
సాక్షి,హైదరాబాద్: ప్రపంచ దేశాల్లో కృత్రిమ మేధ (ai) వినియోగంలో భారత్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. అందుకు ఊతం ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్ బేస్డ్ టెక్ కంపెనీ గిట్ హబ్ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం 1.7కోట్లకు పైగా డెవలప్ ఉన్న భారత్ 2028 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా అవతరిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ దిశగా మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (IDC) అడ్వాన్స్‌డ్ ఏఐపై దృష్టిసారిస్తూ మూడవ పినాకిల్ సమ్మిట్- 2025ను నిర్వహించింది. ‘అన్‌లాక్ ది ఎజెంటిక్ ఫ్యూచర్ - వేర్ ఏఐ ఏజెంట్ మీట్ హ్యూమన్ ఇంజెన్యూయిటీ’ అనే థీమ్ కొనసాగిన ఈ టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఐడీసీ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్, కోర్ ఏఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ్ పారిక్,మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చంద్రోక్‌లు భారత్‌లో ఏఐ విస్తరణ, మైక్రోసాఫ్ట్ ఏఐ ఈకో సిస్టమ్ వంటి అంశాపై చర్చించారు.