
యాదగిరిగుట్ట: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో మోదీ సర్కారు విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధం జరగనుందని ముందే గ్రహించిన అమెరికా, యూరప్ దేశాలు తమ పౌరులకు ప్రమాదం వాటిల్లకుండా వెనక్కి రావాలని 10 రోజుల ముందే సూచించాయని, కానీ, మోదీ మాత్రం అలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. మోదీ మనసంతా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో ఉందే తప్పా, ఉక్రెయిన్‌లోని 18 వేల మంది భారతీయ విద్యార్థుల బాధ, భవిష్యత్తుపై లేదని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment