భారతీయులకు శుభవార్త. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా రాకకు మార్గం సుగమమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్‌లో టెస్లామోడల్ 3 కారు బడ్జెట్ ధరలో వాహనదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
పలు నివేదికల ప్రకారం.. అపరకుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్నారు. జనవరి 10 నుంచి 12 వరకు జరిగే వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌లో పర్యటించన్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను గుజరాత్‌లో ఏర్పాటు చేసే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌కు కావాల్సిన అనుమతులు, స్థల అన్వేషణ త్వరగా జరిగేలా గుజరాత్ సమ్మిట్ దోహదం చేయనుంది.
ఈ నివేదికలపై టెస్లా యూనిపై కేంద్రం గాని అటు టెస్లా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ సమక్షంలో ఎలాన్ మస్క్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
టెస్లా కార్ల ధరలు ఎంతంటే?
పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెస్లా ధరలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చౌకైన మోడల్ టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ ధర 40,240 (సుమారు రూ. 33.5 లక్షలు). ఈ మోడల్‌ను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడం వల్ల రూ.60-66 లక్షల వరకు ఖర్చు అవుతుంది. భారతదేశం 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVలు) 100 శాతం దిగుమతి పన్నును విధించింది.
అన్నీ సవ్యంగా జరిగితే
అన్నీ సవ్యంగా జరిగితే టెస్లా ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, దీని ధర అనూహ్యంగా రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment