శాంతి పునరుద్దరణకు భారత్‌ మద్దతు.. జెలెన్‌స్కీకి మోదీ హామీ | PM meets Ukraine president Zelensky in Us reaffirms peace support | Sakshi
Sakshi News home page

శాంతి పునరుద్దరణకు భారత్‌ మద్దతు.. జెలెన్‌స్కీకి మోదీ హామీ

Published Tue, Sep 24 2024 6:59 AM | Last Updated on Tue, Sep 24 2024 12:58 PM

PM meets Ukraine president Zelensky in Us reaffirms peace support

నూయార్క్‌: మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 79వ సర్వసభ్య సమావేశంలో భాగంగా ‘ప్రపంచ భవితపై శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని ప్రసంగించారు. అయితే దానికంటే ముందు ప్రధాని మోదీ.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. 

ఈ భేటీలో పలు అంశాలపై ద్వైప్వాక్షిక చర్చలు జరిపినట్లు స్వయంగా మోదీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో నెలకొన్ని యుద్ధ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని పునరుద్దరించడానికి భారత్‌ మద్దతుగా ఉంటుందని మోదీ తెలిపారు.

‘‘న్యూయార్క్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యాను. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో నా ఉక్రెయిన్ పర్యటన ఫలితాలను అమలు చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఉక్రెయిన్‌ నెలకొన్న యుద్ధ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు, అక్కడ శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత్‌ మద్దతు ఉంటుందని తెలిపాను’అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

 


 

ఢిల్లీకి బయలుదేరిన మోదీ..
మూడు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని ప్రధాని మోదీఢిల్లీ బయలుదేరారు. ఈ విషయాన్న భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్   ఎక్స్‌ వేదికగా తెలిపారు. ‘‘అమెరికాలో విజయవంతమైన మూడు రోజులు పర్యటన ముగించుకున్న అనంతరం  ప్రధాని మోదీ న్యూఢిల్లీకి బయలుదేరారు’ అని  పేర్కొన్నారు.

 

చదవండి: యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement