మోదీకి జెలెన్‌స్కీ ప్రతిపాదన
ఉక్రెయిన్‌కు మద్దతు కూడగట్టడమే లక్ష్యం
న్యూఢిల్లీ: రష్యాతో యుద్ధం ముగించడమే లక్ష్యంగా భారత్‌లో ప్రపంచదేశాల సదస్సును నిర్వహించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమియర్ జెలెన్‌స్కీ కోరారు. ఈనెల 23న మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించినపుడు జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు (నవంబరు 5) ముందే రెండో ప్రపంచ దేశాధినేతల సదస్సు జరగాలని జెలెన్‌స్కీ కోరుకుంటున్నారు. గ్లోబల్ సౌత్ (దక్షిణార్దగోళ) దేశాల మద్దతును కూడగట్టాలని జూన్‌లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన తొలి సదస్సులో ఉక్రెయిన్ యతి్నంచింది. అంతర్జాతీయంగా గుర్తించిన సరిహద్దుల మేరకు ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వానికి తమ మద్దతు ఉంటుందని మోదీ 23న సంకేతాలిచ్చారు.
అయితే ఉక్రెయిన్ కోరినట్లుగా సదస్సు నిర్వహించడానికి భారత్ ఇంకా సమ్మతించలేదు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ విమరణ కోసం శాంతి ప్రక్రియలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ సంకేతాలిచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
గ్లోబల్ సౌత్ దేశాల్లో.. ముఖ్యంగా భారత్‌లో రెండో అంతర్జాతీయ సదస్సు జరగాలని ఉక్రెయిన్ కోరుకుంటోందని జెలెన్‌స్కీ అధికార ప్రతినిధి తెలిపారు. శాంతి సాధన కోసం జెలెన్‌స్కీ 10 అంశాల ఫార్ములాను రూపొందించారు. ఉక్రెయిన్ భూభాగంలోని ఆక్రమిత ప్రాంతాలన్నింటి నుంచీ రష్యా వైదొలగాలని, ముఖాముఖి చర్చలకు ముందు ప్రపంచదేశాలు రష్యాను దూరంగా పెట్టాలని జెలెన్‌స్కీ కోరుతున్నారు.
శాంతిచర్చల వేదికపై రష్యా ఉన్నపుడే.. ఏ ప్రయత్నమైనా ముందుకు సాగుతుందని గ్లోబల్ సౌత్ దేశాలు అంటున్నాయి. స్విట్జర్లాండ్‌లో జూన్ 15–16 తేదీల్లో జరిగిన చర్చలకు 100 పైగా దేశాలు హాజరైనప్పటికీ.. ఉక్రెయిన్ ప్రపంచ మద్దతును కూడగట్టడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోయింది. చైనా గైర్హాజరు కాగా, భారత్, ఇండోనేíÙయా, దక్షిణాఫ్రికాలు తుది ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment