రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం | Defence Acquisition Council approved capital acquisition proposals worth Rs 1.44Lakh cr | Sakshi
Sakshi News home page

Defence: రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం

Published Wed, Sep 4 2024 9:27 AM | Last Updated on Wed, Sep 4 2024 10:37 AM

Defence Acquisition Council approved capital acquisition proposals worth Rs 1.44Lakh cr

రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99 శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్రం చాలా నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ కంపెనీలు దేశంలో తయారీని ప్రారంభించేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. దాంతో స్థానికంగా ఉత్పాదకత పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు హెచ్చవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల దేశ ఆదాయం ఊపందుకుంటుంది. ఫలితంగా జీడీపీ పెరుగుతుంది. రక్షణశాఖలోనూ దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతోంది. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ సైతం ఈ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తోంది. డిఫెన్స్‌ విభాగానికి అవసరమయ్యే ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఆ రంగం అభివృద్ధికి కేంద్రం మూలధనం సేకరించాలని ప్రతిపాదించింది. అందుకోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ)తో కలిసి ఇటీవల రూ.1.44 లక్షల కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది.

ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్

డీఏసీ ఆమోదంతో సేకరించిన నిధులతో భారత సైన్యం తన యుద్ధ ట్యాంకులను ఆధునీకరించాలని నిర్ణయించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఎఫ్‌ఆర్‌సీఈ) కొనుగోలు చేయనున్నారు. ఎఫ్‌ఆర్‌సీఈ అత్యాధునిక టెక్నాలజీ కలిగి రియల్‌టైమ్‌ పరిస్థితులను అంచనావేస్తూ శత్రువులపై పోరాడే యుద్ధ ట్యాంక్‌.  

ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లు

ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్‌ల సేకరణకు కూడా ఆమోదం లభించింది. ఇది గగనతలంలో శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లను గుర్తించి ట్రాక్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంటలతో వాటిని నియంత్రిస్తుంది.

ఇదీ చదవండి: ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహం

ఇండియన్ కోస్ట్ గార్డ్

ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కొన్ని ప్రతిపాదనలు ఆమోదించారు. డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు చేయనున్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్‌. అధునాతన సాంకేతికత కలిగిన దీన్ని తీర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఉపయోగించనున్నారు. ఏదైనా విపత్తుల సమయంలోనూ ఇది సహాయపడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement