summit
-
డీప్‌ఫేక్: ‘చెడు ఎంతో.. మంచి కూడా అంతే!’
హైదరాబాద్, సాక్షి: డీప్ ఫేక్ ల వల్ల విపరీతైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, మంచి కోసం ఉపయోగించాల్సిన ఏఐ టెక్నాలజీలను చెడు కోసం వినియోగిస్తున్నారని ప్రముఖ పాత్రికేయుడు, ఫ్యాక్ట్ చెక్ ట్రైనర్ ఉడుముల సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో డేటా సైన్స్ సమిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం డీప్ ఫేక్ లను ఉపయోగిస్తూ ఉన్నారని, ఏఐ ద్వారా ముఖాలను మార్చడం, సెలెబ్రిటీల వాయిస్ తో ఇతర వ్యాఖ్యలు చేసేలా ఏఐ ద్వారా సృష్టించడం జరుగుతూ ఉన్నాయన్నారు సుధాకర్ ఉడుముల. సినీ నటుల దగ్గర నుండి, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారులు, ఎవరినైనా సరే ఈ డీప్ ఫేక్ ల ద్వారా ఫేక్ వార్తలను సృష్టించడం వీలవుతుంది. ఒకప్పుడు డీప్ ఫేక్ లను గుర్తించడం కాస్త సులువుగా ఉండేది.. కానీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ కారణంగా ఏది డీప్ ఫేక్, ఏది ఒరిజినల్ అని కనుగొనడం కష్టంగా మారిపోతోంది. ఏఐని మంచి కోసం ఉపయోగించకుండా చెడు కోసం ఉపయోగిస్తూ ఉండడమే ఈ పరిణామాలకు కారణమవుతోందన్నారు. సెలెబ్రిటీల పరువు తీయడానికి, కొందరిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దాడులు చేయడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈ డీప్ ఫేక్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా లోకి వచ్చేయడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు ఫేస్ బుక్, ఎక్స్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ కూడా చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోషల్ మీడియా సైట్స్ 'ఇన్ బిల్ట్ డీప్ ఫేక్ డిటెక్షన్ అల్గారిథమ్' ను తీసుకుని వస్తే వీటిని కట్టడి చేయడం సులభం అవుతుంది. సోషల్ మీడియా ద్వారా ఈ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి కాబట్టి బాధ్యత తీసుకోవాల్సింది కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లదే. ఏఐ ని రెగ్యులేట్, ఎడ్యుకేట్, డిటెక్ట్ విషయంలో సమిష్టి కృషి అవసరం. భారతదేశంలో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఫ్యాక్ట్ చెకర్లు మిస్ ఇన్ఫర్మేషన్ కాంబాట్ అలయెన్స్ ను స్థాపించారు. అందులో భాగంగా డీప్ ఫేక్ అనాలసిస్ యూనిట్ ను కూడా తీసుకొచ్చారు. ఎవరికైనా డీప్ ఫేక్ మీద అనుమానాలు ఉంటే ఈ యూనిట్ కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. భారత్ లో ఫ్యాక్ట్ చెకింగ్ కు సరైన తోడ్పాటును అందించడం లేదు. మీడియా లిటరసీలో భాగంగా డీప్ ఫేక్ అంటే ఏమిటి, అవి ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతాయి లాంటి వివరాలను అందించే కార్యక్రమాలను ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది. లావోస్, కంబోడియా లాంటి దేశాల్లో కూర్చొని భారతదేశంలోని పిల్లలు కిడ్నాప్ అయ్యారు, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సైబర్ నేరగాళ్లు డీప్ ఫేక్ ఆడియో, వీడియోలను వాడుతూ మోసాలకు తెగబడుతూ ఉన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. డీప్ ఫేక్ లు ఎన్నో మోసాల్లో భాగమయ్యాయి, మీడియాలోకి చొచ్చుకొస్తున్నాయి. ఎన్నికల ఫలితాలను మార్చే ప్రమాదం కూడా ఉంది. డీప్ ఫేక్ లను వాడి అసభ్యకరమైన వీడియోలను కూడా సృష్టిస్తూ ఉన్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా మన వీడియోలను ఎవరైనా డీప్ ఫేక్ చేశారా అని కూడా తెలుసుకోవాల్సిన దౌర్భాగ్యం మనకు వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. డీప్ ఫేకింగ్ రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమవుతుంది. ఆర్థికంగా కూడా చాలా ఎంతో మందికి ఇబ్బందులు ఎదురవుతాయి.డీప్ ఫేక్ కారణంగా అటు మంచి, ఇటు చెడు.. రెండూ ఉన్నాయి. రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్ సినిమాలో మలేషియా వాసుదేవన్ పాడినట్లుగా ఏఐ ద్వారా సృష్టించారు. ఇది వాసుదేవన్ కుటుంబం అంగీకారంతో జరిగింది. కానీ అన్ని సందర్భాల్లో ఇలాగే ఉండదు. కొందరు దురుద్దేశపూరితంగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. మంచి ఉద్దేశ్యంతో చేస్తే ఎలాంటి తప్పు లేదని గుర్తుంచుకోవాలి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏఐ ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించవచ్చు.ఏఐను ఉపయోగించడంలో ప్రవర్తనా నియమావళి చాలా ముఖ్యం. ఏఐ మేకర్స్ కూడా ఇన్ బిల్ట్ డిటెక్షన్ ను తీసుకుని రావాలి. మీడియాకు చెందిన వారికి కూడా వీటిపై సరైన అవగాహన కల్పించాలి. డీప్ ఫేక్ విజువల్స్ ఉండే లోపాలను ప్రతి ఒక్కరూ గుర్తించేలా అవగాహన తీసుకుని రావాలి. హైవ్, హియా వంటి డీప్ ఫేక్ టూల్స్ గురించి తెలియజేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దిగ్గజాలు, ప్రభుత్వాలు, ఫ్యాక్ట్ చెకర్స్ కలిసి పోరాటం చేస్తేనే డీప్ ఫేక్ తో సమస్యలను అడ్డుకోడానికి వీలవుతుంది. ఐపీఎస్ అజయ్ కుమార్ యాదవ్ కూడా డీప్ ఫేక్ కారణంగా ఎదురవుతున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. . ఇంకా ఈ కార్యక్రమంలో ఐపీఎస్ రోహిత్ మాల్పని, సైబర్ పీస్ ఫౌండేషన్ ఫౌండర్ మేజర్ వినీత్ కుమార్ తో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సంస్థ మేనేజ్మెంట్ కూడా భాగమైంది. కార్యక్రమాన్ని డేటా సైన్స్ సమ్మిట్ ను బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గారెత్ ఓవెన్ ప్రారంభించారు. కీనోట్ స్పీకర్ గా లారా బాల్డ్విన్, దక్షిణాసియా సైబర్ లీడ్, బ్రిటిష్ హై కమిషన్ వ్యవహరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దోహాలో తొమ్మిదొవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఈ నెల నవంబర్ 22,23, 2024 తేదీలలో మధ్య ప్రాచ్య దేశాలలో తొలిసారిగా ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత మాజీ ఉప రాష్ట్రపతి “పద్మవిభూషణ్” ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు కుటుంబ సమేతంగా ప్రధాన అతిధిగా విచ్చేస్తున్నారు. ఈ వేడుకలో స్థానిక చిన్నారుల స్వాగత నృత్యం, ఉపాధ్యాయుల సత్కారంతో సదస్సు ప్రారంభం అవుతుంది. ఖతార్ దేశంలో భారత రాయబారి ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు.పది మధ్య ప్రాచ్య దేశాల అధ్యక్షులు, భారతదేశం, అమెరికా, ఆఫ్రికా మొదలైన అనేక ప్రాంతాల నుంచి సుమారు 75 మంది వక్తలు, 250 మంది సాహిత్య ప్రతినిధులు, తెలుగు రాష్త్రాల మంత్రి వర్యులు, సినీ గేయ రచయితలు, కవులు, పండితులు నమోదు చేసుకుని ప్రయాణానికి సంసిధ్దంగా ఉన్నారు. సదస్సు తర్వాత దోహా మహానగర సందర్శనం ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ సదస్సులో ప్రముఖ కథకులు, సాహితీ వేత్త ప్రొ. రామా చంద్రమౌళి (వరంగల్) గారెకి ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ సదస్సులో విభిన్న అంశాల మీద నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, సినీ కవి మౌనశ్రీ మల్లిక్ మొదలైన సుమారు 35 మంది ప్రముఖ కవుల స్వీయ రచనా పఠనం, ఆ ప్రాంతంలో ఆచార్య అద్దంకి శ్రీనివాస్ గారు సంచాలకులుగా శ్రీమతి బులుసు అపర్ణ గారి తొలి మహిళా అష్టావధానం, కవి జొన్నవిత్తుల గారి శతక గ్రంధావిష్కరణతో సహా 33 నూతన గ్రంధాల ఆవిష్కరణ, కొత్తగా రూపొందించబడిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సమగ్ర వెబ్ సైట్ ఆవిష్కరణ మొదలైన అంశాలతో పాటు పుస్తక ప్రదర్శన-విక్రయశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.మొదటి రోజు..అనగా నవంబర్ 22, 2024 నాడు సాయంత్రం ప్రత్యేక ఆహ్వానితుల గౌరవార్ధం విందు భోజనం, ప్రముఖ గాయనీ గాయకులు Y.S రామకృష్ణ, లలిత దంపతులు (హైదరాబాద్), సుచిత్ర బాలాంత్రపు (సుచిత్ర ఆర్ట్ క్రియేషన్స్, కాకినాడ), రాంప్రసాద్ (విశాఖ) వారి సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారుల సంగీత, నృత్య ప్రదర్శనలు మొదలైన ఆసక్తికరమైన అంశాలతో వినోద కార్యక్రమం జరుగుతుంది.ప్రతిష్టాత్మకమైన ఈ 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కేవలం ఖర్చుల నిమిత్తం వదాన్యుల ఆర్థిక సహకారం అర్థిస్తున్నాం. వివరాలు జత పరిచిన ప్రకటనలో చూసి స్పందించమని కోరుతున్నారు నిర్వాహకులు. ఈ సదస్సు ప్రత్యక్ష ప్రసారం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యూ ట్యూబ్ లింక్ లో చూడవచ్చు. ఈ కార్యక్రమం ప్రధాన నిర్వాహకులు వంగూరి చిట్టెన్ రాజు, భాగవతుల వెంకప్ప, విక్రమ్ సుఖవాసి, రాధిక మంగిపూడి, శాయి రాచకొండ, వంశీ రామరాజు తదితరులు. (చదవండి: డల్లాస్‌లో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన) -
ఇజ్రాయెల్‌కు షాక్.. పాలస్తీనా కోసం రంగంలోకి సౌదీ అరేబియా
హమాస్, హోజ్బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది.ఈ క్రమంలో తాజాగా గాజా, లెబనాన్‌తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది. నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్ పాలస్తీనా రాజ్య స్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్‌లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.ఈ శిఖరాగ్ర సమావేశం గత సంవత్సరం 2023 అరబ్-ఇస్లామిక్ ఎక్స్‌ట్రార్డీనరీ సమ్మిట్‌కు కొనసాగింపుగా జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్‌పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధాన్ని ముగింపుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి.కాగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి, ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కోఆపరేషన్ సంస్థ (ఓఐసీ) ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 7న హమాస్ తమ దేశంలోకి చొరబడి నరమేథానికి పాల్పడటంతో ఇజ్రాయేల్ ప్రతీకారం తీర్చుకునేందుకు యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈయుద్ధం కారణంగా- గాజాలో 43,000 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో సగానికిపై మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 1,01,110 మంది గాయపడినట్లు పేర్కొంది. అయితే మృతుల్లో ఎంతమంది పౌరులు, మిలిటెంట్లు ఉన్నారనే వివరాలు వెల్లడించలేదు. -
డ్రోన్స్‌పై ఎక్కువ ఆంక్షలు వద్దు
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడపశ్చిమ) : డ్రోన్స్ తయారీ, వినియోగంలో ఎక్కువ ఆంక్షలు పెట్టవద్దని, పరిమితమైన నియంత్రణ ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. డ్రోన్స్ టెక్నాలజీ భవిష్యత్‌లో గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. రెండు రోజులు జరిగే అమరావతి డ్రోన్స్ సమ్మిట్–2024ను చంద్రబాబు మంగళవారం మంగళగిరిలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్స్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 20,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిని డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దుతామన్నారు. డ్రోన్స్ తయారీదారులు, ఆవిష్కర్తలకు వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించేలా 15 రోజుల్లో సమగ్ర విధానాన్ని తెస్తామని చెప్పారు. డ్రోన్ ప్రాజెక్టుల కోసం రాష్ట్రాన్ని టెస్టింగ్ క్షేత్రంగా ఉపయోగించుకోవాలని సూచించారు. తయారీదారులకు తానే అంబాసిడర్‌గా ఉంటానని, మార్కెట్‌ను ప్రోత్సహిస్తానని అన్నారు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనలో డ్రోన్స్ కీలకం కానున్నాయని తెలిపారు. రోడ్లు, ట్రాఫిక్, చెత్త నిర్వహణలో డ్రోన్లు వినియోగిస్తామన్నారు. నేరాలు చేసే వారిపై డ్రోన్స్ ద్వారా నిఘా పెడతామన్నారు. సదస్సులో భాగంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో, ఐఐటీ తిరుపతితో రెండు ఒప్పందాలు చేసుకున్నారు. ఏపీ డ్రోన్స్ ముసాయిదా విధానాన్ని విడుదల చేశారు.ప్రపంచంలో భారత దేశాన్ని డ్రోన్ హబ్‌గా తయారు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర పౌర వియానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.అన్నీ నేనే తెచ్చా1995లో హైదరాబాద్‌కు ఐటీ తీసుకువచ్చింది తానేనని చంద్రబాబు చెప్పారు. పైసా పెట్టుబడి లేకుండా పీపీపీ విధానంలో హైటెక్ సిటీని నిర్మించినట్లు తెలిపారు. దేశంలో మొబైల్ టెక్నాలజీని, తొలిసారిగా ఎమిరేట్స్ విదేశీ విమానాన్ని నేరుగా హైదరాబాద్‌కు రప్పించింది తానేనని చెప్పారు.సార్... బూట్లు..అమరావతి డ్రోన్స్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో జ్యోతి వెలిగించే సమయంలో సీఎం చంద్రబాబు బూట్లు ధరించే ఉన్నారు. ఆయన కొవ్వొత్తితో జ్యోతి వెలిగించబోగా.. పక్కనే ఉన్న పెట్టుబడులు, మౌలిక సదుపాయల కార్యదర్శి సురేష్ కుమార్ దగ్గరకు వెళ్లి బూట్లు చూపెట్టారు. దీంతో చంద్రబాబు వెనక్కి వచ్చి బూట్లు విప్పి జ్యోతి ప్రజ్వలన చేశారు. -
ముగిసిన ‘వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్’
రాయదుర్గం: ఇండిక్ మీడియా వికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్, వికీమీడియా ఫౌండేషన్ సహకారంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన వికీమీడియా టెక్నాలజీ సమ్మిట్–2024 ముగిసింది. ఒక రోజు హ్యాకథాన్‌లో దేశం నలుమూలల నుంచి 130 మంది సాంకేతిక నిపుణులు, డెవలపర్లు, వికీ మీడియా ప్రాజెక్ట్‌ల స్వచ్ఛంద సహకారులు పాల్గొన్నారు.ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, వికీ మీడియా ప్రాజెక్ట్‌లలో తాజా పోకడలు, ఆవిష్కరణల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీలోని లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ హెడ్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ మాట్లాడుతూ ఈ ఏడాది సమ్మిట్ వికీమీడియా ప్రాజెక్ట్‌లు, కమ్యూనిటీలలో టెక్నికల్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని గుర్తు చేశారు. వికీమీడియా ఉద్యమం ద్వారా ఊహించిన విధంగా ఉచిత జ్ఞానం కోసం మిషన్‌ను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ రాధికా మామిడి, వికీమీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్య ఏజీ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా రిత్ సమ్మిట్ 2.0
భారత్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫారమ్. ఆర్య ఏజీ (arya.ag) బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ స్థాపించిన అమెరికన్ ప్రైవేట్ ఫౌండేషన్ బిల్& మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి దేశ రాజధాని ఢిల్లీలో రిత్ సమ్మిట్ రెండో ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన ఈ రిట్ సమ్మిట్ ప్రముఖ అగ్రిబిజినెస్లు, టెక్నాలజీ ప్రొవైడర్లు, అంతర్జాతీయ నిపుణులు, అభివృద్ధి సంస్థలను ఒకచోట చేర్చిందివీరంతా వ్యవసాయ రంగంలో వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించడానికి భాగస్వామ్యాలు, కార్యక్రమాలు, ఆచరణాత్మక సాంకేతికతలను అన్వేషించడానికి వ్యవసాయ కమ్యూనిటీలకు స్థిరమైన భవిష్యత్తును అందించడంలో సహాయపడటానికి నిపుణులను కనెక్ట్ చేయడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి, వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి సమ్మిట్ ఒక వేదికగా మారింది.arya.ag. సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ చంద్ర తన ప్రసంగంతో సమ్మిట్‌ను ప్రారంభించారు. వాతావరణాన్ని తట్టుకోగలిగేలా వ్యవసాయం చేయడానికి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే మార్కెట్-నేతృత్వంలోని నమూనా ప్రాముఖ్యతను తెలియజేశారు. దేశంలో అతిపెద్ద, ఏకైక లాభదాయకమైన అగ్రిటెక్ కంపెనీని నిర్మించడమే లక్ష్యమని తెలిపారు.ప్రతి వాటాదారులకు ప్రయోజనం చేకూర్చే మార్కెట్ నేతృత్వంలోని నమూనాను రూపొందించకపోతే వ్యవసాయ వాతావరణాన్ని స్థితిస్థాపకంగా మార్చడం అసాధ్యమని పేర్కొన్నారు, వాటాదారులందరూ కలిసి ఈ దిశలో తమ వంతు కృషి చేసేందుకు కట్టుబడి ఉంటే తప్ప ఇది కూడా సాధ్యం కాదని, అలాగే రిత్ వెనుక ఉన్న మా తత్వశాస్త్రం అదేనని ఆనంద్ పేర్కొన్నారు. -
ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధాని
ప్రముఖ కంపెనీల సీఈఓలు, అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో సమావేశం అయ్యారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే అమెరికా(ఏ), ఇండియా(ఐ) అని చెప్పారు. మూడు రోజుల యూఎస్ పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం రాత్రి సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన ప్రముఖులను కలిసి మాట్లాడారు. భారతదేశంలోని అవకాశాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారత అభివృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ విధానాలు పాటిస్తున్నాం. ఏదైనా ఒక దేశం విధించిన నియమాలను అనుసరించి డిజిటల్ ప్రపంచం నడవదు. నిత్యం అది మారుతూ ఉంటుంది. భారత్, అమెరికా కలిసి సాంకేతిక అవసరాలు తీర్చుకుంటున్నాయి. ఏఐ అంటే అమెరికా, ఇండియా’ అని తెలిపారు.Had a fruitful roundtable with tech CEOs in New York, discussing aspects relating to technology, innovation and more. Also highlighted the strides made by India in this field. I am glad to see immense optimism towards India. pic.twitter.com/qW3sZ4fv3t— Narendra Modi (@narendramodi) September 23, 2024వైట్ హౌస్ విడుదల చేసిన ఉమ్మడి ఫాక్ట్ షీట్ ప్రకారం..ఐబీఎం సంస్థ ఇండియాకు చెందిన ఐరావత్ సూపర్ కంప్యూటర్‌కు మద్దతుగా ఏఐ సేవలిందిచేలా ఒప్పందం చేసుకుంది. అధునాతన సెమీకండక్టర్ ప్రాసెసర్లకు సంబంధించిన రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సహకారాన్ని మెరుగుపరిచేలా ఒప్పందాలు జరిగాయి. ఇవి భారత క్వాంటం మిషన్‌కు ఎంతో ఉపయోగపడుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో శనివారం సెమీకండక్టర్లకు సంబంధించి ఆర్ అండ్ డీ విభాగాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీన్ని గ్లోబల్ ఫౌండరీస్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!అమెరికా, ఇండియా మధ్య నవంబర్ 2023లో ‘ఇన్నోవేషన్ హ్యాండ్‌షేక్’ కార్యక్రమంలో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాల్లోని అభివృద్ధి అంశాలపై ఇరు దేశాలకు చెందిన నాయకులు చర్చించారు. సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఏఎండీ సీఈఓ లిసా సు చైర్, తదితరులు పాల్గొన్నారు. -
చైనా తీరు మారాలి!
ఆవిర్భవించిన నాటి లక్ష్యాలు విడిచి చాన్నాళ్లుగా దారీ తెన్నూ లేకుండా మిగిలిపోయిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు కజఖ్‌స్తాన్‌లోని ఆస్తానాలో గురువారం ముగిసింది. ఈ సదస్సువల్ల ఇతరత్రా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చుగానీ మనతోవున్న సరిహద్దు సమస్యను నాలుగేళ్లుగా దాటవేస్తున్న చైనాతో మన విదేశాంగమంత్రి జైశంకర్ భేటీ కావటం ఉన్నంతలో జరిగిన మేలు. వాస్తవానికి ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావాల్సివుండగా ఆయన బదులు విదేశాంగ మంత్రి వెళ్లారు. ప్రధాని ప్రసంగాన్ని చదివి వినిపించారు. మోదీ గైర్హాజరు ఆ సంస్థనుంచి భారత్ దూరం జరగటానికి సంకేతమనీ, అమెరికా ఒత్తిడే ఇందుకు కారణమనీ చైనా అనుకూల మీడియా ప్రచారం చేసుకుంది. నిరుడు భారత్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు కూడా ఇలాంటి భాష్యాలే చెప్పారు. చైనాతో నేరుగా సమావేశం కావటం ఇష్టం లేకే ఈ లాంఛనం పూర్తిచేసిందని ఆ భాష్యాల సారాంశం. నిజమే... ప్రపంచంలో 40 శాతం జనాభాతో, ప్రపంచ జీడీపీలో 23 లక్షల కోట్ల మేర వాటాతో ఉన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీఓను విస్మరించటం మంచిది కాదు. కానీ ఆ సంస్థ ఆరంభ కాలంనాటి లక్ష్యాలను గుర్తుంచుకుందా? వాటికి అనుగుణంగా పనిచేస్తున్నదా అంటే లేదనే చెప్పాలి. వర్తక, వాణిజ్యాల్లో దాని ముద్ర లేకపోలేదు. అయితే ఆ సంస్థ పరిధిలోని ప్రాంతాల్లో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వగైరా పోకడల గురించి అది సక్రమంగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మోదీ ప్రసంగంలో ఈ సమస్యలే ప్రధానంగా ప్రస్తావనకొచ్చాయి. 1996లో షాంఘై ఫైవ్‌గా ఏర్పడ్డ బృందంలో చైనా, రష్యా, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్లున్నాయి. 1991లో సోవియెట్ యూనియన్ కుప్పకూలాక ఆ ప్రాంతంలో తెగల ఘర్షణలు పెచ్చుమీరటంతో భద్రతాపరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ బృందం ఆవిర్భవించింది. అంతర్జాతీయ సంస్థగా మలచాలన్న లక్ష్యంతో 2001లో దీన్ని ఎస్సీఓగా మార్చారు. మన దేశానికి సభ్యత్వం ఇవ్వాలన్న రష్యా ప్రతిపాదనను అంగీకరిస్తూనే 2017లో తనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్‌ను ఇందులో చేర్చింది చైనాయే. కానీ ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్టు వెల్లడై అనేకసార్లు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అభిశంసనకు గురైన పాక్‌ను దారి మార్చుకోవాలని చెప్పటంలో చైనా విఫలమైంది. అలాగే పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదుల జాబితాను మన ప్రతిపాదన పర్యవసానంగా భద్రతామండలి చర్యలు తీసుకుంటున్న తరుణంలో చైనా గండికొట్టింది. సరిగదా తన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ)ను పాకిస్తాన్ అధీనంలోవున్న ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లేలా రూపొందించింది. అందుకే 2018లో ఎస్సీఓలో బీఆర్‌ఐను అందరూ అంగీకరించినా మన దేశం వ్యతిరేకించాల్సి వచ్చింది. నిరుడు జరిగిన ఆన్లైన్ సదస్సులో కూడా మన దేశం బీఆర్ఐ గురించిన పేరా తొలగిస్తే తప్ప ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేది లేదని చెప్పింది.ఆ సంగతలావుంచి ఎస్సీఓను అమెరికా, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని సంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనుకుంటున్న చైనా అందుకు అనుగుణమైన నడవడి కనబరచవద్దా? వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద భారీగా సైన్యాన్ని మోహరించి దురాక్రమణకు పాల్పడినప్పుడు ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. 2020లో ఘర్షణలు చెలరేగాక భారత్, చైనాల సైనికాధికారుల స్థాయిలో 20 సార్లు, దౌత్యస్థాయిలో 13 రౌండ్లు చర్చలు జరిగాక ప్యాంగాంగ్ సో సహా అయిదు చోట్ల ఇరు దేశాల సైన్యాలూ వెనక్కి తగ్గటానికి అంగీకరించాయి. తూర్పు లద్దాఖ్‌లోని ప్రాంతాల్లో పరిస్థితి మారలేదు. దీన్ని పక్కనబెట్టి ఇరు దేశాల సంబంధాలూ సాధారణ స్థితికి తీసుకురావాలని చైనా కోరుతోంది. కానీ అక్కడ 2020 ఏప్రిల్ నాటి స్థితికి చైనా సిద్ధపడితేనే అది అసాధ్యమన్నది మన దేశం వాదన. మన సరిహద్దుకు సమీపంగా ఈ నాలుగేళ్లలో చైనా 600 ‘సంపన్న గ్రామాల’ను నిర్మించింది. మన దేశం కూడా అరుణాచల్‌లో 60 గ్రామాలు నిర్మిస్తోంది. మున్ముందు అరుణాచల్, హిమాచల్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఇలాంటివి 3,000 గ్రామాలు నిర్మించాలన్నది మన దేశం లక్ష్యం. ఇదిగాక అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం దలైలామాను కలవడానికి మన దేశం అంగీకరించటం, దక్షిణ చైనా సముద్రంలో చైనాతో ఫిలిప్పీన్స్‌కు వచ్చిన తగాదాలో ఫిలిప్పీన్స్‌ను సమర్థించటం చైనాకు కంటగింపుగా ఉంది. అటు చైనా మనతో స్నేహసంబంధాలున్న హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలను దువ్వుతూ మనకు వ్యతిరేకంగా కూడగడుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ఏసీ సమస్యపై భారత్‌తో చర్చించి, దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలన్న జ్ఞానం చైనాకు ఉండాలి. అసలు ఎల్ఏసీ మ్యాప్‌లను ఇచ్చిపుచ్చుకుందామన్న మన ప్రతిపాదనకే అది జవాబివ్వటం లేదు. ఆ పని చేస్తే తన పాపం బద్దలవుతుందని దాని భయం. వర్తక వాణిజ్యాలు ముమ్మరంగా పెరిగేలా, కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఎస్సీఓను తీర్చిదిద్దుతామని మాటల్లో చెబుతూనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను విస్మరించటం ఏ రకంగా చూసినా చైనాకు తోడ్పడదు. పొరుగుతో సఖ్యతకు రాలేని దేశం ఇటువంటి సంస్థల అభ్యున్నతికి ఏమాత్రం పాటుపడగలదన్న ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతాయి. అందువల్లే మళ్లీ చర్చల పునరుద్ధరణకు చైనా చొరవ తీసుకోవాలి. చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ, జైశంకర్‌ల మధ్య జరిగిన భేటీ ఆ దిశగా తోడ్పడితే మంచిదే. సమస్య పరిష్కారానికి ఇరు దేశాలూ చిత్తశుద్ధితో ప్రయత్నించి సఫలమైతేనే ఎస్సీఓ వంటి సంస్థల నిజమైన లక్ష్యాలు నెరవేరతాయి. -
జీ–7 అసంబద్ధ నిర్ణయం
పేరుకి సంపన్న దేశాలే. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నవే. స్వయంకృతం కావొచ్చు... అంతర్జాతీయ పరిణామాల పర్యవసానం కావొచ్చు ఆ దేశాలకూ సమస్యలుంటాయి. ఇటలీలో గురువారం ప్రారంభమైన జీ–7 దేశాల మూడురోజుల శిఖరాగ్ర సదస్సు ఈ పరిస్థితిని ప్రతిబింబించింది. చుట్టూ అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశా నిస్పృహలు వాటిని పీడిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాల్లేదన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్ ట్రంప్‌కు దక్కవచ్చన్న అంచనాలు వాటిని వణికిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పటికి ట్రంప్ నిష్క్రమించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడై శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. వస్తూనే అందరికీ అభయమిచ్చారు. మళ్లీ ప్రపంచ సారథ్యాన్ని అమెరికా స్వీకరించి జీ–7కు అన్నివిధాలా అండదండలందిస్తుందని పూచీపడ్డారు. అదే బైడెన్ గురువారం సదస్సుకు హాజరైనప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ సరేసరి. పాలస్తీనాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు పాశ్చాత్య దేశాలు, అమెరికా మద్దతిస్తున్నాయన్న ఆగ్రహంతో 1973లో ఒపెక్ దేశాలు చమురు సంక్షోభం సృష్టించినప్పుడు దానికి జవాబుగా జీ–7 ఆవిర్భవించింది. యాభైయ్యేళ్లు గడిచాక ఇప్పటికీ ఇజ్రాయెల్ తీరుతెన్నులు మారలేదు. అమెరికా మాత్రం ఆయుధాలందిస్తూనే గాజాలో దాడులు నిలపాలని ఇజ్రాయెల్‌ను బతిమాలుతోంది. మరోపక్క ఇటీవలే జరిగిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో యూరొప్ రాజకీయ ముఖచిత్రం మారుతున్న వైనం వెల్లడైంది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీల్లో మితవాద పక్షాలు బలపడుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. అసలు జీ–7కు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీయే మితవాద పక్షానికి చెందినవారు. వీటన్నిటికీ అదనంగా ట్రంప్ సమస్య తోడైతే జీ–7 దేశాధినేతలు నిశ్చింతగా ఎలా ఉండగలరు?ఇలా పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయినా ఈ ఏడాది ఆఖరుకల్లా ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల (రూ. 4లక్షల కోట్లుపైగా) రుణం అందించాలని గురువారం జీ–7 అధినేతలు తీర్మానించక తప్పలేదు. ఇది సాధారణ సాయమైతే రష్యా కూడా ఎప్పటిలా ఇది సరికాదని ఖండించి ఊరుకునేది. కానీ తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే దురాక్రమణ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో రష్యాకున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తులతోపాటు నగదు రూపంలోవున్న సంపదను స్తంభింపజేశారు. ఇప్పుడు ఉక్రెయిన్‌కు ఆ ఆస్తులపై ఆర్జించిన వడ్డీనుంచే రుణం అందజేయబోతున్నారు. నిజానికి గత రెండేళ్లుగా అమెరికా ఈ ప్రతిపాదన చేస్తున్నా ఈయూ దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ పని చేస్తే రష్యాను మరింత రెచ్చగొట్టినట్టు అవుతుందనీ, పొరుగునేవున్న తమపై అది నేరుగా దాడికి దిగే ప్రమాదం ఉంటుందనీ భావించాయి. కానీ అమెరికా ఎలాగైతేనేం నచ్చజెప్పి ఒప్పించింది. ఈయూలో ఎప్పుడూ భిన్న స్వరం వినిపించే ఫ్రాన్స్ బాహాటంగానే అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించింది. జీ–7 దేశాలన్నీ విరాళాలు సమకూర్చి, ప్రపంచ దేశాలనుంచి విరాళాలు సేకరించి ఈ రుణాన్ని అందిద్దామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సూచించారు. కానీ చివరకు అమెరికా ఒత్తిడితో రష్యా ఆస్తులనుంచి వచ్చిన వడ్డీనుంచే ఇవ్వాలని తీర్మానించారు. ‘ఇది నేరపూరిత చర్య. మానుంచి దుఃఖాన్ని మిగిల్చే స్పందన చవిచూడాల్సి వస్తుంది సుమా!’ అని రష్యా హెచ్చరించింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వేరే దేశం ఆస్తుల్ని స్తంభింపజేయటం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని వినియోగించటానికి ఇప్పటికైతే న్యాయబద్ధమైన ప్రాతిపదికగానీ, విధానంగానీ లేవు. అమెరికా తనవరకూ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉక్రెయిన్ పౌరుల ఆర్థిక పునర్నిర్మాణం, అవకాశాల మెరుగుదల పేరిట రెపో చట్టం తీసుకొచ్చింది. ఈయూ ఇలాంటి చట్టమేమీ లేకుండానే రష్యా ఆస్తులనుంచి వచ్చిన లాభార్జనను పక్కనబెట్టింది. ఇప్పుడు జీ–7 అమెరికా మాదిరిగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదిక లేకుండా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రమేయం లేకుండా ఏవో కొన్ని దేశాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడటం అనర్థదాయకం. ఇప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక హెచ్చరిక చేసింది. అగ్రరాజ్యాలు సరఫరా చేసిన భారీ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే దాని పర్యవసానాలను ఆ దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుందన్నది ప్రకటన సారాంశం. యుద్ధం మొదలైన నాటినుంచీ రష్యా ఆస్తులను చెరబట్టిన అగ్రరాజ్యాలు ఈ రెచ్చగొట్టే చర్యకు కూడా సిద్ధపడ్డాయంటే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచటమే అవుతుంది.బైడెన్‌కూ, ట్రంప్‌కూ మధ్య ఒక్క చైనా విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. దానిపై భారీగా సుంకాలు విధించాలన్నదే ఇద్దరి ఆలోచన. కానీ ఈయూ, నాటో, జీ–7లపై ట్రంప్ గతంలో కారాలూ మిరియాలూ నూరేవారు. 2018లో కెనడాలో జీ–7 సదస్సు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ ప్రకటించిన వెంటనే ట్రంప్ అది అబద్ధమని కొట్టిపారేశారు. సంస్థలో రష్యాను చేర్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇటీవలే ఆయన నాటో దేశాలను తీవ్రంగా హెచ్చరించారు కూడా. తాను అధికారంలోకొచ్చాక నాటోనుంచి తప్పుకుంటామనీ, అటుపై రష్యా ఆ దేశాలను ఏంచేసినా పట్టించుకోబోమనీ తెలిపారు. ఇలాంటి స్థితిలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గటం ఎంతవరకూ సబబో జీ–7 ఆలోచించుకోవాలి. -
సమీకృత, అవినీతిరహిత ప్రభుత్వాలు కావాలి
దుబాయ్: సమీకృత, అవినీతిరహిత ప్రభుత్వాలు ప్రపంచానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ తమ మంత్రమన్నారు. బుధవారం దుబాయ్‌లో బుధవారం ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యం సాధ్యమైనంత తక్కువగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం లేదనే భావన ప్రజలకు కలగకూడదని, ప్రభుత్వాల ఒత్తిడి వారిపై ఉండకూడదని అన్నారు. భారత్‌లో కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమివ్వడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. అనంతరం దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్–మక్తూమ్‌తో మోదీ సమావేశమయ్యారు. -
సీఎం జగన్ గురించి ఇండియా టుడే శివాని సింగ్ గొప్ప మాటలు
-
విశాఖలో దక్షిణ భారత హోటల్ యజమానుల సదస్సు
-
నేటి నుంచి ‘వైబ్రంట్ గుజరాత్’
గాంధీనగర్/అహ్మదాబాద్: 10వ ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు సర్వం సిద్ధమైంది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్–హోరా్ట, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నుయిసీలతో ఆయన మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో సంబంధాలపై చర్చించారు. అంతకుముందు యూఏఈ అధ్యక్షునికి విమానాశ్రయంలో మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణం దాకా మోదీ రోడ్ షో జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులతోనూ మోదీ భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు. డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్, మైక్రాన్ టెక్నాలజీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రాత, డియాకిన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మారి్టన్, సుజుకీ మోటార్ కార్పొరేసన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీ తదితరులు వీరిలో ఉన్నారు. గాంధీనగర్‌లో ‘వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో–2024’ను మోదీ ప్రారంభించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సు నేపథ్యంలో 2 లక్షల చదరపు మీటర్లలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. -
అబ్బురపరచిన ‘ప్రత్యేక’ ఆవిష్కరణలు.. స్ఫూర్తి నింపిన ప్రసంగాలు
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) హైదరాబాద్‌లోని టీ హబ్ 2.0లో ఏర్పాటు చేసిన అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్ 4.0 (ATS 4.0) నాలుగో ఎడిషన్ ముగిసింది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘టీఎస్ఐసీ ఇన్‌క్లూషన్ టాక్స్’ పేరుతో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని టీఎస్ఐసీ నిర్వహించింది. దివ్యాంగులు, అంధులు, ప్రత్యేక అవసరాలవారు, విభిన్న ప్రతిభావంతులు ఇలా ప్రతిఒక్కరూ ఇతరులతో సమానంగా ముందుకు సాగడం, అభివృద్ధి సాధించడంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాత్రపై వివిధ సంస్థలు, ఎన్జీవోలకు చెందిన పలువురు తమ ప్రసంగాలను వినిపించారు. దీంతోపాటు దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల వ్యక్తుల కోసం రూపొందించిన అబ్బురపరిచే పలు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించారు. అసిస్టెక్ ఫౌండేషన్ (ATF) కోఫౌండర్, సీఈవో ప్రతీక్ మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత, ఎన్ఐఈపీఐడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ డా. అంబాడి, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కౌన్సెలర్ టి.వి. ఐశ్వర్య, భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహేందర్ వైష్ణవ్, ఐటీఈ&సీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, యూత్4జాబ్స్ వ్యవస్థాపకురాలు మీరా షెనాయ్ తదితరులు ప్రసంగించారు. సమగ్ర సమాజాన్ని రూపొందించడంలో ఆవిష్కరణల కీలక పాత్రపై తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టీఎస్ఐసీ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం పేర్కొన్నారు. -
భారత్‌లో టెస్లా ఎలక్ట్రిక్.. కార్ల ధరలు ఇంత తక్కువా?
భారతీయులకు శుభవార్త. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా రాకకు మార్గం సుగమమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే భారత్‌లో టెస్లామోడల్ 3 కారు బడ్జెట్ ధరలో వాహనదారులకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. అపరకుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరికొద్ది రోజుల్లో భారత్‌లో పర్యటించనున్నారు. జనవరి 10 నుంచి 12 వరకు జరిగే వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారత్‌లో పర్యటించన్నట్లు సమాచారం. ఇప్పటికే టెస్లా కార్ల తయారీ యూనిట్‌ను గుజరాత్లో ఏర్పాటు చేసే దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్‌కు కావాల్సిన అనుమతులు, స్థల అన్వేషణ త్వరగా జరిగేలా గుజరాత్ సమ్మిట్ దోహదం చేయనుంది. ఈ నివేదికలపై టెస్లా యూనిపై కేంద్రం గాని అటు టెస్లా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వైబ్రాంట్ గుజరాత్ గ్లోబుల్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ సమక్షంలో ఎలాన్ మస్క్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టెస్లా కార్ల ధరలు ఎంతంటే? పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, టెస్లా ధరలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చౌకైన మోడల్ టెస్లా మోడల్ 3 బేస్ వేరియంట్ ధర 40,240 (సుమారు రూ. 33.5 లక్షలు). ఈ మోడల్‌ను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడం వల్ల రూ.60-66 లక్షల వరకు ఖర్చు అవుతుంది. భారతదేశం 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVలు) 100 శాతం దిగుమతి పన్నును విధించింది. అన్నీ సవ్యంగా జరిగితే అన్నీ సవ్యంగా జరిగితే టెస్లా ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే, దీని ధర అనూహ్యంగా రూ. 20 లక్షల నుండి ప్రారంభమవుతుంది. -
చెక్కుచెదరని మైత్రి
అంతర్జాతీయంగా ఒక అస్పష్ట వాతావరణం అలుముకున్న వేళ భారత్–రష్యాలు తమ చిరకాల స్నేహబంధాన్ని మరింత పటిష్టపరుచుకుంటామని ప్రతినబూనాయి. ఏటా జరిగే శిఖరాగ్ర సమావేశం కోసం ఆ దేశంలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యా తమ నమ్మదగిన మిత్ర దేశమని మరోసారి చాటారు. దాదాపు ఆరున్నర దశాబ్దాల ద్వైపాక్షిక సంబంధాల్లో సమస్యలు తలెత్తలేదని అనలేం. మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై అమెరికా వైపు మొగ్గుచూపటం మొదలైనప్పటినుంచీ రష్యా కలవరపడుతోంది. అమెరికా ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా ఏర్పడిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో మన భాగస్వామ్యం రష్యాకు ససేమిరా నచ్చలేదు. దాన్ని ‘ఆసియా–పసిఫిక్ వ్యూహం’గా సవరించి తనతో సహా ఆసియా దేశాలన్నిటికీ అందులో భాగస్వామ్యం కల్పించాలన్నది రష్యా డిమాండ్. అదే సమయంలో చైనాకు రష్యా సన్నిహితం కావటం, పాకిస్తాన్‌తో సైతం మైత్రి నెరపటం మన దేశాన్ని ఇబ్బందిపెట్టే అంశాలు. ఇక ఇటీవలిఅంతర్జాతీయ పరిణామాల్లో ఇరు దేశాలూ ఉత్తర దక్షిణ ధ్రువాలుగా వున్నాయి. దౌత్య సంబంధాలుఎంతో సున్నితమైనవి. ఒక దేశంతో మనకు ఏర్పడే చెలిమి అంతవరకూ మనతో మిత్రత్వం నెరపుతున్న మరో దేశానికి సమస్యగా అనిపించవచ్చు. అనుమానాలు తలెత్తవచ్చు. ఆ రెండు దేశాలమధ్యా వుండే పొరపొచ్చాలే అందుకు కారణం. 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న ఆరోపణలు వచ్చినప్పటినుంచీ రష్యా–అమెరికా సంబంధాల్లో సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాతకాలంలో క్రిమియాను రష్యా దురాక్రమించాక అమెరికా మరింత ఆగ్రహించింది. ఆ దేశంతో ఎవరూ సన్నిహితంగా వుండరాదని కోరుకుంది. ఇక ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటినుంచీ రష్యాపై అనేక ఆంక్షలు విధించి, పాశ్చాత్య దేశాలను కూడగట్టింది. మన దేశంపై కూడా ఒత్తిళ్లు తెస్తూనేవుంది. అయినా ద్వైపాక్షిక వాణిజ్యం 1,200 కోట్ల డాలర్ల నుంచి నిరుడు 5,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా యూరొప్ దేశాలకు ముడి చమురు అమ్మకం ఆగిపోయిన పర్యవసానంగా మన దేశానికి రష్యా చవగ్గా చమురు విక్రయించటంతో ఈ వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. మున్ముందు ఇది మరింత పెరుగుతుందని జైశంకర్ చెబు తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధాన్ని మన దేశం వ్యతిరేకించినా బాహాటంగా రష్యాను విమర్శించలేదు. మన జాతీయ భద్రతా వ్యూహంలో రష్యా పాత్ర అత్యంత కీలకం. మొదటినుంచీ మన రక్షణ కొనుగోళ్లలో రష్యా వాటా అధికం. ఇప్పటికీ ఆయుధాల మరమ్మత్తు బాధ్యత రష్యాదే. ఇటీవలి కాలంలో అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచి కొనుగోళ్లు పెరిగాయి. తన సలహాను బేఖాతరు చేసి రష్యానుంచి అత్యాధునిక ఎస్–400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయటం అమె రికాకు నచ్చలేదు. ఇలా ఎన్ని ఒత్తిళ్లున్నా రెండు దేశాల బంధం సడలలేదు. జైశంకర్ తాజా పర్యటనలో తమిళనాడులోని కూదంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు రష్యా మరింత సాంకేతిక సహకారం అందించే ఒప్పందంపై సంతకాలయ్యాయి. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో రెండు యూనిట్లు ఇప్పటికే పనిచేస్తుండగా మరో నాలుగు మొదలుకావాల్సివుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టు వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించాల్సి వుంది. ఇదిగాక ఔషధాలు, వైద్య పరికరాలు వగైరాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. యూరేషియన్ ఎకనామిక్ జోన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభించాలన్న రష్యా ప్రతిపాదనకు భారత్ అంగీకరించింది. సాధారణంగా వేరే దేశాల మంత్రులు పర్యటించినప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ వారిని కలిసే సంప్రదాయం లేదు. కానీ దాన్ని పక్కనబెట్టి ఆయన జైశంకర్‌తో సమావేశం కావటం, తమ దేశంలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పంపటం భారత్‌తో బంధానికి పుతిన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియబరుస్తోంది. అయితే సమస్యలున్నాయి. ముడి చమురు కొనుగోళ్లకు మన దేశం రూపాయల్లో చెల్లింపులు మొదలు పెట్టినా, దాని అస్థిరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామనీ, అందుకోసం అదనంగా చెల్లించాలనీ రష్యా చమురు సంస్థలు కోరుతున్నాయి. అదింకా పరిష్కారం కావలిసేవుంది. దౌత్యం ఎంతో క్లిష్టమైనది. అవతలి పక్షంనుంచి కావలసినవి రాబట్టుకోవటం, అదే సమయంలో వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవటం కొన్ని సందర్భాల్లో తప్పనిసరి. కల్లోల సమయాల్లో మరింత చాకచక్యం తప్పనిసరి. వాస్తవానికి భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశాలకు ఇరు దేశాల అధినేతలూ హాజరు కావలసివుంది. 2000 సంవత్సరం నుంచి ఈ సంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనా కారణంగా 2020లో అసలు సమావేశమే జరగలేదు. ఉక్రెయిన్ యుద్ధంతోరెండేళ్లుగా మోదీ శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లలేదు. అయినా సరే ఈసారి కూడా జైశంకరే వెళ్లక తప్పలేదు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. రష్యాకు ఒకప్పుడు మనం జూనియర్ భాగస్వామిగా వుండేవాళ్లం. ఉదాహరణకు 1991 నాటికి రష్యా జీడీపీ 51.80 కోట్ల డాలర్లు కాగా, మన జీడీపీ 27 కోట్ల డాలర్లు. ఇప్పుడు రష్యా జీడీపీ 2 లక్షల 20 వేల కోట్ల డాలర్లయితే, మన జీడీపీ మొత్తం విలువ 3 లక్షల 60 వేల కోట్ల డాలర్లు. అయినా ఇరు దేశాల సంబంధాలూ యధాతథంగా వున్నాయి. పరస్పర విశ్వాసం ప్రాతిపదికగా ఏర్పడే చెలిమి ఎప్పటికీ చెక్కుచెదరదు. ఎన్నో అవాంతరాలనూ, కాలపరీక్షలనూ తట్టుకుని నిలబడిన భారత్–రష్యా సంబంధాలు మున్ముందు సైతం ఇదే రీతిలో కొనసాగుతాయని ఆశించాలి. -
అరబ్ దేశాల పర్యటనలో గురుదేవ్..కాప్ 28 సదస్సులో ప్రసంగించనున్న శ్రీ శ్రీ రవిశంకర్
ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, ఆధ్యాత్మికవేత్త గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ తన వారం రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎమిరేట్స్ నాయకత్వంతో వ్యూహాత్మక సంభాషణలు సహా, వాతావరణ మార్పులపై చర్చించే కాప్ 28 సదస్సులో ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొంటున్నారు. శాంతి స్థాపన, సంక్షోభ నివారణ, సమస్యల పరిష్కారం, పేదరిక నిర్మూలన, పర్యావరణ పరిక్షణ తదితర అంశాలలో శ్రీశ్రీ రవిశంకర్ గణనీయమైన పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. పర్యటనలో భాగంగా శ్రీశ్రీ మొదటగా ఫుజైరా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడైన గౌ. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీతో అతని రాజ నివాసంలో సమావేశమై, ధర్మబద్ధమైన మానవ విలువల్ని పెంపొందించటం, శాంతియుత సహజీవనపు ఆవశ్యకత సహా విస్తృతమైన అంశాలపై చర్చించారు. భారతదేశంలోని 70 నదులు ఉపనదుల పునరుద్ధరణ, పునరుజ్జీవనానికి, 36 దేశాల్లో 8 కోట్ల 12 లక్షల చెట్లను నాటేందుకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా, అలాగే 22 లక్షల రైతులను స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సహజ వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేసిన వ్యక్తిగా, గురుదేవ్ తన అభిప్రాయాలను కాప్ 28 సమావేశాలలో పంచుకోనున్నారు. ధార్మిక విశ్వాసాలను పాటించే సమాజాలను భూ పరిరక్షణకు ఎలా సమీకరించాలనే అంశంపై శ్రీశ్రీ ప్రసంగించనున్నారు. బ్రహ్మ కుమారీస్కు చెందిన మోరీన్ గుడ్మాన్ వరల్డ్ విజన్ ఇంటర్నేషనల్‌కు చెందిన యుకికో యమదా మోరోవిక్ వంటి ఇతర ధార్మిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేగాక ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించి కీలకోపన్యాసం చేయనున్నారు. పర్యావరణ హితమైన సుస్థిరమైన జీవనశైలిని పెంపొందించేందుకు మానవ కార్యకలాపాలకు పర్యావరణానికి మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు మొదటగా మనలో రావలసిన అంతర్గత పరివర్తన యొక్క ప్రాముఖ్యతను, అంతర్గత పరివర్తనకు మార్గాలను శ్రీశ్రీ వివరిస్తారు. అనంతరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వార్షిక అంతర్జాతీయ సదస్సులో ఎమిరేట్స్ దేశపు సహన, పరస్పర సహజీవన శాఖా మంత్రి గౌ. షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, ఇతర ప్రముఖులతో కలసి గురుదేవ్ గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. కాప్28 పర్యావరణ సదస్సులో భాగంగా ఏర్పాటు చేయబడ్డ అనేక కార్యక్రమాలలో భాగంగా, గురుదేవ్ డిసెంబర్ 6న కొలంబియన్ పెవిలియన్‌లో ప్రధానోపన్యాసం చేయనున్నారు. కొలంబియా ప్రభుత్వం, ఫార్క్ వేర్పాటువాదుల మధ్య 52 సంవత్సరాలపాటు కొనసాగిన వివాదానికి ముగింపు పలికేందుకు, దౌత్యం, చర్చల ద్వారా ఏకాభిప్రాయ నిర్మాణానికి 2015 సంవత్సరంలో జరిపిన చర్చలను, వాటి ఫలితాన్ని, సభ్యులతో శ్రీశ్రీ పంచుకోనున్నారు. మానవత్వానికి, ప్రేమకు, ఏకాభిప్రాయ సాధనకు ప్రాధాన్యమిచ్చే గురుదేవ్ విధానాలు సంఘర్షణలతో అతలాకుతలమౌతున్న ప్రజలకు ఆశారేఖలుగా దారిచూపుతాయనడంలో సందేహం లేదు. ప్రపంచ శాంతి, సామరస్యం కావాలంటే మొదటగా వ్యక్తిగతమైన ప్రశాంతత కావాలని గురుదేవ్ అంటారు. అందుకు అనుగుణంగా ఈ ఆరు రోజల అరబ్బుదేశాల పర్యటనలో చివరగా గురుదేవ్ దుబాయ్ లోని అల్ నాసర్ క్లబ్ - అల్ మక్టూమ్ స్టేడియంలో 15 వేల మందికి పైగా ప్రజలతో ధ్యానం చేయించనున్నారు. అరబ్బు దేశాలలో అభివృద్ధికి కృషిచేసిన వ్యాపారవేత్తలను, సంఘ సేవకులను, సన్మానిస్తున్న ఈ కార్యక్రమానికి రిజర్వు చేసిన టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయినట్లు నిర్వాహకులు ప్రకటించారు. (చదవండి: ప్రధాని జస్టిన్ ట్రూడో కఠిన నిర్ణయం.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!) -
డల్లాస్ లో SVES కాలేజీల పూర్వ విద్యార్థుల సమ్మేళనం
-
మెగా మెడిటేషన్ సమ్మిట్ 2023
-
భారత్‌లో ఐసీసీసీ సదస్సు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆన్ ద కెమిస్ట్రీ ఆఫ్ సిమెంట్ (ఐసీసీసీ) సదస్సుకు భారత్ వేదిక కానుంది. 2027లో న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఐసీసీసీకి ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ, స్విట్జర్లాండ్ సైతం పోటీపడ్డాయి. దిగ్గజాలు, విద్యావేత్తలు, నిపుణులు ఈ రంగంలో పరిశోధన పురోగతిపై సదస్సులో చర్చిస్తారు. 1918 నుండి సాధారణంగా 4–6 ఏళ్ల వ్యవధిలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. 16వ ఐసీసీసీ సెపె్టంబర్ 18–22 మధ్య బ్యాంకాక్‌లో జరుగుతోంది. -
ద్రవ్యోల్బణంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
బీ20 సమ్మిట్ ఇండియా 2023లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. భారతదేశ మొదటి త్రైమాసికం బాగానే ఉందని, Q1 GDP సంఖ్యలు కూడా బాగుండాలని అన్నారు. గత తొమ్మిదేళ్లలో భారత్ ఆర్థిక సంస్కరణల వేగవంతమైన వేగాన్ని ప్రదర్శించిందని కూడా వెల్లడించారు. కూరగాయల ధరలు పెరగడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ఇండియన్ క్యూ1 జిడిపి గణాంకాలు ఈ నెలాఖరున విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 15 నెలల గరిష్ఠ స్థాయి 7.44 శాతానికి ఎగబాకింది. దీనికి ప్రధాన కారణం టమోటాలు, ఇతర కూరగాయల ధరల పెరుగుదల అని తెలుస్తోంది. అయితే, ఆర్థిక పునరుద్ధరణకు గణనీయమైన సమయంతో పాటు వడ్డీ రేట్లు పెరగవచ్చని ఆమె అన్నారు. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడంపై దృష్టి సారించామని, అయితే అవసరమైన దిగుమతులు ఆగవని సీతారామన్ అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ), విదేశీ మూలధన ప్రవాహాలు వృద్ధికి కీలకమని కూడా ఆమె అన్నారు. ఆర్బిఐ తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఇటీవలే ప్రకటించింది. ఇందులో వడ్డీ రేటు - రెపో రేటు వరుసగా మూడోసారి యథాతథంగా ఉంచింది. -
బ్రిక్స్‌లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్‌గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. బ్రిక్స్‌లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్‌ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్‌లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్‌కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్‌కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్‌పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో గురువారం జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్‌లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
24న స్టార్టప్‌ల ‘డీ2సీ అన్లాక్డ్’ సమావేశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మర్చంట్ ఫస్ట్ చెకవుట్ నెట్వర్క్ సంస్థ సింపుల్, టీ–హబ్ సంయుక్తంగా జూన్ 24న హైదరాబాద్‌లో కమ్యూనిటీ ఆధారిత స్టార్టప్ వ్యవస్థాపకుల సమావేశం డీ2సీ అన్లాక్డ్ను నిర్వహించనున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా తొమ్మిది ఎడిషన్లు నిర్వహించగా ఇది పదోది. ఇందులో డీ2సీ సంస్థల వ్యవస్థాపకులు.. బ్రాండ్లకు గుర్తింపు, డిజిటల్ మార్కెటింగ్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి, సింపుల్ సహ వ్యవస్థాపకులు నిత్యా శర్మతో పాటు హైదరాబాదీ బ్రాండ్లయిన స్కిపీ ఐసాపాప్స్ సహ వ్యవస్థాపకులు రవి కాబ్రా, గేర్ హెడ్ మోటర్స్ వ్యవస్థాపకుడు నిఖిల్ గుండా, పిప్స్ సీఈవో ప్రశాంత్ గౌరిరాజు తదితరు పాల్గొంటారు. డీ2సీ బ్రాండ్లను నిర్మించడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి పరిశ్రమలోని తోటి వారితో సమావేశమయ్యేందుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉండగలదని నిత్యా శర్మ తెలిపారు. -
హైదరాబాద్: మాదాపూర్ లో వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ సదస్సు
-
జీ20 సమ్మిట్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (ఫొటోలు)
-
FIPIC summit: భారత్ విశ్వసనీయ భాగస్వామి
పోర్ట్ మోరిస్‌బై: ఆపదలోఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నవారు క్లిష్ట సమయంలో ఆదుకోకపోవడం నిజంగా దారుణమని అన్నారు. తద్వారా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా వ్యవహార శైలిని తప్పుపట్టారు. పపువా న్యూ గినియా రాజధాని పోర్ట్ మోరిస్‌బైలో సోమవారం ఫోరమ్ ఫర్ ఇండియా–పసిఫిక్ ఐలాండ్స్ కో–ఆపరేషన్(ఎఫ్ఐపీఐసీ) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు. 14 పసిఫిక్ ద్వీప దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పసిఫిక్ ద్వీప దేశాలకు భారత్ అండగా నిలుస్తోందని మోదీ గుర్తుచేశారు. భారత్‌ను విశ్వసనీయ అభివృద్ధి భాగస్వామిగా పరిగణించవచ్చని ఆయా దేశాలకు సూచించారు. తమ శక్తి సామర్థ్యాలను, అనుభవాలను పసిఫిక్ ద్వీప దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రతి మార్గంలోనూ తోడుగా ఉంటామని మోదీ వివరించారు. తమ దృష్టిలో ఈ దేశాలు చిన్న దేశాలు ఎంతమాత్రం కావని, భారీ సముద్ర దేశాలుగా వాటిని పరిగణిస్తున్నామని మోదీ చెప్పారు. మూడు దేశాల అధినేతలతో భేటీ మోదీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిష్ హిప్కిన్స్, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ అధ్యక్షుడు సురాంగెల్ ఎస్.విప్స్ జూనియర్, పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపేతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, విద్య, క్రీడలు, సాంకేతికత, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. హిప్కిన్స్తో భేటీ అద్భుతంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. పాలౌ ప్రజలు వాడే ఎబాకిల్ పరికరాన్ని మోదీకి సురాంగెల్ బహూకరించారు. ఆస్ట్రేలియాతో సుదృఢ బంధం న్యూఢిల్లీ: ‘‘నేనంత త్వరగా తృప్తిపడే రకం కాదు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్ కూడా అంతే. ఇద్దరమూ కలిసి ఆస్ట్రేలియా, భారత బంధాలను మరింత దృఢతరం చేసి తీరతాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సిడ్నీలో ‘ద ఆస్ట్రేలియన్’ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం, సముద్ర తీర భద్రత, పైరసీ దాకా ఇండో–పసిఫిక్ ప్రాంతం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందంటూ ఆందోళన వెలిబుచ్చారు. విందులో భారతీయ రుచులు ఎఫ్ఐపీఐసీ శిఖరాగ్రం సందర్భంగా ఫసిíఫిక్ ద్వీప దేశాల అధినేతలకు సోమవారం మధ్యాహ్నం మోదీ ఇచ్చిన విందులో భారతీయ వంటకాలు, ముఖ్యంగా తృణధాన్యాల వెరైటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిథులు తృణధాన్యాల విశిష్టితను అడిగి తెలుసుకున్నారు. ఖాండ్వీ, వెజిటెబుల్ సూప్, మలై కోఫ్తా, రాజస్తానీ రాగి గట్టా కర్రీ, దాల్ పంచ్మెల్, మిలెట్ బిర్యానీ, నాన్ ఫుల్కా, మసాలా చాస్, పాన్ కుల్ఫీ, మాల్పువా, మసాలా టీ, గ్రీన్ టీ, మింట్ టీ, పీఎన్జీ కాఫీ తదితరాలను రుచిచూసి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు. మోదీకి రెండు అత్యున్నత పౌర పురస్కారాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యున్నత గౌరవం లభించింది. పసిఫిక్ సముద్ర ద్వీప దేశాలైన పపువా న్యూ గినియా, ఫిజి తమ అత్యున్నత పురస్కారాలను ఆయనకు ప్రదానం చేశాయి. ఆయా దేశాలు మరో దేశ ప్రధానిని ఇలాంటి పురస్కారాలతో గౌరవించడం అరుదైన సంఘటన కావడం విశేషం. సొమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ డొడాయి ప్రధాని మోదీకి ‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు(జీసీఎల్)’ పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత్‌లో భారతరత్న తరహాలో పపువా న్యూగినియాలో ఇదే అత్యున్నత పౌర పురస్కారం. పసిఫిక్ ద్వీప దేశాల ఐక్యతకు చేసిన కృషికి గాను మోదీకి ఈ పురస్కారం అందించినట్లు పపువా న్యూ గినియా ప్రభుత్వం వెల్లడించింది. జీసీఎల్ పురస్కారం పొందిన వారిని ‘చీఫ్’ అనే టైటిల్‌తో సంబోధిస్తారు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు ఈ అవార్డు లభించింది. ఫిజి ప్రధానమంత్రి సితివేణి రాబుకా భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ని ప్రదానం చేశారు. మోదీ గ్లోబల్ లీడర్‌షిప్‌నకు గుర్తింపుగా ఫిజి ప్రభుత్వం ఈ పురస్కారం అందజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలియజేసింది. ఇది భారత్‌కు లభించిన అరుదైన గౌరవమని వివరించింది. ఈ గౌరవాన్ని మోదీ భారతదేశ ప్రజలకు, ఫిజి–ఇండియన్ సమాజానికి అంకితం చేశారని పేర్కొంది. దేశ ప్రజలు సాధించిన విజయాలకు గుర్తింపు ‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లొగోహు’, ‘కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజి’ గౌరవాలు తనకు దక్కడం పట్ల ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. పపువా న్యూగినియా, ఫిజి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పురస్కారాలు భారత్‌కు, భారతదేశ ప్రజలు సాధించిన విజయాలకు ఒక గొప్ప గుర్తింపు అంటూ ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా, అఫ్గానిస్తాన్, పాలస్తీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, మాల్దీవ్స్, బహ్రెయిన్ తదితర దేశాలు గతంలో తమ అత్యున్నత పౌర పురస్కారాలతో ప్రధాని మోదీని సత్కరించాయి. -
ఆచి తూచి వ్యవహరించాలి
యుద్ధోన్మాదం పర్యవసానంగా మనిషి మృగంగా మారితే ఏమవుతుందో ప్రపంచానికి ఇప్పటికీ చాటుతూనే ఉన్న హిరోషిమా నగరంలో శుక్రవారం మూడురోజులపాటు జరిగే జీ–7 దేశాల శిఖ రాగ్ర సదస్సు ప్రారంభమైంది. 15 నెలలుగా ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సహజంగానే ఈ సదస్సులో అది ప్రధానంగా చర్చకొస్తుంది. ఉక్రెయిన్‌లో రష్యా ‘వ్యూహాత్మక ఓటమి’కి అందరూ ఏకం కావాలంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి. ఉక్రెయిన్‌కు ఆయు ధాలందిస్తూ రష్యా యుద్ధ వ్యూహాలను వమ్ముచేస్తున్నాయి. అయితే అదొక్కటే సరిపోదు. జీ–7 సమావేశాల వేదిక హిరోషిమా గనుక ఆ దేశాధినేతలందరూ చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా ఆలో చించి ఈ యుద్ధాన్ని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై దృష్టి సారించాలి. గెలుపోటముల సంగతలావుంచి ఇది అణుయుద్ధంగా పరిణమించకుండా ఏంచేయాలో ఆలోచించాలి. ఎందుకంటే హిరోషిమా, నాగసాకి పట్టణాలపై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 9న అమెరికా అణుబాంబులు ప్రయోగించటం పర్యవసానంగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆనాటి విషాద ఉదంతాల్లో రెండు లక్షలమందికిపైగా మృత్యువాత పడ్డారు. అనంతర దశాబ్దాల్లో మరిన్ని లక్షలమంది దీర్ఘకాల వ్యాధుల బారినపడి చనిపోయారు. బాంబు జారవిడిచిన ప్రాంతానికి చుట్టూవున్న 11 చదరపు కిలోమీటర్ల పరిధిలో కనీవినీ ఎరుగని విధ్వంసం చోటు చేసుకుంది. తరాలు గడుస్తున్నా ఇప్పటికీ అంగవైకల్యంతో జన్మిస్తున్నవారు అక్కడ ఎక్కువే. ఈ శిఖరాగ్ర సదస్సు అణు నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చర్యలపై దృష్టి సారిస్తుందంటున్నారు. అయితే అణ్వస్త్ర దేశాలన్నీ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను స్వచ్ఛందంగా వదులు కోవడానికి ముందుకు రానంతవరకూ ఈ లక్ష్యాలు నెరవేరవు. ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని తరచు పుతిన్ బెదిరిస్తున్నారు. ఉత్తరకొరియా అణు క్షిపణులను అభివృద్ధి చేస్తున్నానంటున్నది. ఈ పరిణామాలు ఆందోళనకరమైనవే. కాదనలేం. అయితే తమ దగ్గర తప్ప వేరే ఎవరివద్దా అణ్వస్త్రాలు ఉండరాదన్న వాదంతో ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనటం సాధ్యంకాదు. అసలు ఎవరిదగ్గరైనా మానవాళిని సర్వనాశనం చేసే ఆయుధాలు ఎందుకుండాలన్న ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి. అమెరికా అణు ఛత్రఛాయలో కొనసాగుతున్న జపాన్ అణునిరా యుధీకరణ గురించి మాట్లాడటంపై విమర్శలు తలెత్తటంలో వింతేమీ లేదు. జీ–7 సభ్యదేశాల ముందు పెద్ద ఎజెండాయే ఉంది. తైవాన్‌కు చైనా నుంచి వస్తున్న బెదిరింపులు, గతంలో పాశ్చాత్య దేశాలకు వలసలుగా ఉండి స్వాతంత్య్రం పొంది ఇప్పుడు రష్యా, చైనా లకు సన్నిహితమవుతున్న పేద దేశాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం ఇందులో చర్చకు రాబోతున్నాయి. ఆర్థిక స్థితిగతులు సరేసరి. అరబ్ దేశాల వైఖరితో తలెత్తిన చమురు సంక్షోభం, దాన్ని వెన్నంటి వచ్చిన ఆర్థిక మాంద్యంతో నిలువెల్లా వణికిన పాశ్చాత్య దేశాలు 1975లో ఒక్కటై జీ–6గా ఏర్పడ్డాయి. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్‌లతోపాటు అమెరికా చేరింది. ఆ మరుసటి ఏడాది కెనడా చేరికతో అది జీ–7 అయింది. చిత్రమేమంటే...అప్పటికి ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో యాభై శాతం వాటావున్న ఈ దేశాలకు ఇప్పుడు 30 శాతం మించిలేదు. చైనా, భారత్, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థలు చురుకందుకున్నాయి. రష్యా, చైనాలవైపు మొగ్గుతున్న పేద దేశా లకు ఆరోగ్యం, ఆహారభద్రత, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో తోడ్పాటునందిస్తూ వాటిని అక్కున చేర్చుకోవాలని జీ–7 దేశాలు భావిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఓఈసీడీ తదితర సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు గనుక ఆ దిశగా విధాననిర్ణయాలుండొచ్చు. ఇక రష్యా చమురుపై విధించిన ఆంక్షల అమలుపై ఇందులో చర్చిస్తారంటున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారంలో కూడా రష్యాను కట్టడి చేయటంపై జీ–7 దృష్టి సారించబోతోంది. ఇది నేరుగా భారత్‌నూ, ప్రత్యేకించి గుజరాత్లో అధికంగా ఉన్న వజ్రాల పరిశ్రమనూ ప్రభావితం చేస్తుంది. ప్రపంచ వజ్రాల వ్యాపారంలో 40 శాతం వాటా ఉన్న రష్యా, గుజరాత్‌లోని సూరత్ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమపై ప్రధానంగా ఆధారపడుతుంది. రష్యాపై విధిస్తున్న ఆంక్షలవల్ల ఆ దేశం ఒక్కటే కాదు... ముడి చమురు, వజ్రాలు తదితర ఉత్పత్తులపై ఆధారపడుతున్న భారత్‌వంటి దేశా లకు సైతం ఇబ్బందులు తలెత్తుతాయి. జీ–7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో మన వైఖరిని స్పష్టంగా తెలియజేయటం అవసరం. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి మూడు దశాబ్దాలవుతోంది. ఇన్నేళ్లుగా ప్రపంచ దేశాల మధ్య పర స్పర విశ్వాసం వల్ల అయితేనేమి, ఎవరూ తొలుత అణ్వాయుధాలు వినియోగించరాదన్న నియమం పెట్టుకోవటం వల్ల అయితేనేమి ప్రమాదం లేకుండా పోయింది. అయితే ఆ దశ ముగిసి పరస్పరం హెచ్చరికలు, సవాళ్ల పర్వం మొదలైంది. యుద్ధం సంప్రదాయ ఆయుధాల పరిధిలోనే పరిభ్రమిస్తుందనుకోవటం ఆత్మవంచనే అవుతుంది. కనుక జీ–7 దేశాలు అత్యంత జాగురూకతతో ఈ అంశాన్ని పరిశీలించాలి. ఉక్రెయిన్‌కు ఆయుధాలందజేస్తూ పోవటం, ఆంక్షలు అమలు చేయటంవల్ల రష్యా లొంగుబాటులోకొస్తుందా, అది మరింత రెచ్చిపోయి ఉన్మాద స్థితికి చేరుతుందా అన్నది గమనించు కోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ యుద్ధాన్ని ఆపటమే ధ్యేయంగా తదుపరి చర్యలుండాలి. -
టెక్నాలజీతో సాధికారత
హైదరాబాద్:సర్వత్రా టెక్నాలజీ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు వృద్ధి కోసం సాంకేతికతపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎస్‌హెచ్‌ఆర్‌ఎం ఇండియా సీఈవో అచల్ ఖన్నా తెలిపారు. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) పనిప్రదేశాల్లో కూడా టెక్నాలజీ వినియోగాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మార్పునకు కారకులయ్యేలా టెక్నాలజీతో ప్రజలకు సాధికారత లభించగలదని వివరించారు. ఎస్‌హెచ్‌ఆర్‌ఎంఐ టెక్23 కాన్ఫరెన్స్, ఎక్స్పో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. (బీర్‌తో నడిచే బైక్: మతిపోయే స్పీడ్, కావాలంటే వీడియో చూడండి!) సదస్సు రెండో రోజున హెచ్ఆర్ సిస్టమ్స్ బ్లూప్రింట్ పేరిట రూపొందించిన రిపోర్టును ఆవిష్కరించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో 120 మంది పైగా వక్తలు, 4,000 మంది పైచిలుకు హెచ్ఆర్ నిపుణులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి భారత్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో ప్రతికూలతలు ఉన్నా, వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రజాస్వామ్యంతో సత్ఫలితాలు లభిస్తాయనడానికిదే నిదర్శనం’’ అన్నారు. గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’లో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దేశ ప్రజల సమ్మిళిత ప్రయత్నాలే తగిన బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. పాలకులను ప్రజలంతా కలిసి ఎన్నుకొనే ఆలోచన ప్రపంచ దేశాల కంటే చాలా ఏళ్ల ముందే భారత్‌లో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. ప్రజల ప్రథమ విధి పాలకులను ఎన్నుకోవడమేనని మహాభారతంలో ఉందని తెలిపారు. ప్రాచీన భారతదేశంలో ఎన్నో గణతంత్ర రాజ్యాలుండేవని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయని వివరించారు. ‘‘గణతంత్ర రాజ్యాల్లో పాలనాధికారం వారసత్వంగా దక్కేది కాదు. పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు’’ అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక నిర్మాణం కాదని, అదొక స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’కు అమెరికా, కోస్టారికా, జాంబియా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా దేశాల అధినేతలు ఆతిథ్యం ఇస్తున్నారు. -
‘సీఎం కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు’
సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. -
విశాఖలో త్వరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: మంత్రి అప్పలరాజు
-
విశాఖలో గ్లోబల్ టెక్ సమ్మిట్
-
బెంగళూరులో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రోడ్ షో
-
విశాఖ: దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో దక్షిణ భారతదేశ వీసీల సదస్సు ప్రారంభం అయ్యింది. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సదస్సును ప్రారంభించారు. సదస్సుకు ఏడు రాష్ట్రాల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు. రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ట్రాన్స్ఫర్ మెటీవ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై జరగనుంది ఈ సదస్సు. మరోవైపు ఈ సదస్సుకు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతుండడం విశేషం. -
‘ఐటీ’ కెరటం విశాఖపట్నం
సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ సంస్థలను రప్పించేందుకు విశాఖలో శుక్రవారం ప్రారంభమైన ఇన్ఫినిటీ వైజాగ్ సమ్మిట్ 2023 సదస్సు తొలిరోజు విజయవంతమైంది. ఐటీ, ఐటీ అధారిత రంగాలకు ఉన్న అపార అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించడంలో అధికారులు, ఐటీ అసోసియేషన్ ప్రతినిధులు సఫలీకృతమయ్యారు. హోటల్ మారియట్‌లో ఇన్ఫినిటీ వైజాగ్ సమ్మిట్‌ను కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అల్కేష్‌కుమార్‌శర్మ, ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్‌కుమార్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, సెయింట్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, ఐటాప్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ కొసరాజు, ఎంపీ జీవీఎల్ నరసింహరావు సంయుక్తంగా ప్రారంభించారు. తొలి రోజు మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సెయింట్, బాష్, టెక్ మహింద్రా, సైబర్ సెక్యూరిటీ, ఐశాట్ తదితర 60 సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. 12 సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు ఎలాంటి సాయం అవసరమైనా కేంద్రం ముందుంటుందని, విస్తరణ దిశగా అడుగులు వేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. ఐటీ కొత్త డెస్టినేషన్ విశాఖ స్టార్టప్‌లు, డీప్‌టెక్‌కు అపార భవిష్యత్తు ఉంది. సరికొత్త ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా విశాఖ సరికొత్త ఐటీ డెస్టినేషన్‌గా ఆవిర్భవిస్తోంది. ఇక్కడ పెద్ద ఎత్తున నిపుణులతోపాటు అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉంది. రాబోయే సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు 20 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల్లో భారత్ ప్రపంచంలో మూడు లేదా నాలుగో స్థానంలో ఉంటుందని భావిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఐటీ, ఐటీఈఎస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆన్లైన్ సొల్యూషన్స్ తదితర రంగాల నుంచి 1 ట్రిలియన్ డాలర్లు రాబట్టగలమని కేంద్రం అంచనా వేస్తోంది. – అల్కేష్‌కుమార్ శర్మ, కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి పెట్టుబడులకు అదే ప్రధాన మార్గం.. అమెరికాలో 638 యూనికార్న్ కంపెనీలు ఉండగా 80 శాతం కంపెనీలకు వ్యవస్థాపకులు, సీనియర్ ప్రతినిధులు, ఛైర్మన్లుగా వలసదారులే ఉన్నారు. నైపుణ్యాలను గుర్తించి మౌలిక వసతులు, వనరులను అమెరికా కల్పిస్తోంది. పెట్టుబడులకు అదే ప్రధాన మార్గం. ప్రతి పరిశ్రమ టెక్నాలజీపైనే ఆధారపడి నడుస్తోంది. వినియోగదారులు సైతం టెక్నాలజీని ఆకళింపు చేసుకుంటున్నారనడానికి వాట్సాప్ ఒక ఉదాహరణ. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్ సిస్టమ్స్, సుస్థిరతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. – బీవీఆర్ మోహన్‌రెడ్డి, సెయింట్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ విశాఖకు అపార అవకాశాలు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖకు అపార అవకాశాలున్నాయి. విశాఖ డైనమిక్ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే ఐటీ రంగం మొత్తం విశాఖ వైపు పరుగులు తీస్తుంది. చైనా, జపాన్ పోటీని తట్టుకోవాలంటే వైజాగ్ లాంటి నగరాలను ఎంపిక చేసుకోవాల్సిందే. – అరవింద్‌కుమార్, ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ విశాఖ వైపు బీపీవోలు.. దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా విశాఖ వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లే సాధ్యమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ ఎగుమతులు సుమారు రూ.5 నుంచి రూ.6 వేల కోట్లు జరుగుతున్నాయి. ఇవి గణనీయంగా పెరగనున్నాయి. – శ్రీధర్ కొసరాజు, ఐటాప్ రాష్ట్ర అధ్యక్షుడు 20 సంస్థలకు ఎస్టీపీఐ అవార్డులు ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో దూసుకెళ్తున్న పలు సంస్థలకు ఎస్టీపీఐ అవార్డులను అందచేసింది. వివిధ విభాగాల్లో 20 సంస్థలకు సదస్సు సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. టాప్ ఐటీ, ఐటీఏపీ ఎక్స్‌పోర్టర్స్ స్టేట్ ఆఫ్ ఏపీ అవార్డును చెగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. -
ఐటీ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇన్ఫినిటీ వైజాగ్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంతోపాటు పలు ఐటీ కంపెనీలను ఆకర్షించే విధంగా రెండురోజుల ‘ఇన్ఫినిటీ వైజాగ్’ సదస్సు శుక్రవారం ప్రారంభం కానుంది. ఐటీ పెట్టుబడుల ప్రధాన ఆకర్షణగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫినిటీ వైజాగ్ పేరుతో శుక్ర, శనివారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తోంది. ద్వితీయ శ్రేణి నగరాల వైపు ఐటీ సంస్థలు ఆసక్తి చూపిస్తున్న తరుణంలో వైజాగ్‌లో ఉన్న మెరుగైన అవకాశాల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ వర్చువల్‌గా ప్రారంభించే ఈ సదస్సులో రెండోరోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొంటారు. సైయంట్ ఫౌండర్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనే ఈ సదస్సుకు కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అఖిలేష్‌కుమార్ శర్మ, ఎస్టీపీఐ డైరెక్టర్ అరవింద్‌కుమార్, పలు ఐటీ కంపెనీల ప్రతినిధులు, యూనికార్న్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. బాస్, టెక్‌మహీంద్రా, మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సైబర్ సెక్యూరిటీ, ఐశాట్ మొదలైన 20కి పైగా ఐటీ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు సదస్సులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు అవకాశాలు, ప్రయోజనాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ కోసరాజు శ్రీధర్ తెలిపారు. ఐటీ సంస్థలకు 21 అవార్డులు అందిస్తున్న ఎస్టీపీఐ రాష్ట్రంలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తున్న ఐటీ కంపెనీలకు సదస్సు తొలిరోజు ఎస్టీపీఐ అవార్డులు ఇవ్వనుంది. ఐటీ రంగంలో అత్యుత్తుమ ఎగుమతులు నమోదు చేసిన కంపెనీ, అత్యధికమందికి ఉపాధి కల్పించిన కంపెనీ, అత్యధిక మహిళలకు ఉపాధి కల్పించిన సంస్థ, ఐటీ ఎమర్జింగ్ సిటీస్, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ వంటి 21 విభాగాల్లో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. సరికొత్త ఆవిష్కరణలు నమోదు చేసిన స్టార్టప్‌కు రూ.లక్ష నగదు పురస్కారంతోపాటు అవార్డు, మెమెంటో ఇవ్వనుంది. ఐటీలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు.. భవిష్యత్తులో ఐటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఏపీని నిలిపేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై రోడ్‌మ్యాప్ రూపొందించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ 3.0 ఆవిష్కరణలు, డీప్‌టెక్ డొమైన్.. తదితర రంగాల్లో రాష్ట్ర ఐటీ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. దానికనగుణంగా ఈ సదస్సులో కార్యక్రమాలను రూపొందించారు. బిజినెస్ టూ బిజినెస్ (బీటూబీ) నెట్వర్కింగ్ అవకాశాలు సృష్టిసూ మల్టీ నేషనల్ కంపెనీలతో నెట్వర్క్ చేసుకోవడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం మొదలైన అంశాలే ముఖ్య అజెండాగా సదస్సు నిర్వహిస్తున్నారు. తొలిరోజు శుక్రవారం ఐటీ, స్టార్టప్‌లపై దృష్టి సారించనున్నారు. రెండోరోజున ఐటీ ఆధారిత పరిశ్రమలు, బీపీవో కంపెనీలపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు పర్యావరణ భాగస్వాములుగా నాస్కామ్, టై ఏపీ చాప్టర్, ఏపీ ఛాంబర్స్, ఏపీ స్టార్టప్స్, ఏ–హబ్ వ్యవహరించనున్నాయి. వివిధ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు కలిపి మొత్తం 12 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. చదవండి: 'బంగారు' బాటలో.. చిప్పగిరిలో మొదలైన పుత్తడి వెలికితీత -
నూతన ఆవిష్కరణలకు వేదికగా గ్లోబల్ టెక్ సమిట్
హైదరాబాద్: వచ్చే నెల ఫిబ్రవరిలో వైజాగ్‌లో జరగబోయే గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023 .. నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలవగలదని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ హెడ్ (టెక్నాలజీ డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్) అనితా అగర్వాల్ చెప్పారు. ఐటీ, సైన్స్, టెక్నాలజీ, స్టార్టప్స్, వాణిజ్యం తదితర రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత మేధావులందరిని ఒక చోటికి చేర్చి, అర్థవంతమైన చర్చలకు తోడ్పడగలదని ఆమె తెలిపారు. 25 మంది ఇన్నోవేటర్ల ప్రతినిధి బృందంతో శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. అంకుర సంస్థలు, శాస్త్రవేత్తలు తదితరులు తమ మేథోశక్తిని ప్రదర్శించేందుకు గ్లోబల్ టెక్ సమిట్ కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 16–17 తేదీల్లో వైజాగ్‌లో నిర్వహించబోయే సదస్సులో పలు కీలక ప్రాజెక్టులను ప్రదర్శించనున్నట్లు గ్లోబల్ టెక్ సమిట్ 2023 లీడ్ ఆర్గనైజర్, పల్సస్ గ్రూప్ వ్యవస్థాపకుడు శ్రీనుబాబు గేదెల తెలిపారు. ఐఐటీ, సీఎస్ఐఆర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 20 మంది ఆవిష్కర్తల బృందం వీటిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సు సందర్భంగా దాదాపు రూ. 3,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులపై కుదిరే అవకాశాలు ఉన్నాయి. -
Andhra Pradesh: సామాన్యుడికి ఆధునిక వైద్యం
సాక్షి, విశాఖపట్నం: సామాన్యుల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం విశాఖలోని ఓ హోటల్లో మూడు రోజుల పాటు జరిగే భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వైద్యుల సంఘం (ఏఏపీఐ) నిర్వహించిన 16వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌కు ఆయన తన సందేశం పంపించారు. ఆ సందేశాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సదస్సులో చదివి వినిపించారు. వ్యాధుల నివారణ, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించామని, గ్రామ స్థాయిలో ఆరోగ్య పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ‘2,000 – 2,500 జనాభా ఉన్న ప్రతి గ్రామ సచివాలయానికి అనుబంధంగా డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ ఆరోగ్య క్లినిక్‌కు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, నలుగురు ఆశా వర్కర్లను నియమించాం. ఈ హెల్త్ క్లినిక్‌లో 67 రకాల మందులు, 14 డయాగ్నస్టిక్ కిట్లు, వీడియో కాలింగ్ సదుపాయం ఉన్న టెలి కన్సల్టేషన్లు ఉన్నాయి. రోజుకు సగటున 60 వేల టెలి కన్సల్టేషన్ కాల్స్‌తో పాటు జనాభాలో 72 శాతం మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లను రూపొందించడంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం. సరికొత్తగా అమలు చేసే ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాంలో ఓపీ, ప్రసవానంతర తనిఖీలు, స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్సలకు పీహెచ్సీ నుంచి ఒక వైద్యుడు నెలకు రెండుసార్లు ఆరోగ్య క్లినిక్‌ను సందర్శిస్తారు. తదుపరి చికిత్స అవసరమైన వారి ఇళ్లకు డాక్టర్ వెళ్లి మంచంపై ఉన్న రోగులను పరీక్షిస్తారు’ అని వివరించారు. ఆరోగ్య సంరక్షణకు అధిక నిధులు ‘ఆరోగ్య సంరక్షణకు కేంద్ర బడ్జెట్లో సగటున 4 శాతం కేటాయిస్తే, రాష్ట్ర బడ్జెట్లో 7.3 శాతం ఖర్చు చేయడం మాకు గర్వకారణంగా ఉంది. నాడు–నేడు కార్యక్రమంలో రూ.16,850 కోట్లతో డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సెకండరీ హెల్త్ ఇన్స్టిట్యూట్లో భారీ మౌలిక సదుపాయాలను కల్పించాం. ప్రభుత్వ రంగంలో 17 కొత్త వైద్య కళాశాలలను మంజూరు చేసి, కనీసం జిల్లాకో వైద్య కళాశాల ఉండేలా చూస్తున్నాం. స్పెష్టలిస్టులు, సూపర్ స్పెషలిస్టులతో అన్ని ఆరోగ్య సంస్థల్లో జీరో ఖాళీని ఒక విధానంగా తీసుకున్నాం. వీరితో సహా 47,191 మంది సిబ్బందిని నియమించాం. ఆరోగ్యశ్రీ కింద జనాభాలో 85 శాతం మందికి ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్య శ్రీ కింద ప్రైవేటు రంగంలోని 2,225 ఎంప్యానల్ ఆస్పత్రుల్లో 3,255 విధానాలను (వైద్య ప్రక్రియలు) అందుబాటులో ఉంచాం. ఇందుకోసం ఏటా రూ.3,300 కోట్లు వెచ్చిస్తున్నాం. రోగులు కోలుకునే వరకు ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 జీవనోపాధి భత్యాన్ని చెల్లిస్తున్నాం. ఇలా ఆరోగ్య అత్యవసర సమయంలో ప్రభుత్వం తమ వెనకే ఉందన్న భరోసా సామాన్యులకు కల్పిస్తున్నాం. ప్రపంచ స్థాయి ఆరోగ్య సౌకర్యాలు అందించే మా ప్రయత్నంలో వైద్యులూ పాలుపంచుకోవాలని కోరుతున్నాను. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ సదస్సు పరిష్కార మార్గాలను అన్వేషిస్తుందని ఆశిస్తున్నాను’ అని సీఎం పేర్కొన్నారు. సమ్మిట్‌ను ప్రారంభించిన మంత్రి రజని తొలుత గ్లోబల్ హెల్త్ సమ్మిట్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైద్య రంగంలో మెరుగైన నైపుణ్యాభివృద్ధికి ఈ సదస్సు ఎంతో దోహదం చేస్తుందన్నారు. శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా రోగులకు మెరుగైన సేవలందించేందుకు వీలవుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్య రంగంలో ఉత్తమ పాలసీలు అమలు చేస్తున్నారన్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైద్య సేవలకు ఎనిమిది జాతీయ, రెండు అంతర్జాతీయ అవార్డులు లభించాయని చెప్పారు. విశాఖ కలెక్టర్ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ఈ సమ్మిట్ మెడికల్ రంగంలో నూతన విధానాలకు, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సాయపడుతుందన్నారు. ఏఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ రవి కొల్లి మాట్లాడుతూ అమెరికా నుంచి 100 మంది, ప్రపంచం నలుమూలల నుంచి 350 మంది వైద్యులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని చెప్పారు. మానసిక ఆరోగ్యం అవగాహన, ఆత్మహత్యల నివారణ, మాతాశిశు మరణాలు, పోషకాహారం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్యాన్సర్ నివారణ, చికిత్స ప్రపంచ వ్యాప్తంగా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వైద్య విద్య సంస్కరణలæ గురించి కూడా ఈ సమ్మిట్‌లో చర్చిస్తామని వివరించారు. సదస్సులో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఏపీ సాక్స్ పీడీ జీఎస్ నవీన్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ జె.నివాస్, నేషనల్ హెల్త్ మిషన్ నుంచి అభిజత్ శేథ్, సమ్మిట్ చైర్మన్ టి.వి.రవిరాజు, సమ్మిట్ భారత్ చైర్మన్ ప్రసాద్ చలసాని, భారతీయ సంతతి అమెరికా వైద్యులు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. -
‘వైజాగ్ టెక్ సమ్మిట్ 2023’: భారీ పెట్టుబడులే లక్ష్యం
విశాఖపట్నం మరో ప్రపంచస్థాయి సదస్సుకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుసంధానంతో పల్సస్ గ్రూపు సీఈవో డా. గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 నిర్వహణకి సన్నాహాలు మొదలయ్యాయి. ``వైజాగ్ టెక్ సమ్మిట్ 2023``పేరుతో ఫిబ్రవరి 16, 17తేదీలలో నిర్వహించనున్న సమ్మిట్ కి గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు, మేధావులు హాజరు కానున్నారు. పల్సస్ గ్రూప్ సీఈవో శ్రీనుబాబు గేదెల ఇప్పటివరకూ 3,000లకు పైగా అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించిన అనుభవంతో వైజాగ్ టెక్ సమ్మిట్ బాధ్యతలు స్వీకరించారు. డిజిటల్, మెడికల్, టెక్ ఈవెంట్లను దిగ్విజయంగా నిర్వహించిన పల్సస్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో పల్సస్ గ్రూపు గ్లోబల్ నెట్వర్క్ ద్వారా వివిధ దేశాల నుంచి వచ్చిన సంస్థలు-మేధావులు జ్ఞానాన్ని పంచుకోవడానికి, తాజా అంశాలను చర్చించడానికి, ఫ్యూచర్ టెక్నాలజీని ప్రదర్శించడానికి వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 వేదిక కానుంది. వర్చువల్, ఫిజికల్ ఈవెంట్ వేదికల ద్వారా గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఇన్నోవేటర్లు పాల్గొంటారు. ఫిబ్రవరి 16, 17తేదీలలో రెండు రోజులపాటు 3 సెషన్లలో 25 మంది సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ ప్రసంగిస్తారు. మనదేశంతోపాటు వివిధ దేశాల నుంచి ఇప్పటికే కంపెనీలు స్థాపించి విజయవంతంగా నడుపుతున్న ప్రతినిధులు వెయ్యి మందికి పైగా హాజరు కానున్నారు. ఈ సమ్మిట్ టెక్ కంపెనీల వృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన మార్గాన్ని చూపేందుకు సమర్థవంతమైన వేదిక కానుంది. వైజాగ్ టెక్ సమ్మిట్‌ని ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్ టెక్నాలజీకి అనుసంధానం అయ్యే అవకాశం దక్కనుంది. పరిశ్రమ ప్రముఖులు, తయారీదారులు, కీలక నిర్ణయాధికారులతో ఫేస్ టైమ్ పొందవచ్చు. వినూత్నమైన సాంకేతికతలను పరిచయం సంస్థల దిశానిర్దేశానికి ఎంతగానో ఉపయోగపడొచ్చని కంపెనీ ప్రకటించింది. ప్రపంచస్థాయి సంస్థల్ని ఒకే వేదికపైకి తీసుకొస్తున్న వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 భారతదేశంలోనే మొట్టమొదటిది కానుంది. సమ్మిట్ నిర్వహణకి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ఈవెంట్లు జరుగుతాయి. నవంబర్ 29, 2022న ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇన్వెస్టర్ల రోడ్ షో, స్టార్టప్ మీట్-అప్లు, CEO కాన్‌క్లేవ్‌లతో ప్రారంభం కానుంది. 2023 ఫిబ్రవరి 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో మెగా ఈవెంట్ నిర్వహణతో టెక్ సమ్మిట్ ముగియనుంది. పోస్టర్ ఆవిష్కరణ వైజాగ్ టెక్ సమ్మిట్ 2023 ఈవెంట్ పోస్టర్‌ను గురువారం ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జొనాథన్ హీమర్, మినిస్టర్ ఆఫ్ కమర్షియల్ అఫైర్స్, యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ, న్యూ ఢిల్లీ, యుఎస్ కాన్సులేట్ ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ ఆండ్రూ ఎడ్లెఫ్‌సెన్ హైదరాబాద్ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం కిరణ్ కుమార్ రెడ్డి సలికిరెడ్డి, గ్రూప్ సీఈఓ, APEITA, జనరల్ మేనేజర్ APEITA, సాయి అరవింద్, డాక్టర్ శ్రీనుబాబు గేదెల, సీఈఓ, పల్సస్ గ్రూప్, వైస్ చైర్మన్ ఆఫ్ ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ EOUs, SEZs, (govt of india) శ్రీకాంత్ బాడిగ, ఇండో-అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సి నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ; CH. రాజగోపాల్ చౌదరి, ఛైర్మన్, దేవి ఫిషరీస్ లిమిటెడ్; సౌరభ్ జైన్, హెడ్ ఏరోస్పేస్, ఎయిర్పోర్ట్ సిటీ బిజినెస్, GMR ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్; M. మురళీధర్, కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్; K. గణేష్ సుబుధి, CFO, K Rraheja IT పార్క్స్; ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ఎస్, అనంత్ ఇన్ఫో పార్క్, హైటెక్ సిటీ సీఎండీ సుబ్బారావు పావులూరి పాల్గొన్నారు. ప్రపంచ ఇన్వెస్టర్ రోడ్ షోలు, 'సీఈవో సమావేశాల షెడ్యూల్ ♦ 29 నవంబర్ 2022, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, హైదరాబాద్ ♦ 01 డిసెంబర్ 2022, హోటల్ స్వాస్తి ప్రీమియం, భువనేశ్వర్ ♦ 11 డిసెంబర్ 2022, విశాఖపట్నం, ఈవెంట్ ప్రెస్ మీట్ ♦ 17 డిసెంబర్-ITC మౌర్య- ఢిల్లీ ♦ 21 డిసెంబర్ - ఐటీసీ గ్రేడేనియా- బెంగళూరు ♦ 28 డిసెంబర్ - ఐటీసీ కోహినూర్- హైదరాబాద్ ♦ 07 జనవరి 2023- ITC మరాఠా- ముంబై ♦ 11 జనవరి 2023- ITC చోళ- చెన్నై ♦ 28 జనవరి 2023 - రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్-లండన్ ♦ 31 జనవరి 2023- WTO టవర్- దుబాయ్ ♦ 02, 04, 06, ఫిబ్రవరి 2023 ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు -
సంపన్న దేశాల చర్యల ప్రతికూలతలపై చర్చ
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో జరుగుతున్న పరిణామాలు, తీసుకుంటున్న చర్యల వల్ల ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి సమిష్టి ప్రయత్నాలపై భారతదేశం జీ20 వేదికగా దృష్టి సారిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అలాగే క్రిప్టో అసెట్స్‌పై ప్రపంచవ్యాప్త నియంత్రణపై భారత్ తగిన ప్రయత్నం చేస్తుందన్నారు. ఉగ్రవాదానికి నిధులు నిలిపివేతలో ఈ చర్య ఎంతగానో దోహపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుత్లో ఏ ఒక్క దేశమో క్రిప్టో ఆస్తులను నియంత్రించజాలదని ఇక్కడ జరిగిన ఐసీఆర్ఐఈఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) జీ20 (14వ వార్షిక అంతర్జాతీయ) సమావేశంలో స్పష్టం చేశారు. డిసెంబర్ నుంచి భారత్ నేతృత్వం నేపథ్యం భౌగోళిక ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల పెంపు, డిమాండ్ మందగమనం వంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ డిసెంబర్ 1వ తేదీ నుంచి జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండొనేషియా నుంచి స్వీకరించనుంది. 2023 నవంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టనుందని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. జీ20 దేశాల్లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో ఈ దేశాల వాటా 85 శాతంకాగా, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం. ప్రపంచంలో మూడింట రెండవంతు (దాదాపు 70 శాతం) జనాభాకు ఈ దేశాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. జీ20కి సంబంధించి ఐసీఆర్ఐఈఆర్ మంగళవారం నిర్వహించిన సమవేశంలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు బెడిసికొట్టాయా అన్న ప్రశ్నకు ఈ సందర్భంగా ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, భారత్ అధ్యక్షతన జీ20లో ఇదీ ఒక చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల మందగమన పరిస్థితుల వల్ల ప్రపంచ వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. 2021లో ప్రపంచ వృద్ధి 6 శాతం ఉంటే, 2022లో ఇది 3.2 శాతానికి పడిపోతుందనిఅంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనావేసింది. 2023లో ఈ రేటు మరింతగా 2.7 శాతానికి పడిపోతుందని అవుట్‌లుక్ అంచనావేసింది ఇక ప్రపంచ వస్తు వాణిజ్యం నడుస్తున్న 2022వ సంవత్సరంలో మెరుగ్గాఉన్నా.. 2023లో పరిస్థితి అస్సలు బాగోలేదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఇటీవల తన తాజా నివేదికలో పేర్కొంది. 2022లో ప్రపంచ వస్తు వాణిజ్య వృద్ధి రేటును గత ఏప్రిల్ నాటి అంచనాలకన్నా ఎక్కువగా తాజాగా 3 శాతం నుంచి 3.5 శాతానికి సవరించింది. 2023లో వృద్ధి రేటు అంచనాను మాత్రం 3.4 శాతం నుంచి భారీగా ఒక శాతానికి తగ్గించింది. ఎగుమతులను భారీగా పెంచుకోవాలని చూస్తున్న భారత్‌సహా పలు వర్థమాన దేశాలకు డబ్ల్యూటీఓ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీఆర్ఐఈఆర్ సమావేశంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలుగా భారత్ ఎనిమిది అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ప్రపంచబ్యాంక్, ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సహా బహుళజాతి బ్యాంకింగ్ సంస్థల్లో సంస్కరణలు, ఆహార, ఇంధన భద్రతలు ఇందులో ప్రధానమైనవి. ► ముఖ్యంగా ఐఎంఎఫ్ కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని భారత్ ఉద్ఘాటిస్తోంది. ► ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. ► భారత్ ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చే కోణంలో చాలా పటిష్టంగా ఉంది. దేశ ఆర్థిక మూలాధారాలు బాగానే ఉన్నాయి. ► అయితే అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందిన దేశాలలో జరిగే అనూహ్య, అసాధారణ పరిణామాలకు ప్రభావితం అవుతున్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందుతున్న, మధ్య–దిగువ స్థాయి ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న ప్రతికూలతపై జీ20 వేదికగా భారత్ తన వాదనలను వినిపిస్తుంది. ఆర్థిక ఒడిదుడుకులు కూడా.. జీ20 దేశాలకు అధ్యక్ష బాధ్యతల్లో క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణతోపాటు, ద్రవ్యోల్బణం తత్సబంధ ఆర్థిక ఒడిదుడుకు లు, సంబంధిత పరిణామాలపైనా భారత్ దృష్టి సారిస్తుంది. అలాగే అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి వృద్ధి ఆకాంక్షలను– వాతావరణ పరిగణనలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉంది. – సీఈఏ అనంత నాగేశ్వరన్ చదవండి: ఇది అసలు ఊహించలేదు.. షాక్‌లో టాటా స్టీల్! -
ప్రజా శాంతి పార్టీ రద్దు కాలేదు: కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ రద్దయిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారని తమ పార్టీ రద్దు కాలేదని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఖండించారు. గురువారం సికింద్రాబాద్‌లోని హరిహరకళాభవన్‌లో నగరంలోని వివిధ చర్చిలకు చెందిన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీకి కేవలం ఈసీ నోటీసులు మాత్రమే ఇచ్చిందని దానికి త్వరలోనే సమాధానం పంపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీన శాంతి సమ్మిట్‌ను నగరంలో నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఒక్క లేఖ ఇస్తే రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు తెప్పిస్తానని ఆయన అన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో 9 లక్షల కోట్ల డబ్బు, బంగారం దాచి ఉంచారని అందుకే అందులోకి ఎవరినీ పంపించరన్నారు. వేల పాటలు రాసి పాడిన గద్దర్‌కు భారతరత్న ఇవ్వాలన్నారు. గద్దర్ మాట్లాడుతూ మనుషులను ప్రేమించే మనిషే దైవమని అలాంటి వ్యక్తి యేసు క్రీస్తు అని అన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు రవికుమార్, శ్యామ్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తి మూడింతలు అవుతుంది
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి వచ్చే 25 ఏళ్లలో మూడింతలు అవుతుందని అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి అన్నారు. 628 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని, వార్షిక సగటు వృద్ధి 4.5 శాతంగా ఉండొచ్చన్నారు. 2021లో దేశంలో 210 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి సాధ్యమైంది. గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ‘అమూల్’బ్రాండ్‌పై పాలు, పాల ఉత్పత్తులు మార్కెటింగ్ చేసే విషయం తెలిసిందే. అంతర్జాతీయ డైరీ సమాఖ్య ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రపంచ డైరీ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో భాగంగా సోధి మాట్లాడారు. ఈ సదస్సు ఈ నెల 15వరకు కొనసాగుతుంది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో పాల ఉత్పత్తి పరంగా భారత్ ప్రస్తుతం 23 శాతం వాటా కలిగి ఉంది. వచ్చే 25 ఏళ్లలో 45 శాతానికి చేరుకుంటుంది. జనాభా పెరుగుదలతో డిమాండ్ ఇతోధికం అవుతుంది. దేశంలో పాల డిమాండ్ వచ్చే 25 ఏళ్లలో 517 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చు. మరో 111 మిలియన్ టన్నుల మిగులు కూడా సాధిస్తాం. తసలరి పాల లభ్యత ప్రస్తుతం 428 గ్రాములుగా ఉంటే, 852 గ్రాములకు పెరుగుతుంది. ప్రపంచంలో భారత డైరీ రంగానికి ఎంతో సమర్థవంతమైన పంపిణీ నెట్వర్క్ ఉంది’’ అని సోధి పేర్కొన్నారు. -
India Ideas Summit: వృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయం
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి, ఉపాధి కల్పనే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్ట చేశారు. ద్రవ్యోల్బణం దారికొస్తోందని, దీనిపై దీర్ఘకాలంపాటు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండబోదని కూడా ఈ సందర్భంగా విశ్లేషించారు. రికార్డు గరిష్ట స్థాయిల నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం దిగివస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధి, దేశ సంపద ఫలాలు అందరికీ సమానంగా అందేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యతా అంశంగా పేర్కొన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీని కట్టడే లక్ష్యంగా మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 1.4 శాతం (ప్రస్తుతం 5.4 శాతానికి పెరుగుదల) పెంచిన నేపథ్యంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు గమనార్హం. రెపో రేటు పెంపునకు తక్షణం ఇక ముగింపు పడినట్లేనా అన్న సందేహాలకు ఆమె ప్రకటన తావిస్తోంది. ‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’లో ఈ మేరకు ఆమె చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► రిటైల్ ద్రవ్యోల్బణం కొద్ది నెలలుగా దిగివస్తోంది. దీనిని మనం నిర్వహించగలిగిన స్థాయికి తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యతలు ఉపాధి కల్పన, వృద్ధికి ఊపును అందించడం. (ఆర్బీఐ కఠిన పాలసీ విధానం, సరఫరాల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యల నేపథ్యంలో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవనెల జూలైలోనూ తగ్గి 6.71 శాతానికి చేరింది. ఏప్రిల్‌లో 7.79 శాతం, మేలో 7.04 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్‌లో 7.01 శాతానికి దిగివచ్చింది. నిజానికి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే ఏడు నెలలుగా 6 శాతం ఎగువనే కొనసాగుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1 శాతం, 6.4శాతం, 5.8శాతాలుగా నమోదవుతాయని ఆర్బీఐ పాలసీ అంచనావేసింది. 2023– 24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 5 శాతానికి ఇది దిగివస్తుందని భావించింది. ► అమెరికన్ సెంట్రల్ బ్యాంక్– ఫెడ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ దూకుడు రేట్ల పెంపు వైఖరి నుండి ఉద్భవిస్తున్న అస్థిరతను ఎదుర్కొనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. భారత్ ద్రవ్య విధానాన్ని పెద్ద అవాంతరాలు లేదా తీవ్ర ఒడిదుడుకులు లేకుండా నిర్వహించగలమన్న ఆర్బీఐ అధికారులు విశ్వసిస్తున్నారు. ► కోవిడ్–19 కాలంలో కేంద్రం ఆర్థిక నిర్వహణ పటిష్టంగా ఉంది. లక్ష్యంతో కూడిన ఆర్థిక విధానంతో భారత్ డబ్బును ముద్రించకుండా సవాళ్లతో కూడిన సమాయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. ► రష్యా–ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఏర్పడిన ప్రపంచ ఇంధన సంక్షోభ వల్ల ముడి చమురు, సహజ వాయువు లభ్యతపై అనిశ్చితి కొనసాగుతోంది. ► చెల్లింపులకు సంబంధించి సాంకేతికతతో సహా అన్ని ఆర్థిక అంశాలకు సంబంధించి భారత్– అమెరికాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. భారత్, అమెరికాలు కలిసి పని చేస్తే, మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 30 శాతానికి చేరుకుంటాం. రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జీడీపీలో 30 శాతం వాటాను అందిస్తాము. ఈ పరిస్థితి భారత్–అమెరిలను ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా మారుస్తుంది. ► భారత్ డేటా డేటా గోప్యత, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్రం కొత్త డేటా గోప్యతా బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. ► అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతల ను తీసుకోనుంది. డిసెంబర్ 1నుంచి 2023 న వంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల స మయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెడుతుంది. ఐఎంఎఫ్ కోటా సమీక్ష సకాలంలో జరగాలి... కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో కోటాల 16వ సాధారణ సమీక్ష (జీఆర్‌క్యూ) సకాలంలో ముగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి ఇది ఎంతో అవసరమని సీతారామన్ పేర్కొన్నారు. ఐఎంఎఫ్ కోటా వ్యవస్థ బహుళజాతి రుణ సంస్థలో దేశాల ఓటింగ్ షేర్‌కు సంబంధించిన అంశం. ప్రస్తుతం ఐఎంఎఫ్‌లో భారతదేశ కోటా 2.75 శాతం. చైనా కోటా 6.4 శాతం కాగా, అమెరికా కోటా 17.43 శాతం. ఐఎంఎఫ్ తీర్మానం ప్రకారం, కోటాలకు సంబంధించి 16వ సాధారణ సమీక్ష 2023 డిసెంబర్ 15వ తేదీలోపు ముగియాలి. వర్థమాన దేశాల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యత లభించేలా కోటా షేర్లలో సర్దుబాటు జరగాలని, వాటి ఓటింగ్ హక్కులు పెరగాల్సిన అవసరం ఉందని భారత్ డిమాండ్ చేస్తోంది. జీ20 బాధ్యతలు స్వీకరించనున్న భారత్‌తో పలు అంశాలపై చర్చించడానికి దేశంలో పర్యటిస్తున్న ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివాతో సమావేశం అనంతరం కోటా అంశంపై సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాదే డిజిటల్ కరెన్సీ ఆవిష్కరణ ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఈ ఏడాదే ‘పైలెట్ బేసిస్’తో ప్రారంభించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టీ రబీ శంకర్ ప్రకటించారు. దీనివల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాలతో ఆర్థిక లావాదేవీల మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఆయా అంశాలకు సంబంధించి సమయం, వ్యయం రెండూ తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2022–23 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయికి సమానమైన డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుందని చెప్పారు. ‘‘జీ–20, అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వంటి సంస్థలతో ఇప్పుడు ఎదుర్కొంటున్న చెల్లింపుల సమస్యను పరిష్కరించడానికి సీబీడీసీ అంతర్జాతీయీకరణ చాలా కీలకమని మనం అర్థం చేసుకోవాలి’’ అని ఇండియా ఐడియాస్ సమ్మిట్‌లో టీ రబీ శంకర్ అన్నారు. -
I2U2 Summit: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా
న్యూఢిల్లీ: నాలుగు దేశాల ‘ఐ2యూ2’ కూటమి తన తొలి శిఖరాగ్ర సదస్సులోనే సానుకూల అజెండాను సిద్ధం చేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి కోసం నాలుగు దేశాలు కలిసికట్టుగా పనిచేయబోతున్నాయని, ఈ మేరకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకున్నాయని వెల్లడించారు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆచరణీయ పరస్పర సహకారానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఒక మంచి మోడల్ అని ఉద్ఘాటించారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్ఏ, యూఏఈ) తొలి శిఖరాగ్ర సదస్సును గురువారం వర్చువల్‌గా నిర్వహించారు. సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యైర్ లాపిడ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఐ2యూ2 అజెండా, దార్శనికత ప్రగతిశీలకంగా, ఆచరణయోగ్యంగా ఉందని కొనియాడారు. నాలుగు దేశాల పెట్టుబడి, నిపుణత, మార్కెట్లు వంటి బలాలను ఒకే వేదికపైకి తీసుకొస్తే అది ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వివిధ రంగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించామని, వాటి అమలు విషయంలో ముందుకెళ్లేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నామని ఉద్ఘాటించారు. నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి ఆరు కీలక రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులను మరింత పెంచేందుకు అంగీకారానికొచ్చామన్నారు. -
డబ్ల్యూహెచ్ఓ పనితీరులో సంస్కరణల కోసం పిలుపునిచ్చిన మోదీ!
WHO must be reformed, India ready to play key role: గురువారం జరిగిన రెండవ గ్లోబల్ కోవిడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనితీరులో సంస్కరణల కోసం పిలుపు నిచ్చారు. ఈ సదస్సులో ప్రపంచ ఆరోగ్య భద్రతను మరింత స్థితిస్థాపకంగా నిర్మించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఆ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. సరఫరా గొలుసులు స్థిరంగా ఉంచడానికి వ్యాక్సిన్లు, చికిత్సవిధానాల కోసం డబ్ల్యూహెచ్ఓ ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు, ముఖ్యంగా వాణిజ్య సంబంధిత అంశాలకు సంబంధించిన మేథో సంపత్తి హక్కు(ట్రిప్స్)ల ఒప్పందాలు మరింత సరళంగా ఉండాలని చెప్పారు. ఈ మేరకు మోదీ సదస్సులో కరోనా విషయమై మాట్లాడుతూ..." కోవిడ్ మహమ్మారి విషయంలో భారత్ సమిష్టి కేంద్రీకృత వ్యూహాన్ని అనుసరించింది. మేము వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌కు అత్యధిక నిధులు కేటాయించాం. భారత్‌లోని వ్యాక్సినేషన్ ప్రక్రియ అతి పెద్దది. భారత్ డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన నాలుగు వ్యాక్సిన్లను తయారు చేయడమే కాకుండా ఐదు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేము 98 దేశాలకు 200 మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్లను సరఫరా చేశాం. అతి తక్కువ ఖర్చుతో కరోనా చికిత్స పొందేలా సరికొత్త వైద్యా విధానాన్ని అభివృద్ధి చేశాం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మేము సంప్రదాయ ఔషధాలకు పెద్ధ పీఠవేశాం. గత నెలలో ఈ పురాతన జ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మేము భారత్‌లో 'డబ్ల్యూహెచ్ఓ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్'కి పునాది వేశాం" అని అన్నారు. (చదవండి: ప్రధాని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ) -
తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ
గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్ ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్‌ను తులసీభాయ్‌గా ప్రధాని పేర్కొన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిష్కరిస్తుందంటూ ప్రశంసించారు. సంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకోవడంలో ఇండియా ఛాంపియన్‌గా నిలుస్తోందన్నారు. 150కి పైగా ఎంవోయూలు గుజరాతి రాజధాని గాంధీనగర్‌లో ఆయుష్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఔషధ మొక్కలకు ఇండియా పుట్టిళ్లన్నారు. మెడిసినల్ ప్లాంట్స్‌ని గ్రీన్గోల్డ్గా అభివర్ణించారు. ఆయుష్ ఉత్పత్తి చేస్తున్న మందులు 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రధాని తెలిపారు. ఆయుష్ ఆహార్ ద్వారా ఫుడ్ సప్లిమెంట్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆయుష్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు, తయారీదారులతో బలమైన నెట్వర్క్ తయారు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 50 కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. గ్రీన్ గోల్డ్ ఆయుర్వేదాన్ని గ్రీన్ గోల్డ్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయుర్వేదానికి రోజురోజుకు డిమాండ్ పెరుగతుందన్నారు. 2014లో మూడు బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయుష్ ఉత్పత్తుల విలువ నేడు 18 బిలియన్ డాలర్లకు పెరగడమే ఇందుకు ఉదాహారణ అన్నారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియా వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఆయుష్ వీసాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. భారత్‌ను మరువలేం సంప్రదాయ మెడిసిన్స్‌ని ప్రోత్సహిస్తున్న భారత ప్రభుత్వాన్ని మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాత్ మెచ్చుకున్నారు. వైద్య రంగంలో మారిషన్‌కు భారత్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. మారిషన్‌లో ఆయుర్వేద కాలేజీ నిర్మించడంతో పాటు కోవిడ్ సమయంలో భారత్ ఎంతో అండగా ఉందని ఆయన తెలిపారు. చదవండి: సంప్రదాయ వైద్యానికి సమయమిదే! -
BIMSTEC summit: చట్టాల నిలకడపై కొత్త ప్రశ్నలు
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఇటీవలి పరిణామాలు అంతర్జాతీయ చట్టాల నిలకడపై కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బిమ్స్టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ–సెక్టోరల్ టెక్నికల్, ఎకనామిక్ కో–ఆపరేషన్) దేశాల మధ్య పరస్పర సహకారం పెంపొందాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భద్రత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. బుధవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన బిమ్స్టెక్ ఐదో శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఆరోగ్యం, ఆర్థిక భద్రత విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యమత్యం, పరస్పర సహకారం తక్షణమే అవసరమని పేర్కొన్నారు. అనుసంధానం, సౌభాగ్యం, భద్రతకు బంగాళాఖాతాన్ని ఒక వారధిగా మార్చాలన్నారు. బిమ్స్టెక్ సెక్రెటేరియట్ ఆపరేషన్ బడ్జెట్‌కు మిలియన్ డాలర్లు అందజేస్తామని ప్రకటించారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల మన ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికీ ప్రభావితం అవుతూనే ఉన్నాయని గుర్తుచేశారు. విజన్ డాక్యుమెంట్ రూపొందిద్దాం.. ఈ సదస్సులో బిమ్స్టెక్ చార్టర్‌ను తీసుకురావడం కీలకమైన ముందుడుగు అని మోదీ అభివర్ణించారు. ఈ చార్టర్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించడానికి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలన్న సెక్రెటరీ జనరల్ ప్రతిపాదనకు ప్రధాని అంగీకారం తెలిపారు. మన ఆకాంక్షలు నెరవేరే దిశగా బిమ్స్టెక్ సెక్రటేరియట్‌ను శక్తివంతంగా తీర్చిదిద్దాలని అన్నారు. అందుకోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని సెక్రెటరీ జనరల్‌కు సూచించారు. బిమ్స్టెక్ దేశాల వ్యాపారవేత్తలు, స్టార్టప్‌ల మధ్య అనుసంధానం పెరగాలని, వ్యాపార వాణిజ్యాల్లో అంతర్జాతీయ నిబంధలను పాటించాలని తెలిపారు. ప్రాంతీయంగా భద్రత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని మోదీ కుండబద్ధలు కొట్టారు. ఉగ్రవాదంపై పోరాటం కోసం గత ఏడాది తీసుకున్న నిర్ణయం చురుగ్గా అమలవుతోందని హర్షం వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో కోస్టల్ షిప్పింగ్ ఎకోసిస్టమ్ కోసం సాధ్యమైనంత త్వరగా లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బిమ్స్టెక్ దేశాల నడుమ రోడ్డు మార్గంద్వారా అనుసంధానం పెరగాలని చెప్పారు. బిమ్స్టెక్ సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. సహకార అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. బిమ్స్టెక్లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. -
పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!
Russia Says Premature Talk: ఉక్రెయిన్‌పై రష్యా ఉద్రిక్తతలను శాంతింపజేయడానికి పారిస్ సమావేశం జరిగే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలో రష్యా అమెరికా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధమైందని రష్యా ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఈ మేరకు రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమయ్యేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ సోమవారం ప్రకటించింది. ఈ శిఖరాగ్ర సమావేశం జరగాలంటే మాస్కో సైన్యం ఉక్రెయిన్ పై దాడి చేయకూడదని అమెరికా పేర్కొంది. నిజానికి ఏదైన శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి ఒక నిర్ధిష్ట ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ సమావేశం ఎలాంటి ప్రణాళికలు లేని అత్యవసర సమావేశంగా రష్యా అభివర్ణించింది. అయితే విదేశాంగ మంత్రుల స్థాయిలో ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు అత్యవసరం అనుకుంటే రష్యా, అమెరికా అధ్యక్షులు టెలిఫోన్ కాల్ ఏదా ఇతర పద్ధతుల ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని రష్యా ప్రతినిధి తెలిపారు. అయితే దేశాధినేతలు సముచితంగా భావిస్తేనే ఈ సమావేశం సాధ్యమవుతుందని చెప్పారు. పైగా క్రెమ్లిన్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పుతిన్ అధ్యక్షత వహించబోతున్నారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురవారం యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరగనున్న షెడ్యూల్ చర్చలకు ముందు ఫ్రెంచ్ కౌంటర్ జీన్-వైవ్స్ లే డ్రియన్‌తో టెలిఫోన్లో మాట్లాడాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్ చుట్టు రష్యా దళాలు మోహరించి ఉండటమే కాక యుద్ధ భయాల్ని విపరీతంగా పెచ్చింది. అంతేగాక తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు ఉక్రెయిన్ సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉద్రిక్తలకు మరింత పెరిగిపోవడానకి కారణమైంది. ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించేలా ఉక్రేనియన్ సైన్యం చేస్తున్న రెచ్చగొట్టే, దూకుడు చర్యల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు. (చదవండి: చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు) -
జర్మనీ పెట్టుబడుల కోసం..ప్రత్యేక క్లస్టర్
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య పెట్టుబడులతో భారత్‌కు వచ్చేవారికి తెలంగాణ రాష్ట్రం ఆకర్షణీయమైన గమ్యస్థానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లో పెట్టుబడులకు అనేక అనుకూలతలు ఉన్నా యని చెప్పారు. జర్మనీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా అన్ని మౌలిక వసతులతో కూడిన ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పని ప్రదేశాల్లోనే ఉద్యోగులు, కార్మికులకు నివాస వసతి కల్పించేలా మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని మంత్రి వెల్లడించారు. ఇండో జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో సోమవారం సంయుక్తంగా నిర్వహించిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ పెట్టుబడులకు అనేక అవకాశాలున్నాయని కేటీఆర్ తెలిపారు. ఇటీవలి కాలంలో యంత్ర, ఎలక్ట్రానిక్ వాహన తయారీ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా పరిస్థితుల్లో తయారీ రంగం చైనా నుంచి తరలేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో భారత్ ప్రత్యేకించి తెలంగాణ ఈ తరహా పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలో జర్మనీ పెట్టుబడిదారులు కూడా తెలంగాణకు తరలివస్తే స్వాగతం పలికేందుకు సిద్ధమన్నారు. ఐపాస్ ద్వారా సులభతర అనుమతులు పారిశ్రామిక అవసరాలకు వీలుగా రాష్ట్రంలో 3.2 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, టీఎస్ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, టీఎస్ఐపాస్ ద్వారా సులభతర అనుమతులు లభించేలా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. జర్మనీ జీడీపీలో 80 శాతానికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచే సమకూరుతోందని, అదే తరహాలో తెలంగాణలోనూ చిన్న, మధ్య తరహా సంస్థలతో పనిచేసేందుకు జర్మనీ పెట్టుబడిదారులు ముందుకు రావాలని మంత్రి కోరారు. జర్మనీ తరహాలో..డ్యూయల్ డిగ్రీ కోర్సుల యోచన జర్మనీ దేశంలో అమలులో ఉన్న డ్యూయల్ డిగ్రీ తరహా కోర్సులను రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జె.లిండ్నర్, చెన్నైలో జర్మనీ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టోల్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. రూ.1,500 కోట్ల పెట్టుబడి .. 27 వేల మందికి ఉపాధి జర్మన్ పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆ దేశానికి చెందిన ‘లైట్ ఆటో జీఎంబీహెచ్’తో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో జర్మనీ రాయబారి వాల్టర్ జె.లిండ్నర్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో ఈ ఎంవోయూ కుది రింది. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైట్ ఆటో ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణలో లైట్ ఆటో జీఎంబీహెచ్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో ఆధునిక డిజైనింగ్, తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. ఎలక్ట్రిక్, ఐసీఈ వాహన రంగంలో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహనాలకు అవసరమైన మెగ్నీషియం ఉత్పత్తులను తయారు చేస్తుంది. దీని ద్వారా 9 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18 వేల మందికి పరోక్షంగా.. మొత్తంగా 27 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. -
ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ఒప్పందాలపై వారు సంతాకలు చేయనున్నారు. కాగా అంతకు ముందు భారత్-రష్యాల మధ్య జరిగిన 2+2 సమావేశంలో నాలుగు కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ( చదవండి: వైరల్: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. సడెన్‌గా మాజీ ప్రేమికుడి ఎంట్రీ.. చివరికి ) రైఫిల్స్ తయారీతో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపై ఒప్పందం చేసుకున్నాయి. ఈ భేటీలో భారత్, రష్యా రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతంపై చర్చలు జరిపారు. భారత్‌కు సహకారం అందించిన రష్యాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఒక దేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం అంటే.. మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. తాజా పరిస్థితులతో ఆసియాలో శాంతి, స్థిరత్వం మెరుగుపడుతుందని రాజ్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాత్రి తొమిదిన్నర గంటలకు పుతిన్ రష్యాకు తిరిగి వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. -
బొగ్గు వినియోగం వద్దు
గ్లాస్గో/లండన్: శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని యూకేలోని గ్లాస్గోలో జరిగిన భాగస్వామ్య పక్షాల (కాప్–26) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వాతావరణ మార్పులు, వాటి దుష్ప్రభావాలు, వాటిని ఎదుర్కొనేందుకు అమలు చేయాల్సిన వ్యహాలపై చర్చించేందుకు గత రెండు వారాలుగా కొనసాగిన ఈ సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై ముసాయిదా తుది ప్రకటనను నిర్వాహకులు శుక్రవారం విడుదల చేశారు. దీన్ని ఐక్యరాజ్యసమితి క్లైమేట్ ఛేంజ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పర్యావరణాన్ని, తర్వాత భూగోళాన్ని కాపాడుకోవాలంటే బొగ్గు వాడకాన్ని దశల వారీగా నిలిపివేయాలని కాప్–26 సూచించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంకా బొగ్గును ఉపయోగిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం మంచి పరిణామం కాదని వెల్లడించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తుచేసింది. చాలావరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కర్బన ఉద్గారాలను నియంత్రించే సాంకేతిక పరిజ్ఞానం లేదని తెలిపింది. శిలాజ ఇంధనాల వాడకాన్ని నిరుత్సాహపర్చాలని ఇందుకోసం, సబ్సిడీల్లో పెద్ద ఎత్తున కోత విధించాలని పేర్కొంది. కాప్–26లో ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 నుంచి 2 డిగ్రీల పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై చర్చించారు. కర్బన ఉద్గారాల తగ్గింపుపై కీలక ఒప్పందం భారత్ సారథ్యం వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ), వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్(యూఎన్ఎఫ్సీసీసీ) మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కుదిరింది. యూకేలోని గ్లాస్గోలో కాప్–26 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా శుక్రవారం ఈ అవగాహనా ఒప్పందంపై ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, యూఎన్ఎఫ్సీసీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ ఓవైస్ సర్మాద్ సంతకాలు చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడానికి, నేషనల్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రపంచ దేశాలతో కలిసి పని చేస్తామని, తమవంతు సహకారం అందిస్తామని ఐఎస్ఏ హామీ ఇచ్చింది. ఒప్పందంలో భాగంగా.. దీర్ఘకాలంలో కర్బన ఉద్గారాల తగ్గింపునకు ఈ రెండు సంస్థలు ఉమ్మడిగా వ్యూహాలు రూపొందించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, క్లీన్ ఎనర్జీ వినియోగానికి పెద్దపీట వేయడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్నదే లక్ష్యమని అజయ్ మాథుర్ చెప్పారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సౌర కూటమిని 2015 నవంబర్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రకటించారు. -
పేద దేశాలకు భారీగా కరోనా వ్యాక్సిన్లు
-
ఐటీ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. తమ సెనేట్‌లో ఈ నెల 29న జరిగే ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021’సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఫ్రాన్స్ ప్రభుత్వం కేటీఆర్‌ను ఆహ్వానించింది. తమ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సారథ్యంలో జరిగే ఈ సదస్సుతో రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయని కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. కోవిడ్ తదనంతరం భారత్, ఫ్రాన్స్ సంబంధాల్లో అభివృద్ధి, భవిష్యత్తు నిర్మాణం అనే అంశంపై ప్రసంగించాలని కోరింది. ఈ సదస్సులో గతంలో కంటే ఎక్కువ కంపెనీల భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని, ఇలాంటి కీలకమైన వేదిక తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను పరిచయం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు పంపిన లేఖలో ఫ్రెంచ్ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా ఈ సదస్సులో ఆరోగ్య రక్షణ, వాతావరణ మార్పులు, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుందని వివరించింది. దీంతో పాటు ఫ్రాన్స్, భారత కంపెనీల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయని మంత్రికి పంపిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ ప్రభుత్వ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించే వీలు కలుగుతుందని, ఫ్రాన్స్ దేశ ఆహ్వానం తెలంగాణ ప్రభుత్వ విధానాలను దక్కిన గుర్తింపు అని పేర్కొన్నారు. -
పరస్పరం గుర్తించాలి: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ
వాషింగ్టన్: కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయొచ్చని ప్రధాని మోదీ బుధవారం సూచించారు. ఒక దేశంలో జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను మరో దేశం గుర్తించే విధానం ఉండాలన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు విదేశీయులను తమ భూభాగంలోకి అనుమతించే విషయంలో వేర్వేరు నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఈ నిబంధనల్లో ఏకరూపత రావాలని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కోవిడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వీడియో సందేశం ద్వారా పాలుపంచుకున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు గుర్తుచేశారు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల సరఫరా వ్యవస్థను సరళతరం చేయాలని, దీనివల్ల ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు వీలుకలుగుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని గుర్తుచేశారు. ఈ సమస్య పరిష్కారంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపుతో ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. భారతీయులు స్వదేశంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ యూకేకు వచ్చిన తర్వాత 10 రోజులు క్వారంటైన్లో ఉండాలని యూకే అంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పర గుర్తించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో 100 కోట్ల డోసుల ఉత్పత్తి: బైడెన్ కోవాక్స్ నిమిత్తం 2022 చివరికల్లా భారత్‌లో కనీసం 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసే దిశగా క్వాడ్ సాగుతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. కోవిడ్–19ను జయించడానికి సమష్టిగా కృషి చేయడం కంటే అత్యవసరమైనది మరేదీ లేదన్నారు. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అమెరికా సాంకేతిక, ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. -
సెప్టెంబర్ 24న క్వాడ్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ
-
క్వాడ్.. ప్రస్తుత అవసరం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి ‘క్వాడ్’ ప్రస్తుత అవసరమని, ‘క్వాడ్’ తొలి సమావేశాల అజెండా కూడా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు అనుగుణంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా శాంతి, అభివృద్ధిలను సాధించే శక్తిగా క్వాడ్ నిలుస్తుందన్నారు. ఈ ‘క్వాడ్’ వర్చువల్ సమావేశాలను ఉద్దేశించి శుక్రవారం మోదీ ప్రసంగించారు. కార్యక్రమంలో యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ పీఎం యోషిహిదె సుగా పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, సమ్మిళిత, సహకార, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం అనే లక్ష్యాలకు మన నాలుగు దేశాలు కట్టుబడి ఉన్నాయి. వాతావరణ మార్పుపై పోరు, కోవిడ్ 19 టీకా, నూతన సాంకేతికలు అనే ప్రపంచానికంతటికీ మంచి జరిగేందుకు ఉద్దేశించిన అంశాలను ఈ భేటీకి అజెండాగా తీసుకోవడం ముదావహం’ అని మోదీ పేర్కొన్నారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమనే భారత దేశ పురాతన విశ్వాసమైన ‘వసుధైక కుటుంబం’ అనే భావనకు ఇది కొనసాగింపని వ్యాఖ్యానించారు. ‘కలసికట్టుగా, గతంలో కన్నా ఐక్యంగా పనిచేద్దాం. సురక్షిత, సుస్థిర, ప్రగతిశీల ఇండో పసిఫిక్‌ను రూపొందిద్దాం’ అన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్ లభించేందుకు వీలుగా, టీకా ఉత్పత్తిని పెంచేందుకు ఉమ్మడి భాగస్వామ్య ప్రాజెక్టు రూపొందించాలన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఘర్షణలకు తావు లేకుండా, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు అమలు జరగాలని బైడెన్ వ్యాఖ్యానించారు. చైనాకు స్పష్టమైన సందేశమిస్తూ.. సుస్థిర, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసం క్వాడ్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుపై జరిపే ఉమ్మడి పోరాటంలో క్వాడ్ ఒక నూతన శక్తి అని బైడెన్ అభివర్ణించారు. ‘మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’ అని బైడెన్ ఈ సందర్భంగా మోదీతో వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో ప్రపంచం గతిని ఇండో పసిఫిక్ ప్రాంతం నిర్ధారిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ పేర్కొన్నారు. 2004లో సునామీ సహాయక చర్యల్లో సమన్వయం లక్ష్యంగా భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఒక కీలక బృందంగా ఏర్పాటయ్యాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం అత్యంత వ్యూహాత్మకంగా మారడంతో పాటు, ఈ ప్రాంతంలో చైనా దూకుడు పెంచుతున్న నేపథ్యంలో ఈ కూటమి కీలకంగా మారింది. వేరే దేశాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు బీజింగ్: దేశాల మధ్య సహకారం, సంప్రదిం పులు మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకునేలా ఉండవద్దని చైనా వ్యాఖ్యానించింది. దేశాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడడం సరికాదని పేర్కొంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ‘క్వాడ్’ భేటీ ప్రారంభమయ్యే ముందు చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. -
చతుర్భుజ సంకీర్ణ కూటమి భేటీ రేపే
వాషింగ్టన్: చతుర్భుజ సంకీర్ణ కూటమిలో (క్వాడ్) భాగస్వామ్య పక్షాలైన అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాధినేతలు శుక్రవారం తొలి సారిగా సమావేశం కానున్నారు. మార్చి 12న జరిగే ఆన్లైన్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడో సుగాలు పాల్గొంటారు. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ప్రధాని మోదీ మొదటి సారిగా ఆయనతో ఈ సదస్సులో చర్చించను న్నారు. ప్రపంచ దేశాలను కరోనా కుదిపేస్తున్న నేపథ్యంలో భారత్‌లో వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి పలు ఆర్థిక ఒప్పందాలను ఈ సదస్సులో ప్రకటించే అవకాశం ఉందని అమెరికా వైట్ హౌస్ అధికారి ఒకరు వెల్లడించారు. అమెరికా ఔషధ సంస్థలైన నోవావాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన వ్యాక్సిన్ల తయారీ భారత్‌లో చేపట్టేలా ఈ సదస్సులో ఒప్పందం కుదిరే అవకాశాలైతే కనిపిస్తు న్నాయి. కరోనా వైరస్‌పై యుద్ధం చేయడం, ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా మిలటరీ శక్తిని దుర్వినియోగంపై చర్చించడమే ఈ క్వాడ్ సదస్సు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వ్యాక్సినేషన్ని మరింత వేగవంతం చేస్తే కరోనా మహమ్మారిని కట్టడి చేయవచ్చునని, భారత్‌లో టీకా డోసుల తయారీని పెంచి ఆగ్నేయాసియా దేశాలకు పంపిణీ చేయాలని క్వాడ్ దేశాలు యోచిస్తున్నాయి. మరోవైపు కోవిడ్–19 సంక్షోభంతో పాటుగా ఆర్థిక సహకారం, వాతావరణం మార్పులు వంటి అంతర్జాతీయ సమస్యలపై ఈ సదస్సులో లోతుగా చర్చించను న్నట్టుగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్‌సాకి చెప్పారు. 2004లో సునామీ ముంచెత్తిన తర్వాత క్వాడ్ కూటమి ఏర్పాటైంది. అప్పట్నుంచి విదేశాంగ ప్రతినిధులే సమావేశాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆ కూటమి ఏర్పాటైన ఇన్నేళ్లకి తొలిసారిగా దేశాధినేతలు సమావేశం కానున్నారు. చైనాకు చెక్ పెట్టే వ్యూహాలు ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా మిలటరీ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఈ సదస్సులో వ్యూహ రచనకు నాలుగు దేశాలు సిద్ధమవుతున్నాయి. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో డ్రాగన్ దేశం పట్టు బిగిస్తూ ఉండడంతో క్వాడ్ సదస్సు ద్వారా ఆ దేశానికి గట్టి హెచ్చరికలు చేయాలనే ఉద్దేశంలో బైడెన్ ఉన్నారు. ఈ సమా వేశం ద్వారా ప్రాంతీయంగా శాంతి స్థాపన జరగా లని కోరుకుంటున్నట్టుగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ అన్నారు. -
నేడే మారిటైమ్ ఇండియా సదస్సు
న్యూఢిల్లీ: మారిటైమ్ ఇండియా 2021 సదస్సు మంగళవారం జరగనుంది. వర్చువల్‌గా జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించొచ్చని కేంద్రం భావిస్తోంది. సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే పనిలో ఉందని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందాలపై ఈ ఏడాది మార్చి 2–4 మధ్య జరిగే మారిటైమ్ ఇండియా రెండో విడత సదస్సులో సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తీర రాష్ట్రాలు, భాగస్వాములు ఈ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. -
ఈయూకు ఆశాభంగం
భారత్–యూరప్ యూనియన్(ఈయూ)ల మధ్య ఆన్లైన్ శిఖరాగ్ర సమావేశం బుధవారం ముగిసింది. ఇది వాస్తవానికి ఏటా జరగాలి. కానీ వాణిజ్యం, పెట్టుబడులు వగైరా అంశాల్లో ఇరు పక్షాల మధ్యా ఏకాభిప్రాయం కొరవడటంతో దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఈ శిఖరాగ్ర సమా వేశం జరిగింది. సమావేశానికి ముందు పౌర అణు ఇంధన సహకార ఒప్పందంపై సంతకా లయ్యాయి. వాణిజ్యం, పెట్టుబడుల్లో సమతూకం సాధించాలని, వాణిజ్య అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే అందరూ అనుకున్నట్టు ఈసారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) ప్రస్తావన రాలేదు. దానిపై తదుపరి చర్చలు ఎప్పుడుం టాయన్న అంశంలోనూ స్పష్టత లేదు. వాణిజ్య రంగంలో ఈయూ మనకు అతి పెద్ద భాగస్వామి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) అంశంలోనూ ఈయూదే పైచేయి. మన దేశంలో ఆ ఎఫ్‌డీఐలు 9,100 కోట్ల డాలర్ల పైమాటే. అయితే ఈయూ దేశాల విదేశీ వాణిజ్యంలో భారత్ వాటా 2 శాతం మాత్రమే. దీన్నింకా పెంచాలన్నది తమ ఉద్దేశమని ఈయూ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్ ప్రకటించారు. భారత్–ఈయూ దేశాల మధ్య పరిష్కారం కావాల్సిన సమస్యలు చాలానే వున్నాయి. ఇటీవలి కాలంలో భారత్ ఆత్మరక్షణ విధానాలు అవలంబిస్తూ భారీగా టారిఫ్‌లు విధిస్తోందని ఈయూ అభ్యంతరం చెబుతోంది. 2013లో చివరిసారి ఇరుపక్షాల మధ్యా చర్చలు జరిగినప్పుడు అంగీ కరించిన అంశాలపై మన దేశం ఆ తర్వాత వెనక్కి తగ్గిందన్నది ఈయూ ఆరోపణ. తాము ఉత్పత్తి చేసే కార్లు, మద్యం వగైరాలపై విధించిన భారీ టారిఫ్‌లు సమ్మతం కాదని ఈయూ అప్పట్లో వాదించింది. సేవల రంగాన్ని కూడా ఒప్పందంలో చేర్చాలని, సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు వీసాలు మంజూరును పెంచాలని మన దేశం కోరింది. అలాగే మన ఆహారోత్పత్తులు, ముఖ్యంగా చేపలు, పాడి ఉత్పత్తులకు ఈయూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ నిబంధనల్ని సరళం చేయాలని కోరింది. ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2016లో మన దేశం ఈయూలోని 22 దేశాలతో అంతక్రితం కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను రద్దుచేసింది. ఈ చర్యతో ఈయూ సభ్య దేశాలకు అపనమ్మకం ఏర్పడిందని, కనుక సమగ్ర ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కుదరాలని తాజా సమావేశం సందర్భంగా ఈయూ ప్రతిపాదించింది. ఆ మాదిరి ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేసిన పక్షంలో తీసుకునే చర్యలే ఈ ప్రతిపాదన సారాంశం. అయితే అందుకు మన దేశం సిద్ధపడలేదు. దీనికి బదుల పరస్పరం ఆసక్తిగల రంగాల్లో అంగీకారం కుదుర్చుకుని, వాటికి పరిమితమై వాణిజ్యాన్ని కొనసాగిం చవచ్చునని సూచించింది. ఇందువల్ల రెండు పక్షాలకూ పెద్దగా ఉపయోగం ఉండదని ఈయూ భావన. అయితే ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడుల ఒప్పందంపై భారత్–ఈయూల మధ్య మరిన్ని చర్చలు జరగాలని, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాలని తాజా శిఖరాగ్ర చర్చల్లో నిర్ణయించారు. ఈయూతో ఎఫ్‌టీఏ కుదర్చుకోవడంపై మన దేశంలో వివిధ వర్గాలు మొదటినుంచీ తీవ్ర వ్యతిరేకతతో వున్నాయి. నిరుడు నవంబర్‌లో మన దేశం చైనాకు పెద్దగా మేలు చేకూర్చే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్సీఈపీ) చర్చల నుంచి బయటకు రావాలని నిర్ణయింది. ఆర్సీఈపీ వల్ల మన సరుకులను అమ్ముకోవడానికి అవకాశాలు ముమ్మరమవుతాయని కొందరు నిపుణులు చెప్పినా, ఆరోగ్య, వ్యవసాయ, పాడిపరిశ్రమ, తయారీ రంగాలను తీవ్రంగా నష్టపరిచే ఆ ఒప్పందం జోలికి వెళ్లవద్దని అనేకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆర్సీఈపీ నుంచి బయటి కొచ్చినట్టే ఎఫ్‌టీఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాలని భిన్న వర్గాలు కోరుతున్నాయి. లేనట్ట యితే మేకిన్ ఇండియా స్ఫూర్తి దెబ్బతింటుందంటున్నాయి. ఇంతక్రితం ఆర్సీఈపీ నుంచి బయటి కొచ్చినా, ఇప్పుడు ఎఫ్‌టీఏ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అదంతా ఆత్మరక్షణ విధా నాల పర్యవసానమేనని ఈయూ అంటుండగా మన దేశం కొట్టిపారేసింది. వాణిజ్య ఒప్పందం ఏదైనా పరస్పర ప్రయోజనాలు ముడిపడి వుండాలి తప్ప, ఒకరికి భారీయెత్తున మేలు చేకూర్చేలా, మరొకరు నష్టపోయేలా వుండరాదన్నదే ఆ అభ్యంతరాల్లోని ఆంతర్యమని మన దేశం చెప్పింది. ఇది పూర్తిగా సహేతుకం. 2013లో భారత్–ఈయూల మధ్య ఎఫ్‌టీఏపై రహస్య చర్చలు జరిగాయి. అప్పట్లో కొన్ని మీడియా సంస్థలు ఎఫ్‌టీఏ నిబంధనలు కొన్నింటిని బయటపెట్టాయి. అవి అమల్లోకి వస్తే ప్రజారోగ్య రంగంపై దారుణమైన ప్రభావం పడుతుందని అప్పట్లో ఆక్స్‌ఫాం వంటి సంస్థలు హెచ్చరించాయి. ఈయూ సభ్యదేశాల్లోని ఫార్మా రంగ సంస్థల ప్రయోజనాలను కాపాడ టానికే ఆ నిబంధనలు పొందుపరిచినట్టు కనబడుతుంది. ఎఫ్‌టీఏపై సంతకాలైతే మన దేశంలో ప్రాణావసరమైన జెనరిక్ మందుల ఉత్పత్తి నిలిచిపోతుంది. వాటి బదులు విదేశాల్లో తయారైన ఖరీదైన మందులే దిక్కవుతాయి. హెచ్ఐవీ వంటి వ్యాధుల నియంత్రణకు వాడే ఔషధాల్లో 80 శాతం మన దేశంలో తయారవుతాయి. అవి వర్ధమాన దేశాల నిరుపేదలకు అందుబాటు ధరల్లో వుంటున్నాయి. కానీ మేధోహక్కుల పేరిట వాటిని అందకుండా చేయడమే ఎఫ్‌టీఏ లక్ష్యం. ఈ అంశాల సంగతలా వుంచి మొన్న ఏప్రిల్‌లో మొబైల్ ఫోన్లు, ఇతర విడిభాగాలు, హెడ్ సెట్లు, కెమెరాలు వగైరాలపై మన దేశం అదనంగా 7.5 శాతం నుంచి 20శాతం వరకూ టారిఫ్‌లు పెంచ డంపై ఇటీవలే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)కు ఈయూ ఫిర్యాదు చేసింది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే 370 అధికరణ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వగైరాలపై అది అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటన్నిటి నేపథ్యంలో జరిగిన భారత్–ఈయూ శిఖరాగ్ర సమావేశం చెప్పుకోదగ్గ పురో గతి సాధించకపోవడంలో వింతేమీ లేదు. ఏ ఒప్పందమైనా మన అభివృద్ధికి తోడ్పడాలి. మన ప్రయోజనాలు నెరవేర్చాలి. వాటికి గండికొట్టేలా వుంటే నిర్ద్వంద్వంగా తిరస్కరించడమే ఉత్తమం. -
మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నగరం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రపంచంలోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్, గేమింగ్, డిజిటల్ అండ్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాల దిగ్గజ కంపెనీలు, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగే ఇండియా జాయ్ కార్యక్రమానికి మరోసారి హైదరాబాద్ నగరం వేదిక కానున్నది. నాలుగు రోజులపాటు జరగనున్న ఇండియా జాయ్-2019 కార్యక్రమం నవంబర్ 20వ తేదీ నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుని ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తూ ఇండియా జాయ్ ప్రతినిధులు ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇండియా జాయ్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారని నిర్వాహకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, యానిమేషన్, విజువల్ ఎపెక్ట్స్ రంగాలకు చెందిన వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులుఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గేమింగ్ యానిమేషన్ , మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ రంగాలకు హైదరాబాద్ నగరాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు ‘ఇమేజ్ టవర్’ ను నిర్మిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఇమేజ్ టవర్ ఈ రంగాలకు ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు’గా పనిచేస్తుందని, ఇందులో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల ముఖ్య ప్రతినిధులు హాజరుకానున్న ఈ సమావేశంలో ఆయా రంగాలకు హైదరాబాద్ నగరంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, వినోద రంగాలకు సంబంధించి అద్భుతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే అంతర్జాతీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ సినిమాలకు, చోటా బీమ్ వంటి గొప్ప కార్టూన్ సిరీస్ రూపకల్పన హైదరాబాద్ నగరంలోనే జరిగిందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్, దేశీ టూన్స్, విఎఫ్ఎక్స్ సదస్సు, ఇన్ఫ్లుయెన్సర్ కాన్ఫరెన్స్, ఈ- స్పోర్ట్స్ వంటి పలు కార్యక్రమాలను ఈ నాలుగు రోజుల్లో చేపట్టనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మొత్తం వివిధ దేశాల నుంచి సుమారు 30 వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు. #IndiajoyinFestival is a prestigious platform for Digital, Media & Entertainment Corporations to collaborate & innovate. With more than 30,000 visitors, the 4-day conclave is expected to serve as a springboard for Indian media, entertainment companies on the world stage. — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 11, 2019 -
రేపు డిప్లొమాటిక్ ఔట్రీచ్ సదస్సు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం విజయవాడ నగరంలో డిప్లొమాటిక్ ఔట్రీచ్ పేరుతో సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దక్షిణ కొరియా, యూకే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 35 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, స్టీల్, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను ఆయా దేశాల ప్రతినిధులకు వివరించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ఈ సదస్సు లక్ష్యం. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నగరంలోని హోటల్ తాజ్ గేట్‌వేలో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పథకాలు, విధానాలను ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలకు తెలియచేయనున్నారు. వివిధ దేశాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సదస్సు షెడ్యూల్... హోటల్ తాజ్ గేట్‌వేలో ఉదయం 10 గంటలకి సదస్సు ప్రారంభం సదస్సు ప్రారంభంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం 11 గంటలకు రాష్ట్రంలో పారిశ్రామిక విధానంపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగం రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలపై చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రెజెంటేషన్ నవరత్నాలు, పెట్టుబడులు, టూరిజం, హెల్త్‌సెక్టార్ వంటి కీలక అంశాలపై బ్రీఫింగ్ మధ్యాహ్నభోజన విరామం అనంతరం రాయబారులు, కాన్సులేట్ జనరల్‌లతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సమావేశం సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న దేశాలు యూఎస్ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు -
చర్చలైనా, యుద్ధమైనా సై
సింగపూర్: వాణిజ్య అంశాలపై అమెరికా, చైనాల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ విషయంలో అమెరికాతో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. చర్చలకు ఇప్పటికీ తాము సిద్ధమేనని, కానీ ఒకవేళ అమెరికా గానీ యుద్ధమే కోరుకుంటే తుదిదాకా పోరాడతామని హెచ్చరించింది. సింగపూర్‌లో ఐఐఎస్ఎస్ షాంగ్రి–లా సదస్సుకు హాజరైన సందర్భంగా చైనా రక్షణ మంత్రి జనరల్ వై ఫెంగీ ఈ విషయాలు చెప్పారు. ‘అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య వివాదం విషయానికొస్తే.. అమెరికా కోరుకుంటే మేమూ చర్చలకు సిద్ధమే. కాదూ.. యుద్ధం చేయదల్చుకుంటే దానికి కూడా సిద్ధమే‘ అని ఆయన చెప్పారు. మరోవైపు, దేశభద్రత పేరిట చైనా టెలికం కంపెనీ హువావేపై అమెరికా ఆంక్షలు విధించడం అర్ధరహితమన్నారు. ఆ సంస్థ యజమాని మాజీ సైనికాధికారి అయినంత మాత్రాన అది మిలిటరీ కంపెనీ కాదని ఫెంగీ వ్యాఖ్యానించారు. 539 బిలియన్ డాలర్ల పైగా ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేయాలంటూ చైనా మీద అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై అమెరికా ప్రభుత్వం ఇటీవలే సుంకాలు పెంచింది. ప్రతిగా చైనా కూడా 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ దిగుమతులపై టారిఫ్‌లు పెంచింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫెంగీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆసియా–పసిఫిక్ ప్రాంత దేశాల మధ్య బంధాలు మెరుగుపర్చుకునేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించడం ఈ సదస్సు ప్రధానోద్దేశం. అమెరికా ఎకానమీకే నష్టం.. అమెరికా తెరతీసిన వాణిజ్య యుద్ధంతో ఆ దేశానికి ఒనగూరిందేమీ లేకపోగా.. ఆ దేశ ఎకానమీకే ఎక్కు వగా నష్టం జరుగుతోందని చైనా ప్రభుత్వం వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే సిద్ధాంతాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. తమ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధించిన దరిమిలా తాజాగా విడుదల చేసిన శ్వేతపత్రంలో ఈ అంశాలు పేర్కొంది. చైనా ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌లు విధించడం వల్ల అగ్రరాజ్యంలో ఉత్పత్తి వ్యయాలు, ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయని.. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వృద్ధికి ప్రమాదకరంగా మారాయని చైనా వ్యాఖ్యానించింది. -
పెప్ ఫొటో సమ్మిట్ 2019
-
భారత్–జపాన్, 2+2
దౌత్య సంబంధాలు ఏర్పడటంలోనూ, అవి చిక్కబడటంలోనూ ఎన్నో అంశాలు కీలకపాత్ర పోషి స్తాయి. అందుకే రెండు దేశాలు సాన్నిహిత్యాన్ని పెంచుకుంటుంటే... ఆ రెండు దేశాలతో లేదా వాటిలో ఒక దేశంతో విభేదాలున్న మూడో దేశం ఆ సాన్నిహిత్యాన్ని సంశయంతో చూస్తుంది. జపా న్లో రెండు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పం దాలను సహజంగానే ఇతర దేశాలకన్నా చైనా నిశితంగా గమనిస్తుంది. భారత్–జపాన్ల మధ్య ఏటా జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంత ర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆరు ఒప్పందాలపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల సహకారం మరింత పెంపొందించేం దుకు ఈ శిఖరాగ్ర సమావేశంలో అంకురార్పణ జరిగింది. ఇంతవరకూ అమెరికాతో మాత్రమే ఉన్న మంత్రుల స్థాయి 2+2 చర్చల ప్రక్రియ విధానాన్ని జపాన్‌కు కూడా వర్తింపజేసేందుకు అంగీకారం కుదిరింది. అమెరికాతో రక్షణ శాఖ, విదేశాంగ మంత్రుల స్థాయిలో 2+2 చర్చల ప్రక్రియ సాగు తోంది. జపాన్‌తో ప్రస్తుతం ఇది కార్యదర్శుల స్థాయిలోనే ఉంది. అయితే దాన్ని మరింత విస్తృతం చేయడం కోసం 2+2 చర్చల ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. 2+2 చర్చల్లో ఇరు దేశాలూ వ్యూహాత్మక, భద్రతా అంశాలపై లోతుగా చర్చించుకుంటాయి. రక్షణ రంగానికి సంబం ధించి రెండు దేశాలూ మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ తమ సైనిక స్థావరాలను ఇరు దేశాలకూ చెందిన సైనిక దళాలు అవసర సమయాల్లో పరస్పరం వినియోగించుకోవడానికి వీలు కల్పించే ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని అంగీకారానికొచ్చాయి. ఈ మాదిరి ఒప్పందం మనకు ఇంతవరకూ అమెరికా, ఫ్రాన్స్‌లతో ఉంది. ఇది జపాన్‌తో కూడా కుదిరితే ఆఫ్రికా ఖండం లోని ఏడెన్ జలసంధి సమీపంలో జపాన్‌కున్న జిబౌతి స్థావరం మన నావికా దళానికి అందు బాటులోకొస్తుంది. అలాగే హిందూ మహా సముద్రంలోని అండమాన్, నికోబార్ దీవుల్లో భారత్ కున్న సైనిక స్థావరాలు జపాన్ ఆత్మరక్షణ దళాలకు వినియోగపడతాయి. మొన్న ఆగస్టులో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. మోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు తాజాగా దీనిపై తదుపరి చర్చలు జరపాలన్న నిర్ణయానికొచ్చారు. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి దేశమూ ఖండాంత రాల్లో తన సైనిక స్థావరాలు నెలకొల్పుకోవడానికి ప్రాధాన్యమిస్తోంది. మన దేశం హిందూ మహా సముద్ర ప్రాంత దేశమైన సేషెల్స్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటోంది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని క్రమేపీ విస్తరించుకోవడాన్ని గమనించాక మన దేశం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత స్థావరాల విషయంలో సేషెల్స్ సానుకూలత ప్రదర్శించినా స్వదేశంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో మొన్నీ మధ్య వెనకడుగేసింది. వాస్తవానికి సేషెల్స్ 2011లో సైనిక స్థావరం ఏర్పాటు చేయమని చైనాను కోరింది. అది అంగీకరించి ఆ పని పూర్తిచేసింది. సముద్ర దొంగల బెడద నివారణ కోసం ఇది అవసరమని సేషెల్స్ భావించింది. ఇప్పుడు భారత్‌ను కూడా అను మతిస్తే ఆ రెండు దేశాలమధ్యా మున్ముందు సమస్యలు తలెత్తి అవి యుద్ధానికి దారితీస్తే తమ భూభాగంలోనే అవి కత్తులు దూసుకునే ప్రమాదం ఏర్పడుతుందని అక్కడి విపక్షాలు ఆందోళన మొదలుపెట్టాయి. పర్యవసానంగా అది కాస్తా ఆగిపోయింది. యుద్ధ సమయాల్లో తమ దళాలకు అవసరమయ్యే ఆహారం, రక్షణ సామగ్రి తదితరాలను సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో చేరే యడం కోసం ఈ స్థావరాలను నెలకొల్పుకుంటారు. నిజానికి హిందూ మహా సముద్ర ప్రాంతాన్ని ఏ దేశమూ సైనిక స్థావరంగా వినియోగించుకోకుండా, దాన్ని శాంతి మండలంగా ప్రకటించాలని మన దేశంతో సహా చాలా దేశాలు కోరేవి. 60, 70 దశకాల్లో ఆసియా, ఆఫ్రికా దేశాలు దానిపై పట్టు బట్టేవి. 1971లో ఐక్యరాజ్యసమితి ఆ మేరకు తీర్మానం కూడా చేసింది. అప్పట్లో అమెరికా– సోవి యెట్ యూనియన్ల మధ్య ఉండే విభేదాల పర్యవసానంగా పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులుండేవి. తమ దగ్గర అలాంటి స్థితి ఏర్పడకూడదని హిందూ మహా సముద్ర ప్రాంత దేశాల భావన. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎవరికి వారు పోటీలు పడి సుదూర తీర ప్రాంతాల్లో తమ సైనిక స్థావరాలుండాలని కలలు కంటున్నారు. జిబౌతి నిరంకుశ పాలనలో ఉన్న అతి చిన్న దేశం కనుక అక్కడ జపాన్ సైనిక స్థావరానికి అడ్డంకులు ఏర్పడలేదు. ఇప్పుడా స్థావరాన్ని మనం కూడా వినియోగించుకోవడానికి జపాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది గనుక సేషెల్స్ వెనకడుగేయడం వల్ల వచ్చే నష్టం పెద్దగా ఉండదు. తూర్పు చైనా సముద్రంలోని కొన్ని దీవుల విషయమై చైనాతో ఏర్పడ్డ వివాదాల నేపథ్యంలో అంతర్జాతీయంగా తనకు మద్దతు కూడగట్టుకునేందుకు జపాన్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఆ దేశం మనతో సాన్నిహిత్యాన్ని మరింత పటిష్టపరుచుకోవాలన్న ఉత్సు కతతో ఉంది. అయితే ఇరు దేశాల మధ్యా వాణిజ్యం అనుకున్నంతగా విస్తరించడం లేదు. ద్వైపాక్షిక వాణిజ్యంపై 2011లో భారత్–జపాన్‌లు ఒప్పందం కుదుర్చుకున్నా అందులో పెద్దగా పురోగతి లేదు. 2017–18లో మూడేళ్లనాటితో పోల్చినా వాణిజ్యం అంతంతమాత్రమే. ఆ దేశానికి మన ఎగు మతులైనా, అక్కడినుంచి మన దేశానికి దిగుమతులైనా ఒకలాగే ఉన్నాయి. ఈ శిఖరాగ్ర చర్చల సందర్భంగా ఆ అంశం కూడా ప్రస్తావనకొచ్చింది. అయితే జపాన్ తాను రూపొందించిన నావి కాదళ విమానాలను మనతో డజను వరకూ కొనిపించాలని అయిదేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈసారి కూడా ఆ విషయంలో జపాన్‌కు నిరాశే ఎదురైంది. ఏదేమైనా ఈ శిఖరాగ్ర సమావేశం సాధించింది తక్కువేమీ కాదు. -
మరోసారి ట్రంప్–కిమ్ భేటీ!
-
మరోసారి ట్రంప్–కిమ్ భేటీ!
సియోల్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య మరో శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఉత్తర కొరియాలో ప్రస్తుతం పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ విషయమై పురోగతి సాధించారు. ప్యాంగ్యాంగ్లో ఆదివారం కిమ్‌తో రెండు గంటల పాటు సమావేశమైన పాంపియో.. అణు నిరాయుధీకరణతో పాటు అమెరికా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వీలైనంత త్వరగా ట్రంప్‌తో మరోసారి సమావేశం అయ్యేందుకు కిమ్ ఈ భేటీలో అంగీకరించారు. కిమ్‌తో భేటీ అనంతరం దక్షిణకొరియా చేరుకున్న పాంపియో అధ్యక్షుడు మూన్–జే–ఇన్ను కలుసుకున్నారు. ట్రంప్–కిమ్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి స్థలం, తేదీ ఖరారు కాలేదని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఉత్తర కొరియా, అమెరికాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండే దిశలో ఆదివారం చర్చలు సాగాయని కిమ్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సింగపూర్‌లో ట్రంప్–కిమ్ తొలిసారిగా సమావేశమైన సంగతి తెలిసిందే. -
పెట్టుబడులకు స్వర్గధామం.. భారత్
డెహ్రాడూన్: దేశంలో ప్రస్తుతం కీలక సామాజిక, ఆర్థిక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘డెస్టినేషన్ ఉత్తరాఖండ్: ఇన్వెస్టర్స్ సమ్మిట్–2018’ను ఆదివారం ఇక్కడ ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేనంతగా సామాజిక, ఆర్థిక మార్పులు సంభవిస్తున్నాయి. వచ్చే దశాబ్దాల్లో భారత్ ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా మారుతుంది’ అని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం తగ్గాయి. దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య, ఆర్థిక వృద్ధి పెరిగాయి. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న కనీసం 10వేల చర్యల వల్ల దేశంలో వ్యాపార అవకాశాలు గణనీయంగా పెరిగాయి’ అని తెలిపారు. స్వాతంత్య్రం తర్వాత దేశంలో చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ జీఎస్టీ అమలు. దీని ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్‌గా మారిపోయింది’ అని తెలిపారు. ‘మౌలిక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. దేశవ్యాప్తంగా దాదాపు 10వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 100 కొత్త హెలిప్యాడ్లు, విమానాశ్రయాలు అందుబాటులోకి రానున్నాయి. మా దేశంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నా. ఇది కేవలం భారతీయుల కోసమే కాదు, ప్రపంచం కోసం కూడా’ అని ప్రధాని అన్నారు. రాష్ట్రాల్లో అద్భుత వనరులున్నాయంటూ ఆయన.. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే జరిగే అద్భుత అభివృద్ధిని ఏశక్తీ ఆపలేదన్నారు. అనేక యూరప్ దేశాలను అధిగమించవచ్చన్నారు. ఉత్తరాఖండ్‌లో పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉన్నందున తమ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు ముందుకు రావాలని పారిశ్రామిక వేత్తలను కోరారు. దేశంలోనే ఆధ్యాత్మిక పర్యావరణ జోన్(స్పిరిట్యువల్ ఎకో జోన్)గా అవతరించేందుకు రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణ కొరియా మోడల్ ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పటి తన అనుభవాన్ని వివరించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరిగిన మీడియా సమావేశంలో కొందరు విలేకరులు నన్ను తికమకపెట్టేందుకు యత్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు వీరు ఎలాంటి మోడల్‌ను అనుసరించాలనుకుంటున్నారు అని నన్ను అడిగారు. వెంటనే నేను దక్షిణ కొరియాను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పా. నా సమాధానం వారికి అర్థం కాలేదు. దక్షిణకొరియా విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం దాదాపు గుజరాత్ మాదిరిగానే ఉంటాయి కాబట్టే ఆ దేశాన్ని మోడల్‌గా తీసుకున్నానని వారికి వివరించా’ అని అన్నారు. వ్యవసాయం, అగ్రిబిజినెస్తోపాటు ఆర్గానిక్ వ్యవసాయానికి ఉత్తరాఖండ్‌లో మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఈ రంగంలో పెట్టుబడులతో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చన్నారు. ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్యవేత్తలు ఎంతో ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆదానీ, మహింద్రా గ్రూప్ సంస్థలు, జేఎస్‌డబ్ల్యూ, అమూల్, పతంజలి వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు, ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు తెలిపారు. -
కొరియాల మధ్య శిఖరాగ్ర చర్చలు
సియోల్: చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఉభయ కొరియాల మధ్య శిఖరాగ్ర చర్చలు ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్–జె–ఇన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఉ.కొరియాకు వెళ్లారు. ప్యాంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అధ్యక్షుడు కిమ్–జొంగ్–ఉన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో ఇద్దరూ కలిసి అధ్యక్ష భవనానికి బయలుదేరారు. దక్షిణ కొరియా అధ్యక్షుడికి దారిపొడవునా వందలాది మంది ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు నేతలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు. ‘ప్రపంచం మొత్తం మమ్మల్ని గమనిస్తోంది. ప్రపంచ ప్రజలకు శాంతి, సంపదను సాధించడమనే బృహత్తర బాధ్యత నాపై ఉంది’ అనంతరం మూన్ మీడియాతో అన్నారు. ఇద్దరు నేతల మధ్య చర్చలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. సంపూర్ణ అణునిరాయుధీకరణ జరగాలని అమెరికా పట్టుబడుతుండగా, తమ దేశ భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర కొరియా కోరుతోంది. గత పదేళ్లలో ద.కొరియా అధ్యక్షుడొకరు ఉ.కొరియాలో పర్యటించడం ఇదే ప్రథమం. -
‘బిడ్డకు పాలివ్వడం కోసం.. ఇంత సొమ్ము వృధానా’
విల్లింగ్టన్ : దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా రికార్డుకెక్కిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘బ్రెస్ట్‌ఫీడింగ్ పేరు చెప్పి ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారంటూ’ న్యూజిలాండ్ పౌరులు ఆమెపై మండిపడుతున్నారు. విషయమేంటంటే.. రెండు నెలల క్రితం ఆర్డర్న్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా అందరిలానే సాధరణ మహిళ అయితే మెటర్నటి లీవ్ పెట్టి ఇంటి వద్దనే ఉంటూ తన చిన్నారి ఆలన పాలన చూసుకునేవారేమో. కానీ దేశాధ్యక్షురాలు కావడంతో కేవలం రెండు నెలలు మాత్రమే మెటర్నటి సెలవులు తీసుకుని, అనంతరం తన చిన్నారితో కలిసి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1 - 9 వరకూ నౌరులో జరగనున్న ‘పసిఫిక్ ఐస్‌ల్యాండ్స్ సమ్మిట్’కి ఆర్డర్న్ తన చిన్నారితో కలిసి హాజరయ్యారు. అయితే ఈ సమ్మిట్‌కి ఆర్డర్న్తో పాటు ఉప ప్రధాని విన్స్టన్ పీటర్స్ కూడా హాజరయ్యారు. ఒకే కార్యక్రమానికి హాజరవుతోన్న ప్రధాని, ఉప ప్రధాని మాత్రం రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించారు. ప్రయాణంలో తన బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుందని భావించి ఆర్డర్న్ ఇలా చేశారు. సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆర్డర్న్ తన బిడ్డకు పాలు ఇస్తూ ఉండి పోవడం వల్ల.. పీటర్స్ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకే సమావేశానికి హాజరవ్వడం కోసం ప్రధాని, ఉప ప్రధాని ఇలా రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 50,000(మన కరెన్సీలో దాదాపు 35 లక్షల రూపాయలు) డాలర్లు అదనపు భారం పడిందని హెరాల్డ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కివి ప్రజలు స్పందిస్తూ.. ‘ఇంత డబ్బు ఖర్చు చేసి మీరు ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అంత అవసరమా.. ఒక వేళ మీ డిప్యూటీ వెళ్తే సరిపోయేది అనుకుంటే అతన్నే పంపిస్తే అయిపోయేదిగా’ అంటూ ఆర్డర్న్‌ని విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు మద్దతు తెలిపే వారు మాత్రం.. ‘ఆర్డర్న్ తల్లిగా, దేశాధ్యక్షురాలిగా రెండు బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించించార’ని మెచ్చుకుంటున్నారు. ఈ విషయం గురించి ఆర్డర్న్‌ని వివరణ కోరగా.. ‘నేను ప్రత్యేక విమానంలో సమావేశానికి హాజరయినందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారు కదా.. ఒకవేళ నేను హాజరుకాకపోయినా ఇలానే విమర్శించేవారు. వీటన్నింటిని పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమ’ని తెలిపారు. -
మళ్లీ చురుగ్గా ‘బిమ్స్టెక్’
ఒక ప్రాంత దేశాలన్నీ సమష్టిగా కదిలితే సాధించనిదంటూ ఏమీ ఉండదు. నేపాల్ రాజధాని కఠ్మాండూలో రెండురోజులు కొనసాగి శుక్రవారం ముగిసిన బిమ్స్టెక్(బే ఆఫ్ బెంగాల్ ఫర్ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఆ దిశగా కొంత ముందడుగు వేసింది. 21 ఏళ్లక్రితం మన దేశంతోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక, థాయ్‌లాండ్‌లతో ‘బిస్ట్–ఈసీ’గా ఆవిర్భవించిన ఈ సంస్థ అనంతరకాలంలో నేపాల్, మయన్మార్ కూడా చేరటంతో పేరు మార్చుకుంది. బంగాళాఖాతం తీరాన ఉన్న దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు సాంకే తిక, ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాల్లో పరస్పరం సహరించుకోవటం దీని ప్రధా నోద్దేశం. ఉమ్మడి ప్రయోజనాలుండే మత్స్య పరిశ్రమ, రవాణా, కమ్యూనికేషన్లు, ఇంధనం వగైరా అంశాల్లో కూడా సమష్టిగా పనిచేయాలని ఈ దేశాలు నిర్ణయించుకున్నాయి. అయితే ప్రాంతీయ కూటముల్లోని దేశాలు ఇరుగుపొరుగైతే ఉమ్మడి ప్రయోజనాలతోపాటు సమస్యలు కూడా ఉంటాయి. దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి(సార్క్) ఇందువల్లే తగినంత శక్తిసామ ర్థ్యాలతో పనిచేయలేకపోతోంది. ఆ సంస్థ సభ్యదేశాలైన భారత్, పాక్‌ల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు దానికి అవరోధంగా నిలుస్తున్నాయి. బిమ్స్టెక్లో ఈ తరహా సమస్యలు పెద్దగా లేవు. మనకు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్‌లతో సరిహద్దులున్నాయి. ఇందులో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మనతో సత్సంబంధాలే కొనసాగిస్తున్నారు. మయన్మార్‌లో ఇంతక్రితం సైనిక పాలకులైనా, ఇప్పుడున్న పౌర ప్రభుత్వ అధినేతలైనా సఖ్యంగానే మెలిగారు. నేపాల్‌తో పొరపొచ్చాలున్నా అవి వైషమ్యాల స్థాయికి చేరలేదు. బిమ్స్టెక్లోని ఏడు దేశాల్లోనూ 150 కోట్లమంది జనాభా ఉన్నారు. ఈ దేశాలన్నిటి స్థూల దేశీయోత్పత్తులు మూడున్నర లక్షల కోట్ల డాలర్ల పైమాటే. ఈసారి శిఖరాగ్ర సదస్సు ప్రధానంగా శాంతియుత, సుస్థిర, సంపన్నవంత బంగాళాఖాత ప్రాంతాన్ని రూపుదిద్దేం దుకు చేయాల్సిన కృషిపై చర్చించింది. బిమ్స్టెక్ దేశాల్లో మన దేశం వేరే దేశాలతో పోలిస్తే ఆర్థికంగా, సైనికంగా చాలా పెద్దది. భార త్–పాక్‌ల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు సార్క్ ఎదుగుదలకూ, ఆ దేశాలమధ్య అర్ధవంతమైన సహకారానికి అవరోధంగా మారాయని ఈమధ్యకాలంలో గుర్తించిన మన దేశం బిమ్స్టెక్ పటి ష్టానికి ప్రయత్నించాలన్న నిర్ణయానికొచ్చింది. సార్క్‌లో తీసుకునే ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయం ప్రాతిపదికనే ఉండాలన్నది ప్రధానమైన షరతు. భారత్–పాక్‌లు రెండూ చాలా అంశాల్లో విభేదిం చుకుంటున్నాయి గనుక ఆ సంస్థలో నిర్ణయాలు తీసుకోవటం అసాధ్యంగా మారింది. ఉగ్రవాదు లకు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వటం మానుకుంటే తప్ప ఆ దేశంతో ఎటువంటి చర్చలూ జరపరాదని నిర్ణయించిన పర్యవసానంగా 2016లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సదస్సు రద్దయింది. ఇలాంటి ప్రాంతీయ సహకార కూటములు ఏర్పడినప్పుడు సహజం గానే పరస్పర అవిశ్వాసం తప్పదు. నేపాల్, బంగ్లాదేశ్ సార్క్ అంకురార్పణకు ప్రయత్నించిన ప్పుడు దాన్ని మన దేశం అనుమాన దృక్కులతో చూసింది. చిన్న దేశాలన్నీ తనకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయని భావించింది. భారత్–పాక్ ఉద్రిక్తతలు దీనికి తోడయ్యాయి. నాలుగేళ్లక్రితం కఠ్మాండూలో సార్క్ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు అందులో చైనాను కూడా చేర్చుకుందామని నేపాల్ ప్రతిపాదించింది. సహజంగానే దీనికి పాకిస్తాన్ మద్దతు పలికింది. అయితే మన దేశానికి ఇది ససేమిరా ఇష్టం లేదు. చెప్పాలంటే బిమ్స్టెక్కి కూడా ఇటువంటి సమస్యలున్నాయి. ఉనికి లోకొచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్నా దానికంటూ ముసాయిదా ప్రణాళిక రూపొందలేదు. స్థూలంగా కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకుని వాటి పరిధిలో పనిచేసుకుంటూ పోవటమే కొనసాగు తోంది. సార్క్ అనుభవాల తర్వాత మన దేశం దీనికి మళ్లీ జవజీవాలు కల్పించాలని భావించ టంతో ఇప్పుడీ శిఖరాగ్ర సదస్సు సాధ్యమైంది. మొదట్లో బిమ్స్టెక్పై సంశయపడిన నేపాల్ అనంతరకాలంలో ముందు పరిశీలక హోదాలో, అనంతరం పూర్తి స్థాయి సభ్య దేశంగా చేరింది. దీనివల్ల లాభపడటం ప్రారంభించింది కూడా. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడ్డాయి. ప్రస్తుత నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఏకకాలంలో అటు చైనాతోనూ, ఇటు మనతోనూ సఖ్యత కొనసాగించి లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు అగ్ర దేశాల అండ తమకుంటే అంతర్జాతీయంగా మరే దేశంపైనా ఆధారపడనవసరం లేదన్నది ఆయన ఉద్దేశం. అందుకే చైనా తలపెట్టిన భారీ ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)లో నేపాల్ చేరింది. అదే సమ యంలో మన సహకారంతో రైలు, రోడ్డు ప్రాజెక్టుల్ని చేపడుతోంది. మన ఇరుగుపొరుగు మునుపటిలా లేవు. కేవలం మనపైనే ఆధారపడే స్థితిని దాటుకుని ముందుకెళ్లాయి. ఒకదాని తర్వాత మరో దేశం చైనా ప్రభావంలో పడుతున్నాయి. అందుకే గతంతో పోలిస్తే మనం ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉంది. పెద్దన్నగా వ్యవహరిస్తున్నామన్న అభిప్రాయం చిన్న దేశాల్లో కలిగించకూడదు. ఇరుగు పొరుగుకు ప్రథమ ప్రాధాన్యం, ‘తూర్పు దిశగా కార్యాచరణ’ అనే రెండు లక్ష్యాలనూ సాధించటమే ధ్యేయమని బిమ్స్టెక్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. హిమశిఖరాలకూ, బంగాళాఖాతానికీ మధ్యనున్న దేశాలు తరచు తుఫానులు, భూకంపాల బారినపడుతున్నందున ఆ అంశాల్లో మరింత సమన్వయం, సహకారం పెరగాలన్న సూచన కూడా మెచ్చదగిందే. ఉగ్రవాదం, ఇతర అంతర్జాతీయ నేరాలకు పోత్సా హాన్నందించే దేశాలనూ, సంస్థలనూ గుర్తించి వాటిని జవాబుదారీ చేయాలని కఠ్మాండూ డిక్లరేషన్ ఏకగ్రీవంగా పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పటం, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవటం తమ ప్రధాన లక్ష్యాలని చాటింది. ఇకపై బిమ్స్టెక్ చురుగ్గా పనిచేస్తుందని ఆశించాలి. -
నేపాల్ పర్యటనలో ప్రధాని మోదీ
-
పుతిన్ పాచికకు ట్రంప్ చిత్తు...!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో శిఖరాగ్ర భేటీ ద్వారా కొంత సానుకూల ఇమేజి పొందాలనుకున్న డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిన్లాండ్లోని హెల్సెంకీలో జరిగిన భేటీలో పుతిన్ ముందు ట్రంప్ తేలిపోయారని, గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ స్థాయిలో అణిగిమణిగి, దిగజారిపోలేదంటూ కొందరు అమెరికన్ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు దుమ్మెత్తిపోసాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదంటూ పుతిన్ ఇచ్చిన స్వయం దృవీకరణకు ట్రంప్ వంతపాడడాన్ని అమెరికన్ రాజకీయ నేతలు, మీడియా తూర్పారపడుతున్నాయి. ట్రంప్ ఇష్టపడే ‘ఫాక్స్’ నెట్వర్క్ సైతం పుతిన్‌తో కలిసి ఆయన నిర్వహించిన వివాదాస్పద మీడియా సమావేశాన్ని ఎండగట్టింది. అమెరికా నిఘా వ్యవస్థపై కంటే కూడా పుతిన్ చెప్పిన మాటలనే తాను నమ్ముతున్నానని ట్రంప్ పేర్కొనడాన్ని సీఎన్ఎన్, ఫాక్స్ ఇతర సంస్థలు తప్పుబట్టాయి. టీవీ చర్చలతో పాటు, ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా ట్రంప్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రెండు పెద్ద దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశమంటే అంతర్జాతీయ సమాజంపై ప్రభావం చూపే నిర్ణయాలు ఏవైనా వెలువడతాయా అన్న భావనకు భిన్నంగా అమెరికా స్థానిక రాజకీయాలు అక్కడ చర్చనీయాంశం కావడాన్ని పరిశీలకులకు సైతం మింగుడుపడడం లేదు. గత ఎన్నికల్లో తాను హిల్లరీ క్లింటన్‌ను సులభంగా ఓడించానని, అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై స్పెషల్ ప్రాసిక్యూటర్ రాబర్ట్ మలర్ విచారణ అవమానకరమైనదిగా ట్రంప్ అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ అంశాలపై, రెండు దేశాల సంబంధాలపై కూలంకశంగా చర్చించాల్సిందిపోయి పుతిన్ పన్నిన రాజకీయ ఉచ్చులో ట్రంప్ సులభంగా పడిపోయారని వారి అభిప్రాయం. అమెరికా ఎన్నికల్లో 12 మంది రష్యన్ మిలటరీ అధికారుల ప్రమేయం ఉందంటూ ఇటీవలే మల్లర్ నిగ్గుతేల్చారు. సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ, ఇతర సంస్థలు కూడా దీనిని నిర్థారించాయి. అయితే తమ నిఘా సంస్థల విచారణను తిరస్కరించేలా ట్రంప్ చేసిన ప్రకటన వల్ల అమెరికన్ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్టుగా మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. ట్రంప్ వేసిన తప్పటడుగు వల్ల పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి రావచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. రష్యా జోక్యంపై మల్లర్ నిర్థారణ నేపథ్యంలో అసలు పుతిన్‌తో శిఖరాగ్ర భేటీనే రద్దు చేసుకోవాలనే వత్తిడి ట్రంప్‌పై వచ్చింది. అయినా ఖాతరు చేయకుండా అమెరికా గత విధానాలను బహిరంగంగా విమర్శించారు. కొన్నేళ్ల అమెరికా మూర్ఖత్వం, అవివేకం కారణంగా రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు ఎన్నికల ఫలితాలను ఆ దేశం ప్రభావితం చేసిందనే ఆరోపణలతో అవి మరింత దిగజారాయని ఈ భేటీకి ముందు ట్రంప్ చెప్పారు. అంతేకాకుండా రష్యా కంటే కూడా ఐరోపా సంఘం (ఈయూ)మే పెద్ద శత్రువు అన్న ఆయన మాటలూ అమెరికన్లకు రుచించడం లేదు. విభేదాలను మరిచిపోయారా ? రష్యా వైఖరిపట్ల అమెరికాకు అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆ దేశం క్రీమియాను కైవసం చేసుకోవడం, ఉక్రేయిన్‌పై ఆధిపత్యం చెలాయించడం, సిరియా విషయంలో రెండు దేశాలు పరస్పరభిన్నమైన వైఖరి తీసుకోవడం, అమెరికా వ్యతిరేకిస్తున్న ఇరాన్ ప్రభుత్వానికి రష్యా మద్దతు కొనసాగింపు, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ఉన్ను తనపావుగా అమెరికాపై పుతిన్ ప్రయోగిస్తున్నాడనే అనుమానాలు, నాటో దేశాల విస్తరణను రష్యా వ్యతిరేకించడం వంటివి కొంతకాలంగా ఈ రెండుదేశాల మధ్యనున్న వైరం కొనసాగడానికి కారణమవుతున్నాయి. శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాలపై చర్చించకుండా రష్యాకు వత్తాసు పలకడం ఎవరికీ కొరుకున పడడం లేదు. ఈ స్థాయిలో భేదాభిప్రాయాలున్నప్పటికీ పుతిన్ తానా అంటే ట్రంప్ తందానా అనడం అమెరికన్ల వ్యతిరేకతకు కారణమవుతోంది. -
‘ట్రంప్.. ఓ ఫ్యాన్‌బాయ్‌లా ప్రవర్తించారు’
వాషింగ్టన్ : రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు ఫిన్లాండ్లోని హెల్సింకిలో సమావేశమైన విషయం తెలిసిందే. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇదొక మంచి ఆరంభమనుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని వ్యాఖ్యానించగా.. పుతిన్ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’ సాగాయని తెలిపారు. అయితే పుతిన్‌తో ట్రంప్ భేటీ గురించి ప్రస్తావిస్తూ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ సెనేటర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆటోగ్రాఫ్ కోసం వెళ్లారా...? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందు.. ట్రంప్ ఓ ఫ్యాన్ బాయ్‌లా ప్రవర్తించారని ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ విమర్శించారు. ‘ట్రంప్.. పుతిన్‌తో మీరు జరిపిన మంతనాలను చూశాను. చాలా ఇబ్బందిగా అనిపించింది. మీరక్కడ ఓ తడి నూడుల్లా నిల్చుని ఉన్నారు. మీ వాలకం చూస్తుంటే పుతిన్ ఆటోగ్రాఫ్ కోసమో, లేదా సెల్ఫీ దిగడానికో వెళ్లినట్లు ఉంది. సమావేశంలో భాగంగా అమెరికా కమ్యూనిటీని అమ్మేశారు. దేశం పరువు తీసేశారంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో పాటు శ్వేత సౌధ ప్రతినిధుల తీరును కూడా ఆయన తప్పు పట్టారు. -
ట్రంప్, పుతిన్‌ను ఆ దేశం నవ్వించలేకపోయింది!
ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ట్రంప్ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు. హెల్సింకి: 18 నెలల క్రితం దేశాధ్యక్షుడయిన వారొకరు, 18 సంవత్సరాలుగా దేశాన్ని నడుపుతున్న వారొకరు. ఆ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు దేశాలకు అధిపతులు. అనేక అంశాల్లో పోటీ కారణంగా ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఘర్షణాత్మక వాతావరణమే నెలకొంది. అయితే ఇప్పడు కొత్తగా మైత్రి కోసం ఇరు దేశాధినేతలూ ప్రయత్నించారు. ఆ ఇద్దరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వివిధ అంశాలపై చర్చల కోసం వీరిద్దరూ తొలిసారిగా ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో సోమవారం భేటీ అయ్యారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంలోని మిగతా దేశాలపై కూడా ఉంటుంది కాబట్టి వీరి భేటీకి అంత ర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ అనంతరం ఇద్దరు నేతలూ సానుకూలంగా స్పందించారు. పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ సోమవారం ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరిగింది. సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఆరంభమని నేననుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని అన్నారు. అటు పుతిన్ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’ సాగాయని తెలిపారు. ఫిన్లాండ్ అధ్యక్ష భవనంలోని ఓ గదిలో ఇద్దరు నేతలు రహస్యంగా భేటీ అయ్యి రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో గదిలో అనువాదకులు తప్ప మరెవరూ లేరు. ట్రంప్, పుతిన్‌లు ఒకరితో ఒకరు ఏకాంతంగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పుతిన్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్.. భేటీ కోసం గదిలోకి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ‘రష్యాతో అమెరికా సంబంధాలు ప్రస్తుత అధమ స్థాయికి పడిపోవడానికి గత అమెరికా ప్రభుత్వాలే కారణం’ అని నిందించారు. చర్చల ప్రారంభానికి లోనికి వెళ్లే ముం దు ఇద్దరూ ముభావంగానే మీడియాతో మాట్లాడారు. ఇద్దరి ముఖాల్లోనూ పెద్ద ఉత్సాహం కనిపించలేదు. బంధాల బలోపేతానికి కృషి అమెరికా, రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామని ట్రంప్, పుతిన్‌లు భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించడం కోసం సహకారంతో పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సిరియా, ఉక్రెయిన్, చైనా, అంతర్జాతీయ వ్యాపారంలో సుంకాలు, అణ్వాయుధ సంపత్తి తదితరాలపై తాము చర్చించామన్నారు. ‘మా బంధాలు ఇప్పుడున్నంత బలహీనంగా గతంలో ఎప్పుడూ లేవు. అయితే నాలుగు గంటల క్రితం పరిస్థితి మారిందని నేను నమ్ముతున్నా. ఇదొక మలుపు’ అని ట్రంప్ అన్నారు. రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పడంలో ఇది ఆరంభం మాత్రమేనన్నారు. పుతిన్ మాట్లాడుతూ ‘మా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేవన్నది అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత ఉద్రిక్త వాతావరణానికి పెద్ద కారణాలేవీ లేవు’ అని అన్నారు. రష్యా నుంచి గ్యాస్, ముడి చమురును జర్మనీకి తరలించేందుకు నార్డ్ స్ట్రీమ్2 పైప్‌లైన్‌ను నిర్మించినప్పటికీ ఉక్రెయిన్ మీదుగా తమ గ్యాస్ సరఫరా కొనసాగుతుందని ట్రంప్‌కు తాను హామీనిచ్చినట్లు చెప్పారు. నార్డ్ స్ట్రీమ్2 వల్ల అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు దెబ్బతింటాయా? అన్న ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు. జోక్యంపై చాలా సేపు మాట్లాడాం: ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం గురించి కూడా తాము చాలా సమయమే మాట్లాడామని ట్రంప్ చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి ఇతర వివరాలను వెల్లడించని ఆయన.. రష్యా జోక్యం లేదంటూ బహిరంగంగా చెప్పనూలేదు. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటూ ఇటీవల అమెరికా 12 మంది రష్యా నిఘా అధికారులపై అభియోగం మోపడాన్ని విలేకరులు ప్రస్తావించగా, రష్యా జోక్యం ఎంత మాత్రం లేనట్లు పుతిన్ తనకు చెప్పారనీ, ఈ అంశంలో రాబర్ట్ ముల్లర్ చేసిన విచారణ విఫలమైందని ట్రంప్ పేర్కొన్నారు. తన ప్రచార బృందానికి రష్యాతో ఏ సంబంధాలూ లేవని ట్రంప్ పునరుద్ఘాటించారు. అటు పుతిన్ కూడా ‘అమెరికా అంతర్గత వ్యవహారాల్లో రష్యా ఎప్పడూ తలదూర్చలేదు. భవిష్యత్తులో ఆ పని చేసే ప్రణాళికలూ లేవు’ అని తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను, ముడి చమురు ధరలను నియంత్రించడం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని పుతిన్ ప్రకటించారు. ట్రంప్‌కు సంబంధించిన రహస్య సమాచారమేదో రష్యా వద్ద ఉందన్న వాదనలను పుతిన్ కొట్టిపారేశారు. ట్రంప్ తన వ్యాపార అవసరాల కోసం మాస్కోకు వచ్చినప్పుడు ఆ విషయం కూడా తనకు తెలిసేది కాదన్నారు. ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ట్రంప్ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు. ఆధిపత్యం.. నిస్సహాయత లండన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల భేటీ సందర్భంగా వారి శరీర కదలికలు, హావభావాలపై ఓ బ్రిటన్‌కు చెందిన సైకాలజిస్ట్ పీటర్ కొల్లెట్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హెల్సింకీలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆధిపత్య ధోరణితో ప్రవర్తించారనీ, మరికాసేటికే నిస్సహాయంగా కన్పించారని వెల్లడించారు. ‘ఇద్దరు నేతలు ఒకరి సమక్షంగా మరొకరు అంత రిలాక్స్‌గా కన్పించలేదు. చర్చల గదిలోకి ట్రంప్ దర్జాగా ప్రవేశిస్తే, పుతిన్ మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసంతో లోపలకు వచ్చారు. ఈ సమావేశం లో కుడివైపు కూర్చున్న ట్రంప్.. పుతిన్‌కు తలొగ్గుతున్నట్లు అరచేతిని సాధారణం కంటే కొంచెం పైకెత్తి ఆయనతో కరచాలనం చేశారు. తద్వారా చర్చల్లో మరింత చొరవ తీసుకోవాలని పుతిన్‌ను పరోక్షంగా కోరినట్లయింది. అంతలోనే పుతిన్‌ను కూర్చోవాల్సిందిగా కుర్చీ చూపించడం ద్వారా మొత్తం పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు ట్రంప్ యత్నించారు’ అని కొల్లెట్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ చేతుల్ని గోపురం ఆకారంలో ఉంచడంపై స్పందిస్తూ.. ‘చుట్టూ ఉన్నవారి కంటే తాను గొప్పవాడినని భావించే లేదా ఆత్మన్యూనతాభావంతో ఉండే వ్యక్తులే ఇలా చేతుల్ని పెడతారు. పుతిన్‌తో కరచాలనం సమయంలో ట్రంప్ ఇబ్బందిగా కన్పించారు. సమావేశంలో అధిక్యం ప్రదర్శించేందుకు అవకాశం రాకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. భేటీ సందర్భంగా ట్రంప్ మాటలు, హావభావాలకు పుతిన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు’ అని అన్నారు. -
మరో శిఖరాగ్ర భేటీకి సిద్ధమైన ట్రంప్
హెల్సింకి: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సింగపూర్‌లో చారిత్రక శిఖరాగ్ర భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి మరో సమావేశానికి సిద్ధమయ్యారు. అమెరికాతో అత్యంత బలహీన సంబంధాలు ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ సోమవారం ఫిన్లాండ్లో భేటీ కానున్నారు. ట్రంప్, పుతిన్ ఏకాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోనుండటం (వన్ టు వన్) ఇదే తొలిసారి. వీరు భేటీ అయ్యే గదిలో అనువాదకులు తప్ప మరెవరూ ఉండరు. ఫిన్లాండ్ అధ్యక్ష భవనంలోని గోథిక్ హాల్లో ట్రంప్, పుతిన్‌లు సమావేశమవుతారు. ప్రస్తుతం అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు ఏ మాత్రం బాగా లేవనీ, బలమైన బంధం కోసం ప్రయత్నం ప్రారంభిస్తున్నామని రష్యా ప్రభుత్వ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ట్రంప్‌ను ‘సంప్రదింపులు జరిపే నేత’గా తాము పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు గతంలో రష్యా కోసమే పనిచేసిన ఓ గూఢచారిపై రష్యానే బ్రిటన్‌లో విషప్రయోగం చేసిందన్న ఆరోపణలు, సిరియా అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి రష్యా మద్దతు, క్రిమియాను ఆక్రమించుకోవడం, రష్యాతో ట్రంప్ కఠినంగా వ్యవహరించట్లేదంటూ నాటో సభ్య దేశాల భయాలు తదితర అంశాల నేపథ్యంలో ట్రంప్, పుతిన్‌ల శిఖరాగ్ర భేటీపై ఉత్కంఠ నెలకొంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్లతో ఘర్షణాత్మక వాతావరణం నుంచి స్నేహం వైపు మళ్లిన ట్రంప్, ఇప్పుడు పుతిన్‌తో కూడా అదే రీతిలో వ్యవహరిస్తారో లేదోనని అమెరికా, రష్యాల మిత్రదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్‌తో సన్నిహిత బంధానికే పుతిన్ మొగ్గు చూపొచ్చనీ, ట్రంప్ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తారని నిపుణులు అంటున్నారు. భారీ అంచనాలేమీ లేవు: ట్రంప్ పుతిన్‌తో భేటీపై ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ ‘నేనేమీ భారీ అంచనాలతో ఈ సమావేశానికి వెళ్లడం లేదు. కానీ ఈ భేటీ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఫలితాలు సానుకూలంగా ఉండొచ్చు తప్ప చెడు జరగదు’ అని అన్నారు. తాను రష్యాతో తొలి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నాననీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశాన్ని కూడా పుతిన్‌తో చర్చల్లో కచ్చితంగా ప్రస్తావనకు తెస్తానని ట్రంప్ చెప్పారు. 12 మంది రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాట్ల అకౌంట్లను హ్యాక్ చేశారంటూ వారిపై ఇటీవలే అమెరికా నేరాభియోగాలు మోపింది. ఆ 12 మందిని తమకు అప్పగించాలని కూడా తాను పుతిన్‌ను కోరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. నేరాభియోగాలు నమోదైన నేపథ్యంలో పుతిన్‌తో భేటీని రద్దు చేసుకోవాలని డెమొక్రాట్లు నాలుగు రోజుల క్రితం ట్రంప్‌ను కోరినా, శ్వేతసౌధం తిరస్కరించింది. కాగా, రష్యాను తిరిగి జీ–7 కూటమిలో చేర్చి, మళ్లీ జీ–8గా మార్చాలని కూడా ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పుడు వారు చర్చిస్తే ఫలితం ఎలా ఉంటుందోనని అమెరికా మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. శత్రువులే కానీ..: రష్యాతోపాటు చైనా, యూరోపియన్ యూని యన్ (ఈయూ) అమెరికాకు శత్రువులని ట్రం ప్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మాకు చాలా మంది శత్రువులున్నారని నేననుకుంటాను. ఈయూ ఒక శత్రువు. వాణిజ్యంలో వారు మాకు ఏం చేస్తున్నారు? కొన్ని అంశాల్లో రష్యా కూడా శత్రువే. ఆర్థికాంశం పరంగా చైనా మాకు కచ్చితంగా శత్రువే. అయితే వీళ్లంతా చెడ్డవాళ్లని కాదు. పోటీ తత్వం ఉన్నవారు మాత్రమే’ అని ట్రంప్ చెప్పారు. కాగా, బ్రిట న్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. ఫిన్లాండ్లోనూ ట్రంప్ అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు. -
మనవాళ్లు ‘లుంగీ దోశె’ వెయ్యగలరు
♦ జీవన కాలమ్ అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు ట్రంప్, కిమ్ మధ్య సమావేశం అనుకు న్నంత గొప్పగా జరగక పోవడానికి కారణాలు నాకు తెలుసు. నిజానికి నాకే తెలుసు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే– దాదాపు అన్ని విదేశాలలో భారతీయ ఆహారం అంటే– ఉత్తర దేశపు ఆహారమనే అర్థం. నేనూ, మా పెద్ద బ్బాయి చాలా సంవత్సరాల కిందట నెదర్లాండ్స్‌లో గ్రహించాం. అక్కడ ‘ఇండియన్ రెస్టా రెంట్’ అన్న బోర్డు చూడగానే మా ఇద్దరికీ ప్రాణం లేచి వచ్చింది. రెస్టారెంటు పేరు ‘మహారాజా’. తీరా వెళ్లి చూస్తే– తందూరీ రోటీ, తందూరీ కుఫ్టా, చోళా భటూరే, భైంగన్ భర్తా, కశ్మీరీ దమ్ ఆలూ, చికెన్ టిక్కా నెడ్ (ఈ ‘నెడ్’ ఏమిటని అడిగితే, తింటున్న ఓ విదేశీ మనిషి చెప్పాడు. అది నెదర్లాండ్స్ స్పెషల్ అట). ఏమైనా మా రోగం కుదిరింది. అన్నట్టు ‘రుమాలీ రోటీ’ మరిచిపోయాను. మనవాళ్లు తలచుకుంటే ‘గావంచా దోశె’, ‘లుంగీ దోశె’, ‘గోచీ దోశె’ కూడా వెయ్యగలరని వారికి తెలీదు. కొత్తవాళ్లకి కొత్త రుచులు నేర్పాలంటే మనకి బాగా నలిగిన వంటకాలను ఎంపిక చేయాలి. వీరిద్దరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినపని ఇద్దరు తమిళ మంత్రులకు అప్పగించారు. న్యాయంగా భోజ నంలో తమిళ రుచులు వీటు దోశె, పొగైల్, అవి యల్, వెర్త కుళంబు వంటివి సమృద్ధిగా ఉండాలి. అలాంటిది– పులావు, చేపల కూర, కోడి కూర, చికెన్ కుర్మా వంటివి ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఎక్కడ దెబ్బ కొట్టిందో నాకు వెంటనే అర్థమైపోయింది. ఇలాంటి చోట ఒక తెలుగు వంటవాడిని కల పాలని నా ఉద్దేశం– పుల్లట్లు, మినపట్లు, పెసరట్లు, నాటుపెసర దోశె, బొబ్బట్టు, పొన్నగంటి పచ్చడి, బచ్చలి మజ్జిగ పులుసు, చిట్టి గారెలు, పెనం గారెలు, ఉల్లి గారెలు, పచ్చి పులుసు– ఇలాంటివి సమృద్ధిగా ఏర్పాటు చేసి ఉండాలి. కిమ్ దొర గారికి అమెరికా క్షిపణుల మీద చుర్రు మని కోపం వచ్చినప్పుడు– వారి చేతికి చిట్టి గారెలు అందించాలి. ట్రంప్ కిమ్‌ని కరుచుకు తినేసేటట్టు చూసేటప్పుడు– ఒక పుల్లట్టు రుచిని వారి ముందు ఉంచాలి. తెలుగు రుచులు తెలియని అరవ మంత్రులు కేవలం 15 దేశాల రుచులను వారి ముందుంచారు కానీ, తమ రాష్ట్రపు రుచులను కానీ, ఆ మాటకు వస్తే పొరుగు రాష్ట్రపు రుచులను కానీ ఎంపిక చేయక పోవటం చాలా ఘోరం. వీరు పెట్టిన పదార్థాలన్నీ ఈ కార్యక్రమాన్ని తమ తమ పేపర్లలో రాయడానికి వచ్చిన 3 వేల మంది పాత్రికేయులకు పెట్టారు. వారంతా సుష్టుగా భోజనం చేశారు కానీ ఎవరూ బాలకృష్ణన్తోగానీ, షణ్ముగమ్తోగానీ వారు ‘మిస్’ అవుతున్న రుచుల గురించి వివరించకపోవడం అత్యంత శోచనీయం. ఎటువంటి సమస్యనయినా కమ్మని భోజనం పరిష్కరిస్తుంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ‘ఒక గ్లాసు మజ్జిగ తాగండి’ అంటాం. అందులో ‘చలవ’ ఎక్కువ. అలాగే చర్చలకు ముందు– మన తెలుగు వంటవాడు ఉంటే– మడత కజ్జికాయలు, పాలకా యలు, బూందీ గారె, ఉల్లిపాయ పకోడీలు, శనగ పప్పు బఠాణీలు, వేపుడు వేరు శెనగపప్పు, చిన్న కారం అతికించి నానబెట్టిన అటుకుల తాళింపు, పెసర పుణుకులు– ఇలాంటివి చేసి పెట్టేవాడు. చర్చలు ప్రారంభానికి ముందే ఇద్దరు నాయకులూ– ఈ పదార్థాలు నంచుకుని– ‘చర్చలు రేపు చేద్దాం. ముందు వీటిని తిందాం’ అనుకునేవారని నా ఉద్దేశం. అయితే ఇందులో చిన్న పితలాటకం ఉంది. తమిళ వంటవారి సంగతి నాకు తెలీదు కానీ తెలుగు వంటవారు ముఖాలు చూస్తూ వారి వంటకాలు తినలేం, ఇలా అందరినీ అవమానించడం లేదని తమరు గుర్తించాలి. రత్నాలు రాళ్లలో ఉంటాయి. అవి తీసి మెరుగు పెడితేనే రత్నమని తెలుస్తుంది. నాకీ అనుభవం చాలా ఉంది. ‘దోశె చూస్తూ తింటారా? తిని చూస్తారా?’ అని ఒక మిత్రుడు పొద్దున్నే మా ఆవిడనీ, నన్నూ ఒక ఊళ్లో అడిగాడు. ఊరు పేరు చెప్పను. ఇదేం ప్రశ్న? అనుకున్నాను. ‘మంచి దోశె తింటాను’ అన్నాను. నన్ను కారులోనే కూర్చోపెట్టి వెళ్లి రెండు దోశెలు తెచ్చాడు. అపూర్వం. ఆనాడు ఇద్దరం తలో మూడు దోశెలు తిన్నాం. ఆ తర్వాత మా మిత్రుడు వద్దంటున్నా ఆ వంటవాడిని చూడా లన్నాను. నన్ను వారించడం చేతగాక పిలుచుకొచ్చాడు. ఆ కుర్రాడిని చూస్తూనే మూర్ఛబోయాను. అంత ‘అసందర్భం’గా, అసహ్యంగా ఉన్నాడు. అక్కడితో ఆగుతాను. ‘మా తెలుగు తల్లికి’ రాసి తెలుగు తల్లికి నీరాజనాలర్పించిన శంకరంబాడి.. డిలన్ థామస్ జ్ఞాపకం వచ్చారు. ప్రతిభకీ, జీవనానికీ సంబంధం లేదు. అంత గొప్ప పనివాడు. వంటని అలం కరించాడు కానీ తనని కాదు. ఏమైనా సింగపూర్‌లో పెద్ద చరిత్రను సృష్టించిన ఇద్దరు తమిళ మంత్రులు– మొన్న గొప్ప అవకాశాన్ని నష్టపోయారని మనవి చేస్తున్నాను. గొల్లపూడి మారుతీరావు -
శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ ‘సమ్మిట్’
వాషింగ్టన్: ప్రపంచంలో సాంకేతికంగా అత్యంత శక్తిమంతమైన సూపర్ కంప్యూటర్ను అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ కంప్యూటర్ సెకన్‌కు 2 లక్షల ట్రిలియన్ గణనలను చేస్తుందని తెలిపారు. ఇంధన రంగం, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో మరింత పరిశోధనలకు ఈ సూపర్ కంప్యూటర్ విప్లవాత్మక మార్పులు తెస్తుందని వెల్లడించారు. ఈ సూపర్ కంప్యూటర్ పేరు ‘సమ్మిట్’. ఇప్పటివరకు సూపర్ కంప్యూటర్‌గా ఉన్న టైటాన్ కంటే సమ్మిట్ ఎనిమిది రెట్లు శక్తిమంతమైనదని దీనిని అభివృద్ధి చేసిన యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ వెల్లడించింది. కొన్ని రకాల పరిశోధన విభాగాల్లో సెకన్‌కు మూడు బిలియన్ బిలియన్ల మిశ్రమ గణనలను కూడా చేయగలగడం దీని ప్రత్యేకత. -
‘అమెరికాకు అతిపెద్ద శత్రువులు మీరే’
వాషింగ్టన్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరిగిన చారిత్రాత్మక భేటీ గురించి అమెరికన్ మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేసిందంటూ డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ట్విటర్ వేదికగా మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. ‘ముఖ్యంగా ఎన్బీసీ, సీఎన్ఎన్ వంటి మీడియా సంస్థలు ప్రచారం చేసే నకిలీ వార్తలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఉత్తర కొరియాతో జరిగిన ఒప్పందం గురించి తక్కువ చేసి చూపించడానికి వారు ఎంతో కష్టపడ్డారు. .. ఈ ఒప్పందం జరగాలంటూ 500 రోజుల క్రితం ఏదో ఉపద్రవం ముంచుకొస్తుందా అన్న స్థాయిలో గగ్గోలు పెట్టిన వారే ఇప్పుడు ఈవిధంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారే మన దేశానికున్న అతిపెద్ద శత్రువులంటూ’ ట్రంప్ ట్వీట్ చేశారు. భేటీ అనంతరం అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సమ్మతించిన నేపథ్యంలో భారీ అణు విపత్తునుంచి ప్రపంచం ఒక అడుగు వెనక్కు వేయగలిగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశంపై కొందరు ‘నిపుణులు’ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించినట్లే.. ట్రంప్ ట్వీట్‌పై న్యూయార్క్ యూనివర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్ జే రోసన్ స్పందించారు. ‘వాస్తవాలను తొక్కిపెట్టాలనే ప్రయత్నమే ఇది. ఒకవేళ నిజాలను అంగీకరించలేకపోతే.. ఈ ప్రపంచంలో వివాదాలు తప్ప నిజమనేదే ఉండదు. జవాబుదారీతనం కూడా ఉండదు. భావప్రకటనా స్వేచ్ఛకు ఇది పూర్తి విరుద్ధం’ అంటూ వ్యాఖ్యానించారు. So funny to watch the Fake News, especially NBC and CNN. They are fighting hard to downplay the deal with North Korea. 500 days ago they would have “begged” for this deal-looked like war would break out. Our Country’s biggest enemy is the Fake News so easily promulgated by fools! — Donald J. Trump (@realDonaldTrump) June 13, 2018 -
ట్రంప్-కిమ్ భేటీ : అయితే భారత్‌కేంటి ?
సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ జరిపిన అణు చర్చలు ఎలాంటి ఫలితాన్నిస్తాయా అని ఆసక్తిగా ఎదురు చూసిన దేశాలలో భారత్ కూడా ఒకటి. మొదట్నుంచి ట్రంప్, కిమ్ వేస్తున్న అడుగుల్ని నిశితంగా గమనిస్తున్న భారత్ సదస్సు విజయవంతం కావడాన్ని స్వాగతించింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతలకు ఈ చర్చల ద్వారా మార్గం ఏర్పడిందని భారత్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ఇరుగుపొరుగు దేశాలకు అణుపరిజ్ఞానం వ్యాప్తికి ఇకనైనా అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఉత్తరకొరియా, పాకిస్తాన్ మధ్య అణు సంబంధాలు కొనసాగుతున్నాయనే ఆందోళనలో ఉన్న భారత్ ఈ చర్చల ద్వారా తమ ఆందోళనలకు కూడా తెరపడుతుందని ఆశగా ఎదురు చూస్తోంది. ట్రంప్, కిమ్ చర్చలు సానుకూలంగా జరగడం భారత్‌కు కలిసొచ్చే అంశమనే అంచనాలు ఉన్నాయి. దౌత్యపరంగా, వాణిజ్యపరంగా వీరి శిఖరాగ్ర సదస్సు భారత్‌కు లాభిస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దౌత్యం బంధాలు బలపడేలా .. భారత్‌కు మొదట్నుంచి ఉత్తర కొరియా శత్రుదేశమేమీ కాదు. దాదాపుగా 20 ఏళ్ల తరవాత గత నెలలో ఉత్తర కొరియాలో పర్యటించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్ ఉత్తర కొరియాను మిత్ర దేశంగానే అభివర్ణించారు. 1962–73 మధ్య కాలంలో రెండు దేశాల మధ్య బంధాలు బలోపేతం దిశగా అడుగులు పడ్డాయి. అయితే ఉత్తర కొరియా, పాక్ మధ్య అణు సంబంధాలు, క్షిపణి సాంకేతిక సహకారం ఎప్పుడైతే కొనసాగాయో భారత్ ఉత్తర కొరియాతో అంటీముంటనట్టుగా వ్యవహరించడం మొదలు పెట్టింది. పాకిస్థాన్‌కు ఉత్తర కొరియా అణు పరిజ్ఞానం అమ్ముతోందన్న కారణంగానే ఐక్యరాజ్యసమితిలో కొరియాపై ఆంక్షల తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. అయినప్పటికీ భారత్ ఉత్తర కొరియా పట్ల ఎల్లప్పుడూ మానవతా దృక్పథంతోనే వ్యవహరిస్తూ వచ్చింది. భారత్‌లో ఉత్తర కొరియా సైనికులకు శిక్షణ, డెహ్రడూన్‌లోని సెంటర్‌ఫర్ స్పేస్‌సైన్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌లో ఉత్తర కొరియా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చింది. కరువు కాటకాల సమయంలో ఆ దేశానికి చాలాసార్లు వందల టన్నుల ఆహార పదార్థాల్ని పంపించింది. ఉత్తర కొరియా కూడా భారత్‌ను సునామీ ముంచెత్తినప్పుడు 30 వేల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇప్పుడు ట్రంప్, కిమ్ చర్చల ఫలితంగా ఆసియా ఖండంలో అణ్వాయుధ వ్యాప్తి నిరోధం జరిగి శాంతిభద్రతలు ఏర్పడతానే ఆశాభావంతో భారత్ ఉంది. వాణిజ్యపరంగానూ ప్రభావం ! ఉత్తరకొరియాతో వాణిజ్యపరంగానూ భారత్ సత్సంబంధాలనే కలిగి ఉంది. ఉత్తర కొరియాతో వాణిజ్య భాగస్వామ్యులుగా ఉన్న దేశాలలో భారత్ మూడో అతి పెద్ద దేశంగా ఉంది. ప్రభుత్వ గణాంకాలప్రకారం 2015–16 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య 5.9 కోట్ల డాలర్ల వ్యాపార లావాదేవీలు జరిగాయి. గత ఏడాది ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన తర్వాత ఆందోళన చెందిన భారత్ ఆ దేశంపై వాణిజ్యపరమైన ఆంక్షల్ని విధించింది. ట్రంప్, కిమ్ సమావేశంలో ఉత్తర కొరియా అణు నిరాయుధీకరణకు అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం చేపట్టిన తూర్పు దేశాలతో వాణిజ్య బం«ధాల బలోపేత విధానానికి (యాక్ట్ ఈస్ట్ పాలసీ) మరింత ప్రాధాన్యం పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే మరికొందరు రాజకీయ పరిశీలకులు మాత్రం ఉత్తర కొరియా ఎంతవరకు మాట మీద నిలబడి అణునిరా«యుధీకరణ జరుపుతుందా అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సదస్సుతో భారత్‌కు, ఉభయ కొరియా దేశాలతో బంధాలు బలోపేతమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
చారిత్రక భేటీపై నిపుణుల భిన్నాబిప్రాయాలు