World Summit
-
Volodymyr Zelenskyy: భారత్‌లో సదస్సు నిర్వహించండి
న్యూఢిల్లీ: రష్యాతో యుద్ధం ముగించడమే లక్ష్యంగా భారత్‌లో ప్రపంచదేశాల సదస్సును నిర్వహించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమియర్ జెలెన్స్కీ కోరారు. ఈనెల 23న మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించినపుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను ఆయన ముందుంచారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు (నవంబరు 5) ముందే రెండో ప్రపంచ దేశాధినేతల సదస్సు జరగాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారు. గ్లోబల్ సౌత్ (దక్షిణార్దగోళ) దేశాల మద్దతును కూడగట్టాలని జూన్‌లో స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన తొలి సదస్సులో ఉక్రెయిన్ యతి్నంచింది. అంతర్జాతీయంగా గుర్తించిన సరిహద్దుల మేరకు ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వానికి తమ మద్దతు ఉంటుందని మోదీ 23న సంకేతాలిచ్చారు. అయితే ఉక్రెయిన్ కోరినట్లుగా సదస్సు నిర్వహించడానికి భారత్ ఇంకా సమ్మతించలేదు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ విమరణ కోసం శాంతి ప్రక్రియలో నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ సంకేతాలిచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో.. ముఖ్యంగా భారత్‌లో రెండో అంతర్జాతీయ సదస్సు జరగాలని ఉక్రెయిన్ కోరుకుంటోందని జెలెన్స్కీ అధికార ప్రతినిధి తెలిపారు. శాంతి సాధన కోసం జెలెన్స్కీ 10 అంశాల ఫార్ములాను రూపొందించారు. ఉక్రెయిన్ భూభాగంలోని ఆక్రమిత ప్రాంతాలన్నింటి నుంచీ రష్యా వైదొలగాలని, ముఖాముఖి చర్చలకు ముందు ప్రపంచదేశాలు రష్యాను దూరంగా పెట్టాలని జెలెన్స్కీ కోరుతున్నారు. శాంతిచర్చల వేదికపై రష్యా ఉన్నపుడే.. ఏ ప్రయత్నమైనా ముందుకు సాగుతుందని గ్లోబల్ సౌత్ దేశాలు అంటున్నాయి. స్విట్జర్లాండ్‌లో జూన్ 15–16 తేదీల్లో జరిగిన చర్చలకు 100 పైగా దేశాలు హాజరైనప్పటికీ.. ఉక్రెయిన్ ప్రపంచ మద్దతును కూడగట్టడంలో పూర్తిగా సఫలీకృతం కాలేకపోయింది. చైనా గైర్హాజరు కాగా, భారత్, ఇండోనేíÙయా, దక్షిణాఫ్రికాలు తుది ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించాయి. -
ప్రపంచ ఔషధశాల భారత్.. 100 దేశాలకు కరోనా టీకా
న్యూఢిల్లీ: ఈ ఏడాది దాదాపు 100 దేశాలకు 6.5 కోట్లకుపైగా కరోనా టీకా డోసులను ఎగుమతి చేశామని ప్రధాని మోదీ చెప్పారు. భారత ఆరోగ్యసంరక్షణ రంగం ప్రపంచ దేశాల నమ్మకాన్ని చూరగొన్నదని తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఔషధశాలగా (ఫార్మసీ) పరిగణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని టీకా డోసులను విదేశాలకు ఎగుమతి చేయబోతున్నామని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి తొలి ‘ప్రపంచ ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు’ను గురువారం ప్రారంభించారు. మనదేశంలో వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు సానుకూల వాతావరణం కల్పిస్తున్నామని, ప్రోత్సాహం అందిస్తున్నామని మోదీ గుర్తుచేశారు. దీనివల్ల కొత్త ఔషధాల అభివృద్ధి, వినూత్న వైద్య పరికరాల తయారీలో భారత్ అగ్రగామిగా ఎదగడం ఖాయమని చెప్పారు. వైద్య రంగాన్ని గొప్ప స్థాయికి చేర్చగల సామర్థ్యం ఉన్న సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారని తెలియజేశారు. ఇండియాను స్వయం సమృద్ధ దేశంగా(ఆత్మనిర్భర్) మార్చడానికి దేశంలోని 130 కోట్ల మంది కంకణం కట్టుకున్నారని ప్రధాని పేర్కొన్నారు. టీకాలు, ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలను దేశీయంగానే తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్నప్పుడు ఇదే స్ఫూర్తిని చాటిచెప్పామని ఉద్ఘాటించారు. 150కిపైగా దేశాలకు ప్రాణరక్షక ఔషధాలు, వైద్య పరికరాలు అందజేశామని వివరించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఫార్మా రంగం ఎంతగానో దోహదపడుతోందని ప్రశంసించారు. డిజిటల్ విప్లవంతో కొత్త సవాళ్లు ఆస్ట్రేలియా డైలాగ్‌లో ప్రధాని మోదీ క్రిప్టోకరెన్సీ వాడకం ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఇది దుష్ట శక్తుల చేతుల్లో పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని∙మోదీ చెప్పారు. డిజిటిట్ విప్లవంతో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు భావ సారుప్యం కలిగిన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇనిస్టిట్యూషన్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులతో గురువారం నిర్వహించిన సదస్సులో(సిడ్నీ డైలాగ్) మోదీ ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఆధిపత్యం చెలాయించడానికి టెక్నాలజీ ఉపయోగించుకొనే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఫ్యూచర్ టెక్నాలజీలో పరిశోధనలు, అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య దేశాలు ఉమ్మడిగా పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసే యత్నాలను అడ్డుకొనేందుకు కృషి చేయాలని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక, సామాజిక రంగాలను డిజిటల్ యుగం పునర్నిర్వచిస్తోందని తెలిపారు. డిజిటల్ విప్లవంతో దేశాల సార్వభౌమత్వం, పరిపాలన, విలువలు, హక్కులు, భద్రత విషయంలో కొత్త ప్రశ్నలు ఉదయిస్తున్నాయని వెల్లడించారు. క్రిప్టోకరెన్సీ విషయంలో అప్రమత్తత అవసరమని ఉద్ఘాటించారు. ఇది మన యువతను నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. భారత్‌లో డేటాను ప్రజల సాధికారత కోసం ఒక వనరుగా ఉపయోగిస్తున్నామని గుర్తుచేశారు. డిజిటల్ విప్లవంతో అభివృద్ధికి నూతన అవకాశాలే కాదు, కొత్త సవాళ్లు సైతం ఎదురవుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్‌తో భారత్‌లో 6 లక్షల గ్రామాలను అనుసంధానించామని తెలిపారు. -
మిసైల్స్..బాంబులపై పెట్టుబడులా..?
సాక్షి, అబుదాబి : సాంకేతికతను దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. క్షిపణులు, బాంబులపై ప్రపంచ దేశాలు భారీగా వెచ్చించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను విధ్వంసం కోసం కాకుండా అభివృద్ధి కోసంఉపయోగించుకోవాలని హితవు పలికారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని..వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు. వరల్డ్ గవర్న్మెంట్ సమ్మిట్‌లో ప్రధాని కీలకోపన్యాసం చేస్తూ గడిచిన రెండున్నర దశాబ్ధాల్లో భారత్ సహా ప్రపంచం సాధించిన పురోగతిని వివరించారు. శిశుమరణాల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని చెప్పుకొచ్చారు. అంతకుముందు ప్రధాని గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి హాజరైన బిజినెస్ లీడర్లతో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను, గత నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా వారికి వివరించారు. -
‘హైదరాబాద్ కాప్’కు అరుదైన గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగం రూపొందించి, వినియోగిస్తున్న యాప్ ‘హైదరాబాద్ కాప్’కు అరుదైన గుర్తింపు లభించిందని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్ సమ్మిట్ అవార్డ్– 2017’ను గెల్చుకుందని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా ఉన్న ప్రతి దేశం ఈ అవార్డుకు ఒక్కో నామినేషన్ సమర్పించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 180 దేశాలు ఎనిమిది కేటగిరీల్లో 400 ఎంట్రీలు పంపాయని, వాటిలో భారత్ నుంచి హైదరాబాద్ కాప్ నామినేట్ అయిందని కొత్వాల్ తెలిపారు. గత వారం జర్మనీలోని బెర్లిన్‌లో సమావేశమైన జ్యూరీ మొత్తం 40 యాప్స్‌ను అవార్డులకు ఎంపిక చేసిందన్నారు. హైదరాబాద్ కాప్ ‘గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఎంగేజ్మెంట్’కేటగిరీలో అవార్డు దక్కించుకుందని మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజంపై ప్రభావం చూపిన, ప్రజలకు ఉపయుక్తంగా మారిన యాప్స్‌ను ఈ వార్డుకు ఎంపిక చేస్తారని కమిషనర్ తెలిపారు. ప్రత్యేక కేటగిరీలో 24 దేశాల నుంచి వచ్చిన 39 ప్రాజెక్టులను అధిగమించి ‘హైదరాబాద్ కాప్’అవార్డు దక్కించుకుందని కొత్వాల్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 20–22 మధ్య వియన్నాలో జరగనున్న ‘వాస్ గ్లోబల్ కాంగ్రెస్’లో సిటీ పోలీసులు ఈ అవార్డును అందుకుంటారని చెప్పారు. -
మీడియాకు దూరంగా మెట్రోపొలిస్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన మెట్రోపొలిస్ సదస్సుపై అన్ని వర్గాల్లో విస్తృత అవగాహన కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 50 దేశాల ప్రతినిధులు హాజరయిన ఈ అంతర్జాతీయ సదస్సుకు ఈనెల 6 నుంచి 9 వరకు మీడియా ప్రతినిధులను హైటెక్స్ భవనం వరకే పరిమితం చేయడం, సదస్సు జరుగుతున్న హెచ్ఐసీసీవేదిక దరిదాపుల్లోకి చేరనీయకపోవడంతో వారు పలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సదస్సుకు రావడంతో ఈ ఆంక్షలు తీవ్రమయ్యాయి. నాలుగురోజుల పాటు జరిగిన సదస్సులను హైటెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలపై వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే పలు సదస్సులకు సంబంధించిన ప్రసారాలు స్పష్టంగా కనిపించక, వక్తల ప్రసంగాలు సరిగా వినిపించకపోవడంతో విదేశీప్రతినిధుల అభిప్రాయాలను, అనుభవాలను సైతం క్షుణ్ణంగా తెలుసుకోవడం కష్టసాధ్యమైందని పలువురు మీడియా ప్రతినిధులు ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరవాత తొలిసారిగా జరిగిన మెట్రోపొలిస్ సదస్సు గురించి నగరంలోని యువత, మహిళలు, మేధావులు, సాంకేతిక నిపుణులు, ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల ప్రతినిధులకు సరైన అవగాహన కల్పించడంలోనూ అధికారులు విఫలమయ్యారు. దీంతో పలువురు సదస్సులో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేయించుకోలేకపోయారు. విదేశాలకు చెందిన సుమారు 60 నగరాల మేయర్లు ఈ సదస్సులో పాల్గొంటారని తొలుత నిర్వాహకులు హడావుడిగా ప్రకటించినప్పటికీ అంతమంది మేయర్లు ఈ సదస్సులో పాల్గొనలేదని తెలిసింది. ఆయా నగరాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులే సదస్సులో పాల్గొన్నట్లు సమాచారం. ఇక కీలక అంశాలపై ప్రముఖులు తెలిపిన విలువైన సలహాలు, సూచనలను బహిర్గతం చేయడంలోనూ నిర్వాహకులు విఫలమయ్యారు. మొక్కుబడిగానే సదస్సుల వారీగా పత్రికాప్రకటనలు విడుదల చేసి అందులో అరకొర విషయాలను పేర్కొని మమ అనిపించడం గమనార్హం. -
మార్గ నిర్దేశకులు యువతే
సాక్షి, హైదరాబాద్: మహానగరాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఉద్దేశించిన మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును మంగళవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు. తొలిరోజు ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్ స్థలాలు, రోడ్లపై మహిళలు, పిల్లలు, వృద్ధులకు రక్షణ, విపత్తుల సమయంలో చేపట్టాల్సిన చర్యలు, శానిటేషన్-వేస్ట్ మేనేజ్మెంట్, మురికివాడల్లో ఆరోగ్య సేవలు, ఇళ్లకు నంబర్లు వంటి అంశాలపై విడివిడిగా చర్చ ప్రారంభమైంది. భవిష్యత్తులో యువత ఆలోచనలే నగరాల రూపురేఖలను మారుస్తాయని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. యువత సృజనాత్మకతతో అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. సోమవారం దేశంలోని వివిధ నగరాల నుంచి వచ్చిన 782 మంది ప్రతినిధులతోపాటు విదేశాలకు చెందిన 140 మంది ప్రతినిధులు హజరయ్యారు. 10వ తేదీ వరకు సాగనున్న ఈ సదస్సులో మంగళవారం 400 మందికి పైగా విదేశీ ప్రతినిధులతో సహా 2 వేలమందికి పైగా హాజరు కాగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం కార్యక్రమంలో గవర్నర్, సీఎం కేసీఆర్‌తోపాటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మేయర్ మాజిద్, మెట్రోపొలిస్ అధ్యక్షుడు జీన్‌పాల్ పాల్గొననున్నారు. గళమెత్తిన బాలలు.. తొలిరోజు ‘వాయిస్ ఆఫ్ చిల్డ్రన్’ అంశంపై ప్రసంగించిన బాలలు నగరాల్లోని మురికివాడల దుర్భర పరిస్థితులపై ధారాళంగా ప్రసంగించారు. తమకు ఇళ్లు, తాగునీరు, మరుగుదొడ్లువంటి సదుపాయాలు లేకపోవడాన్ని ప్రశ్నించారు. పారిశుధ్య నిర్వహణ, ఆటస్థలాలు లేకపోవడం, రోడ్లపై ప్రాణాంతకంగా వేలాడే విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్ల పరిసరాల్లో రక్షణ చర్యలు లేకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. మురికివాడల్లోకి అంబులెన్స్‌లు త్వరితంగా వెళ్లేందుకు వీల్లేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు రూపొందించేటప్పుడు బాలల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. బాలల అభిప్రాయాలతో ఆయా ప్రభుత్వాలు తగిన పాలసీలు రూపొం దించే అవకాశముందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ సెషన్లో పాల్గొన్న బాలల్లో హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్, ముంబైకి చెందిన కాజల్ ఖురానా, ఢిల్లీకి చెందిన మాలతీయాదవ్ ఉన్నారు. ఇళ్ల ధరలు అందుబాటులో ఉండాలి.. దేశంలో అందరికీ ఇళ్లు సమకూరాలంటే అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు తమ సలహాలిచ్చారు. ముఖ్యంగా ఇళ్ల ధరలు ప్రజలు భరించగలిగే ధరల్లో ఉండాలని. అందుకు ప్రైవేట్ రంగం కూడా తమ వంతు సహకారం ఇవ్వాలని సూచించారు. హౌసింగ్ పాలసీలు-అమలుకు మధ్య వ్యత్యాసం ఉంటోందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించనున్న ఇళ్ల ప్రస్తావన కూడా వచ్చింది. తొలిరోజు పలు అంశాలపై జరిగిన చర్చల వివరాలను ఆయారంగాలకు చెందిన విదేశీ ప్రముఖులు మీడియాకు వివరాలు తెలియజేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సీనియర్ డెరైక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వారిని మీడియాకు పరిచయం చేశారు. హైదరాబాద్‌కు ఉజ్వల భవిష్యత్తు హైదరాబాద్ హాకథాన్ పేరిట ఒక పోటీని నిర్వహిస్తున్నాం. నగరంలోని సమస్యల పరిష్కారానికి 20 బృందాలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించాం. ఈ పోటీలో చివరకు 5 బృందాలను ఎంపికచేస్తాం. నగరాలనేవి ఫైబర్ ఆప్టిక్ట్లకే పరిమితం కావొద్దు. ప్రజలు, ప్రభుత్వం, పౌరసమాజం కలిసి ప్రణాళికలు రూపొందించుకోవాలి. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉంది. - ఆల్ఫెన్స్ గోవెల (నెక్స్ ్టస్మార్డ్ సిటీస్ వ్యవస్థాపకులు, మెక్సికో) యువత నడిపిస్తుంది భవిష్యత్ నగరాలు కాంట్రీబ్యూటరీ నగరాలుగా ఉండాలి. యువజనులు తప్పకుండా మార్పు తీసుకురాగలరు. యువత ఆలోచనా ధోరణులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. నగరాల్లో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యలకు యువత పరిష్కారాలను కనుక్కుంటుంది. - అలెన్ ర్యాంక్ (సిటీ ప్లానర్, ఫ్రాన్స్) వారి ఆలోచనలను పట్టుకుంటే అద్భుతాలే నేటి యువత అద్భుతమైన ఆలోచనలను ఆవిష్కరిస్తోంది. ఈ ఆలోచనలను ఒడిసిపట్టగలిగితే ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. హైదరాబాద్‌లో మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. డిజిటల్ ప్రాజెక్ట్స్ ముఖ్య భూమిక నిర్వహిస్తాయి. - ఫిలిప్ వీస్ట్ (డిజిటల్ ప్రాజెక్ట్స్, బ్రిటన్) మంచి ప్రతిపాదనలు వచ్చాయి హైదరాబాద్ అర్బన్ హాకథాన్ పేరిట నగరంలోని సమస్యలకు 18-35 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న యువత ద్వారా పరిష్కారాలను ఆహ్వానించాం. మైక్రోసాఫ్ట్, ఐఐఐటీ-హైదరాబాద్ 20 బృందాలను ఎంపిక చేసింది. వీటి నుంచి 5 బృందాలను ఎన్నుకుని ఆయా సమస్యలపై ప్రాజెక్టులను చేపట్టాలి. పలు అంశాలపై మంచి ప్రతిపాదలు వచ్చాయి. - సుబ్రహ్మణ్య శర్మ (ఐఎస్బీ సీనియర్ డెరైక్టర్) మెట్రోపొలిస్‌లో నేడు చర్చించనున్న ముఖ్యాంశాలు గ్లోబల్ వాటర్ లీడర్షిప్ న్యూ సిటీస్/ విజనరీ ఆర్ కానండ్రమ్ సస్టెయినబుల్ హైదరాబాద్ రిపోర్ట్ సిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్- వేస్ట్ మేనేజ్మెంట్ ఫైనాన్సింగ్ అర్బన్ ఇండియా బిజినెస్ ఆఫ్ సిటీస్ ఎకానమీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్ సర్కిల్స్ ఆఫ్ సస్టెయినబిలిటీ ఈ-అర్బన్ గవర్నెన్స్ స్మార్ట్‌సిటీస్ అజెండా- థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ సాయంత్రం 5 గంటలకు హైటెక్‌సిటీ వద్ద స్మార్ట్‌సిటీ అంశంపై -
‘మెట్రోపొలిస్’కు సర్వం సిద్ధం
రేపట్నుంచే ప్రపంచ సదస్సు 50 దేశాల నుంచి ప్రతినిధుల హాజరు సాక్షి, హైదరాబాద్: ‘సిటీస్ ఫర్ ఆల్’ నినాదంతో దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ‘11వ మెట్రోపొలిస్ ప్రపంచ సదస్సు’కు సర్వం సిద్ధమైంది. దాదాపు 50 దేశాల నుంచి రెండు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్న ఈ సదస్సులో మెట్రోనగరాల సమస్యలు, అనుభవాలు, ఆవిష్కరణలు వంటి వాటిపై ప్రతినిధులు చర్చిస్తారు. నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల్ని సూచిస్తారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. వేదిక పరిసరాలతోపాటు ప్రతినిధులు పర్యటించే మార్గాలు.. పర్యాటక ప్రదేశాల్లో రహదారులకు మెరుగులు దిద్దారు. సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. వేదిక పరిసరాల్లో ఉచిత వైఫై సేవల్ని అందుబాటులోకి తెస్తున్నారు. సదస్సును పురస్కరించుకొని ప్రత్యేకంగా ‘కాన్ఫరెన్స్ మొబైల్ యాప్’ను ఆవిష్కరించారు. దీని ద్వారా ప్రతినిధులు స్మార్ట్ ఫోన్ నుంచే ఏరోజుకారోజు జరిగే సమావేశాలు, ప్రసంగించే వక్తలు, ప్రతినిధుల వివరాలు తదితరమైనవి తెలుసుకోవచ్చు. ఒకరికొకరు ఎస్సెమ్మెస్‌లు పంపించుకోవచ్చు. సదస్సుకు జొహన్నెస్‌బర్గ్, బార్సిలోనా, బెర్లిన్, టెహ్రాన్ తదితర నగరాల మేయర్లతోపాటు పలువురు అడ్మినిస్ట్రేటర్లు, ఆయా అంశాల్లో నిపుణులైన వారు తదితరులు హాజరవుతున్నారు. సిటీస్ ఫర్ ఆల్.. ‘సిటీస్ ఫర్ ఆల్’ నినాదంతో జరుగుతున్న ఈ సదస్సులో స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రోపొలిస్-గవర్నెన్స్, సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్,అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్ తదితర అంశాలపై చర్చలు జరుగనున్నాయి. వీటిల్లో సిటీ మేనేజ్మెంట్-సర్వీసెస్‌కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను చర్చించనున్నారు. వాటిల్లో సోలార్ ఎనర్జీ, రహదారులు, నీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం తదితరాలున్నాయి. వీటితోపాటు మహిళలు, యువతకు సంబంధించిన అంశాలపైనా ప్రత్యేక చర్చలు జరుగనున్నాయి. చర్చల్లో వెలువడిన అభిప్రాయాలను, పరిష్కారమార్గాలను పరిశీలించి ఉపయోగకర అంశాలను క్రోడీకరించి వాటి ఆధారంగా ఆయా నగరాలకు అనువైన పాలసీ డాక్యుమెంట్స్ రూపొందించనున్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ డెలివరీ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ల నిర్వహణకు 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. అంశాల ఎంపికలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి), సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ) ముఖ్య భూమిక వహించాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), యూఎన్ హాబిటేట్, ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఒరాకిల్, సిటీస్ అలయెన్స్, ఏఎంబీ (బార్సిలోనా) తదితర సంస్థలు తమవంతు సహకారం అందించాయి. ఆతిథ్య నగరమైన హైదరాబాద్‌లోని అనుభవం ప్రతినిధులకు మరపురాని జ్ఞాపకాన్ని మిగల్చనుందని మెట్రోపొలిస్ సదస్సు డెరైక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. పాల్గొనే ప్రముఖులు.. సదస్సులో ప్రసంగించనున్న వారిలో ప్రముఖ పర్యావరణ వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాజేంద్ర పచౌరి, జీన్-పాల్ హ్యూకన్(మెట్రోపొలిస్ ప్రెసిడెంట్), అలైన్ లీ సాక్స్ (మెట్రోపొలిస్ సెక్రటరీ జనరల్), పాల్ జేమ్స్(డెరైక్టర్, యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్-సిటీస్ ప్రోగ్రాం), ప్రొఫెసర్ ఓమ్ మాథుర్ (అర్బన్ ఎకనామిస్ట్), ప్రొఫెసర్ అమితాబ్ కుందు (చైర్పర్సన్,‘రివ్యూ ఆఫ్ పోస్ట్ సచార్ ప్రోగ్రామ్స్, ఇండియా), ప్రొఫెసర్ క్రిస్‌జాన్సన్ (సీఈవో, అర్బన్ టాస్క్‌ఫోర్స్, ఆస్ట్రేలియా), రామన్ టోర్రా, జనరల్ మేనేజర్, బార్సిలోనా మెట్రోపాలిటన్ ఏరియా(ఏఎంబీ), కీర్తిషా (ఆర్కిటెక్ట్, కేఎస్ఏ డిజైన్ ప్లానింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), ఇందూ ప్రకాశ్‌సింగ్ (కన్వీనర్ నేషనల్ ఫోరం ఫర్ హౌసింగ్ రైట్స్), మ్జోలిసి త్షబలాలా (ప్రాజెక్ట్ మేనేజర్, హ్యూమన్ సెటిల్మెంట్స్ డెవలప్మెంట్స్, ఈ-తెక్విని మున్సిపాలిటీ), రాజేంద్ర జోషి (డెరైక్టర్, సాథ్ లైవ్లీహుడ్ సర్వీసెస్), సరాహ్‌ఉదీనా (డిప్యూటీ టూ ది అర్బన్ ప్లానింగ్ మేనేజర్ డెరైక్టర్, బార్సిలోనా సిటీ కౌన్సిల్), జాన్ మౌంట్ (కౌన్సిలర్, సిడ్నీ), ఫ్రాన్సినా విలా (ప్రెసిడెంట్, మెట్రోపొలిస్ ఉమెన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్), డా.సూక్ జిన్ లీ (ప్రెసిడెంట్, సియోల్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ) సహా పలువురున్నారు. 400 మంది విదేశీ ప్రతినిధులు సదస్సుకు దాదాపు 2వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని అంచనా వేయగా, ఆ సంఖ్య దాటింది. మన దేశంలోని 458 నగరాల నుంచి 1653 మంది ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకోగా, దాదాపు 400 మంది విదేశీ ప్రతినిధులు పేర్లు నమోదు చేయించుకున్నారు. ప్రతినిధుల్లో దాదాపు 50 మంది మేయర్లున్నారు. మన దేశం నుంచి ఢిల్లీ, లక్నో, సూరత్, గ్వాలియర్, చెన్నయ్ తదితర నగరాల మేయర్లున్నారు. విదేశాలకు సంబంధించి బార్సిలోనా, జొహన్నెస్‌బర్గ్, టెహ్రాన్, జెనీవా, ఢాకా, సిడ్నీ, ఉగాండా తదితర ప్రాంతాల మేయర్లు హాజరుకానున్నారు. విస్తృత ఏర్పాట్లు చేశాం: సీఎస్ రాజీవ్ శర్మ మెట్రోపొలిస్ సదస్సు దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 4 నెలల్లోనే జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సుకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా మన్నారు. శనివారం హెచ్ఐసీసీలో ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, స్పెషల్ కమిషనర్ ఎ.బాబు, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, మెట్రోపొలిస్ ప్రతినిధి అగ్నేస్ బికార్ట్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాన్ఫరెన్స్ మొబైల్ యాప్’ను, విదేశీ ప్రతినిధులకు ఉపకరించే హ్యాండ్‌బుక్‌ను రాజీవ్‌శర్మ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాలివీ... సాంకేతికంగా 6వ తేదీనే సదస్సు ప్రారంభం కానున్నప్పటికీ, ప్రధాన సదస్సు 7వ తేదీన ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సదస్సును ప్రారంభించే ఈ కార్యక్ర మంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. 9వ తేదీన ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరు కానున్నారు. తొలి ప్లీనరీలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగించనున్నారు. రెండో రోజు కార్యక్రమంలో ఐటీ మంత్రి కె. తారకరామారావు పాల్గొననున్నారు. వివిధ దేశాల ప్రతినిధుల మధ్య జరిగే అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజలకు మేలు జరుగనుంది. నగరంలో ఎదురవుతున్న సవాళ్లు, రవాణా, కాలుష్యం తదితర అంశాలపైనా చర్చలు జరుగుతాయి. 7, 8, 9 తేదీల్లో ఉదయం ప్లీనరీ సమావేశాలు.. అనంతరం సాంకేతిక, క్షేత్రస్థాయి సమావేశాలుంటాయి. అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల వసతికి హోటళ్లలో బస, శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. చర్చలు.. ఒప్పందాలు సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేయర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిని గవర్నమెంట్ టూ గవర్నమెంట్(జీ2జీ)గా వ్యవహరిస్తున్నారు. ఆయా అంశాల్లో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి తదితర అంశాలపై చర్చలు జరిపి ఆయా దేశాలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బిజినెస్ టూ బిజినెస్(బీ2బీ)గా వ్యవహరించే వేదికల్లో మన దేశం- ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వీటిల్లో హైదరాబాద్‌ను ప్రత్యేకాంశంగా తీసుకొని కూడా చర్చలు జరుపుతారు. ఆయా అంశాలపై ముఖ్యంగా సాంకేతిక, పర్యావరణ అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. నగరంలోని వివిధ ప్రాజెక్టుల సందర్శన సదస్సులో సోషల్ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన అంశాలు, పుస్తకావిష్కరణలు తదితర కార్యక్రమాలుంటాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు ఆయా అంశాలను అధ్యయనం చేసేందుకు తొమ్మిది వరకు క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 1. హైదరాబాద్ మెట్రోరైలు 2. మహిళా స్వయం సంఘాలు 3. ఐటీ కారిడార్/ సైబరాబాద్ 4. చారిత్రక వారసత్వ భవనం నుంచి స్టార్‌హోటల్‌గా మారిన ఫలక్‌నుమా 5. ఔటర్‌రింగ్ రోడ్డు 6. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన 7. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 8. ఈఎంఆర్ఐ ఎమర్జెన్సీ సర్వీసెస్ 9. రూ. 5లకే భోజనం అమలు ఉన్నాయి. సదస్సును ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. చార్మినార్, ఐటీకారిడార్, ట్యాంక్‌బండ్‌లపై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనలను కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని ఇంటర్నెట్ నుంచి సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజుకారోజు నాలుగుపేజీల పత్రికను సైతం వెలువరించనున్నారు. అర్బన్ హాకథాన్ పేరుతో ప్రజలకు కొత్త సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్వేర్ రూపకల్పనకు సంబంధించిన పోటీలు నిర్వహించారు. ఎంపిక చేసిన ఐదు బృందాలు రూపొందించిన యాప్స్ తదితరమైన వాటిని మెట్రోపొలిస్ సదస్సులో ప్రదర్శించడంతో పాటు వాటిని వినియోగంలోకి తెస్తారు. -
సరికొత్త శిఖరాలకు...
-
సరికొత్త శిఖరాలకు...
భారత్, అమెరికా సంబంధాలపై మోదీ, ఒబామా సంకల్పం పౌర అణు సహకార ఒప్పందంపై ముందుకు.. వాషింగ్టన్: ఒకటి అగ్రదేశం. ప్రపంచ రాజకీయాలను, అంతర్జాతీయ సంబంధాలను కోరుకున్న రీతిలో ప్రభావితం చేయగల దేశం..అమెరికా. మరోటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అన్నింటా అంతర్జాతీయ శక్తిగా ఎదగగల సత్తా ఉందని ప్రపంచమంతా భావిస్తున్న దేశం.. భారత్! ఈ రెండు ప్రఖ్యాత ప్రజాస్వామ్య దేశాల శిఖరాగ్ర సమావేశం మంగళవారం వాషింగ్టన్లో జరిగింది. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు, అంతర్జాతీయ అంశాల్లో సహకారాత్మక సంబంధాలను దృఢపర్చుకునేందుకు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆర్థిక రంగంలో సహకారం, వాణిజ్యం, పెట్టుబడులపై అవగాహనకు వచ్చారు. పశ్చిమాసియాలో పరిసితులతో పాటు ‘ఇస్లామిక్ స్టేట్’ ఉగ్రవాదాన్ని అంతమొందించే అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం మోదీ, ఒబామాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విషయంలో కృతనిశ్చయంతో ఉన్నామని వారు స్పష్టం చేశారు. ఇంధన భద్రత, రక్షణ, మౌలిక వసతులు.. తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నామని, ఆ ఒప్పందం అమలుకు అడ్డుపడుతున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు ఒబామా తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లను స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దేందుకు అమెరికా సహకారం అందించనుంది. రక్షణ రంగంలో సహకారాన్ని మరో పదేళ్లు పొడిగించాలని రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. సహజ భాగస్వామి యూఎస్: భారత్, యూఎస్‌లు సహజ భాగస్వాములన్న తన విశ్వాసం ఈ పర్యటన ద్వారా మరింత బలపడిందని మోదీ అన్నారు. ‘భారతదేశ లుక్ ఈస్ట్.. లింక్ వెస్ట్ విధానంలో భాగంగా అమెరికాతో సంబంధాలు మాకు చాలా కీలకం’ అన్నారు. ఒబామా కుటుంబాన్ని భారత్‌లో పర్యటించాల్సిందిగా మోదీ ఆహ్వానించారు. అమెరికా, భారత్‌ల ‘మార్స్’ గ్రహ ప్రయోగాలు విజయవంతమైన సందర్భంలో ఈ భేటీ జరగడం సం తోషంగా ఉందన్నారు. ‘అరుణ గ్రహంపై ఇరుదేశాల శిఖరాగ్ర భేటీ అనంతరం ఇక్కడ భూమిపై ఇప్పుడు ఆ దేశాల నేతల సమావేశం జరుగుతోంది’ అని మోదీ చమత్కరించారు. దక్షిణాసియాలో ఉగ్రవాదం, పశ్చిమాసియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరిం త దృఢపర్చుకోవాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయన్నారు. లష్కరే తోయిబా, జెఈఎం, డీ కంపెనీ, అల్‌కాయిదా, హఖ్కానీ గ్రూప్.. తదితర ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసేందుకు రెండు దేశాలు కలసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు. ఆ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక, వ్యూహాత్మక సాయం అందకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఒబామా, మోదీ భేటీ అనంతరం పశ్చిమాసియాలో ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏ సంకీర్ణంలోనూ భారత్ చేరబోవడం లేదని భారత అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. పౌర అణు విద్యుత్‌కు సంబంధించి అమెరికా సహకారాన్ని భారత్ కోరుతోందన్నారు. డబ్ల్యూటీవోలో భారత్ వైఖరిని ఒబామాకు స్పష్టం చేశానని మోదీ తెలిపారు. భారతదేశ సేవారంగ కంపెనీలను అమెరికా ఆర్థికవ్యవస్థలో భాగం చేయాలని ఒబామాను కోరానని మోదీ చెప్పారు. భారతదేశ జాతీయ డిఫెన్స్ యూనివర్సిటీలో నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండేందుకు అమెరికా అంగీకరించిందన్నారు. అఫ్ఘానిస్థాన్‌కు సహకరించే విషయంలో సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. మోదీకి స్పష్టత ఉంది: ఒబామా మాట్లాడుతూ.. ఆర్థిక వృద్ధికి సంబంధించి మోదీకి స్పష్టమైన ఆలోచనలున్నాయని ప్రశంసించారు. భారత్‌నుంచి పేదరికాన్ని పారద్రోలే విషయంలో మోదీ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులపై తామిద్దరం చర్చించామన్నారు. అంతరిక్షం, శాస్త్రీయ పరిశోధనల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని, ఎబోలా తరహా సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మోదీ హిందీలో మాట్లాడగా.. ఆంగ్లంలోకి అనువదించారు. బ్లెయిర్ హౌస్ టు వైట్‌హౌస్: అంతకు ముందు అమెరికా రక్షణ మంత్రి చుక్ హేగెల్ బ్లెయిర్ హౌస్‌లో మోదీతో సమావేశమై రక్షణ సహకారంపై చర్చించారు. తరువాత ఒబామా తో చర్చల కోసం నేరుగా అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్‌కు మోదీ బయలుదేరారు. నలుపురంగు ఎస్‌యూవీలో.. ఇరువైపులా భారత్, అమెరికా జాతీయ జెండా లు రెపరెపలాడుతుండగా.. మోదీ, తన వెంట వచ్చిన మంత్రులు అధికారుల బృందంతో వైట్‌హౌస్‌కి చేరుకున్నారు.