
వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రధాని కీలకోపన్యాసం
సాక్షి, అబుదాబి : సాంకేతికతను దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. క్షిపణులు, బాంబులపై ప్రపంచ దేశాలు భారీగా వెచ్చించడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతికతను విధ్వంసం కోసం కాకుండా అభివృద్ధి కోసంఉపయోగించుకోవాలని హితవు పలికారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని..వీటికి అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు.
వరల్డ్ గవర్న్‌మెంట్ సమ్మిట్‌లో ప్రధాని కీలకోపన్యాసం చేస్తూ గడిచిన రెండున్నర దశాబ్ధాల్లో భారత్ సహా ప్రపంచం సాధించిన పురోగతిని వివరించారు. శిశుమరణాల సంఖ్య గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని చెప్పుకొచ్చారు. అంతకుముందు ప్రధాని గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి హాజరైన బిజినెస్ లీడర్లతో భేటీ అయ్యారు. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలను, గత నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా వారికి వివరించారు.