యూఏఈ అధ్యక్షుడు నహ్యాన్‌ను స్వాగతిస్తున్న మోదీ
గాంధీనగర్/అహ్మదాబాద్: 10వ ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్’కు సర్వం సిద్ధమైంది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలో పాల్గొనే ఈ మూడు రోజుల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభిస్తారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్–హోరా్ట, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నుయిసీలతో ఆయన మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు.
ఆయా దేశాలతో సంబంధాలపై చర్చించారు. అంతకుముందు యూఏఈ అధ్యక్షునికి విమానాశ్రయంలో మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణం దాకా మోదీ రోడ్ షో జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులతోనూ మోదీ భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు.
డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయమ్, మైక్రాన్ టెక్నాలజీ అధ్యక్షుడు, సీఈఓ సంజయ్ మెహ్రోత్రాత, డియాకిన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మారి్టన్, సుజుకీ మోటార్ కార్పొరేసన్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకీ తదితరులు వీరిలో ఉన్నారు. గాంధీనగర్‌లో ‘వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షో–2024’ను మోదీ ప్రారంభించారు. వైబ్రంట్ గుజరాత్ సదస్సు నేపథ్యంలో 2 లక్షల చదరపు మీటర్లలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment