ప్రముఖ కంపెనీల సీఈఓలు, అధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో సమావేశం అయ్యారు. ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అంటే అమెరికా(ఏ), ఇండియా(ఐ) అని చెప్పారు. మూడు రోజుల యూఎస్ పర్యటనలో భాగంగా రెండోరోజు ఆదివారం రాత్రి సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చెందిన ప్రముఖులను కలిసి మాట్లాడారు. భారతదేశంలోని అవకాశాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘భారత అభివృద్ధిలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ విధానాలు పాటిస్తున్నాం. ఏదైనా ఒక దేశం విధించిన నియమాలను అనుసరించి డిజిటల్ ప్రపంచం నడవదు. నిత్యం అది మారుతూ ఉంటుంది. భారత్, అమెరికా కలిసి సాంకేతిక అవసరాలు తీర్చుకుంటున్నాయి. ఏఐ అంటే అమెరికా, ఇండియా’ అని తెలిపారు.
Had a fruitful roundtable with tech CEOs in New York, discussing aspects relating to technology, innovation and more. Also highlighted the strides made by India in this field. I am glad to see immense optimism towards India. pic.twitter.com/qW3sZ4fv3t
— Narendra Modi (@narendramodi) September 23, 2024
వైట్ హౌస్ విడుదల చేసిన ఉమ్మడి ఫాక్ట్ షీట్ ప్రకారం..ఐబీఎం సంస్థ ఇండియాకు చెందిన ఐరావత్ సూపర్ కంప్యూటర్‌కు మద్దతుగా ఏఐ సేవలిందిచేలా ఒప్పందం చేసుకుంది. అధునాతన సెమీకండక్టర్ ప్రాసెసర్‌లకు సంబంధించిన రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సహకారాన్ని మెరుగుపరిచేలా ఒప్పందాలు జరిగాయి. ఇవి భారత క్వాంటం మిషన్‌కు ఎంతో ఉపయోగపడుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో శనివారం సెమీకండక్టర్లకు సంబంధించి ఆర్ అండ్ డీ విభాగాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదిరింది. దీన్ని గ్లోబల్ ఫౌండరీస్ ఆధ్వర్యంలో కోల్‌కతాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!
అమెరికా, ఇండియా మధ్య నవంబర్ 2023లో ‘ఇన్నోవేషన్ హ్యాండ్‌షేక్’ కార్యక్రమంలో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాల్లోని అభివృద్ధి అంశాలపై ఇరు దేశాలకు చెందిన నాయకులు చర్చించారు. సీఈఓలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఏఎండీ సీఈఓ లిసా సు చైర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment