25న ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాల దర్నా | Left parties dharna at Indira park on feb 25 | Sakshi
Sakshi News home page

25న ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాల దర్నా

Published Sat, Feb 20 2016 7:55 PM | Last Updated on Thu, Jul 11 2019 9:08 PM

Left parties dharna at Indira park on feb 25

హైదరాబాద్‌: ఈ నెల 25న ఇందిరాపార్క్‌ వద్ద వామపక్షాల ధర్నా జరుగుతుందని వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. జేఎన్యూ విద్యార్థి కన్హయ్య కుమార్ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం వారిద్దరూ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్‌ ఘటన నుంచి బయటపడటానికే బీజేపీ నాటకం ఆడుతోందని ఆరోపించారు. పార్లమెంట్‌లో సమాధానం చెప్పలేక బయట నాటకాలు ఆడుతోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక దేశంలో నియంత్రృత్వ ధోరణి పెరిగిపోయిందని తమ్మినేని, చాడ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement