తటస్థం కాదు, భారత్‌ ఎప్పుడూ శాంతి వైపే: జెలెన్‌స్కీతో మోదీ | PM Modi To Ukraine's Zelenskyy: India Was Never Neutral In This War, On Side Of Peace | Sakshi
Sakshi News home page

తటస్థం కాదు, భారత్‌ ఎప్పుడూ శాంతి వైపే: రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంపై మోదీ

Published Fri, Aug 23 2024 7:34 PM | Last Updated on Fri, Aug 23 2024 8:34 PM

India was never neutral in this war, on side of peace: PM to Ukraine's Zelenskyy

కీవ్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్‌ సమర్ధిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో కలిసి మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీతో మోదీ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలని జెలెన్స్కీని మోదీ కోరారు. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి స్నేహితుడిగా వ్యవహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.

స్నేహితుడిగా సాయం చేసేందుకు  సిద్దం: మోదీ
‘చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే యుద్దానికి పరిష్కారానికి మార్గం కనుగొనవచ్చు. మనం సమయాన్ని వృధా చేయకుండా ఆ దిశలో పయనించాలి. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఇరుపక్షాలు కలిసి కూర్చోని చర్చించాలి. శాంతిని నెలకొల్పేదిశగా జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనైనా క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో ఒక స్నేహితుడిగా నేను మీకు ఏం చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నాననే భరోసా ఇవ్వాలనుకుంటున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.

జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసి
అంతకముందు రాజధాని కీవ్‌లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్న మోదీకి స్వాగతం పలికిన అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు. అక్కడికి వెళ్లే సమయంలో జెలెన్‌స్కీ భుజంపై చేతులు వేసిన మోదీ ఆత్మియంగా పలకరిస్తూ ముందుకు సాగారు.  ఉక్రెయిన్‌ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు..

గాంధీ విగ్రహానికి నివాళి
కీవ్‌లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి మోదీ నివాళి అర్పించారు. బాపూజీ ఆశయాలు విశ్వవ్యాప్తమన్న ఆయన.. కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement