బుధవారం త్రివర్ణ శోభితంగా వెలిగిపోతున్న బుర్జ్ ఖలీఫా
దుబాయ్: సమీకృత, అవినీతిరహిత ప్రభుత్వాలు ప్రపంచానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ తమ మంత్రమన్నారు. బుధవారం దుబాయ్‌లో బుధవారం ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం సాధ్యమైనంత తక్కువగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వం లేదనే భావన ప్రజలకు కలగకూడదని, ప్రభుత్వాల ఒత్తిడి వారిపై ఉండకూడదని అన్నారు. భారత్‌లో కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమివ్వడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అనంతరం దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్–మక్తూమ్‌తో మోదీ సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment