ఖమ్మం మయూరిసెంటర్ : రాష్ట్రంలో గత 16 రోజులుగా పంచాయతీ కార్మికులు, 11 రోజులు గా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లో 10 వామపక్ష పార్టీ నాయకులు చేస్తున్న నిరహరదీక్షను భగ్నం చేసి నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ 10 వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించ తలపెట్టిన జిల్లా బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వేమూరి భాస్కర్ కోరారు. ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భ క్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రాచలంను బంద్‌లో మినహయిస్తున్నామని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ఉంది గనుక ముస్లిం సోదరు లు బంద్‌కు సహకరించాలని కోరారు.
కాంగ్రెస్ మద్దతు
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన జిల్లాబంద్‌కు జిల్లా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం ఓ ప్రకటనలో తెలిపారు.
నేటి బంద్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు
ఖమ్మం : మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు వారి కనీస సమస్యల పరిష్కారాన్ని కోరుతూ కార్మికులు చేస్తున్న దీక్షను భగ్నం చేయడం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. వామపక్షాల బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సంపె ట వెంకటేశ్వర్లు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. మొదటి నుంచి పోరాటాలు చేసిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారుతాయని నమ్మకంతో ప్రజలు గద్దెనెక్కించారని, కానీ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ ప్రస్తుత ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. ఏళ్ల తరబడి దుర్గంధం మధ్య జీవనం సాగిస్తున్న కార్మికుల కనీస సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడం లేదని విమర్శించారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్‌చేశారు.
నేటి బంద్‌ను జయపద్రం చేయండి
Published Fri, Jul 17 2015 3:16 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement
Advertisement