టీడీపీ రాజధాని : పవన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వం తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిసారి రాజీపడేలా వ్యవహరించిందని తెలిపారు. విభజన హామీల విషయంలో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటుచేయలేదని గుర్తుచేశారు. సోమవారం ఏపీ వామపక్ష నేతలు మధు, రామకృష్ణతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు నిధులే కొరత ఉన్నా.. ఏపీ సర్కారు ఇష్టరాజ్యంగా నిధులను ఖర్చుపెట్టిందని, అభివృద్ధి, ప్రజారోగ్యానికి ఉద్దేశించిన నిధులను పుష్కరాల కోసం ఖర్చు చేసిందని విమర్శించారు. టీడీపీ తీరుతో రాష్ట్రానికి తీరనినష్టం వాటిల్లిందని తెలిపారు. అమరావతి ఏపీ ప్రజలకు సంబంధించిన రాజధానిలా కనిపించడం లేదు.. టీడీపికి సంబంధించిన రాజధానిలా మారిందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం జనసేన, సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయని పవన్ తెలిపారు. కలిసి ఉద్యమాలు చేస్తాం రాజధాని లేదు. పరిశ్రమలు లేవు. రైల్వే జోన్ లేదు. సీమ, ఉత్తరాంధ్రకు ప్యాకేజీ లేదు. హోదా, విభజన హామీల సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలని సీపీఎం, సీపీఐ, జనసేన కలిసి నిర్ణయించాయి. మేధావులు, ఉద్యోగస్తులు, మధ్యతరగతి వారిని కలుపుకొని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాల నుండి ఉద్యమాలు ప్రారంభిస్తాం. మోసం చేసిన బీజేపీ, వంతపాడిన టీడీపీని ఎండగడుతాం. -సీపీఎం నేత మధు బాబు కొత్త డ్రామాకు తెరతీశారు ఐదు కోట్ల ప్రజలు అన్యాయం జరిగిందని అంటున్నా మోదీ ప్రభుత్వం స్పందించలేదు. నాలుగేళ్ళు లాలూచీ పడి ఇప్పుడు ఉద్యమం చేస్తున్నట్టు బాబు డ్రామా ఆడుతున్నారు. తన లోపాలను ఎండగడితే రాష్ట్రాన్ని అవమాన పరిచినట్టు చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. అనంతపురంలో ఏప్రిల్‌లో, తర్వాత విశాఖ, ప్రకాశంలో సమావేశాలు నిర్వహిస్తాం. రాష్ట్రాల్లో ఫిరాయింపు, అవినీతి రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలు మా వైపు చూసే విధంగా పోరాటం ఉంటది. 27న అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్షలు చేస్తాం. -సీపీఐ నేత రామకృష్ణ -
‘చలో అసెంబ్లీ’పై పోలీసుల ఉక్కుపాదం
-
వామపక్ష నేతల అరెస్టును ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తున్న వామపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఛలో వంశధార కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా నేత ధర్మాన కృష్ణదాస్‌ను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని, మళ్లీ ఈ రోజు వెంటాడినట్లుగా వామపక్ష నేతలను మరోసారి అరెస్టు చేయడాన్ని వైఎస్ జగన్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో ఎంత దండుకోవాలన్నదే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానంగా మారింది తప్ప, నిర్వాసితులకు ఎంత ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం తలకెక్కడం లేదని జగన్ పేర్కొన్నారు. సీపీఎం నేత పి.మధును, సీపీఐ నేత కె.రామకృష్ణతో సహా వామపక్ష నేతలను కూడా ఈ ప్రభుత్వం అరెస్టులు చేసి బెదిరింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. వంశధారకు సంబంధించిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలూ తీసుకోవాల్సిందేనని జగన్ ఉద్ఘాటించారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. వంశధార నిర్వాసితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని గతంలోనే తాము మాట ఇచ్చామని ఈ ప్రభుత్వం ముందుకు కదలని పక్షంలో అధికారంలోకి రాగానే వారంతా సంతోషించేలా న్యాయం చేస్తామని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. -
వామపక్ష నేతల అరెస్ట్..
-
అనంతలో ఉద్రిక్తత: బస్సులు, ఏటీఎంలపై దాడులు
అనంతపురం: అనంతపురంలో వామపక్షాల బంద్ ఉద్రిక్తతకు దారితీసింది. రామచంద్రనగర్‌లో ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. 10 బస్సులు, 5 దుకాణాలను ధ్వంసం చేశారు. పలు దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేయగా ఇండియన్ బ్యాంకు పై రాళ్లదాడి జరిగింది. ఏటీఎంను కూడా ధ్వంసం చేశారు. మడకశిరలో కూడా వామపక్షాల కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. కాగా ఆందోళన చేస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, ఏఐసీటీయూ రాష్ట్ర కార్యదర్శి ఓబులేశులను పోలీసులు అరెస్టు చేశారు. -
మిర్చికి మద్దతు ధర ఇవ్వండి
ఒంగోలు టౌన్: మిర్చి క్వింటా 10వేల రూపాయలకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని నాలుగు వామపక్ష రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించాయి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. హనుమారెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులు ఈ ఏడాది పంట పండించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 70వేల రూపాయల వరకు ఖర్చు చేశారన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినా మిర్చి పంటను ఇంతవరకు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు. ఎండిపోయిన మిర్చి పంటను వెంటనే నమోదుచేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు రామారావు మాట్లాడుతూ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ధరలు తగ్గాయని అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గిన విషయాన్ని గుర్తెరగాలన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు ఆర్. మోహన్ మాట్లాడుతూ మిర్చి ధరలు రోజురోజుకు పతనం అవుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా గతంలో అనేక ఫలితాలు సాధించుకోవచ్చని చెప్పారు. మిర్చి రైతుల సమస్యలపై ఐక్య పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు ఎస్. లలితకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు పరిటాల నాగేశ్వరరావు, నాంచార్లు, కె. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇలపర్రు దళితులపై పోలీస్ జులుం
వామపక్ష నాయకులపై లాఠీచార్జి ► నేతలను ఈడ్చుకెళ్లి వాహనంలోపడేసిన పోలీసులు ► సీపీఎం, సీపీఐ కార్యదర్శులు రఘు, వనజలపై దౌర్జన్యం గుడివాడ: ఇలపర్రు దళితులపై పోలీసు జులుం ప్రదర్శించారు. ఆందోళనకారులను చితకబాదారు. దాడిలో సీపీఎం, సీపీఐ నాయకులు గాయపడ్డారు. వంద మందిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాలు.. నందివాడ మండలం ఇలపర్రులో భూస్వాముల ఆక్రమణలో ఉన్న 165 ఎకరాల భూమిని తిరిగి పేదలకు ఇవ్వాలని కోరుతూ వామపక్షాలు ఐదు నెలలుగా వివిధ దశల్లో ఉద్యమం చేస్తున్నాయి. ప్రభుత్వ స్పందించకపోవడంతో సోమవారం ఆర్డీవో కార్యాలయం ముట్టడికి వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఉదయం 10 గంటలకు స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్ నుంచి ఉద్యమకారులు ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యాలయం వద్ద బైఠాయింపు: కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వామపక్షనాయకులు, వివిధ ప్రజాసంఘాలు, జనసేన, దళిత నాయకులు ఆర్డీవో కార్యాలయ ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించారు. భూముల కోసం పోరాటం ఆగదు: భూస్వాములు ఆక్రమించుకున్న దళితుల భూములు దళితులకే చెందుతాయని జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నా ప్రభుత్వం బడాబాలుకు కొమ్ముకాస్తోందని వామపక్షాల నాయకులు ఆర్.ర«ఘు, అక్కినేని వనజ ఆరోపించారు. స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్ వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ కేవలం దళితులను అణచి వేసేందుకు ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయించిందన్నారు. అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మి ఆక్రమించుకున్న భూముల్లో ఇలపర్రు దళితులకు చెందిన 27 ఎకరాల భూమి ఉందని చెప్పారు. అంతే కాకుండా నందివాడ మండలంలో ఇలపర్రు, పోలుకొండ, అనమనపూడి, వెన్ననపూడి, కుదరవల్లి గ్రామాల్లో ఉన్న సుమారు ఐదు వేల ఎకరాలు భూస్వాముల చేతిలో ఉందని వాటిపై కూడా తాము పోరాటం చేయనున్నట్లు తెలిపారు. అరెస్టు అయిన వారిలో సీపీఎం గుడివాడ డివిజన్ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డిలతో పాటు మురాల రాజేష్, సీఐటీయూయు నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ నాయకుడు ఆర్కే, వ్యసాయ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి కొండా వీరాస్వామిలతో పాటుగూడపాటి ప్రకాష్‌బాబు, దగాని సంగీతరావు ఉన్నారు. దళితులపై లాఠీచార్జి దారుణం : భూమి కోసం ఉద్యమిస్తున్న దళితులపై లాఠీచార్జి దారుణమని సీపీఎం పశ్చిమ కృష్ణా కమిటీ కార్యదర్శి డీవీ కృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వంద మందిని అరెస్టు చేయటంపై నిరసన వ్యక్తం చేశారు. దళితులకే చెందిన భూములని ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వులను ఏళ్ల తరబడి అమలు చేయకుండా భూస్వాములు ఆ భూమిని అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావుతో పాటు సీపీఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. --సీపీఎం ఆందోళనకారులపై లాఠీచార్జి: బైఠాయించిన ఆందోళనకారులపై డీఎస్పీ అంకినీడు ప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు చితక బాదారు. మహిళలు అత్యధిక సంఖ్యలో ఉండగా వారిని కూడా మగ పోలీసులతో ఊడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. మహిళల జాకెట్లు ,చీరలు చిరిగి పోయాయి. పోలీసు లాఠీచార్జిలో సీపీఎం తూర్పు కృష్ణా కార్యదర్శి ఆర్.రఘు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వరరావులకు లాఠీదెబ్బలు తగిలాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి గుడివాడ పట్టణంలోని వన్‌టౌన్, పెదపారుపూడి, పామర్రు పోలీసు స్టేషన్లకు తరలించారు. వనజను ఈడ్చుకెళ్లి.. దళితులకు మద్దతు తెలిపిన సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజపై పిడిగుద్దులు కురిపిం చారు. బూటుకాళ్లతో తన్నుతూ తీసుకెళ్లారు. విచక్షణా రహితంగా లాఠీచార్జి చేస్తూ ఈడ్చుకెళ్లారు. -
రేపు వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు అల్లాడిపోతున్నారని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ప్రభాకరరెడ్డి, రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నల్లకుబేరులెవరూ ఇబ్బంది పడటం లేదన్నారు. ఇప్పటికే నోట్ల మార్పిడిలో దేశవ్యాప్తంగా 70 మంది సామాన్యులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య భవన్లో ఈనెల 28న నిర్వహించనున్న భారత్ బంద్ విజయంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. 86 శాతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న నిర్వహించనున్న «భారత్ బంద్‌కు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, ఎస్‌యూసీఐ(సీ) జిల్లా నాయకులు నాగన్న, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు చక్రవర్తి, సీపీఎం నాయకులు గౌస్‌దేశాయ్, ఇ.పుల్లారెడ్డి, సీపీఐ నాయకులు మనోహర్ మాణిక్యం పాల్గొన్నారు. -
ఆ రోజు ఉద్యోగులకు సెలవులు బంద్
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీలు బంద్ నిర్వహించే సోమవారం రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఏ ఉద్యోగికీ సెలవు మంజూరు చేసేదిలేదని, తగిన కారణం లేకుండా ఎవరైనా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వాసుదేవ్ చెప్పారు. అత్యవసర, చాలా ముఖ్యమైన పని ఉంటే తప్ప ఉద్యోగులు సెలవు తీసుకోరాదని, సోమ, మంగళవారాల్లో కచ్చితంగా విధులకు హాజరుకావాలని ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. బంద్ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు పనిచేస్తాయని చెప్పారు. బంద్‌లకు తాము వ్యతిరేకమని, పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సోమవారం నాడు నిరసన ప్రదర్శనలో పాల్గొంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బంద్ రోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, వారి ఆస్తులకు ఎలాంటి నష్టం కలగకుండా భద్రత కల్పించాలని చెప్పారు. -
న్యాయవిచారణకు వామపక్షాల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్ అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, తక్షణమే దానిపై న్యాయవిచారణకు ఆదేశించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మావోయిస్టుల సమస్యను ప్రభుత్వం శాం తిభద్రతల సమస్యగా మాత్రమే పరిగణించడం సరికాదని తమ్మినేని వీరభద్రం(సీపీఎం), చాడ వెంకటరెడ్డి(సీపీఐ), జానకిరాములు(ఆర్ఎస్పీ), మురహరి(ఎస్‌యూసీఐ-సీ), కె.గోవర్దన్(న్యూడెమోక్రసీ-చంద్రన్న), వేములపల్లి వెంకటరామయ్య(న్యూడెమోక్రసీ-రాయల), భూతం వీరన్న(సీపీఐ-ఎంఎల్), ఎన్.మూర్తి(లిబరేషన్), బం డా సురేందర్‌రెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్)లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విధం గా చూసినంత కాలం సమస్య పరిష్కారం కాదని సూచించారు. -
సమగ్ర దర్యాప్తు జరిపించాలి
వామపక్ష పార్టీల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో మాల్కాన్‌గిరీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పుల పేరిట 24 మందికి పైగా మావోయిస్టులను దారుణంగా కాల్చిచంపారని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(చంద్రన్న) ఆరోపించాయి. ప్రజలు, ప్రజాతంత్ర, ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఖండించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయా పార్టీలు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. 500 మందికి పైగా సాయుధ పోలీసులు జరిపిన హంతక దాడిగా న్యూడెమెక్రసీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న అభివర్ణించారు. పక్కా సమాచారం ఆధారంగా ఎన్కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్న దానివెనుకున్న పరమార్థమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కోవర్టు ఆధారంగా పోలీసులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారా? అనే అనుమానాన్ని కూడా చంద్రన్న వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులపై 302 సెక్షన్ కింద హత్యానేరం మోపి విచారించాలన్నారు. సామూహిక హత్యాకాండకు పాల్పడమని ఏ చట్టంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మావోయిస్టుల్ని పట్టుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కాల్చిచంపడం దారుణమని సీపీఎం నాయకుడు పి.మధు మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ (ఎంల్) న్యూడెమోక్రసీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రం, రాష్ర్ట కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. -
స్వార్థపరులే పార్టీని వీడారు
నర్మెట : కొందరూ వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని మోసం చేసి వెళ్లిపోయారని కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మ¯ŒS గొల్లపల్లి కుమారస్వామి అన్నారు. ఎంతో నమ్మకంతో వారికి పదవులను కట్టబెట్టిన మోసంచేవారన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్య జూంలాల్‌నాయక్, చేర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జుల సుధాకర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి చేరడంపై గురువారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిదని అన్నారు. పార్టీ పదవులతో అన్నివిధాలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు పార్టీని వీడటం సరైంది కాదన్నారు. కాంట్రాక్టుల కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. వారు పార్టీని వీడటం వల్ల అధినాయకత్వానికి కాని, పార్టీకి కాని ఏలాంటి నష్టం లేదన్నారు. వారి స్థానాలను త్వరలోనే క్రీయశీలకంగా పనిచేసే కార్యకర్తలకు అప్పగిస్తామని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కొంపెల్లి రమేష్, ప్రజ్ఞపురం కనుకయ్య, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు -
పచ్చచొక్కా వేసుకుని పని చేస్తున్నాడు
– కలెక్టర్‌పై రాజకీయ, ప్రజాసంఘాల నేతల ఆగ్రహం – నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా కర్నూలు సిటీ: జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు అండగా నిలవాల్సిన కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పని చేస్తున్నారని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయకూడదని నిషేధం విధించడంపై మంగళవారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలో వామ పక్ష పార్టీలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రసూల్, సీపీఎం నగర నాయకులు రాజశేఖర్‌లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గోవిందు, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసింహా, సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు దండు శేషు యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు మద్దయ్య, తోట క్రిష్ణారెడ్డి ప్రసంగించారు. విజయమోహన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు వినతులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉందని, దీన్ని కలెక్టర్ అణిచి వేయాలనే ధోరణిలో వ్యవహారిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలను వదిలేసి కలెక్టరేట్‌ను అధికారి పార్టీ కార్యాలయంగా మార్చుతున్నారని ఆరోపించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేయకుడదని నిషేధించడం అప్రజాస్వామ్యమని, ఆ బోర్డును తొలగించాలని కోరుతూ బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని తెలిపారు. -
'అంతా వారికే ఊడిగం చేస్తున్నారు'
హైదరాబాద్: నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదాలనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్నారని లెఫ్ట్ పార్టీ నేతలు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు విద్యుత్ ధరలను పెంచాడని.. అదే మాదిరిగా ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచిందని ఆరోపించారు. గత ఉద్యమ స్ఫూర్తిగా ఇప్పుడు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రత్యేక హోదా కోసం రేపు ప్రజాబంద్
కాకినాడ సిటీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం, రాష్ట్రంలోని పాలక పార్టీలు బీజేపి, టీడీపిలు అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ మంగళవారం ప్రజాబంద్‌కు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక సుందరయ్యభవన్‌లో ఆదివారం సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జి సంయుక్తంగా ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 2వ తేదీన జరిగే రాష్ట్ర బంద్‌కు జిల్లాలో ఉన్న అన్ని వాణిజ్య, వ్యాపార వర్గాలు, విద్యాసంస్థలు, ఆర్టీసీ, కార్మిక, కర్షకులు, ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలోనూ, తరువాత ఇచ్చిన హామీలను పక్కనపెట్టి పాలకపార్టీలు రాష్ట్ర ప్రజలను దగా చేశారని విమర్శించారు. గతంలో నేరుగా కేబినేట్ తీర్మానంతో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, ఎక్కడా చట్టం చేయలేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కుంటిసాకులు చెబుతున్నారన్నారు. ఆవిషయం విభజన చట్టంలో పొందుపరచ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ తెలుగుదేశం, బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఉద్యమానికి కలిసిరావాలని, అన్ని పక్షాలను కలుపుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళి కేంద్రంపై తీవ్ర వత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీపీఎం కాకినాడ నగర కార్యదర్శి పలివెల వీరబాబు, సీపీఐ కాకినాడ నగర, రూరల్ కార్యదర్శులు తోకల ప్రసాద్, నక్కా కిషోర్ పాల్గొన్నారు. -
ఆగస్టు 1న విద్యాసంస్థల బంద్
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆగస్టు 1న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జేఏసీ ఆధ్వర్యాన బంద్ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. కేజీనుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చుదిద్దుతామని ప్రకటనలు చేస్తూనే చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలలు, హాస్టళ్లను మూసివేస్తోందన్నారు. ఏడు ప్రధాన డిమాండ్లతో చేపడుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రామకృష్ణ, రవిచంద్ర (పీడీఎస్‌యూ), ఎన్.కోటి (ఎస్ఎఫ్ఐ), షేక్ బాజీసైదా (పీడీఎస్ఓ), సీహెచ్.రఘువీరా, షెహెన్షా (ఏఐఎస్ఎఫ్) పాల్గొన్నారు. -
సంస్థాగత నిర్మాణంపై లెఫ్ట్ పార్టీల దృష్టి
సాక్షి, హైదరాబాద్: సంస్థాగతంగా పార్టీలను బలోపేతం చేయడంపై సీపీఐ, సీపీఎం నాయకులు దృష్టి కేంద్రీకరించారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ప్రధానంగా సైద్ధాంతిక అవగాహన, రాజకీయ శిక్షణ తరగతులతో కేడర్‌లో ఉత్సాహం నింపాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. రాబోయే 3, 4 నెలల పాటు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సీపీఐ నిర్ణయించగా, సీపీఎం కూడా అదే బాటలో నడుస్తోంది. కాగా పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసే చర్యల్లో భాగంగా వచ్చే సెప్టెంబర్ వరకు సీపీఐ నాయకులు వివిధ కార్యక్రమాలను చేపట్టనున్నారు. జూన్ నుంచి ఆగస్టు వరకు గ్రామ, మండల, జిల్లాస్థాయి పార్టీ నిర్మాణ సమావేశాలను నిర్వహించాలని షెడ్యూల్‌ను రూపొందించారు. జిల్లాస్థాయిలో కార్యక్రమాలు ముగిశాక సెప్టెంబర్‌లో పార్టీనిర్మాణ రాష్ట్ర మహాసభను వరంగల్‌లో నిర్వహించాలని సీపీఐ నాయకత్వం నిర్ణయించింది. కాగా మండల కౌన్సిల్ సభ్యులు మొదలుకుని రాష్ర్ట కౌన్సిల్ సభ్యుల వరకు వివిధ స్థాయిల్లో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. 22 నుంచి సీపీఎం శిక్షణ తరగతులు ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్, మిర్యాలగూడ, ఖమ్మంలలో సీపీఎం శిక్షణ తరగతులను నిర్వహించనుంది. డివిజన్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, పూర్తికాల కార్యకర్తలకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత మండల స్థాయిలో తరగతులను నిర్వహిస్తారు. అంబేడ్కరిజం, మార్క్సిజం, ప్రజా సమస్యలపై అవగాహన, జాతీయ, రాష్ట్రస్థాయిలో రాజకీయ పరిస్థితులపై తరగతులను నిర్వహించి కేడర్‌ను సైద్ధాంతికంగా బలోపేతం చేయాలని సీపీఎం భావిస్తోంది.